ఇంద్రవెల్లి ఇంగలం


Sat,April 20, 2013 12:54 AM

‘ఒక నిప్పురవ్వ దావానలమవుతుంది’ అనేమాట సామాన్యంగా ఒకచోట రగుల్కొన్న విప్లవం నలువైపులా విస్తరించడానికి అన్వయిస్తుంటారు. వైనాడ్ (కేరళ) అడవుల్లో వర్గీస్ చిందిన రక్తంలో ఎగసిన నిప్పురవ్వ, తెలంగాణ రైతాంగ పోరాటం వేగుచుక్కగా ఏర్పడిన నక్సల్బరీ పాలపుంత ఆకాశమంతా విస్తరించి విప్లవాన్ని భూమార్గం పట్టించే వెలుగుదారి అయింది. ఆ పంథాయే ఈనాటికీ కొనసాగుతున్న విప్లవ మార్గం.
ఇవ్వాళ తెలంగాణ ఉద్యమానికి కూడా ఇంద్ర ఒక పాఠం ఉన్నది. తెలంగాణ ఉద్యమం రాజ్యాంగం ఆర్టికల్ 3 కింద తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు చేయాల ని అంటున్నది. 1950 ఫజల్ అలీ కమిషన్ మొదలు 2009 డిసెంబర్ 9 ప్రకటన వరకు దాదాపు 60 ఏళ్లుగా.. తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు అనే ఒక చట్టబద్ధమైన ప్రజాస్వామికమై డిమాండు. 1969 మొదలు నేటి మలిదశ తెలంగాణ ఉద్యమం దాకా అన్ని చట్టబద్ధ పోరాటాలు, వెయ్యిమంది దాకా బలిదానాలు, సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్,సాగరహారం మొదలు సబ్బండరాశుల ఆకాంక్ష నుంచి సడక్‌బంద్ దాకా రకరకాల ఉద్యమాలు, ప్రయోగాలు జరిగాయి.

ఒక న్యాయమైన ప్రజాస్వామిక పోరాటం కోసం కశ్మీర్ మొదలు ఈశాన్య రాష్ట్రాల వరకు ప్రజలు ఎటువంటి పోరాట రూపాలు తీసుకోవలసి వచ్చిందో కూడా మనం చూస్తున్నాం. ‘ప్రతి న్యాయమైన పోరాటం ప్రజలు శాంతియుతంగా, చట్టబద్ధంగానే ప్రారంభిస్తారు. అది ఏ రూపాన్ని తీసుకుంటుందో చాలాసార్లు శత్రువు నిర్ణయిస్తాడంటాడు’ రావిశాస్త్రి. అధికారంలో ఉన్నవాడు అడిగినంతనే దిగిపోతే మాకు ఆయుధాలు పట్టాల్సిన అవసరమేమిటి? అంటాడు లెనిన్. చరివూతంతా ఇటువంటి న్యాయ పోరాటాల చరిత్రే.

1981 ఏప్రిల్ 20న ఇంద్ర ఏం జరిగింది? ఆదిలాబాదు జిల్లా గిరిజన రైతుకూలీ సంఘం మహాసభలను 81 ఏప్రిల్ 20న తలపెట్టింది. జిల్లా గిరిజన రైతుకూలీ సంఘం అధ్యక్షుడు హనుమంతరావుకు సభ జరుపుకోవడానికి పోలీసులు మొదట అనుమతిచ్చారు. ఆ రోజు ఇంద్ర సంత. జిల్లా అంతటా రాష్ట్రమంత టా ఈ సభ గురించి విస్తృతంగా ప్రచారం జరిగింది. ఇంద్ర నాలుగువైపుల నుంచి అడవి నుంచి కొండలమీంచి, లోయల నుంచి జనం చీమలదండుగా రావ డం ప్రారంభమైంది. ఆఖరి క్షణాన సభకు అనుమతి నిరాకరించినట్లు 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించినట్లు ప్రకటించి, వందలాదిమంది పోలీసులను దించి పోలీసు వాహనాలకు స్పీకర్లమర్చి సభకు ఎవరూ రావద్దని ప్రచారం మొదలుపెట్టారు.

తుడుందెబ్బ సమాచారం, నోటిమాట ప్రచారం తప్ప 144 సెక్షన్, నిషేధాజ్ఞలు అంటే తెలియని ఆదివాసులు ఈ పోలీసు ప్రకటనలు అర్థంకాక కొంత, పోలీసులు ఆఖరిక్షణలో అనుమతించడం లేదని తెలియక కొంత దాన్ని ఖాతరు చేయకుండా ఇంద్ర వైపుకు సాగివచ్చారు. పోలీసులు రోడ్లకు అన్నివైపులా మోహరించి, బస్సులు వాహనాలు నిలిపివేసి, చెట్లమీద తుపాకులు పెట్టుకొని కూర్చున్నారు. బస్సులో వచ్చేవాళ్లను ఇంద్ర దిగకుండా వెళ్లిపొమ్మన్నారు. దిగినవారిని అరెస్టు చేసారు. ఆ విధంగా ఇంద్ర చేరుకున్న ఆర్‌ఎస్‌యు ఉపాధ్యక్షుడు లింగమూర్తి, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు బి.జనార్దనరావు, కె.సీతారామరావు, ఎన్.వేణుగోపాల్‌ను అరెస్టుచేసి లాకప్‌లో పెట్టారు. లింగమూర్తి అప్పటికే ఎం.ఎ గోల్డ్‌మెడలిస్ట్. రీసెర్చ్ స్కాలర్. అయితే పోలీసులు అతన్ని ఆర్‌ఎస్‌యు ఉపాధ్యక్షుడంటే నమ్మలేదు. జనార్దనరావు, సీతారామరావు అప్పుడు కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు. వేణుగోపాల్ వరంగల్ ఆర్ట్స్ కాలేజీ విద్యార్థి. లాకప్‌లో ఉన్న వీళ్ల కళ్లముందే పోలీసులు జనంపై నిర్విచక్షణగా కాల్పులు ప్రారంభించారు. ఆ కాల్పుల్లో ఎంతమంది ఆదివాసులు హతమయ్యారో, ఎంతమంది గాయపడినారో ఇప్పటికీ ఇదమిద్థంగా లెక్కలు లేవు. దేశం నలుమూలల నుంచి వచ్చిన నిజనిర్థారణ కమిటీలు, ఏపీసీఎల్‌సీ కనీసం 60 మందైనా ఈ కాల్పుల్లో మరణించి ఉంటారని భావించాయి. ప్రతి ఒక్కరు దీనిని జలియన్ వాలాబాగ్ మారణకాండతో పోల్చారు. అయితే ఈ మారణకాండ ప్రభుత్వానికి ఒక మాయనిమచ్చలా మిగిలిందే తప్ప ప్రజల నైతిక పోరాటశక్తిని ఏమాత్రం హరించలేకపోయింది.

ఇంద్రవెల్లి ఘటనతో మొదటిసారిగా దేశవ్యాప్తంగా ఆదివాసుల సమస్యలు, హక్కులు, పోరాటాలు చర్చకు వచ్చాయి. ముఖ్యంగా ఒకప్పుడు గోండ్వానా ప్రజల కు ఉన్న స్వతంవూత రాజ్యం గురించి, చంద్రవంక గుర్తు ఉన్న రగల్‌జెండా గురించి, రాంజీగోండు, కొమురంభీంల పోరాటం గురించి, త్యాగం గురించి చర్చకు వచ్చిం ది. దేశంలోని మైదానవూపాంతమంతా మహానగరాలతో సహా అడవివైపు తలతిప్పి చూసే ఒక కుదుపువలె ఇంద్ర ఒక దర్శనీయ స్థలమైంది. పోరాట సంకేత మయ్యింది. ఇందుకు కారణం యాదృచ్ఛిక ఘటన కాదు. ఇది సద్యో (స్పాం సంఘటన కాదు. ఇంద్ర ఒక నిర్మాణ వూకమం, ఒక పోరాట క్రమం, ఒక ప్రాసెస్ ఉన్నాయి.అందుకే శత్రువు ఈ సభను అంత సీరియస్‌గా తీసుకున్నాడు. చట్టబద్ధమైన డిమాండ్ల కోసం కదలివచ్చిన వేలాది ఆదివాసుల చైతన్యం వెనుక విప్లవోద్యమం కృషి ఉన్నది.

విప్లవోద్యమ కృషిలో భాగమైన రాడికల్ విద్యార్థులు ప్రజల్లో మమేకమై చేసిన ప్రచారం ఉన్నది. అప్పటికే సాయిని ప్రభాకర్, నల్లా ఆదిడ్డి, మల్లోజుల కోటేశ్వరరావు, ముప్పాళ్ల లక్ష్మణరావు మొదలైనవాళ్లు, జగిత్యాల, సిరిసిల్లా, పెద్దపెలి,్ల కరీంనగర్ జిల్లాలోని ప్రాంతాల్లో పూర్తికాలపు విప్లవకారులుగా విప్లవోద్యమ నిర్మాణంలో ఉన్నారు.1976లో నాగపూర్‌లో తెలంగాణ రీజినల్ కమిటీ రూపొందించిన ‘రోడ్ టు రెవల్యూషన్’ (విప్లవానికి దారి) ప్రజాపంథా కార్యవూకమానికి 81 ఏప్రిల్ ఇంద్ర మధ్యన ఐదు సంవత్సరాల కృషి ఇది.

ఇందులో ఒక గుణాత్మక పరిణామం 1980 ఏప్రిల్‌లో సీపీఐ(ఎంఎల్) పీపుల్స్‌వార్ ఏర్పడడం. ఈ విప్లవపార్టీకి జగిత్యాల జైత్రయాత్ర కేవలం ఒక ఆర్థిక విజయమే. దీని నుంచి ఒక రాజకీయ భవిష్యత్ కార్యవూకమాన్ని రూపొందించుకోవాలని రచించుకున్న దండకారణ్య పర్‌స్పెక్టివ్‌ను అమలు చేయడానికి మహారాష్ర్ట సిరొంచ అడవులకు అమరుడు పెద్దిశంకర్ నాయకత్వంలో ఒక దళం, మరో ఏడు దళాలు బస్తర్‌కు వెళ్లాయి, పెద్దిశంకర్ 80 నవంబర్ 2న సిరొంచ అడవుల్లో ‘ఎన్‌కౌంటర్’లో అమరుడయి ఈనాటి దండకారణ్య ఉద్యమానికి తన నవ యవ్వన కవోష్ణ రక్తధారలతో చాలుపెట్టాడు. ఇదే కాలంలో సింగరేణి కార్మిక సమాఖ్య అమరులు శ్యాం, కట్ల మల్లేశ్, రమాకాంత్‌ల నాయకత్వంలో ఏర్పడింది. రాష్ట్రవ్యాప్తంగా అమరుడు గంజి రామారావు నాయకత్వంలో రైతుకూలీ సంఘం ఏర్పడింది. ఆదిలాబాదు జిల్లా గిరిజన రైతుకూలీ సంఘం ఇంద్ర ఏర్పాటుచేసిన సభానంతర, విషాదానంతర పోరాటానికి బహిరంగంగా రైతుకూలీ సంఘం నాయకత్వం, విప్లవోద్య మ మార్గదర్శకత్వం లభించాయి. అందుకే ఇంద్ర మారణకాండ నిప్పురవ్వ దావానలమయ్యే ఒక చారివూతక సంఘటన అయింది.

రైతుకూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంజి రామారావు ఇంద్ర తన నివాసంగా మార్చుకొని ఇంద్ర ఆదివాసీ అమరుల జ్ఞాపకార్థం దేశంలోనే అపూర్వమైన స్థూపనిర్మాణం చేపట్టాడు. ఇందుకోసం చైనాకు వెళ్లి అక్కడ తీన్‌మీన్‌స్క్వేర్‌లో ఉన్న స్థూపాన్ని చూసి, అధ్యయనం చేసి తాను స్వయంగా నిలబడి 83 అడుగుల ఎత్తైన స్థూపాన్ని నిర్మాణం చేయించాడు.

ఇవన్నీ ఒక ఎత్తు. కొమురంభీం పునరావిష్కరణ మరో ఎత్తు. అప్పటికే ఆదిలాబా దు జిల్లా కమిటీ శ్యాం, గజ్జెల గంగారామ్ ల నాయకత్వంలో ఆదివాసీ జీవిత, పోరాటాల అధ్యయనానికి పూనుకున్నది. గజ్జెల గంగారామ్, సాహులు అప్పుడు దండకారణ్యంలో భాగమైన ఆదిలాబాదు అడవు ల్లో గోండుల మధ్య వాళ్ల భాష కూడ నేర్చుకొని వాళ్ల మధ్యన నిర్మాణాన్ని చేపట్టారు. గజ్జెల గంగారామ్ బెల్లంపల్లి బొగ్గుగని కార్మికుని కొడుకు. వరంగల్ రీజినల్ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థి. నల్లా ఆదిడ్డి జమ్మికుంట కాలేజీ విద్యార్థి. సాహు పేరుతో ప్రసిద్ధుడైన శనిగరం వెంక కూడా జమ్మికుంట కాలేజీ విద్యార్థి.సాహు, అల్లం రాజయ్యలు కొమురం భీం 1940లలో చేసిన పోరాట అధ్యయనానికి పూనుకొని కేవలం నైజాం కాలపు దస్తావేజులు, చారివూతక ఆధారాల అధ్యయనమే కాకుండా కొమురం భీం సమకాలీనులను ఇంటర్వ్యూలు చేసి, ఆదిలాబాదు అడవుల్లో ఆదివాసుల్లో ఉన్న పురాణగాథలు, పాటలు సేకరించి చెంఘీజ్‌ఖాన్‌ను తలపించేదే కాదు, మరిపించేదయిన ఒక ప్రామాణిక చారివూతక నవలను రాసారు. అదే ‘కొమురంభీము’. 1983 ఏప్రిల్‌లో ఇంద్ర స్థూపావిష్కరణతో పాటు అదే వేదిక మీద కొమురంభీము నవల కూడా ఆవిష్కరింపబడింది.
ఇప్పుడు ఇంద్ర అమరులైన ఆదివాసులు విడిగా సంస్మరించుకోబడరు. అంటే జోడేఘాట్ నుంచి ఇంద్ర దాకా అది ఒక పోరాట సంప్రదాయం.

అది బాబేఝరీ.‘మావూళ్లో మా రాజ్యం’ సాధించుకోవడానికి ఆదివాసులు తలపెట్టిన స్వీయగౌరవ పోరాటం. కొమురం భీము కాలంలో పన్నెండూళ్లపై అధికారం కోసం ‘మావూళ్లో మారాజ్యం’ కోసం ప్రారంభమైన పోరాటం. ఇంద్ర నుంచి ఈనాటి వరకు సామ్రాజ్యవాద భూస్వామ్య దళారీ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జల్‌జంగిల్ జమీన్‌లపై అధికారం కోసమే కాదు, దండకారణ్యంలో ప్రత్యామ్నాయ ప్రజా రాజ్యాధికార ‘జనతన సర్కార్ల’ నిర్మాణం వరకు పురోగమించాయి. ఈ క్రమంలో ఒకప్పటి స్వతంత్ర గోండ్వానా రాజ్యాలు, రాంజీగోండు వంటి నేటి విప్లవకారులు,రగల్‌జెండాలు పూర్తి విప్లవ సంప్రదాయంతో స్మరించుకోబడుతున్నాయి. బ్రిటిష్ సామ్రాజ్యవాదం ఉరికంబం ఎక్కించిన రాంజీ పేరును దండకారణ్యంలో విప్లవోద్యమ నిర్మాణంలో కీలకభూమిక నిర్వహించిన మల్లోజుల కోటేశ్వరరావు స్వీకరించాడు. ఇప్పుడు దండకారణ్యంలో వందేళ్ల క్రితం గూండాదర్ నాయకత్వంలో జరిగిన బ్రిటిష్ సామ్రాజ్యవాద వ్యతిరేక భూంకాల్ పోరాటాన్ని స్మరించుకోవడమే కాదు భూంకాల్ మిలీషియాను నిర్మించుకొని శత్రు శిబిరాలపై మెరుపుదాడులు చేసి చింతల్నార్‌లను సృష్టిస్తున్నారు.

చంద్రవంక గుర్తుగల రగల్‌జెండా ఇపుడు దండకారణ్యంలో దళిత ఆదివాసీ విప్లవకర వర్గాల రెండు నక్షవూతాల ఎర్రజెండాయై ఎగురుతున్నది. ఇంద్ర ఈ విధంగా గత వర్తమానాల సంభాషణగా చరిత్ర నిర్మాణంలో ఒక భవిష్యత్ దార్శనికతకు వెలుగుజాడ అయింది.

ఇంద్ర మారణకాండ జరిగి ఇప్పటికి ముఫ్పైరెండేళ్లు. ఇప్పటికీ ఇంద్ర శత్రువుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. ప్రతి ఏప్రిల్ 20న ఆప్రాంతాల్లో 144సెక్షన్ విధించి గుడిహత్నూర్ నుంచి లక్షెట్టిపేట దాకా రోడ్డు పోలీసు పహారాపెడతాడు. ఏప్రిల్ 20 కన్న ముందు ఉట్నూరు పరిసర ప్రాంతాలన్నీ గాలింపు చేస్తాడు. అయినా సరే ఇంద్ర మాత్రమే కాదు ఆరోజు జోడేఘాట్, ఉట్నూరు మొదలైన అన్ని అటవీ ప్రాంతాల్లో గూడాల్లో ఇంద్ర అమరులను జోడేఘాట్ అమరులతో సహా స్మరించుకుంటారు. ఇవ్వాళ కొమురం భీము ఆదివాసీ ఆత్మగౌరవానికే కాదు, తెలంగాణ ఆత్మగౌరవానికి, విప్లవస్ఫూర్తికి సంకేతమయ్యాడు. మావూళ్లో మారాజ్యానికి, మా తెలంగాణలో మా స్వపరిపాలనకు, మా విప్లవ ప్రాంతాల్లో మా జనతన సర్కార్లకు సంకేతమయ్యాడు. ఈ పునరావిష్కరణ చేసింది ఇంద్ర విప్లవోద్యమం. ప్రజాస్వామిక తెలంగాణ ఉద్యమం, ఆదివాసీ ఆత్మగౌరవ పోరాటాలు.

కనుక ఇంద్ర గతం కాదు. ఇవ్వాళ ఆదిలాబాదు జిల్లాలో ఆదివాసుల పోరాటాలకు, పులుల అభయారణ్యం వ్యతిరేక పోరాటాలకు, ఓపెన్‌కాస్ట్ వ్యతిరేక పోరాటాలకు, ప్రత్యేక తెలంగాణ ప్రజాస్వామిక పోరాటానికి ఈ పోరాటాన్నీ అంతర్లీనం కావల్సిన విప్లవోద్యమానికి ఇంద్ర పాల ఇంద్ర స్మరించుకోవడమంటే ఏప్రిల్20న ఆదిలాబాదు అడవుల్లో చెట్లపైనుంచి ఎగిరే పాలపిట్టలను పలకరించడం. చెట్లతొపూరల్లో దాచిన ఆయుధాలను అందుకోవడం. ఇంద్ర మీదుగా పయనమైపోయిన దండును దండకారణ్యం నుంచి ఆవాహన చేసుకోవడం. అక్కడి క్రాంతికారీ జనతన సర్కార్ ఆదేశాలను, ఆదర్శాలను, ఆకాంక్షలను ఇక్కడి ప్రజాపోరాటాల్లోకి అనువదించుకోవడం. ముఖ్యంగా గోదావరీ, ప్రాణహిత, శబరి, ఇంద్రావతీ నదుల పొడుగునా మోహరించిన పారామిలిటరీ బలగాలు, పోలీసుక్యాంపులు, దాడులు, గృహదహనాలు, ఎన్‌కౌంటర్ల నుంచి ఆదివాసుల హననాన్ని, విధ్వంసాన్ని అడ్డుకునే విశాల ఐక్య వూపజా సంఘటనను నిర్మాణం చేయడం. ఇంద్ర నుంచి సాత్నాల వరకు ఆదివాసుల పోరాటాలకు బాసటగా నిలిచిన విశాల ప్రజారాశుల ప్రజాస్వామిక పోరాటాలను ఒక జ్వాజ్వల్యమైన కాగడాగా ఎత్తి ‘లే మషాలా లే చలేంగే’ అని పాడుతూ వెలుగులవైపుగా ప్రస్థానం చేస్తామని ప్రతిజ్ఞ చేయడం. ఇంద్ర ఇవ్వాల్టి ప్రాసంగికత ఇదే.
-వరవరరావు

35

VARAVARA RAO

Published: Wed,February 19, 2014 12:14 AM

ఈ బొమ్మకింక.. ప్రాణం పోయాలి!

ఎన్నాళ్లుగా నీ బొమ్మ గీయాలని.. ప్రయత్నిస్తున్నాను ఎన్నో పోరాటాల జ్ఞాపకాల కన్నీళ్లతో తడిసి నెత్తురు చింది అది చెరిగిపోయేది సాయు

Published: Tue,November 5, 2013 11:56 PM

దాశరథి దేశకాలాలు వెలుగు చీకటి జ్ఞాపకాలు

నా పదమూడో ఏటనే దాశరథి (కృష్ణమాచార్య)తో పరోక్ష పరిచయం, ప్రత్యక్ష పరిచయంగానే కాదు స్నేహంగా కూడా అంత సులభంగా సాధ్యమవుతుందని నేనూహిం

Published: Mon,September 9, 2013 01:08 AM

కాళోజీ కలగన్న తెలంగాణ

ఇవాళ్టికి కాళోజీకి నూరేండ్లు. ఆయన ‘నా గొడవ’ మొదటి ముద్రణ ఆవిష్కరణ జరిగి ఆరవై ఏళ్లు దాటింది. ఇంకా ఆంధ్రరాష్ట్రం ఏర్పడక ముందు 1953

Published: Wed,August 14, 2013 01:16 AM

కేఎంసీలో వికసించిన ఎర్రమందారం

కాటా నారాయణరావు ‘శబరి గోదారి’ (1986) కవితా సంకలనానికి ముందుమాట రాస్తూ కాళోజీ నారాయణరావు.. ‘1965 లో ప్రారంభమైన అలజడి (విశాఖ ఉక్కు

Published: Wed,June 19, 2013 12:59 AM

తీర్మానం చేయలేని అసెంబ్లీ ఓడిపోయింది చేరనివ్వని చలో గెలిచింది

అసెంబ్లీ అంటే పది మంది సమావేశమయ్యే స్థలం కదా మంది కూడా కాదు మన ప్రజావూపతినిధులు పదికోట్ల మంది పెట్టు.. పెట్టుకున్న సభ మన చె

Published: Fri,June 14, 2013 12:21 AM

ప్రజాస్వామ్యమా! పోలీసుస్వామ్యమా!!

శాసనసభాపతిగా కూడా వ్యవహరించి, విజయవంతంగా, సమర్థవంతంగా శాసనసభను నిర్వహించిన పేరు కూడా తెచ్చుకొని ముఖ్యమంత్రి అయిన కిరణ్‌కుమార్‌డ్

Published: Sun,May 26, 2013 12:54 AM

ఆంధ్ర సారస్వత పరిషత్ జ్ఞాపకాలు ...అనుబంధాలు

జాగీరు గ్రామమైన మా చిన్న పెండ్యాలలో నా బాల్యంలోనే నేను ఆంధ్ర సారస్వత పరిషత్తు పేరు వినడమే కాదు,అది మా విద్యాభివృద్ధిలో పాత్ర నిర్వ

Published: Mon,April 1, 2013 12:37 AM

రాజ్యాంగమా? మతక్షిగంథాలా?

మన ప్రభుత్వాలు లౌకిక ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రకారం నడుస్తున్నాయని ఎవరికైనా భ్రమలుంటే వాటిని పటాపంచలు చేశాడు మన ముఖ్యమంత్రి కిరణ

Published: Thu,March 21, 2013 12:13 AM

‘కుక్క’ల్లో వార్త

‘వార్తల్లో కుక్క’ అనాలి. కాని అపుడది వార్త కాదు. రిపోర్టింగ్‌లో ప్రవేశించిన ప్రతి ఒక్కరికీ మీడియా అనుభవజ్ఞులు ఏది వార్త అవుతుందో,

Published: Fri,March 15, 2013 02:14 AM

వంజెం సోమయ్య జైలుడైరీ...

ఇది జైలు డైరీ కాదు... ఇది నిర్బంధ డైరీ... ఇది పోలీసు అక్రమ అరెస్టు డైరీ.. ఇది చిత్రహింసల డైరీ.. ఇది దాతు ఫిర్యాదులేని రాజ్యాంగం ప

Published: Wed,February 20, 2013 11:57 PM

నాటి మాటలు మరిచారా?

అధ్యక్షా! మన శాసనసభ కేంద్ర ప్రభుత్వానికి మరణశిక్షను రద్దు చేయవలసిందిగా రికమెండ్ చేస్తూ తీర్మానం చేయాలని ప్రతిపాదిస్తున్నా ను. పూర్

Published: Fri,February 15, 2013 11:28 PM

బతికించే వృత్తినుంచి ఉరికంబం దాకా..

అప్జల్‌గురు ప్రస్థానం అతని మాటల్లోనే... నేను పెరుగుతున్న కాలంలో కశ్మీర్ రాజకీయంగా కల్లోలంగా ఉన్నది. మక్బుల్‌భట్‌ను ఉరి తీశారు(198

Published: Sat,December 29, 2012 04:40 PM

డిసెంబర్ 6కు 20 ఏండ్లు

ఈ డిసెంబర్ 6కు (బాబ్రీమసీదు విధ్వంసం జరిగి) 20 ఏండ్లు నిండాయి. ఇరవైఏండ్లంటే ఇంచుమించు ఒక తరం మారింది. పి.వి.నర సింహా రావు నుంచి మన

Published: Wed,October 10, 2012 08:11 PM

‘తెలంగాణ మార్చ్’యే జవాబు

ముందు కొన్ని వాస్తవాలు చెప్పుకోవాలె. ఆ వాస్తవాలపై మన అభివూపాయా లు, వ్యాఖ్యలు ఏమైనా కావచ్చు. నెలవారీగా కేంద్ర హోంమంత్రి నిర్వహించే

Published: Sat,October 6, 2012 03:30 PM

పిల్లి మొగ్గలు ఎలుకల్ని పట్టడానికే

భాషలో తేడాయే తప్ప ప్రకాశ్‌సింగ్, కిషోర్‌చంవూదదేవ్, జైరాంరమేష్‌లు కూడా దళారీ పాలనలో భాగమైనంత కాలం చిదంబరం, రమణ్‌సింగ్, విజయ్‌కుమార్

Published: Sat,October 6, 2012 03:31 PM

ఆత్మావలోకనం

మార్క్సిజం పెట్టుబడిదారీ విధానాన్ని మట్టికాళ్ల మహారాక్షసి అంటుంది. ఆ మహారాక్షసి ఉక్కువేళ్లు మట్టిపొరలు చీల్చుకొని భూగర్భ జలాల్లోకి

Published: Sat,October 6, 2012 03:31 PM

విప్లవ దార్శనికుడు

‘చాటండి గళమెత్తి విప్లవదార్శనికుడు చారుమజుందార్ చచ్చిపోలేదని- కామ్రేడ్ చారుమజుందార్ చంపబడ్డాడని’ అంటూ చెరబండరాజు తన కవితా సంకలనం

Published: Sat,October 6, 2012 03:32 PM

ఆదివాసులకు న్యాయం దక్కేనా?

చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, సుక్మా, కాంకేర్ జిల్లాల్లో జూన్ 28,29 తేదీల్లో పోలీసులు మూడుచోట్ల అమాయకులైన 23మంది ఆదివాసీలను చంపారు. జ

Published: Sat,October 6, 2012 03:33 PM

అద్దంలో ‘విద్యార్థి ’ మాట

మొదట వరంగల్ ఆర్ట్స్‌కాలేజీ, తర్వాత ఉస్మానియా క్యాంపస్, రెండుచోట్ల చలం, శ్రీశ్రీ ఇచ్చిన మిత్రులు కాకుండా‘మివూతమండలి’ ఇచ్చిన మిత్రుల

Published: Sat,October 6, 2012 03:33 PM

జార్జ్ అడుగు జాడల్లో..

నేను జార్జిని చూసిన జ్ఞాపకం లేదు. కాని 1972 ఏప్రిల్ 14 సాయంకాలం నుంచి ప్రతి సాయం సంధ్యలోనూ ప్రతి ఉదయసంధ్యలోనూ ఆకాశంలోనే కాదు, నేలమ

Published: Sat,October 6, 2012 03:34 PM

విప్లవ స్వాప్నికుడు ‘అలిశెట్టి’

ఈసారి 2011 సెప్టెంబర్ 29న కామ్రేడ్ సూర్యం సంస్మరణ సభ గుంటూరులో అపూర్వంగా జరిగింది. నేను వెళ్లాల్సింది. ఆ సభ జరుపుతామని తెలిసినప్ప

Published: Sat,October 6, 2012 03:34 PM

దిక్కుల కూడలిలో ధిక్కార స్వరాలు...?

ఎందుకోసం వచ్చినా.. చెరబండరాజు పుట్టిన రోజు చర్చ మంచి కోసం ఉపయోగపడుతోంది. చెరబండరాజు కు సాహిత్య అకాడమీ నుంచి వచ్చిన సహాయాన్ని తన అవ

Published: Sat,October 6, 2012 03:35 PM

ఉద్యమ పంథా మారాలె

సకలజనుల సమ్మె స్వయంపాలనలో భాగంగా శాంతియుతంగా, రాజకీయాలకు అతీతంగా యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని ఒక్కతాటి మీదికి తీసుకురావడం ద్వారా ప్

Published: Sat,October 6, 2012 03:35 PM

కాళోజీ (అను) వాదం

‘నా భారతదేశయాత్ర’ డ్బై ఏళ్ల క్రితం (1941) కాళోజీ (నారాయణరావు)గారు అనువదించి, దేశోద్ధారక గ్రంథమాల పక్షాన వట్టికోట ఆళ్వారుస్వామిగారు