విజ్ఞానాన్ని అందించిన ప్రణవానంద


Sat,October 6, 2012 03:37 PM

గత శతాబ్దం ప్రారంభంలో, స్వీడన్‌కు చెందిన స్వెన్ హెదిన్ అనే యూరోపియన్ పర్యాటకుడు, టిబెట్ వెళ్లి, ఆసియా ఖండానికి చెందిన భౌగోళిక విషయాలను అధ్యయనం చేసి, మ్యాపులు గీశాడు. ఆయన పర్యటనలకు సంబంధించి హెదిన్ అనేక విషయాలను గ్రంథస్థం చేశాడు. థ్రూ ఏసియా అన్న ఆయన ప్రఖ్యాత గ్రంథం వందేళ్ల క్రితం 19 లో ప్రచురించడం జరిగింది. ఏసియా సంస్కృతిని గురించి అధ్యయనం చేయదల్చుకున్న వారికి ఆయన రాసిన పుస్తకాలు చాలా ఉపయుక్తంగా ఉంటాయి. ఐతే స్వెన్ హెదిన్ గీసిన టిబెట్ మ్యాపులకు, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన, స్వామీ ప్రణవానంద గీసిన మ్యాపులకు చాలా తేడా వుందని పరిశోధకులంటారు. ఇరువురి మ్యాపులను శ్రద్ధగా పరిశీలించిన పలువురు స్వెన్ హెదిన్ సరిగ్గా చూడకుండా కేవలం తెలివితేటలు ఉపయోగించి మ్యాపులు గీశాడంటారు. ప్రణవానంద తన టిబెట్ యాత్రను గురించి రాసిన గ్రంథాన్ని కాని, ఆయన అక్కడ నుంచి సేకరించి తెచ్చిన, వృక్ష,పక్షి, ఖనిజ అవశేషాలను కానీ ఆంధ్ర విశ్వవిద్యాలయం ముట్టనే లేదట! కానీ, కలకత్తా విశ్వవిద్యాలయం ‘ఎక్స్ ప్లొరేషన్ ఇన్ టిబెట్’ పేరుతో ఆ పుస్తకాన్ని ప్రచురించింది. ఆయన పట్టుకొచ్చిన వస్తువులను తీసుకుని ప్రదర్శనశాలలో పెట్టింది. లక్నో ప్రదర్శనశాల వారు కూడా కొన్నింటిని తీసుకున్నారు. అదీగాక అప్పటి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ టిబెట్‌కు సంబంధించిన సమాచారాన్ని స్వామీ ప్రణవానంద ద్వారా సేకరించి, నాలుగువేల పేజీల డాక్యుమెంటు తయారు చేయించుకుని, భవిష్యత్‌లో అవసరమైనప్పుడు ఉపయోగించుకునేందుకు భద్రపరిచారట. ఇంతకూ ఎవరీ ప్రణవానంద స్వామి?

స్వామీ ప్రణవానంద స్వాతంత్య్ర ఉద్యమాలలో పాల్గొని, టిబెట్ వెళ్ళి, అక్కడి నైసర్గిక స్థితిగతులను చూసి, అధ్యయనం చేసి, మ్యాపులు గీసి దేశానికి సమర్పించుకున్న మహనీయుడు. ప్రణవానందస్వామి సరిగ్గా 115 సంవత్సరాల క్రితం 196 మార్చ్ నెలలో తూర్పుగోదావరి జిల్లాలో జన్మించాడు. 191 లో లాహోర్‌లోని దయానంద కళాశాల నుంచి పట్టభవూదుడైనాడు. 1920 నుంచి 1926 వరకు పశ్చిమగోదావరి జిల్లాలో ఖాదీ ప్రచారం, హరిజన సేవ చేయడమే కాకుండా, తెలుగునాట మొట్టమొదటి హిందీవిద్యాలయం నెలకొల్పిన ఖ్యాతి దక్కించుకున్నాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అణుశాస్త్ర విభాగం నెలకొల్పిన స్వామీ జ్ఞానానంద హిమాలయాలలో ఆధ్యాత్మిక విషయాలలో పరిశోధనలు కూడా చేశారు. స్వాములనేవారు, కేవలం స్వాములోరిగానే మిగిలిపోకుండా, శాస్త్రవేత్తలుగా, పరిశోధకులుగా, సాంకేతిక విజ్ఞానులుగా ఉండాలనేది జ్ఞానానంద సందేశం. అలాంటి మహనీయుడి వద్ద సన్యాసాక్షిశమం స్వీకరించాడు ప్రణవానంద.

192లో ప్రారంభమైంది ప్రణవానంద అన్వేషణ. తొలుత ఉత్తరప్రదేశ్‌కు చేరుకున్న ప్రణవానంద, అక్కడ అల్మోరా ఫిటోర్‌ఘర్ ప్రాంతంలో కనీస వైద్య సదుపాయాలు కూడా లేవని గమనించారు. అక్కడ సంచార వైద్య సేవలు ప్రారంభించారు. హిమాలయాల పాదమైన ఉత్తర ప్రదేశ్ నుంచే హిమాలయాలకు చేరుకోవాలన్నది ఆయన ఆశయం.హిమాలయ యాత్రను ఆధ్యాత్మిక సాధన కోసం ఉద్దేశించినప్పటికీ, మొదపూట్టిన తరువాత, అది వృక్ష-జంతు-ఖనిజ-పురా తత్వ-సాంఘిక-ఇతిహాసిక విజ్ఞానాలన్నింటికీ విస్తరించిన ఆసక్తికర అంశంగా మారిపోయింది. టిబెట్‌లో నివసించే లామాలతో స్నేహం చేసుకుని, సాహిత్యం,చరిత్ర లోతులను అవలోకించి, అధ్యయనం చేశాడు ప్రణవానంద.

సాధారణంగా, పురాతన గ్రంథాలలో ఏది రాస్తే, దానినే నమ్మడం మనలో చాలామందికి అలవాటు. కొత్త విషయాలు చెప్పినా వినరు. తెలుసుకోవాలనే ఉత్సాహం కూడా పలువురిలో ఉండదు. ప్రణవానంద స్వామి అలా కాదు. బౌద్ధ లామాలతో సంవత్సరాల తరబడి వుండి, అక్కడి ప్రకృతిని ఒక సుబోధక విమర్శనా గ్రంథంగా మలచ గలిగాడు. ఆ జిజ్ఞాసే ఆయనతో పాతికేసి పర్యాయాలు కైలాస గిరి ప్రదక్షిణలు, మానస సరోవర ప్రదక్షిణలు చేయించింది. ప్రకృతి సౌందర్యంతో పాటు, ప్రకృతిలో నిక్షిప్తమై వున్న విజ్ఞాన రహస్యాలను కూడా ఆకళించుకోగలిగాడు. తనలో వున్న వైద్య నిపుణత్వంతో, అక్కడున్న అధికార,అనధికార వర్గాల వారందరితో స్నేహం చేసుకున్నాడు.అక్కడి సరస్సులను శోధించడానికి భారతదేశం నుంచి ఒక ఉక్కు పడవను మోసుకుపోగలిగారు. అక్కడి నుంచి మొదటిసారిగా సముద్ర వస్తు అవశేషాలను తీసుకోరాగలిగారు. ప్రణవానంద ఏది చేసినా పరిశోధక దృష్టితోనే చేశారు. సన్యాసి చేయాల్సిన పని అదే అనిపించాడు. కస్తూరి మృగంపై ఆయన చేసిన పరిశోధన చెప్పుకోదగింది. అలానే ఔషధాలపై చేసిన పరిశోధనలు కూడా నేటికీ తలమానికాలు. స్వామీ ప్రణవానంద హిమాలయాలలో, టిబెట్‌లో చేసిన అన్వేషణ, అధ్యయనం, హిమాలయాల్లోని అందాలను ఆవిష్కరించింది. సింధూ, సట్లెజ్, బ్రహ్మపుత్ర, కర్నాలీ నదుల వాస్తవ జన్మస్థానాలను కనిపెట్టగలిగాడాయన. లండన్‌లోని రాయల్ జియోక్షిగాఫికల్ సొసైటీ, దేశంలోని సర్వే ఆఫ్ ఇండియా ఆయన పరిశోధనలను అంగీకరించాయి. 1941లో సర్వే ఆఫ్ ఇండియా వారు ముద్రించిన మ్యాపులలో ప్రణవానంద గీసినవన్నీ వున్నాయి.

ప్రణవానంద రాసిన ‘ఎక్స్ ప్లొరేషన్ ఇన్ టిబెట్’ అనే గ్రంథాన్ని కలకత్తా విశ్వవిద్యాలయం వారు 1950లో ప్రచురించారు.ఆ పుస్తకానికి ముందుమాట రాస్తూ పరిచయం చేసిన శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ, ‘ఖర్చు లేకుండానే ఇంత పరిశోధన చేశారీ సన్యాసి. ఆత్మానందం కోసం ఇంత పని చేశాడు. ఇరవై ఐదేళ్లకు పైగా పవిత్ర హిమాలయాలలో గడిపాడు. ఆయన పరిశోధనలను నిపుణులు మెచ్చారు’అని అన్నారు. 1954లో టిబెట్ సరిహద్దులో భారత ప్రభు త్వం చెక్ పోస్టులను పెట్టి, విదేశీయులను దరిదాపులలోకి రాకుండా చేసింది. ప్రణవానంద సూచనల మేరకే ఈ చర్యలు తీసుకున్నది భారత ప్రభుత్వం. 1960లో భారత ప్రభు త్వం ఆయనకు పద్మశ్రీ బిరుదునిచ్చి సత్కరించింది.సింధు నది, సట్లెజ్,వూబహ్మపుత్ర నదుల మూలాలను తొలిసారిగా కనుక్కున్నది తానేనంటాడు స్వెన్ హెదిన్. టిబెటన్లు, తాను తప్ప మరెవ్వరూ, ఆ మూలాల దగ్గరకు చేరుకోలేకపోయారని బల్ల గుద్ది మరీ చెప్పాడు.ఐతే స్వెన్ హెదిన్ చెప్పిన దాంట్లో వాస్తవం లేదన్న విషయాన్ని, స్వామీ ప్రణవానంద బయట పెట్టాడు. 192-193 మధ్యలో, ఆయన మానస సరోవర్-కైలాస్‌గిరి ప్రాంతాలలో చేసిన యాత్రలు, మానవ మాత్రుపూవ్వరూ పోలేని ప్రాంతానికి ఆయ న వెళ్లడమే కాకుండా ఒక ఏడాది పాటు నివసించడం, స్వెన్ హెదిన్ చెప్పిన విషయాలపై కొంత అనుమానాలకు తావిచ్చింది. వృత్తి రీత్యా భౌగోళిక శాస్త్రవేత్త కాకపోయినా, స్వామీ ప్రణవానంద పరిశోధనలు, ఆ నదుల వాస్తవ మూలాలను అధ్యయనాత్మకంగా కనుగొన్న దాఖలాలు స్పష్టంగా బయట పెట్టాయి. వాస్తవానికి ఏ జీవనది ఎక్కడ ఉద్భవించిందో అన్న విషయాలపై చర్చ ఎప్పటికీ కొనసాగుతూనే వుంటుంది. స్వామీ ప్రణవానంద రాసిన ‘ఎక్స్ ప్లొరేషన్ ఇన్ టిబెట్’ పుస్తకంలో, టిబెట్ ప్రాంతంలోని మానస సరోవర్-కైలాసగిరి భాగాన్ని గురించే ఎక్కువగా వుంటుంది.ఏదేమైనా స్వామీ ప్రణవానంద లాంటి అరుదైన సహజ భౌగోళిక శాస్త్రవేత్తల జన్మ స్థలం ఆంధ్ర ప్రదేశ్ కావడం మనం గర్వించ తగ్గ విషయం. మార్చ్ నెల లో ఆయన 115 వ జయంతి. ఈ సందర్భంగా స్వామీజీని గుర్తుచేసుకోవడం ఎంతైనా సమంజసం. సాధులు, సన్యాసుల వేషధారణలో ఉన్నా శాస్త్రీయ దృష్టితో భవిష్యత్ తరాలకు ఎంతో ఉపకరించే పరిశోధనలు చేసిన వారు ఎందరో మన చరిత్రలో కనిపిస్తారు.

- వనం జ్వాలా నరసింహారావు

35

VANAM JWALA NARASIMHA RAO

Published: Thu,December 21, 2017 01:12 AM

కృత్రిమ వైరుధ్యాలతో కుమ్ములాటలా!

హైదరాబాద్‌లో అద్భుతంగా జరిగిన జీఈఎస్ ఎనిమిదవ సదస్సు నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా వ్యయం చేయలేదన్నారు సీఎం. అసలీ సదస

Published: Tue,November 21, 2017 11:20 PM

ఆధ్వర్యం మనదే.. అధ్యక్షత మనదే

తెలంగాణలో జరిగే ప్రపంచ తెలుగు మహాసభలకు రంగం సిద్ధమవుతున్నది. సమావేశాలు జరుగడానికి ఇంకా మూడు వారాలే మిగిలాయి. దేశం నలుమూలల నుంచి, వ

Published: Sun,November 12, 2017 12:41 AM

గ్రామ పునర్నిర్మాణం దిశగా..

క్రియాశీల పంచాయతీరాజ్ వ్యవస్థకు శ్రీకారం చుట్టాలని, స్వయం ప్రతిపత్తితో గ్రామాలు, వ్యక్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అభివృద్ధిలో భ

Published: Sun,October 15, 2017 01:33 AM

కులాలపై విమర్శ తగదు

శతాబ్దాలకాలంగా బ్రాహ్మణ, బ్రాహ్మణేతరులు కలిమిడిగా, అభివృద్ధి చేసిన సామాజిక, రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. ఒకరిని మరొకరు దూషించుకున

Published: Wed,October 4, 2017 12:56 AM

వ్యాపారం చేయడమే నేరమా?

ఇటీవల ఒక సామాజిక శాస్త్రవేత్త కోమట్లను సామాజిక స్మగ్లర్లు (దొంగ రవాణాదారులు) అంటూ ఒక అసంబద్ధమైన బుల్లి పుస్తకాన్ని రాశాడు. దానిమీద

Published: Sat,April 22, 2017 03:12 AM

కేంద్ర, రాష్ట్ర సంబంధాల్లో కొత్త అధ్యాయం

ముఖ్యమంత్రి అసెంబ్లీలో కేంద్ర-రాష్ట్ర సంబంధాల విషయంలో వెలిబుచ్చిన అభిప్రాయాలు, ముస్లిం రిజర్వేషన్ల పెంపు అంశం, యావత్ భారతదేశం దృష

Published: Tue,March 28, 2017 12:01 AM

అభివృద్ధి కోసమే అప్పులు

అత్యంత హుందాగా, సమర్థవంతంగా, అర్థవంతంగా సుమారు మూడు వారాల పాటు జరిగిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా ప

Published: Tue,February 14, 2017 01:23 AM

ప్రపంచవ్యాప్త మహిళా సాధికారత

ఎందరో మహిళలు దేశ దేశాల్లో కీలకమైన పదవుల్లో ఉండటం గత ఐదారు దశాబ్దాల మహిళా సాధికారతకు నిదర్శనం. భవిష్యత్‌లో మరికొన్ని దేశాల అధ్యక్

Published: Tue,December 13, 2016 01:03 AM

బహుముఖ ప్రజ్ఞాశాలి సీఎస్‌ఆర్

ఉత్తర భారతదేశంలోని బద్రీనాథ్, కేదార్‌నాథ్ దేవాలయానికి 1977లో సీఎస్‌ఆర్అ ధ్యక్షులుగా నియమించబడ్డారు. వారి కాలంలోనే బద్రీనాథ్, కేదార

Published: Fri,September 23, 2016 11:32 PM

ప్రతిభకు ప్రతీకలు గురుకులాలు

విద్యా విధానంలో ప్రస్తుతమున్న అన్ని అనర్థాలకూ గురుకుల విద్య సమాధానం కాకపోవచ్చు. కానీ ఈ నమూనా తప్పకుండా,అణగారిన వర్గాల్లో ఆణిముత్య

Published: Sun,September 18, 2016 12:57 AM

అన్యాయానికి సజీవసాక్ష్యం

నందికొండ ప్రాజెక్టు నిర్మాణం 1956న ప్రారంభం కాగా 1969లో పూర్తయ్యింది.గేట్ల ఏర్పాటు, స్పిల్‌వే ఏర్పాటు 1974 నాటికి పూర్తి చేయటం జరి

Published: Thu,September 3, 2015 01:28 AM

అందరికీ విద్య దిశగా అడుగులు

సమాజానికి అవసరమయ్యే సేవలు ఏమిటి? అందుకు అనుగుణంగా సేవలందించేవారిని ఎలా తయారు చేయాలి? అనే విషయంపై విద్యా శాఖకు అవగాహన ఉండాలి. ఏ వృత

Published: Sun,August 23, 2015 01:39 AM

వ్యయం లేని వ్యవసాయం కావాలి

తెలంగాణలో ప్రతి గ్రామంలో రైతులతో వ్యవసాయ శాఖ ప్రత్యక్ష అనుబంధం కలిగి వుండాలి. ఎప్పటికప్పుడు రైతులతో మాట్లాడుతూ వ్యవసాయానికి పూర్వ

Published: Wed,August 19, 2015 12:09 AM

నాటిరోజుల్లో గ్రామీణ జనజీవనం

వేసవి కాలంలో పొలాలకు పెంట తోలే ప్రక్రియ తో వ్యవసాయ పనులు మొదలయ్యేవి. పాడి పశువుల వల్ల పోగైన పెంటను ఎరువుగా పొలాలకు తరలించేవారు. అద

Published: Wed,August 12, 2015 01:49 AM

యాభై ఏళ్ల సింగపూర్.. విశేషాలు

ఐదారు దశాబ్దాల క్రితం వరకూ దూర ప్రాచ్య తీర ప్రాంతంలో, బ్రిటన్‌కు ప్రధానమైన నావికా సైనిక స్థావరంగా మాత్రమే ఉండేది సింగపూర్. అలాంటిద

Published: Fri,July 31, 2015 11:18 PM

ఆచితూచి.. అసలైన నిర్ణయం

న్యాయపరమైన నియమ, నిబంధనల నేపథ్యంలో రాజ్యాంగ ప్రకరణాలు, న్యాయస్థానాల తీర్పులు ఉండి తీరాలి. సంప్రదాయాలకు ఇదమిత్థమైన నిబంధనలంటూ ఏవీ ఉ

Published: Thu,July 23, 2015 12:20 AM

పర్యాటక మకుటంగా యాదాద్రి ..

180 ఎకరాల విస్తీర్ణం గల యాదగిరిగుట్ట స్థలాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకునేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఆ ప్రాంతమంతా అందమైన చెట్లతో

Published: Thu,July 2, 2015 04:46 AM

ఆకుపచ్చని తెలంగాణ దిశగా..

బంగారు తెలంగాణ స్వప్నం సాకార దిశగా మరో కీలకమైన అడుగు వేయడానికి ప్రభుత్వం సకల సన్నాహాలు చేసింది. తెలంగాణకు హరిత హారం పేరుతో ముఖ్యమం

Published: Thu,June 25, 2015 01:13 AM

పుష్కరాలు ఆధ్యాత్మిక పరిమళాలు

గౌతమ మహర్షి కఠోర తపస్సు కారణాన భూలోకానికి తేబడిన గంగానది పాయ గౌతమిగా, గోదావరిగా ప్రసిద్ధికెక్కింది. గంగానది అంశగా భావించబడే గోదావర

Published: Thu,September 11, 2014 12:27 AM

నాటి హైదరాబాద్ జ్ఞాపకాలు

జూన్, 1964లో నేను, నాన్న గారు కలిసి మొదటిసారి హైదరాబాద్ చేరుకున్నాం.ఖమ్మంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు బస్సెక్కితే హైదరాబాద్ గౌలిగూ

country oven

Featured Articles