ఉద్యమ పంథా మారాలె


Sat,October 6, 2012 03:35 PM

సకలజనుల సమ్మె స్వయంపాలనలో భాగంగా శాంతియుతంగా, రాజకీయాలకు అతీతంగా యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని ఒక్కతాటి మీదికి తీసుకురావడం ద్వారా ప్రజాస్వామ్య దేశాల చరివూతలో ఒక నూతన అధ్యాయానికి తెరతీసింది. ఆరు దశాబ్దాల స్వతంత్ర భారతదేశ నాయకత్వ చరివూతలో నాయకులు నిర్ణయాత్మక శక్తిని కోల్పోయిన నేటి దుస్థితిని తెలంగాణ ఉద్యమం ప్రశ్నిస్తున్నది. ఢిల్లీ నుంచి గల్లీ వరకు నాయకత్వం నిర్వీర్యం అయినందుకు కారణాలను అన్వేషిస్తున్నది. దీనికి కారకులు ఎవరని ప్రశ్నిస్తున్నది.
ఆకలి అయినప్పుడు అన్నం పెట్టమని అడిగే అమ్మకు తోడుగా కుటుంబసభ్యులు తమ బాధ్యతలను నిర్వర్తించనిదే తిండి నోటికాడికి రాదు. కొడుకుగా, కోడలిగా, ఆడబిడ్డగా బాధ్యతలతో సామాజిక కట్టుబాట్లతో మెదిలితే తప్ప తమ కుటుంబ సభ్యునిగా తమ అవసరాలు తీర్చుకోలేని పరిస్థితి మన ది. అలాంటిది ఏ రక్త సంబంధంలేని రాజకీయ నాయకులను మన జీవితాలను మార్చగల నిర్ణయాధికారాన్ని మనమే వారికి ఓటు ద్వారా కట్టబెట్టే ముందు వారికి మన సమస్యలపైన అవగాహన, ప్రజలపట్ల ప్రేమ, బాధ్యత ఏ మేరకు ఉన్నాయని ప్రశ్నించకుండా ఉండడం ఎవరితప్పు? చిన్న ప్రలోభాలకు లోనై అధికారాన్ని కట్టబెట్టడం ఎంత వరకు సమంజసం? అలాం టి నాయకత్వాలే నేడు ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమ సెగలను సైతం నిర్ల క్ష్యం చేస్తున్నాయి. ప్రస్తుతం అధికార, ప్రతిపక్షాల నాయకులు తమ కృత్రిమ రాజీనామాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి.

సమైక్యవాదం పేర్లతో చిత్ర విచిత్ర వేషాలతో తెలంగాణ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. అయినా ఉద్యమకారులు ఈసారి సహనంతో సమ్మె లో పాల్గొంటున్నారు. వీరిని నమ్మే స్థితిలో లేరు. అయితే ఇప్పుడే తెలంగా ణ ప్రజలు కొంత విషయ పరిజ్ఞానంతో దూరదృష్టితో వ్యవహరించాలి. వారి భవిష్యత్తు కార్యాచరణపైన కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ఈ క్రమం లో వారు కొన్ని ప్రశ్నలకు సమాధానాలు రాబట్టాలి.

1) అధికారంలో ఉన్న తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసి వాటిని ఆమోదించుకునే విధంగా ఉద్యమ తీవ్రతను మార్చాలి. కేంద్ర ప్రభుత్వ మెడలు వంచకుండా, రాజకీయ సంక్షోభం తేకుండా తెలంగాణ సాధ్యమవుతుందా అని ఉద్యమకారులు తమను తాము ప్రశ్నించుకోవాలి. 2) తెలంగా ణ రాష్ట్ర సాధన తొలిమెట్టని నమ్మి మనం, నిజమైన తెలంగాణ సాధికారతకు నాయకత్వం వహించాల్సింది ప్రజా ఉద్యమాలా? లేక అధికార మార్పిడి మాత్రమేనా అన్నది తేల్చుకోవాలి. 3) ప్రస్తుత ఉద్యమాన్ని పొడిగించకుండా, దాని స్వరూపాన్ని మార్చకుండా స్వయం పాలనను పొందగలమా? 4) ప్రజల ఎజెండాలను నిర్ధారించేది ఎవరు? ప్రజా ఉద్యమాలా? రాజకీయ నాయకులా? 5) రాజకీయం అంటే ప్రజల ఎజెండా లేని పార్టీల జెండాలు మోయడమా? లేక ప్రజల ఏకాభివూపాయ సాధన కై ఉద్యమాలు చేయడమా? 6) ప్రజలకు రాజకీయాలు నేర్పేది ఎవరు? రాజకీయ పార్టీలా? ప్రజా ఉద్యమాలా? 7) ప్రజల సమస్యలపై నిర్ణయాత్మక శక్తి వహించాల్సింది ఎవరు? రాజకీయ నాయకులా సగటు తెలంగాణ ఉద్యమకారుడా? 8)మొత్తం రాష్ట్ర పాలనా యంత్రాంగాన్ని నెలరోజుల పాటు సకల జనుల సమ్మె ద్వారా స్తంభింపచేయగల ఓర్పు నేర్పు ఉన్న ఉద్యమకారునిగా, రానున్న రోజుల్లో ప్రజా సమస్యల సాధనకై నాయకత్వాల ఎంపిక కోసం మన అవగాహన పెంచుకోకుండా, ఉద్యమించకుండా తెలంగాణ సాధికారత సాధ్యమవుతుందా? 9) నేటి దుస్థితికి కారణం ప్రజలదా? నాయకులదా?
పై ప్రశ్నలకు సమాధానం రాబట్టే క్రమంలో ప్రస్తుత ఉద్యమం ఏ రీతిలో ఉండాలన్నది ఆలోచించుకోవాలి. అలాగే భవిష్యత్తులో ప్రతి ప్రజా సమ స్యపై ఒక వేదికగా ఉద్యమించి పరిష్కారం రాబట్టగల నాయకత్వం కావాలి. ఆ లక్ష్యాలను సాధించగల అర్హులైన వారే నాయకులుగా చెలామణి అయ్యే విధంగా ఉద్యమాల స్వరూపం మారాలి. అప్పుడే తెలంగాణలోని బలిదానాలకు, ఉద్యమాలకు, సకల జనుల సమ్మెకు అర్థం, పరమార్థం ఉంటుం ది. లేదంటే తెలంగాణ ప్రజలంతా మళ్లీ బానిసలుగా బతకడం తప్ప మరో మార్గం లేదు.

-వి.వి. రావు
రాష్ట్ర ఎన్నికల నిఘా వేదిక కన్వీనర్

35

VARAVARA RAO

Published: Wed,February 19, 2014 12:14 AM

ఈ బొమ్మకింక.. ప్రాణం పోయాలి!

ఎన్నాళ్లుగా నీ బొమ్మ గీయాలని.. ప్రయత్నిస్తున్నాను ఎన్నో పోరాటాల జ్ఞాపకాల కన్నీళ్లతో తడిసి నెత్తురు చింది అది చెరిగిపోయేది సాయు

Published: Tue,November 5, 2013 11:56 PM

దాశరథి దేశకాలాలు వెలుగు చీకటి జ్ఞాపకాలు

నా పదమూడో ఏటనే దాశరథి (కృష్ణమాచార్య)తో పరోక్ష పరిచయం, ప్రత్యక్ష పరిచయంగానే కాదు స్నేహంగా కూడా అంత సులభంగా సాధ్యమవుతుందని నేనూహిం

Published: Mon,September 9, 2013 01:08 AM

కాళోజీ కలగన్న తెలంగాణ

ఇవాళ్టికి కాళోజీకి నూరేండ్లు. ఆయన ‘నా గొడవ’ మొదటి ముద్రణ ఆవిష్కరణ జరిగి ఆరవై ఏళ్లు దాటింది. ఇంకా ఆంధ్రరాష్ట్రం ఏర్పడక ముందు 1953

Published: Wed,August 14, 2013 01:16 AM

కేఎంసీలో వికసించిన ఎర్రమందారం

కాటా నారాయణరావు ‘శబరి గోదారి’ (1986) కవితా సంకలనానికి ముందుమాట రాస్తూ కాళోజీ నారాయణరావు.. ‘1965 లో ప్రారంభమైన అలజడి (విశాఖ ఉక్కు

Published: Wed,June 19, 2013 12:59 AM

తీర్మానం చేయలేని అసెంబ్లీ ఓడిపోయింది చేరనివ్వని చలో గెలిచింది

అసెంబ్లీ అంటే పది మంది సమావేశమయ్యే స్థలం కదా మంది కూడా కాదు మన ప్రజావూపతినిధులు పదికోట్ల మంది పెట్టు.. పెట్టుకున్న సభ మన చె

Published: Fri,June 14, 2013 12:21 AM

ప్రజాస్వామ్యమా! పోలీసుస్వామ్యమా!!

శాసనసభాపతిగా కూడా వ్యవహరించి, విజయవంతంగా, సమర్థవంతంగా శాసనసభను నిర్వహించిన పేరు కూడా తెచ్చుకొని ముఖ్యమంత్రి అయిన కిరణ్‌కుమార్‌డ్

Published: Sun,May 26, 2013 12:54 AM

ఆంధ్ర సారస్వత పరిషత్ జ్ఞాపకాలు ...అనుబంధాలు

జాగీరు గ్రామమైన మా చిన్న పెండ్యాలలో నా బాల్యంలోనే నేను ఆంధ్ర సారస్వత పరిషత్తు పేరు వినడమే కాదు,అది మా విద్యాభివృద్ధిలో పాత్ర నిర్వ

Published: Sat,April 20, 2013 12:54 AM

ఇంద్రవెల్లి ఇంగలం

‘ఒక నిప్పురవ్వ దావానలమవుతుంది’ అనేమాట సామాన్యంగా ఒకచోట రగుల్కొన్న విప్లవం నలువైపులా విస్తరించడానికి అన్వయిస్తుంటారు. వైనాడ్ (కేరళ)

Published: Mon,April 1, 2013 12:37 AM

రాజ్యాంగమా? మతక్షిగంథాలా?

మన ప్రభుత్వాలు లౌకిక ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రకారం నడుస్తున్నాయని ఎవరికైనా భ్రమలుంటే వాటిని పటాపంచలు చేశాడు మన ముఖ్యమంత్రి కిరణ

Published: Thu,March 21, 2013 12:13 AM

‘కుక్క’ల్లో వార్త

‘వార్తల్లో కుక్క’ అనాలి. కాని అపుడది వార్త కాదు. రిపోర్టింగ్‌లో ప్రవేశించిన ప్రతి ఒక్కరికీ మీడియా అనుభవజ్ఞులు ఏది వార్త అవుతుందో,

Published: Fri,March 15, 2013 02:14 AM

వంజెం సోమయ్య జైలుడైరీ...

ఇది జైలు డైరీ కాదు... ఇది నిర్బంధ డైరీ... ఇది పోలీసు అక్రమ అరెస్టు డైరీ.. ఇది చిత్రహింసల డైరీ.. ఇది దాతు ఫిర్యాదులేని రాజ్యాంగం ప

Published: Wed,February 20, 2013 11:57 PM

నాటి మాటలు మరిచారా?

అధ్యక్షా! మన శాసనసభ కేంద్ర ప్రభుత్వానికి మరణశిక్షను రద్దు చేయవలసిందిగా రికమెండ్ చేస్తూ తీర్మానం చేయాలని ప్రతిపాదిస్తున్నా ను. పూర్

Published: Fri,February 15, 2013 11:28 PM

బతికించే వృత్తినుంచి ఉరికంబం దాకా..

అప్జల్‌గురు ప్రస్థానం అతని మాటల్లోనే... నేను పెరుగుతున్న కాలంలో కశ్మీర్ రాజకీయంగా కల్లోలంగా ఉన్నది. మక్బుల్‌భట్‌ను ఉరి తీశారు(198

Published: Sat,December 29, 2012 04:40 PM

డిసెంబర్ 6కు 20 ఏండ్లు

ఈ డిసెంబర్ 6కు (బాబ్రీమసీదు విధ్వంసం జరిగి) 20 ఏండ్లు నిండాయి. ఇరవైఏండ్లంటే ఇంచుమించు ఒక తరం మారింది. పి.వి.నర సింహా రావు నుంచి మన

Published: Wed,October 10, 2012 08:11 PM

‘తెలంగాణ మార్చ్’యే జవాబు

ముందు కొన్ని వాస్తవాలు చెప్పుకోవాలె. ఆ వాస్తవాలపై మన అభివూపాయా లు, వ్యాఖ్యలు ఏమైనా కావచ్చు. నెలవారీగా కేంద్ర హోంమంత్రి నిర్వహించే

Published: Sat,October 6, 2012 03:30 PM

పిల్లి మొగ్గలు ఎలుకల్ని పట్టడానికే

భాషలో తేడాయే తప్ప ప్రకాశ్‌సింగ్, కిషోర్‌చంవూదదేవ్, జైరాంరమేష్‌లు కూడా దళారీ పాలనలో భాగమైనంత కాలం చిదంబరం, రమణ్‌సింగ్, విజయ్‌కుమార్

Published: Sat,October 6, 2012 03:31 PM

ఆత్మావలోకనం

మార్క్సిజం పెట్టుబడిదారీ విధానాన్ని మట్టికాళ్ల మహారాక్షసి అంటుంది. ఆ మహారాక్షసి ఉక్కువేళ్లు మట్టిపొరలు చీల్చుకొని భూగర్భ జలాల్లోకి

Published: Sat,October 6, 2012 03:31 PM

విప్లవ దార్శనికుడు

‘చాటండి గళమెత్తి విప్లవదార్శనికుడు చారుమజుందార్ చచ్చిపోలేదని- కామ్రేడ్ చారుమజుందార్ చంపబడ్డాడని’ అంటూ చెరబండరాజు తన కవితా సంకలనం

Published: Sat,October 6, 2012 03:32 PM

ఆదివాసులకు న్యాయం దక్కేనా?

చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, సుక్మా, కాంకేర్ జిల్లాల్లో జూన్ 28,29 తేదీల్లో పోలీసులు మూడుచోట్ల అమాయకులైన 23మంది ఆదివాసీలను చంపారు. జ

Published: Sat,October 6, 2012 03:33 PM

అద్దంలో ‘విద్యార్థి ’ మాట

మొదట వరంగల్ ఆర్ట్స్‌కాలేజీ, తర్వాత ఉస్మానియా క్యాంపస్, రెండుచోట్ల చలం, శ్రీశ్రీ ఇచ్చిన మిత్రులు కాకుండా‘మివూతమండలి’ ఇచ్చిన మిత్రుల

Published: Sat,October 6, 2012 03:33 PM

జార్జ్ అడుగు జాడల్లో..

నేను జార్జిని చూసిన జ్ఞాపకం లేదు. కాని 1972 ఏప్రిల్ 14 సాయంకాలం నుంచి ప్రతి సాయం సంధ్యలోనూ ప్రతి ఉదయసంధ్యలోనూ ఆకాశంలోనే కాదు, నేలమ

Published: Sat,October 6, 2012 03:34 PM

విప్లవ స్వాప్నికుడు ‘అలిశెట్టి’

ఈసారి 2011 సెప్టెంబర్ 29న కామ్రేడ్ సూర్యం సంస్మరణ సభ గుంటూరులో అపూర్వంగా జరిగింది. నేను వెళ్లాల్సింది. ఆ సభ జరుపుతామని తెలిసినప్ప

Published: Sat,October 6, 2012 03:34 PM

దిక్కుల కూడలిలో ధిక్కార స్వరాలు...?

ఎందుకోసం వచ్చినా.. చెరబండరాజు పుట్టిన రోజు చర్చ మంచి కోసం ఉపయోగపడుతోంది. చెరబండరాజు కు సాహిత్య అకాడమీ నుంచి వచ్చిన సహాయాన్ని తన అవ

Published: Sat,October 6, 2012 03:35 PM

కాళోజీ (అను) వాదం

‘నా భారతదేశయాత్ర’ డ్బై ఏళ్ల క్రితం (1941) కాళోజీ (నారాయణరావు)గారు అనువదించి, దేశోద్ధారక గ్రంథమాల పక్షాన వట్టికోట ఆళ్వారుస్వామిగారు