కేఎంసీలో వికసించిన ఎర్రమందారం


Wed,August 14, 2013 01:16 AM


కాటా నారాయణరావు ‘శబరి గోదారి’ (1986) కవితా సంకలనానికి ముందుమాట రాస్తూ కాళోజీ నారాయణరావు.. ‘1965 లో ప్రారంభమైన అలజడి (విశాఖ ఉక్కుఫ్యాక్టరీ) ప్రభావము కారణంగా డాక్టరు గారి కవిత మరోమలుపు తిరిగి ముందడుగు వేసిం ది. ధూర్తలోకాన్ని ఎదిరించి చేసే పోరాటంలో అహింసా పద్ధతి పనికిరాదని, ప్రతిహింస కూడ అనివార్యమే అవుతుందనే ధోరణి ఉక్కుపోరు గీతములో ప్రత్యక్షమవుతుంది. దీని తరువాత ఉన్న గేయాలన్నీ...పణయ గీతాలాపన ఏమిటి కవీతైపళయ ప్రభంజనాలు వీస్తుంటే?! అనే ఈ రెండు చరణాలననుసరించే సాగాయి’ అని రాసారు. తెలుగునేలమీద విశాఖపట్నంలో ఉక్కుఫ్యాక్టరీ కోసం 1965లో జరిగిన ఉద్యమం గురించి, వరంగల్‌లో (అందులోను రీజినల్ ఇంజనీరింగు కాలేజీలో జరిగిన మిలిటెంటు పోరాటం, ఆర్‌ఈసీ విద్యార్థులపై సీఆర్‌పీఎఫ్ కాల్పుల గురించి నేనిదివరకు ఒకటిండుచోట్ల ప్రస్తావించే ఉన్నాను. వరంగల్‌లో ఈ ఉద్యమం వెనుక కొండపల్లి సీతారామయ్య, కె.జి.సత్యమూర్తిల దిశానిర్దేశకత్వం ఉంది. అయితే అది కూడ వాళ్లకు అంతకన్నా ముందుకాలంలో సాధ్యమై ఉండేది కాదు. కాటా నారాయణరావు తన ముందుమాటలో చెప్పుకున్నట్లుగా ‘అపుడే దిగంబరుల, పైగంబరుల హడావిడి. మహాకవి శ్రీశ్రీ ‘మహావూపస్థానం’, ప్రజాకవి కాళోజీ ‘నాగొడ వ’ అతని కవితా వూపస్థానానికి దారిచూపించాయి. కాళోజీ రచనాశైలీ సౌలభ్యాన్ని, సూటిదనాన్ని అబ్బించింది.1967లో రగిలిన నక్సల్బరీ, శ్రీకాకుళ సాయుధ రైతాగ విప్లవా లు కలాలకు బలాన్నిచ్చాయి. సైద్ధాంతిక పునాదిని అందించాయి. విప్లవ చైతన్యాగ్నులను వెదజల్లాలని పిలుపునిచ్చాయి. అప్పటిదే ‘తెలంగాణ పిలిచిందిరా! వీరతెలంగాణ పిలిచిందిరా!’ అనే గీతం. ఈ వీరతెలంగాణ పందొమ్మిదివందల నలభైఏడునాటి వీరతెలంగాణ మాత్రమే కాదు, 1967-68 శ్రీకాకుళంతోపాటే తెలంగాణ గోదావరి అడవులపై కూడా నక్సల్బరీ గర్జించిన వసంతమేఘం. ‘వీరకుంకుమ’ నాటకంలో శివసాగర్ రాసిన కొత్తపాటలు చేరి ఆదిలాబాదు మొదలు వరంగల్ దాకా ప్రదర్శనలు పొందాయి. ‘ఆ కాలంలో శివసాగర్‌తో కలిసి రాసే అవకాశం కలిగింది. విప్లవకర గ్రామీణ రైతాంగంతో కలిసి సాగిన దశలో రాసిన బతుకుపాట సాయుధపూజ’అంటాడు కాటా నారాయణరావు. ‘సమకాలీన శ్రీకాకుళ గిరిజన రైతాంగ విప్లవ పోరాటాన్ని ఆడుతూ పాడుతూ జముకు మోగిస్తూ ఆంధ్రదేశమంతా జైత్రయాత్ర సాగించిన విప్లవకవి పాణిక్షిగాహి తెలంగాణను పలకరించి వెళ్లాడు. చరిత్ర తిరుగుబాటు కవులను, ఇంగితం గల దిగంబరులను తదితరులను ఎరుపెక్కించుకొని విరసం రూపమిచ్చింది. జననాట్యమండలిని సృష్టించుకున్నది. సృజన, సాహితీమివూతులు సాహిత్యాన్ని మరింత ఎరుపెక్కించారు. విప్లవావశ్యకత కవులను, రచయితలను విముక్తి పోరాటాలు సాగిస్తున్న పీడిత ప్రజల కొరకు రాయమన్నది. ప్రజల (వాడుక) భాషలో రాయమన్నది. ప్రజలనుంచి ప్రజలకనే నియమాన్ని పాటించమన్నది’. ఇవి కాటా తన ముందుమాటలో తనమీద ప్రభావాల గురించి తన పరిణామం గురించి చెప్పుకున్నమాటలు. అం దుకే 1967లో ‘తెలంగాణ పిలిచిందిరా’ అని ఆయన రాసిన కవిత 1973లో సృజనలో ‘మహావూపస్థానానికి పిలుపు’గా ప్రచురింప బడేనాటికి ‘జనసేన పిలిచిందిరా! ప్రజాసేన పిలిచిందిరా’గా పదునెక్కి ‘కర్రొ సిర్రొ కత్తొ సుత్తొ తాడొపేడో సేతపట్టి కదనానికి రమ్మ’ని పిలుపునిచ్చింది.

ఆయన బతుకుపాట వరంగల్‌జిల్లా దేశాయిపేట, మొగిలిచెర్ల గ్రామాల్లో చిన్నపిల్లలకు చప్పట్లతో బృందగానం, నృత్యం నేర్పినపాట. రచనాకాలం 1967. ఇది 1974 సృజన ‘మే’ డే సంచికలో అచ్చయింది. సృజన 74 మే సంచిక అప్పటి చరివూతాత్మకమైన రైల్వే సమ్మెను బలపరచింది. ‘జైళ్లు రైళ్లను నడిపించగలవా?’ అని రైల్వే కార్మికుడు రాసిన ఒక కవితను అచ్చేసి, అదే శీర్షికతో సంపాదకీయం కూడ రాసినందుకు, అదే సంచికలో బాక్సు గట్టి
‘దొరల గుమ్ముల్లో గింజలున్నాయి
మన కడుపులో ఆకలున్నాది
ఆకపూట్టా తీర వలెరన్నో
గుమ్ములన్నీ పగలగొట్టన్నా హెయ్
దుమ్ముదుమ్ముగ పగలగొట్టన్నా....’అని ప్రచురించిన ఈ సంచిక నిషేధాన్ని హైకోర్టు ధృవపరచింది. వరంగల్‌సెషన్స్‌కోర్టు ‘రాజవూదోహ నేరా’నికి సృజన ప్రచురణకర్త హేమలతకు రెండుసంవత్సరాల కఠిన కారాగారశిక్ష వేసింది. ఈ కవిత రాయడానికి, అచ్చయి నిషేధింపబడటానికి మధ్యకాలంలో1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కె.జి.సత్యమూర్తి నాయకత్వంలో దేశాయిపేట, పైడిపల్లి గ్రామాల్లో విప్లవంపట్ల ఆకర్షితులైన యువకులు వరంగల్ రైల్వేస్టేషన్‌లో ధాన్యం వ్యాగన్లపై, స్టేషన్ బజార్లో గోడౌన్లపై దాడులు చేసి ధాన్యం తెచ్చుకున్నారు. ఆ రోజుల్లో కాజిపేట, వరంగల్ స్టేషన్‌ల పరిసరాల గ్రామాలపై, రైల్వే కార్మికులపై పోలీసుల దాడులు, అరెస్టులు, చిత్రహింసలు ఈనాటికీ మరిచిపోజాలనివి.కాకతీయ వైద్యకళాశాల తొలితరం విద్యార్థిగా ఈ నేపథ్యం నుం చి వచ్చిన కాటానారాయణరావు సహజంగానే విప్లవ రచయితలసంఘం ఏర్పడగానే విరసంలో చేరాడు. రాజమంవూడిలో ప్రజావైద్యశాలతో పాటు ‘చైతన్యవూసవంతి’ అనే సాహిత్యసంస్థను ఏర్పాటుచేసాడు. చిరకాలంలోనే రాజమండ్రి దేవీచౌక్‌లోని ఆయన ‘తులసి క్లినిక్’ విరసం, ఏపీసీఎల్‌సీ, భారత చైనా మిత్రమండలి, జననాట్యమండలి వంటి విప్లవ, ప్రజాస్వామిక కార్యకలాపాలన్నింటికీ కేంద్రమైంది. 1974లో విప్లవోద్యమ నాయకులతోపాటు, విరసం రచయితలు ఆరుగురిపై సికిందరాబాదు కుట్రకేసు పెట్టినపుడు రాజమండ్రి సుబ్రహ్మణ్యం మైదానంలో డాక్టర్ కాటా నారాయణరావు నాయకత్వంలో ఏర్పాటుచేసిన విరసం బహిరంగసభలో వక్తల ప్రసంగాలు ‘రాజవూదోహాన్ని’ సాయుధ పోరాటాన్ని రెచ్చగొట్టినట్లుగా ఆరోపించబడినవి. అదే రోజుల్లో 1974 ఉత్తరార్థంలో రాజమండ్రి కేంద్రకారాగారంలో ఉన్న తమ సహచరులను కొందరిని విడిపించుకోవడానికి బయటినుంచి సీపీఐ ఎంఎల్ (సీఓసీ) నాయకత్వం ప్రయత్నం చేసిందని ఆ పార్టీ కార్యదర్శి ముక్కు సుబ్బాడ్డితోపాటు ఎన్.సి.శివాజీని అరెస్టుచేసి పోలీసులు రాజమండ్రి కుట్రకేసు పెట్టా రు. ఆ కేసులో డాక్టర్ కాటా నారాయణరావును కూడ ముద్దాయిని చేసి అరెస్టుచేసారు. ఆ కేసు కొనసాగుతుండగానే ఎమ్జన్సీ విధించబడి ఆయన ఎమ్జన్సీ కాలమంతా కూడ అదే జైల్లో ‘మీసా’ కింద డిటెన్యూగా కొనసాగాడు.

ఇక ఎమ్జన్సీ ఎత్తివేసిన తర్వాత రాడికల్ విద్యార్థి, యువజన సంఘాలు ‘గ్రామాలకు తరలండి’ పిలుపు యిచ్చి, రైతుకూలీసంఘాలు ఏర్పడి ‘జగిత్యాల జైత్రయాత్ర’ ప్రభావంతో వెల్లు ప్రజా ఉద్యమాలు 1978- 85 మధ్యకాలంలో తెలంగాణనే కాదు గోదావరి ఏజెన్సీ ఏరియాను కూడా ముంచెత్తినవి. డాక్టర్ కాటా నారాయణరావు కవిత్వం ‘శబరి గోదారి’ అట్లా రెండునదుల సంగమంగా పోటెత్తిన కవిత్వం పౌరహక్కుల ఉద్యమ నాయకులు డాక్టర్ రామనాథం అరుణారుణ స్మృతికి అంకితమై ముగిసింది.కాటా నారాయణరావు జులై 27న దోసకాయలపల్లి (తూర్పు గోదావరిజిల్లా)లో తన 70వ ఏట అనారోగ్యం తో మరణించాడని విన్నాక, కొల్లూరి చిరంజీవి కూడ ఫోన్‌చేసి చాలసేపు ఆ రోజులను జ్ఞాపకం చేస్తూ మాట్లాడాడు. కాటా నారాయణరావు అనే వ్యక్తి కాళోజీ చెప్పినట్లు 1965 నుంచి అట్లా ఎందుకు మారాడు? ఆయనొక్కడేనా కాకతీయ వైద్యకళాశాలయే అటువంటి ఒక విప్లవ ప్రయోగశాలగా పరిణతి చెందిందా! 65 ఉక్కు ఉద్య మం ఒక స్పష్టమైన ప్రాపంచిక దృక్పథంతో నడిచింది గనుక మడికొండ నుంచి వరంగల్‌దాకా ఈ కళాశాల మొదటితరం విద్యార్థులు ‘ప్రజావైద్య శిబిరాలు’ నిర్వహించారు. విప్లవ రాజకీయ ప్రచారానికి పూనుకున్నారు. చెంచురామిడ్డి వం టి మొదటితరం విద్యార్థులు ములుగు అడవుల్లోకి కూడా వెళ్లారు. అయితే వైద్యవిద్య కోసం ఈ కళాశాలలో చాలామంది విద్యార్థులు సాహిత్య విద్యార్థులుగా కూడా మారడం అప్పటి దేశకాల పరిస్థితు ల ప్రభావం అనుకుంటాను. గిడుగు, గురజాడలపై చేసిన అధ్యయన, పరిశోధన కోసం, ఆయన ప్రచురించిన సంచికల కోసం చేరా అభినందనలు కూడ అందుకున్న డాక్టర్ కావూరు రమేశ్‌బాబు ఈ కళాశాల విద్యార్థియే. జీవితమంతా విప్లవ, ప్రజాస్వామిక సంస్థలతో మమేకమై ‘తర్జని’ వంటి కథాసంకలనం వెలువరించిన ఆయ న సహచరి డాక్టర్ కరుణ ఈ కళాశాల విద్యార్థే. ఈ కళాశాల విద్యార్థిగా 1960లలోనే ‘భారతి’ వంటి సాహిత్య పత్రికల్లో కథలు అచ్చయిన డాక్టర్ కె.హరీష్ ఖమ్మంలో విరసం ప్రథమ మహాసభలు నిర్వహించినది మొదలు, ఇటీవల ‘శివసాగర్ సమగ్ర కవితాసంకలనం’ ప్రచురించడం వరకు సాహిత్యోద్యమంతో కొనసాగినవాడు.

1968లో ఆంధ్రవిద్యాభివర్ధినీ ఉన్నత పాఠశాలలో జరిగిన జిల్లా రచయితల సభల దగ్గరికి వచ్చి సృజన, రచయితల ప్రాపంచిక దృక్పథం గురించి చర్చించి ఆలోచనలు రేకెత్తించినవాళ్లలో వీళ్లున్నారు.1970 జులై 4న విరసం ఆవిర్భావ చారివూతక పత్రంపై సంత కం చేసినవారిలో ఈ కళాశాల విద్యార్థి రావి భుజంగరావు ఉన్నా డు. ఆయనే ‘సృజన’లో డాక్టర్ నార్మన్‌బెతూన్ ‘రక్తావూశువులు’ పుస్తకాన్ని పరిచయం చేసి సహవిద్యార్థులతో కలిసి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి గోడలపై, ఎదురుగా ఇస్లామియాకళాశాల గోడలపై ‘వైద్యులారా రోగుల దగ్గరికి వెళ్లండి’ అనే నినాదాలు రాసారు. ఎంజీఎం ఆసుపత్రి ముందు వైద్యవిద్యార్థులు పేదరోగుల కోసం కనిపెట్టుకుని ఉండి వైద్య సహాయ, చికిత్సలు చేయించేవారంటే ఆ రోజుల్లో నార్మన్‌బెతూన్, డాక్టర్ కొట్నీస్‌ల సేవాభావంతో కేఎంసీ విద్యార్థులు ఎంత ప్రభావితులయ్యారో ఊహించుకోవచ్చు. డాక్టర్ రామనాథం క్లినిక్‌లో కొంతకాలం పనిచేసి, ఆయన హత్యానంతరం ఆయన ఆదర్శం తో, ప్రజల్లోకి వెళ్లడానికి మొగిలిచర్లలో ప్రజావైద్యశాలను ఒక్కడుగా నిర్వహించి న డాక్టర్ ఆమెడ నారాయణను మొగిలిచర్లకు స్కూటర్‌మీద పోతుంటే చికిత్సపేరు తో ఆపి పోలీసులు గుండెల్లో గురిచూసి కాల్చేసారు.1972లో కాకతీయ వైద్యకళాశాల వార్షిక సంచికలో శ్రీశ్రీ తెలుగు నాటకరంగంపై లెనిన్ ప్రభా వం ఇంగ్లీషువ్యాసాన్ని అచ్చువేస్తే ఏబీవీపీ విద్యార్థులు యాజమాన్యంపై ఆ రచన చింపివేసి పత్రిక పంచాలని ఒత్తిడి తెచ్చా రు. ‘ఎన్ని హృదయాలనుంచి శ్రీశ్రీని చించగలరు?’ అనే ముఖచివూతంతో సృజన సంచిక దీనిపై నిరసన ప్రకటించింది. స్పార్టకస్ ఏకపావూతాభినయానికి ఆరోజుల్లో ప్రసిద్ధుడైన యాదగిరి ఈ కళాశాల విద్యార్థే. ‘తిరుగబడు’ ‘మార్చ్’ కవుల్లో కూడ ఒకడైన యాదగిరి ‘ఇపుడు వీస్తున్నగాలి’ కవితా చరణం తర్వాత కొ.కు. సంపాదకత్వం వహించిన విరసం కథాసంకలనం పేరయింది.విప్లవ భావాలు గల విద్యార్థులు, రచయితలనే కాదు, భావుకతకు మంచి సాహిత్య కళాభిరుచికి కూడ ఈ కళాశాల విద్యార్థులు ఎంతో దోహదం చేసారు. స్వయంగా చిత్రాలు వేసీ కథలు రాసిన డా.అంజని, సాహిత్య సంగీతాల్లో తండ్రి అనుముల కృష్ణమూర్తి వారసత్వం నిలిపిన డాక్టర్ సరస్వతి ఈ కళాశాల మొదటితరం విద్యార్థినులు. మేధావిగా, ఆలోచనాపరుడుగా పేరుపొంది ఎన్నో సాహిత్య ప్రక్రియలు సృష్టించిన వాసిడ్డి మోహనరావు, యువకుడుగానే మరణించిన ఎం.వి.ఎచ్‌పసాద్ వంటి ఎందరో.. ఇంకా నాకు తెలియని సాహిత్యవేత్తలు ఈ కళాశాల నుంచి వచ్చారు.

ఈ కళాశాల విద్యార్థి అప్పాల చక్రధారి ఇవ్వాళ నిర్మాత నుంచి తెలంగాణరచయితల వేదికలో రాష్ట్రస్థాయిలోనే ప్రముఖపాత్ర నిర్వహించడమే కాకుండా స్వయంగా కవి. ఇంక అందరికన్న చెప్పవలసిన వ్యక్తి దామెర రాములు. వరంగల్‌కు సమీపంలోని శాయంపేటలో దళిత కుటుంబంలో పుట్టి ప్రతిభాశాలిగా వరంగల్ ఆర్ట్స్ కాలేజీ విద్యార్థిగానే ధారాళంగా పద్యాలు రాసిన రాములు చెరబండరాజు ప్రభావంతో విరసంలో చేరి, వరంగల్ కేఎంసీలో పీజీ చేయడానికి వచ్చి వరంగల్ విరసం కన్వీనర్‌గా ఉన్నాడు. ఎమ్జన్సీ ఎత్తివేసిన తర్వాత దివిసీమలో ఉప్పెన వచ్చినపుడు డాక్టర్ రామనా థం, డాక్టర్ భుజంగరావు, డాక్టర్ ఉపేందర్‌ల పూనికతో విరసం ఏపీసీఎల్‌సీ దివిసీమలో నెలరోజులపాటు సహాయశిబిరం నిర్వహించింది. ఈ రోజుల్లోనే 72 రోజులపాటు జూనియర్ డాక్టర్ల సమ్మె జరిగితే ఒకవైపు ఆ సమ్మెకు నాయకత్వం వహిస్తూనే విరసం కన్వీనర్‌గా డాక్టర్ దామెర రాము లు, డాక్టర్ రామనాథం మొదలైన డాక్టర్ల సహాయంతో ఎంజీఎం ఎదురుగా పేదరోగుల కోసం ఉచితవైద్యశిబిరాన్ని నిర్వహించా డు. ఇప్పటికీ తెలంగాణ రచయితల వేది క ఆదిలాబాదు జిల్లా బాధ్యతల్లో ఉంటూ దామెరరాములు విరివిగా కవిత్వం రాస్తూ సంకలనాలు తెస్తూనే ఉన్నాడు.1973లో వరంగల్‌లో విరసం సాహి త్య పాఠశాల నిర్వహణలో కీలకభూమిక నిర్వహించిన వాళ్లు డాక్టర్ రామనాథం, అప్పటికింకా వైద్యవిద్యార్థిగా ఉన్న కె.చిరంజీవి, డాక్టర్ రామనాథంగారు‘శ్రామికవర్గ ప్రచురణలు’ ప్రారంభించి చారుమజుందార్ రచనలతోపాటు మావో ‘సరియైన భావాలు ఎచటినుండి వస్తాయి?’ అనే చిన్న పుస్తకం ఒక డయాక్షిగామ్ వేసి ప్రచురించారు. వైద్యజ్ఞానం రోగులకు చికిత్స చేయడం నుంచి, సేవ చేయడం నుంచి వస్తుంద ని, కేవలం వైద్యశాస్త్ర గ్రంథాల నుంచే రాదని కాకతీయ వైద్యకళాశాల విద్యార్థులకు నేర్పింది. ఇక్కడ హాస్టల్ డైనింగ్‌హాల్‌లో మెస్‌బాయ్‌గా పనిచేసిన జన్నుచిన్నాలు 1979కాలంలో ఇక్కడి విప్లవ విద్యార్థులకే కాదు, జిల్లా పీడిత ప్రజలకే నాయకుడయ్యాడు. ఇటువంటి కళాశాలలో, అటువంటి కాలంలో చదువుకున్న కాటా నారాయణరావు కూనవరంలోనైనా, దోసకాయలపల్లిలోనైనా, దేవీచౌక్‌లోనైనా అందుకే ప్రజావైద్యశాలలే నిర్వహించాడు. ప్రజాసాహిత్యమే రచించాడు.

-వరవరరావు

142

VARAVARA RAO

Published: Wed,February 19, 2014 12:14 AM

ఈ బొమ్మకింక.. ప్రాణం పోయాలి!

ఎన్నాళ్లుగా నీ బొమ్మ గీయాలని.. ప్రయత్నిస్తున్నాను ఎన్నో పోరాటాల జ్ఞాపకాల కన్నీళ్లతో తడిసి నెత్తురు చింది అది చెరిగిపోయేది సాయు

Published: Tue,November 5, 2013 11:56 PM

దాశరథి దేశకాలాలు వెలుగు చీకటి జ్ఞాపకాలు

నా పదమూడో ఏటనే దాశరథి (కృష్ణమాచార్య)తో పరోక్ష పరిచయం, ప్రత్యక్ష పరిచయంగానే కాదు స్నేహంగా కూడా అంత సులభంగా సాధ్యమవుతుందని నేనూహిం

Published: Mon,September 9, 2013 01:08 AM

కాళోజీ కలగన్న తెలంగాణ

ఇవాళ్టికి కాళోజీకి నూరేండ్లు. ఆయన ‘నా గొడవ’ మొదటి ముద్రణ ఆవిష్కరణ జరిగి ఆరవై ఏళ్లు దాటింది. ఇంకా ఆంధ్రరాష్ట్రం ఏర్పడక ముందు 1953

Published: Wed,June 19, 2013 12:59 AM

తీర్మానం చేయలేని అసెంబ్లీ ఓడిపోయింది చేరనివ్వని చలో గెలిచింది

అసెంబ్లీ అంటే పది మంది సమావేశమయ్యే స్థలం కదా మంది కూడా కాదు మన ప్రజావూపతినిధులు పదికోట్ల మంది పెట్టు.. పెట్టుకున్న సభ మన చె

Published: Fri,June 14, 2013 12:21 AM

ప్రజాస్వామ్యమా! పోలీసుస్వామ్యమా!!

శాసనసభాపతిగా కూడా వ్యవహరించి, విజయవంతంగా, సమర్థవంతంగా శాసనసభను నిర్వహించిన పేరు కూడా తెచ్చుకొని ముఖ్యమంత్రి అయిన కిరణ్‌కుమార్‌డ్

Published: Sun,May 26, 2013 12:54 AM

ఆంధ్ర సారస్వత పరిషత్ జ్ఞాపకాలు ...అనుబంధాలు

జాగీరు గ్రామమైన మా చిన్న పెండ్యాలలో నా బాల్యంలోనే నేను ఆంధ్ర సారస్వత పరిషత్తు పేరు వినడమే కాదు,అది మా విద్యాభివృద్ధిలో పాత్ర నిర్వ

Published: Sat,April 20, 2013 12:54 AM

ఇంద్రవెల్లి ఇంగలం

‘ఒక నిప్పురవ్వ దావానలమవుతుంది’ అనేమాట సామాన్యంగా ఒకచోట రగుల్కొన్న విప్లవం నలువైపులా విస్తరించడానికి అన్వయిస్తుంటారు. వైనాడ్ (కేరళ)

Published: Mon,April 1, 2013 12:37 AM

రాజ్యాంగమా? మతక్షిగంథాలా?

మన ప్రభుత్వాలు లౌకిక ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రకారం నడుస్తున్నాయని ఎవరికైనా భ్రమలుంటే వాటిని పటాపంచలు చేశాడు మన ముఖ్యమంత్రి కిరణ

Published: Thu,March 21, 2013 12:13 AM

‘కుక్క’ల్లో వార్త

‘వార్తల్లో కుక్క’ అనాలి. కాని అపుడది వార్త కాదు. రిపోర్టింగ్‌లో ప్రవేశించిన ప్రతి ఒక్కరికీ మీడియా అనుభవజ్ఞులు ఏది వార్త అవుతుందో,

Published: Fri,March 15, 2013 02:14 AM

వంజెం సోమయ్య జైలుడైరీ...

ఇది జైలు డైరీ కాదు... ఇది నిర్బంధ డైరీ... ఇది పోలీసు అక్రమ అరెస్టు డైరీ.. ఇది చిత్రహింసల డైరీ.. ఇది దాతు ఫిర్యాదులేని రాజ్యాంగం ప

Published: Wed,February 20, 2013 11:57 PM

నాటి మాటలు మరిచారా?

అధ్యక్షా! మన శాసనసభ కేంద్ర ప్రభుత్వానికి మరణశిక్షను రద్దు చేయవలసిందిగా రికమెండ్ చేస్తూ తీర్మానం చేయాలని ప్రతిపాదిస్తున్నా ను. పూర్

Published: Fri,February 15, 2013 11:28 PM

బతికించే వృత్తినుంచి ఉరికంబం దాకా..

అప్జల్‌గురు ప్రస్థానం అతని మాటల్లోనే... నేను పెరుగుతున్న కాలంలో కశ్మీర్ రాజకీయంగా కల్లోలంగా ఉన్నది. మక్బుల్‌భట్‌ను ఉరి తీశారు(198

Published: Sat,December 29, 2012 04:40 PM

డిసెంబర్ 6కు 20 ఏండ్లు

ఈ డిసెంబర్ 6కు (బాబ్రీమసీదు విధ్వంసం జరిగి) 20 ఏండ్లు నిండాయి. ఇరవైఏండ్లంటే ఇంచుమించు ఒక తరం మారింది. పి.వి.నర సింహా రావు నుంచి మన

Published: Wed,October 10, 2012 08:11 PM

‘తెలంగాణ మార్చ్’యే జవాబు

ముందు కొన్ని వాస్తవాలు చెప్పుకోవాలె. ఆ వాస్తవాలపై మన అభివూపాయా లు, వ్యాఖ్యలు ఏమైనా కావచ్చు. నెలవారీగా కేంద్ర హోంమంత్రి నిర్వహించే

Published: Sat,October 6, 2012 03:30 PM

పిల్లి మొగ్గలు ఎలుకల్ని పట్టడానికే

భాషలో తేడాయే తప్ప ప్రకాశ్‌సింగ్, కిషోర్‌చంవూదదేవ్, జైరాంరమేష్‌లు కూడా దళారీ పాలనలో భాగమైనంత కాలం చిదంబరం, రమణ్‌సింగ్, విజయ్‌కుమార్

Published: Sat,October 6, 2012 03:31 PM

ఆత్మావలోకనం

మార్క్సిజం పెట్టుబడిదారీ విధానాన్ని మట్టికాళ్ల మహారాక్షసి అంటుంది. ఆ మహారాక్షసి ఉక్కువేళ్లు మట్టిపొరలు చీల్చుకొని భూగర్భ జలాల్లోకి

Published: Sat,October 6, 2012 03:31 PM

విప్లవ దార్శనికుడు

‘చాటండి గళమెత్తి విప్లవదార్శనికుడు చారుమజుందార్ చచ్చిపోలేదని- కామ్రేడ్ చారుమజుందార్ చంపబడ్డాడని’ అంటూ చెరబండరాజు తన కవితా సంకలనం

Published: Sat,October 6, 2012 03:32 PM

ఆదివాసులకు న్యాయం దక్కేనా?

చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, సుక్మా, కాంకేర్ జిల్లాల్లో జూన్ 28,29 తేదీల్లో పోలీసులు మూడుచోట్ల అమాయకులైన 23మంది ఆదివాసీలను చంపారు. జ

Published: Sat,October 6, 2012 03:33 PM

అద్దంలో ‘విద్యార్థి ’ మాట

మొదట వరంగల్ ఆర్ట్స్‌కాలేజీ, తర్వాత ఉస్మానియా క్యాంపస్, రెండుచోట్ల చలం, శ్రీశ్రీ ఇచ్చిన మిత్రులు కాకుండా‘మివూతమండలి’ ఇచ్చిన మిత్రుల

Published: Sat,October 6, 2012 03:33 PM

జార్జ్ అడుగు జాడల్లో..

నేను జార్జిని చూసిన జ్ఞాపకం లేదు. కాని 1972 ఏప్రిల్ 14 సాయంకాలం నుంచి ప్రతి సాయం సంధ్యలోనూ ప్రతి ఉదయసంధ్యలోనూ ఆకాశంలోనే కాదు, నేలమ

Published: Sat,October 6, 2012 03:34 PM

విప్లవ స్వాప్నికుడు ‘అలిశెట్టి’

ఈసారి 2011 సెప్టెంబర్ 29న కామ్రేడ్ సూర్యం సంస్మరణ సభ గుంటూరులో అపూర్వంగా జరిగింది. నేను వెళ్లాల్సింది. ఆ సభ జరుపుతామని తెలిసినప్ప

Published: Sat,October 6, 2012 03:34 PM

దిక్కుల కూడలిలో ధిక్కార స్వరాలు...?

ఎందుకోసం వచ్చినా.. చెరబండరాజు పుట్టిన రోజు చర్చ మంచి కోసం ఉపయోగపడుతోంది. చెరబండరాజు కు సాహిత్య అకాడమీ నుంచి వచ్చిన సహాయాన్ని తన అవ

Published: Sat,October 6, 2012 03:35 PM

ఉద్యమ పంథా మారాలె

సకలజనుల సమ్మె స్వయంపాలనలో భాగంగా శాంతియుతంగా, రాజకీయాలకు అతీతంగా యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని ఒక్కతాటి మీదికి తీసుకురావడం ద్వారా ప్

Published: Sat,October 6, 2012 03:35 PM

కాళోజీ (అను) వాదం

‘నా భారతదేశయాత్ర’ డ్బై ఏళ్ల క్రితం (1941) కాళోజీ (నారాయణరావు)గారు అనువదించి, దేశోద్ధారక గ్రంథమాల పక్షాన వట్టికోట ఆళ్వారుస్వామిగారు