దిక్కుల కూడలిలో ధిక్కార స్వరాలు...?


Sat,October 6, 2012 03:34 PM

ఎందుకోసం వచ్చినా.. చెరబండరాజు పుట్టిన రోజు చర్చ మంచి కోసం ఉపయోగపడుతోంది. చెరబండరాజు కు సాహిత్య అకాడమీ నుంచి వచ్చిన సహాయాన్ని తన అవసాన దశలో రోగక్షిగస్థుడై ఉండి కూడా నిరాకరించడం ఒక గొప్ప స్ఫూర్తి. ఆయన మరణానంతరం ఆయన సహచరి శ్యామల ఆయన విశ్వాసాలను, విలువలను కొనసాగిస్తూ ఆంధ్రవూపదేశ్ సాహిత్య అకాడమీ ప్రకటించి, ఇవ్వజూపిన (అప్పు డు 2500 రూపాయాలు) సాహిత్య అకాడమీ అవార్డును 192లోనే నిరాకరించడం, చేతులతో కాదు కదా కాలిగోటితో కూడా ముట్టనని ప్రకటించడం ఓ గొప్ప విప్లవ, ధిక్కార సంప్రదాయం. ఇది సరైన సందర్భంలోనే మళ్లీ ప్రస్తావనకు వచ్చిందని నేను భావిస్తున్నాను.
చెరబండరాజు తన పుట్టిన రోజు ఎప్పుడో తన కు గుర్తులేదని చెప్పిన సందర్భం వుంది. ‘నా జీవి త రేఖలు’ అని ఆయన చెప్పగా విరసం చలసాని ప్రసాదు రాసి ప్రచురించిన 24 పేజీల పుస్తకంలో ‘నేను 1944లో పుట్టాను. నేను పుట్టిన ఐదేండ్లకు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ప్రారంభమైంది. మా ఊరు అంకుశాపురంలో రామలింగం అనేటటువంటి ఓ వైశ్యుణ్ని ఇంటి గడప మీద తల పెట్టి నరికేసిన దృశ్యం ఊరంత కలకలాన్ని రేపింద’ని ఆయన చెప్పిన సందర్భంలో 1944లో పుట్టినట్లు చెప్పాడు. కాని ఆయన పనిచేసిన ప్రభుత్వ పాఠశాలలో ఆయన సర్వీసు రికార్డులోను, ఆయన ప్రావిడెంట్ రికార్డ్‌లోను 30 మే 1939న పుట్టినట్లుగా ఉంది. దిగంబర కవులలో అందరికన్నా బైరవయ్య, చెరబండరాజు చిన్నవాళ్లు. చెరబండరాజు ఆ ఇద్దరి లో కూడా చిన్నవాడు. కాబట్టి ఆయన పుట్టినది 1944 సంవత్సరమే సరైన సంవత్సరం అయివుంటుంది. మరి 30మే నాడు పుట్టాడా..లేదా అనేది అలకానంద వాళ్లు వేసిన క్యాలండర్‌లో 3 జనవరి 39 గా నమోదు కావడం తప్ప ఇంకే ఆధారం లేదు.

మరి అయన పుట్టినరోజు కన్నా, ఆయన సాహిత్య అకాడమీ అవార్డును ఆయన మరణానంతరం ఆయన సహచరి నిరాకరించడమనేది వచ్చిన ప్రత్యేక సందర్భానికి చాల గొప్పగా, చాల అర్థవంతంగా అనువయించిన అంశం అనుకుంటా. కొన్నాళ్లుగా ఒకవైపు సామ్రాజ్యవాద, ప్రపంచీకరణను వ్యతిరేకిస్తూ ప్రజలు, ముఖ్యంగా ఆదివాసులు పోరాడుతున్న సందర్భంలో.., కంపెనీల దోపిడీని, జోక్యాన్ని కంపెనీల పాలనను వ్యతిరేకిస్తున్న పార్టీలుగా.. దేశంలోని రాజకీయపార్టీ లేవి లేవు. కంపెనీ ల పార్టీలే ఉన్నాయని అరుంధతీరాయ్ వంటి రచయివూతిలు పేర్కొంటున్నారు. ఈ సమయంలో కంపెనీల పోషణలో సాహిత్య పోషణ జరగడం ఒకప్పటి సంస్థానధీశుల పోషణ కంటే కూడా గర్హనీయమైన విషయంగా ముందుకు వస్తున్నది. విష రసాయనాలతో మొత్తం సమాజాన్ని కలుషితం చేస్తున్నవాళ్లు కవిత్వాన్ని పోషించడం, ప్రతి కవికి ఒక కంపె నీ సాహిత్య పోషకుడుగా అండగా నిలబడటం అవి అవార్డులు, సన్మానాలు కవుల నిత్య సాయంకాలపు సన్నివేశాలు కావడం ఓ విషాదం. తెలుగు సాహిత్య వాతావరణంలో ఒకప్పుడు దిగంబరకవులు, ఏ సన్మానాలను, ఏ అవార్డులను అసహించుకొని గతం మీద తిరుగుబాటు చేశారో అవన్నీ జీవితంలో వివక్ష, విచక్షణ, కనీసం స్వీయశోధన లేకుండా భాగమైపోవడం భరిస్తున్నాం. తెలంగాణ వచ్చేదాకా ఏ అవార్డులు, సన్మానాలు స్వీకరించకుండ కేంద్రవూపభుత్వం, ఆంధ్రవూపదేశ్ ప్రభుత్వం ఇచ్చిన అవార్డులన్నింటిని, సన్మానాలన్నింటిని తిరిగి ఇవ్వాలని ప్రతిపాదనలు ఒకవైపు వస్తున్న సందర్భంలో.. మరీ ముఖ్యంగా ఈరోజు రాంకీ సంస్థ ఒంగోలులో ప్రపంచ సాహిత్య, సంస్కృతిక ఉత్సవాలను జరప డం, దానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి ముఖ్యఅతిథిగా వెళ్లడం, కవులందరూ ఆ మూడు రోజుల సంస్కృతిక ఉత్సవాలలో పోలోమని వెళ్లి పాల్గొంటుంటే కుటుంబరావుగారు విరసం ఏర్పడ్డ సమయంలో చెప్పిన విషయం ఒకటి గుర్తుకు వస్తున్నది. వాస్తవానికి 1970 జులై 4న అభ్యుదయ సాహిత్య అకాడమీ, అభ్యుదయ సాహిత్య సదస్సు జరిగింది. ఆ సదస్సుకు శ్రీశ్రీ, కుటుంబరావు, రమణాడ్డి, జ్వాలాముఖి, మొదలుకొని మమ్మల్నందరినీ ఆహ్వానించినప్పుడు ఈ అభ్యుదయ సాహిత్య వేదిక వెనక బ్రహ్మానందడ్డి ప్రభుత్వం శ్రీకాకుళం ఉద్యమాన్ని నెత్తురు ముంచి, ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసినటువంటి బ్రహ్మానందడ్డి ప్రభు త్వం, సినిమా పరిక్షిశమ, అభ్యుదయ సంఘం ఈ మూడు ఉన్నవని నిరాకరిస్తూ .. ‘కసాయివాడు బూత దయ మీద’(కసాయివాడు క్షమించాలి. ఈ కులాన్ని, వృత్తిని అవమానపరచడం కోసం వాడిన మాట కాదు) ‘కసాయివాడు జీవకారుణ్యం మీద సదస్సు పెడితే మానవాళి మీద ప్రేమ ఉన్నవాడు అనుకొని పొలోమంటు పోవడమేనా..? అంటూ నేను ఈ సదస్సుకు రాను’ అని కుటుంబరావు గారు రాశారు. మళ్ళీ ఒకసారి రచయితలకు మొత్తం సామాజిక వాతావరణాన్ని రాజకీయ వాతవరణాన్ని కల్మషం చేస్తున్నటువంటి దళారులు, ముఖ్యమంవూతు లు పారిక్షిశామిక రంగాన్ని విచ్ఛిన్నం చేస్తూ, తద్వారా సమస్త జీవన రంగాలను కలుషితం చేస్తున్నటువం టి కంపెనీలు ప్రభుత్వాలతో కుమ్మకై సాహిత్య, సాంస్కృతిక సదస్సులు ఏర్పాటు చేస్తున్నప్పుడు మనకు ఉండే సాహిత్యం పట్ల ప్రేమ నిర్విపేక్షతో పోవడమనేది ఎంత వరకు సమంజసమని ఒకసారి స్వీయశోధన చేసుకోవాల్సిందిగా రచయితలకు విజ్ఞ ప్తి చేస్తున్నా....

- వరవరరావు
సాహిత్య అకాడమీ అవార్డును కొసకాలితో గూడా ముట్టను!
(శ్యామలా చెరబండరాజు ప్రకటన)

చివరి వూపిరి వరకూ సాయుధ ప్రజా విప్లవానికే తన కలాన్నీ, కాలాన్నీ అంకితం చేసిన చెరబండరాజు, ఈ ప్రభుత్వానికో, ఆ ప్రభుత్వానికో మాత్రమే గాక నేటి దోపిడీ రాజ్యవ్యవస్థకంతటికీ బద్ధవిరోధి అయిన సాహిత్య విప్లవకారుడు. ఈ దుష్ట వ్యవస్థ అంతర్భాగాలే అకాడమీలన్నీ. ఆంధ్రవూపదేశ్ సాహిత్య అకాడమీ కార్యదర్శి శ్రీ ఇరి కృష్ణమూర్తి నాకొక ఉత్తరం రాస్తూ, చెరబండరాజు నవల ‘ప్రస్థానం’ వుత్తమ నవలగా ఎంపికైనట్టూ, దీనికి గుర్తింపుగాను 2,500/- నగదు బహుమతిని యివ్వబూనినట్టూ తెలియబరుస్తూ, దానికి నా ఆమో దం కోరారు. చెరబండరాజుతో కలిసి రెండు దశాబ్దాలు కాపురం చేసిన నాకు, ఆయన ప్రతి గుండె కదలికా, ప్రతి ఆలోచ నా పూర్తిగా తెలుసు. బహుమతి పేరిట ఈ పిండానికి చేయిచూపి చెరబండరాజు ఎర్రెపూరని స్మృతికి నేను ద్రోహం చేసేదిలేదు. చేతితోనే కాదు సరికదా, కొసకాలితో గూడా ఈ నీచపు సొమ్ముని ముట్టను. జీవించి వుండ గా ఎన్నోమార్లు జైలుకు పంపి, ఉద్యోగం వూడగొట్టి, కుట్రకేసులో యిరికించి వేధి స్తూ, పరోక్షంగా ఆయన మెదడు వ్యాధికి కారణమైన ఈ ప్రభుత్వంతో, దాని వుపాంగావైన అకాడమీ లాంటి తుచ్ఛ సంస్థలతో నాకు ఎలాంటి రాజీ కూడా లేదు. ఏ పీడిత ప్రజలైతే చెరబండరాజు కవిత్వాన్ని, సాహిత్యాన్నీ, ఆదరించి, సొంతం చేసుకొని, ఆయనకు చేదోడు వాదోడుగా నిలిచారో, ఏ ప్రజల కోసమైతే ఆయన రాసి, పాడాడో, అనుక్షణం పోరాడాడో, ఆ ప్రజల పేరిట, ఆ సాహిత్యం పేరిట, ఆ విప్లవం పేరిట నేను ఈ బహుమానాన్ని తోసివేస్తున్నాను.

-బి. శ్యామల

35

VARAVARA RAO

Published: Wed,February 19, 2014 12:14 AM

ఈ బొమ్మకింక.. ప్రాణం పోయాలి!

ఎన్నాళ్లుగా నీ బొమ్మ గీయాలని.. ప్రయత్నిస్తున్నాను ఎన్నో పోరాటాల జ్ఞాపకాల కన్నీళ్లతో తడిసి నెత్తురు చింది అది చెరిగిపోయేది సాయు

Published: Tue,November 5, 2013 11:56 PM

దాశరథి దేశకాలాలు వెలుగు చీకటి జ్ఞాపకాలు

నా పదమూడో ఏటనే దాశరథి (కృష్ణమాచార్య)తో పరోక్ష పరిచయం, ప్రత్యక్ష పరిచయంగానే కాదు స్నేహంగా కూడా అంత సులభంగా సాధ్యమవుతుందని నేనూహిం

Published: Mon,September 9, 2013 01:08 AM

కాళోజీ కలగన్న తెలంగాణ

ఇవాళ్టికి కాళోజీకి నూరేండ్లు. ఆయన ‘నా గొడవ’ మొదటి ముద్రణ ఆవిష్కరణ జరిగి ఆరవై ఏళ్లు దాటింది. ఇంకా ఆంధ్రరాష్ట్రం ఏర్పడక ముందు 1953

Published: Wed,August 14, 2013 01:16 AM

కేఎంసీలో వికసించిన ఎర్రమందారం

కాటా నారాయణరావు ‘శబరి గోదారి’ (1986) కవితా సంకలనానికి ముందుమాట రాస్తూ కాళోజీ నారాయణరావు.. ‘1965 లో ప్రారంభమైన అలజడి (విశాఖ ఉక్కు

Published: Wed,June 19, 2013 12:59 AM

తీర్మానం చేయలేని అసెంబ్లీ ఓడిపోయింది చేరనివ్వని చలో గెలిచింది

అసెంబ్లీ అంటే పది మంది సమావేశమయ్యే స్థలం కదా మంది కూడా కాదు మన ప్రజావూపతినిధులు పదికోట్ల మంది పెట్టు.. పెట్టుకున్న సభ మన చె

Published: Fri,June 14, 2013 12:21 AM

ప్రజాస్వామ్యమా! పోలీసుస్వామ్యమా!!

శాసనసభాపతిగా కూడా వ్యవహరించి, విజయవంతంగా, సమర్థవంతంగా శాసనసభను నిర్వహించిన పేరు కూడా తెచ్చుకొని ముఖ్యమంత్రి అయిన కిరణ్‌కుమార్‌డ్

Published: Sun,May 26, 2013 12:54 AM

ఆంధ్ర సారస్వత పరిషత్ జ్ఞాపకాలు ...అనుబంధాలు

జాగీరు గ్రామమైన మా చిన్న పెండ్యాలలో నా బాల్యంలోనే నేను ఆంధ్ర సారస్వత పరిషత్తు పేరు వినడమే కాదు,అది మా విద్యాభివృద్ధిలో పాత్ర నిర్వ

Published: Sat,April 20, 2013 12:54 AM

ఇంద్రవెల్లి ఇంగలం

‘ఒక నిప్పురవ్వ దావానలమవుతుంది’ అనేమాట సామాన్యంగా ఒకచోట రగుల్కొన్న విప్లవం నలువైపులా విస్తరించడానికి అన్వయిస్తుంటారు. వైనాడ్ (కేరళ)

Published: Mon,April 1, 2013 12:37 AM

రాజ్యాంగమా? మతక్షిగంథాలా?

మన ప్రభుత్వాలు లౌకిక ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రకారం నడుస్తున్నాయని ఎవరికైనా భ్రమలుంటే వాటిని పటాపంచలు చేశాడు మన ముఖ్యమంత్రి కిరణ

Published: Thu,March 21, 2013 12:13 AM

‘కుక్క’ల్లో వార్త

‘వార్తల్లో కుక్క’ అనాలి. కాని అపుడది వార్త కాదు. రిపోర్టింగ్‌లో ప్రవేశించిన ప్రతి ఒక్కరికీ మీడియా అనుభవజ్ఞులు ఏది వార్త అవుతుందో,

Published: Fri,March 15, 2013 02:14 AM

వంజెం సోమయ్య జైలుడైరీ...

ఇది జైలు డైరీ కాదు... ఇది నిర్బంధ డైరీ... ఇది పోలీసు అక్రమ అరెస్టు డైరీ.. ఇది చిత్రహింసల డైరీ.. ఇది దాతు ఫిర్యాదులేని రాజ్యాంగం ప

Published: Wed,February 20, 2013 11:57 PM

నాటి మాటలు మరిచారా?

అధ్యక్షా! మన శాసనసభ కేంద్ర ప్రభుత్వానికి మరణశిక్షను రద్దు చేయవలసిందిగా రికమెండ్ చేస్తూ తీర్మానం చేయాలని ప్రతిపాదిస్తున్నా ను. పూర్

Published: Fri,February 15, 2013 11:28 PM

బతికించే వృత్తినుంచి ఉరికంబం దాకా..

అప్జల్‌గురు ప్రస్థానం అతని మాటల్లోనే... నేను పెరుగుతున్న కాలంలో కశ్మీర్ రాజకీయంగా కల్లోలంగా ఉన్నది. మక్బుల్‌భట్‌ను ఉరి తీశారు(198

Published: Sat,December 29, 2012 04:40 PM

డిసెంబర్ 6కు 20 ఏండ్లు

ఈ డిసెంబర్ 6కు (బాబ్రీమసీదు విధ్వంసం జరిగి) 20 ఏండ్లు నిండాయి. ఇరవైఏండ్లంటే ఇంచుమించు ఒక తరం మారింది. పి.వి.నర సింహా రావు నుంచి మన

Published: Wed,October 10, 2012 08:11 PM

‘తెలంగాణ మార్చ్’యే జవాబు

ముందు కొన్ని వాస్తవాలు చెప్పుకోవాలె. ఆ వాస్తవాలపై మన అభివూపాయా లు, వ్యాఖ్యలు ఏమైనా కావచ్చు. నెలవారీగా కేంద్ర హోంమంత్రి నిర్వహించే

Published: Sat,October 6, 2012 03:30 PM

పిల్లి మొగ్గలు ఎలుకల్ని పట్టడానికే

భాషలో తేడాయే తప్ప ప్రకాశ్‌సింగ్, కిషోర్‌చంవూదదేవ్, జైరాంరమేష్‌లు కూడా దళారీ పాలనలో భాగమైనంత కాలం చిదంబరం, రమణ్‌సింగ్, విజయ్‌కుమార్

Published: Sat,October 6, 2012 03:31 PM

ఆత్మావలోకనం

మార్క్సిజం పెట్టుబడిదారీ విధానాన్ని మట్టికాళ్ల మహారాక్షసి అంటుంది. ఆ మహారాక్షసి ఉక్కువేళ్లు మట్టిపొరలు చీల్చుకొని భూగర్భ జలాల్లోకి

Published: Sat,October 6, 2012 03:31 PM

విప్లవ దార్శనికుడు

‘చాటండి గళమెత్తి విప్లవదార్శనికుడు చారుమజుందార్ చచ్చిపోలేదని- కామ్రేడ్ చారుమజుందార్ చంపబడ్డాడని’ అంటూ చెరబండరాజు తన కవితా సంకలనం

Published: Sat,October 6, 2012 03:32 PM

ఆదివాసులకు న్యాయం దక్కేనా?

చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, సుక్మా, కాంకేర్ జిల్లాల్లో జూన్ 28,29 తేదీల్లో పోలీసులు మూడుచోట్ల అమాయకులైన 23మంది ఆదివాసీలను చంపారు. జ

Published: Sat,October 6, 2012 03:33 PM

అద్దంలో ‘విద్యార్థి ’ మాట

మొదట వరంగల్ ఆర్ట్స్‌కాలేజీ, తర్వాత ఉస్మానియా క్యాంపస్, రెండుచోట్ల చలం, శ్రీశ్రీ ఇచ్చిన మిత్రులు కాకుండా‘మివూతమండలి’ ఇచ్చిన మిత్రుల

Published: Sat,October 6, 2012 03:33 PM

జార్జ్ అడుగు జాడల్లో..

నేను జార్జిని చూసిన జ్ఞాపకం లేదు. కాని 1972 ఏప్రిల్ 14 సాయంకాలం నుంచి ప్రతి సాయం సంధ్యలోనూ ప్రతి ఉదయసంధ్యలోనూ ఆకాశంలోనే కాదు, నేలమ

Published: Sat,October 6, 2012 03:34 PM

విప్లవ స్వాప్నికుడు ‘అలిశెట్టి’

ఈసారి 2011 సెప్టెంబర్ 29న కామ్రేడ్ సూర్యం సంస్మరణ సభ గుంటూరులో అపూర్వంగా జరిగింది. నేను వెళ్లాల్సింది. ఆ సభ జరుపుతామని తెలిసినప్ప

Published: Sat,October 6, 2012 03:35 PM

ఉద్యమ పంథా మారాలె

సకలజనుల సమ్మె స్వయంపాలనలో భాగంగా శాంతియుతంగా, రాజకీయాలకు అతీతంగా యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని ఒక్కతాటి మీదికి తీసుకురావడం ద్వారా ప్

Published: Sat,October 6, 2012 03:35 PM

కాళోజీ (అను) వాదం

‘నా భారతదేశయాత్ర’ డ్బై ఏళ్ల క్రితం (1941) కాళోజీ (నారాయణరావు)గారు అనువదించి, దేశోద్ధారక గ్రంథమాల పక్షాన వట్టికోట ఆళ్వారుస్వామిగారు