పిల్లి మొగ్గలు ఎలుకల్ని పట్టడానికే


Sat,October 6, 2012 03:30 PM

MaoistWomanభాషలో తేడాయే తప్ప ప్రకాశ్‌సింగ్, కిషోర్‌చంవూదదేవ్, జైరాంరమేష్‌లు కూడా దళారీ పాలనలో భాగమైనంత కాలం చిదంబరం, రమణ్‌సింగ్, విజయ్‌కుమార్‌ల ఆచరణకే దాసోహం అవుతారు. ఇది చారివూతక విషాదం కాదు. చారివూతక విభాత సంధ్యలో మానవ వికాస చరిత్ర పరస్పరం సంఘర్షించిన శక్తులతో పుడుతున్న చరిత్ర.

కిషోర్ చంద్రదేవ్ పిల్లిమొగ్గ (స్వేచ్ఛారావం- ప్రొ. హరగోపాల్, గురువారం జూలై 12)కు స్పందనగా మూడు అంశాలు రాయాల్సి ఉన్నది. మనకు ఇవాళ ‘పార్లమెంటరీ రాజకీయాల్లో శారద బిల్లు కోసం బి.ఆర్. అంబేద్కర్, సంయుక్త మహారాష్ట్ర కోసం చింతామణి దేశ్‌ముఖ్, మండల్ కమిషన్ అమ లు కోసం వి.పి.సింగ్ వలే విశ్వాసాల కోసం పదవీ త్యాగాలు చేసేవారు ఒక్కరూ మిగలలేదు. లాల్ బహుదుర్‌శాస్త్రి వలె రైలు ప్రమాదానికి రైల్వే మంత్రి పదవికి రాజీనామా చేసినట్టు.. గిరిజనుల మారణకాండకు గిరిజన మంత్రి రాజీనామా చేస్తాడని ఆశించడం కూడా అత్యాశే.

1991నుంచి సామ్రాజ్యవాద, ప్రపంచీకరణ తర్వాత రాజనీతిశాస్త్ర విద్యార్థులు ఆశించే పార్లమెంటరీ సంప్రదాయాలు ఎండమావే. రియాజ్ ఎన్‌కౌంటర్ సందర్భంగా వైఎస్‌ఆర్ మంత్రివర్గంలోని టి.ఆర్.ఎస్‌మంత్రులందరూ (కేంద్రంలో తప్ప) రాజీనామా చేసింది ఒక్కటే మన పార్లమెంటరీ సంప్రదాయల్లో దింపుడు కల్లం ఆశ. తన విశ్వాసాల కోసం రాజీనామా చేయడం అలా వుంచి కిషోర్ చంద్రదేవ్ గ్రేహౌండ్స్ లాంటి లక్ష్యానికి అంకితమైన బలగాల్ని తయారు చేయాలన్నాడు.

ఇటువంటి నక్సలైట్ వ్యతిరేక పోలీసు బలగాల రూపకల్పనలతో 194 నుంచి ఆంధ్రవూపదేశ్‌లో ఐ.పి.ఎస్ అధికారులు నక్సలైట్ బాధితులు, లేదా లొంగిపోయిన నక్సలైట్ల సైన్యాలను కూడా తయారు చేశారు. 194లో కరీంనగర్ ఎస్.పి. అశోక్ ప్రసాద్ ‘ఫియర్ వికాస్’ పేరుతో ఒక నక్సలైట్ బాధిత సంఘాన్ని పెట్టాడు. కానీ ఎక్కువ కాలం నిలవలేకపోయింది. మెదక్ జిల్లాలో తొంభైలలో వినయ్‌కుమార్ సింగ్ సీపీఐ(ఎంఎల్) పార్టీ పేరుతో ఒక దళమే ఏర్పాటు చేశాడు. కానీ వాళ్లు ఏం చేయలేకపోయారు. బయట నుంచి ఈ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోయే సరికి కత్తుల సమ్మయ్యతో మొదలుపెట్టి కోవర్టు హత్యలకు పూనుకున్నారు. 1999లో కరీంనగర్ జిల్లా కార్యదర్శి ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యు డు విజయ్ అలియాస్ మల్కాపురం భాస్కర్‌ను కోవర్టుగా హత్య చేసినందుకు అప్ప టి హోంమంత్రి, డీజీపీ- జడల నాగరాజుకు పది లక్షల అవార్డు ఇచ్చిన మిలాఖత్ గురించి ఏపీసీఎల్సీ తరపున బాలగోపాల్ సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్లాడు.

1999 కొయ్యూరు ఎన్‌కౌంటర్ ఘటనలో శౌర్య పతకాలు తీసుకున్న ఉన్నత పోలీసు అధికారులు కరీంనగర్, నల్లగొండ ఎస్పీలు కోవర్టులతో సంబంధాలు పెట్టుకున్న విష యం ఇప్పుడు చరివూతలో భాగమే. మానాల ఎన్‌కౌంటర్(నిజామాబాద్), గాడిదగండ్ల ఎన్‌కౌంటర్(కరీంనగర్) రచన అంతా కోవర్టులు చేసిన తర్వాత గ్రేహౌండ్స్ పని కేవలం కాల్చిచంపడమే. మానాలలో అప్పటికే కోవర్టులు దళ సభ్యులకు అన్నం లో విషం కలిపి పెట్టారు. గాడిదగండ్లలో తామే చంపి గ్రేహౌండ్స్‌కు అప్పగించారు. చంద్రబాబు కాలంలో ఏపీసీఎల్సీ నాయకులు పురుషోత్తం, అజం అలీ, తెలంగాణ కళాకారిణి బెల్లి లలితను, వైఎస్సార్‌కాలంలో మన్నెం ప్రసాద్, కనకాచారి లను చంపింది ఈ కోవర్టులే. ఆయా ముఖ్యమంవూతుల కాలంలో సంక్షేమ పథకాల పేర్లు మారినట్లు గానే హత్య, విధ్వంసకాండల పేర్లు మాత్రం మారాయి. చంద్రబాబు కాలంలో టైగర్లు, వైఎస్‌ఆర్ కాలంలో కోబ్రాలు అయ్యారు.

రాజనీతి శాస్త్రం దశాబ్దాలుగా బోధిస్తున్న హరగోపాల్ మావోయిస్టు ఉద్యమం ఒక సైన్యాన్ని కలిగి ఉందని, అది రాజ్యాధికారం కోసం పోరాడుతున్నది అనే అం శం పట్ల ఇబ్బంది పడటం ఆశ్చర్యంగా ఉంది. ఒక రాజకీయ పార్టీ ఒకటి రెండు వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తూ అది ఆ వర్గానికి లేదా ఆ వర్గాలకు రాజ్యాధికారం తేవడం కోసమే ఏర్పడుతుందనేది రాజనీతిశాస్త్ర సాధారణ పాఠం. ఎన్టీఆర్, వీపీ సింగ్‌లు కొత్త పార్టీని పెట్టి చాలా తొందర్లో రాజ్యాధికారంలోకి వచ్చారు. మావోయిస్టు పార్టీ కార్మికవర్గపార్టీ కనుక అది పార్లమెంటరీ రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని సాధించాలనుకున్నది. కనుక దానికి సాయుధ పోరాటం ప్రధాన మార్గం.

అందుకు ఒక సైన్యం అవసరమయ్యాయి. రష్యా, చైనా, వియత్నాం వంటి దేశాల్లో విప్లవాలు ఐక్య సంఘటన, ప్రజా సైన్యం, కమ్యూనిస్టు పార్టీ అనే మూడు విప్లవ మంత్ర దం డాలు లేకుండా సాధ్యమయ్యాయా? ఈ మూడు చోట్ల విప్లవపార్టీ రాజ్యాధికారం గురించి ప్రయత్నించకుండా మాట్లాడకుండా రాజ్యాధికారానికి రాకుండానే ప్రజలు కోరుకునే మానవీయ విలువలు సాధించాయా? ‘మానవీయ విలువలు కాపాడుకోవాల్సిన ప్రత్యామ్నాయ రాజకీయాలు కావాల’ ని కోరుకునే చాలా మంది, ప్రజలకు అవి ఎట్లా సాధ్యమవుతుంది. కేవలం వాటి గురించి ప్రచారం చేయడం వల్ల సాధ్యమవుతాయా? పోలీసులు, జైళ్లు లేని ఒక సమతా సుందర రాజ్యం కార్మికులకు ప్యారిస్ కమ్యూన్ వల్ల 70 రోజుల కోసమైనా సాధ్యమైంది కదా! ఒక పటిష్టమైన కమ్యూనిస్టుపార్టీ నిర్మాణం లేకపోవడం వల్లనే అది నిలువలేకపోయిందని లెనిన్ గుణపాఠం తీసుకుని ఓ బోల్షివిక్ పార్టీని నిర్మాణం చేశాడు కదా! సమాజంలో హింస, ప్రతిహింసలను హరగోపాల్ ఒక వలయం గా చూస్తున్నారు. తాత్వికమైన, శాస్త్రీయమైన, రాజకీయ నిర్దేశకత్వం లేనప్పుడు అది వలయమే అవుతుంది.

అది విపరీతమైన ప్రాణ నష్టానికే దారి తీస్తుంది. ఇవాళ మనం వ్యవస్థీకృతమైన హింస గురించి మాట్లాడుతున్నం. ఆకలి, రోగం, కరువు, వరదలు మొదలుకుని ఈ వ్యవస్థ విధానాల ఫలితంగా నిత్యం జరుగుతున్న హింస, విధ్వంసాల గురించి మాట్లాడుతున్నం. పెట్టుబడి వల్ల జరిగే విధ్వంసం, మానవీయ విలువల పరాయికరణ పెట్టుబడిదారీ వర్గానికి ఘోరి కట్టే కార్మికవర్గం నాయకత్వంలో పీడిత వర్గం అంతం చేస్తుందని మార్క్స్ కమ్యూనిస్టు మేనిఫెస్టోలో ప్రతిపాదించారు. ఆయన ఒత్తిడి(ఫోర్స్) విప్లవానికి మంత్రసాని అన్నారు. ‘వాళ్లు ఊరికినే అధికారం నుంచి దిగిపోతే సాయుధంగా దించాల్సిన ప్రయాస మాకెందు కు?’ అన్నాడు లెనిన్ ఆనాటి కార్మికవర్గశక్తితో పోల్చితే ఎంతో బలహీనమైన జార్ పరిపాలన గురించి. ప్రజలకు, విప్లవానికి హాని తలపెట్టని ఏ మనిషి, చివరకు పోలీ సును అయినా సరే చంపితే అది విప్లవానికి, ప్రజలకు నష్టమనే అవగాహన అమలవుతున్నదా? లేదా అనే సమీక్ష మళ్లీ మళ్లీ చేసుకోవాల్సింది తప్ప, ప్రజల ప్రతిహిం స లేకుండా, ప్రజల విప్లవ హింస లేకుండా అధికారం ప్రజలకు సాధ్యంకాదు. ప్రజా సైన్యం లేకుండా ప్రజలకు ఒరిగేది లేదు.

ప్రజలకే అన్ని అధికారాలు, సోవియట్‌లు, కమ్యూన్‌లు. రష్యా, చైనాలో ఇచ్చినట్లుగా ప్రజలకే రాజ్యాధికారం క్రాంతికారీ జనతన సర్కార్ మాత్రమే ఇవ్వగలదు. మావోయిస్టుపార్టీ, సీపీఐ(ఎంఎల్) జనశక్తితో పాటు చర్చలకు వచ్చింది. ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు బలంగా ఆకాంక్షించినందు వల్ల ఆ ఆకాంక్ష వ్యక్తీకరణలో శంకరన్ నిజాయితీగా నిస్వార్ధంగా కృషి చేశారు. అదే సమయంలో భూసంస్కరణలు చిత్తశుద్ధిగా అమలు చేస్తే నక్సలైట్ ఉద్యమం ఉండదని ఆయన అవగాహన పరిమితి కూడా ఉన్నది. అయినా మావోయిస్టు పార్టీ ప్రభుత్వంతో చర్చలకు వచ్చింది. మావోయిస్టు సిద్ధాంతాన్ని ప్రభుత్వంతో అంగీకరింపజేసి రాజ్యాధికారం తమకు అప్పగించమని అడగడానికి కాదు. రాజ్యాంగం ప్రకారం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం రాజ్యాంగాన్ని అమలు చేయడం లేదని చెప్పడానికే. ప్రజాస్వామ్య హక్కులు అనే నేతిబీరకాయ సంగతి అట్లా ఉంచి, తాను చేసిన భూసంస్కరణల చట్టం తను అమలు చేయని ప్రభుత్వమిదే అని చర్చలు రుజువు చేశాయి.

భూస్వామ్య పెట్టుబడిదారీ, దళారీ వర్గాల ప్రతినిధులైన ఎవరైనా పార్లమెంటరీ రాజకీయాల్లో చర్చల వైఫల్యానికే కారణమవుతారు అనడానికి మమతా బెనర్జీ తాజా ఉదహరణ. మానవీయ విలువలు కాపాడుకోవాల్సిన ప్రత్యామ్నాయ రాజకీయాలు జనతన సర్కార్ వల్లనే సాధ్యమనే విషయం ఇవాళ దండకారణ్యంలో రుజువు అవుతున్నది. యాన్‌మిర్డాల్, సత్నాం, అరుంధతీరాయ్ వంటి ఎందరో అక్కడ అమలవుతున్న ప్రత్యామ్నాయ రాజకీయాల వల్ల జరుగుతున్న నూతన మానవ ఆవిష్కరణ గురించి రాశారు. ఉదాహరణకు విప్లవంలో మహిళల భాగస్వామ్యం, మహిళల విషయంలో బహిస్టు అయితే ఇంటి బయట ఉంచడం, స్వగోవూతంలో పెళ్లిళ్ల వంటి విషయాల్లో అటు ఆదివాసీల భావాలు గాయపడకుండానే ఎంతో ఓపికగ్గా, మావోయిస్టులు మార్పులు తీసుకొస్తున్నారు.

గోటుల్లోని సామూహిక విలువలు నిలుపుతూ పితృస్వామిక భావాలకు వ్యతిరేకంగా ఎట్ల పోరాడుతున్నారో మిర్డాల్ రాశారు. స్త్రీలు నాగలి దున్నుతుంటే పురుషులు విత్తనాలు వేసే దృశ్యాల్ని తాము దారి పొడవునా చూశామని బొజ్జా తారకం చెప్పారు. ఒకవైపు సస్యశ్యామలమైన పంటలు, ఆరోగ్యకరమైన పశుసంపద, మధ్యన అమరుల స్థూపా లు ఇదీ ఇవ్వాళ దండకారణ్య దృశ్యమని బొజ్జాతారకం చెప్పారు. ఇటీవలి బాసగూడెం ఘటననే తీసుకుంటే- కర్కగూడెం,రాజుపెంట, కొత్తగూడెం మూడు గ్రామాలకు ఒక రెవల్యూషనరీ ప్రొవిజన్ కౌన్సిల్ (ఒక విప్లవ రాజ్యాధికారం)ఉన్నది. వాళ్లు జూన్ 2 రాత్రి ఎందుకు సమావేశమయ్యారంటే.., తాము అప్పటికే భూమి చదును చేసుకుని, పంపకాలు చేసుకుని సమష్టిగా చేసుకున్న వ్యవసాయ భూములను తిరిగి పంచుకోవడానికే. పార్టీ విజ్ఞప్తి మేరకు పశ్చాత్తాపం చెంది తిరిగి వచ్చిన సల్వాజుడుం కార్యకర్తలకు, ఆంధ్రవూపదేశ్ ప్రవాసం నుంచి వచ్చిన యువకులకు, సల్వాజుడుం జులుం తగ్గిందని తిరిగి వచ్చిన తమ వాళ్లకు కూడా భూమి ఇవ్వాలని సమావేశమయ్యారు.

బస్తర్‌లో భూమి లేని ఆదివాసీ కుటుంబం లేదు. భూమిని చదును చేసుకోవడం ఇవాళ అక్కడ ఒక పెద్ద రాజకీయ జాతర. కుంటలు, చెరువులు, కాల్వలు తవ్వుకోవడం కూరగాయలు,పండ్లతోటలు పెంచుకోవడం, చేపల చెరువులు తవ్వుకోవడా న్ని...అక్కడ ఇంత యుద్ధంలో కూడా కన్నుల పండుగగా చూడవచ్చు. ప్రతి ఇంటికి ధాన్యగారాలు, కోళ్లు, మేకలు, పశువులు ఉండటమే కాదు, వాటితో పాటు జనతన సర్కార్ ఉండటమే కదా, తాడిమెట్లపై మళ్లీ మళ్లీ పోలీసుల దాడులకు అసలు కారణం! రాజకీయ ఆర్థిక విధానంలో రాజకీయ ఉపరితలం లేకుండా ఆర్థిక పునాది ఉంటుందా? ఆర్థిక పునాది లేకుండా రాజకీయ ఉపరితలం ఉంటుందా? ఈరెండు అభివృద్ధి నమూనాల మధ్య ఘర్షణ అయితే అనివార్యంగా ఇది సామ్రాజ్యవాద ప్రపంచీకరణకు, స్వావలంబనకు మధ్య ఘర్షణయే.

బూర్జువా నియంతృత్వానికి, నూతన ప్రజాస్వామిక విప్లవానికి మధ్య ఘర్షణయే.వాళ్లు విత్తనాల పండుగ కోసం గుమిగూడారు. అవి హైబ్రీడ్ విత్తనాలు కావు. నిరుడి పంటలో విత్తనాల కోసం తీసి దాచిన పంటను వాగ్ధానం చేసే విత్తనాలు. రైతుకు పురుగుల మందు పెరుగన్నమయ్యే విత్తనాలు కావు, ఇది శత్రువుకు తెలుసు. అందుకే 17 మంది హతుల నెత్తురు చెందిన ఆప్రాంతపు మట్టి పెళ్లను పెకిలించుకుపోయాడు. భాషలో తేడాయే తప్ప ప్రకాశ్‌సింగ్, కిషోర్‌చంవూదదేవ్, జైరాంరమేష్‌లు కూడా దళారీ పాలనలో భాగమైనంత కాలం చిదంబరం, రమణ్‌సింగ్, విజయ్‌కుమార్‌ల ఆచరణకే దాసోహం అవుతారు. ఇది చారివూతక విషాదం కాదు. చారివూతక విభాత సంధ్యలో మానవ వికాస చరిత్ర పరస్పరం సంఘర్షించిన శక్తులతో పుడుతున్న చరిత్ర.
-వరవరరావు

35

VARAVARA RAO

Published: Wed,February 19, 2014 12:14 AM

ఈ బొమ్మకింక.. ప్రాణం పోయాలి!

ఎన్నాళ్లుగా నీ బొమ్మ గీయాలని.. ప్రయత్నిస్తున్నాను ఎన్నో పోరాటాల జ్ఞాపకాల కన్నీళ్లతో తడిసి నెత్తురు చింది అది చెరిగిపోయేది సాయు

Published: Tue,November 5, 2013 11:56 PM

దాశరథి దేశకాలాలు వెలుగు చీకటి జ్ఞాపకాలు

నా పదమూడో ఏటనే దాశరథి (కృష్ణమాచార్య)తో పరోక్ష పరిచయం, ప్రత్యక్ష పరిచయంగానే కాదు స్నేహంగా కూడా అంత సులభంగా సాధ్యమవుతుందని నేనూహిం

Published: Mon,September 9, 2013 01:08 AM

కాళోజీ కలగన్న తెలంగాణ

ఇవాళ్టికి కాళోజీకి నూరేండ్లు. ఆయన ‘నా గొడవ’ మొదటి ముద్రణ ఆవిష్కరణ జరిగి ఆరవై ఏళ్లు దాటింది. ఇంకా ఆంధ్రరాష్ట్రం ఏర్పడక ముందు 1953

Published: Wed,August 14, 2013 01:16 AM

కేఎంసీలో వికసించిన ఎర్రమందారం

కాటా నారాయణరావు ‘శబరి గోదారి’ (1986) కవితా సంకలనానికి ముందుమాట రాస్తూ కాళోజీ నారాయణరావు.. ‘1965 లో ప్రారంభమైన అలజడి (విశాఖ ఉక్కు

Published: Wed,June 19, 2013 12:59 AM

తీర్మానం చేయలేని అసెంబ్లీ ఓడిపోయింది చేరనివ్వని చలో గెలిచింది

అసెంబ్లీ అంటే పది మంది సమావేశమయ్యే స్థలం కదా మంది కూడా కాదు మన ప్రజావూపతినిధులు పదికోట్ల మంది పెట్టు.. పెట్టుకున్న సభ మన చె

Published: Fri,June 14, 2013 12:21 AM

ప్రజాస్వామ్యమా! పోలీసుస్వామ్యమా!!

శాసనసభాపతిగా కూడా వ్యవహరించి, విజయవంతంగా, సమర్థవంతంగా శాసనసభను నిర్వహించిన పేరు కూడా తెచ్చుకొని ముఖ్యమంత్రి అయిన కిరణ్‌కుమార్‌డ్

Published: Sun,May 26, 2013 12:54 AM

ఆంధ్ర సారస్వత పరిషత్ జ్ఞాపకాలు ...అనుబంధాలు

జాగీరు గ్రామమైన మా చిన్న పెండ్యాలలో నా బాల్యంలోనే నేను ఆంధ్ర సారస్వత పరిషత్తు పేరు వినడమే కాదు,అది మా విద్యాభివృద్ధిలో పాత్ర నిర్వ

Published: Sat,April 20, 2013 12:54 AM

ఇంద్రవెల్లి ఇంగలం

‘ఒక నిప్పురవ్వ దావానలమవుతుంది’ అనేమాట సామాన్యంగా ఒకచోట రగుల్కొన్న విప్లవం నలువైపులా విస్తరించడానికి అన్వయిస్తుంటారు. వైనాడ్ (కేరళ)

Published: Mon,April 1, 2013 12:37 AM

రాజ్యాంగమా? మతక్షిగంథాలా?

మన ప్రభుత్వాలు లౌకిక ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రకారం నడుస్తున్నాయని ఎవరికైనా భ్రమలుంటే వాటిని పటాపంచలు చేశాడు మన ముఖ్యమంత్రి కిరణ

Published: Thu,March 21, 2013 12:13 AM

‘కుక్క’ల్లో వార్త

‘వార్తల్లో కుక్క’ అనాలి. కాని అపుడది వార్త కాదు. రిపోర్టింగ్‌లో ప్రవేశించిన ప్రతి ఒక్కరికీ మీడియా అనుభవజ్ఞులు ఏది వార్త అవుతుందో,

Published: Fri,March 15, 2013 02:14 AM

వంజెం సోమయ్య జైలుడైరీ...

ఇది జైలు డైరీ కాదు... ఇది నిర్బంధ డైరీ... ఇది పోలీసు అక్రమ అరెస్టు డైరీ.. ఇది చిత్రహింసల డైరీ.. ఇది దాతు ఫిర్యాదులేని రాజ్యాంగం ప

Published: Wed,February 20, 2013 11:57 PM

నాటి మాటలు మరిచారా?

అధ్యక్షా! మన శాసనసభ కేంద్ర ప్రభుత్వానికి మరణశిక్షను రద్దు చేయవలసిందిగా రికమెండ్ చేస్తూ తీర్మానం చేయాలని ప్రతిపాదిస్తున్నా ను. పూర్

Published: Fri,February 15, 2013 11:28 PM

బతికించే వృత్తినుంచి ఉరికంబం దాకా..

అప్జల్‌గురు ప్రస్థానం అతని మాటల్లోనే... నేను పెరుగుతున్న కాలంలో కశ్మీర్ రాజకీయంగా కల్లోలంగా ఉన్నది. మక్బుల్‌భట్‌ను ఉరి తీశారు(198

Published: Sat,December 29, 2012 04:40 PM

డిసెంబర్ 6కు 20 ఏండ్లు

ఈ డిసెంబర్ 6కు (బాబ్రీమసీదు విధ్వంసం జరిగి) 20 ఏండ్లు నిండాయి. ఇరవైఏండ్లంటే ఇంచుమించు ఒక తరం మారింది. పి.వి.నర సింహా రావు నుంచి మన

Published: Wed,October 10, 2012 08:11 PM

‘తెలంగాణ మార్చ్’యే జవాబు

ముందు కొన్ని వాస్తవాలు చెప్పుకోవాలె. ఆ వాస్తవాలపై మన అభివూపాయా లు, వ్యాఖ్యలు ఏమైనా కావచ్చు. నెలవారీగా కేంద్ర హోంమంత్రి నిర్వహించే

Published: Sat,October 6, 2012 03:31 PM

ఆత్మావలోకనం

మార్క్సిజం పెట్టుబడిదారీ విధానాన్ని మట్టికాళ్ల మహారాక్షసి అంటుంది. ఆ మహారాక్షసి ఉక్కువేళ్లు మట్టిపొరలు చీల్చుకొని భూగర్భ జలాల్లోకి

Published: Sat,October 6, 2012 03:31 PM

విప్లవ దార్శనికుడు

‘చాటండి గళమెత్తి విప్లవదార్శనికుడు చారుమజుందార్ చచ్చిపోలేదని- కామ్రేడ్ చారుమజుందార్ చంపబడ్డాడని’ అంటూ చెరబండరాజు తన కవితా సంకలనం

Published: Sat,October 6, 2012 03:32 PM

ఆదివాసులకు న్యాయం దక్కేనా?

చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, సుక్మా, కాంకేర్ జిల్లాల్లో జూన్ 28,29 తేదీల్లో పోలీసులు మూడుచోట్ల అమాయకులైన 23మంది ఆదివాసీలను చంపారు. జ

Published: Sat,October 6, 2012 03:33 PM

అద్దంలో ‘విద్యార్థి ’ మాట

మొదట వరంగల్ ఆర్ట్స్‌కాలేజీ, తర్వాత ఉస్మానియా క్యాంపస్, రెండుచోట్ల చలం, శ్రీశ్రీ ఇచ్చిన మిత్రులు కాకుండా‘మివూతమండలి’ ఇచ్చిన మిత్రుల

Published: Sat,October 6, 2012 03:33 PM

జార్జ్ అడుగు జాడల్లో..

నేను జార్జిని చూసిన జ్ఞాపకం లేదు. కాని 1972 ఏప్రిల్ 14 సాయంకాలం నుంచి ప్రతి సాయం సంధ్యలోనూ ప్రతి ఉదయసంధ్యలోనూ ఆకాశంలోనే కాదు, నేలమ

Featured Articles