‘కుక్క’ల్లో వార్త


Thu,March 21, 2013 12:13 AM

‘వార్తల్లో కుక్క’ అనాలి. కాని అపుడది వార్త కాదు. రిపోర్టింగ్‌లో ప్రవేశించిన ప్రతి ఒక్కరికీ మీడియా అనుభవజ్ఞులు ఏది వార్త అవుతుందో, ఏది కాదో చెప్తారు. వార్తా రహస్యం ఏమిటో చెప్తారు. ఏది వార్త కాగలుగుతుంది అని. ‘మనిషిని కుక్క కరిస్తే వార్త్త కాదు, కుక్కను మనిషి కరిస్తేవార్త’ అని.

యాంటీ మీడియాగా కుఖ్యాతి పొందానని బాధపడుతున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఒక మీడియా మిత్రుణ్ని అడిగాడట, ఎందుకు ప్రభుత్వం చేసిన ఒక్క మంచి పనినైనా రిపోర్టు చేయరు అని. అప్పుడది వార్త కాదు. వార్త సంచలనంగా ఉండాలి అని చెప్తూ ‘మనిషిని కుక్క కరిస్తే వార్త కాదు, మనిషి కుక్కను కరిస్తేవార్త’ అని. ఒక కొత్త టీవీ చానెల్ లోగో ను ఆవిష్కరిస్తూ ముఖ్యమంత్రి ఈ మాట చెప్పాడు.

ఏ ముహూర్తాన ముఖ్యమంత్రి నోట కుక్క మాట వచ్చిందో కానీ ఇంక అక్కడి నుంచి కుక్క వార్తల్లో కెక్కింది. రెండేండ్ల పరిపాలనలోనే కుక్క వార్త అవుతుందని ఒక ముఖ్యమంవూతికి అర్థం అయితే, తొమ్మిదన్నరేండ్లు పరిపాలించిన తాను కుక్కను నోట కరవకుండా ఉంటే వెనుకపడినట్లే కదా తోక కావడమే కదా) అనిపించిందేమో చంద్రబాబు నాయుడుకు! ఒకటికి రెండుసార్లు కుక్క ప్రస్తావన తెచ్చాడు. తెరా స అధ్యక్షుడు కేసీఆర్ కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడితే బలపరచడానికి తానేమీ కుక్కతోకనా? అని అభిమాన పడిపోయాడు. కుక్క తోకను ఆడిస్తుందా, తోక కుక్కను ఆడిస్తుందా అని ఆయనకు సందేహం వచ్చింది. సమయం వచ్చినప్పుడు, టీడీపీ తానుగానే ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రకటిస్తుంది గానీ తాను తెరాస తోకను కాదల్చుకోలేదన్నది.

అట్లని చంద్రబాబును విశ్వాసం విషయంలో కూడా కుక్కతో పోల్చడానికి వీలు లేదు. ఆయన వీపీ సింగ్ నాయకత్వంలోని ఐక్య సంఘటన కన్వీనర్‌గా ఎన్నికలు గెలిచి అద్వానీ ఐక్య సంఘటన వైపు ప్లేటు ఫిరాయించగలడు. అప్పుడు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం విషయంలో కుక్కను తోక ఆడించినట్లు ఆడించగలడు. బీజేపీ ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి నాయకత్వం వహించినంత కాలం తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఇవ్వలేకపోయిందంటే చంద్రబాబు భాషలో ఏం జవాబు చెప్పాల్సి ఉంటుంది ‘ఏం చేయాలి ఏపీ లోని టీడీపీ ప్రభుత్వం అనే తోక నన్నాడించి తెలంగాణ ఇవ్వకుండా చేసింది’ అనాల్సి ఉంటుంది.

టంగుటూరి అంజయ్య కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉండి టీడీపీ ఆవిర్భావంలో ఎన్నికల్లో వ్యతిరేకంగా పనిచేసి ఎన్టీఆర్ అల్లుడయ్యాక దశాబ్దన్నర పాటు తొంభై అయిదు ఆగస్టు దాకా ఆయన టీడీపీలో, ప్రభుత్వంలో నిర్వహించిన పాత్రను కుక్క, తోకలలో దేనితో పోల్చాలి.

వైస్రాయి హోటల్ కుట్రను దేనితో పోల్చాలి?
ఏమైనా చంద్రబాబు నాయుడుకు అవిశ్వాసం మీద విశ్వాసం లేదు. ఆయనకు విశ్వాసం ఎక్కువ. ఆత్మ విశ్వాసం మరీ ఎక్కువ. ప్రభుత్వం మీద, ప్రభుత్వంలో ఉండడం మీద విశ్వాసం ఎక్కువ. ప్రభుత్వంలో వీపీసింగ్ ఉంటే ఆయన వెంట ఉంటాడు. వాజపేయి ఉంటే ఆయన వెంట ఉంటాడు.

కిరణ్‌కుమార్ రెడ్డి ఉంటే?...
అవిశ్వాసాన్ని బలపరచడు. వీపీసింగ్, ఎన్టీఆర్‌ల విషయంలో లేని విశ్వాసం ఆయనకు కిరణ్‌కుమార్ రెడ్డి పట్ల ఉన్నదా? కాదు. అది ఆయనకున్న ఆత్మవిశ్వాసం. ప్రభుత్వం ప్రభుత పట్ల ఉన్న అచంచల విశ్వాసం.

చంద్రబాబును విశ్వాసం విషయంలో ఆయనతో ఆయననే పోల్చాలి తప్ప విశ్వాసం గల ఏ జంతువూ, ఏ మనిషి పోలికా కుదరదు. ఆయన ఎన్టీఆర్, వీపీసింగ్, వాజపేయిలతో అంత విశ్వాస, అవిశ్వాసాలతోనే వ్యవహరించాడు. ఆయనకు విశ్వాసం, అవిశ్వాసం రెండు కళ్లు. ఒక కన్ను తనపై అపారమైన ఆత్మవిశ్వాసం. మరొకటి ఎదుటి వారిపై అడుగడుగునా అవిశ్వాసం. మనుషులందరికీ రెండు కళ్లు ఉంటాయి. సామాన్యుల రెండు కళ్లకూ ఒకే చూపు ఉంటుంది. నాలుక కూడా ఒకటే ఉంటుంది.
వార్తల్లో కుక్క గురించి కదా మనం మాట్లాడుకోవాల్సింది, మళ్లీ చంద్రబాబు నోట కుక్క ప్రస్తావన. కాంగ్రెస్ నాయకులంతా సోనియా గాంధీ వెంట కుక్కల వలె తోకాడిస్తూ తిరుగుతున్నారని. కుక్క విశ్వాసాన్ని ఆచరణలో చూపుతుంది. దానికి మాటలు రావు కదా.

ప్రకటనలివ్వదు, నటించదు. (మనం నేర్పితే తప్ప) రాజకీయ నాయకులు అంటే ఓటు ద్వారా, విశ్వాస, అవిశ్వాసాలు ఆచరించవలసిన వాళు, మాటలు నేర్చిన వాళ్లు కదా. విశ్వాసాలే కాదు విధేయతలు కూడా ప్రకటిస్తుంటారు.
కుక్కల వలె తమ వెంట తిరుగుతారని నమ్మకం లేని నాయకులు మాత్రం, సూట్‌కేసులకు అమ్ముడుపోతారని అనుమానం ఉన్న నాయకు లు మాత్రం విప్‌లు జారీ చేస్తుంటారు. సమస్య ఎక్కడంటే.. ఇటువంటి నాయకులకు కుక్కల మీదా విశ్వాసం ఉండదు. తోకల మీదా విశ్వాసం ఉండదు. తోకగా ఉన్నప్పుడు కుక్క నాడించాలని, కుక్కగా ఉన్నప్పుడు తోకనాడించాలని విశ్వాస, అవిశ్వాసాలను తారు మారు చేస్తుంటారు.
అపరిమిత ఆధిపత్య ఆత్మవిశ్వాసానికున్న బలమది. తనకోసం ప్రభుత్వాన్ని పడగొట్టడానికైనా, నిలబెట్టడానికైనా కావల్సిందదే.
(కుక్కలను, మనుషులను గాయపరచి ఉంటే క్షమించగలరు)

-వరవరరావు

35

VARAVARA RAO

Published: Wed,February 19, 2014 12:14 AM

ఈ బొమ్మకింక.. ప్రాణం పోయాలి!

ఎన్నాళ్లుగా నీ బొమ్మ గీయాలని.. ప్రయత్నిస్తున్నాను ఎన్నో పోరాటాల జ్ఞాపకాల కన్నీళ్లతో తడిసి నెత్తురు చింది అది చెరిగిపోయేది సాయు

Published: Tue,November 5, 2013 11:56 PM

దాశరథి దేశకాలాలు వెలుగు చీకటి జ్ఞాపకాలు

నా పదమూడో ఏటనే దాశరథి (కృష్ణమాచార్య)తో పరోక్ష పరిచయం, ప్రత్యక్ష పరిచయంగానే కాదు స్నేహంగా కూడా అంత సులభంగా సాధ్యమవుతుందని నేనూహిం

Published: Mon,September 9, 2013 01:08 AM

కాళోజీ కలగన్న తెలంగాణ

ఇవాళ్టికి కాళోజీకి నూరేండ్లు. ఆయన ‘నా గొడవ’ మొదటి ముద్రణ ఆవిష్కరణ జరిగి ఆరవై ఏళ్లు దాటింది. ఇంకా ఆంధ్రరాష్ట్రం ఏర్పడక ముందు 1953

Published: Wed,August 14, 2013 01:16 AM

కేఎంసీలో వికసించిన ఎర్రమందారం

కాటా నారాయణరావు ‘శబరి గోదారి’ (1986) కవితా సంకలనానికి ముందుమాట రాస్తూ కాళోజీ నారాయణరావు.. ‘1965 లో ప్రారంభమైన అలజడి (విశాఖ ఉక్కు

Published: Wed,June 19, 2013 12:59 AM

తీర్మానం చేయలేని అసెంబ్లీ ఓడిపోయింది చేరనివ్వని చలో గెలిచింది

అసెంబ్లీ అంటే పది మంది సమావేశమయ్యే స్థలం కదా మంది కూడా కాదు మన ప్రజావూపతినిధులు పదికోట్ల మంది పెట్టు.. పెట్టుకున్న సభ మన చె

Published: Fri,June 14, 2013 12:21 AM

ప్రజాస్వామ్యమా! పోలీసుస్వామ్యమా!!

శాసనసభాపతిగా కూడా వ్యవహరించి, విజయవంతంగా, సమర్థవంతంగా శాసనసభను నిర్వహించిన పేరు కూడా తెచ్చుకొని ముఖ్యమంత్రి అయిన కిరణ్‌కుమార్‌డ్

Published: Sun,May 26, 2013 12:54 AM

ఆంధ్ర సారస్వత పరిషత్ జ్ఞాపకాలు ...అనుబంధాలు

జాగీరు గ్రామమైన మా చిన్న పెండ్యాలలో నా బాల్యంలోనే నేను ఆంధ్ర సారస్వత పరిషత్తు పేరు వినడమే కాదు,అది మా విద్యాభివృద్ధిలో పాత్ర నిర్వ

Published: Sat,April 20, 2013 12:54 AM

ఇంద్రవెల్లి ఇంగలం

‘ఒక నిప్పురవ్వ దావానలమవుతుంది’ అనేమాట సామాన్యంగా ఒకచోట రగుల్కొన్న విప్లవం నలువైపులా విస్తరించడానికి అన్వయిస్తుంటారు. వైనాడ్ (కేరళ)

Published: Mon,April 1, 2013 12:37 AM

రాజ్యాంగమా? మతక్షిగంథాలా?

మన ప్రభుత్వాలు లౌకిక ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రకారం నడుస్తున్నాయని ఎవరికైనా భ్రమలుంటే వాటిని పటాపంచలు చేశాడు మన ముఖ్యమంత్రి కిరణ

Published: Fri,March 15, 2013 02:14 AM

వంజెం సోమయ్య జైలుడైరీ...

ఇది జైలు డైరీ కాదు... ఇది నిర్బంధ డైరీ... ఇది పోలీసు అక్రమ అరెస్టు డైరీ.. ఇది చిత్రహింసల డైరీ.. ఇది దాతు ఫిర్యాదులేని రాజ్యాంగం ప

Published: Wed,February 20, 2013 11:57 PM

నాటి మాటలు మరిచారా?

అధ్యక్షా! మన శాసనసభ కేంద్ర ప్రభుత్వానికి మరణశిక్షను రద్దు చేయవలసిందిగా రికమెండ్ చేస్తూ తీర్మానం చేయాలని ప్రతిపాదిస్తున్నా ను. పూర్

Published: Fri,February 15, 2013 11:28 PM

బతికించే వృత్తినుంచి ఉరికంబం దాకా..

అప్జల్‌గురు ప్రస్థానం అతని మాటల్లోనే... నేను పెరుగుతున్న కాలంలో కశ్మీర్ రాజకీయంగా కల్లోలంగా ఉన్నది. మక్బుల్‌భట్‌ను ఉరి తీశారు(198

Published: Sat,December 29, 2012 04:40 PM

డిసెంబర్ 6కు 20 ఏండ్లు

ఈ డిసెంబర్ 6కు (బాబ్రీమసీదు విధ్వంసం జరిగి) 20 ఏండ్లు నిండాయి. ఇరవైఏండ్లంటే ఇంచుమించు ఒక తరం మారింది. పి.వి.నర సింహా రావు నుంచి మన

Published: Wed,October 10, 2012 08:11 PM

‘తెలంగాణ మార్చ్’యే జవాబు

ముందు కొన్ని వాస్తవాలు చెప్పుకోవాలె. ఆ వాస్తవాలపై మన అభివూపాయా లు, వ్యాఖ్యలు ఏమైనా కావచ్చు. నెలవారీగా కేంద్ర హోంమంత్రి నిర్వహించే

Published: Sat,October 6, 2012 03:30 PM

పిల్లి మొగ్గలు ఎలుకల్ని పట్టడానికే

భాషలో తేడాయే తప్ప ప్రకాశ్‌సింగ్, కిషోర్‌చంవూదదేవ్, జైరాంరమేష్‌లు కూడా దళారీ పాలనలో భాగమైనంత కాలం చిదంబరం, రమణ్‌సింగ్, విజయ్‌కుమార్

Published: Sat,October 6, 2012 03:31 PM

ఆత్మావలోకనం

మార్క్సిజం పెట్టుబడిదారీ విధానాన్ని మట్టికాళ్ల మహారాక్షసి అంటుంది. ఆ మహారాక్షసి ఉక్కువేళ్లు మట్టిపొరలు చీల్చుకొని భూగర్భ జలాల్లోకి

Published: Sat,October 6, 2012 03:31 PM

విప్లవ దార్శనికుడు

‘చాటండి గళమెత్తి విప్లవదార్శనికుడు చారుమజుందార్ చచ్చిపోలేదని- కామ్రేడ్ చారుమజుందార్ చంపబడ్డాడని’ అంటూ చెరబండరాజు తన కవితా సంకలనం

Published: Sat,October 6, 2012 03:32 PM

ఆదివాసులకు న్యాయం దక్కేనా?

చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, సుక్మా, కాంకేర్ జిల్లాల్లో జూన్ 28,29 తేదీల్లో పోలీసులు మూడుచోట్ల అమాయకులైన 23మంది ఆదివాసీలను చంపారు. జ

Published: Sat,October 6, 2012 03:33 PM

అద్దంలో ‘విద్యార్థి ’ మాట

మొదట వరంగల్ ఆర్ట్స్‌కాలేజీ, తర్వాత ఉస్మానియా క్యాంపస్, రెండుచోట్ల చలం, శ్రీశ్రీ ఇచ్చిన మిత్రులు కాకుండా‘మివూతమండలి’ ఇచ్చిన మిత్రుల

Published: Sat,October 6, 2012 03:33 PM

జార్జ్ అడుగు జాడల్లో..

నేను జార్జిని చూసిన జ్ఞాపకం లేదు. కాని 1972 ఏప్రిల్ 14 సాయంకాలం నుంచి ప్రతి సాయం సంధ్యలోనూ ప్రతి ఉదయసంధ్యలోనూ ఆకాశంలోనే కాదు, నేలమ

Published: Sat,October 6, 2012 03:34 PM

విప్లవ స్వాప్నికుడు ‘అలిశెట్టి’

ఈసారి 2011 సెప్టెంబర్ 29న కామ్రేడ్ సూర్యం సంస్మరణ సభ గుంటూరులో అపూర్వంగా జరిగింది. నేను వెళ్లాల్సింది. ఆ సభ జరుపుతామని తెలిసినప్ప

Published: Sat,October 6, 2012 03:34 PM

దిక్కుల కూడలిలో ధిక్కార స్వరాలు...?

ఎందుకోసం వచ్చినా.. చెరబండరాజు పుట్టిన రోజు చర్చ మంచి కోసం ఉపయోగపడుతోంది. చెరబండరాజు కు సాహిత్య అకాడమీ నుంచి వచ్చిన సహాయాన్ని తన అవ

Published: Sat,October 6, 2012 03:35 PM

ఉద్యమ పంథా మారాలె

సకలజనుల సమ్మె స్వయంపాలనలో భాగంగా శాంతియుతంగా, రాజకీయాలకు అతీతంగా యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని ఒక్కతాటి మీదికి తీసుకురావడం ద్వారా ప్

Published: Sat,October 6, 2012 03:35 PM

కాళోజీ (అను) వాదం

‘నా భారతదేశయాత్ర’ డ్బై ఏళ్ల క్రితం (1941) కాళోజీ (నారాయణరావు)గారు అనువదించి, దేశోద్ధారక గ్రంథమాల పక్షాన వట్టికోట ఆళ్వారుస్వామిగారు

Featured Articles