ప్రజాస్వామ్యమా! పోలీసుస్వామ్యమా!!


Fri,June 14, 2013 12:21 AM


శాసనసభాపతిగా కూడా వ్యవహరించి, విజయవంతంగా, సమర్థవంతంగా శాసనసభను నిర్వహించిన పేరు కూడా తెచ్చుకొని ముఖ్యమంత్రి అయిన కిరణ్‌కుమార్‌డ్డికి శాసనసభ సాంప్రదాయాలు తెలియకపోవడం దిగ్భ్రాంతికరమే కాదు రాష్ట్ర ప్రజలకు పాలితులకు సంబంధించినంత వరకు పెద్ద విషాదం. తీవ్రమైన నష్టదాయక అంశం. అన్నిటినీ మించి రాజ్యాంగ నియమాల దృష్ట్యా అభ్యంతరకరం.అదేమంటే ఆయన ‘చలో అసెంబ్లీ’ కార్యవూకమాన్ని శాసనసభ జరుగుతుండగా కాదు, శాసనసభ సమావేశాలు లేనప్పుడు జరిపితే బాగుండుననడం. ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి సంబంధించిన ప్రాథమిక సంప్రదాయం తెలియకపోవడం మాత్రమే కాదు కామన్‌సెన్స్ అని మనం అంటామే ఆ ఇంగిత జ్ఞానం కూడా లేకపోవడం. అయితే ఓ రాజనీతి శాస్త్రవేత్త మనం కామన్‌సెన్స్ అనుకునేది చాలా అరుదయిన జ్ఞానం అందరిలో ఉంటుందని భ్రమించడం ముఖ్యంగా పాలకుల్లో ఉంటుందనుకోవడం అత్యాశ అంటాడు. ఇదెట్లా ఉంటుందంటే ముఖ్యమంవూతికి ఇవ్వాలనుకున్న విజ్ఞాపన పత్రం ముఖ్యమంత్రి లేనపుడు వచ్చి యిస్తే శాంతిభవూదతల సమస్య కాకుండా ఉండేది కదా అని ప్రజలంటే భయపడే, ప్రజావూపతినిధుల ప్రాతినిధ్యాలంటే భయపడే పాలకుల మాట వలె ఉంటుంది. శాసనసభలో ఆ ప్రజా ప్రతినిధుల మొహా లు చూడక ఆయనకు తప్పడం లేదు గానీ వాళ్లే వచ్చి శాసనసభ ఆవరణలోనే ఆయన కార్యాలయం ముందు నిరసన తెలిపితే ఎంతో అసహనంతో ‘ఇదంతా డ్రామా’ అని మండిపడ్డాడు. ప్రజలంటే వెరచే ప్రజావూపతినిధులు, ప్రజావూపతినిధులంటే అసహనం చూపే ముఖ్యమంత్రి ఉండే వ్యవస్థను ఎటువంటి ప్రజాస్వామ్యమనాలి. మన ప్రజాస్వామిక విలువల సంగతి అలా ఉంచి శాసనసభ కనీస సంప్రదాయాల స్థాయి ఆంధ్రవూపదేశ్ ఏర్పడేనాటికి, ఈనాటికి ఎంత పడిపోయాయో ఒక్క ఉదాహరణ చాలు.ఆంధ్రవూపదేశ్ ఏర్పడి నీలం సంజీవడ్డి ముఖ్యమంవూతిగా ఉన్నపుడే జరుగుతున్న శాసనసభా సమావేశం దగ్గరికి అప్పటి ప్రతిపక్ష నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య నాయకత్వంలో భూ సంస్కరణలు చేపట్టాలనే డిమాండు తో ఒక పెద్ద ‘చలో అసెంబ్లీ’ ఊరేగింపు వచ్చింది. ఒక అర్థ శతాబ్దం గడిచిపోయింది. అప్పుడూ ఇలాగే వర్షం పడుతున్నది. ఇప్పటి వలె ‘చలో అసెంబ్లీ’లు అనుమతించని, అడ్డుకునే కాలం ఇంకా రాలేదు. అనుమతించినా ఇందిరాపార్కు దగ్గరే ఆగే కాలం కూడా వచ్చినట్లు లేదు.

ప్రదర్శన శాసనసభ ప్రాంగణం ఆవరణ దాకా వచ్చింది. అంటే మనం పూర్వం పిలుచుకునే బాగేఆమ్ ఆవరణ ఆవల ఆకాశవాణి కి ఎదురుగా అసెంబ్లీకి ఎదురుగా ఉన్న రోడ్ల మీద నిలిచిం ది. లోపల శాసనసభా సమావేశం జరుగుతున్నది. బయట ‘చలో అసెంబ్లీ’ ర్యాలీ వచ్చి నిలిచి ఉన్నదని, దానికి ప్రతిపక్ష నాయకుడు సుందరయ్యగారు నాయకత్వం వహించారని లోనికి తెలిసింది. సభాపతి అనుమతి తీసుకొని ముఖ్యమంత్రి నీలం సంజీవడ్డి బయటికి వచ్చి, సిబ్బంది తనకు పట్టిన గొడుగు కాకుండా, మరొక గొడుగు తెప్పించి ప్రదర్శన దగ్గరికి వచ్చి, ఎదురేగి సుందరయ్యగారికి తాను స్వయంగా గొడుగుపట్టి, మర్యాదగా పలకరించి డిమాండుల పత్రం తీసుకొని ఈ ప్రదర్శన గురించి, డిమాండుల గురించి సమావేశంలో ఉన్న సభకి తెలియచేస్తానని ప్రకటించి శాసనసభలోకి వెళ్లిపోయాడు. శాసనసభా సాంప్రదాయమంటే ఇది. ఆ తర్వాత కాలంలో లోక్‌సభ స్పీకర్, రాష్ట్రపతి అయిన నీలం సంజీవడ్డి తెలంగాణకు చేసిన అన్యాయమెటువంటిదయినా కనీసం ఆయనకు ఆ పార్లమెంటరీ సంప్రదాయాలు తెలుసునన్నమాట.

ఈ సంఘటనను దృశ్యాన్ని 1972లో ‘భూమి కోసం’ సినిమా ముగింపు దృశ్యంగా సినీ దర్శకుడు తిలక్ వాడుకున్నాడు.ండు దశాబ్దాలు పోయాక 1984లో సికిందరాబాదు కుట్ర కేసుకు పదేళ్లు నిండిన సందర్భంగా విరసం, సంఘీభావంగా కాళోజీ మొదపూైన రచయితలు బాగే-ఎ-ఆమ్ ఇటు గేటు నుంచి నూటా నలభై నాలుగో సెక్షన్‌ను ఉల్లంఘించడానికి ప్రయత్నించి ‘చలో అసెంబ్లీ’ ప్రదర్శన కోసం ప్రయతిస్తే కాళోజీని మినహాయించి కెవిఆర్‌తో సహా ఎనభైమందిని ఎన్టీఆర్ ప్రభుత్వం అరెస్టు చేసి ఘోషా మహల్ స్టేడియమ్‌లో పెట్టి ఫొటోలు బలవంతంగా తీయడానికి ప్రయత్నించి లాఠీచార్జ్ కూడా చేశారు.ఆ తర్వాత కూడా ఎన్నో ప్రదర్శనలు జగ్‌జీవన్‌రాం విగ్రహం దగ్గరో, ఇందిరా పార్క్ వద్దనో ఆపేసి ఐదో, పదో ఎంతో సంఖ్యను ప్రతినిధి బృందాన్ని శాసనసభా స్థలికి అనుమతించి ముఖ్యమంవూతిగానీ, శాసనసభాపతిగానీ విజ్ఞప్తి పత్రాలు, డిమాం డు పత్రాలు స్వీకరించిన సందర్భాలూ ఆ తర్వాత లేకపోలేదు. ఏభై వేల మందితో జరిగిన విద్యుత్ చార్జీల వ్యతిరేక ప్రదర్శన చంద్రబాబు కాలంలో బషీర్‌బాగ్ వరకు రాగలిగింది. ఆ ప్రదర్శనలో నక్సపూైట్లు ఉన్నారని కాల్పులు జరిపి ఐదుగురిని చంపడానికి ఎంచుకున్నాడు చంద్రబాబు. అది ఇరవయ్యకటో శతాబ్ది ప్రారంభ పాదం.ఇంకో దశాబ్దం గడిచింది. ఇపుడింక ‘చలో అసెంబ్లీ’లకే అనుమతి లేదంటున్నారు. 1962 నుంచే శాసనసభ సమావేశాలంటే చుట్టూ రెండు కిలోమీటర్లు 144 సెక్షన్ విధిస్తున్నారు. అంటే ప్రజావూపతినిధులు ప్రజలపై నిషేధాజ్ఞలు విధించి ప్రజా సమస్యలు చర్చించుకుంటారన్నమాట! ముఖ్యమంత్రి వైఖరి ఇట్లా ఉంటే మూడు రోజుల క్రితమే సిటీ కమిషనర్ అనురాగ్ శర్మ చలో అసెంబ్లీ తలపెట్టిన తెలంగాణ పొలిటికల్ జెఎసి అనుమతి కోసం దరఖాస్తు చేయలేదని, చేసినా అనుమతి యిచ్చేది లేదని ఒక సర్కార్ కొత్వాల్‌గా కాదు హైదరాబాద్ తన ప్రైవేటు జాగీర్ అయినట్లుగా ప్రకటించాడు.

ఇంక నిర్బంధాలు, అరెస్టులు నగరంలోనే కాదు, తెలంగాణ అంతటా మొదలైనవి. బైండోవర్లు, గృహనిర్బంధాలు, నిఘాలు ఒక ఉద్రిక్త, భీతావహ స్థితిని పోలీసులు రాష్ట్రమంతటా వారం రోజుల క్రితం నుంచే అమలు చేస్తున్నారు. 12వ తేదీన ఉస్మానియా క్యాంపస్‌లో విద్యార్థుల మీద లాఠీచార్జ్, బాష్పవాయు ప్రయోగం, జర్నలిస్టులపై దాడులు, విద్యార్థుల అరెస్టులు మళ్లీ 2009 డిసెంబర్ కన్నా ముందటి కాన్‌సెంవూటేషన్ క్యాంపుల పరిస్థితిని తలపించినవి. విద్యార్థులు మళ్లీ చేతుల్లోకి రాళ్లు తీసుకోక తప్పలేదు. ఇంకొక అడుగు ముందుకు వెళ్లి, ముఖ్యమంత్రి కన్నా రెండాకులు ఎక్కువ చదివినవాని వలె 12 జూన్ రోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ‘చలో అసెంబ్లీకి ప్రభుత్వం అనుమతి లేదు. అయినా ప్రభుత్వం అనుమతి యిచ్చినా మేం అనుమతించేది లేదు.’ అన్నాడు సిటీ పోలీసు కమిషనర్. అంటే పోలీసు శాఖ ప్రభుత్వంలో భాగం కాదా? ప్రభుత్వానికి సంబంధించిన ఒక శాఖ కాదా? పోలీసు కమిషనర్ ప్రభుత్వ ఉద్యోగి కాదా? ఆయన ప్రభుత్వానికి అతీతుడా? ఆయనకు ప్రభుత్వం కన్నా అపరిమితమైన అధికారాలు ఉన్నాయా? ఇది మనం అడగాల్సిన ప్రశ్న కూడా కాదు.

ప్రభుత్వాధిపతులు, ముఖ్యమంత్రి, హోంమంత్రి అడగాల్సిన ప్రశ్న. ప్రజావూపతినిధులు అడగాల్సిన ప్రశ్న? ఎవ్వరూ అడిగినట్లు లేదు! ప్రభుత్వం అనుమతించినా అనురాగ్ శర్మగా ఎందుకు అనుమతించరట. అందులో మావోయిస్టులు దూరే ప్రమా దం ఉందట. దేన్ని బట్టి చెప్తున్నాడు. జూన్ 12న పత్రికల్లో చలో అసెంబ్లీని మిలిటెంట్‌గా సమరశీలంగా నిర్వహించమని మావోయిస్టు పార్టీ ఉత్తర తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ పిలుపు ఇచ్చాడు కాబట్టి. మరి అంతకు ముందే అనుమతించేది లేదన్నావు కదా. గొర్రెపిల్ల తాను తాగిన కాలువలో నీళ్లు తాగిందని దాడి చేసిన తోడేలు వ్యవహారం వలె ఉన్నది ఇది. అనుమతి నిరాకరించడానికి ఒక సాకు కావాలి. ఆ అనుమతి నిరాకరించడమైనా ప్రభుత్వామోదంతో కాదు, ప్రభుత్వం ఆమోదించినా సరే సిటీ పోలీసు కమీషనర్ అనుమతించడట. ఇంతకన్నా పోలీసుస్వామ్యం ఏం ఉంటుంది? పోలీసే రాజ్యం, తుపాకి రాజ్యం అనే జవాబు ఇదేం రాజ్యం. ఇదేం రాజ్యం’ అనే ప్రశ్నకు అందుకే వస్తుంది. అనురాగ్ శర్మ వంటి పోలీసు అధికారికి ఇంత అధికార అహంకారం ఎక్కడి నుంచి వచ్చింది. 1990లోనే ఆయన మీద చర్య తీసుకోవాల్సిందని జుడీషియల్ కమిషన్ సిఫారసు చేసినా ఏ చర్యా తీసుకోకుండా ప్రమోషన్‌లు ఇచ్చిన ప్రభుత్వాలను ఆయన ఎందుకు లక్ష్యపెడతాడు. అంత అపరిమితమైన అధికారం ఆయనకు ప్రభుత్వాలే ఇచ్చాయి.

1986లో హైదరాబాదు నవరంగ్ టాకీసు ముందర కాంటాక్టు కోసం ఎదురు చూస్తున్న అప్పటి పీపుల్స్‌వార్ ఉత్తర తెలంగాణ కార్యదర్శి గోపగాల ఐలయ్యను, ఆయన వెంట ఉన్న రాజమల్లును పోలీసులు ఎత్తుకపోయి ‘అదృ శ్యం’ చేసారు. వాళ్లను ఏం చేసారో చెప్పాలని ప్రభుత్వాన్ని నిలదీయడానికి జరిగిన ఉద్యమం, సంఘటనల ప్రస్తావన అంతా అలా ఉంచి ఎన్టీఆర్ కాలంలో(1985-89) జరిగిన అటువంటి 75 ‘మిస్సింగ్’ కేసుల మీద న్యాయ విచారణ చేయడానికి 90లో అధికారంలోకి వచ్చిన చెన్నాడ్డి ప్రభుత్వం జస్టిస్ టిఎల్‌ఎన్‌డ్డి కమిషన్‌ను వేసింది, జస్టిస్ టిఎల్‌ఎన్‌డ్డి ఈ డ్బ్భై అయిదో ‘మిస్సింగ్స్’ కేసులు విని శిక్షించదగిన వారిగా భావించి ప్రైమోఫెసీ నేరారోపణలు ఉన్నాయని, వీళ్లపై చర్య తీసుకోవాలని సిఫారసు చేసిన ఏడుగురు పోలీసు అధికారుల్లో అప్పటికే అపకీర్తిశేషలైన యాదగిరిడ్డి, కె.ఎస్. వ్యాస్‌తో పాటు అనురాగ్‌శర్మ కూడా ఉన్నాడు. గోపగాని ఐలయ్య, రాజమల్లుల అపహరణకు వ్యాస్‌తో పాటు అనురాగ్‌శర్మ బాధ్యుడని కమిషన్ భావించింది.

ముఖ్యమంత్రి చెన్నాడ్డి ఈ కమిషన్ నివేదికను శాసనసభలో అట్లా చూపించి చర్చ జరపకుండానే శాసనసభ గ్రంథాలయానికి పంపాడు. ఆ నివేదిక కూడా ‘అదృశ్యం’ కాకుండా, శాసనసభా పత్రాల్లో దుమ్ము పేరుకొని ఉండే రూపంలోనైనా ఉండి ఉంటే తెలంగాణవాదులు, ప్రజాస్వామ్యవాదులు ఎవరైనా ఆసక్తి కలవారు చదువుకోవచ్చు. ముఖ్యమంత్రి మొదలు పోలీసు కమిషనర్‌దాకా మన పాలకులు ఎందుకు ఇంత అప్రజాస్వామికంగా వ్యవహరిస్తారో తెలుసుకోవడం మన ప్రజాస్వామిక ఆకాంక్షలను, ఉద్యమాలను కంటికి రెప్పలా కాపాడుకోవడానికి ఇది చాలా అవసరం. అప్పుడు గానీ ‘చలో అసెంబ్లీ’ ప్రదర్శనను మనం ఒక విలువయిన ప్రజాస్వామిక ఆకాంక్షగా, హక్కుగా ఆచరించలేం. అసెంబ్లీ లేనపుడు ‘చలో అసెంబ్లీ’ పెట్టుకొమ్మన్న ముఖ్యమంత్రి అజ్ఞానానికి నిరసనగా, ప్రభుత్వం అనుమతించినా తాను అనుమతించనన్న సిటీ పోలీసు కమిషనర్ అధికారాహంకారానికి నిరసనగా ఇపుడింక తెలంగాణవాదులే కాదు, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం సంప్రదాయం తెలిసిన ప్రతి ఒక్కరూ ‘చలో అసెంబ్లీ’లో పాల్గొని తీరాలి.

-వరవరరావు

35

VARAVARA RAO

Published: Wed,February 19, 2014 12:14 AM

ఈ బొమ్మకింక.. ప్రాణం పోయాలి!

ఎన్నాళ్లుగా నీ బొమ్మ గీయాలని.. ప్రయత్నిస్తున్నాను ఎన్నో పోరాటాల జ్ఞాపకాల కన్నీళ్లతో తడిసి నెత్తురు చింది అది చెరిగిపోయేది సాయు

Published: Tue,November 5, 2013 11:56 PM

దాశరథి దేశకాలాలు వెలుగు చీకటి జ్ఞాపకాలు

నా పదమూడో ఏటనే దాశరథి (కృష్ణమాచార్య)తో పరోక్ష పరిచయం, ప్రత్యక్ష పరిచయంగానే కాదు స్నేహంగా కూడా అంత సులభంగా సాధ్యమవుతుందని నేనూహిం

Published: Mon,September 9, 2013 01:08 AM

కాళోజీ కలగన్న తెలంగాణ

ఇవాళ్టికి కాళోజీకి నూరేండ్లు. ఆయన ‘నా గొడవ’ మొదటి ముద్రణ ఆవిష్కరణ జరిగి ఆరవై ఏళ్లు దాటింది. ఇంకా ఆంధ్రరాష్ట్రం ఏర్పడక ముందు 1953

Published: Wed,August 14, 2013 01:16 AM

కేఎంసీలో వికసించిన ఎర్రమందారం

కాటా నారాయణరావు ‘శబరి గోదారి’ (1986) కవితా సంకలనానికి ముందుమాట రాస్తూ కాళోజీ నారాయణరావు.. ‘1965 లో ప్రారంభమైన అలజడి (విశాఖ ఉక్కు

Published: Wed,June 19, 2013 12:59 AM

తీర్మానం చేయలేని అసెంబ్లీ ఓడిపోయింది చేరనివ్వని చలో గెలిచింది

అసెంబ్లీ అంటే పది మంది సమావేశమయ్యే స్థలం కదా మంది కూడా కాదు మన ప్రజావూపతినిధులు పదికోట్ల మంది పెట్టు.. పెట్టుకున్న సభ మన చె

Published: Sun,May 26, 2013 12:54 AM

ఆంధ్ర సారస్వత పరిషత్ జ్ఞాపకాలు ...అనుబంధాలు

జాగీరు గ్రామమైన మా చిన్న పెండ్యాలలో నా బాల్యంలోనే నేను ఆంధ్ర సారస్వత పరిషత్తు పేరు వినడమే కాదు,అది మా విద్యాభివృద్ధిలో పాత్ర నిర్వ

Published: Sat,April 20, 2013 12:54 AM

ఇంద్రవెల్లి ఇంగలం

‘ఒక నిప్పురవ్వ దావానలమవుతుంది’ అనేమాట సామాన్యంగా ఒకచోట రగుల్కొన్న విప్లవం నలువైపులా విస్తరించడానికి అన్వయిస్తుంటారు. వైనాడ్ (కేరళ)

Published: Mon,April 1, 2013 12:37 AM

రాజ్యాంగమా? మతక్షిగంథాలా?

మన ప్రభుత్వాలు లౌకిక ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రకారం నడుస్తున్నాయని ఎవరికైనా భ్రమలుంటే వాటిని పటాపంచలు చేశాడు మన ముఖ్యమంత్రి కిరణ

Published: Thu,March 21, 2013 12:13 AM

‘కుక్క’ల్లో వార్త

‘వార్తల్లో కుక్క’ అనాలి. కాని అపుడది వార్త కాదు. రిపోర్టింగ్‌లో ప్రవేశించిన ప్రతి ఒక్కరికీ మీడియా అనుభవజ్ఞులు ఏది వార్త అవుతుందో,

Published: Fri,March 15, 2013 02:14 AM

వంజెం సోమయ్య జైలుడైరీ...

ఇది జైలు డైరీ కాదు... ఇది నిర్బంధ డైరీ... ఇది పోలీసు అక్రమ అరెస్టు డైరీ.. ఇది చిత్రహింసల డైరీ.. ఇది దాతు ఫిర్యాదులేని రాజ్యాంగం ప

Published: Wed,February 20, 2013 11:57 PM

నాటి మాటలు మరిచారా?

అధ్యక్షా! మన శాసనసభ కేంద్ర ప్రభుత్వానికి మరణశిక్షను రద్దు చేయవలసిందిగా రికమెండ్ చేస్తూ తీర్మానం చేయాలని ప్రతిపాదిస్తున్నా ను. పూర్

Published: Fri,February 15, 2013 11:28 PM

బతికించే వృత్తినుంచి ఉరికంబం దాకా..

అప్జల్‌గురు ప్రస్థానం అతని మాటల్లోనే... నేను పెరుగుతున్న కాలంలో కశ్మీర్ రాజకీయంగా కల్లోలంగా ఉన్నది. మక్బుల్‌భట్‌ను ఉరి తీశారు(198

Published: Sat,December 29, 2012 04:40 PM

డిసెంబర్ 6కు 20 ఏండ్లు

ఈ డిసెంబర్ 6కు (బాబ్రీమసీదు విధ్వంసం జరిగి) 20 ఏండ్లు నిండాయి. ఇరవైఏండ్లంటే ఇంచుమించు ఒక తరం మారింది. పి.వి.నర సింహా రావు నుంచి మన

Published: Wed,October 10, 2012 08:11 PM

‘తెలంగాణ మార్చ్’యే జవాబు

ముందు కొన్ని వాస్తవాలు చెప్పుకోవాలె. ఆ వాస్తవాలపై మన అభివూపాయా లు, వ్యాఖ్యలు ఏమైనా కావచ్చు. నెలవారీగా కేంద్ర హోంమంత్రి నిర్వహించే

Published: Sat,October 6, 2012 03:30 PM

పిల్లి మొగ్గలు ఎలుకల్ని పట్టడానికే

భాషలో తేడాయే తప్ప ప్రకాశ్‌సింగ్, కిషోర్‌చంవూదదేవ్, జైరాంరమేష్‌లు కూడా దళారీ పాలనలో భాగమైనంత కాలం చిదంబరం, రమణ్‌సింగ్, విజయ్‌కుమార్

Published: Sat,October 6, 2012 03:31 PM

ఆత్మావలోకనం

మార్క్సిజం పెట్టుబడిదారీ విధానాన్ని మట్టికాళ్ల మహారాక్షసి అంటుంది. ఆ మహారాక్షసి ఉక్కువేళ్లు మట్టిపొరలు చీల్చుకొని భూగర్భ జలాల్లోకి

Published: Sat,October 6, 2012 03:31 PM

విప్లవ దార్శనికుడు

‘చాటండి గళమెత్తి విప్లవదార్శనికుడు చారుమజుందార్ చచ్చిపోలేదని- కామ్రేడ్ చారుమజుందార్ చంపబడ్డాడని’ అంటూ చెరబండరాజు తన కవితా సంకలనం

Published: Sat,October 6, 2012 03:32 PM

ఆదివాసులకు న్యాయం దక్కేనా?

చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, సుక్మా, కాంకేర్ జిల్లాల్లో జూన్ 28,29 తేదీల్లో పోలీసులు మూడుచోట్ల అమాయకులైన 23మంది ఆదివాసీలను చంపారు. జ

Published: Sat,October 6, 2012 03:33 PM

అద్దంలో ‘విద్యార్థి ’ మాట

మొదట వరంగల్ ఆర్ట్స్‌కాలేజీ, తర్వాత ఉస్మానియా క్యాంపస్, రెండుచోట్ల చలం, శ్రీశ్రీ ఇచ్చిన మిత్రులు కాకుండా‘మివూతమండలి’ ఇచ్చిన మిత్రుల

Published: Sat,October 6, 2012 03:33 PM

జార్జ్ అడుగు జాడల్లో..

నేను జార్జిని చూసిన జ్ఞాపకం లేదు. కాని 1972 ఏప్రిల్ 14 సాయంకాలం నుంచి ప్రతి సాయం సంధ్యలోనూ ప్రతి ఉదయసంధ్యలోనూ ఆకాశంలోనే కాదు, నేలమ

Published: Sat,October 6, 2012 03:34 PM

విప్లవ స్వాప్నికుడు ‘అలిశెట్టి’

ఈసారి 2011 సెప్టెంబర్ 29న కామ్రేడ్ సూర్యం సంస్మరణ సభ గుంటూరులో అపూర్వంగా జరిగింది. నేను వెళ్లాల్సింది. ఆ సభ జరుపుతామని తెలిసినప్ప

Published: Sat,October 6, 2012 03:34 PM

దిక్కుల కూడలిలో ధిక్కార స్వరాలు...?

ఎందుకోసం వచ్చినా.. చెరబండరాజు పుట్టిన రోజు చర్చ మంచి కోసం ఉపయోగపడుతోంది. చెరబండరాజు కు సాహిత్య అకాడమీ నుంచి వచ్చిన సహాయాన్ని తన అవ

Published: Sat,October 6, 2012 03:35 PM

ఉద్యమ పంథా మారాలె

సకలజనుల సమ్మె స్వయంపాలనలో భాగంగా శాంతియుతంగా, రాజకీయాలకు అతీతంగా యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని ఒక్కతాటి మీదికి తీసుకురావడం ద్వారా ప్

Published: Sat,October 6, 2012 03:35 PM

కాళోజీ (అను) వాదం

‘నా భారతదేశయాత్ర’ డ్బై ఏళ్ల క్రితం (1941) కాళోజీ (నారాయణరావు)గారు అనువదించి, దేశోద్ధారక గ్రంథమాల పక్షాన వట్టికోట ఆళ్వారుస్వామిగారు

Featured Articles