రాజ్యాంగమా? మతక్షిగంథాలా?


Mon,April 1, 2013 12:37 AM

SINGARENIమన ప్రభుత్వాలు లౌకిక ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రకారం నడుస్తున్నాయని ఎవరికైనా భ్రమలుంటే వాటిని పటాపంచలు చేశాడు మన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి. అది కూడ ఎక్కడో వ్యక్తిగత సంభాషణలో కాదు. జనాంతికంగా కాదు. రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా ఎన్నికలు జరిగి ఏర్పడిన శాసనసభలో, అదికూడా బడ్జెట్ సెషన్‌లో. రాజ్యాంగ సంప్రదాయం ప్రకార మే ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగించి, ఆర్థికమంత్రి బడ్జెట్‌ను ప్రతిపాదించిన తర్వాత జరిగిన చర్చలో. రాజ్యాంగ సూత్రాలకు, సంప్రదాయాలకు అనుగుణంగా అరవై ఏళ్లుగా జరుగుతూ వస్తున్న పార్లమెంటరీ సంప్రదాయమే ఇది.

అభ్యంతరకరమైన విషయమేమంటే-ముఖ్యమంత్రి ‘కాగ్’ నివేదిక గురించిన వ్యాఖ్యానం. ఒక సంవత్సరం కోసం లేదా నిర్దిష్ట కాలంకోసం ప్రభుత్వం వివిధ శాఖలకు చేయవలసిన ఖర్చులు, ఆదాయ వనరులు మొదలైన అంశాలు ప్రభు త్వం శాసనసభలో ప్రతిపాదించి, చర్చజరిగి ఆమోదం పొందిన తర్వాత మరో ఏడాదికి, లేదా నిర్దిష్టకాలానికి ఆదాయ వ్యయ నిర్ణయాలు సక్రమంగా అమలయ్యాయా, ఆయా శాఖలకు కేటాయించిన డబ్బు ఆయా శాఖలు తీసుకొని ఖర్చు చేశాయా, లేదా? సక్రమంగానే జరిగిందా అనే విషయాలు తేల్చడానికి, రాజ్యాం గం ప్రకారమే ఆడిట్ చేయడానికి కంప్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)ను నియమిస్తారు. అంటే ఆర్థిక, ఆదాయ వ్యయాలకు సంబంధించినంత వరకు నిధు లు వినియోగించుకోకపోవటం, దుర్వినియోగం మొదలు సద్వినియోగం వరకు కాగ్ ఆడిట్‌పామాణికంగా భావించవలసినది. ప్రామాణికం-అంటే-రాజ్యాంగం ప్రకారం ఏర్పరుచుకున్న ఒక ప్రమాణం అని అర్థం.

కాలం గురించి, కాలమానం గురించి -ఒక వస్తువు మన్నిక గురించి-అన్నిటి గురించీ నాగరిక ప్రభుత్వాలు శాస్త్రీయమైన ప్రమాణాలు (స్టాండర్డ్స్)ఏర్పాటు చేశాయి. ఇది ప్యూడల్, రాచరిక, భూస్వామ్య సమాజాల్లోను, సంస్కృతిలోనూ ఉన్న మత ప్రమాణాలుకావు. దేవుని మీద ఒట్టు-వంటి ప్రమాణం కాదు. అట్లే మతపరమైన సేవ హక్కు, ఫత్వా, టెన్ కమాండమెంట్స్ కూడా కావు. అదేం వేదవాక్కా, అదేం శిలాశాసనమా? అనేమాట ఎవరైనా అంటున్నారంటే అటువంటి వారిలో ఇంకా మతవాసనలే ఉన్నాయని కూడ అర్థం. ఆవిషయంలో కిరణ్‌కుమార్‌డ్డి ముఖ్యమంత్రి కనుక ఒక జాగ్రత్త తీసుకున్నాడు. మూడు ప్రధాన మతక్షిగంథాలను ప్రమాణంగా భావించాడు. మరి బౌద్ధ మతానికి సంబంధించిన దమ్మ పదం ఏమయింది? బౌద్ధం మతంకాదని కిరణ్‌కుమార్‌డ్డికి తెలుసుననుకోవాలా? అతి తెలివితేటలు ప్రదర్శించే వాళ్లతో వచ్చే చిక్కేమిటంటే వాళ్ల తెలివి తక్కువతనం కూడ అక్కడే బయటపడుతూ ఉంటుంది.

కాగ్ నివేదిక భగవద్గీతనా, ఖురానా,బైబిలా అన్నాడు ఆయన. నయమింక మను ధర్మశాస్త్రమా,కౌటిల్యుడి అర్థశాస్త్రమా అని అడగలేదు. శాసనసభ ఈ మతక్షిగంథాల ప్రాతిపదికన నడవాలని సభలో కూర్చున్న వాళ్లంతా తెలిసో తెలియకో అనుకున్నట్లున్నారు కనుక, ఒక్కరికీ ఇది లౌకిక ప్రజాస్వామ్యంలో అభ్యంతరకరమని అనిపించలేదు. ఎందుకు ఒక్కరు కూడా ‘మనం రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి గదా! మత గ్రంథాల ప్రకారం కాదుకదా’! అని అడగలేదు. ఈ వ్యాఖ్యలు అభ్యంతరకరమైనవని, రికార్డుల నుంచి తొలిగించాలని అడిగిన వాళ్లు లేకపోలేదు. రికార్డులు చూసి శాసనసభ నియమాలు చూసి రూలింగ్ ఇస్తానని సభాపతి అనకపోలేదు. కానీ గతంలో శాసన సభాపతిగా చేసిన ఇప్పటి ముఖ్యమంత్రి శాసనసభలో రాజ్యాంగాన్ని కాకుండా మతక్షిగంథాలను ప్రమాణంగా భావించి కాగ్ నివేదికను కించపరచడాన్ని ఒక్కరూ అడ్డుకోలేకపోయారు. మన శాసనసభ్యుల్లోనే కాదు, విద్యావంతుల్లోనేకాదు, మీడియాలోనే కాదు, మన తథాకభెల్ ప్రజాస్వామ్య సంస్కృతిలో ఇటు ప్రజాస్వామ్యమూ, అటు లౌకిక భావన లేకపోవడమే ఇటువంటి మాటలు శాసనసభలో కూడ అనగలుగుతున్నారు.

ఎవరో ఎమ్మెల్యే కాదు, స్వయంగా నిన్నటి స్పీకర్, ఇవ్వాల సీఎం. అరవై ఏళ్లకు పైగా ఎంతో సెక్యులర్ ప్రభుత్వాలు అనుకున్నవి కూడా అమలు చేసింది, ఈ గీత ఖురాన్, బైబిల్ అనుయాయుల జనాభా ప్రాతిపదిక విశ్వాసాలను తృప్తిపరచే చర్యలే. ఈ ‘సెక్యులరిజాన్ని’ ఈ మూడు మతాలు కానే కాదు, బౌద్ధులు, నాస్తికులు, కమ్యూనిస్టులు కూడా ప్రశ్నించినప్పుడు ఇంక పుట్టుకవల్లనో, స్వీకరించినందు వల్లనో,ఉనికి, చైతన్యాల వల్లనో ఈ మూడు మతాలకే చెందిన వాళ్లమనుకునే మన పార్లమెంటరీ ప్రజాస్వామ్య భావనలకు అభ్యంతరమెందుకుంటుంది?

మనం ప్రజాస్వామ్యం గురించి, అభివృద్ధి గురించి ఎంత ప్యూడల్ భూస్వామ్య భాషలో మాట్లాడుతున్నామో, వ్యవహరిస్తున్నామో, చివరకు శరీర భాషలో కూడ వ్యక్తం చేస్తున్నామో ఈసారి శాసనసభలో శాసనసభ నాయకుని మించిన దృష్టాం తం అక్కర్లేదు. తెలంగాణకు ఉద్యమం కాలర్ పట్టుకుని అడిగితే నిధులు ఇచ్చింది ప్రభుత్వంఅని తెరాస శాసనసభ్యుడు అంటే నన్ను కాలర్‌పట్టుకొని అడుగుతావా? నేనేం భయపడతానా? నవ్వు వీధిరౌడీలా మాట్లాడితే, నేను హైదరాబాద్‌లో పుట్టాను. హైదరాబాద్‌లో పెరిగాను. హైదరాబాదీని- నేనూ ఆ భాషలోనే జవాబు చెప్పగలను. ‘ఒక్కరూపాయి ఇవ్వను ఏం చేసుకుంటావో చేసుకో’అంటాడు ముఖ్యమంత్రి. ఇదేం హరీశ్‌రావు, కిరణ్‌కుమార్‌డ్డి వ్యవహారమా? తన జేబులోంచి నిధులు తీసి యిస్తున్నాడా? (నిధులు తన జేబులోనయితే వేసుకోవడం లేదుగదా!) హరీశ్‌రావు జేబులోకి ఇస్తున్నాడా? తెలంగాణ నీటి వనరుల కోసం ప్రభుత్వం కేటాయిస్తున్నాడా? ఇది శాసనసభలో వ్యక్తులకు వ్యక్తులు వివరణ, సంజాయిషీ ఇవ్వాల్సిన విషయాలా? ప్రజలకు ప్రభుత్వం జవాబుదారీకి సంబంధించిన విషయాలా?

అమలు, ఆచరణల సంగతి అట్లా ఉంచుదాం. మన ముఖ్యమంత్రి దాకా పార్లమెంటరీ భాష మాట్లాడే విషయంలో, శాసనసభకు-శాసనసభకు మధ్యన రాజ్యాంగాన్ని చదువుకోవాల్సిన విరామం ఏమైనా చిక్కించుకోగలడేమో మాజీ స్పీకర్‌కు ఎవరైనా గుర్తు చేయగలరా? ఆచరణ- అర్థవలస, అర్థ భూస్వామ్య దళారీ పాలన అయినప్పుడు వ్యక్తీకరణ మరొక రూపంలో ఎట్లా ఉంటుంది అని నా బోటివాడు, సీమాంధ్ర పాలకుల ఆచరణ ఉన్నట్లే, సీమాంధ్ర పాలకుల భాష ఉంటుందని తెలంగాణ వాది అంటే తప్పవుతుందా? శాసనసభ నిరవధికంగా వాయిదాపడిన ఈ మండుటెండల్లో మనసుపెట్టి ఆలోచించమని ప్రత్యేకించి ప్రజాస్వామ్యవాదులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.

-వరవరరావు

35

VARAVARA RAO

Published: Wed,February 19, 2014 12:14 AM

ఈ బొమ్మకింక.. ప్రాణం పోయాలి!

ఎన్నాళ్లుగా నీ బొమ్మ గీయాలని.. ప్రయత్నిస్తున్నాను ఎన్నో పోరాటాల జ్ఞాపకాల కన్నీళ్లతో తడిసి నెత్తురు చింది అది చెరిగిపోయేది సాయు

Published: Tue,November 5, 2013 11:56 PM

దాశరథి దేశకాలాలు వెలుగు చీకటి జ్ఞాపకాలు

నా పదమూడో ఏటనే దాశరథి (కృష్ణమాచార్య)తో పరోక్ష పరిచయం, ప్రత్యక్ష పరిచయంగానే కాదు స్నేహంగా కూడా అంత సులభంగా సాధ్యమవుతుందని నేనూహిం

Published: Mon,September 9, 2013 01:08 AM

కాళోజీ కలగన్న తెలంగాణ

ఇవాళ్టికి కాళోజీకి నూరేండ్లు. ఆయన ‘నా గొడవ’ మొదటి ముద్రణ ఆవిష్కరణ జరిగి ఆరవై ఏళ్లు దాటింది. ఇంకా ఆంధ్రరాష్ట్రం ఏర్పడక ముందు 1953

Published: Wed,August 14, 2013 01:16 AM

కేఎంసీలో వికసించిన ఎర్రమందారం

కాటా నారాయణరావు ‘శబరి గోదారి’ (1986) కవితా సంకలనానికి ముందుమాట రాస్తూ కాళోజీ నారాయణరావు.. ‘1965 లో ప్రారంభమైన అలజడి (విశాఖ ఉక్కు

Published: Wed,June 19, 2013 12:59 AM

తీర్మానం చేయలేని అసెంబ్లీ ఓడిపోయింది చేరనివ్వని చలో గెలిచింది

అసెంబ్లీ అంటే పది మంది సమావేశమయ్యే స్థలం కదా మంది కూడా కాదు మన ప్రజావూపతినిధులు పదికోట్ల మంది పెట్టు.. పెట్టుకున్న సభ మన చె

Published: Fri,June 14, 2013 12:21 AM

ప్రజాస్వామ్యమా! పోలీసుస్వామ్యమా!!

శాసనసభాపతిగా కూడా వ్యవహరించి, విజయవంతంగా, సమర్థవంతంగా శాసనసభను నిర్వహించిన పేరు కూడా తెచ్చుకొని ముఖ్యమంత్రి అయిన కిరణ్‌కుమార్‌డ్

Published: Sun,May 26, 2013 12:54 AM

ఆంధ్ర సారస్వత పరిషత్ జ్ఞాపకాలు ...అనుబంధాలు

జాగీరు గ్రామమైన మా చిన్న పెండ్యాలలో నా బాల్యంలోనే నేను ఆంధ్ర సారస్వత పరిషత్తు పేరు వినడమే కాదు,అది మా విద్యాభివృద్ధిలో పాత్ర నిర్వ

Published: Sat,April 20, 2013 12:54 AM

ఇంద్రవెల్లి ఇంగలం

‘ఒక నిప్పురవ్వ దావానలమవుతుంది’ అనేమాట సామాన్యంగా ఒకచోట రగుల్కొన్న విప్లవం నలువైపులా విస్తరించడానికి అన్వయిస్తుంటారు. వైనాడ్ (కేరళ)

Published: Thu,March 21, 2013 12:13 AM

‘కుక్క’ల్లో వార్త

‘వార్తల్లో కుక్క’ అనాలి. కాని అపుడది వార్త కాదు. రిపోర్టింగ్‌లో ప్రవేశించిన ప్రతి ఒక్కరికీ మీడియా అనుభవజ్ఞులు ఏది వార్త అవుతుందో,

Published: Fri,March 15, 2013 02:14 AM

వంజెం సోమయ్య జైలుడైరీ...

ఇది జైలు డైరీ కాదు... ఇది నిర్బంధ డైరీ... ఇది పోలీసు అక్రమ అరెస్టు డైరీ.. ఇది చిత్రహింసల డైరీ.. ఇది దాతు ఫిర్యాదులేని రాజ్యాంగం ప

Published: Wed,February 20, 2013 11:57 PM

నాటి మాటలు మరిచారా?

అధ్యక్షా! మన శాసనసభ కేంద్ర ప్రభుత్వానికి మరణశిక్షను రద్దు చేయవలసిందిగా రికమెండ్ చేస్తూ తీర్మానం చేయాలని ప్రతిపాదిస్తున్నా ను. పూర్

Published: Fri,February 15, 2013 11:28 PM

బతికించే వృత్తినుంచి ఉరికంబం దాకా..

అప్జల్‌గురు ప్రస్థానం అతని మాటల్లోనే... నేను పెరుగుతున్న కాలంలో కశ్మీర్ రాజకీయంగా కల్లోలంగా ఉన్నది. మక్బుల్‌భట్‌ను ఉరి తీశారు(198

Published: Sat,December 29, 2012 04:40 PM

డిసెంబర్ 6కు 20 ఏండ్లు

ఈ డిసెంబర్ 6కు (బాబ్రీమసీదు విధ్వంసం జరిగి) 20 ఏండ్లు నిండాయి. ఇరవైఏండ్లంటే ఇంచుమించు ఒక తరం మారింది. పి.వి.నర సింహా రావు నుంచి మన

Published: Wed,October 10, 2012 08:11 PM

‘తెలంగాణ మార్చ్’యే జవాబు

ముందు కొన్ని వాస్తవాలు చెప్పుకోవాలె. ఆ వాస్తవాలపై మన అభివూపాయా లు, వ్యాఖ్యలు ఏమైనా కావచ్చు. నెలవారీగా కేంద్ర హోంమంత్రి నిర్వహించే

Published: Sat,October 6, 2012 03:30 PM

పిల్లి మొగ్గలు ఎలుకల్ని పట్టడానికే

భాషలో తేడాయే తప్ప ప్రకాశ్‌సింగ్, కిషోర్‌చంవూదదేవ్, జైరాంరమేష్‌లు కూడా దళారీ పాలనలో భాగమైనంత కాలం చిదంబరం, రమణ్‌సింగ్, విజయ్‌కుమార్

Published: Sat,October 6, 2012 03:31 PM

ఆత్మావలోకనం

మార్క్సిజం పెట్టుబడిదారీ విధానాన్ని మట్టికాళ్ల మహారాక్షసి అంటుంది. ఆ మహారాక్షసి ఉక్కువేళ్లు మట్టిపొరలు చీల్చుకొని భూగర్భ జలాల్లోకి

Published: Sat,October 6, 2012 03:31 PM

విప్లవ దార్శనికుడు

‘చాటండి గళమెత్తి విప్లవదార్శనికుడు చారుమజుందార్ చచ్చిపోలేదని- కామ్రేడ్ చారుమజుందార్ చంపబడ్డాడని’ అంటూ చెరబండరాజు తన కవితా సంకలనం

Published: Sat,October 6, 2012 03:32 PM

ఆదివాసులకు న్యాయం దక్కేనా?

చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, సుక్మా, కాంకేర్ జిల్లాల్లో జూన్ 28,29 తేదీల్లో పోలీసులు మూడుచోట్ల అమాయకులైన 23మంది ఆదివాసీలను చంపారు. జ

Published: Sat,October 6, 2012 03:33 PM

అద్దంలో ‘విద్యార్థి ’ మాట

మొదట వరంగల్ ఆర్ట్స్‌కాలేజీ, తర్వాత ఉస్మానియా క్యాంపస్, రెండుచోట్ల చలం, శ్రీశ్రీ ఇచ్చిన మిత్రులు కాకుండా‘మివూతమండలి’ ఇచ్చిన మిత్రుల

Published: Sat,October 6, 2012 03:33 PM

జార్జ్ అడుగు జాడల్లో..

నేను జార్జిని చూసిన జ్ఞాపకం లేదు. కాని 1972 ఏప్రిల్ 14 సాయంకాలం నుంచి ప్రతి సాయం సంధ్యలోనూ ప్రతి ఉదయసంధ్యలోనూ ఆకాశంలోనే కాదు, నేలమ

Published: Sat,October 6, 2012 03:34 PM

విప్లవ స్వాప్నికుడు ‘అలిశెట్టి’

ఈసారి 2011 సెప్టెంబర్ 29న కామ్రేడ్ సూర్యం సంస్మరణ సభ గుంటూరులో అపూర్వంగా జరిగింది. నేను వెళ్లాల్సింది. ఆ సభ జరుపుతామని తెలిసినప్ప

Published: Sat,October 6, 2012 03:34 PM

దిక్కుల కూడలిలో ధిక్కార స్వరాలు...?

ఎందుకోసం వచ్చినా.. చెరబండరాజు పుట్టిన రోజు చర్చ మంచి కోసం ఉపయోగపడుతోంది. చెరబండరాజు కు సాహిత్య అకాడమీ నుంచి వచ్చిన సహాయాన్ని తన అవ

Published: Sat,October 6, 2012 03:35 PM

ఉద్యమ పంథా మారాలె

సకలజనుల సమ్మె స్వయంపాలనలో భాగంగా శాంతియుతంగా, రాజకీయాలకు అతీతంగా యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని ఒక్కతాటి మీదికి తీసుకురావడం ద్వారా ప్

Published: Sat,October 6, 2012 03:35 PM

కాళోజీ (అను) వాదం

‘నా భారతదేశయాత్ర’ డ్బై ఏళ్ల క్రితం (1941) కాళోజీ (నారాయణరావు)గారు అనువదించి, దేశోద్ధారక గ్రంథమాల పక్షాన వట్టికోట ఆళ్వారుస్వామిగారు

Featured Articles