ఆంధ్ర సారస్వత పరిషత్ జ్ఞాపకాలు ...అనుబంధాలు


Sun,May 26, 2013 12:54 AM

జాగీరు గ్రామమైన మా చిన్న పెండ్యాలలో నా బాల్యంలోనే నేను ఆంధ్ర సారస్వత పరిషత్తు పేరు వినడమే కాదు,అది మా విద్యాభివృద్ధిలో పాత్ర నిర్వహించింది.1950 దాకా మా ఊళ్లో ప్రభుత్వ పాఠశాల లేదు. ఖాన్గీ బడిలోనే చదువు. మా ఊళ్లో నాగ రవీందర్ అనే సారును అట్లా చదువుకునే ఆసక్తిగల పిల్లల కోసం కాంగ్రెస్ పార్టీ నాయకుడైన మా పెద్దన్నయ పెండ్యాల రామానుజరావు ఏర్పాటు చేశారు. గాంధీజీ ఆత్మకథ, నెహ్రూ భారత దర్శనం వంటి పుస్తకాల నుంచి పాఠాలు చెప్పేవాడు. తకిలీలు, రాట్నం వడికించేవాడు. వాగుకు తీసుకు వ్యాయామం, ఆటలు నేర్పేవాడు. ఆయన ఆర్యసమాజ్ నుంచి వచ్చిన వరంగల్ వాస్తవ్యుడు. ఆయన ప్రయత్నం వల్లనే 1949లో ఆంధ్ర సారస్వత పరిషత్తు మా ఊళ్లో తెలుగు పరీక్షలు, ప్రాథమిక, మాధ్యమిక ప్రవేశ, విశారద పరీక్షలు నిర్వహించింది. పరీక్ష పర్యవేక్షణాధికారిగా పొట్లపల్లి రామారావు వచ్చారు.తెలుగుభాష, సాహిత్యం, చరిత్ర, సంస్కృతికి సంబంధించిన ఆసక్తిదాయకమైన పాఠ్యవూపణాళిక ఈ పరీక్షలకుండేదని జ్ఞాపకం.

1953 అలంపురం సందర్భంలో ఆంధ్ర సారస్వత పరిషత్తు పేరు మరింత ప్రచలితంగా విన్నాం. అప్పుడు అలంపురానికి ప్రత్యేకంగా వేసిన రైలులో అప్పటికే రచయితగా పేరు తెచ్చుకున్న దాశరథి, సినారె, కాళోజీ, ఆళ్వారుస్వామిలతో స్నేహం ఉన్న మా రాగవులన్నయ్య ఆ సభలకు వెళ్లి వచ్చి మాకు ఆ సభల గురించి ఎన్నో విశేషాలు చెప్పాడు. గడియారం రామకృష్ణశర్మ ఆ సభలు నిర్వహించిన తీరు, కాళోజీ ‘నా గొడవ’ ను శ్రీశ్రీ ఆవిష్కరించడం, అన్నిటికన్నా ఆసభలకు సర్వేపల్లి రాధాకృష్ణన్ రావడం మాకు గొప్పగా అనిపించింది.

ఇప్పుడు వెనక్కు తిరిగి ఆలోచిసే..్త నిజాం వ్యతిరేక పోరాటమైనా, తెలంగాణ విముక్తి ఉద్యమమైనా ఒక సమక్షిగతతో, వైవిధ్యంతో, సర్వాంగీన అభివృద్ధి లక్ష్యంతో జరిగాయని అనిపిస్తుంది. 1901లో శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయంతో ప్రారంభించి తొలుత గ్రంథాలయాలు, ఆ తర్వాత ఆంధ్ర మహాసభ. అది ప్రతి ఏటా తెలంగాణలో వేరు వేరు జిల్లాల్లో నిర్వహించిన సభలు. వాటితోపాటు మహిళల కోసం ప్రత్యేక సదస్సులు, తీర్మానాలు, గోలకొండ పత్రిక, 1943 ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆవిర్భావం, తెలంగాణ రచయితల సంఘం ఏర్పాటు ఇవన్నీ అవినాభావంగా కలిసి పనిచేస్తూ మళ్లీ తమ తమ ప్రత్యేక రంగాల్లో ఆయా సంస్థలు కేంద్రంగా ఉండి పని చేయడం.1938లో స్టేట్ కాంగ్రెస్ ఏర్పడినా, 1944లో కమ్యూనిస్టుల నాయకత్వంలోకి ఆంధ్ర మహాసభ వచ్చినా ఒక ఐక్య సంఘటనగా ఆంధ్ర మహాసభ, ఐక్య కార్యాచరణగా గ్రంథాలయోద్యమం గోలకొండ పత్రిక, మీ జాన్, రయ్యత్ వంటి పత్రికలు, ఆంధ్ర సారస్వత పరిషత్తు నిర్వహించిన భూమిక. విద్య, సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో ఇప్పటి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ఇంకా విశ్లేషించి అధ్యయనం చేసి గ్రహించవలసినదనిపిస్తున్నది.

ఈ అన్నింటిలోనూ తన ప్రభావం చూపిన సురవరం ప్రతాపడ్డి ఆంధ్ర మహాసభ జోగిపేట సభలకు అధ్యక్షత వహించడమే కాకుండా స్వయంగా గోలకొండ పత్రిక స్థాపించి, నిర్వహించాడు. ఆ తర్వాత కాలంలో నూకల నరోత్తమరెడ్డి దానికి సంపాదకుడయ్యాడు. సురవరం ప్రతాపడ్డి దూరదృష్టిలోనే ఆంధ్ర సారస్వత పరిషత్తు ఏర్పడింది. దానికి జీవితమంతా దేవులపల్లి రామానుజరావు తానేయై అభివృద్ధికి బాధ్యత వహించాడు. ఆంధ్రవూపదేశ్ ఏర్పడిన తర్వాత కూడా బెజవాడ గోపాలడ్డి, విశ్వనాథ సత్యనారాయణ, అబ్బూరి రామకృష్ణారావు వంటి వాళ్లు ఉండగా ఇటు సాహిత్య అకాడమీలో రామానుజరావు, అటు లలిత కళా అకాడమీలో నరోత్తమడ్డి నిర్ణయాలు తీసుకోగలిగే స్థానంలో ఉన్నారంటే ఆ ఇద్దరూ సారస్వత పరిషత్తులోనూ, గోలకొండ పత్రికలోనూ నేర్చుకున్న కార్యదక్షత వల్లనే. దేవులపల్లి రామానుజరావు తన జీవితకాలమంతా ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడుగా ఉన్నట్లే ఆంధ్ర సాహిత్య అకాడమీ ఏర్పడి ఎన్టీఆర్ అకాడమీలను రద్దు చేసే దాకా కార్యదర్శిగా ఉన్నాడు. ఆయన హయాంలోనే హైదరాబాద్‌లో రవీంద్ర భారతి నిర్మాణం, ఠాగూర్, గురజాడ శత జయంతులు జరిగాయి.

వరంగల్‌లోని భూస్వామ్య కుటుంబం నుంచి వచ్చి మొదటి ఎన్నికల్లో (1952) రామరాజ్య పరిషత్ వంటి కన్సర్వేటివ్ భావాలు గల పార్టీ నుంచి స్వతంవూతంగా ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినా, హైదరాబాద్‌కు మారిన తర్వాత దేవులపల్లి రామానుజరావు విద్యా సాహిత్యరంగాలకు తన కార్యక్షేవూతాన్ని పరిమితం చేసుకున్నాడు. కేంద్ర ప్రభుత్వం ఉస్మానియా యూనివర్సిటీని తీసుకోకుండా అడ్డుపడి దాని స్వయం ప్రతిపత్తి కాపాడడంలో చివరిదాకా పోరాడాడు. దశాబ్దాల తరబడి ఆంధ్ర సారస్వత పరిషత్తు, ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ కీలక పదవులు నిర్వహించిన రామానుజరావు విఠల్‌వాడీలో కిరాయి ఇంట్లో ఉండేవారు. సారస్వత పరిషత్తుకైతే రిక్షాలో వచ్చేవారు. ఆంధ్రవూపదేశ్ సాహిత్య అకాడమీ ఏర్పడగానే ‘అంధ పరదేశీ సాహిత్య అగాధ మీ’ అని దీర్ఘ వ్యంగ్య కవిత రాసిన కాళోజీ, రామానుజరావును దయ్యాల గూడెం రాముని తమ్ముడు దానికి కార్యదర్శి అని దెప్పి పొడిచినా ఆయన నిష్కళంక పరిపాలనా దక్షత, నిర్భీతి గురించి ఎప్పుడూ ప్రశం సించేవాడు. తెలంగాణ రచయితల సంఘానికి ఆయన పెద్ద దిక్కుగా ఉండేవాడు. సార్వసత పరిషత్తు నిర్వహిస్తున్న ప్రాచ్య కళాశాలలో కె.కె. రంగనాధచార్య ప్రిన్సిపల్‌గా, నరహరి అధ్యాపకుడుగా ఉన్న కాలాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే ఆయన భిన్నాభివూపాయాలకన్నా, ఆ అభివూపాయాల పట్ల ఎదుటి వారి నిబద్ధత, నిజాయితీలను ఎక్కువ గౌరవించి ప్రోత్సహించే వాడని అర్థమవుతుంది.

ఏకకాలంలో ఒక స్వతంత్ర సంస్థ, ఒక ప్రభుత్వ సంస్థ ప్రధాన బాధ్యతలు నిర్వహిస్తూ, ఆయన ఒక కవితా సంకలనం కోసం కవిత పంపించమని నన్ను కోరినపుడు నేను చాలా నిష్ఠూరంగా నిరాకరించాను. ఆపుడాయన చాలా నొచ్చుకున్నాడని, ఆయన ఉద్దేశాలను నేను చాలా యాంత్రికంగా అర్థం చేసుకున్నానని ఆ తర్వాత కలిసినపుడు కెకెఆర్ చెప్పారు. మా కుటుంబానికి ఆయనతో దగ్గరి బంధుత్వం ఉన్నా, నా సాహిత్య రాజకీయ విశ్వాసాల వల్ల మా మధ్యన ఎప్పుడూ ఒక శీతల యుద్ధం నడుస్తుండేది. పరస్పర గౌరవాలు ఉండేవి గానీ నేనొక తరాన్ని చెడగొడుతున్నాననే ఆందోళన ఆయనలో కనిపించేది. కనుక ఆయన పట్టు ఉన్న కార్యక్షేవూతాల్లో నేను ప్రవేశించకుండా జాగ్రత్త పడేవాడు. కాని విచివూతంగా విప్లవ రచయితల సంఘం సాహిత్య సాంస్కృతిక కార్యకలాపాలకు హైదరాబాద్‌లో సారస్వత పరిషత్తు 1970ల నుంచి కూడా ఒక కేంద్రంగానే ఉంటున్నది.

ప్రభుత్వం జోక్యం చేసుకోకుండా వివిధ ప్రజాహిత కార్యకలాపాలూ, సాహిత్య, సాంస్కృతిక కార్యకలాపాలూ నిర్వహించుకునే అవకాశం దశాబ్దాలుగా కల్పించిన సంస్థల్లో మొదట పేర్కొనవలసింది సారస్వత పరిషత్తే. సారస్వత పరిషత్తు నిర్మాణంకూడ ఇటు హాల్ గానూ, అటు బహిరంగ సభ స్థలంగానూ ఉండేది. ఇప్పుడు బహిరంగ సభావరణ లేకుండా పోయింది.1972 ఏప్రిల్ 14న జార్జిడ్డి హత్య జరగగానే అక్కడ నిర్వహించబడిన సంస్మరణ సభ కిక్కిరిసిన జనసందోహం. ఆసభాధ్యక్షుడు డాక్టర్ కె.శ్రీనాథ్‌డ్డి అన్నట్లు సభముగిసి చరిత్ర మొదలైనట్లే ఉం ది.1982లో చెరబండరాజు అమరుడైనాక అప్పటికి ఉస్మానియా విద్యార్థిగా ఉంటూ విప్లవ రాజకీయాల్లో నిమగ్నమై ఉన్న ఎర్రండ్డి సంతోషడ్డి పూనికతో సారస్వత పరిషత్తు హాల్‌లోనే విరసం ఒక రోజంతా సదస్సు నిర్వహించి, బహిరంగసభ నిర్వహించడమే కాదు విరసం సభ్యులతోనే ‘సమకాలీన తెలుగు సాహిత్య ధోరణులపై విరసం దృక్పథం’తో సురా దర్శకత్వంలో ఒక కవితా రూపకం ప్రదర్శించింది. 1993 జనవరి 12న అలిశెట్టి ప్రభాకర్ అమరత్వం తర్వాత కూడా జి పూనికతో నిర్వహించబడిన ఆయన సంస్మరణసభ, కళా ప్రదర్శన కూడా సారస్వత పరిషత్తు హాల్‌లోనే జరిగాయి. భూమి పుత్రుడు వీరన్న చొరవతో విరసం మండల్ కమిషన్ రిపోర్డుకు అనుకూలంగా, రిజర్వేషన్ వ్యతిరేక శక్తులకు జవాబుగా విరసం ప్రచురించిన మానవస్మృతి కవితా సంకలనాన్ని 1991లో సారస్వత పరిషత్తు హాల్‌లోనే శివసాగర్ ఆవిష్కరించాడు.

1997 ఏప్రిల్ 6న గద్దర్‌పై హత్యా ప్రయత్నాన్ని ఖండిస్తూ, విరసం, జన నాట్యమండలి కలిసి ఏర్పాటు చేసిన సభ కూడ సారస్వత పరిషత్తు హాల్‌లోనే జరిగింది. తెలుగు సాహిత్య చరివూతలోనే మొదటిసారిగా ఒక సాహిత్య సంస్థ విరసం నిషేధానికి గురై నిషేధం తొలగిన తర్వాత నిర్వహించిన విరసం మహాసభలు 2006 జూన్ నెలలో రెండు రోజులు సారస్వత పరిషత్తు హాల్‌లోనే జరిగాయి. సాహిత్య సభలకే కాకుండా ఏపీసీఎల్‌సీ మహాసభలు, విద్యార్థి సంఘాల మహాసభలు అన్ని ప్రజా సంఘాల కార్యకలాపాలకు ఒక ముఖ్యమైన కేంద్రంగా సారస్వత పరిషత్తు కొనసాగుతున్నది. ఇన్ని సందర్భాల్లోనూ డాక్టర్ రామనాథం హత్య (3 సెప్టెంబర్ 1985) తర్వాత ఏపీసీఎల్‌సీ సారస్వత పరిషత్తులో రాజ్యహింసకు వ్యతిరేకంగా నిర్వహించిన సభ సందర్భంలో మాత్రం పోలీసులు గేటు బయట అడ్డంగా కూర్చొని వక్తలను తప్ప శ్రోతపూవ్వరినీ లోనికి పోనివ్వలేదు. చనిపోయింది రామనాథమా? మనమా? అని కాళోజీ ఎంతో ఆవేదనతో ఉద్వేగపడిన సభ అదే.

బహుశా సారస్వత పరిషత్తు చరివూతలో పోలీసులు ప్రత్యక్షంగా జోక్యం చేసుకున్న సందర్భం అదే. ఆ తర్వాత చాలా తెలివిగా ఒక ఏడాది పాటు డీజీపీ హెచ్‌జే. దొర నిత్య నాటకోత్సవాల పేరుతో ఎస్పీ హాల్‌లో ఇంకో సభ జరగకుండా రసన సంస్థ పేరుతో బుక్ చేసుకున్నాడు.

ఆర్.ఎస్.రావు, అంటరాని వసంతం మొదలు యాన్ మిర్డాల్ వరకు విరసం అవగాహన తరగతులకూ సారస్వత పరిషత్తే అవకాశమిచ్చింది. దేవులపల్లి రామానుజరావు మరణించినపుడు ఆయన పార్ధివ దేహాన్ని సార్వసత పరిషత్తు ప్రాంగణంలోనే ప్రజల దర్శనానికి ఉంచారు. ఒక మనిషి ఒక సాహిత్య సాంస్కృతిక సంస్థ కోసం అట్లా అంకితం కావడం, తానొక సంస్థగా స్వతంవూతంగా జీవించి నిర్వహించడం తెలంగాణ ఆత్మగౌరవం గురించి ఉద్యమించే వాళ్లు, ముఖ్యంగా సాహిత్యరంగంలో ఉన్న కార్యకర్తలు అలవరచుకోవాలి.
విచివూతమేమిటంటే తెలంగాణ వైతాళికులలో పేర్కొనదగిన దాశరథి, దేవులపల్లి రామానుజరావులిద్దరూ ఆఖరి శ్వాస దాకా సమైక్యవాదులే. ‘వీర తెలంగాణ నాది వేరు తెలంగాణ కాద’ని 1969-72లో ప్రకటించిన సి.నారాయణడ్డి ఇప్పుడిప్పుడు జై తెలంగాణ అంటున్నా, వాళ్ల తరం తెలుగు జాతి సమైక్యంగా సమగ్ర అభివృద్ధి వికాసాలు సాధించాలని కలలుగన్న తరం. అదెట్లా ఉన్నా సి.నారాయణడ్డిది రామానుజరావు వలె సారస్వత పరిషత్తు మాత్రమే చిరునామా కాకపోయినా రామానుజరావు వీలునామాలో ఎంచుకున్న వారసుడుగా ఆయన సారస్వత పరిషత్తు అధ్యక్షుడుగా ఆయన నెలకొల్పిన సంప్రదాయాలను, విలువలను కొనసాగిస్తున్నారు.అయినా సారస్వత పరిషత్తు, ప్రాచ్య కళాశాలలు నిర్వహించే కార్యవూకమాలల్లో ఆయన తన జీవితంలో సహస్ర చంద్రోదయం తర్వాత కూడా చంద్రోదయాలను అక్కడే చూస్తున్నాడు. అదీ సారస్వత పరిషత్తు ఆకర్షణ, ప్రభావం.

విరసం ఆవిర్భావం నుంచీ ఇప్పటి దాకా విరసంతో సారస్వత పరిషత్తుకు ఉన్న అనుబంధానికి కృతజ్ఞతగా అక్కడ కొన్ని ఫొటోలు దిగుదామని మే 10న ఉదయమే కృష్ణక్క, చలసాని ప్రసాద్, నేనూ, 1970 జూలై 3 అర్ధరాత్రి నాంపల్లి ఇంపీరియల్ హోటల్‌లో విరసం ఆవిర్భావపవూతంపై సంతకం పెట్టిన వారిలో ఒకరైన డా.రావి భుజంగరావు, కె.వి. కూర్మనాథ్ సారస్వత పరిషత్తుకు వెళ్లాం. ఇటీవలికాలంలో ఆ ఆవరణంతా కలియ తిరిగింది అప్పుడే. నెలకు కనీసం ఒకసారయినా సారస్వత పరిషత్తు ఆవరణకు పోకుండా ఉండం గానీ, సమావేశ స్థలికో, సభాస్థలికో వెళ్లి రావడం తప్ప ఇట్లా కలియ తిరగక చాలా కాలమైంది. పోతుకూచి సాంబశివరావు ఆధ్వర్యంలో 1961లోనో 62 లోనో ప్రపంచ తెలుగు సభలు తలపెట్టినప్పుడు నేను, నా సహాధ్యాయి వే.నరసింహాడ్డి ఈ ఆవరణలోకి వెళ్లినపుడు అప్పటికే అక్కడ ఉన్న చలసాని ప్రసాదరావు ఆ బహిరంగ సభావేదిక దగ్గర గోడకు నిలబెట్టి నా ఫొటో తీసాడు. ఆంధ్రజ్యోతిలో హరి పురుషోత్తమరావు, ఇందుర్తి ప్రభాకరరావు నా గురించి రాసిన ‘మన వాళ్లయ్య’కు ఆ ఫొటోనే వాడుకున్నారు.ఇప్పుడు చూస్తే బహిరంగ సభావరణం లేదు. సి.నారాయణడ్డి తన ఎంపి నిధుల నుంచి నిర్మించినవీ, ఇంకెవరో దాతల సహాయంతో నిర్మించినవీ. డెభై ఏళ్ల సారస్వత పరిషత్తు చాలా చిన్నదైనట్లు అనిపించింది. మరో బాల్యంలో ప్రవేశించిందా? 49లో నా తొలి పరోక్ష బాల్య స్నేహంగా పరిచయమైన ఆరేళ్ల శిశువుకు ఏడు వసంతాలా? డ్బ్భై గ్రీష్మాలా?

ఇంతకూ ఆబిడ్స్ వైపు వెళ్లే బొగ్గులకుంటలో సారస్వత పరిషత్తు ఎక్కడ ఉంది? చలం కాలంలోనైతే కొంచెం ‘మౌనానికీ ధ్యానానికీ తావిచ్చే’ దివ్యజ్ఞాన సమాజం ముందర ఒక ఉద్యమ కెరటంగా. ఇప్పుడైతే కె. శ్రీనివాస్ ఆక్రోశించినట్టు ‘ఆదిత్య హాస్పిటల్స్ ముందర’, ఎస్పీ హాల్‌గా కూడా గుర్తుపెట్టుకోలేని సారస్వత పరిషత్!

-వరవరరావు
(ఆంధ్ర సారస్వత పరిషత్తు సప్తతి సమాపనోత్సవ సందర్భంగా..)

35

VARAVARA RAO

Published: Wed,February 19, 2014 12:14 AM

ఈ బొమ్మకింక.. ప్రాణం పోయాలి!

ఎన్నాళ్లుగా నీ బొమ్మ గీయాలని.. ప్రయత్నిస్తున్నాను ఎన్నో పోరాటాల జ్ఞాపకాల కన్నీళ్లతో తడిసి నెత్తురు చింది అది చెరిగిపోయేది సాయు

Published: Tue,November 5, 2013 11:56 PM

దాశరథి దేశకాలాలు వెలుగు చీకటి జ్ఞాపకాలు

నా పదమూడో ఏటనే దాశరథి (కృష్ణమాచార్య)తో పరోక్ష పరిచయం, ప్రత్యక్ష పరిచయంగానే కాదు స్నేహంగా కూడా అంత సులభంగా సాధ్యమవుతుందని నేనూహిం

Published: Mon,September 9, 2013 01:08 AM

కాళోజీ కలగన్న తెలంగాణ

ఇవాళ్టికి కాళోజీకి నూరేండ్లు. ఆయన ‘నా గొడవ’ మొదటి ముద్రణ ఆవిష్కరణ జరిగి ఆరవై ఏళ్లు దాటింది. ఇంకా ఆంధ్రరాష్ట్రం ఏర్పడక ముందు 1953

Published: Wed,August 14, 2013 01:16 AM

కేఎంసీలో వికసించిన ఎర్రమందారం

కాటా నారాయణరావు ‘శబరి గోదారి’ (1986) కవితా సంకలనానికి ముందుమాట రాస్తూ కాళోజీ నారాయణరావు.. ‘1965 లో ప్రారంభమైన అలజడి (విశాఖ ఉక్కు

Published: Wed,June 19, 2013 12:59 AM

తీర్మానం చేయలేని అసెంబ్లీ ఓడిపోయింది చేరనివ్వని చలో గెలిచింది

అసెంబ్లీ అంటే పది మంది సమావేశమయ్యే స్థలం కదా మంది కూడా కాదు మన ప్రజావూపతినిధులు పదికోట్ల మంది పెట్టు.. పెట్టుకున్న సభ మన చె

Published: Fri,June 14, 2013 12:21 AM

ప్రజాస్వామ్యమా! పోలీసుస్వామ్యమా!!

శాసనసభాపతిగా కూడా వ్యవహరించి, విజయవంతంగా, సమర్థవంతంగా శాసనసభను నిర్వహించిన పేరు కూడా తెచ్చుకొని ముఖ్యమంత్రి అయిన కిరణ్‌కుమార్‌డ్

Published: Sat,April 20, 2013 12:54 AM

ఇంద్రవెల్లి ఇంగలం

‘ఒక నిప్పురవ్వ దావానలమవుతుంది’ అనేమాట సామాన్యంగా ఒకచోట రగుల్కొన్న విప్లవం నలువైపులా విస్తరించడానికి అన్వయిస్తుంటారు. వైనాడ్ (కేరళ)

Published: Mon,April 1, 2013 12:37 AM

రాజ్యాంగమా? మతక్షిగంథాలా?

మన ప్రభుత్వాలు లౌకిక ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రకారం నడుస్తున్నాయని ఎవరికైనా భ్రమలుంటే వాటిని పటాపంచలు చేశాడు మన ముఖ్యమంత్రి కిరణ

Published: Thu,March 21, 2013 12:13 AM

‘కుక్క’ల్లో వార్త

‘వార్తల్లో కుక్క’ అనాలి. కాని అపుడది వార్త కాదు. రిపోర్టింగ్‌లో ప్రవేశించిన ప్రతి ఒక్కరికీ మీడియా అనుభవజ్ఞులు ఏది వార్త అవుతుందో,

Published: Fri,March 15, 2013 02:14 AM

వంజెం సోమయ్య జైలుడైరీ...

ఇది జైలు డైరీ కాదు... ఇది నిర్బంధ డైరీ... ఇది పోలీసు అక్రమ అరెస్టు డైరీ.. ఇది చిత్రహింసల డైరీ.. ఇది దాతు ఫిర్యాదులేని రాజ్యాంగం ప

Published: Wed,February 20, 2013 11:57 PM

నాటి మాటలు మరిచారా?

అధ్యక్షా! మన శాసనసభ కేంద్ర ప్రభుత్వానికి మరణశిక్షను రద్దు చేయవలసిందిగా రికమెండ్ చేస్తూ తీర్మానం చేయాలని ప్రతిపాదిస్తున్నా ను. పూర్

Published: Fri,February 15, 2013 11:28 PM

బతికించే వృత్తినుంచి ఉరికంబం దాకా..

అప్జల్‌గురు ప్రస్థానం అతని మాటల్లోనే... నేను పెరుగుతున్న కాలంలో కశ్మీర్ రాజకీయంగా కల్లోలంగా ఉన్నది. మక్బుల్‌భట్‌ను ఉరి తీశారు(198

Published: Sat,December 29, 2012 04:40 PM

డిసెంబర్ 6కు 20 ఏండ్లు

ఈ డిసెంబర్ 6కు (బాబ్రీమసీదు విధ్వంసం జరిగి) 20 ఏండ్లు నిండాయి. ఇరవైఏండ్లంటే ఇంచుమించు ఒక తరం మారింది. పి.వి.నర సింహా రావు నుంచి మన

Published: Wed,October 10, 2012 08:11 PM

‘తెలంగాణ మార్చ్’యే జవాబు

ముందు కొన్ని వాస్తవాలు చెప్పుకోవాలె. ఆ వాస్తవాలపై మన అభివూపాయా లు, వ్యాఖ్యలు ఏమైనా కావచ్చు. నెలవారీగా కేంద్ర హోంమంత్రి నిర్వహించే

Published: Sat,October 6, 2012 03:30 PM

పిల్లి మొగ్గలు ఎలుకల్ని పట్టడానికే

భాషలో తేడాయే తప్ప ప్రకాశ్‌సింగ్, కిషోర్‌చంవూదదేవ్, జైరాంరమేష్‌లు కూడా దళారీ పాలనలో భాగమైనంత కాలం చిదంబరం, రమణ్‌సింగ్, విజయ్‌కుమార్

Published: Sat,October 6, 2012 03:31 PM

ఆత్మావలోకనం

మార్క్సిజం పెట్టుబడిదారీ విధానాన్ని మట్టికాళ్ల మహారాక్షసి అంటుంది. ఆ మహారాక్షసి ఉక్కువేళ్లు మట్టిపొరలు చీల్చుకొని భూగర్భ జలాల్లోకి

Published: Sat,October 6, 2012 03:31 PM

విప్లవ దార్శనికుడు

‘చాటండి గళమెత్తి విప్లవదార్శనికుడు చారుమజుందార్ చచ్చిపోలేదని- కామ్రేడ్ చారుమజుందార్ చంపబడ్డాడని’ అంటూ చెరబండరాజు తన కవితా సంకలనం

Published: Sat,October 6, 2012 03:32 PM

ఆదివాసులకు న్యాయం దక్కేనా?

చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, సుక్మా, కాంకేర్ జిల్లాల్లో జూన్ 28,29 తేదీల్లో పోలీసులు మూడుచోట్ల అమాయకులైన 23మంది ఆదివాసీలను చంపారు. జ

Published: Sat,October 6, 2012 03:33 PM

అద్దంలో ‘విద్యార్థి ’ మాట

మొదట వరంగల్ ఆర్ట్స్‌కాలేజీ, తర్వాత ఉస్మానియా క్యాంపస్, రెండుచోట్ల చలం, శ్రీశ్రీ ఇచ్చిన మిత్రులు కాకుండా‘మివూతమండలి’ ఇచ్చిన మిత్రుల

Published: Sat,October 6, 2012 03:33 PM

జార్జ్ అడుగు జాడల్లో..

నేను జార్జిని చూసిన జ్ఞాపకం లేదు. కాని 1972 ఏప్రిల్ 14 సాయంకాలం నుంచి ప్రతి సాయం సంధ్యలోనూ ప్రతి ఉదయసంధ్యలోనూ ఆకాశంలోనే కాదు, నేలమ

Featured Articles