అరుదైన కార్యదక్షుడు చెన్నారెడ్డి


Sat,October 6, 2012 03:39 PM

డాక్టర్ మర్రి చెన్నాడ్డి మరణించి 15 సంవత్సరాలైంది. పాతతరం నాయకుల్లో అరుదైన ఆ నాయకుడిని ఎన్నో రకాలుగా ఆంధ్రవూపదేశ్ రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకుంటారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై ‘తెలంగాణ ప్రజా సమితి’ పేరుతో ఉద్యమాన్ని చేపట్టి, మహోన్నత స్థాయికి ఉద్యమాన్ని తీసుకెళ్లి, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సాక్షా త్తు ఇందిరగాంధీకి ఎదురు తిరిగారుపజాభివూపాయాన్ని పదిమంది లోక్‌సభ సభ్యులను ఎన్నిక చేయించుకోవడం ద్వారా అధిష్టానానికి ఎరుక పరిచిన వ్యక్తిగా ఎల్లప్పుడూ గు ర్తుంచుకుంటారు. చివరకు రాజకీయ కారణాల వలయంలో చిక్కుకుని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఇందిర వాయిదా వేయడానికి పరోక్షంగా అంగీకరించిన వ్యక్తిగా కూడా ఆయనను మరిచిపోలేరనవచ్చేమో! ఏదేమైనా.. భావితరాల వారికి తెలంగాణ ఉద్యమ పాఠాలు బోధించిన మహనీయుడుగా మర్రి చెన్నాడ్డి సదా స్మరణీయుడే. మర్రి చెన్నాడ్డి రెండవ పర్యాయం డిసెంబర్ 1989లో ముఖ్యమంవూతిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకు, ముఖ్యమంత్రి పేరుతో పంపాల్సిన ఒక అధికారిక సందేశాన్ని తయారు చేసి చూపినప్పుడు ఆయన చేసిన వ్యాఖ్య నేనెప్పటికీ మరిచిపోలేను. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జరుపుకుంటున్న సమావేశాలకు తయారుచేసిన ముఖ్యమంత్రి సందేశాన్ని కొద్ది మార్పులతో మళ్లీ చూపించిన తర్వాత యథాతధంగా ఆమోదించి సంతకం చేశారు. అంతే...ఇక ఆ తర్వా త ముఖ్యమంత్రి సంతకానికి తీసుకెళ్లిన దేనినీ ఆయన నిశితంగా పరిశీలించడం, విమర్శించడం, వ్యాఖ్యానించడం కాని చేయలేదు. తన దగ్గర పనిచేసే అధికారులపై ఆయనకున్న విశ్వాసం బహుశా మరింకెవరికీ వుండదేమో. ఆయన దగ్గర పనిచేస్తున్న మా మాట అంటే, అది ముఖ్యమంత్రి చెన్నాడ్డి మాటగానే చలామణి కావాలని ఎన్నో పర్యాయాలు బహిరంగంగానే అంటుండేవారు. పాత్రికేయ మిత్రుడు పర్సా వెంకట్ ద్వారా 1988లో పరిచయమైన మర్రి చెన్నాడ్డి దగ్గరకు, అప్పట్లో గవర్నర్ కుముద్‌బెన్ జోషి వద్ద పనిచేస్తుండే నేను, ఆయనుండే తార్నాక ఇంటికి తరచూ పోతుండేవాడిని. ఇంతలో, ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా వున్న ఎన్ జనార్ధనడ్డి స్థానంలో ఇంకొకరిని నియమించి, ఆయన నాయకత్వంలో,త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఎన్‌టీ రామారావును ఓడించాలన్న ఆలోచనలో హైకమాండ్ వుందన్న ఊహాగానాలు వినిపించాయి.

ఆ నేపథ్యంలో పక్షం రోజులకే, ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా హైదరాబాద్ తిరిగొచ్చారు చెన్నాడ్డి. అధికారంలో వున్న తెలుగుదేశం పార్టీకి-పార్టీ అధినేత, ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావుకి, పీసీసీ అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించిన మరుక్షణం నుంచే సవాళ్ళు విసరడం ఆరంభించారు చెన్నాడ్డి. నవంబర్-డిసెంబర్ 1989లో జరిగిన ఎన్నికల్లో చెన్నాడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఓడిపోడనుకున్న ఎన్‌టీ రామారావును ఒక నియోజక వర్గంలోను, పార్టీని రాష్ట్రంలోను ఓడించింది. అర్హులైన పేదలకే సబ్సిడీ బియ్యం పథకం పరోక్షంగా ప్రస్తావిస్తూ, పటిష్ఠమైన పౌర పంపిణీ వ్యవస్థ విధాన ప్రకటన మేనిఫెస్టోలో మొదటి అంశంగా చేర్చింది కాంగ్రెస్ పార్టీ. అలానే స్వయం ఉపాధి పథకాల ప్రస్తావన కూడా దానికి జత పరిచింది పార్టీ. ముసాయిదాను అధ్యక్షుడి ఆమోదం కొరకు చూపించినప్పుడు నేను కూడా వున్నాను. కేవలం పావుగంటలోనే ఆసాంతం చదివి, తప్పులు సరిదిద్దిన చెన్నాడ్డి, అదనంగా మరో పదమూడు పేరాలు ,కాగితంపై పెట్టిన కలాన్ని ఎత్తకుండా రాశారు.


నిజాం కళాశాల మైదానంలో డిసెంబర్ 3, 1989 న ముఖ్యమంవూతిగా పదవీ ప్రమాణ స్వీకారం చేస్తూ ఆయన చేసిన తొలి ప్రసంగంలో, ప్రజలకు ఇబ్బందులకు గురిచేసేది, ఆమోదయోగ్యం కానిది ప్రభుత్వం చేయడం తగదని అన్నప్పుడు, హెల్మెట్లు విధిగా ధరించడం మాకిష్టం లేదంటూ ప్రేక్షకుల నుంచి కేకలు వినిపించాయి. తక్షణమే స్పందించిన చెన్నాడ్డి, ధరించమని బలవంతంగా ఎవరిపైనా రుద్దమని అన్నారు.అలా అంటూనే, భద్రత దృష్ట్యా వాటిని ధరించితేనే మంచిదంటూ సూచన కూడా చేశారు. అద్వితీయమైన శైలిలో ఆయన తన అభిమానులకు చేరవేయాలనుకున్న సందేశాన్ని మాతో రాయించారు. తనకు తెలుగుదేశం నుంచి వారసత్వంగా సంక్రమించిన ఛిన్నాభిన్నమైన పాలనా వ్యవస్థను, ఆర్థిక వ్యవస్థను, అత్యవసరంగా ప్రక్షాళన చేయడానికి వారి సహకారం అందించమంటూ తన జవాబులో కోరారు. చెన్నాడ్డికి ఒకరు రాసిచ్చిన ఉపన్యా సం చదివే అలవాటు ఏనాడూ లేదు. ఏ సభలోనైనా కనీసం గంటకు తక్కువ లేకుండా, ఆశువుగా మూడు భాషల్లో-ఇంగ్లీష్, ఉర్దూ, తెలుగుల్లో, అనర్గళంగా మాట్లాడే వారు. తాను డాక్టర్ అయినా మంత్రిగా ఆరోగ్య శాఖ కోరుకోక పోవడానికి కారణం, తనకు చదువు చెప్పిన అధ్యాపకులు ఇంకా పనిచేస్తుండగానే, వారికి మంత్రిగా వుండడం సమంజసం కాదనే వారు.లౌక్యంలో కూడా చెన్నాడ్డిది అరుదైన శైలి. ఢిల్లీలోని రాజకీయేతర కాంగ్రెస్ ముఠా నాయకులకు చెన్నాడ్డి హెచ్చరిక చేసినట్లు, జాతీయ స్థా యిలో అలాంటి నాయకుల వైఫల్యం మూలాన్నే ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చాయని ఆయన అన్నట్లు, కొన్ని వివాదాస్పదమైన అంశాలున్నాయందులో.

అలాగే మరోచోట, చెన్నాడ్డి, శరద్ పవార్, వీరేంద్రపాటిల్ తెలుగుగంగ పేరుతో తిరుపతిలో సమావేశమై, రాజీవ్‌గాంధీకి వ్యతిరేకంగా పనిచేయాలని నిర్ణయ ం తీసుకున్నట్లు కూడా వచ్చింది.ఆ విషయాలకు కంగారు పడుతూ ఆయన దృష్టికి తెచ్చినప్పుడు, అలా ఎవరైనా అనుకుం పర్వాలేదు అనడం నన్ను ఆశ్చర్య పరిచింది.మే నెల 1990లో ఆంధ్ర ప్రదేశ్‌లో భీకరమైన తుఫాను వచ్చింది. అదే రోజుల్లో వైద్య చికిత్స కోసం అమెరికా వెళ్లడానికి అంతా సిద్ధం చేసుకున్నారు చెన్నాడ్డి. అనుకున్న రోజున కుటుంబ సభ్యులు బేగంపేట విమానాక్షిశయానికి వెళ్లడం, బోర్డింగ్ పాసులు తీసుకునే వరకు రావడం జరిగింది. మంత్రి వర్గ సభ్యులకు చెప్పిపోవడానికి సచివాలయానికి వచ్చారు ముఖ్య మంత్రి చెన్నాడ్డి.అలనాటి సహాయ పునరావాస కమీషనర్ అర్జునరావు, ముఖ్యమంత్రి కార్యదర్శి పరమహంస, మరికొందరు, చెన్నాడ్డి అమెరికా పర్యటన వాయిదా వేసుకుంటే మంచిదని సూచించారు. ఒక్క నిమిషం కూడా ఆలోచించకుం డా, ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా, ఆఖరు క్షణంలో ప్రయాణం మానుకున్నారు. బహుశా చెన్నాడ్డి ఆరోజుల్లో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో పెంచుకున్న అనుబంధమే, నేటి ప్రభుత్వాల వరకూ, కొనసాగుతుందనడంలో అతిశయోక్తి లేదే మో!

- వనం జ్వాలా నరసింహారావు
చెన్నాడ్డికి పౌర సంబంధాల అధికారి
(మర్రిచెన్నారెడ్డి వర్థంతి సందర్భంగా.....)

35

VANAM JWALA NARASIMHA RAO

Published: Thu,December 21, 2017 01:12 AM

కృత్రిమ వైరుధ్యాలతో కుమ్ములాటలా!

హైదరాబాద్‌లో అద్భుతంగా జరిగిన జీఈఎస్ ఎనిమిదవ సదస్సు నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా వ్యయం చేయలేదన్నారు సీఎం. అసలీ సదస

Published: Tue,November 21, 2017 11:20 PM

ఆధ్వర్యం మనదే.. అధ్యక్షత మనదే

తెలంగాణలో జరిగే ప్రపంచ తెలుగు మహాసభలకు రంగం సిద్ధమవుతున్నది. సమావేశాలు జరుగడానికి ఇంకా మూడు వారాలే మిగిలాయి. దేశం నలుమూలల నుంచి, వ

Published: Sun,November 12, 2017 12:41 AM

గ్రామ పునర్నిర్మాణం దిశగా..

క్రియాశీల పంచాయతీరాజ్ వ్యవస్థకు శ్రీకారం చుట్టాలని, స్వయం ప్రతిపత్తితో గ్రామాలు, వ్యక్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అభివృద్ధిలో భ

Published: Sun,October 15, 2017 01:33 AM

కులాలపై విమర్శ తగదు

శతాబ్దాలకాలంగా బ్రాహ్మణ, బ్రాహ్మణేతరులు కలిమిడిగా, అభివృద్ధి చేసిన సామాజిక, రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. ఒకరిని మరొకరు దూషించుకున

Published: Wed,October 4, 2017 12:56 AM

వ్యాపారం చేయడమే నేరమా?

ఇటీవల ఒక సామాజిక శాస్త్రవేత్త కోమట్లను సామాజిక స్మగ్లర్లు (దొంగ రవాణాదారులు) అంటూ ఒక అసంబద్ధమైన బుల్లి పుస్తకాన్ని రాశాడు. దానిమీద

Published: Sat,April 22, 2017 03:12 AM

కేంద్ర, రాష్ట్ర సంబంధాల్లో కొత్త అధ్యాయం

ముఖ్యమంత్రి అసెంబ్లీలో కేంద్ర-రాష్ట్ర సంబంధాల విషయంలో వెలిబుచ్చిన అభిప్రాయాలు, ముస్లిం రిజర్వేషన్ల పెంపు అంశం, యావత్ భారతదేశం దృష

Published: Tue,March 28, 2017 12:01 AM

అభివృద్ధి కోసమే అప్పులు

అత్యంత హుందాగా, సమర్థవంతంగా, అర్థవంతంగా సుమారు మూడు వారాల పాటు జరిగిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా ప

Published: Tue,February 14, 2017 01:23 AM

ప్రపంచవ్యాప్త మహిళా సాధికారత

ఎందరో మహిళలు దేశ దేశాల్లో కీలకమైన పదవుల్లో ఉండటం గత ఐదారు దశాబ్దాల మహిళా సాధికారతకు నిదర్శనం. భవిష్యత్‌లో మరికొన్ని దేశాల అధ్యక్

Published: Tue,December 13, 2016 01:03 AM

బహుముఖ ప్రజ్ఞాశాలి సీఎస్‌ఆర్

ఉత్తర భారతదేశంలోని బద్రీనాథ్, కేదార్‌నాథ్ దేవాలయానికి 1977లో సీఎస్‌ఆర్అ ధ్యక్షులుగా నియమించబడ్డారు. వారి కాలంలోనే బద్రీనాథ్, కేదార

Published: Fri,September 23, 2016 11:32 PM

ప్రతిభకు ప్రతీకలు గురుకులాలు

విద్యా విధానంలో ప్రస్తుతమున్న అన్ని అనర్థాలకూ గురుకుల విద్య సమాధానం కాకపోవచ్చు. కానీ ఈ నమూనా తప్పకుండా,అణగారిన వర్గాల్లో ఆణిముత్య

Published: Sun,September 18, 2016 12:57 AM

అన్యాయానికి సజీవసాక్ష్యం

నందికొండ ప్రాజెక్టు నిర్మాణం 1956న ప్రారంభం కాగా 1969లో పూర్తయ్యింది.గేట్ల ఏర్పాటు, స్పిల్‌వే ఏర్పాటు 1974 నాటికి పూర్తి చేయటం జరి

Published: Thu,September 3, 2015 01:28 AM

అందరికీ విద్య దిశగా అడుగులు

సమాజానికి అవసరమయ్యే సేవలు ఏమిటి? అందుకు అనుగుణంగా సేవలందించేవారిని ఎలా తయారు చేయాలి? అనే విషయంపై విద్యా శాఖకు అవగాహన ఉండాలి. ఏ వృత

Published: Sun,August 23, 2015 01:39 AM

వ్యయం లేని వ్యవసాయం కావాలి

తెలంగాణలో ప్రతి గ్రామంలో రైతులతో వ్యవసాయ శాఖ ప్రత్యక్ష అనుబంధం కలిగి వుండాలి. ఎప్పటికప్పుడు రైతులతో మాట్లాడుతూ వ్యవసాయానికి పూర్వ

Published: Wed,August 19, 2015 12:09 AM

నాటిరోజుల్లో గ్రామీణ జనజీవనం

వేసవి కాలంలో పొలాలకు పెంట తోలే ప్రక్రియ తో వ్యవసాయ పనులు మొదలయ్యేవి. పాడి పశువుల వల్ల పోగైన పెంటను ఎరువుగా పొలాలకు తరలించేవారు. అద

Published: Wed,August 12, 2015 01:49 AM

యాభై ఏళ్ల సింగపూర్.. విశేషాలు

ఐదారు దశాబ్దాల క్రితం వరకూ దూర ప్రాచ్య తీర ప్రాంతంలో, బ్రిటన్‌కు ప్రధానమైన నావికా సైనిక స్థావరంగా మాత్రమే ఉండేది సింగపూర్. అలాంటిద

Published: Fri,July 31, 2015 11:18 PM

ఆచితూచి.. అసలైన నిర్ణయం

న్యాయపరమైన నియమ, నిబంధనల నేపథ్యంలో రాజ్యాంగ ప్రకరణాలు, న్యాయస్థానాల తీర్పులు ఉండి తీరాలి. సంప్రదాయాలకు ఇదమిత్థమైన నిబంధనలంటూ ఏవీ ఉ

Published: Thu,July 23, 2015 12:20 AM

పర్యాటక మకుటంగా యాదాద్రి ..

180 ఎకరాల విస్తీర్ణం గల యాదగిరిగుట్ట స్థలాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకునేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఆ ప్రాంతమంతా అందమైన చెట్లతో

Published: Thu,July 2, 2015 04:46 AM

ఆకుపచ్చని తెలంగాణ దిశగా..

బంగారు తెలంగాణ స్వప్నం సాకార దిశగా మరో కీలకమైన అడుగు వేయడానికి ప్రభుత్వం సకల సన్నాహాలు చేసింది. తెలంగాణకు హరిత హారం పేరుతో ముఖ్యమం

Published: Thu,June 25, 2015 01:13 AM

పుష్కరాలు ఆధ్యాత్మిక పరిమళాలు

గౌతమ మహర్షి కఠోర తపస్సు కారణాన భూలోకానికి తేబడిన గంగానది పాయ గౌతమిగా, గోదావరిగా ప్రసిద్ధికెక్కింది. గంగానది అంశగా భావించబడే గోదావర

Published: Thu,September 11, 2014 12:27 AM

నాటి హైదరాబాద్ జ్ఞాపకాలు

జూన్, 1964లో నేను, నాన్న గారు కలిసి మొదటిసారి హైదరాబాద్ చేరుకున్నాం.ఖమ్మంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు బస్సెక్కితే హైదరాబాద్ గౌలిగూ

country oven

Featured Articles