ప్రతిభకు ప్రతీకలు గురుకులాలు


Fri,September 23, 2016 11:32 PM

విద్యా విధానంలో ప్రస్తుతమున్న అన్ని అనర్థాలకూ గురుకుల విద్య సమాధానం కాకపోవచ్చు. కానీ ఈ నమూనా తప్పకుండా,అణగారిన వర్గాల్లో ఆణిముత్యాల్ని వెలికితీస్తుంది. సురక్షితమైన,సుస్థిరమైన, సమగ్రమైనరీతిలో తీర్చిదిద్దబడిన పిల్లలు వారి కుటుంబాలనే కాకుండా సమాజాన్నీతగురీతిన తీర్చిదిద్దటంలో సఫలీకృతులవుతారు.

పైవేట్ కోచింగ్ సెంటర్లలో చదివే విద్యార్థులకు దీటుగా, తెలంగాణ సాం ఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో చదివిన విద్యార్థులు ఎంసెట్-2016 పరీక్షలో గణనీయమైన సంఖ్యలో ఉత్తీర్ణులయ్యారు. మెడిసిన్ విభాగంలో 40 సీట్లు, బీడీఎస్‌లో 20 సీట్లు సంపాదించారు. తమ ప్రతిభను చాటి సంస్థకు, రాష్ట్ర ప్రభుత్వానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టారు. దీనికి అదనంగా ఇక్కడే చదివిన మరికొందరు విద్యార్థులు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో 25 సీట్లను పొందడంతో పాటు, టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ లో 6 సీట్లు, అజీం ప్రేమ్ జీ విద్యాసంస్థల్లో 11 సీట్లు, ఐఐటీ లు, ఎన్‌ఐటీలలో 45 సీట్లు, చార్టెడ్ ఎకౌంటెన్సీల్లో 5 సీట్లు సాధించారు.

narasimha
గురుకుల విద్యాసంస్థల విద్యార్థులు కనబరిచిన ప్రతిభను తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో గురుకుల పాఠశాలల సంఖ్యను పెంచాలని నిర్ణయించారు. వీటిని ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకే పరిమితం చేయకుండా, మైనారిటీలకూ, వెనుకబడిన తరగతుల వారికీ ప్రవేశం కల్పించేందుకూ నిర్ణయించారు. దీనిద్వారా ప్రస్తుతమున్న గురుకుల పాఠశాలల సంఖ్యకు అదనంగా కేవలం మైనారిటీ విద్యార్థులకు ఉపయోగపడేలా మరో 89 గురుకుల పాఠశాలలను నెలకొల్పడం జరుగుతుంది. తద్వారా మైనారిటీలకు ఇప్పటికే ప్రారంభించిన 71 గురుకులాల (వాటిలో బాలురకు 39, బాలికలకు 32) సంఖ్యను 160కి పెంచటం జరిగిం ది. గతంలో అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 120 మైనారిటీ గురుకుల పాఠశాలల ను మాత్రమే ఏర్పాటు చేయాలని నిర్ణయించా రు.

అయితే గురుకుల పాఠశాలల్లో చేరడానికి ఆసక్తి కనబరుస్తున్న మైనారిటీ విద్యార్థుల సంఖ్య క్రమేపీ పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో మరో 40 అదనంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి భావించారు. గురుకుల పాఠశాలల్లో మొదట 5,6,7 తరగతులలో విద్యార్థులను చేర్చుకుని ఏడాది గడుస్తున్న కొద్దీ, పైతరగతులను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాలల విద్యాసంస్థ ఆ పాఠశాలల నిర్వహణ బాధ్యతలను చేపడు తుంది. మైనారిటీలలో విద్యా ప్రమాణాలు తగ్గు ముఖం పట్టడం, మధ్యలోనే చదువు మానేసే వారి సంఖ్య పెరగటం వల్ల ఈ సమస్యను అధిగమించాల్సిన ఆవశ్యకత వున్న దని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. మైనార్టీలకు మెరుగైన విద్యను అందించడానికి నాణ్యమైన గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి, ఆ తర్వాత తగు ఉద్యోగ అవకాశాలను కల్పించి, వారి జీవన ప్రమాణాలను పెంచటమే ప్రభు త్వం లక్ష్యం.

అలాగే బీసీల కోసం నియోజకవర్గానికి ఒకటి చొప్పున మరో 120 గురుకుల పాఠశాలలను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. బీసీ కులాలకు చెందిన వారికి మెరుగైన భవిష్యత్ అందించడం తమ బాధ్యతగా ప్రభుత్వం భావిస్తున్నది. వారికి ఉత్తమమైన విద్యను అందించి తద్వారా మంచి పునాది వేయాలన్నది ప్రభుత్వ ఆశయం. అందుకే వచ్చే విద్యా సంవత్సరం నుంచి వీరి కోసం గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయనున్నారు. వీటిలో సగం బాలురకు, సగం బాలికలకు కేటాయించనున్నారు. బాబాసాహేబ్ అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాల సందర్భంలో 100 నూతన గురుకుల పాఠశాలలను, 30 గురుకుల డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రత్యేకించి వీటితో పాటు ఎస్టీ విద్యార్థులకు అదనంగా మరో 50 విద్యాలయాలను అదే దశల వారీగా ఆరంభించాలని కూడా ముఖ్యమంత్రి నిర్ణయించారు. ప్రభుత్వం అణగారిన వర్గాల అభ్యున్నతికి పెద్దపీట వేయడానికి, వారి భవిష్యత్‌ను చక్కగా తీర్చిదిద్దటానికి తీసుకుంటున్న చర్య ఇది. టీఆర్‌ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న విధంగా, కేజీ టు పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్యను అందించే క్రమంలో పెద్ద సంఖ్యలో గురుకుల పాఠశాలల ఏర్పాటుకు ఉపక్రమించింది. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీలకు ప్రత్యేకించి ఈ పాఠశాలలు ఉపయోగపడతాయి.

రాష్ట్రంలో ఈ పాటికే 135 గురుకుల విద్యా సంస్థలు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థ నిర్వహణలో నడుస్తున్నాయి. వీటిలో సుమారు 77,000 మంది విద్యార్థులున్నారు. రాష్ట్ర ఆవిర్భావానికి పూర్వం ఎస్సీలకు 74 పాఠశాలలు, బీసీలకు 23 పాఠశాలలు, ఇతరులకు 47 పాఠశాలలు (మొత్తం 279) ఉండేవి. ఇప్పుడు ప్రత్యేకించి మైనారిటీలకు ఏర్పాటు చేయదల్చుకున్న 89 అదనపు గురుకుల పాఠశాలలు, బీసీలకు ఏర్పాటు చేయాలనుకున్న 120 పాఠశాలలు కలిపి రాష్ట్రం ఏర్పడ్డాక ఏర్పాటు చేస్తున్న గురుకుల విద్యాసంస్థల సంఖ్య 480కి చేరుతుం ది. వీటిలో ఎస్సీలకు 103, ఎస్టీలకు 51, ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలలు 30, మైనారిటీలకు 160, బీసీలకు 120, జూనియర్ కళాశాలలు వున్నాయి. లోగడ వున్నవి, కొత్తగా ఏర్పా టు చేస్తున్నవి అన్నీ కలిపితే, వచ్చే విద్యా ఏడాది నాటికి రికార్డుస్థాయిలో 760 గురుకుల విద్యా సంస్థలు రాష్ట్రంలో నెలకొల్పబడి సుమారు 2.3 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.

రాష్ట్ర ఆవిర్భావం జరిగిన కొన్నాళ్లకే జూన్ 2014లో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థ స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థగా రూపుదిద్దుకున్నది. సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి, గణనీయమైన సేవలందిస్తున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీలో పట్టభద్రులు కావడానికి పూర్వం అక్కడ పరిచయమైన కొందరి స్ఫూర్తి ఇక్కడ పని చేయటానికి బాటలు వేసింది.

గురుకుల విద్యా సంస్థల్లోని ప్రతి పాఠశాలలో చక్కటి భవనంతో పాటు, ఒక డార్మిటరీ, వంటశాల, భోజనశాల, పని వారికి ఇళ్ళు, ఆటలకు మైదానం ఉంటా యి. టీచర్లూ అదే క్యాంపస్‌లోనే ఉంటూ విద్యార్థుల అవసరాలకనుగుణంగా పాఠ్యాంశాలను బోధిస్తుంటారు. పాఠ్యేతర, క్రీడా సంబంధమైన అంశాల కనుగుణంగా దిశా నిర్దేశం చేస్తూ అహర్నిశలు కంటికి రెప్పలా వారిని పర్యవేక్షిస్తుంటారు. విద్యా విధానంలో ప్రస్తుతమున్న అన్ని అనర్థాలకూ గురుకుల విద్య సమాధానం కాకపోవచ్చు. కానీ ఈ నమూనా తప్పకుండా, అణగారినవర్గాల్లో ఆణిముత్యాల్ని వెలికితీస్తుంది. సురక్షితమైన, సుస్థిరమైన, సమగ్రమైన రీతిలో తీర్చిదిద్దబడిన పిల్లలు వారి కుటుంబాలనే కాకుండా సమాజాన్నీ తగురీతిన తీర్చిదిద్దటంలో సఫలీకృతులవుతారు.

512

VANAM JWALA NARASIMHA RAO

Published: Thu,December 21, 2017 01:12 AM

కృత్రిమ వైరుధ్యాలతో కుమ్ములాటలా!

హైదరాబాద్‌లో అద్భుతంగా జరిగిన జీఈఎస్ ఎనిమిదవ సదస్సు నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా వ్యయం చేయలేదన్నారు సీఎం. అసలీ సదస

Published: Tue,November 21, 2017 11:20 PM

ఆధ్వర్యం మనదే.. అధ్యక్షత మనదే

తెలంగాణలో జరిగే ప్రపంచ తెలుగు మహాసభలకు రంగం సిద్ధమవుతున్నది. సమావేశాలు జరుగడానికి ఇంకా మూడు వారాలే మిగిలాయి. దేశం నలుమూలల నుంచి, వ

Published: Sun,November 12, 2017 12:41 AM

గ్రామ పునర్నిర్మాణం దిశగా..

క్రియాశీల పంచాయతీరాజ్ వ్యవస్థకు శ్రీకారం చుట్టాలని, స్వయం ప్రతిపత్తితో గ్రామాలు, వ్యక్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అభివృద్ధిలో భ

Published: Sun,October 15, 2017 01:33 AM

కులాలపై విమర్శ తగదు

శతాబ్దాలకాలంగా బ్రాహ్మణ, బ్రాహ్మణేతరులు కలిమిడిగా, అభివృద్ధి చేసిన సామాజిక, రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. ఒకరిని మరొకరు దూషించుకున

Published: Wed,October 4, 2017 12:56 AM

వ్యాపారం చేయడమే నేరమా?

ఇటీవల ఒక సామాజిక శాస్త్రవేత్త కోమట్లను సామాజిక స్మగ్లర్లు (దొంగ రవాణాదారులు) అంటూ ఒక అసంబద్ధమైన బుల్లి పుస్తకాన్ని రాశాడు. దానిమీద

Published: Sat,April 22, 2017 03:12 AM

కేంద్ర, రాష్ట్ర సంబంధాల్లో కొత్త అధ్యాయం

ముఖ్యమంత్రి అసెంబ్లీలో కేంద్ర-రాష్ట్ర సంబంధాల విషయంలో వెలిబుచ్చిన అభిప్రాయాలు, ముస్లిం రిజర్వేషన్ల పెంపు అంశం, యావత్ భారతదేశం దృష

Published: Tue,March 28, 2017 12:01 AM

అభివృద్ధి కోసమే అప్పులు

అత్యంత హుందాగా, సమర్థవంతంగా, అర్థవంతంగా సుమారు మూడు వారాల పాటు జరిగిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా ప

Published: Tue,February 14, 2017 01:23 AM

ప్రపంచవ్యాప్త మహిళా సాధికారత

ఎందరో మహిళలు దేశ దేశాల్లో కీలకమైన పదవుల్లో ఉండటం గత ఐదారు దశాబ్దాల మహిళా సాధికారతకు నిదర్శనం. భవిష్యత్‌లో మరికొన్ని దేశాల అధ్యక్

Published: Tue,December 13, 2016 01:03 AM

బహుముఖ ప్రజ్ఞాశాలి సీఎస్‌ఆర్

ఉత్తర భారతదేశంలోని బద్రీనాథ్, కేదార్‌నాథ్ దేవాలయానికి 1977లో సీఎస్‌ఆర్అ ధ్యక్షులుగా నియమించబడ్డారు. వారి కాలంలోనే బద్రీనాథ్, కేదార

Published: Sun,September 18, 2016 12:57 AM

అన్యాయానికి సజీవసాక్ష్యం

నందికొండ ప్రాజెక్టు నిర్మాణం 1956న ప్రారంభం కాగా 1969లో పూర్తయ్యింది.గేట్ల ఏర్పాటు, స్పిల్‌వే ఏర్పాటు 1974 నాటికి పూర్తి చేయటం జరి

Published: Thu,September 3, 2015 01:28 AM

అందరికీ విద్య దిశగా అడుగులు

సమాజానికి అవసరమయ్యే సేవలు ఏమిటి? అందుకు అనుగుణంగా సేవలందించేవారిని ఎలా తయారు చేయాలి? అనే విషయంపై విద్యా శాఖకు అవగాహన ఉండాలి. ఏ వృత

Published: Sun,August 23, 2015 01:39 AM

వ్యయం లేని వ్యవసాయం కావాలి

తెలంగాణలో ప్రతి గ్రామంలో రైతులతో వ్యవసాయ శాఖ ప్రత్యక్ష అనుబంధం కలిగి వుండాలి. ఎప్పటికప్పుడు రైతులతో మాట్లాడుతూ వ్యవసాయానికి పూర్వ

Published: Wed,August 19, 2015 12:09 AM

నాటిరోజుల్లో గ్రామీణ జనజీవనం

వేసవి కాలంలో పొలాలకు పెంట తోలే ప్రక్రియ తో వ్యవసాయ పనులు మొదలయ్యేవి. పాడి పశువుల వల్ల పోగైన పెంటను ఎరువుగా పొలాలకు తరలించేవారు. అద

Published: Wed,August 12, 2015 01:49 AM

యాభై ఏళ్ల సింగపూర్.. విశేషాలు

ఐదారు దశాబ్దాల క్రితం వరకూ దూర ప్రాచ్య తీర ప్రాంతంలో, బ్రిటన్‌కు ప్రధానమైన నావికా సైనిక స్థావరంగా మాత్రమే ఉండేది సింగపూర్. అలాంటిద

Published: Fri,July 31, 2015 11:18 PM

ఆచితూచి.. అసలైన నిర్ణయం

న్యాయపరమైన నియమ, నిబంధనల నేపథ్యంలో రాజ్యాంగ ప్రకరణాలు, న్యాయస్థానాల తీర్పులు ఉండి తీరాలి. సంప్రదాయాలకు ఇదమిత్థమైన నిబంధనలంటూ ఏవీ ఉ

Published: Thu,July 23, 2015 12:20 AM

పర్యాటక మకుటంగా యాదాద్రి ..

180 ఎకరాల విస్తీర్ణం గల యాదగిరిగుట్ట స్థలాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకునేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఆ ప్రాంతమంతా అందమైన చెట్లతో

Published: Thu,July 2, 2015 04:46 AM

ఆకుపచ్చని తెలంగాణ దిశగా..

బంగారు తెలంగాణ స్వప్నం సాకార దిశగా మరో కీలకమైన అడుగు వేయడానికి ప్రభుత్వం సకల సన్నాహాలు చేసింది. తెలంగాణకు హరిత హారం పేరుతో ముఖ్యమం

Published: Thu,June 25, 2015 01:13 AM

పుష్కరాలు ఆధ్యాత్మిక పరిమళాలు

గౌతమ మహర్షి కఠోర తపస్సు కారణాన భూలోకానికి తేబడిన గంగానది పాయ గౌతమిగా, గోదావరిగా ప్రసిద్ధికెక్కింది. గంగానది అంశగా భావించబడే గోదావర

Published: Thu,September 11, 2014 12:27 AM

నాటి హైదరాబాద్ జ్ఞాపకాలు

జూన్, 1964లో నేను, నాన్న గారు కలిసి మొదటిసారి హైదరాబాద్ చేరుకున్నాం.ఖమ్మంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు బస్సెక్కితే హైదరాబాద్ గౌలిగూ

Published: Tue,June 10, 2014 01:16 AM

వాగ్దానాల అమలు దిశగా..

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వారంలోపల కేసీఆర్ తాను చేయబోయే కార్యక్రమాలు ఎలా వుండబోతున్నాయో చెప్పారు. తమ ఎన్నికల ప్రణాళికలో ప

country oven

Featured Articles