కాళోజీ కలగన్న తెలంగాణ


Mon,September 9, 2013 01:08 AM


ఇవాళ్టికి కాళోజీకి నూరేండ్లు. ఆయన ‘నా గొడవ’ మొదటి ముద్రణ ఆవిష్కరణ జరిగి ఆరవై ఏళ్లు దాటింది. ఇంకా ఆంధ్రరాష్ట్రం ఏర్పడక ముందు 1953 జనవరి 12న ఆయన ‘నా గొడవ’ మొదటి ముద్రణను అలంపురంలో తెలంగాణ రచయితల సంఘం,ఆంధ్ర సారస్వత పరిషత్ కలిసి నిర్వహించిన సభలో శ్రీశ్రీ ఆవిష్కరించాడు. ‘కాళోజీ నిఖిలాంధ్ర కవి. అందులో ఎట్టి సందేహంలేదు, ఆయనకు తెలంగాణ అంచులు గోడలు గా అడ్డు నిలువజాలవు.. ఇది కవి గొడవగానే కనిపించినప్పటికి ఇది విశాల జగత్తు ప్రజలందరి గొడవ’ అని అంటూ ‘తెలంగాణ మూగ జీవాల హృదయాల్ని ప్రతిబింబింపజేశాడు కాళోజీ’ అంటాడు శ్రీశ్రీ.తెలంగాణ రచయితల సంఘం ఈ సభల ముగింపులో తనను తాను అఖిలాంధ్ర రచయితల సంఘంగా మార్చుకున్నట్లుగా ప్రకటించింది. 1901 నుంచి గ్రంథాలయాలు పెట్టినా, మహాసభపెట్టినా, జనకేంద్ర సంఘం, సారస్వత పరిషత్ పెట్టి సంస్థలు,ఉద్యమం నిర్వహించినా అన్నింటి ముందు ఆంధ్ర శబ్దాన్ని ఒక విశాల భాష, సాంస్కృతిక జాతి ఆకాంక్షతో చేర్చిన తెలంగాణ వైతాళికులు, ఉద్యమకారులు, రచయితలు 1953 వరకు ఎంత ఔదార్యంతో వ్యవహరించారో, ఎంత విశాల దృక్పథం నుంచి వ్యవహరించారో చూపడానికి ఈ ఉదాహరణలన్నీ. తెలంగాణ స్వాభిమానం, సంస్కృతి ఒక కలయికతో అది విశాలాంవూధగానో, అది ఆంధ్ర తెలంగాణ గానో విస్తరించి వికసిస్తుందని ఆశించారు. అందుకే కాళోజీ వరంగల్లుకు శ్రీశ్రీని ఆహ్వానించి వరంగల్ లో తన దస్తూరితో రాసి, శ్రీశ్రీతో పాటు సంతకం చేసి, విశాలాంధ్ర తీర్మానం చేయించాడు. అప్పటికి తెలంగాణలో విశాలాంధ్ర కోసం సర్వజనామోదం ఉన్నదని కాదు. అప్పటికే తెలంగాణలో నాన్‌ముల్కీ గోబ్యాక్ ఉద్యమం అంకురించింది. కాళోజీ ‘నాగొడవ ఆత్మకథ’లో చెప్పినట్లు తెలంగాణను వేరువేరు రూపాల్లో నాన్‌ముల్కీల ఆధిపత్యం కృంగదీసింది. సరిగ్గా కాళోజీ పుట్టిన 1914లో మాడపాటి హనుమంతరావు తెలంగాణ పై ఈ నాన్‌ముల్కీల ఆధిపత్యం గురించి ఒక వ్యాసం రాశాడు. అది వట్టికోట ఆళ్వార్‌స్వామి దేశోద్ధారక గ్రంధమాల తరఫున ప్రచురించిన ఆంధ్రోద్యమం మొదటి సంపుటంలో చూడవచ్చు. కనుక 1957లో కాళోజీ ఆంధ్రవూపదేశ్ ఏర్పడినాక చాల సహజంగా తెలంగాణ ప్రజల హృదయాలను ఆవిష్కరించినట్లు ‘ఇట్లౌనని ఎవరనుకున్నారు’ అని రాశాడు. ఒక ఆదర్శవాదిగా, ఒక స్వాప్నికునిగా అన్నిటికన్న మించి ఎల్లవేళల ఓపెన్‌మైండ్‌తో ఉన్న ఒక ప్రజాస్వామ్యవాదిగా తెలంగాణలోని జన చైతన్యంతోటి ఎదిగినవాడు కాళోజీ.

ఆయనే స్వయంగా ‘మొదటి ప్రపంచ యుద్ధంతో పాటు నేను భూమ్మిదపడ్డ (9-9-1914)న అని రాసుకున్నాడు. అంటే కాళోజీ యుద్ధంలో పుట్టి యుద్ధంలో పెరిగి జీవితమంతా ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాడిన ప్రజాస్వామ్యవాది. ‘నా గొడవ’ ప్రథమ ముద్రణను ఆవిష్కరిస్తూ శ్రీశ్రీ కూడా కాళోజీని యుద్ధకవి అన్నాడు. పద్దెనమిదో యేట హనుమకొండ కాలేజీయేట్ హైస్కూల్లో గణపతి ఉత్సవాల వూరేగింపు కోసం సామూహిక సెలవు కోసం లిఖిత పూర్వకంగానే ప్రిన్సిపల్‌కి ఇచ్చాడు. అందుకు శిక్షను అనుభవించాడు. నిషేధం చెల్లదని చెప్పడానికి తన మీద వేసుకొని ప్లకార్డులు రాసి, బ్యానర్లు రాసి బహిరంగంగా కూర్చుని నిర్వహించాడు. అందుకోసం వరంగల్లు నగరం నుంచి బహిష్కరణకు గురయ్యాడు. దేశవ్యాప్తంగానే కవుల్లో ఇట్లా దేశ బహిష్కరణకు గురైన కవి నాకు తెలిసి ఫైజ్ అహ్మద్ ఫైజ్ ఒక్కడే ఉన్నాడు. వరంగల్ కోటలో ఆంధ్ర సారస్వత పరిషత్ కవి సమ్మేళనం, అందు లో ఒకవైపు రజాకార్లు సభల కోసం వేసిన పందిళ్లు తగులబెడుతుంటే దాశరథి, కాళోజీల కవిత్వగానం సాగిన తీరు ఇప్పటికే తెలంగాణ అంతటా సుప్రసిద్ధమైన విషయాలు. మొగిలయ్య, డాక్టర్ నారాయణడ్డి హత్య సందర్భం నుం చి పద్మాక్షమ్మగుట్ట ఎన్‌కౌంటర్ల దాక కాళోజీ హృదయ స్పందనలు తెలంగాణ ప్రజల గుండె చప్పుళ్ల ప్రకంపనలే. కాళోజీ గాంధేయవాది, ఆహింసావాది. కానీ ప్రహ్లాదుని సత్యాక్షిగహం చెల్లనిచోట ఉగ్రనరసింహుని చర్యను సమర్ధించినవాడు. కాళోజీలో ఎన్ని వైరుధ్యాలు ఉన్నా పోరాటం అధికృత హింసపై చేశాడు. గాంధీ చెప్పిన వాటిలో కూడా ఆయనకు చాలా ఇష్టమైనది ‘నేను హింసను వ్యతిరేకిస్తాను, కానీ పిరికితనం కన్నా హింసను ఎన్నుకుంటాను’అని. హింసాహింసల చర్చలలో ఆయనకు ఎంతటి స్పష్టత అంటే ప్రభుత్వ హింస ముందు ప్రజల హింస, అధికృత హింసకు వ్యతిరేకతకు, ప్రతిహింస ఎప్పుడూ సమర్థనీయమే’ అంటాడు. మొదటి ప్రపంచ యుద్ధంలో పుట్టి రెండవ ప్రపంచయుద్ధం నాటికి ఆంధ్ర మహాసభలో క్రియాశీల కార్యకర్త అయిన కాళోజీ దేశ, కాల పరిస్థితులకు అనుగుణంగానే జీవితమంతా యుద్ధకవిగానే ఉన్నాడు. ఆంధ్రవూపదేశ్ ఏక కాలంలో ప్రత్యేక తెలంగాణ, నక్సలైట్ ఉద్యమాలు (1968-72),ఎమ్జన్సీ వ్యతిరేకత (1975-77)ఇంకా తర్వాతి జీవితమంతా ఆయా ప్రభుత్వాల కాలంలో రాజ్యహింస వ్యతిరేక, ప్రజాస్వామిక పోరాటం, మళ్లీ 96లో ప్రజాస్వామిక ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మొదలుకాగానీ, అది వరంగల్‌లో కాశయ్యగారి దొడ్లో అయినా, భువనగిరిలోనైనా, ఏవీ కాలేజీలోనైనా స్వతంత్ర సమరయోదుడు భువనగిరి జైని మల్లయ్య గుప్తలతో మొదలుకొని ఇన్నయ్య, గద్దర్, బెల్లి లలితల దాక ఎవరు డెల్టా వలసాంధ్ర పాలనకు వ్యతిరేకంగా ప్రజల్ని సమీకరిస్తే వాళ్ల నడిచినవాడు. వరంగల్‌లో (1996 డిసెంబర్ 30,31పజాస్వామిక ప్రత్యేక తెలంగాణ మహాసభ వేదికను, వేదిక కింద బాంబులు పెట్టి పేల్చివేస్తామని రాజ్య ప్రాయోజిత మాఫియా బెదిరింపు ప్రకటనలు ఇస్తే వక్తలందరి కన్న ముందు వచ్చి లక్షలాది ప్రజల ముందు ‘ప్రజాస్వామిక ప్రత్యేక తెలంగాణ మహాసభ వేదిక మీద నిలబడ్డాను. ఇంక వేదిక కింద మీ బాంబులేవో పేల్చండ’ని సవాల్ విసిరిన సాహసి ఆయన.

తెలంగాణ ప్రజా జీవితాలతో, పోరాటాలతో ఇంత మమేకమైన సుదీర్ఘ ఆచరణ అనుబంధం ఉన్న బుద్ధిజీవి ఇంకొకరు ఉండరు. 1930లో బుద్ధి తెలిసిన నాటి నుంచి తన 89వ యేట 2003లో చనిపోయే వరకు ఆయన మాటల్లోనే ఏ అవయవం కూడా సహకరించని కాలంలో ఆయన పదునైన బుద్ధి, ఆర్ద్రమైన హృదయం తెలంగాణ ప్రజాచైతన్యాన్ని రగిలిస్తూనే ఉన్నవి. ఆయనకు ఇంత నిశితమై న దృష్టిని, ప్రజల జీవనాడిని పట్టుకునే శక్తి మాత్రం స్పష్టంగా మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత 1918-20 ప్రాంతాల్లో తెలంగాణలో వికసించిన ప్రజాస్వామిక ఉద్యమమే ఇచ్చింది. జనగామ ప్రజల వీరోచి త పోరాటాల్లో స్వయంగా పాల్గొని రాసిన దేవులపల్లి వెంక ప్రపంచ మార్కెట్ల పునఃపంపకం కోసం జరిగిన మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత వలస దేశాల్లోని ప్రజల్లో పొటమరించిన ప్రజాస్వామ్య చైతన్యం గురించి రాస్తాడు. అది క్రమంగా రెండో ప్రపంచ యుద్ధం ముగిసేనాటికి, అంటే తెలంగాణలో 1944లో భువనగిరి ఆంధ్రమహాసభ జరిగే నాటికి ఫాసిస్టు వ్యతిరేక ప్రజల విజయంలో భాగంగా, తెలంగాణ ప్రజల అకాంక్షలలో భాగంగా కాళోజీయే ప్రతిపాదించిన తీర్మానంగా వెలుగు చూసింది. ఇవాళ్టి తెలంగాణ ఉద్యమం, రాజకీయాలు కాళోజీ నుంచి హెచ్చరికగా గ్రహించవలసిన ప్రజల సమస్యలు ఇవి. సమష్టి చైతన్యానికి ప్రాతిపదిక ఇది. 1939లో ‘ఇస్లాత్’ పేరుతో రాజ్యాంగ సంస్కరణలను సాలార్‌జంగ్ ప్రతిపాదించినపుడు,మంత్రివర్గం ఏర్పడినపుడు ఈ మంత్రివర్గం మనుగడ నిజాం ఇష్టా ఇష్టాలపై ఆధారపడి ఉంటుందని, ఆ సంస్కరణలు ప్రజాస్వామ్య వ్యతిరేకమైనవని ఆయన ఖండించాడు. ఇవాళ తెలంగాణ రాష్ట్రవిభజనకు అంగీకరించిన యూపీఏ, కాంగ్రెస్ సీడబ్ల్యూసీ తయారు చేసి పంపుతున్న పత్రం హైదరాబాద్ నగరాన్ని యూటీ చేయాలనే ప్రతిపాదనను కూడా ఈ దృష్టితోనే ప్రతిఘటించాలి. రాష్ట్ర విభజన, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, ప్రజాస్వామ్య వ్యతిరేకంగా జరగడం కాదు. కేంద్రపాలిత ప్రాంత ఉమ్మడి రాజధానిగా ఉండటం రెండు రాష్ట్రాల ప్రజలకు అవమానకరమైన, అప్రజాస్వామికరమైన సంస్కరణయేపజాభీష్టానికి వ్యతిరేకంగా 1956లో తెలంగాణను ఆంధ్రవూపదేశ్‌లో విలీనం చేస్తూ ఏర్పాటు చేసినపుడు చేసుకున్న పెద్దమనుషుల ఒప్పందం లో గానీ, తెలంగాణ ప్రాంతీయ కమిటీకి ఇచ్చిన అధికారాల్లో గాని చాలా ముఖ్యమైన అంశం తెలంగాణ భూముల క్రయ,విక్రయాలకు సంబంధించినది . తెలంగాణలోని భూములను తెలంగాణేతరులు ఎవరూ తెలంగాణ ప్రాంతీయ కమిటీ అనుమతి, ఆమోదం లేకుండ కొనరాదు, అమ్మరాదు అనే నియమం, ఆదివాసులకు రాజ్యాంగం ఇచ్చిన పరిరక్షణ వంటిది. ఆచరణలో అది ఎన్ని ఉల్లంఘనలకు గురైనా ఒప్పందాల్లో, చట్టాల్లో అది ఉన్న ది. కానీ ఇవాళ గ్రేటర్ హైదరాబాద్‌లోని భూముల క్రయ విక్రయాలన్ని కంపెనీలకు అమ్ముకునే అధికారం కేంద్ర వూపభుత్వానికి హస్తగతమౌతుంది. ఇది ఇరు ప్రాంతాల దళారులకు సమ్మతమే. అనాడు అట్లా ఏర్పడిన సంస్కరణ సభలో ఎన్నికైన హైదరాబాద్ కొత్వాల్ పింగళి వెంకవూటామ్‌డ్డిని, జస్టిస్ లకా్ష్మడ్డిని అసెంబ్లీలో కొనసాగరాదని కాళోజీ కవితలు రాసి హెచ్చరించాడు. 1947లో నైజాం ప్రభుత్వంలో చేరడానికి నిరాకరించిన బూర్గుల రామకృష్ణరావును అభినందించాడు. ప్రభుత్వాల పట్ల, రాజ్యం పట్ల , బుద్దిజీవులకు ఉండాల్సిన వైఖరి ఇది.

ఈనాటి తెలంగాణవాదులు హైదరాబాద్‌ను యూటీ చేసే విషయంలో గానీ, పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా అమలు చేసే విషయంలోగానీ ప్రతిఘటించాల్సిన వైఖరి కాళోజీ నుంచి అలవర్చుకున్నప్పుడు గాని ఆయనకు ఇవాళ మనం నిజమైన నివాళి చెప్పినట్లు కాదు.1944లో జనగామ, నల్లగొండ ప్రాంతాల్లో జరుగుతున్న దౌర్జన్యాలను, అణచివేతలను ఖండిస్తూ ప్రత్యేకించి ఆ ప్రాంతంలో ఆరుట్ల లక్ష్మినరసింహాడ్డి పైన జరిపిన దౌర్జన్యకరమైన సంఘటనపై స్పందించి ఆయన ‘ఇంకెన్నాళు’్ల అనే కవిత రాశాడు. నిజాం రజాకార్లు, బ్రిటిష్ మిలటరీ దళాలు జనగామ తాలుకలోని మాచిడ్డిపల్లె, ఆకునూరు గ్రామాల్లో స్త్రీలపై జరిపిన అత్యాచారాలను నిరసిస్తూ 1945లో ‘చాలు ఇంక’ అని రాసిన గేయం ఇవ్వాళ్టికి ఎంతో సందర్భోచితంగా ఉన్నాయి. కాళోజీ గొప్ప ఆశావాది, స్వాప్నికుడు, అల్పసంతోషి కూడా గనుక కొన్నిసార్లు కొన్ని భ్రమలకు లోనైయ్యాడు. తెలంగాణ సందర్భమే తీసుకుంటే తెలంగాణకు నెహ్రూ, ఇందిరలు ఎంత ద్రోహం చేశారో ఆయన ఆయా సందర్భాల్లో రాసిన కవితలు ఒక పెద్ద సంపుటమే అవుతాయి. ముఖ్యంగా 1969 నుంచి 77 వరకు ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సంద ర్భం కావచ్చు, నక్సలైట్ ఉద్యమ సందర్భం కావచ్చు, ఎమ్జన్సీ కావచ్చు ఆయన ఇందిర, బ్రహ్మానందడ్డి, వెంగళరావులకు వ్యతిరేకంగా ఎన్ని కవిత లు రాశాడో లెక్కేలేదు. ఆయినా 1969 జూన్‌లో రాజ్‌భవన్ ముందు కాల్పులు జరిపినపుడు ‘ఇందిరాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసా’్త అని ప్రకటిస్తే 1969 జూలైలో తెలంగాణ ఏర్పడుతుందని ఆశపడి ఒకటి కన్నా ఎక్కువే గేయాలు రాశాడు. రాజ్యస్వభావం, అధికృత హింస స్వభావం, ప్రభుత్వ స్వభావం జీవితమంతా ఇంతగా తెలిసిన కాళోజీయే తెలంగాణపై ఉన్న ప్రేమవల్ల, అకాంక్ష వల్ల ఒక క్షణమైనా భ్రమపడితే ఇంక కాంగ్రెస్ విధేయులు, ఖద్దర్ దారులు, కాంగ్రెస్‌లో విలీనం అయ్యేవాళ్లు, రాజ్య, ప్రభుత్వ, అధికార వ్యతిరేకత లేనివాళ్లు వాళ్లు ఎంత నిజాయితీతో తెలంగాణ అకాంక్షతో ఉద్యమిస్తున్నా మూడోసారి మోసపోకూడదని మనం కాళోజీ నుంచి నేర్చుకోవాలి. అది నాల్గవసారి అని కూడ అనవచ్చునేమో. ఎందుకంటే ఆంధ్రవూపదేశ్ ఏర్పడక పూర్వం నెహ్రూ ప్రకటన, ఫజల్‌ఆలీ కమిషన్ నివేదిక మొదలుకొని చర్విత చరణంగా చెప్పనక్కర లేకుండా 69 జూన్ ప్రధాని ఇందిర ప్రకటన, 2009 డిసెంబర్ 9, దేశీయ వ్యవహారాల మంత్రి చిదంబరం ప్రకటన (డిసెంబర్ 10న పార్లమెంట్ ఉభయసభల్లో చిదంబరం ప్రకటన) మొదలుకొని ఇప్పుడు నడుస్తున్న చరిత్ర అంతా తెలంగాణ నాల్గవసారి నవ్విన నాప చేను పండుతుందా..?

కాళోజీ దృష్టిలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి శత్రువులు రెండున్నర జిల్లాల, రెండున్నర కులాల సంపన్న వర్గాలు. ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణ జిల్లాలోని డెల్టా ప్రాంతంలోని బ్రాహ్మణులు కమ్మలు,రాజులు (అర)లోని సంపన్న వర్గాలు. కృష్ణ, గోదావరి నదులపై నిర్మాణమైన ఆనకట్టల వలన ఆదనపు మిగులు పొందిన సంపన్నులు అయి, దళారులు అయ్యారన్నది కాళోజీ అవగాహన. ఆయన మరణించే 2003 నాటి కన్నా ఇవ్వాళ వైఎస్‌ఆర్ కాలంలో ఎదిగి వచ్చిన రాయలసీమ దళారులను కలుపుకొని తెలంగాణ ప్రజల పాలిటనే కాదు, ఆయా ప్రాంతాల ప్రజలపైన కూడా అధికృత హింస ఆచరించే శత్రువులే అయ్యారు. కోస్టల్ కారిడార్‌కు వ్యతిరేకంగా ఆంధ్ర సముద్ర తీరమంతా పోరాడుతున్న మత్స్యకారులు, పల్లెకారులు, ప్రజలతో వాన్‌పిక్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న భూమిలేని దళితులతో, సోంపేట, కాకర్లపల్లె మొదలుకొని శ్రీకాకుళంలో పవర్‌ప్లాంట్లకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజల తో, విశాఖపట్నం, విజయనగరం, వాకపల్లి, భల్లుగూడ అత్యాచారాలను కూడా భరించి దుబాయి కంపెనీకి, జిందాల్ కంపెనీలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఆదివాసీ ప్రజలతో, పులిచింతలకు వ్యతిరేకంగా, సిమెంట్ కంపెనీలకు వ్యతిరేకంగా పోరాడుతున్న పల్నాడు ప్రాంత ప్రజలతో, బళ్లారి మొదలు కర్నూల్ వరకు గనుల మాఫియాకు వ్యతిరేకంగా పోరాడుతున్న, నీళ్ల కోసం కన్నీళ్ల పోరాటం చేస్తున్న రాయలసీమ ప్రజలతో మనం మమేకమై ఆంధ్ర, కేంద్ర ప్రభుత్వలకు వ్యతిరేకంగా తెలంగాణ కోసం పోరాడి ఉంటే విజయం ఇంత కష్టసాధ్యమయ్యేది కాదు. దీన్ని మనం సీమాంధ్ర, తెలంగాణ విభజనగా మార్చాం. కాళోజీ అట్లా మార్చలేదు కాళోజీ శత్రువును రాజకీయ, ఆర్ధిక పరిభాషలో, దోపిడీ పరిభాషలో ఏకాకిని చేస్తూ మిత్రులను అన్ని పోరాట ప్రాంత ప్రజలుగా కలుపుకరమ్మన్నాడు. ఇలా వచ్చిన అవగాహనయే ‘ప్రాంతేతరులు దోపిడీ చేస్తే.. పొలిమేర్లదా దాక తన్ని తరుముతం, ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ప్రాంతంలోనే పాతర పెడతం’ అన్నది.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తెలంగాణ రాజకీయార్ధిక, అధికృతస్థాయి లో ఉన్న నాయకులు, అధిష్ఠాన స్థానంలో ఉన్న నాయకులకు తీసిపోయినవారేమీ కాదు. అక్కడివాళ్ల మోచేతి గంజినీళ్లు తాగుతున్నవాళే.్ల వీళ్లను ఎండగట్టడంలోని వైఫల్యమే తెలంగాణ రాష్ట్ర సాధన షరతులతో సాధ్యమయ్యే స్థితికి వచ్చింది. ఇది మనం తెచ్చుకునే వాళ్లం అనే భావన తప్ప మనకు ఎవరో అధిష్ఠానంలో ఉన్న వాళ్లు ఇచ్చే భావన నుంచి వచ్చింది.

కాళోజీ 1969లో ఒక రోజు (బహుశా నవంబర్ 1) ఆ రోజు తెలంగా ణ రాష్ట్రాన్ని ప్రకటిస్తున్నానని వరంగల్ పోచమ్మ మైదానంలో తెలంగాణ జెండా ఎగుర వేస్తున్నానని దమ్మున్నవాళ్లను రమ్మని పిలుపునిచ్చాడు. ఆ దారిలో ముల్కీ ఉద్యమ కాలంలో 68,69 ఉద్యమంలో ప్రాణాలు ఆర్పించిన ఎందరో అమరవీరుల ఆశయ సాధన కోసం మనం సకల జనుల సమ్మెను నిర్వహించాం, మిలియన్ మార్చ్‌లు చేశాం. సాగరహారమై సబ్బం డ రాసులు కదిలాం. 2009 నవరంబర్ 29 నుంచి డిసెంబర్ 10 వరకు పది రోజులు క్యాంపస్‌లలోని మన విద్యార్థులు ప్రపంచాన్ని కదిలించే ప్రకంపనాలను సృష్టించారు. చలో అసెంబ్లీ, క్విట్ తెలంగాణ అన్నాం. ఇవన్నీ కేంద్రానికి, రాష్ట్రంలోఅధికారానికి వ్యతిరేకంగా ప్రజల ప్రతిఘటన, ప్రజాస్వామిక పోరాటాలు. ఇది సీమాంధ్ర, తెలంగాణ పంచాయితి కాదు. ఇది ఒకరిచ్చేది కాదు, ఒకరు తెచ్చుకునేది కాదు. ప్రజాస్వామిక ఉద్యమాలు ప్రజా చైతన్యాన్ని పరిణతి వైపు తీసుకెళ్లాలి. ప్రజాస్వామిక ఉద్యమాలలో ప్రజాస్వామిక వికేంవూదీకరణ జరగాలె. ప్రజల బలం పెరగాలె. కానీ ప్రభుత్వాల బలం పెరగడం కాదు. ఫాసిస్టు పాలన పెరగడం కాదు. హైదరాబాద్‌ను యూనియన్ టెరిటరీ చేయడమనేది హైదరాబాద్ నగరంపై కేంద్ర హోంశాఖ అధికారా న్ని ప్రత్యక్షంగా కొని తెచ్చుకోవడం. యూటీ అంటే యూఏపీఏని ప్రజా ఉద్యమాలపై అమలు చేయడమే. ఎన్‌కౌంటర్లు, రాజ్యహింస పెరిగిపోవడమే. రానున్న తెలంగాణలో ఇటువంటి రాజ్యహింస ఉండని, ప్రజలు కూడు, గూడు, గుడ్డ అనే మౌలిక అవసరాలతో వాక్, సభా, విశ్వాస స్వతంత్రం అనే మౌలిక హక్కులకు ఏ తెలంగాణ రాజకీయ పార్టీ కూడా హామీ పడటం లేదు. హైదరాబాద్ నగరం విభిన్న సంస్కృతుల కూడలి అని కాళోజీ రాసిన కవిత చదివిన వాళ్లకు యూటీ హైదరాబాద్ కావడమంటే ఏమిటో దాని తీవ్రత అర్థం కాదు. కాళోజీ చాలా ఎక్కువగా తపించిన అంశం సంస్కృతి భాషా, యాసల వెక్కిరింతలు. ఒక్క మాటలో ఆయన బడిపలుకుల స్ధానంలో పలుకుబడుల చదువులు కావాలని కోరుకున్నాడు. దండిగొట్టే రెండున్నర జిల్లాలదే దండి భాష ఎందుకని ప్రశ్నించాడు. భాషకు ఆదిమ సమాజాలో ్లగానీ, సమ సమాజాల్లోగానీ భావ వినిమయ (కమ్యూనికెట్‌వ్) భూమిక మాత్రమే ఉంటుంది. కానీ అది అసమ సమాజంగాను, వర్గ సమాజంగాను పాలకుల భాష అధికార భాష అవుతుంది. ప్రజల భాష అణచివేతకు గురవుతుంది. అప్పుడు భాషకు కూడ అధికార స్వభావం వస్తుంది. దీనికి వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేసిన వాడు కాళోజీ . అందుకే కాళోజీ పుట్టిన రోజు అయిన సెప్టెంబర్ 9న తెలుగు సమాజం మాండలిక (ఇక నుంచి ప్రజల) భాష దినోత్సవంగా జరుపుకుంటున్నది. జరుపుకోవాలె. బడిపలుకుల భాష స్థానంలో పలుకుబడుల భాషకు స్వామ్యం వచ్చిన నాడు కానీ అది ప్రజస్వామ్య సంస్కృతి కాజాల దు. అందాక కాళోజీ మనలను ఆ ప్రజాస్వామ్య సంస్కృతి కోసం, నిరంత రం పోరాడాలని హెచ్చరిస్తూనే ఉంటాడు.

-వరవరరావు

322

VARAVARA RAO

Published: Wed,February 19, 2014 12:14 AM

ఈ బొమ్మకింక.. ప్రాణం పోయాలి!

ఎన్నాళ్లుగా నీ బొమ్మ గీయాలని.. ప్రయత్నిస్తున్నాను ఎన్నో పోరాటాల జ్ఞాపకాల కన్నీళ్లతో తడిసి నెత్తురు చింది అది చెరిగిపోయేది సాయు

Published: Tue,November 5, 2013 11:56 PM

దాశరథి దేశకాలాలు వెలుగు చీకటి జ్ఞాపకాలు

నా పదమూడో ఏటనే దాశరథి (కృష్ణమాచార్య)తో పరోక్ష పరిచయం, ప్రత్యక్ష పరిచయంగానే కాదు స్నేహంగా కూడా అంత సులభంగా సాధ్యమవుతుందని నేనూహిం

Published: Wed,August 14, 2013 01:16 AM

కేఎంసీలో వికసించిన ఎర్రమందారం

కాటా నారాయణరావు ‘శబరి గోదారి’ (1986) కవితా సంకలనానికి ముందుమాట రాస్తూ కాళోజీ నారాయణరావు.. ‘1965 లో ప్రారంభమైన అలజడి (విశాఖ ఉక్కు

Published: Wed,June 19, 2013 12:59 AM

తీర్మానం చేయలేని అసెంబ్లీ ఓడిపోయింది చేరనివ్వని చలో గెలిచింది

అసెంబ్లీ అంటే పది మంది సమావేశమయ్యే స్థలం కదా మంది కూడా కాదు మన ప్రజావూపతినిధులు పదికోట్ల మంది పెట్టు.. పెట్టుకున్న సభ మన చె

Published: Fri,June 14, 2013 12:21 AM

ప్రజాస్వామ్యమా! పోలీసుస్వామ్యమా!!

శాసనసభాపతిగా కూడా వ్యవహరించి, విజయవంతంగా, సమర్థవంతంగా శాసనసభను నిర్వహించిన పేరు కూడా తెచ్చుకొని ముఖ్యమంత్రి అయిన కిరణ్‌కుమార్‌డ్

Published: Sun,May 26, 2013 12:54 AM

ఆంధ్ర సారస్వత పరిషత్ జ్ఞాపకాలు ...అనుబంధాలు

జాగీరు గ్రామమైన మా చిన్న పెండ్యాలలో నా బాల్యంలోనే నేను ఆంధ్ర సారస్వత పరిషత్తు పేరు వినడమే కాదు,అది మా విద్యాభివృద్ధిలో పాత్ర నిర్వ

Published: Sat,April 20, 2013 12:54 AM

ఇంద్రవెల్లి ఇంగలం

‘ఒక నిప్పురవ్వ దావానలమవుతుంది’ అనేమాట సామాన్యంగా ఒకచోట రగుల్కొన్న విప్లవం నలువైపులా విస్తరించడానికి అన్వయిస్తుంటారు. వైనాడ్ (కేరళ)

Published: Mon,April 1, 2013 12:37 AM

రాజ్యాంగమా? మతక్షిగంథాలా?

మన ప్రభుత్వాలు లౌకిక ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రకారం నడుస్తున్నాయని ఎవరికైనా భ్రమలుంటే వాటిని పటాపంచలు చేశాడు మన ముఖ్యమంత్రి కిరణ

Published: Thu,March 21, 2013 12:13 AM

‘కుక్క’ల్లో వార్త

‘వార్తల్లో కుక్క’ అనాలి. కాని అపుడది వార్త కాదు. రిపోర్టింగ్‌లో ప్రవేశించిన ప్రతి ఒక్కరికీ మీడియా అనుభవజ్ఞులు ఏది వార్త అవుతుందో,

Published: Fri,March 15, 2013 02:14 AM

వంజెం సోమయ్య జైలుడైరీ...

ఇది జైలు డైరీ కాదు... ఇది నిర్బంధ డైరీ... ఇది పోలీసు అక్రమ అరెస్టు డైరీ.. ఇది చిత్రహింసల డైరీ.. ఇది దాతు ఫిర్యాదులేని రాజ్యాంగం ప

Published: Wed,February 20, 2013 11:57 PM

నాటి మాటలు మరిచారా?

అధ్యక్షా! మన శాసనసభ కేంద్ర ప్రభుత్వానికి మరణశిక్షను రద్దు చేయవలసిందిగా రికమెండ్ చేస్తూ తీర్మానం చేయాలని ప్రతిపాదిస్తున్నా ను. పూర్

Published: Fri,February 15, 2013 11:28 PM

బతికించే వృత్తినుంచి ఉరికంబం దాకా..

అప్జల్‌గురు ప్రస్థానం అతని మాటల్లోనే... నేను పెరుగుతున్న కాలంలో కశ్మీర్ రాజకీయంగా కల్లోలంగా ఉన్నది. మక్బుల్‌భట్‌ను ఉరి తీశారు(198

Published: Sat,December 29, 2012 04:40 PM

డిసెంబర్ 6కు 20 ఏండ్లు

ఈ డిసెంబర్ 6కు (బాబ్రీమసీదు విధ్వంసం జరిగి) 20 ఏండ్లు నిండాయి. ఇరవైఏండ్లంటే ఇంచుమించు ఒక తరం మారింది. పి.వి.నర సింహా రావు నుంచి మన

Published: Wed,October 10, 2012 08:11 PM

‘తెలంగాణ మార్చ్’యే జవాబు

ముందు కొన్ని వాస్తవాలు చెప్పుకోవాలె. ఆ వాస్తవాలపై మన అభివూపాయా లు, వ్యాఖ్యలు ఏమైనా కావచ్చు. నెలవారీగా కేంద్ర హోంమంత్రి నిర్వహించే

Published: Sat,October 6, 2012 03:30 PM

పిల్లి మొగ్గలు ఎలుకల్ని పట్టడానికే

భాషలో తేడాయే తప్ప ప్రకాశ్‌సింగ్, కిషోర్‌చంవూదదేవ్, జైరాంరమేష్‌లు కూడా దళారీ పాలనలో భాగమైనంత కాలం చిదంబరం, రమణ్‌సింగ్, విజయ్‌కుమార్

Published: Sat,October 6, 2012 03:31 PM

ఆత్మావలోకనం

మార్క్సిజం పెట్టుబడిదారీ విధానాన్ని మట్టికాళ్ల మహారాక్షసి అంటుంది. ఆ మహారాక్షసి ఉక్కువేళ్లు మట్టిపొరలు చీల్చుకొని భూగర్భ జలాల్లోకి

Published: Sat,October 6, 2012 03:31 PM

విప్లవ దార్శనికుడు

‘చాటండి గళమెత్తి విప్లవదార్శనికుడు చారుమజుందార్ చచ్చిపోలేదని- కామ్రేడ్ చారుమజుందార్ చంపబడ్డాడని’ అంటూ చెరబండరాజు తన కవితా సంకలనం

Published: Sat,October 6, 2012 03:32 PM

ఆదివాసులకు న్యాయం దక్కేనా?

చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, సుక్మా, కాంకేర్ జిల్లాల్లో జూన్ 28,29 తేదీల్లో పోలీసులు మూడుచోట్ల అమాయకులైన 23మంది ఆదివాసీలను చంపారు. జ

Published: Sat,October 6, 2012 03:33 PM

అద్దంలో ‘విద్యార్థి ’ మాట

మొదట వరంగల్ ఆర్ట్స్‌కాలేజీ, తర్వాత ఉస్మానియా క్యాంపస్, రెండుచోట్ల చలం, శ్రీశ్రీ ఇచ్చిన మిత్రులు కాకుండా‘మివూతమండలి’ ఇచ్చిన మిత్రుల

Published: Sat,October 6, 2012 03:33 PM

జార్జ్ అడుగు జాడల్లో..

నేను జార్జిని చూసిన జ్ఞాపకం లేదు. కాని 1972 ఏప్రిల్ 14 సాయంకాలం నుంచి ప్రతి సాయం సంధ్యలోనూ ప్రతి ఉదయసంధ్యలోనూ ఆకాశంలోనే కాదు, నేలమ

Published: Sat,October 6, 2012 03:34 PM

విప్లవ స్వాప్నికుడు ‘అలిశెట్టి’

ఈసారి 2011 సెప్టెంబర్ 29న కామ్రేడ్ సూర్యం సంస్మరణ సభ గుంటూరులో అపూర్వంగా జరిగింది. నేను వెళ్లాల్సింది. ఆ సభ జరుపుతామని తెలిసినప్ప

Published: Sat,October 6, 2012 03:34 PM

దిక్కుల కూడలిలో ధిక్కార స్వరాలు...?

ఎందుకోసం వచ్చినా.. చెరబండరాజు పుట్టిన రోజు చర్చ మంచి కోసం ఉపయోగపడుతోంది. చెరబండరాజు కు సాహిత్య అకాడమీ నుంచి వచ్చిన సహాయాన్ని తన అవ

Published: Sat,October 6, 2012 03:35 PM

ఉద్యమ పంథా మారాలె

సకలజనుల సమ్మె స్వయంపాలనలో భాగంగా శాంతియుతంగా, రాజకీయాలకు అతీతంగా యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని ఒక్కతాటి మీదికి తీసుకురావడం ద్వారా ప్

Published: Sat,October 6, 2012 03:35 PM

కాళోజీ (అను) వాదం

‘నా భారతదేశయాత్ర’ డ్బై ఏళ్ల క్రితం (1941) కాళోజీ (నారాయణరావు)గారు అనువదించి, దేశోద్ధారక గ్రంథమాల పక్షాన వట్టికోట ఆళ్వారుస్వామిగారు

Featured Articles