ఉత్తర భారతదేశంలోని బద్రీనాథ్, కేదార్నాథ్ దేవాలయానికి 1977లో సీఎస్‌ఆర్అ ధ్యక్షులుగా నియమించబడ్డారు. వారి కాలంలోనే బద్రీనాథ్, కేదార్నాథ్ దేవస్థానాల ఆధునీకరణ జరిగింది. దేశంలో ఆదిశంకరుని సంప్రదాయాలు
కొనసాగడానికి, బద్రీనాథ్, కేదార్నాథ్ ఉన్నతస్థానంలో నిలువడానికి చాలా కృషి చేశారు.

వామపక్ష భావాలు గల దివంగత సి.ఎస్. సుబ్రమణియన్ స్వాతంత్య్ర సమరం జరిగే రోజు ల్లో, కమ్యూనిస్టు పార్టీపై నిషేధం ఉన్నా.. ఉద్యమాల్లో పాల్గొనేవారు. దీన్ని నిషేధిస్తూ ఆయ నపై ఉత్తర్వులు జారీచేసి జైలుకు పంపిం చారు అప్పటి ఐసీఎస్ సి.ఎస్.రామచంద్రన్. సి.ఎస్.సుబ్రమణియన్‌కు రామ చంద్రన్ స్వయానా తమ్ముడు. అప్పట్లో ఒక నిబధ్ధత కలిగిన అధికారిగా అలా చేయటం అనివార్యమైంది.
రామచంద్రన్ శత జయంత్యుత్సవాల్లో భాగంగా 102 ఏళ్లకు పైబడిన వి.కె.రావు, వల్లూరి కామేశ్వర్లు రామచంద్రన్‌పై ఆయన కూతురు మాజీ ఐఏఎస్ అధికారిణి రాసిన పుస్తకా న్ని హైదరాబాద్ నగరంలోని అడ్మినిస్ట్రేటి వ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియాలో నేడు సాయంత్రం ఐదున్నరకు ఆవిష్కరించనున్నారు.
తెలుగువారికి సుపరిచితులైన వి.కె. రావు విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌గా, నాటి ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా, 1973 లో రాష్ట్రపతి పాలన విధించబడిన రోజుల్లో గవర్నర్‌కు సలహాదారుడిగా ఉన్నారు. పదవీ విరమణ అనంతరం విజిలెన్స్ కమిషనర్‌గా, 1981-1982లో నాటి భారత రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డికి ప్రిన్సిపల్ కార్యదర్శిగా పనిచేశారు.
ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పూర్వ ఐఏఎస్ అధికారులు అయిన ఎం.గోపాల కృష్ణ, ఎస్.పార్థసారథి, టి.ఎల్.శంకర్ ప్రఖ్యాత వైద్యులు డా.ఎ.పి.రంగారావు లాంటి నిష్ణాతు లు ప్రసంగించనున్నారు.
1937 బ్యాచ్‌కు చెందిన సి.ఎస్.రామచంద్రన్ 1940 సివిల్ సర్వీసుల పోటీ పరీక్షల్లో ఉత్తమ శ్రేణిలో సఫలీకృతమయ్యా రు. ఇండియన్ సివిల్ సర్వీస్ పరీక్షల్లోనే కాకుండా ఫైనాన్షియల్ సివిల్ సర్వీస్ పరీక్షలను కూడా విజయవంతంగా పూర్తిచేశారు. ఐసీఎస్‌కు ఎంపికైన తర్వాత 1942లో బేరార్-సెంట్రల్ ప్రావిన్సెస్ కేడర్‌కు కేటాయించారు. 1942-1948 వరకు సెంట్రల్ ప్రావిన్సెస్‌లో పనిచేసి తర్వాత మద్రాసు ప్రెసిడెన్సీకి కేడర్‌ను బదలాయించుకున్నారు.
బ్రిటీష్ ఇండియా రోజుల్లో ఇండియన్ సివిల్ సర్వీస్‌లను అధికారికంగా ఇంపీరియల్ సివిల్ సర్వీస్‌లుగా వ్యవహరించేవారు. అది అత్యున్నత సివిల్ సర్వీసెస్‌గా 1858 నుంచి 1947 వరకు వ్యవహరించబడిం ది. ఐసీఎస్‌కు ఎంపికైన మొదటి వెయ్యి మంది సభ్యులనందరినీ సివిలియన్స్గా పిలిచేవారు. వారందరు బ్రిటిష్ వారే కావటం విశేషం. పైగా వారి చదువు అంతా బ్రిటిష్ పాఠశాలల్లోనే జరిగిపోయేది. 1905 నాటికి 5 శాతం మందిని బెంగాల్ నుంచి ఎంపిక చేశారు. 1947 నాటికి 322 మంది భారతీయులు, 688 మంది బ్రిటిషర్లు సభ్యులుగా ఉండేవారు. 1980 ఏప్రిల్ నెలలో క్యాబినెట్ కార్యదర్శిగా పదవీ విరమణ కావించిన నిర్మల్ కుమార్ ముఖర్జీ, 1944 బ్యాచ్‌కు చెందిన చివరి ఐసీఎస్ అధికారి కాగా చిట్ట చివరి ఐసీఎస్ అధికారిగా పాకిస్థాన్ నుంచి పదవీ విరమణ పొందిన వ్యక్తి ఆఘా షాహీ.
భారత ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీలో డిప్యూటేషన్‌లో సి.ఎస్.రామచంద్రన్ పనిచేశారు. లాల్ బహదూర్ శాస్త్రి వద్ద కూడా సీఎస్ఆర్ పనిచేశారు. శాస్త్రి నిరాడంబరతే సీఎస్ ఆర్కు ఆదర్శప్రాయమైంది. దేశ పారిశ్రామిక విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావటంలో ఇద్దరు కలిసి పనిచేశారు. నేటికి సీఎస్ఆర్ సేవలు దేశ పారిశ్రామిక పటిష్ఠతకు పునాదులు వేయటంలో దోహదపడ్డాయని విశ్వసించేవారు ఉన్నారు. 1961లో రామచంద్రన్ కు ఇంగ్లండ్‌లోని (NUFFIELD) ఫౌండేషన్‌లో సభ్యత్వం లభించిం ది. ఇక్కడే ఫిజిక్స్ విభాగంలో, న్యూక్లియర్ ఆస్ట్రో విజిక్స్ విభాగాల్లో ప్రావీణ్యం సంపాదించారు. ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయాల్లో పేరు గాంచారు. తర్వాత భారత ప్రభుత్వంలో పలు పదవులు చేపట్టిన రామచంద్రన్ మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ట్రేడ్‌లో అదనపు కార్యదర్శిగా, ప్రణాళికా సంఘం సలహాదారునిగా, కుటుంబ నియంత్రణ, వైద్యశాఖలో కార్యదర్శిగా కూడా పనిచేశారు.
పరిపాలనా పరంగా దేశాన్ని తీర్చిదిద్దడంలో వారిది అందెవేసిన చేయి. అంతర్జాతీయంగా కూడా పలు కీలకమైన పదవులను ఆయన నిర్వహించారు. కేంద్ర ఆరోగ్య శాఖలో కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఈ సమయంలోనే ఆయనకు డబ్ల్యూ హెచ్వోతో సాన్నిహిత్యం పెరిగింది.సీఎస్ఆర్ ఆధ్యాత్మిక విషయాల కు అధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాల పై ఆయనకు అపారమైన విశ్వాసం ఉండేది. కంచి కామకోటి పీఠానికి చెందిన, పరమాచార్యగా అందరికీ తెలిసిన శంకరాచార్యులకు సీఎస్ఆ ర్ అనుంగు శిష్యులు. వేద పఠనం లో, అభ్యాసనలో ఎక్కువ కాలం నిమగ్నమై ఉండేవారు. కంచి మఠాలు, సంస్థలు స్థాపనా పరిరక్షణల్లో కాలం గడిపేవారు. ఎన్నో దేవాలయాల స్థాపనలో భాగస్వాములయ్యారు. ఉత్తర భారతదేశంలోని బద్రీనాథ్, కేదార్నాథ్ దేవాలయానికి 1977లో సీఎస్ఆర్ అధ్యక్షులుగా నియమించబడ్డారు.
వారి కాలంలోనే బద్రీనాథ్, కేదార్నాథ్ దేవస్థానాల ఆధునీకరణ జరిగింది. దేశంలో ఆదిశంకరుని సంప్రదాయాలు కొనసాగడానికి బద్రీనాథ్, కేదార్నాథ్ ఉన్నతస్థానంలో నిలువడానికి చాలా కృషి చేశారు. ఢిల్లీలోని సౌత్ ఇండియన్ సమాజ్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. దక్షి ణ భారతదేశంలోని సాంస్కృతిక సంస్థల అభి వృద్ధిలో పాలుపంచుకున్నారు. సివిల్ సర్వెంట్‌గా, మానవతావాదిగా, ఆధ్యాత్మికవాదిగా సీఎస్ఆర్ చేసిన కృషి ఎనలేనిది.