గెలుపెవరిది ? ఓటమెవరిది?


Sat,October 6, 2012 03:40 PM

లాంఛనవూపాయంగా ముగుస్తుందనుకున్న అవిశ్వాస తీర్మానం తతంగం, ఆద్యం తం ఆసక్తికరంగా కొనసాగింది. తీర్మానం వీగిపోయిందనేకన్నా, అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు ఎన్నో రకాల సందేశాలను పంపిందనాలి. బద్ధవైరత్వం వున్న తెలుగుదేశం పార్టీతో ఒకవైపు తెలంగాణ రాష్ట్ర సమితి, మరో పక్క వైఎస్‌ఆర్‌కాంక్షిగెస్ పార్టీ కారణాలేవైనా చేతులు కలిపాయి. సభలో ఒకరిని ఇంకొకరు తీవ్రంగా విమర్శించుకున్నప్పటికీ, అవిశ్వాసానికి అనుకూలంగానే ఓటు వేశాయి.

నిఖార్సుగా ప్రభుత్వ వ్యతిరేకత అణువణువునా కనిపించే రీతిలో మాట్లాడింది బహు శా తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులేనేమో! పీఆర్పీ సభ్యుడు కాంగ్రెస్ పార్టీ సభ్యులకన్నా గట్టిగా ప్రభుత్వాన్ని సమర్థిస్తూ వాదన వినిపించారు. రాజశేఖరడ్డి సతీమణి విజయమ్మ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి తన భర్త పడిన కష్టాలను ఏకరవు పెట్టడానికి ఇంతకంటే తగిన సమయం లేదన్న తరహాలో వ్యవహరించారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఒకటికి రెండుసార్లు తానే ముఖ్యమంవూతిని అన్న చందాన స్పందించారు.

అవిశ్వాసం నెగ్గిందా-ఓడిందా అనేకంటే, ఎవరి పక్షాన, ఎవరి పార్టీ పక్షాన ఎంతమంది ఉన్నారనేది మాత్రం స్పష్టంగా తేలిపోయింది. జగన్ పార్టీకి ఓటమి అని అంద రూ భావిస్తున్నా, శాసనసభలో జగన్ వర్గం కేవలం 19 మంది మాత్రమే అని తేలి నా, కిరణ్ సర్కారు పార్టీపరంగా మైనారిటీలో పడిపోయిందనేది వాస్తవం. ఒకవ్యక్తి, అధికారంలో లేకపోయినప్పటికీ, ఆయన వెంట వెళ్తే తమకిప్పుడికిప్పుడే ఏమీ ఒరగ క పోయినప్పటికీ, 16 మంది అధికార పక్ష సభ్యులు, వైఎస్‌ఆర్‌కాంక్షిగెస్ పార్టీతో వుండడం విశేషమే! అందుకే కిరణ్ సర్కారు గెలిచినా ఓటమితో సమానమే. గెలుపు- ఓటములు చంద్రబాబు నాయుడి తెలుగుదేశానికి సరిసమానమనాలి.

నూట పాతికేళ్ల భారత జాతీయ కాంగ్రెస్ ప్రస్థానంలో, ధిక్కరించి పార్టీ వీడిన ప్రముఖులకే ప్రధాని, ఉప ప్రధాని, రాష్ట్రపతి లాంటి అత్యున్నత పదవులు దక్కాయి. విధేయత, వీర విధేయత ప్రదర్శించిన వారంతా తాము అనుభవిస్తున్న పదవులను కాపాడుకోవడానికి పరిమితమయ్యారే కాని ఉన్నత శిఖరాలకు చేరుకోలేకపోయారు. ఎత్తుకు పై ఎత్తులు వేయగల కాంగ్రెస్ పార్టీలో ఏదైనా సాధ్యమే... ఏదీ అసా ధ్యం కాదు! వై. ఎస్. జగన్మోహనడ్డి కూడా అదే బాటలో పయనించనున్నారా? ఆయన వెంట నడుస్తున్న, రేపో-మాపో సభ్యత్వం కోల్పోనున్న పద్దెనిమిమంది రాష్ట్ర శాసనసభ సభ్యులకు భవిష్యత్ బంగారుదవుతుందా? లేక, పార్టీని ధిక్కరించి కష్టాలపాలైన కొందరి లాగా అంధకారమవుతుందా? సమాధానం ఇతమిత్థంగా రాని ప్రశ్నే!

రాజీవ్‌గాంధీ మరణానంతరం కాంగ్రెస్ పార్టీ పగ్గాలను పీవీ నరసింహారావు చేపట్టారు. 1996 ఎన్నికలలో పార్టీ ఓటమి పాలవడంతో, సోనియా విశ్వాసాన్ని కోల్పోయి పార్టీ అధ్యక్షుడిగా, పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా రాజీనామా చేయక తప్పలేదు. వృద్ధ నాయకుడు సీతారాం కేసరికి ఆ రెండు పదవు లు దక్కాయి. సీతారాం కేసరికి వ్యతిరేకంగా పలువురు సీనియర్ నాయకులు ధ్వజం ఎత్తడంతో, పార్టీ ఛిన్నాభిన్నం కాకుండా రక్షించమని కొందరు నాయకులు చేసిన అభ్యర్థన మేరకు, సోనియా తొలుత పార్టీ ప్రాథమిక సభ్యత్వం స్వీకరించారు. అచిర కాలంలోనే కొంద రు ఆమె జాతీయతను ప్రశ్నించినప్పటికీ, అధ్యక్ష పదవిని చేపట్టి పన్నెండేళ్లకు పైగా పార్టీకి తిరుగులేని నాయకురాలిగా, నెహ్రూ-గాంధీల వారసత్వాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. పార్టీలో ఆమె తీసుకున్న నిర్ణయమే, ఏక వ్యక్తి అభివూపాయమే చివరకు ఏకాభివూపాయంగా అవుతోంది.

రాజీవ్ గాంధీ నాయకత్వంలో 1984 సార్వవూతిక ఎన్నికల్లో పార్టీ భారీ మెజారిటీ సాధించింది.1985లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. విశ్వనాథ్ ప్రతాప్ సింగ్‌ను మంత్రివర్గంలో తీసుకుని ఆర్థిక శాఖను కేటాయించి, సింగ్ ధిక్కార ధోరణి ని సహించలేకశాఖలో మార్పులు చేసి రక్షణ శాఖకు మార్చాడు. బోఫోర్స్ సమాచా రం వెలుగులోకి తేవడానికి సింగ్ సిద్ధపడుతున్నాడని అనుమానం వచ్చిందో, ఆ శాఖనుంచి కూడా తప్పించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్లమెంటు స్థానానికి రాజీనామా చేసిన వీపీ సింగ్, 1989లో జరిగిన ఎన్నికల్లో జనతా దళ్ అభ్యర్థిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వానికి సారథ్యం వహించి ప్రధాని అయ్యా రు. ఆయనే కనుక రాజీవ్‌కు వీర విధేయుడిగా వుండి పోయినట్లయితే, ప్రధాని స్థాయికి ఎదిగేవారు కానే కాదు. 1991లో రాజీవ్ గాంధీ హత్యకు గురికావడంతో, పీవీ నరసింహారావు ఏకాభివూపాయ అభ్యర్థిగా పార్టీ పదవిని చేపట్టి, ఎన్నికల తర్వాత ప్రధాని అయ్యారు.

పీవీ సొంత నిర్ణయాలు తీసుకోవడం, ఆర్థిక సంస్కరణల ఆద్యుడిగా అంతర్జాతీ య మన్ననలందుకోవడం సోనియాకు మింగుడు పడలేదు. రాజకీయాలతో సంబంధంలేని మన్మోహన్‌ను ఆర్థిక మంత్రిగా తెచ్చి, భవిష్యత్ ప్రధాని కావడానికి పునాదులు వేశారాయన. ఐదేళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓటమి చెందిన పార్టీ నాయకత్వ బాధ్యతలనుంచి దయనీయంగా తొలగించారాయనను. సోనియా శకం మొదలైంది. ఐదో తరం వ్యక్తిగా పార్టీ అధ్యక్షురాలైంది. ఇంతలో 2004 ఎన్నికల సంరంభం మొదలైంది. రద్దయిన లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించిన శరద్ పవార్ ధిక్కార స్వరం వినిపించాడు. నెహ్రూ-గాంధీ వారసురాలిగా సోనియా ప్రధాని కాకూడదన్న భావం ఆయనకే కాకుండా మరి కొందరిలో కూడా ప్రస్ఫుటం గా కనిపించింది. మాట నెగ్గించుకోలేని పవార్, మాజీ లోక్ సభ సభాపతి సంగ్మాతో కలిసి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని నెలకొల్పారు.

స్థెర్యం కోల్పోని సోనియా, చాకచక్యంగా మన్మోహన్ సింగ్‌ను తెర పైకి తెచ్చి ఆయనను ప్రధానిని చేసింది.
రిజర్వ్ బాంక్ గవర్నర్‌గా మన్మోహన్ సింగ్ పనిచేసిన రోజుల్లో, ఆర్థిక మంత్రిత్వ శాఖను నిర్వహించిన ప్రణబ్ కుమార్ ముఖర్జీ ఇప్పుడు మన్మోహన్ మంత్రివర్గంలో పనిచేయక తప్పలేదు. కాంగ్రెస్ సీనియారిటీ సోనియా నిర్ణయం ముందు పనికి రాలేదు. ఆయనకు ప్రధాని కావాలన్న ఆశా చావలేదు. ఎదురు తిరిగే ధైర్యం అప్పట్లో లేదు. కాని, అవకాశం వస్తే వదులుకుంటాడా? గతంలో రాజీవ్ హయాంలోఒకసారి నిర్లక్ష్యానికి గురై పార్టీని వీడి సొంత కుంపటి కూడా పెట్టుకున్నారు. తిరిగి పీవీ హయాంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా స్వగృహ ప్రవేశం చేసి, పార్టీకి-సోనియాకు (పైకి వీర)విధేయుడిగా ఇప్పుడు కొనసాగుతున్నారు. ఆయనలోని అలనాటి రాజీవ్ (నెవూ-గాంధీ) వ్యతిరేకత దేనికైనా, ఎప్పుడైనా దారితీయవచ్చు!

తనకు మద్దతు ఇస్తూనే-ఇస్తున్నట్లు నటిస్తూనే, అవకాశం కోసం ఎదురుచూస్తున్న పార్టీలోని సొంత మనుషుల వ్యవహారం సోనియా కు తెలియకుండా వుంటుందా? బయటపడి ఏదో ఒక కారణం చూపించి, సోనియా సూచనను పాటించని వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్లు ఆమెకు అసలైన శత్రువులు కారని ఆమెకూ తెలుసు. జగన్ లాంటి వారు జాతీయస్థాయిలో సోనియాని అస్థిరపరిచలేరని కూడా ఆమెకు తెలుసు. వచ్చిన చిక్కల్లా కంట్లో నలుసులతోనే. సోనియాకు కాంగ్రెస్ పార్టీని మరో మారు ఏదో ఒక రకంగా, అత్తగారి తరహాలో చీలిస్తేనో, లేక, ఏదో కారణాన జాతీయస్థాయిలో ఆమెను వ్యతిరేకించేవారు చీలిపోతేనే మంచిది.

నెహ్రు-గాంధీ వారసత్వం చెక్కు చెదరకుండా వుండాలంటే కాంగ్రెస్ పార్టీలో మరో ప్రక్షాళన జరగాల్సిందేయకమశిక్షణ సంఘం అధ్యక్షుడిగా వున్న ఏకే ఆంటోనీ ఒకప్పుడు పార్టీని వీడిన వాడే. ప్రణబ్ ముఖర్జీ పార్టీని వీడిన వాడే. ఇందిరకు వ్యతిరేకంగా కాంగ్రెస్ (ఐ) నుంచి బయటికొచ్చి, భారత జాతీయ కాంగ్రెస్ (అర్స్) స్థాపించినప్పుడు అందు లో చేరిన ప్రముఖుల్లో ఆంటోనీ ఒకరు. సోనియాకు సన్నిహితుడైన ప్రియరంజన్ దాస్ మున్షీ కూడా ఒకరు. ఆంటోనీ అంతటితో ఆగకుండా, కాంగ్రెస్ (ఎ)ను స్థాపించి, 1982లో స్వగృహ ప్రవేశం చేసి, పార్టీ లో క్రమశిక్షణను కాపాడే పనిలో వున్నాడు! సోనియా ఆదేశాలిచ్చిందన్న సాకుతో, మొయిలీలు-అహ్మద్ పటేల్లు-వూపణబ్ ముఖర్జీలు, వారు చెప్పారని ఆంధ్రా నాయకులు, జగన్‌కు మంచిచెపుతున్నట్లు నటిస్తూనే, ఆమెకు వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నారు. అలాంటి వారిని గుర్తించే ప్రయత్నం జరుగుతుండొచ్చు. అందుకే పార్టీ లో చీలిక తప్పకపోవచ్చు.

భారత జాతీయ కాంగ్రెస్(ఆర్) కాని, భారత జాతీయ కాంగ్రెస్ (ఎస్) కాని ఆవిర్భవించవచ్చు. అనూహ్యంగా తెర పైకి ప్రియాంక గాంధీని తీసుకొచ్చి కాంగ్రెస్ (పి) స్థాపన జరిగినా ఆశ్చర్యం లేదు. అలా జరగాలంటే, జగన్ లాంటి యువ నాయకులను వెంట వుంచుకోవాల్నా? వదిలించుకోవాల్నా? అన్న ఆలోచన చేయకుండా వుంటుందా సోనియా? అంటే, జగన్మోహన్ రెడ్డి వెంట నడిచిన పదహారు మంది కాంగ్రెస్ పార్టీ శాసనసభ సభ్యులకు సోనియా నుంచో, ఆమె కోటరీ మనుషులుగా నటిస్తున్న వారినించో, సలహాలు-సూచనలు అందుతున్నాయనడంలో అనుమానం లేదు. ఈ నేపథ్యంలోనే తన పార్టీ వారు కాకపోయినా తనకు ఎప్పుడో అప్పుడు విధేయులుగా వుండకపోతారా అన్న నమ్మకంతో టీఆర్‌ఎస్ లాంటి పార్టీలను కలుపుకునిపోయేందుకు ప్రయత్నించవచ్చు.

తన తనయుడు రాహుల్‌ని ప్రధాని పీఠంపై కూర్చొబెట్టడానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరించినా ఆశ్చర్యపోనక్కరలేదు! తెలంగాణ ఏర్పాటు విషయంలో కావాలనే తనను తప్పుదోవ పట్టిస్తున్న ప్రణబ్ ముఖర్జీ లాంటి వారి నుంచి సోనియా అప్రమత్తంగా వుంటే మంచిది.

-వనం జ్వాలా నరసింహారావు



35

VANAM JWALA NARASIMHA RAO

Published: Thu,December 21, 2017 01:12 AM

కృత్రిమ వైరుధ్యాలతో కుమ్ములాటలా!

హైదరాబాద్‌లో అద్భుతంగా జరిగిన జీఈఎస్ ఎనిమిదవ సదస్సు నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా వ్యయం చేయలేదన్నారు సీఎం. అసలీ సదస

Published: Tue,November 21, 2017 11:20 PM

ఆధ్వర్యం మనదే.. అధ్యక్షత మనదే

తెలంగాణలో జరిగే ప్రపంచ తెలుగు మహాసభలకు రంగం సిద్ధమవుతున్నది. సమావేశాలు జరుగడానికి ఇంకా మూడు వారాలే మిగిలాయి. దేశం నలుమూలల నుంచి, వ

Published: Sun,November 12, 2017 12:41 AM

గ్రామ పునర్నిర్మాణం దిశగా..

క్రియాశీల పంచాయతీరాజ్ వ్యవస్థకు శ్రీకారం చుట్టాలని, స్వయం ప్రతిపత్తితో గ్రామాలు, వ్యక్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అభివృద్ధిలో భ

Published: Sun,October 15, 2017 01:33 AM

కులాలపై విమర్శ తగదు

శతాబ్దాలకాలంగా బ్రాహ్మణ, బ్రాహ్మణేతరులు కలిమిడిగా, అభివృద్ధి చేసిన సామాజిక, రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. ఒకరిని మరొకరు దూషించుకున

Published: Wed,October 4, 2017 12:56 AM

వ్యాపారం చేయడమే నేరమా?

ఇటీవల ఒక సామాజిక శాస్త్రవేత్త కోమట్లను సామాజిక స్మగ్లర్లు (దొంగ రవాణాదారులు) అంటూ ఒక అసంబద్ధమైన బుల్లి పుస్తకాన్ని రాశాడు. దానిమీద

Published: Sat,April 22, 2017 03:12 AM

కేంద్ర, రాష్ట్ర సంబంధాల్లో కొత్త అధ్యాయం

ముఖ్యమంత్రి అసెంబ్లీలో కేంద్ర-రాష్ట్ర సంబంధాల విషయంలో వెలిబుచ్చిన అభిప్రాయాలు, ముస్లిం రిజర్వేషన్ల పెంపు అంశం, యావత్ భారతదేశం దృష

Published: Tue,March 28, 2017 12:01 AM

అభివృద్ధి కోసమే అప్పులు

అత్యంత హుందాగా, సమర్థవంతంగా, అర్థవంతంగా సుమారు మూడు వారాల పాటు జరిగిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా ప

Published: Tue,February 14, 2017 01:23 AM

ప్రపంచవ్యాప్త మహిళా సాధికారత

ఎందరో మహిళలు దేశ దేశాల్లో కీలకమైన పదవుల్లో ఉండటం గత ఐదారు దశాబ్దాల మహిళా సాధికారతకు నిదర్శనం. భవిష్యత్‌లో మరికొన్ని దేశాల అధ్యక్

Published: Tue,December 13, 2016 01:03 AM

బహుముఖ ప్రజ్ఞాశాలి సీఎస్‌ఆర్

ఉత్తర భారతదేశంలోని బద్రీనాథ్, కేదార్‌నాథ్ దేవాలయానికి 1977లో సీఎస్‌ఆర్అ ధ్యక్షులుగా నియమించబడ్డారు. వారి కాలంలోనే బద్రీనాథ్, కేదార

Published: Fri,September 23, 2016 11:32 PM

ప్రతిభకు ప్రతీకలు గురుకులాలు

విద్యా విధానంలో ప్రస్తుతమున్న అన్ని అనర్థాలకూ గురుకుల విద్య సమాధానం కాకపోవచ్చు. కానీ ఈ నమూనా తప్పకుండా,అణగారిన వర్గాల్లో ఆణిముత్య

Published: Sun,September 18, 2016 12:57 AM

అన్యాయానికి సజీవసాక్ష్యం

నందికొండ ప్రాజెక్టు నిర్మాణం 1956న ప్రారంభం కాగా 1969లో పూర్తయ్యింది.గేట్ల ఏర్పాటు, స్పిల్‌వే ఏర్పాటు 1974 నాటికి పూర్తి చేయటం జరి

Published: Thu,September 3, 2015 01:28 AM

అందరికీ విద్య దిశగా అడుగులు

సమాజానికి అవసరమయ్యే సేవలు ఏమిటి? అందుకు అనుగుణంగా సేవలందించేవారిని ఎలా తయారు చేయాలి? అనే విషయంపై విద్యా శాఖకు అవగాహన ఉండాలి. ఏ వృత

Published: Sun,August 23, 2015 01:39 AM

వ్యయం లేని వ్యవసాయం కావాలి

తెలంగాణలో ప్రతి గ్రామంలో రైతులతో వ్యవసాయ శాఖ ప్రత్యక్ష అనుబంధం కలిగి వుండాలి. ఎప్పటికప్పుడు రైతులతో మాట్లాడుతూ వ్యవసాయానికి పూర్వ

Published: Wed,August 19, 2015 12:09 AM

నాటిరోజుల్లో గ్రామీణ జనజీవనం

వేసవి కాలంలో పొలాలకు పెంట తోలే ప్రక్రియ తో వ్యవసాయ పనులు మొదలయ్యేవి. పాడి పశువుల వల్ల పోగైన పెంటను ఎరువుగా పొలాలకు తరలించేవారు. అద

Published: Wed,August 12, 2015 01:49 AM

యాభై ఏళ్ల సింగపూర్.. విశేషాలు

ఐదారు దశాబ్దాల క్రితం వరకూ దూర ప్రాచ్య తీర ప్రాంతంలో, బ్రిటన్‌కు ప్రధానమైన నావికా సైనిక స్థావరంగా మాత్రమే ఉండేది సింగపూర్. అలాంటిద

Published: Fri,July 31, 2015 11:18 PM

ఆచితూచి.. అసలైన నిర్ణయం

న్యాయపరమైన నియమ, నిబంధనల నేపథ్యంలో రాజ్యాంగ ప్రకరణాలు, న్యాయస్థానాల తీర్పులు ఉండి తీరాలి. సంప్రదాయాలకు ఇదమిత్థమైన నిబంధనలంటూ ఏవీ ఉ

Published: Thu,July 23, 2015 12:20 AM

పర్యాటక మకుటంగా యాదాద్రి ..

180 ఎకరాల విస్తీర్ణం గల యాదగిరిగుట్ట స్థలాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకునేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఆ ప్రాంతమంతా అందమైన చెట్లతో

Published: Thu,July 2, 2015 04:46 AM

ఆకుపచ్చని తెలంగాణ దిశగా..

బంగారు తెలంగాణ స్వప్నం సాకార దిశగా మరో కీలకమైన అడుగు వేయడానికి ప్రభుత్వం సకల సన్నాహాలు చేసింది. తెలంగాణకు హరిత హారం పేరుతో ముఖ్యమం

Published: Thu,June 25, 2015 01:13 AM

పుష్కరాలు ఆధ్యాత్మిక పరిమళాలు

గౌతమ మహర్షి కఠోర తపస్సు కారణాన భూలోకానికి తేబడిన గంగానది పాయ గౌతమిగా, గోదావరిగా ప్రసిద్ధికెక్కింది. గంగానది అంశగా భావించబడే గోదావర

Published: Thu,September 11, 2014 12:27 AM

నాటి హైదరాబాద్ జ్ఞాపకాలు

జూన్, 1964లో నేను, నాన్న గారు కలిసి మొదటిసారి హైదరాబాద్ చేరుకున్నాం.ఖమ్మంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు బస్సెక్కితే హైదరాబాద్ గౌలిగూ

Published: Tue,June 10, 2014 01:16 AM

వాగ్దానాల అమలు దిశగా..

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వారంలోపల కేసీఆర్ తాను చేయబోయే కార్యక్రమాలు ఎలా వుండబోతున్నాయో చెప్పారు. తమ ఎన్నికల ప్రణాళికలో ప

Published: Tue,December 10, 2013 12:53 AM

ద్వీప దేశం సింగపూర్ అభివృద్ధి రహస్యం!

గత ఏడాది మొదటిసారి వచ్చినప్పుడు, ఇప్పుడు మళ్లీ రెండో మారు వచ్చినప్పుడు సింగపూర్ నగరంలో తిరుగుతుంటే ఆశ్చ ర్యం. ఎలా అతి కొద్ది కాలంల

Published: Sat,May 25, 2013 01:10 AM

అంతర్‌రాష్ట్ర జలవివాదాలు, రాజకీయాలు

బాబ్లీ ప్రాజెక్టు వివాదంపై కోర్టు తీర్పుమీద వివరణ, సమీక్ష కోసం సుప్రీంకోర్టు లో పిటిషన్ దాఖలుకు ముందు మూడంచెల వ్యూహం అనుసరించాలని

Published: Mon,April 22, 2013 12:38 AM

రాహుల్ కోసం అధిష్ఠానం ఆరాటం

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మరోమారు రాష్ట్ర వ్యవహారాలపై దృష్టి సారించారనడానికి నిదర్శనం,ఢిల్లీకి రావాల్సిందిగా ముఖ్

Published: Mon,April 8, 2013 02:40 AM

కాగ్ నివేదిక పరమార్థమే!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2006-2011 మధ్య జరిపిన భూముల కేటాయింపులలో 50 కోట్ల పైగా విలువగల భూమి అక్రమ పద్ధతుల్లో అన్యాక్షికాంతమైందని క

Published: Fri,March 29, 2013 11:50 PM

అసమ్మతిపై అనర్హత అస్త్రం

అవిశ్వాస తీర్మానం ఓటింగులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటువేసిన తొమ్మిది మంది కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలపై, పార్టీ ఫిరాయింపుల ని

Published: Wed,December 19, 2012 11:49 PM

బ్రాహ్మణుల బాధలు పట్టవా?

ఒక నాడు సమాజాన్ని ఐక్యంగా వుంచడానికి తమ శాయశక్తులా కృషిచేసిన బ్రాహ్మణుల స్థితిగతులు రోజురోజుకూ క్షీణించిపోతున్నాయి. క్రిస్టియన్ మి

Published: Fri,December 14, 2012 12:01 AM

కాలయాపనకే అఖిల పక్షాలు!

తెలంగాణ సమస్యపై శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇచ్చి రెండేళ్లు పూర్తి కావస్తున్నది. తదనంతరం అనేక అఖిలపక్ష సమావేశాలు జరిగాయి. ఏమీ తేలలేదు.

Published: Wed,December 26, 2012 04:31 PM

రాజ్యాంగ వ్యవస్థలపై రాజకీయాలు వద్దు!

దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు గవర్నర్ వ్యవహారం నచ్చనప్పుడు గవర్నర్ పాత్రను విమర్శించడంతో సరిపుచ్చుకోకుండా, గవర్నర్ వ్యవస్థనే రద

Published: Wed,October 10, 2012 05:37 PM

దారులు ఏవైనా గమ్యమొక్కటే

తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటూ ఏళ్ల తరబడి సాగుతున్న ఉద్య మం మరో మలుపు తిరిగింది. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె

Published: Sat,October 6, 2012 03:36 PM

అక్కసుతోనే పీవీపై ఆరోపణలు

బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ పీవీ బాధ్యుడా? పీవీకి, నెహ్రూ-గాంధీ కుటుంబానికి భేదాభివూపాయాలున్నాయా? ఆ

Published: Sat,October 6, 2012 03:37 PM

క్షీణిస్తున్న పార్లమెంట్ జవాబుదారీతనం

భారత పార్లమెంట్ షష్టిపూర్తి జరుపుకుంటున్నది. రాష్ట్రానికి చెందిన ఇద్దరు నాటి తొలితరం పార్లమెం సహా మరో ఇద్దరు మాజీ పార్లమెంటుసభ్యుల

Published: Sat,October 6, 2012 03:37 PM

విజ్ఞానాన్ని అందించిన ప్రణవానంద

గత శతాబ్దం ప్రారంభంలో, స్వీడన్‌కు చెందిన స్వెన్ హెదిన్ అనే యూరోపియన్ పర్యాటకుడు, టిబెట్ వెళ్లి, ఆసియా ఖండానికి చెందిన భౌగోళిక విషయ

Published: Sat,October 6, 2012 03:38 PM

పార్టీని వీడిన వాళ్లకే పట్టం!

అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసి, ధిక్కార స్వరం వినిపించి న కాంగ్రెస్ శాసనసభ్యులమీద వేటు పడింది. వారితో పాటు ఎంపీ మేకపాటి

Published: Sat,October 6, 2012 03:38 PM

హైమన్‌డార్ఫ్ అనుబంధం

మానవ పరిణామ శాస్త్రవేత్త ప్రొఫెసర్ వోన్ ఫ్యూరర్ హైమ న్‌డార్ఫ్‌కు గిరిజన సంప్రదాయాల ప్రకారం, అంతి మ సంస్కారాలు జరిపించడానికి ఆయన కు

Published: Sat,October 6, 2012 03:38 PM

స.హ. చట్టంలో సంభావనలు!

సమాచార హక్కు చట్టం కమిషనర్లుగా కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఎనిమిదిని ఎంపిక చేసింది. ఆ నిర్ణయానికి ప్రతిపక్షనేత మద్దతు ఇచ్చీ-ఇవ్వ

Published: Sat,October 6, 2012 03:39 PM

పద్యపుష్పంపై రమణీయ ఝంకారం

రమణ ఎంపిక చేసుకున్న అంశం వినూత్నమైందనాలి. సాధారణంగా, తెలుగులో పీహెచ్‌డీ కావాలనుకున్నవారు ఎవరో ఒకరి ప్రముఖ రచనలపై పరిశోధన చేస్తారు.

Published: Sat,October 6, 2012 03:39 PM

అరుదైన కార్యదక్షుడు చెన్నారెడ్డి

డాక్టర్ మర్రి చెన్నాడ్డి మరణించి 15 సంవత్సరాలైంది. పాతతరం నాయకుల్లో అరుదైన ఆ నాయకుడిని ఎన్నో రకాలుగా ఆంధ్రవూపదేశ్ రాష్ట్ర ప్రజలు గ

Published: Sat,October 6, 2012 03:41 PM

ఏకాభిప్రాయం ఎన్నటికి సాధ్యం?

తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావంతో నూతనోత్సాహంతో ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం పూర్తిగా అహింసా మార్గంలో సాగుతోంది. ఆబాల

Published: Sat,October 6, 2012 03:41 PM

సకలంతో కాంగ్రెస్‌లో కదలిక

మూసుకున్న ఢిల్లీ కాంగ్రెస్-యూపీఏ సారథ్య నాయకుల (నాయకీమణు ల) కళ్లు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. అవును మరి! ఇంకా కొద్ది రోజులు మ

Published: Sat,October 6, 2012 03:40 PM

గైర్హాజరే మిగిలిన దారి

-వనం జ్వాలా నరసింహారావు చట్ట సభల ప్రతినిధుల రాజీనామాల విషయంలో ఎలా వ్యవహరిస్తే మంచిదో, రాజీనామా చేసిన, చేయని సభ్యుల ద్వారా సభా మ