నాటి మాటలు మరిచారా?


Wed,February 20, 2013 11:57 PM

kasab_guruఅధ్యక్షా! మన శాసనసభ కేంద్ర ప్రభుత్వానికి మరణశిక్షను రద్దు చేయవలసిందిగా రికమెండ్ చేస్తూ తీర్మానం చేయాలని ప్రతిపాదిస్తున్నా ను. పూర్వకాలంలో అనాది మానవులు నివసించేటప్పుడు, నాగరికత అభివృద్ధి చెందనప్పుడు, మానవునికి సాంకేతికపరమైన విషయాలతో సంబంధం లేనప్పుడు ఆదిమ కాలంలోనూ, ఆ తరువాత కొంతకాలంపాటు ఒక వ్యక్తిని మరొక వ్యక్తి చంపినప్పుడు ప్రాణానికి ప్రాణం, చెయ్యికి చెయ్యి, కన్ను తీసివేస్తే కన్ను అనే కక్ష సాధింపు ధోరణి ఉండేది.

కాలక్షికమేణా అనేక మార్పులు వచ్చాయి. ప్రపంచ దేశాలలో నాగరికత పెరిగిన తరువాత ప్రజలలోనూ రాజ్యాధినేతలలోనూ కూడా మార్పు రావడమూ సంభవించింది. కాలక్షికమేణా అనేక రకాలైన మార్పులు వచ్చాయి. మార్పులు వచ్చి ప్రపంచ దేశాలలో కూడా నాగరికత పెరిగిన తరువాత ప్రపంచ రాజ్యాలలో, ప్రజానీకంలో రాజ్యాధినేతలలో ఒక రకమైన మార్పు కూడా రావడం సంభవించింది. మరణశిక్షను పూర్తిగా రద్దు చేయాలని కొంతమంది, మరణశిక్షను కఠినంగా అమలు పరచాల ని కొంతమంది కోరుతున్నారు.

ఇటీవల రోజులలో లోకనాయక్ జయవూపకాష్ నారాయణ్, మన ప్రస్తుత విదేశాంగమంత్రి మరణశిక్ష రద్దుచేయాలని అభివూపాయాన్ని వ్యక్తం చేస్తూ, ప్రాణం తీయడం మంచిది కాదు అనే అభివూపాయానికి వచ్చారు. మానవతా దృష్టితో ఆలోచించినప్పుడు మనకు తెలుస్తుంది. ఆ మనిషి మానసికంగా మంచివాడుగా మారడానికి అవకాశం కల్పించకపోవడం వల్ల, సమాజానికి ఉపయోగపడే అవకాశం లేకుండాపోతుంది.

20 సంవత్సరాలు యావజ్జీవ కఠిన కారాగార శిక్షల్లో బాధపడేదానికన్నా ఒకసారి ప్రాణంపోతే మంచిది అంటారు. అట్లా కాకుండా వారికి మనస్సు మార్చుకునే అవకాశం కల్పించాలి. ఇప్పుడు మన భారత దేశం లో ఉన్న జైళ్లు మరణశిక్ష రద్దు చేస్తే వచ్చే పరిస్థితికి అనుకూలంగా మార్పు చేయాలి. ఇప్పుడు జైలులోకి వెళ్లిన వాళ్లు ఆ ప్రవృత్తిని పెంచుకోవడమే జరుగుతోంది గానీ, వారు మారడానికి అవకాశం దొరకడం లేదు. మన జైళ్లు రిఫార్మేటివ్‌గా లేవు. జైళ్లను కూడా సంస్కరించాలి. లోపల ఉండే వ్యక్తులను కూడా మార్గదర్శకులుగా చేసి క్రైం తగ్గేట్లు చేయాలి. మరణశిక్షను రద్దు చేయాలని ఈ సభ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి తెల్పడానికి తీర్మానం ప్రవేశపెడుతూ మిగతా సభ్యులందరిని కూడా దీనిని బలపరచవలసిందిగా కోరుతున్నాను.

(1978 మార్చి 31న రాష్ట్ర అసెంబ్లీలో మరణశిక్ష రద్దును కోరుతూ జరిగినచర్చలో వెంకయ్యనాయుడు ప్రసంగ పాఠంలోని కొంత భాగం)

హైదరాబాద్‌లో ఫిబ్రవరి 10వ తేదీన ఒక మీడియా సమావేశంలో రాజ్యసభ బిజెపి సభ్యుడు ఎం. వెంకయ్య నాయుడు గారు ‘ఉరి తీస్తే నిరసనా’ అని మాట్లాడిన అంశాలు కొంచెం ఆలస్యంగా నా దృష్టికి వచ్చాయి అందులో మానవహక్కుల సంఘాల ముసుగులో ఉన్న దానవ హక్కుల సంఘాలు అని పేర్కొనడానికి ఆ సంఘాలు స్పందిస్తాయి గానీ వెంకయ్య నాయుడుగారి ప్రాసలతో కూడిన ప్రసంగాలను దాదాపు ముప్ఫై ఐదేళ్లుగా వింటున్న నాకు వింత అనిపించలేదు.కాకపోతే అభివూపాయాలు ప్రకటించే హక్కు ఎవరికైనా ఉంటుంది గానీ వాస్తవాలు వక్రీకరించే అధికారం ఎవరికీ ఉండదు. నేను పౌరహక్కుల సంఘం నేతను కాను. విప్లవ రచయితల సంఘం సభ్యుణ్ని. ఎమ్జన్సీలో సికిందరాబాద్ జైల్లో మేము ఒక చోట డిటెన్యూలుగా ఉన్నప్పటికే ఆయనకా విషయం తెలుసు.

అట్లాగే 1972 నుంచి, ముఖ్యంగా ఎమ్జన్సీ (1975-77) కాలం నుంచి ఉరిశిక్షలపై వెంకయ్య నాయుడు గారి అభివూపాయాలు కనీసం 1978 వరకు మారలేదు. ఆయన ఆంధ్రవూపదేశ్ శాసనసభలో 31 మార్చ్ 1978 న ‘మన శాసన సభ కేంద్ర ప్రభుత్వానికి మరణశిక్షను రద్దు చేయావలసిందిగా రికమెండ్ చేస్తూ తీర్మానం చేయాలని’ ప్రతిపాదించాడు. (చూ. వెంకయ్యనాయుడు ప్రధాన ప్రసంగాలు- అలుపెరుగని గళం- విరామమెరుగని పయనం. అలకనంద ప్రచురణలు విజయవాడ .పే.299) అభివూపాయాలు మారవచ్చు. ఒపీనియన్స్ మార్చుకోవడం పాలిటీషియన్స్ లక్షణం అని గిరీశం’ చెప్ప నే చెప్పాడు. పచురణార్థం ఆ ప్రసంగ పూర్తి పాఠాన్ని జతపరుస్తున్నాను.)

1972 నుంచి మన ప్రధాన రాజకీయ పార్టీల అభివూపాయాలు మరణశిక్ష గురించి ఎట్లా మారుతూ వచ్చాయో చూడండి. అప్పటి సిపిఐ ఎంఎల్ నాయకుడు నాగభూషణ్ పట్నాయక్‌కు ఉరిశిక్ష పడితే ఒరిస్సా మాజీ ముఖ్యమంత్రి నవకృష్ణ చౌదరి మాలతీ చౌధురితో కలసి ఉరిశిక్ష రద్దు కోసం పెద్ద ఉద్యమమే చేశాడు. వెన్నెలకంటి రాఘువయ్య గారి పూనికతో రాష్ట్రపతి వివిగిరి 72 ఆగస్టు 15 సందర్భంగా ఆ ఉరిశిక్షను రద్దు చేసి యావజ్జీవశిక్షగా మార్చాడు.

అప్పటి మరో కాంగ్రెస్ నాయకుడు ఎస్. జయపాల్‌డ్డి భూమయ్య, కిష్టాగౌడ్‌ల ఉరిశిక్ష రద్దు కోసం కూడా చాల కృషి చేశాడు. భూమయ్య కిష్టాగౌడ్‌ల ఉరిశిక్ష రద్దు కోసం దేశవ్యాప్తంగా జయవూపకాశ్ నారాయణ్ నాయకత్వంలో అటల్ బిహారీ వాజపేయి తాను ఎమ్జన్సీలో అరెస్ట్‌య్యేదాకా కూడా ఎపిసిఎల్‌సి ప్రధానకార్యదర్శి పత్తిపాటి వెంక జార్జి ఫెర్నాండెజ్‌లకు అండగా డిమాండ్ చేశాడు. ఢిల్లీ బోటు క్లబ్ దగ్గర వీళ్లంతా కలిసి ఉరిశిక్షల రద్దు కోసం తలపెట్టిన కాగడాల ప్రదర్శన ఎమ్జన్సీ విధించడంతో ఆగిపోయింది. ఎమ్జన్సీ చీకటిరోజుల్లో డిసెంబర్ 1న భూమయ్య కిష్టాగౌడ్‌లను సికిందరాబాద్ జైల్లో ఉరి తీశారు. అప్పుడు వెంకయ్య నాయుడుగారు ఆ జైల్లోనే ఉన్నారు, ఆ విష యం ప్రస్తావించి తనకు రాజకీయ అభివూపాయ భేదమున్నా తాను వాళ్ల ఉరిశిక్ష రద్దు కోరానని తన ఈ శాసనసభ ప్రసంగంలో చెప్పారు కూడా.

కాంగ్రెస్ బిజెపిల వైఖరి మరణశిక్షల విషయంలో 1984 పిబ్రవరి 11న మఖ్బూల్‌భట్ ఉరిశిక్ష దగ్గర్నించి మారిందని అనుకోవల్సి ఉంటుంది. ఇందిరాగాంధీ అయితేనేమో ఒక వైపు స్పెయిన్‌లో ఉరిశిక్షలు పడిన ఐదుగురు యువకుల ఉరిశిక్షలు రద్దు చేయమని నియంత ఫ్రాంకోకు విజ్ఞప్తి చేస్తుంది గానీ (ఇప్పటికీ ఇండియాలో అన్ని రాజకీయపార్టీలు పాకిస్థాన్‌లో సరబ్‌జిత్‌సేన్ ఉరిశిక్ష రద్దు చేయాలనే డిమాండ్ చేస్తా యి. భూల్లార్ ఉరిశిక్ష రద్దు చేయాలన్న అకాలీదళ్ డిమాండ్‌ను బిజెపి బలపరుస్తుం ది.) తాను మాత్రం భూమయ్య, కిష్టాగౌడ్‌లను ఉరి తీయడానికి ముఖ్యమంత్రి జలగం వెంగళరావును ఆదేశిస్తుంది.

ఈ ద్వంద్వ నీతి కాంగ్రెస్‌కు నెహ్రూ కాలం నుంచీ ఉన్నది. ఇంకా ముందు నుంచే ఉన్నది. గాంధీజీ భగత్‌సింగ్, రాజగురు, సుఖదేవ్‌ల మరణశిక్షపై మౌనం వహించాడు. నెహ్రూ కయ్యూరు కామ్రేడ్స్‌ను 1946లోనే ఉరి తీశాడు. (కన్నడ రచయిత నిరంజన ‘చిరస్మరణ’ నవల చదవండి)
ఇంక మఖ్బూల్‌భట్ ప్రస్తావన వచ్చింది కనుక నేను కశ్మీరు పోలిక తెచ్చి తెలంగాణ ప్రజలను అవమానపరచానని వెంకయ్య నాయుడు అన్నారు గనుక ఆ చరివూతలోకి వెళ్లాలి. మఖ్బూల్ భట్ కశ్మీర్ స్వయం నిర్ణయాధికారం కోసం ‘ఆజాద్ కాశ్మీర్’ కోసం ఉరికంబం ఎక్కాడు.

భారత ఉప ఖండంలో ఉన్న ఐదు వందల సంస్థానాల్లో అతిపెద్ద సంస్థానం హైదరాబాదు, జమ్మూ-కశ్మీరు రెండు కూడా 1947 ఆగస్టు 15న ఇండియన్ యూనియన్‌లో విలీనం కావడానికి అంగీకరించలేదు. రెండుచోట్ల ఇండియన్ యూనియన్ సైన్యాలు అక్రమించుకొని కలిపేసుకున్నాయి. (కేంద్ర ప్రభుత్వమే వాడిన మాట-ఎనెక్స్-అంటే కలిపేసుకోవడం) రెండు చోట్ల రాజులు ప్రలోభంతో, భయంతో అంగీకరించారు. కశ్మీర్‌లో మాత్రం ప్లెబిసైట్ నిర్వహిస్తానని స్వయంగా ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఐక్యరాజ్యసమితికి విన్నవించాడు. అది ఇవ్వాల్టికీ జరగలేదు. కశ్మీరీ ప్రజలు సాయుధంగా పోరాడారు. శాంతియుతంగా పోరాడుతున్నారు. కశ్మీర్ గత అరవై ఏళ్లకు పైగా సైనిక దురాక్షికమణలో ఉన్నది.

ఇది చరిత్ర. విప్లవరచయితగా నేను కశ్మీరీ ప్రజల స్వయం నిర్ణయాధికార హక్కును గౌరవిస్తూ బలపరుస్తున్నాను. తెలంగాణ ప్రజల స్వయం నిర్ణయాధికార హక్కు ఉన్నదని, అయితే తెలంగాణ ప్రజలు ఇండియాలో భాగంగానే ఒక రాష్ట్రాన్ని కోరుతున్నారని, అందుకు పార్లమెంట్‌లో బిల్లు పెట్టాలని నేను తెలంగాణ విద్యావంతుల వేదిక సభలో పోలిక తెచ్చాను. పోలిక 1948 వరకు కశ్మీరు, తెలంగాణ ఢిల్లీ పాలనలో లేవని పోలిక పోరాటాలకు, తెలంగాణ విముక్తి కోసం సాయుధపోరాటం కూడా చేసింది. ప్రస్తుతం తెలంగాణ ఇండియన్ యూనియన్‌లో తన కు రాష్ట్ర ప్రతిపత్తి కావాలని కోరుకుంటున్నది. పోరాటపటిమ విషయంలో తెలంగాణను ఇవ్వాళ కొత్తగా కాదు నేను ఎప్పుడూ పాలస్తీనా, కశ్మీరులతో పోలుస్తూ ఉంటాను.

తెలంగాణ ప్రజల పోరాట శక్తి సమ్మక్క సారలక్కల కాలం నుంచి రుజువవుతున్న ప్రజావూపత్యామ్నాయ రాజకీయమని చెప్తూ ఉంటాను. నేను ‘తెలంగాణ ప్రజలను అవమానపరిచే రీతిలో మాట్లాడానని వెంకయ్యనాయుడు గారు (ఆయనకెప్పటి నుంచి తెలంగాణ ప్రజలపై ప్రేమ?!) రెచ్చగొడితే రెచ్చిపోవడానికి తెలంగాణ ప్రజలు తెలివి తక్కువ వాళ్లు కాదు. ఈ కుట్ర పూరిత ధూర్తవక్షికీకరణలు తెలంగాణ ప్రజలు విశ్వసించరు. సహించరు ‘తెలంగాణ ప్రజలు అభివృద్ధి కోసం’ మాత్ర మే కాదు. ఆత్మగౌరవం కోసం, స్వావలంబన కోసం, స్వపరిపాలన కోసం ప్రత్యేక రాష్ట్రాన్ని ఆకాంక్షిస్తూ పోరాడుతున్నారు. తెలంగాణ సాధించుకొని తీరుతారు. కాకపోతే నేను వెంకయ్యనాయుడు గారివలె కశ్మీరీ ప్రజలను అవమానపరచలేను. కశ్మీ రీ ప్రజల స్వయం నిర్ణయాధికార పోరాటం పట్ల నాకు, నా తెలంగాణ ప్రజల స్వయం నిర్ణయాధికార పోరాటం పట్ల ఉన్నంత గౌరవం ఉన్నది.

అందుకే వెయ్యిమంది తెలంగాణ యువకుల, విద్యార్థుల ఆత్మహత్యలు కేంద్ర ప్రభుత్వ హత్యలన్నాను. అఫ్జల్‌గురు ఉరిశిక్షను ఖండించాను. కశ్మీరు, తెలంగాణలకు శత్రువు ఢిల్లీయేనన్నదే నా అవగాహన. కశ్మీరు లోయకు దక్కన్ పీఠభూమికీ శత్రువొక్కడే వాడు ఢిల్లీలో ఉన్న అమెరికా కీలుబొమ్మ శ్రీనగర్‌లో గోల్ఫ్‌క్లబ్‌లోను హైదరాబాద్‌లోని సచివాలయంలోను వాని తైనాతీలున్నారు. మానుకోట లో మనం విసిరిన రాయి కశ్మీరులో వాళ్లు విసిరిన రాయి గురి చూసిన శత్రువువాడే వానితో కలిసి తలపడదాం రండి. సుప్రీంకోర్టు మరణశిక్షను ఖాయం చేసి, రాష్ట్రపతి కూడా క్షమాభిక్షను తిరస్కరించినాకనే కదా వాజపేయి అయినా, వెంకయ్యనాయుడై నా భూమ య్య, కిష్టాగౌడ్‌ల ఉరిశిక్షలు రద్దు చేయాలని విజ్ఞప్తి చేసింది.

ఆ ఉరి శిక్ష ల అమలును తప్పు పట్టింది. మౌలికంగా నే మరణశిక్షను కేంద్రవూపభుత్వం రద్దు చేయాలని శాసనసభలో ప్రతిపాదించిన వెంకయ్యనాయుడు గారు ఎప్పుడూ బాధ్యతగల స్థానాల్లోనే ఉంటున్నారు గనుక అది అఫ్జల్‌గురు విషయంలోనే కాదు. ఎవరి విషయంలోనయి నా అడగాల్సే ఉంటుంది. అయితే ఆరంభంలోనే చెప్పినట్లు 1984 నుంచి ఈ విషయంలో కాంగ్రెస్, బిజెపిల వైఖరి మారడ మే కాదు, ఒకటిగానే ఉంటున్నాయి. బాబ్రీమసీదు విధ్వంసం, గుజరాత్ మారణకాం డ తర్వాత బిజెపి నుంచి గానీ, వెంకయ్యనాయుడు గారి నుంచి అటువంటి వైఖరిని ఆశించడం అవగాహనారాహిత్యమవుతుం ది. ‘మానవభక్షకులు, ఉగ్రవాదులు’ ఎవరో 2001లో గుజరాత్‌లో చూసాం. అంతకు ముందు బొంబాయి, సూరత్‌లలో 1992 లో చూశాం. మాలెగావ్ నుంచి మక్కామసీదు పేలుళ్ల దాక చూస్తూనే ఉన్నాం.

1984లో పంజాబ్ మొదలు ఇటీవల శ్రీలంక దాకా ఈ విషయంలో బీజేపీతో పోటీ పడగలిగిందీ, అధిగమించగలిగిందీ ఎక్కువ కాలం అధికారంలో ఉండగలిగిందీ ఒక్క కాంగ్రెస్ పార్టీయే.(మత కలహాల చిచ్చుకు కాంగ్రెస్ కన్నతల్లి అని వాజపేయ్ ఏనాడో అన్నాడు. 1984 సిక్కుల ఊచకోత తర్వాత విరసం కవి విమల ‘కన్నతల్లి’ అని ఒక ఉద్విగ్నమైన దీర్ఘకవిత రాసింది) 2004 నుంచి ‘సాల్వాజుడుం’ రూపకల్పనతో బిజెపి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రతిపక్ష సహకారంతో ఛత్తీస్‌ఘడ్‌లో చేసిన దురంతాలు సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ఇప్పుడు ప్రపంచానికంతా తెలుసు
-వరవరరావు

35

VARAVARA RAO

Published: Wed,February 19, 2014 12:14 AM

ఈ బొమ్మకింక.. ప్రాణం పోయాలి!

ఎన్నాళ్లుగా నీ బొమ్మ గీయాలని.. ప్రయత్నిస్తున్నాను ఎన్నో పోరాటాల జ్ఞాపకాల కన్నీళ్లతో తడిసి నెత్తురు చింది అది చెరిగిపోయేది సాయు

Published: Tue,November 5, 2013 11:56 PM

దాశరథి దేశకాలాలు వెలుగు చీకటి జ్ఞాపకాలు

నా పదమూడో ఏటనే దాశరథి (కృష్ణమాచార్య)తో పరోక్ష పరిచయం, ప్రత్యక్ష పరిచయంగానే కాదు స్నేహంగా కూడా అంత సులభంగా సాధ్యమవుతుందని నేనూహిం

Published: Mon,September 9, 2013 01:08 AM

కాళోజీ కలగన్న తెలంగాణ

ఇవాళ్టికి కాళోజీకి నూరేండ్లు. ఆయన ‘నా గొడవ’ మొదటి ముద్రణ ఆవిష్కరణ జరిగి ఆరవై ఏళ్లు దాటింది. ఇంకా ఆంధ్రరాష్ట్రం ఏర్పడక ముందు 1953

Published: Wed,August 14, 2013 01:16 AM

కేఎంసీలో వికసించిన ఎర్రమందారం

కాటా నారాయణరావు ‘శబరి గోదారి’ (1986) కవితా సంకలనానికి ముందుమాట రాస్తూ కాళోజీ నారాయణరావు.. ‘1965 లో ప్రారంభమైన అలజడి (విశాఖ ఉక్కు

Published: Wed,June 19, 2013 12:59 AM

తీర్మానం చేయలేని అసెంబ్లీ ఓడిపోయింది చేరనివ్వని చలో గెలిచింది

అసెంబ్లీ అంటే పది మంది సమావేశమయ్యే స్థలం కదా మంది కూడా కాదు మన ప్రజావూపతినిధులు పదికోట్ల మంది పెట్టు.. పెట్టుకున్న సభ మన చె

Published: Fri,June 14, 2013 12:21 AM

ప్రజాస్వామ్యమా! పోలీసుస్వామ్యమా!!

శాసనసభాపతిగా కూడా వ్యవహరించి, విజయవంతంగా, సమర్థవంతంగా శాసనసభను నిర్వహించిన పేరు కూడా తెచ్చుకొని ముఖ్యమంత్రి అయిన కిరణ్‌కుమార్‌డ్

Published: Sun,May 26, 2013 12:54 AM

ఆంధ్ర సారస్వత పరిషత్ జ్ఞాపకాలు ...అనుబంధాలు

జాగీరు గ్రామమైన మా చిన్న పెండ్యాలలో నా బాల్యంలోనే నేను ఆంధ్ర సారస్వత పరిషత్తు పేరు వినడమే కాదు,అది మా విద్యాభివృద్ధిలో పాత్ర నిర్వ

Published: Sat,April 20, 2013 12:54 AM

ఇంద్రవెల్లి ఇంగలం

‘ఒక నిప్పురవ్వ దావానలమవుతుంది’ అనేమాట సామాన్యంగా ఒకచోట రగుల్కొన్న విప్లవం నలువైపులా విస్తరించడానికి అన్వయిస్తుంటారు. వైనాడ్ (కేరళ)

Published: Mon,April 1, 2013 12:37 AM

రాజ్యాంగమా? మతక్షిగంథాలా?

మన ప్రభుత్వాలు లౌకిక ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రకారం నడుస్తున్నాయని ఎవరికైనా భ్రమలుంటే వాటిని పటాపంచలు చేశాడు మన ముఖ్యమంత్రి కిరణ

Published: Thu,March 21, 2013 12:13 AM

‘కుక్క’ల్లో వార్త

‘వార్తల్లో కుక్క’ అనాలి. కాని అపుడది వార్త కాదు. రిపోర్టింగ్‌లో ప్రవేశించిన ప్రతి ఒక్కరికీ మీడియా అనుభవజ్ఞులు ఏది వార్త అవుతుందో,

Published: Fri,March 15, 2013 02:14 AM

వంజెం సోమయ్య జైలుడైరీ...

ఇది జైలు డైరీ కాదు... ఇది నిర్బంధ డైరీ... ఇది పోలీసు అక్రమ అరెస్టు డైరీ.. ఇది చిత్రహింసల డైరీ.. ఇది దాతు ఫిర్యాదులేని రాజ్యాంగం ప

Published: Fri,February 15, 2013 11:28 PM

బతికించే వృత్తినుంచి ఉరికంబం దాకా..

అప్జల్‌గురు ప్రస్థానం అతని మాటల్లోనే... నేను పెరుగుతున్న కాలంలో కశ్మీర్ రాజకీయంగా కల్లోలంగా ఉన్నది. మక్బుల్‌భట్‌ను ఉరి తీశారు(198

Published: Sat,December 29, 2012 04:40 PM

డిసెంబర్ 6కు 20 ఏండ్లు

ఈ డిసెంబర్ 6కు (బాబ్రీమసీదు విధ్వంసం జరిగి) 20 ఏండ్లు నిండాయి. ఇరవైఏండ్లంటే ఇంచుమించు ఒక తరం మారింది. పి.వి.నర సింహా రావు నుంచి మన

Published: Wed,October 10, 2012 08:11 PM

‘తెలంగాణ మార్చ్’యే జవాబు

ముందు కొన్ని వాస్తవాలు చెప్పుకోవాలె. ఆ వాస్తవాలపై మన అభివూపాయా లు, వ్యాఖ్యలు ఏమైనా కావచ్చు. నెలవారీగా కేంద్ర హోంమంత్రి నిర్వహించే

Published: Sat,October 6, 2012 03:30 PM

పిల్లి మొగ్గలు ఎలుకల్ని పట్టడానికే

భాషలో తేడాయే తప్ప ప్రకాశ్‌సింగ్, కిషోర్‌చంవూదదేవ్, జైరాంరమేష్‌లు కూడా దళారీ పాలనలో భాగమైనంత కాలం చిదంబరం, రమణ్‌సింగ్, విజయ్‌కుమార్

Published: Sat,October 6, 2012 03:31 PM

ఆత్మావలోకనం

మార్క్సిజం పెట్టుబడిదారీ విధానాన్ని మట్టికాళ్ల మహారాక్షసి అంటుంది. ఆ మహారాక్షసి ఉక్కువేళ్లు మట్టిపొరలు చీల్చుకొని భూగర్భ జలాల్లోకి

Published: Sat,October 6, 2012 03:31 PM

విప్లవ దార్శనికుడు

‘చాటండి గళమెత్తి విప్లవదార్శనికుడు చారుమజుందార్ చచ్చిపోలేదని- కామ్రేడ్ చారుమజుందార్ చంపబడ్డాడని’ అంటూ చెరబండరాజు తన కవితా సంకలనం

Published: Sat,October 6, 2012 03:32 PM

ఆదివాసులకు న్యాయం దక్కేనా?

చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, సుక్మా, కాంకేర్ జిల్లాల్లో జూన్ 28,29 తేదీల్లో పోలీసులు మూడుచోట్ల అమాయకులైన 23మంది ఆదివాసీలను చంపారు. జ

Published: Sat,October 6, 2012 03:33 PM

అద్దంలో ‘విద్యార్థి ’ మాట

మొదట వరంగల్ ఆర్ట్స్‌కాలేజీ, తర్వాత ఉస్మానియా క్యాంపస్, రెండుచోట్ల చలం, శ్రీశ్రీ ఇచ్చిన మిత్రులు కాకుండా‘మివూతమండలి’ ఇచ్చిన మిత్రుల

Published: Sat,October 6, 2012 03:33 PM

జార్జ్ అడుగు జాడల్లో..

నేను జార్జిని చూసిన జ్ఞాపకం లేదు. కాని 1972 ఏప్రిల్ 14 సాయంకాలం నుంచి ప్రతి సాయం సంధ్యలోనూ ప్రతి ఉదయసంధ్యలోనూ ఆకాశంలోనే కాదు, నేలమ

Published: Sat,October 6, 2012 03:34 PM

విప్లవ స్వాప్నికుడు ‘అలిశెట్టి’

ఈసారి 2011 సెప్టెంబర్ 29న కామ్రేడ్ సూర్యం సంస్మరణ సభ గుంటూరులో అపూర్వంగా జరిగింది. నేను వెళ్లాల్సింది. ఆ సభ జరుపుతామని తెలిసినప్ప

Published: Sat,October 6, 2012 03:34 PM

దిక్కుల కూడలిలో ధిక్కార స్వరాలు...?

ఎందుకోసం వచ్చినా.. చెరబండరాజు పుట్టిన రోజు చర్చ మంచి కోసం ఉపయోగపడుతోంది. చెరబండరాజు కు సాహిత్య అకాడమీ నుంచి వచ్చిన సహాయాన్ని తన అవ

Published: Sat,October 6, 2012 03:35 PM

ఉద్యమ పంథా మారాలె

సకలజనుల సమ్మె స్వయంపాలనలో భాగంగా శాంతియుతంగా, రాజకీయాలకు అతీతంగా యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని ఒక్కతాటి మీదికి తీసుకురావడం ద్వారా ప్

Published: Sat,October 6, 2012 03:35 PM

కాళోజీ (అను) వాదం

‘నా భారతదేశయాత్ర’ డ్బై ఏళ్ల క్రితం (1941) కాళోజీ (నారాయణరావు)గారు అనువదించి, దేశోద్ధారక గ్రంథమాల పక్షాన వట్టికోట ఆళ్వారుస్వామిగారు

Featured Articles