కృత్రిమ వైరుధ్యాలతో కుమ్ములాటలా!


Thu,December 21, 2017 01:12 AM

హైదరాబాద్‌లో అద్భుతంగా జరిగిన జీఈఎస్ ఎనిమిదవ సదస్సు నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా వ్యయం చేయలేదన్నారు సీఎం. అసలీ సదస్సు పూర్వాపరాలు చాలామందికి తెలియదనీ, అయినా తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చు చేసిందని కొందరు విమర్శలు చేశారని, అదంతా అబద్ధమని ఆయన అన్నారు.

బీసీల సంక్షేమం-అభివృద్ధి కోసం తీసుకోవలసిన చర్యల విషయంలో, బీసీ వర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు, మంత్రులతో రెండువారాల కిందట శాసనసభా ప్రాంగణంలో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. అందులో సీఎం కేసీఆర్ ప్రధానాంశం మీద మాట్లాడే ముందర, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యంలో విధానాల కొనసాగింపు ఆవశ్యకత, అమెరికా-చైనా దేశాలు అంతర్జాతీయ ఆర్థికరంగంలో పోటీ పడుతున్న వ్యవహారం, ఇటీవలే ముగిసిన అంతర్జాతీయ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సదస్సు, తెలంగాణ రాష్ట్రం ఆర్థిక పురోగతి లాంటి అంశాలపై తన విలువైన అభిప్రాయాలను నిర్మొహమాటంగా పంచుకున్నారు. తన అభిప్రాయాల నేపథ్యంలో బీసీల అభ్యున్నతి కోసం ఎలాంటి చర్యలు చేపట్టాలనే విషయంలో రాజకీయాలకతీతంగా ఆ వర్గాల ప్రజాప్రతినిధులందరూ కలిసి కూలంకషంగా చర్చించి, ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని కోరారు. వాటిని అమలు చేస్తామని సీఎం కేసీఆర్ అన్నారు.

అధికారంలోకి ఏ రాజకీయపార్టీ వచ్చినా, కొన్ని విధానాల కొనసాగింపు అవసరమని అంటూ, వాస్తవాల అవగాహన జరిగితేనే ప్రజలకు లాభం చేకూరే అవకాశం ఉందని సీఎం చెప్పారు. మానవజాతి పరిణామక్రమంలో నిరంతరం మార్పు చోటుచేసుకుంటుంది. మన దేశం పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను పాటిస్తున్నది. అభివృద్ధి చెందుతున్నాం, ముందుకుపోతున్నాం. ప్రభుత్వాల పయనమేదైనా ప్రజాస్వామ్యంలో విధానాల కొనసాగింపు అతి ముఖ్యమని సీఎం చెప్పారు.

ప్రజాస్వామ్య వ్యవస్థ మీద మరింత లోతుగా మాట్లాడిన ముఖ్యమం త్రి, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక నిర్దిష్ట కాల పరిమితి తర్వాత ప్రభుత్వా లు మారుతుంటాయి. ఒక రాజకీయపార్టీ స్థానంలో మరోపార్టీ అధికారంలోకి వస్తుంది. అలా జరిగినప్పుడు ఆ పార్టీ ప్రాధాన్యాలకు అనుగుణంగా, లక్ష్యాలు మారవచ్చు. అంతమాత్రాన విధానాలన్నీ మారాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు విదేశాంగ విధానం కానీ, దేశరక్షణ సంబంధమైన విధానం కానీ, పెద్దగా మార్పులకు గురికావాల్సిన అవసరం లేదు. ఇటీవల హైదరాబాద్‌లో ముగిసిన అంతర్జాతీయ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల సదస్సు (జీఈఎస్) విషయం. అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా పాలనాకాలంలో అమల్లోకి వచ్చిన జీఈఎస్ కార్యక్రమాన్ని-విధానాన్ని, ఆయన వారసుడు ట్రంప్ కొనసాగించాడు.
హైదరాబాద్‌లో అద్భుతంగా జరిగిన జీఈఎస్ ఎనిమిదవ సదస్సు నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా వ్యయం చేయలేదన్నారు సీఎం. అసలీ సదస్సు పూర్వాపరాలు చాలామందికి తెలియదనీ, అయినా తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చు చేసిందని కొంద రు విమర్శలు చేశారని, అదంతా అబద్ధమని ఆయన అన్నారు.

బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు పోటీగా, జీఈఎస్‌ను నెలకొల్పాడు. అప్పటి నుంచి ఏడుసార్లు వివిధ దేశాల్లో గ్లోబల్ సమ్మిట్లు నిర్వహించింది ఆ దేశం. ఎనిమిదవ సదస్సును భారతదేశంలో నిర్వహించమని ట్రంప్ భారత ప్రధాని మోదీని కోరారు. ఆ పనిని మోదీ నీతీఆయోగ్‌కు అప్పగించారు. తెలంగాణతో సహా సదస్సు నిర్వహించడానికి ఎనిమిది రాష్ర్టాలు పోటీ పడ్డాయి. చివరికి హైదరాబాద్‌కు నిర్వహణ బాధ్యత దక్కింది. మన భాగస్వామ్యంతో బ్రహ్మాండంగా సదస్సును నిర్వహించాం. మన రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్క రూపాయి ఖర్చు కూడా కాలేదు. ఇది తెలియక ఎన్ని వందల కోట్లు ఖర్చు చేసిందో రాష్ట్ర ప్రభుత్వం అని విమర్శిస్తున్నారు. ఫలక్‌నుమా ప్యాలెస్ లో డిన్నర్ ఖర్చంతా నీతీ ఆయోగ్-కేంద్ర ప్రభుత్వమే భరించింది. దానికి కారణం అమెరికా ప్రభుత్వ సలహాదారైన ఇవాంకా గౌరవార్థం అనుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చల్లా, గోల్కొండలో సదస్సుకు హాజరైన దేశ-విదేశ ప్రతినిధులకు ఇచ్చిన డిన్నర్ ఆతిథ్యానికి మాత్రమే! అది కూడా నామమాత్రమే. అంతకుమించి ఏ ఖర్చూ లేదు.

చైనాలో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సు-వరల్డ్ ఎకనామిక్ ఫోరం-విషయాన్ని ప్రస్తావిస్తూ, ముఖ్యమంత్రి, ఈ సదస్సులు చైనాలో ఏడాదికి రెండుసార్లు జరుగుతాయన్నారు. అమెరికా వరల్డ్ ఎకనామిక్ ఫోరం అం టే గిట్టదు. జర్మనీలో పుట్టిన ప్రొఫెసర్ స్ఖ్వాబ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం వ్యవస్థాపక కార్యనిర్వాహక అధ్యక్షుడు. 1971లో కొందరు స్నేహితులతో కలిసి ఆయన దాన్ని స్థాపించాడు. యావత్ ప్రపంచానికి సంబంధించిన ఆర్థిక అంశాలమీద ఆలోచించే ఈ వేదిక, అనతికాలంలోనే గొప్ప రూపా న్ని సంతరించుకున్నది. ప్రొఫెసర్ స్ఖ్వాబ్‌ను కలువడానికి, ఆయనతో కరచాలనం చేయడానికి ప్రపంచ నేతలు బారులు తీరుతారు. ఇక ఈ ఫోరం నిర్వహణలో అమెరికా పాత్ర కించిత్తయినా లేదని చెప్పారు సీఎం.

సంఘటిత, భాగస్వామ్య అభివృద్ధి ప్రక్రియ గురించి మాట్లాడిన సీఎం తెలంగాణ ఉద్యమస్ఫూర్తిని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో మనం అందరం భాగస్వాములం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్థికంగా అద్భుతంగా ఉన్నాం. ఎలాంటి లోటూ లేదు. ప్రభు త్వ బడ్జెట్‌కూ, ప్రైవేట్ బడ్జెట్ కూ చాలా తేడా ఉంది. ప్రభు త్వ బడ్జెట్ అంటే ముందు ఒక ప్రణాళిక వేసుకుంటాం. దానికనుగుణంగా నిధులను సేకరిస్తాం. ప్రైవేట్ బడ్జెట్ అంటే, మన దగ్గర ఉన్న డబ్బుతో ఎలా ఖర్చు చేయాలో ఆలోచించుకుంటాం. ప్రభుత్వ బడ్జెట్‌లో అంచనా బడ్జెట్ అనీ, సవరించిన బడ్జెట్ అనీ, వాస్తవ బడ్జెట్ అనీ, ఒక విధమైన గాఢమైన వాంఛతో-అత్యాశతో కూడిన బడ్జెట్ ఉంటుందని సీఎం వివ రించారు.
narasimha
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కొన్నాళ్లు ప్రభుత్వం ఎదుర్కొన్న అనేక సమస్యలను కేసీఆర్ ప్రస్తావించారు. 23 జిల్లాల ఉమ్మడి ఏపీ రాష్ట్రం ఉన్నప్పుడు కూడా బడ్జెట్ అంచనాలను చేరుకోలేకపోయాం. మన బడ్జెట్ ఇప్పుడు రూ.1,49,000 కోట్లు. మనం తప్పకుండా 1,25,000 కోట్లకు చేరుకుంటాం, సందేహం లేనేలేదు. మరోవిధంగా చెప్పాలంటే, పది జిల్లా ల (నేటి 31 జిల్లాల) తెలంగాణ, నాటి 23 జిల్లాల ఏపీ వ్యయానికి చేరుకున్నది. ఇప్పుడున్న తెలంగాణ, ఆర్థికంగా ఆలోచిస్తే గతంలో ఎన్నడూ లేదు. ఎఫ్.ఆర్.బీ.ఎం 0.5శాతం అధికంగా సాధించాం. కొత్తగా 21 జిల్లాల ఏర్పాటు గురించి చెబుతూ, పేదరికం పోవడానికి, చిన్న జిల్లాల ను, ఎక్కువ జిల్లాలను ఏర్పాటు చేయాల్సి వచ్చిందన్నారు. ఇదంతా చెప్పడానికి కారణం వివరిస్తూ.. బీసీ వర్గాల వారికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మీ లాంటి పథకాలు భవిష్యత్‌లో ఏ ప్రభుత్వం వచ్చినా అమలుచేయక తప్పదనీ సీఎం కేసీఆర్ అన్నారు. అలాంటివే మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు వారి సంక్షేమం కోసం అమలు చేస్తామని ముఖ్యమంత్రి అన్నారు. ప్రజాస్వామ్యంలో విధానాల కొనసాగింపు తప్పదని ఆయన సోదాహరణంగా వివరిస్తూ అభివృద్ధి క్రమాన్ని తెలిపారు.

540

VANAM JWALA NARASIMHA RAO

Published: Tue,November 21, 2017 11:20 PM

ఆధ్వర్యం మనదే.. అధ్యక్షత మనదే

తెలంగాణలో జరిగే ప్రపంచ తెలుగు మహాసభలకు రంగం సిద్ధమవుతున్నది. సమావేశాలు జరుగడానికి ఇంకా మూడు వారాలే మిగిలాయి. దేశం నలుమూలల నుంచి, వ

Published: Sun,November 12, 2017 12:41 AM

గ్రామ పునర్నిర్మాణం దిశగా..

క్రియాశీల పంచాయతీరాజ్ వ్యవస్థకు శ్రీకారం చుట్టాలని, స్వయం ప్రతిపత్తితో గ్రామాలు, వ్యక్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అభివృద్ధిలో భ

Published: Sun,October 15, 2017 01:33 AM

కులాలపై విమర్శ తగదు

శతాబ్దాలకాలంగా బ్రాహ్మణ, బ్రాహ్మణేతరులు కలిమిడిగా, అభివృద్ధి చేసిన సామాజిక, రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. ఒకరిని మరొకరు దూషించుకున

Published: Wed,October 4, 2017 12:56 AM

వ్యాపారం చేయడమే నేరమా?

ఇటీవల ఒక సామాజిక శాస్త్రవేత్త కోమట్లను సామాజిక స్మగ్లర్లు (దొంగ రవాణాదారులు) అంటూ ఒక అసంబద్ధమైన బుల్లి పుస్తకాన్ని రాశాడు. దానిమీద

Published: Sat,April 22, 2017 03:12 AM

కేంద్ర, రాష్ట్ర సంబంధాల్లో కొత్త అధ్యాయం

ముఖ్యమంత్రి అసెంబ్లీలో కేంద్ర-రాష్ట్ర సంబంధాల విషయంలో వెలిబుచ్చిన అభిప్రాయాలు, ముస్లిం రిజర్వేషన్ల పెంపు అంశం, యావత్ భారతదేశం దృష

Published: Tue,March 28, 2017 12:01 AM

అభివృద్ధి కోసమే అప్పులు

అత్యంత హుందాగా, సమర్థవంతంగా, అర్థవంతంగా సుమారు మూడు వారాల పాటు జరిగిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా ప

Published: Tue,February 14, 2017 01:23 AM

ప్రపంచవ్యాప్త మహిళా సాధికారత

ఎందరో మహిళలు దేశ దేశాల్లో కీలకమైన పదవుల్లో ఉండటం గత ఐదారు దశాబ్దాల మహిళా సాధికారతకు నిదర్శనం. భవిష్యత్‌లో మరికొన్ని దేశాల అధ్యక్

Published: Tue,December 13, 2016 01:03 AM

బహుముఖ ప్రజ్ఞాశాలి సీఎస్‌ఆర్

ఉత్తర భారతదేశంలోని బద్రీనాథ్, కేదార్‌నాథ్ దేవాలయానికి 1977లో సీఎస్‌ఆర్అ ధ్యక్షులుగా నియమించబడ్డారు. వారి కాలంలోనే బద్రీనాథ్, కేదార

Published: Fri,September 23, 2016 11:32 PM

ప్రతిభకు ప్రతీకలు గురుకులాలు

విద్యా విధానంలో ప్రస్తుతమున్న అన్ని అనర్థాలకూ గురుకుల విద్య సమాధానం కాకపోవచ్చు. కానీ ఈ నమూనా తప్పకుండా,అణగారిన వర్గాల్లో ఆణిముత్య

Published: Sun,September 18, 2016 12:57 AM

అన్యాయానికి సజీవసాక్ష్యం

నందికొండ ప్రాజెక్టు నిర్మాణం 1956న ప్రారంభం కాగా 1969లో పూర్తయ్యింది.గేట్ల ఏర్పాటు, స్పిల్‌వే ఏర్పాటు 1974 నాటికి పూర్తి చేయటం జరి

Published: Thu,September 3, 2015 01:28 AM

అందరికీ విద్య దిశగా అడుగులు

సమాజానికి అవసరమయ్యే సేవలు ఏమిటి? అందుకు అనుగుణంగా సేవలందించేవారిని ఎలా తయారు చేయాలి? అనే విషయంపై విద్యా శాఖకు అవగాహన ఉండాలి. ఏ వృత

Published: Sun,August 23, 2015 01:39 AM

వ్యయం లేని వ్యవసాయం కావాలి

తెలంగాణలో ప్రతి గ్రామంలో రైతులతో వ్యవసాయ శాఖ ప్రత్యక్ష అనుబంధం కలిగి వుండాలి. ఎప్పటికప్పుడు రైతులతో మాట్లాడుతూ వ్యవసాయానికి పూర్వ

Published: Wed,August 19, 2015 12:09 AM

నాటిరోజుల్లో గ్రామీణ జనజీవనం

వేసవి కాలంలో పొలాలకు పెంట తోలే ప్రక్రియ తో వ్యవసాయ పనులు మొదలయ్యేవి. పాడి పశువుల వల్ల పోగైన పెంటను ఎరువుగా పొలాలకు తరలించేవారు. అద

Published: Wed,August 12, 2015 01:49 AM

యాభై ఏళ్ల సింగపూర్.. విశేషాలు

ఐదారు దశాబ్దాల క్రితం వరకూ దూర ప్రాచ్య తీర ప్రాంతంలో, బ్రిటన్‌కు ప్రధానమైన నావికా సైనిక స్థావరంగా మాత్రమే ఉండేది సింగపూర్. అలాంటిద

Published: Fri,July 31, 2015 11:18 PM

ఆచితూచి.. అసలైన నిర్ణయం

న్యాయపరమైన నియమ, నిబంధనల నేపథ్యంలో రాజ్యాంగ ప్రకరణాలు, న్యాయస్థానాల తీర్పులు ఉండి తీరాలి. సంప్రదాయాలకు ఇదమిత్థమైన నిబంధనలంటూ ఏవీ ఉ

Published: Thu,July 23, 2015 12:20 AM

పర్యాటక మకుటంగా యాదాద్రి ..

180 ఎకరాల విస్తీర్ణం గల యాదగిరిగుట్ట స్థలాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకునేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఆ ప్రాంతమంతా అందమైన చెట్లతో

Published: Thu,July 2, 2015 04:46 AM

ఆకుపచ్చని తెలంగాణ దిశగా..

బంగారు తెలంగాణ స్వప్నం సాకార దిశగా మరో కీలకమైన అడుగు వేయడానికి ప్రభుత్వం సకల సన్నాహాలు చేసింది. తెలంగాణకు హరిత హారం పేరుతో ముఖ్యమం

Published: Thu,June 25, 2015 01:13 AM

పుష్కరాలు ఆధ్యాత్మిక పరిమళాలు

గౌతమ మహర్షి కఠోర తపస్సు కారణాన భూలోకానికి తేబడిన గంగానది పాయ గౌతమిగా, గోదావరిగా ప్రసిద్ధికెక్కింది. గంగానది అంశగా భావించబడే గోదావర

Published: Thu,September 11, 2014 12:27 AM

నాటి హైదరాబాద్ జ్ఞాపకాలు

జూన్, 1964లో నేను, నాన్న గారు కలిసి మొదటిసారి హైదరాబాద్ చేరుకున్నాం.ఖమ్మంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు బస్సెక్కితే హైదరాబాద్ గౌలిగూ

Published: Tue,June 10, 2014 01:16 AM

వాగ్దానాల అమలు దిశగా..

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వారంలోపల కేసీఆర్ తాను చేయబోయే కార్యక్రమాలు ఎలా వుండబోతున్నాయో చెప్పారు. తమ ఎన్నికల ప్రణాళికలో ప

country oven

Featured Articles