పార్టీని వీడిన వాళ్లకే పట్టం!


Sat,October 6, 2012 03:38 PM

అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసి, ధిక్కార స్వరం వినిపించి న కాంగ్రెస్ శాసనసభ్యులమీద వేటు పడింది. వారితో పాటు ఎంపీ మేకపాటి రాజగోపాల్‌డ్డి రాజీనామాకు కూడా లోక్‌సభ స్పీకర్ ఆమోదముద్ర వేశారు. కాంగ్రెస్ పార్టీలో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకొంటూ, అధిష్ఠానం అంటే భయం కూడా లేకుండాపోయింది. ఒకవైపు కిరణ్- బొత్స వర్గాలు, మరోవైపు సీమాంవూధ-తెలంగాణ వర్గాలు, సమ్మతి-అసమ్మతి ముఠాలు బాహాటంగానే విమ ర్శించుకుంటున్నాయి. తన మాటను ఖాతరు చేయడం లేదని భావించినప్పుడు అధిష్ఠానం ఒకరిద్దరి మీద వేటు వేస్తూ, ఆ తర్వాత అదంతా తమ సొంత ఇంటి వ్యవహారంగా చెప్పుకొంటున్నది.

కాంగ్రెస్‌లో అసంతృప్తులు, ధిక్కారాలు, ఎదురీతలు, చీలికలు అంతర్భాగాలే. చాలావరకు నెహ్రూ-గాంధీ కుటుంబీకుల చుట్టే అవన్నీ చోటు చేసుకుంటున్నాయి. ఆ వారసత్వ పరంపరలో ప్రతి ఒక్కరు, తమ మాట చెల్లన ప్పుడు పార్టీని చీల్చడమో, పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటేయమని సూచించడమో చేశారు. అలా జరిగిన ప్రతిసారీ ఆ కుటుంబీకులు పార్టీలో తమ ఆధిపత్యాన్ని పదిల పరచుకున్నారు. అదే ఇప్పటికీ కొనసాగుతోంది.
నెహ్రూ వారసురాలిగా ఇందిరాగాంధీ తొలుత పార్టీ పగ్గాలను 1959-60లో చేపట్టారు. 1966లో ఇందిర ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన రోజుల్లో సామ్యవాదులు, సంప్రదాయ వాదులని పార్టీలో రెండు వర్గాలుండేవి. ఆధిపత్యం కోసం బహిరంగంగానే విమర్శించుకునే వారు. 1967 ఎన్నికల్లో పార్టీ విజయం సాధించినప్పటికీ, మెజారిటీ భారీగా తగ్గింది. పార్టీలో మొరార్జీని ఓడించి ఇందిర ప్రధాని కాగలిగారు. తనను వ్యతిరేకించిన మొరార్జీ ని మంత్రివర్గంలో తీసుకుని కీలకమైన ఆర్థికశాఖను కట్టబెట్టారు. బ్యాంకుల జాతీయం, రాజభరణాల రద్దు లాంటి విధాన పరమైన నిర్ణయాల నేపథ్యంలో, మొరార్జీ దేశాయ్‌తో సహా, హేమామేమీలైన సంప్రదాయవాదులను బయటకు పంపేందుకు సిద్ధమై, 1969లో పార్టీని చీల్చారు ఇందిర. ఆమెతో విభేదించి, తమదే అసలైన పార్టీగా ప్రకటించి, ఆ తర్వాత జనతా పార్టీలో విలీనం చేసిన మొరార్జీ దేశాయ్ ప్రప్రథమ కాంగ్రేసేత ర ప్రధాని కాగలిగారు. నెహ్రూ-గాంధీ కుటుంబ వారసత్వాన్ని వ్యతిరేకించగలిగి న వారే ప్రధానిస్థాయికి ఎదగగలుగుతారని నిరూపించారాయన.

ఇందిరాగాంధీ కాంగ్రేసేతర సోషలిస్టుల-వామ పక్షాల మద్దతుతో, విప్లవాత్మక సంస్కరణలతో బలమైన నాయకురాలిగా ఎదిగారు. 1971 ఎన్నికల్లో మెజారిటీ సాధించి, కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని నాయకురాలయ్యారు. పార్టీని అంటిపెట్టుకు న్న విధేయుల్లో కొందరు క్రమేపీ ఆమెను అంతర్లీనంగా వ్యతిరేకించసాగారు. పార్టీ ని వీడిన చంద్రశేఖర్ ప్రధానిస్థాయికి, కృష్ణకాంత్ ఉప రాష్ట్రపతి స్థాయికి ఎదిగారు. ఇందిరను తీవ్రంగా విమర్శించే ఐకే గుజ్రాల్ కూడా ప్రధాని కాగలిగారు. ఎమ్జ న్సీ తర్వాత ఆమెకు అత్యంత విధేయుడుగా వున్న జగ్జీవన్‌రాం ఆమెను ఎదిరించి, పార్టీని వదిలి, కాంగ్రెస్ ఫర్ డెమాక్షికసీని స్థాపించారు. జనతా కూటమితో కలిసి పోటీ చేసి ఉప ప్రధాని అయ్యారు. ఇందిరా 1977 ఎన్నికలలో ఘోర పరాజయం పొందిన తర్వాత పార్టీలో తన వీర విధేయులకు తప్ప ఇతరులకు స్థానం లేకుండా చేశారు. పార్టీని చీల్చి, ఇందిరా కాంగ్రెస్ పేరుతో పునర్నిర్మించి, ఎవరినీ నమ్మలేని పరిస్థితుల్లో 197లో తానే అధ్యక్ష పదవిని చేపట్టారు. అనతి కాలంలో నే అఖండ విజయం సాధించి తిరిగి ప్రధాని కాగలిగారు. ఆమె వారసుడిగా ఎదుగుతున్న సంజయ్‌గాంధీ దుర్మరణం పాలవడంతో, రాజీవ్‌గాంధీని రాజకీయ తెరమీదికి తీసుకొచ్చారు. హత్యకు గురయ్యేంతవరకూ పార్టీ పగ్గాలు ఇందిరాగాంధీ తన చేతుల్లోనే వుంచుకున్నారు. తదనంతరం రాజీవ్‌కు ఆ పదవి వార సత్వంగా వచ్చింది. ఇక నాటినుంచి భారత జాతీయ కాంగ్రెస్‌ను ఇందిరా కాంగ్రెస్ అని వాడుకలో పిలవడం, ఏఐసీసీ (ఐ) అని ఉపయోగించడం మొదలైంది.

రాజీవ్ నాయకుడయ్యారు.194 సార్వవూతిక ఎన్నికల్లో భారీ మెజారిటీతో పార్టీ ని గెలిపించారు. 195 నాటికి భారత జాతీయ కాంగ్రెస్ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో ఆయన ఇందిర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తనను వ్యతిరేకించిన విశ్వనాథ్ ప్రతాప్‌సింగ్‌ను, మంత్రివర్గంలో తీసుకుని ఆర్థికశాఖను కేటాయించారు. వీపీ సింగ్ ధిక్కార ధోరణిని సహించలేని రాజీవ్ తల్లి ఇందిర ఏ విధంగా మొరార్జీని తొలగించారో, అలానే, సింగ్ శాఖలో మార్పులు చేసి రక్షణ శాఖకు మార్చారు. ఎప్పుడైతే బోఫోర్స్ కుంభకోణానికి సంబంధించిన సమాచారం వెలుగులో తేవడానికి సింగ్ సిద్ధపడుతున్నారని అనుమానం వచ్చిం దో, రాజీవ్ ఆయనను ఆ శాఖనుంచి కూడా తప్పించారు. కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి, పార్లమెంటు స్థానానికి రాజీనామా చేసిన వీపీ సింగ్, 199 ఎన్నికల్లో జనతాదళ్ అభ్యర్థిగా లోక్‌సభకు ఎన్నికై, నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వానికి సారథ్యం వహించి ప్రధాని అయ్యారు. 1991 మధ్యంతర ఎన్నికల్లో ప్రచారంలో వున్న రాజీవ్ దారు ణ హత్యకు గురికావడంతో ఆయన స్థానంలో పీవీ నరసింహారావు పార్టీ పదవిని చేపట్టి, ఎన్నికల తర్వాత ప్రధాన మంత్రి అయ్యారు.

నెహ్రూ-గాంధీ వారసత్వ పరంపరకు చెందని వారికి, పార్టీ సారథ్యం-వూపధాన మంత్రి పదవి రావడం పలువురిని ఆశ్చర్యపరిచింది. సోనియా తన చెప్పు చేతల్లో వుంటారనుకున్న పీవీ సొంత నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో, భారత దేశ ఆర్థిక సంస్కరణల ఆద్యుడిగా మన్ననలందుకున్నారు. రాజకీయాలతో సంబంధంలేని మన్మోహన్‌సింగ్‌ను ఆర్థికమంత్రిగా తెచ్చి, భవిష్యత్ ప్రధాని కావడానికి పునాదులు వేశారాయన. ఐదేళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓట మి చెందడంతో పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి పీవీని నిర్దాక్షిణ్యంగా తొలగించారు. ఆయన స్థానంలో వచ్చిన కేసరికి అదే పరిస్థితి ఎదురైంది. నాటి నుంచి సోనియాగాంధీ శకం మొదలైంది.

లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించిన శరద్ పవార్, ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థిగా, భారత దేశంలో పుట్టిన వారి పేరునే ప్రకటించాలన్న ధిక్కార స్వరం వినిపించారు. మాట నెగ్గించుకోలేని పవార్, మాజీ లోక్‌సభ స్పీకర్ సంగ్మాతో కలిసి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని నెలకొల్పారు. దీంతో సోనియా చాకచక్యంగా వ్యవహరించి సీనియర్లను పక్కనపెట్టి మన్మోహన్ సింగ్‌ను తెరపైకి తెచ్చారు. ఎన్నికల అనంతరం సోనియా యూపీఏ ప్రభుత్వానికి నేతృత్వం వహించడానికి తిరస్కరించి, మన్మోహన్‌ను ప్రధానిని చేశారు. ప్రణబ్‌ముఖర్జీ గతంలో కేంద్ర ఆర్థికశాఖ నిర్వహించినప్పుడు, రిజర్వ్‌బాంక్ గవర్నర్‌గా మన్మోహన్ పనిచేశారు. ప్రణబ్ ఇప్పుడు పార్టీలో తనకంటే జూనియరైన మన్మోహన్ మంత్రివర్గంలో పనిచేస్తున్నారు. ఆయనకు ప్రధాని కావాలన్న ఆశా చావలేదు. గతంలో రాజీవ్ హయాంలో, ఇందిర హత్యానంతరం జరిగిన ఎన్నికల తర్వాత, నిర్లక్ష్యానికి గురై పార్టీని వీడి సొంత కుంపటి పెట్టుకున్నారు. తిరిగి పీవీ హయాంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా స్వగృహ ప్రవేశం చేసి, పార్టీకి-సోనియాకు విధేయుడిగా కొనసాగుతున్నారు. ఆయనలోని నాటి రాజీవ్ (నెవూ-గాంధీ)ల వ్యతిరేకత దేనికైనా దారితీయవచ్చునేమో!
సోనియా సూచనను పాటించకుండా సొంతకుంపటి పెట్టుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళు,్ల తనకు అసలైన శత్రువులు కారని ఆమెకూ తెలుసు. నెహ్రూ-గాంధీల వారసత్వం చెక్కు చెదరకుండా వుండాలంటే కాంగ్రెస్ పార్టీలో మరో ప్రక్షాళన జరగాల్సిందే. అందుకే పార్టీలో చీలిక తప్పకపోవచ్చు. భారత జాతీయ కాంగ్రెస్(ఆర్-రాహుల్)కాని, భారత జాతీయ కాంగ్రెస్ (ఎస్-సోని యా) కాని ఆవిర్భవించవచ్చు. అనూహ్యంగా తెరపైకి ప్రియాంక గాంధీని తీసుకొచ్చి కాంగ్రెస్ (పి-వూపియాంక) స్థాపన జరిగినా ఆశ్చర్యం లేదు. అలా జరగాలంటే జగన్ లాంటి యువ నాయకులను తన వెంట వుంచుకోవాలా? వదిలించుకోవాలా? అన్న ఆలోచన చేయకుండా సోనియా వుండే అవకాశాలు లేనే లేవు!

-వనం జ్వాలా నరసింహారావు

35

VANAM JWALA NARASIMHA RAO

Published: Thu,December 21, 2017 01:12 AM

కృత్రిమ వైరుధ్యాలతో కుమ్ములాటలా!

హైదరాబాద్‌లో అద్భుతంగా జరిగిన జీఈఎస్ ఎనిమిదవ సదస్సు నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా వ్యయం చేయలేదన్నారు సీఎం. అసలీ సదస

Published: Tue,November 21, 2017 11:20 PM

ఆధ్వర్యం మనదే.. అధ్యక్షత మనదే

తెలంగాణలో జరిగే ప్రపంచ తెలుగు మహాసభలకు రంగం సిద్ధమవుతున్నది. సమావేశాలు జరుగడానికి ఇంకా మూడు వారాలే మిగిలాయి. దేశం నలుమూలల నుంచి, వ

Published: Sun,November 12, 2017 12:41 AM

గ్రామ పునర్నిర్మాణం దిశగా..

క్రియాశీల పంచాయతీరాజ్ వ్యవస్థకు శ్రీకారం చుట్టాలని, స్వయం ప్రతిపత్తితో గ్రామాలు, వ్యక్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అభివృద్ధిలో భ

Published: Sun,October 15, 2017 01:33 AM

కులాలపై విమర్శ తగదు

శతాబ్దాలకాలంగా బ్రాహ్మణ, బ్రాహ్మణేతరులు కలిమిడిగా, అభివృద్ధి చేసిన సామాజిక, రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. ఒకరిని మరొకరు దూషించుకున

Published: Wed,October 4, 2017 12:56 AM

వ్యాపారం చేయడమే నేరమా?

ఇటీవల ఒక సామాజిక శాస్త్రవేత్త కోమట్లను సామాజిక స్మగ్లర్లు (దొంగ రవాణాదారులు) అంటూ ఒక అసంబద్ధమైన బుల్లి పుస్తకాన్ని రాశాడు. దానిమీద

Published: Sat,April 22, 2017 03:12 AM

కేంద్ర, రాష్ట్ర సంబంధాల్లో కొత్త అధ్యాయం

ముఖ్యమంత్రి అసెంబ్లీలో కేంద్ర-రాష్ట్ర సంబంధాల విషయంలో వెలిబుచ్చిన అభిప్రాయాలు, ముస్లిం రిజర్వేషన్ల పెంపు అంశం, యావత్ భారతదేశం దృష

Published: Tue,March 28, 2017 12:01 AM

అభివృద్ధి కోసమే అప్పులు

అత్యంత హుందాగా, సమర్థవంతంగా, అర్థవంతంగా సుమారు మూడు వారాల పాటు జరిగిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా ప

Published: Tue,February 14, 2017 01:23 AM

ప్రపంచవ్యాప్త మహిళా సాధికారత

ఎందరో మహిళలు దేశ దేశాల్లో కీలకమైన పదవుల్లో ఉండటం గత ఐదారు దశాబ్దాల మహిళా సాధికారతకు నిదర్శనం. భవిష్యత్‌లో మరికొన్ని దేశాల అధ్యక్

Published: Tue,December 13, 2016 01:03 AM

బహుముఖ ప్రజ్ఞాశాలి సీఎస్‌ఆర్

ఉత్తర భారతదేశంలోని బద్రీనాథ్, కేదార్‌నాథ్ దేవాలయానికి 1977లో సీఎస్‌ఆర్అ ధ్యక్షులుగా నియమించబడ్డారు. వారి కాలంలోనే బద్రీనాథ్, కేదార

Published: Fri,September 23, 2016 11:32 PM

ప్రతిభకు ప్రతీకలు గురుకులాలు

విద్యా విధానంలో ప్రస్తుతమున్న అన్ని అనర్థాలకూ గురుకుల విద్య సమాధానం కాకపోవచ్చు. కానీ ఈ నమూనా తప్పకుండా,అణగారిన వర్గాల్లో ఆణిముత్య

Published: Sun,September 18, 2016 12:57 AM

అన్యాయానికి సజీవసాక్ష్యం

నందికొండ ప్రాజెక్టు నిర్మాణం 1956న ప్రారంభం కాగా 1969లో పూర్తయ్యింది.గేట్ల ఏర్పాటు, స్పిల్‌వే ఏర్పాటు 1974 నాటికి పూర్తి చేయటం జరి

Published: Thu,September 3, 2015 01:28 AM

అందరికీ విద్య దిశగా అడుగులు

సమాజానికి అవసరమయ్యే సేవలు ఏమిటి? అందుకు అనుగుణంగా సేవలందించేవారిని ఎలా తయారు చేయాలి? అనే విషయంపై విద్యా శాఖకు అవగాహన ఉండాలి. ఏ వృత

Published: Sun,August 23, 2015 01:39 AM

వ్యయం లేని వ్యవసాయం కావాలి

తెలంగాణలో ప్రతి గ్రామంలో రైతులతో వ్యవసాయ శాఖ ప్రత్యక్ష అనుబంధం కలిగి వుండాలి. ఎప్పటికప్పుడు రైతులతో మాట్లాడుతూ వ్యవసాయానికి పూర్వ

Published: Wed,August 19, 2015 12:09 AM

నాటిరోజుల్లో గ్రామీణ జనజీవనం

వేసవి కాలంలో పొలాలకు పెంట తోలే ప్రక్రియ తో వ్యవసాయ పనులు మొదలయ్యేవి. పాడి పశువుల వల్ల పోగైన పెంటను ఎరువుగా పొలాలకు తరలించేవారు. అద

Published: Wed,August 12, 2015 01:49 AM

యాభై ఏళ్ల సింగపూర్.. విశేషాలు

ఐదారు దశాబ్దాల క్రితం వరకూ దూర ప్రాచ్య తీర ప్రాంతంలో, బ్రిటన్‌కు ప్రధానమైన నావికా సైనిక స్థావరంగా మాత్రమే ఉండేది సింగపూర్. అలాంటిద

Published: Fri,July 31, 2015 11:18 PM

ఆచితూచి.. అసలైన నిర్ణయం

న్యాయపరమైన నియమ, నిబంధనల నేపథ్యంలో రాజ్యాంగ ప్రకరణాలు, న్యాయస్థానాల తీర్పులు ఉండి తీరాలి. సంప్రదాయాలకు ఇదమిత్థమైన నిబంధనలంటూ ఏవీ ఉ

Published: Thu,July 23, 2015 12:20 AM

పర్యాటక మకుటంగా యాదాద్రి ..

180 ఎకరాల విస్తీర్ణం గల యాదగిరిగుట్ట స్థలాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకునేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఆ ప్రాంతమంతా అందమైన చెట్లతో

Published: Thu,July 2, 2015 04:46 AM

ఆకుపచ్చని తెలంగాణ దిశగా..

బంగారు తెలంగాణ స్వప్నం సాకార దిశగా మరో కీలకమైన అడుగు వేయడానికి ప్రభుత్వం సకల సన్నాహాలు చేసింది. తెలంగాణకు హరిత హారం పేరుతో ముఖ్యమం

Published: Thu,June 25, 2015 01:13 AM

పుష్కరాలు ఆధ్యాత్మిక పరిమళాలు

గౌతమ మహర్షి కఠోర తపస్సు కారణాన భూలోకానికి తేబడిన గంగానది పాయ గౌతమిగా, గోదావరిగా ప్రసిద్ధికెక్కింది. గంగానది అంశగా భావించబడే గోదావర

Published: Thu,September 11, 2014 12:27 AM

నాటి హైదరాబాద్ జ్ఞాపకాలు

జూన్, 1964లో నేను, నాన్న గారు కలిసి మొదటిసారి హైదరాబాద్ చేరుకున్నాం.ఖమ్మంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు బస్సెక్కితే హైదరాబాద్ గౌలిగూ

country oven

Featured Articles