డిసెంబర్ 6కు 20 ఏండ్లు


Sat,December 29, 2012 04:40 PM

ఈ డిసెంబర్ 6కు (బాబ్రీమసీదు విధ్వంసం జరిగి) 20 ఏండ్లు నిండాయి. ఇరవైఏండ్లంటే ఇంచుమించు ఒక తరం మారింది. పి.వి.నర సింహా రావు నుంచి మన్మోహన్‌సింగ్ దాక కేంద్రంలో కాంగ్రెస్ పయనించింది. చట్ట పరిభాషలో విధ్వంసానికి వీళ్లను సహాయకులు (అబెటర్స్) అనవచ్చు. విధ్వంస కారుల నాయకత్వం లాల్‌కృష్ణ అద్వానీ నుంచి నరేంద్రమోడీ దాక ‘పరి ణతి’ చెందింది. చార్‌మినార్, చార్‌మినార్‌లో మసీదు, చార్‌మినార్ పక్కన భాగ్యలక్ష్మీ దేవాలయం అనే ప్రస్తుత వివాద సందర్భంలో చూసినపుడు ఈ నాయకత్వం వెంకయ్యనాయుడు నుంచి కిషన్‌రెడ్డి దాక మన రాష్ట్రంలో ‘పునరు జ్జ్జీవనం’ పొందింది. సామెత చెప్పినట్లు ఈ మధ్యకాలంలో వంతెన కింద చాల నెత్తురు ప్రవహించింది. ఈవంతెన తరాల మధ్య ‘వారధి’ అనుకుంటే ఈ తరా లు చాలా నెత్తుటి ప్రవాహానికి వాహికలు అయినవి. పదేండ్లు తిరిగే వరకు గుజరాత్ లో నరేంద్రమోడీ ప్రభుత్వం గోద్రా రైలు నెపంతో ‘నరసంహారం’ చేసింది. ‘నరోద్‌పాటియా’ తీర్పు సందర్భంగా న్యాయస్థానం కూడా ఈ విషయాన్నే వ్యాఖ్యానించింది. ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా సాయి బాబా గుడిపేలుళ్లు, మక్కామసీదు పేలుళ్లు అన్నింట్లోనూ హైదరాబాద్ పాతబస్తీ ముస్లిం యువకులను దోషులుగా చూపడం, చివరకి కోర్టులలో ఆ బాంబులు పేల్చిన వాళ్లు, ‘హిందూవాహిని’ పేరుతో ఊరే గుతున్న హిందుత్వ మిలి టెంట్లేనని తేలడం ఇదంతా మనకండ్ల ముందరి చరిత్రే.
ఒక దశాబ్దం నుంచి ‘హిందూవాహిని’ పేరుతో హిందుత్వ శక్తు లు బాంబులు తయారుచేసి దేశమంతటా ముస్లింలపై దాడులు చేసే మిలిటెంట్ చర్యలకు పూనుకుంటున్నట్లు కోర్టులలో కూడా రుజువు అవుతున్నది.

మహారాష్ట్రలో మాలేగావ్‌లో, హైదరాబాద్ మక్కామసీదు లో ఈ బాంబుపేలుళ్ల చర్యలతో హిందుత్వశక్తులు జైళ్లకు వెళ్లాయి. వీరికి బాంబు లు తయారు చేసి మారణాయుధాలు సరఫరా చేయటంలో సైన్యంలో పనిచేసిన వారి సహాయం కూడా లభించిందనే విషయం న్యాయస్థానాల ముందర వెల్ల డైంది. అయినా మక్కామసీదు పేలుళ్ల సందర్భం తీసుకుంటే శుక్రవారం రోజు ‘నమాజ్’ సమయంలో జరిగిన పేలుళ్లలో మరణించింది పేద ముస్లింలే. పోలీ సుల కాల్పుల్లో హతులువాళ్లే. అనుమానితులుగా అరెస్టయి మొదట ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గింది వాళే.్ల హిందుత్వవాహిని కార్యకర్తలు పట్టుబడి నేరస్తులుగా రుజువు అయినాక గానీ వీళ్లు నిర్దోషులుగా విడుదల కాలేదు. వీళ్లకు ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది, కానీ ఇప్పటికీ పాతబస్తీలో వీరికి సంబంధించిన ఇరవై కుటుంబాలు ఒక రకమైన సాంఘిక వెలిని అనుభవిస్తున్నాయి. యువకు లకు ఉద్యోగాలురావు. ఉపాధి దొరకదు, వివాహాలు కావు. ఇటువంటి యువకు లే మళ్లీ నేరారోపణలతో జైలు పాలైతే ఏ శిక్షాస్మృతిలో కూడా లేని ఐ.ఎస్.ఐ (పాకిస్తాన్ ప్రభుత్వ నిఘా సంబంధ) ఖైదీల బ్యారక్ పేరిట ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆవరణలో ఉంచుతారు. జైళ్ల సిబ్బందీ వాళ్లను విదేశీ ఏజెంట్లుగా చూస్తా రు. ఆ యువకుల కోసం ‘ములాకత్’కు వచ్చే తల్లులను, రక్తబంధువులను దేశ ద్రోహుల తల్లులుగా, రక్తబంధువులుగానే చూస్తారు. హైదరాబాద్ సంస్కృతి లో భాగమైన ముఖ్యంగా హైదరాబాద్ తెహజీబ్‌లో గణనీయమైన పాత్ర నిర్వహించి న ముస్లిం సమాజ వర్తమానమిది.

ఈ నేపథ్యంలో చార్‌మినార్ పక్క న భాగ్య లక్ష్మీ దేవాలయం ఉన్నదంటూ ఒక నిర్మాణాన్ని హిందుత్వశక్తులు రోజు రోజుకు పెంచడం ప్రారంభించారు. ఇటువంటి ప్రయత్నాలు సంఘ్ పరివార్ బలపడటా నికి, బలపడే క్రమంలో బషీర్‌బాగ్‌లో కానీ, మరొకచోట గానీ నిర్మాణాలు జరగ డం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం చార్‌మినార్ విషయాని కి పరిమిత మైతే.. చార్‌మినార్ 430 సంవత్సరాల క్రితం ఆ ప్రాంతమంతాట ‘ప్లేగు’ వ్యాధి వ్యాపిం చి చాలామంది మరణిస్తే వాళ్ల జ్ఞాపకార్థం మహమ్మద్ కులీకుతుబ్‌షా 1991లో నిర్మించిన ఒక చారిత్రక స్మారక చిహ్నం. 1991-92 మధ్యకాలంలోనే ఈ చార్‌మినార్ రెండో అంతస్థులో ఒక మసీదు కూడా నిర్మాణం చేశారు. ఈ తాజీబ్ కులీకుతుబ్‌షా కళాబిరుచికి ప్రతీకగా నిలుస్తుంది. మొహర్రం రోజున సుల్తాన్ ఇక్కడ ప్రార్ధన చేసేవాడని చెప్పుకుంటారు. ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండి యా ప్రకారం చార్‌మినార్ కట్టడం ఒక మదర్‌సా, ఒక మసీదు. 1956లో ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడిన తర్వాత 1958 లో అర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చార్‌మినార్‌ను స్వాధీనం చేసుకొని అక్కడి మసీదును, మదర్‌సాను మూసివేసిం ది. ఆ మసీదులో ముస్లింలను నమాజ్ చేసుకోవడానికి అనుమతిం చాలని ఎ.ఎన్.ఐ (ఆర్కియాలాజీ ఆఫ్ ఇండియా)ని కోరినపుడు చార్‌మినార్ పరిరక్షణ బాధ్యతలు తాము చేపట్టినపుడు అక్కడ ప్రార్థనలు జరగడం లేదనీ, కాబట్టి అక్కడ ముస్లింలను ప్రార్థనకు అను మతించడం సాధ్యంకాదని తేల్చిచెప్పింది.

1987లో నలుగురు అమ్మాయిలు చార్‌మినార్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఈ రెండో అంతస్తుపైకి సందర్శకుల ప్రవేశాన్ని నిషేధించారు. ఇది 25ఏళ్ల కిందటి చరిత్ర. హిందుత్వ రాజ్యానికి ఉద్దేశపూర్వకంగా విస్మృతి లో భాగమైపోయింది. ఈ నిర్మాణం పూర్తిగా గ్రానైట్ రాళ్లతో జరిగింది. ఒకేసారి 45 మంది ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా ఉంది. ఈ మసీదుకు వెళ్లాలంటే చార్‌మినార్ పైకి 75 మెట్లెక్కి పైకిపోవాలి. ఈ మసీదు వెలుపలి భాగంలో 1889 లో ఏర్పాటు చేసిన గడియారాలు నమాజ్ సమయాన్ని తెలియజేసేవని చెపుతా రు. ఈ విశేషాలన్నీ విస్మృతికిలోనై ఇప్పుడు ఇక్కడ చార్‌మినార్ పక్కన ఒక భాగ్యలక్ష్మీ దేవాలయం ఉందని, చార్‌మినార్ ఒక పార్శం మూసుకపోయేట ట్లుగా హిందుత్వశక్తులు నిర్మాణం ప్రారంభించాయి. ఈ భాగ్యలక్ష్మియే కులీకుతు బ్‌షా ప్రేమించి పెళ్లాడిన బాగమతి అని ఇప్పుడు చంచల్‌గూడ ప్రాంత పు అప్పటి చెంచు మహిళ పేరును సంస్కృతీకరించారు. బాగమతి భాగ్యలక్ష్మి కావ డం అసంబద్ధమైన విషయం. బాగమతి చారిత్రక వ్యక్తి. ముస్లింరాజు ఆమె ను ప్రేమించాడు. ఆమెను కలుసుకోవడానికి గొల్కొండ నుంచి వరదలెత్తుతు న్నా మూసీనదిని కూడా యీది వచ్చాడు. ఆమెను పెళ్లాడాడు. ఆమె పేరిట ఒక నగరా న్నీ నిర్మించాడు. హిందూ-ముస్లిం మత సామరస్యానికి, ప్రేమకు ఒక అపూర్వ మైన సందర్భంగా ఇప్పటికీ మనం స్మరించుకుంటున్నాం. అటువంటి బాగమతి ని ఒక హిందూ దేవతను చేసి ఆమె పేరిట మత విద్వేషాలు రెచ్చగొట్టే కుట్ర ఒకటి జరుగుతున్నది. దీనికి ఈ విషయంలో ‘ఎ.ఎన్.ఐ’ ఉదాసీనమైన నిష్క్రియతను ప్రదర్శిస్తుంటే కోర్టులు ‘స్టే’లు విధించిస్తున్నాయి.

బాబ్రీమసీదులో రాంలల్లా విగ్రహాల పూజ జరిగేదని 1984లో రాజీవ్‌గాంధీ అధికారంలోకి రాగానే ప్రారంభమైన కుట్ర, 92 నాటికి బాబ్రీమసీదు విధ్వంసా నికి దారి తీసింది. ప్రధానిగా రాజీవ్ ద్వారాలు తెరిపించి హిందుత్వశక్తులతో అక్కడ పెట్టిన రాంలల్లాకు పూజలు జరిపించాడు. అద్వానీ అక్కడ రామమంది రం నిర్మాణం చేస్తామని రథయాత్రలు చేసాడు. ‘ఏకాత్మతా’ యజ్ఞం పేరుతో దేశమంతా రథయాత్ర చేసాడు. చార్‌మినార్ పక్కన ‘భాగ్యలక్ష్మీ దేవాలయ’ వివాదం బాబ్రీమసీదు రాంలల్లా వివాదస్థాయికి చేరకముందే దేశం లోని లౌకిక వాద ప్రజాస్వామికశక్తులు మేల్కోవాలి. ఈ హిందుత్వ శక్తులకు ఒక సుదీర్ఘ చరి త్ర ఉన్నది. కనీసం 1980ల నుంచే చూసినపుడు ఇది అమృత్‌సర్‌లో స్వర్ణదేవాల యంపై ఇందిరాగాంధీ సైనిక చర్యతో ప్రారంభమైంది. సిక్కుజాతి హననాన్ని ఇందిరాగాంధీ హత్య తరువాత అక్టోబర్ 31 నుంచి నవంబర్ 3 దాక రాజీవ్ గాంధీ కొనసాగించి వేలాది మంది సిక్కులను చంపి అదే నినాదంగా (హింద్ కరేగా హిందూరాజ్) పార్లమెంట్‌లో 401 సీట్లు గెల్చు కున్నాడు. ఆ ఎన్నికలకు ముందే భోపాల్‌లో రసాయనిక పదార్థాల పేలుళ్లు జరిగి మూడు వేల మంది చనిపోయారు. ఒకవైపు బహుళజాతి కంపెనీలు సృష్టించిన విధ్వంసం, మరొక వైపు హిందు త్వశక్తుల విధ్వంసాల నుంచి అధికారంలోకి వచ్చిన రాజీవ్ గాంధీ, దేశాన్ని 21 శతాబ్దంలోకి తీసుకపోతానన్నాడు.

రాజీవ్‌గాంధీ అనుచరుడు నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి సామ్రాజ్యవాద ప్రపం చీకరణ, ప్రైవేటీకరణకు తగిన ముఖ్యమంత్రిగా చేయడానికి పాతబస్తీలో వైఎస్ ఆర్ ముఠా నిర్వహించిన హత్యాకాండలో వందల మంది ముస్లింలు మరణిం చారు. పి.వి.నరసింహారావు తర్వాత అధికారంలోకి వచ్చిన వాజపేయి సామ్రాజ్యవాద ప్రపంచీకరణ విధానాన్ని కొనసా గించాడు. ఇవాళ గుజరాత్‌లో ముస్లింలను మానవ హననం చేసి నరేంద్రమోడీ ఆయన సాధించిన ‘అభివృద్ధి’ని దేశానికి నమూనాగా చూపుతున్నారు. బిజెపిలో అధికారం కోసం తగవు లు కూడా ముగిసి సుష్మా స్వరాజ్ కూడా నరేంద్రమోడీని భావి భారత ప్రధాని గా ఆమోదించింది. ఇంక ఎన్నికలే ఆలస్యం! ఇటు ఆంధ్రప్రదేశ్‌లో అధి కారంలో ఉన్నప్పుడు ఉక్కు మనిషి సర్దార్ వల్లబాయ్ పటేల్ పోలికతో పిలవ బడే అద్వానీ నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో తెలంగాణ డిమాండ్‌ను తిరస్కరించి, అధికారంలో లేనప్పుడు మాత్రం ఆయన నాయకత్వంలోని బిజెపి ‘ఒక్క ఓటు రెండు రాష్ట్రా’ల సిద్ధాంతం ప్రతిపాదించింది.

కేంద్రంలో బిజెపి అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయగల ప్రత్యామ్నాయ జాతీయ పార్టీ అదే అవుతుంది కనుక తెలంగాణవాదులెవరికీ ఇవాళ బిజెపిలో తెలంగాణవాదం కనిపించినంతగా హిందుత్వ వాసన కనిపించడంలేదు. జెఎసిలో బిజెపి ఉంటుంది. ఇటీవల జరిగి న జెఎసి సమావేశానికి అన్ని పార్టీలు హాజరై టిఆర్‌ఎస్ ఎన్డీయేవైపు మొగ్గు చూపుతుందన్న దానికి సంకేతంగా కెసిఆర్, కిషన్‌రెడ్డి చేతులు కలుపుతారు. కానీ టిఆర్‌ఎస్ గానీ భౌగోళిక తెలంగాణవాదులుగానీ ‘చార్‌మినార్-భాగ్యలక్ష్మీ దేవా లయం’వివాదం గురించి పెదవి విప్పరు! ఇటీవల మహబూ బ్‌నగర్ ఉప ఎన్ని కలు మొదల్కొని సంగారెడ్డి, పాతబస్తీలలో మత కలహాల పేరుతో జరుగుతున్న ఘర్షణలన్నీ రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జరుగు తున్నవే. ఈ ఎన్నికల కోసం ప్రాచీన పురాతత్వ నిర్మాణాలను, మత విశ్వాసాల తో వివాదాస్పదం చేయడం బిజెపికి, సంఘ్ పరివార్‌కు కలిసి వచ్చే పథకం. ప్రజల విశ్వాసాలను ఉన్మాద స్థాయికి తీసుకువెళ్లి రెచ్చగొట్టి ఘర్షణలు సృష్టించి, ఎన్నికల్లో ప్రయోజ నం పొందడం ఇవాళ కొత్త కాదు. హైదరాబాద్ చరిత్ర, సంస్కృతి ‘తెహజీబ్’లపై ముఖ్యంగా మత సామరస్యంపై గురి, గౌరవం ఉన్న ప్రతి ఒక్కరూ తీవ్రంగా స్పందించాల్సిన తరుణమిది.

-వరవరరావు


35

VARAVARA RAO

Published: Wed,February 19, 2014 12:14 AM

ఈ బొమ్మకింక.. ప్రాణం పోయాలి!

ఎన్నాళ్లుగా నీ బొమ్మ గీయాలని.. ప్రయత్నిస్తున్నాను ఎన్నో పోరాటాల జ్ఞాపకాల కన్నీళ్లతో తడిసి నెత్తురు చింది అది చెరిగిపోయేది సాయు

Published: Tue,November 5, 2013 11:56 PM

దాశరథి దేశకాలాలు వెలుగు చీకటి జ్ఞాపకాలు

నా పదమూడో ఏటనే దాశరథి (కృష్ణమాచార్య)తో పరోక్ష పరిచయం, ప్రత్యక్ష పరిచయంగానే కాదు స్నేహంగా కూడా అంత సులభంగా సాధ్యమవుతుందని నేనూహిం

Published: Mon,September 9, 2013 01:08 AM

కాళోజీ కలగన్న తెలంగాణ

ఇవాళ్టికి కాళోజీకి నూరేండ్లు. ఆయన ‘నా గొడవ’ మొదటి ముద్రణ ఆవిష్కరణ జరిగి ఆరవై ఏళ్లు దాటింది. ఇంకా ఆంధ్రరాష్ట్రం ఏర్పడక ముందు 1953

Published: Wed,August 14, 2013 01:16 AM

కేఎంసీలో వికసించిన ఎర్రమందారం

కాటా నారాయణరావు ‘శబరి గోదారి’ (1986) కవితా సంకలనానికి ముందుమాట రాస్తూ కాళోజీ నారాయణరావు.. ‘1965 లో ప్రారంభమైన అలజడి (విశాఖ ఉక్కు

Published: Wed,June 19, 2013 12:59 AM

తీర్మానం చేయలేని అసెంబ్లీ ఓడిపోయింది చేరనివ్వని చలో గెలిచింది

అసెంబ్లీ అంటే పది మంది సమావేశమయ్యే స్థలం కదా మంది కూడా కాదు మన ప్రజావూపతినిధులు పదికోట్ల మంది పెట్టు.. పెట్టుకున్న సభ మన చె

Published: Fri,June 14, 2013 12:21 AM

ప్రజాస్వామ్యమా! పోలీసుస్వామ్యమా!!

శాసనసభాపతిగా కూడా వ్యవహరించి, విజయవంతంగా, సమర్థవంతంగా శాసనసభను నిర్వహించిన పేరు కూడా తెచ్చుకొని ముఖ్యమంత్రి అయిన కిరణ్‌కుమార్‌డ్

Published: Sun,May 26, 2013 12:54 AM

ఆంధ్ర సారస్వత పరిషత్ జ్ఞాపకాలు ...అనుబంధాలు

జాగీరు గ్రామమైన మా చిన్న పెండ్యాలలో నా బాల్యంలోనే నేను ఆంధ్ర సారస్వత పరిషత్తు పేరు వినడమే కాదు,అది మా విద్యాభివృద్ధిలో పాత్ర నిర్వ

Published: Sat,April 20, 2013 12:54 AM

ఇంద్రవెల్లి ఇంగలం

‘ఒక నిప్పురవ్వ దావానలమవుతుంది’ అనేమాట సామాన్యంగా ఒకచోట రగుల్కొన్న విప్లవం నలువైపులా విస్తరించడానికి అన్వయిస్తుంటారు. వైనాడ్ (కేరళ)

Published: Mon,April 1, 2013 12:37 AM

రాజ్యాంగమా? మతక్షిగంథాలా?

మన ప్రభుత్వాలు లౌకిక ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రకారం నడుస్తున్నాయని ఎవరికైనా భ్రమలుంటే వాటిని పటాపంచలు చేశాడు మన ముఖ్యమంత్రి కిరణ

Published: Thu,March 21, 2013 12:13 AM

‘కుక్క’ల్లో వార్త

‘వార్తల్లో కుక్క’ అనాలి. కాని అపుడది వార్త కాదు. రిపోర్టింగ్‌లో ప్రవేశించిన ప్రతి ఒక్కరికీ మీడియా అనుభవజ్ఞులు ఏది వార్త అవుతుందో,

Published: Fri,March 15, 2013 02:14 AM

వంజెం సోమయ్య జైలుడైరీ...

ఇది జైలు డైరీ కాదు... ఇది నిర్బంధ డైరీ... ఇది పోలీసు అక్రమ అరెస్టు డైరీ.. ఇది చిత్రహింసల డైరీ.. ఇది దాతు ఫిర్యాదులేని రాజ్యాంగం ప

Published: Wed,February 20, 2013 11:57 PM

నాటి మాటలు మరిచారా?

అధ్యక్షా! మన శాసనసభ కేంద్ర ప్రభుత్వానికి మరణశిక్షను రద్దు చేయవలసిందిగా రికమెండ్ చేస్తూ తీర్మానం చేయాలని ప్రతిపాదిస్తున్నా ను. పూర్

Published: Fri,February 15, 2013 11:28 PM

బతికించే వృత్తినుంచి ఉరికంబం దాకా..

అప్జల్‌గురు ప్రస్థానం అతని మాటల్లోనే... నేను పెరుగుతున్న కాలంలో కశ్మీర్ రాజకీయంగా కల్లోలంగా ఉన్నది. మక్బుల్‌భట్‌ను ఉరి తీశారు(198

Published: Wed,October 10, 2012 08:11 PM

‘తెలంగాణ మార్చ్’యే జవాబు

ముందు కొన్ని వాస్తవాలు చెప్పుకోవాలె. ఆ వాస్తవాలపై మన అభివూపాయా లు, వ్యాఖ్యలు ఏమైనా కావచ్చు. నెలవారీగా కేంద్ర హోంమంత్రి నిర్వహించే

Published: Sat,October 6, 2012 03:30 PM

పిల్లి మొగ్గలు ఎలుకల్ని పట్టడానికే

భాషలో తేడాయే తప్ప ప్రకాశ్‌సింగ్, కిషోర్‌చంవూదదేవ్, జైరాంరమేష్‌లు కూడా దళారీ పాలనలో భాగమైనంత కాలం చిదంబరం, రమణ్‌సింగ్, విజయ్‌కుమార్

Published: Sat,October 6, 2012 03:31 PM

ఆత్మావలోకనం

మార్క్సిజం పెట్టుబడిదారీ విధానాన్ని మట్టికాళ్ల మహారాక్షసి అంటుంది. ఆ మహారాక్షసి ఉక్కువేళ్లు మట్టిపొరలు చీల్చుకొని భూగర్భ జలాల్లోకి

Published: Sat,October 6, 2012 03:31 PM

విప్లవ దార్శనికుడు

‘చాటండి గళమెత్తి విప్లవదార్శనికుడు చారుమజుందార్ చచ్చిపోలేదని- కామ్రేడ్ చారుమజుందార్ చంపబడ్డాడని’ అంటూ చెరబండరాజు తన కవితా సంకలనం

Published: Sat,October 6, 2012 03:32 PM

ఆదివాసులకు న్యాయం దక్కేనా?

చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, సుక్మా, కాంకేర్ జిల్లాల్లో జూన్ 28,29 తేదీల్లో పోలీసులు మూడుచోట్ల అమాయకులైన 23మంది ఆదివాసీలను చంపారు. జ

Published: Sat,October 6, 2012 03:33 PM

అద్దంలో ‘విద్యార్థి ’ మాట

మొదట వరంగల్ ఆర్ట్స్‌కాలేజీ, తర్వాత ఉస్మానియా క్యాంపస్, రెండుచోట్ల చలం, శ్రీశ్రీ ఇచ్చిన మిత్రులు కాకుండా‘మివూతమండలి’ ఇచ్చిన మిత్రుల

Published: Sat,October 6, 2012 03:33 PM

జార్జ్ అడుగు జాడల్లో..

నేను జార్జిని చూసిన జ్ఞాపకం లేదు. కాని 1972 ఏప్రిల్ 14 సాయంకాలం నుంచి ప్రతి సాయం సంధ్యలోనూ ప్రతి ఉదయసంధ్యలోనూ ఆకాశంలోనే కాదు, నేలమ

Published: Sat,October 6, 2012 03:34 PM

విప్లవ స్వాప్నికుడు ‘అలిశెట్టి’

ఈసారి 2011 సెప్టెంబర్ 29న కామ్రేడ్ సూర్యం సంస్మరణ సభ గుంటూరులో అపూర్వంగా జరిగింది. నేను వెళ్లాల్సింది. ఆ సభ జరుపుతామని తెలిసినప్ప

Published: Sat,October 6, 2012 03:34 PM

దిక్కుల కూడలిలో ధిక్కార స్వరాలు...?

ఎందుకోసం వచ్చినా.. చెరబండరాజు పుట్టిన రోజు చర్చ మంచి కోసం ఉపయోగపడుతోంది. చెరబండరాజు కు సాహిత్య అకాడమీ నుంచి వచ్చిన సహాయాన్ని తన అవ

Published: Sat,October 6, 2012 03:35 PM

ఉద్యమ పంథా మారాలె

సకలజనుల సమ్మె స్వయంపాలనలో భాగంగా శాంతియుతంగా, రాజకీయాలకు అతీతంగా యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని ఒక్కతాటి మీదికి తీసుకురావడం ద్వారా ప్

Published: Sat,October 6, 2012 03:35 PM

కాళోజీ (అను) వాదం

‘నా భారతదేశయాత్ర’ డ్బై ఏళ్ల క్రితం (1941) కాళోజీ (నారాయణరావు)గారు అనువదించి, దేశోద్ధారక గ్రంథమాల పక్షాన వట్టికోట ఆళ్వారుస్వామిగారు

Featured Articles