నాటి హైదరాబాద్ జ్ఞాపకాలు


Thu,September 11, 2014 12:27 AM

జూన్, 1964లో నేను, నాన్న గారు కలిసి మొదటిసారి హైదరాబాద్ చేరుకున్నాం.ఖమ్మంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు బస్సెక్కితే హైదరాబాద్ గౌలిగూడా బస్‌స్టాండ్ చేరుకునే సరికి సాయంత్రం ఏడు దాటింది. చిక్కడపల్లి వెళ్లడానికి గౌలిగూడా నుంచి రిక్షా కుదుర్చుకున్నాం. రిక్షావాలాను మొద లు చల్తే క్యా అని అడగాలి. అంతా హిందీ -ఉర్దూ కలిసిన భాష. కహా జానా సాబ్ అని తను అడగడం...మేం చిక్కడపల్లి దేవల్ కి బాజు గల్లీ అని చెప్పడం, రిక్షా అతను బారానా (75 పైసలకు సమానం) కిరాయి అడిగితే, మేం ఛె అనా ఇస్తామనడం, చివరకు ఆఠానాకు కుదిరింది. గౌలిగూడ, ఇస్లామియా బజార్, సుల్తాన్‌బజార్, బడీచావిడి, కాచిగుడా చౌరస్తా, వై.ఎం.సి.ఏ మీదుగా చిక్కడపల్లి దేవల్‌కి బాజు గల్లీలో వున్న మామయ్య ఇంటికి చేరుకున్నాం.


1964 జూన్ నెలలో న్యూసైన్స్ కాలేజీలో బీఎస్సీ డిగ్రీ రెండో సంవత్సరంలో చేరాను. అడిక్‌మెట్‌లో ఒక గది అద్దెకు తీసుకున్నాను. నెలసరి అద్దె పది రూపాయల లోపే! అప్పట్లో బట్టల కుట్టు కూలీ ఐదారు రూపాయల కంటే మించకపోయేది. ఇప్పటి లాగా అప్పట్లో రెడీమేడ్ దుస్తులు ఎక్కువగా లభించకపోయేవి. కాటన్ దస్తులు తక్కువే. మొదట్లో బాటం వెడల్పుగా వుండే పాంట్లు కుట్టించుకునే వాళ్లం. ఆ తరువాత గొట్టం పాంట్ల ఫాషన్ వచ్చింది. అవి పోయి బెల్ బాటం వచ్చాయి. పాంటు కింద భాగంలో మడతతో కొన్నాళ్లు, మడత లేకుండా కొన్నాళ్లు ఫ్యాషన్‌గా వుండేది.


విద్యానగర్‌లో వున్నంత కాలం భోజనం సమీపంలోని చెలమయ్య హోట ల్‌లో తినేవాడిని. విద్యానగర్ నుంచి కాలేజీకి వెళ్లడానికి 3-డి బస్సు ఎక్కి, నారాయణగూడలో దిగి, నడుచుకుంటూ, విఠల్‌వాడీ మీదుగా వెళ్లేవాడిని. చార్మినార్ చౌరస్తా-ఆర్.టి.సి.క్రాస్‌రోడ్స్ నుంచి (ఇప్పుడున్న) టాంక్ బం డును కలిపే రోడ్డు కూడా అప్పట్లో లేదు. ఇందిరాపార్క్ అసలే లేదు. ధర్నా చౌక్ కూడా లేదు. ఇందిరాపార్క్ దగ్గర నుంచి టాంక్‌బండ్ పక్కగా ప్రస్తుతం వున్న ైఫ్లె ఓవర్ కూడా లేదప్పుడు. ఆ రోజుల్లో హైదరాబాద్‌లో కనీసం పాతిక- ముప్ఫై వేల రిక్షాలన్నా వుండేవి. మీటర్ టాక్సీలుండేవి కాని, బేరం కుదుర్చుకోని ఎక్కించుకోవడం తప్ప మీటర్ ఎప్పుడూ వేయక పోయేవారు. ఆటోలు కూడా వుండేవి కాని అంత పాపులర్ కాదు. టాక్సీలకు కిలోమీటర్‌కు పావలా చార్జ్ వున్నట్లు గుర్తు.


సిటీ బస్సుల్లో ప్రయాణం ఇప్పటిలాగా కష్టంగా వుండేది కాదు. హాయిగా ప్రయాణం చేసేవాళ్లం. ఆగే బడో అనుకుంటూ కండక్టర్ సున్నితంగా చెపుతుంటే ప్రయాణీకులు క్రమశిక్షణతో దొరికిన సీట్లలో కూచోవడమో, లేదా, ఒక క్రమపద్ధతిన నిలబడడమో చేసేవారు. సింగిల్ బస్సులు, ట్రైలర్ బస్సులు, డబుల్ డెక్కర్ బస్సులు వుండేవి. టికెట్ ఖరీదు పైసల్లోనో, అణా-బేడలలోనో వుండేది. కనీసచార్జ్ ఒక అణా-ఆరు నయా పైసలు వున్నట్లు గుర్తు. ఇప్పుడు మనం పైసలుగా వ్యవహరిస్తున్న నాణాలను 1957-1964 మధ్య కాలంలో నయా పైసలుగా పిలిచేవారు.

1, 2, 5, 10, 20, 25, 50 (నయా) పైసల నాణాలు చెలామణిలో వుండేవి.
విద్యానగర్‌లో ఎక్కువ రోజులుండలేదు. అక్కడ నుంచి కాలేజీకి వెళ్లి రావ డం ఇబ్బందిగా వుండడంతో మకాం మార్చి, హిమాయత్‌నగర్‌లో ఒక గది అద్దెకు తీసుకున్నా. అద్దె పది రూపాయలు. ఇద్దరం వుండేవాళ్లం. చెరి ఐదు రూపాయలు. కాలేజీకి వెళ్లే దారిలో వై.ఎం.సి.ఎకి ఎదురుగా ఇంద్రభవన్ అనే ఇరానీ రెస్టారెంట్‌లో ఆగుతుండేవాళ్లం ఒక్కొక్కప్పుడు. అక్కడ కాకపోతే సెంటర్ కెఫే కి పోయే వాళ్లం. ఇరానీ చాయ్15 పైసలిచ్చి తాగేవాళ్లం. ఒక్కోసారి పౌనా తాగేవాళ్లం.

5 పైసలకు ఒక సమోసా, లేదా, ఒక బిస్కట్ కొనుక్కుని తినేవాళ్లం. అప్పట్లో పానీ పురి ఖరీదు కూడా 5 పైసలే. మిర్చి బజ్జీ కూడా 5 పైసలకే దొరికేది. అలానే సాయంత్రాలు చిక్కడపల్లి వెళ్లి సాయిబాబా మిఠాయి భండార్‌లో గులాబ్ జామ్, కలకంద తిని, హైదరాబాద్ మౌజ్ కలుపుకుని పాలు-పౌనా తాగేవాళ్లం. పావలాకు అర డజన్ మౌజ్-అరటి పళ్లు దొరికేవప్పుడు.

చిక్కడపల్లి మా మామయ్య ఇంటికి పోయే సందులోనే ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు జి. వెంకటస్వామి ఇల్లుండేది. ఆయనను తరచుగా చూస్తుండేవాళ్లం.నేను స్టూడెంటుగా వున్నంతకాలం ఒక్క తాజ్‌మహల్ హోటల్‌లోనే భోజనం చేశాను. క్రమేపీ రేట్ పెరుక్కుంటూ పోయింది. ఇప్పుడు 36 రూపాయలకు ప్లేట్ ఇడ్లీ కూడా రాని పరిస్థితి! నారాయణగూడ తాజ్‌మహల్ హోట ల్‌లో సాయంత్రాలు కబుర్లు చెప్పుకుంటూ, ఒక ప్లేట్ ముర్కు తిని, వన్ బై టు కప్పు కాఫీ తాగి బయట పడేవాళ్లం. హిమాయత్‌నగర్, అశోక్‌నగర్ మధ్య ఇప్పుడున్న బ్రిడ్జ్ అప్పుడు లేదు. వర్షాకాలంలో మోకాలు లోతు నీళ్లలో నడుచుకుంటూ వెళ్లేవాళ్లం. అశోక్‌నగర్‌లో ఇప్పుడు బ్రహ్మాండంగా వెలిగిపోతున్న హనుమాన్ గుడి అప్పుడు లేదు. కేవలం ఒక విగ్రహం మాత్రం రోడ్డు మధ్యలో కొంచెం పక్కగా వుండేది.


హైదరాబాద్‌లో ఆ రోజుల్లో ఇప్పుడున్నన్ని సినిమా టాకీసులు లేవు. ఆబిడ్స్‌లో వున్న జమ్రూద్ టాకీసు ఒక్కటే జనరేటర్ బాక్-అప్ వున్న ఎయిర్ కండిషన్ థియేటర్. అలానే వి.వి.కాలేజీ పక్కనున్న నవరంగ్ థియేటర్ ఒకే ఒక్క ఎయిర్ కూల్డ్ థియేటర్. ఇవి కాకుండా నారాయణగూడలో దీపక్ మహల్, హిమాయత్‌నగర్‌లో లిబర్టీ, సికింద్రారాబాద్‌లో పారడైజ్, తివోలీ థియేటర్లుండేవి. సికింద్రారాబాద్‌లో ఎక్కువగా ఇంగ్లిష్ సినిమాలు చూపించేవారు. ముషీరాబాద్‌లో రహమత్ మహల్ టాకీసుండేది.

నేను డిగ్రీ ఫైనల్ ఇయర్‌లో వున్నప్పుడు, ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి నాయకుల మధ్య, ఉపకులపతి (వైస్ ఛాన్స్‌లర్) డి.ఎస్.రెడ్డి వ్యవహారంలో బాగా గొడవలు జరిగాయి. ఒక గ్రూపుకు మాజీ కేంద్రమంత్రి ఎస్. జైపాల్‌రెడ్డి, కె. కేశవరావు (మొన్నటి వరకూ ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు.. ప్రస్తుతం టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి) మార్గదర్శకత్వం వహించగా, మరొక గ్రూపుకు నాటి విద్యార్థి నాయకులు ఎం. శ్రీధర్‌రెడ్డి, పుల్లారెడ్డి, (జన సంఘ్) నారాయణదాస్, కమ్యూనిస్టు పార్టీ అనుబంధ విద్యార్థి సంఘ నాయకులు నాయకత్వం వహించారు.

1966లో నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి, 1957నుంచి ఉపకులపతిగా పనిచేస్తున్న డి.ఎస్.రెడ్డిని పదవి నుంచి తప్పించినట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో గుంటూరు కాలేజీ ప్రిన్సిపాల్‌ను నియమించడం కూడా జరిగింది. ఆయన ఛార్జ్ తీసుకోవడానికి రావడం, విద్యార్థుల ఆందోళన మధ్య వెనక్కు తిరిగిపోవడం నాకిం కా గుర్తుంది. బ్రహ్మానందరెడ్డి తీసుకున్న చర్యకు మద్దతుగా జైపాల్‌రెడ్డి, కేశవరావులు ఉద్యమించగా, వ్యతిరేకంగా విద్యార్థి నాయకులు ఉద్యమించారు. ఇంతకు, డి.ఎస్.రెడ్డి చేసిన తప్పేంటి అంటే...ఆయన ఉస్మానియా యూనివర్సిటీకి స్వయం ప్రతిపత్తి కావాలని ప్రతిపాదించడమే! అది నచ్చని బ్రహ్మానందరెడ్డి ఉపకులపతిని తొలగించడానికి చట్టాన్ని సవరించే ప్రయత్నం కూడా చేశాడు.

డి.ఎస్.రెడ్డి హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు న్యాయం కోసం వెళ్లాడు. చివరికి కోర్టులో ఆయనకు అనుకూలంగానే తీర్పు వచ్చింది.1969 వరకు ఆయనే వైస్ ఛాన్స్‌లర్‌గా కొనసాగారు.1968లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి అంకురార్పణ జరుగుతున్నప్పుడు ఆయనే వైస్ ఛాన్స్‌లర్. ఉద్యమం ఊపందుకునే సరికి రావాడ సత్యనారాయణ ఆయన స్థానంలో వచ్చారు. వైస్ ఛాన్స్‌లర్ డి.ఎస్.రెడ్డి కొనసాగించాలని న్యాయస్థానం తీర్పు ఇచ్చిన నేపథ్యంలో, డిగ్రీ విద్యార్థులకు పరీక్షల్లో గ్రేస్ మార్కులు ప్రకటించింది యూనివర్సిటీ.


1068

VANAM JWALA NARASIMHA RAO

Published: Thu,December 21, 2017 01:12 AM

కృత్రిమ వైరుధ్యాలతో కుమ్ములాటలా!

హైదరాబాద్‌లో అద్భుతంగా జరిగిన జీఈఎస్ ఎనిమిదవ సదస్సు నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా వ్యయం చేయలేదన్నారు సీఎం. అసలీ సదస

Published: Tue,November 21, 2017 11:20 PM

ఆధ్వర్యం మనదే.. అధ్యక్షత మనదే

తెలంగాణలో జరిగే ప్రపంచ తెలుగు మహాసభలకు రంగం సిద్ధమవుతున్నది. సమావేశాలు జరుగడానికి ఇంకా మూడు వారాలే మిగిలాయి. దేశం నలుమూలల నుంచి, వ

Published: Sun,November 12, 2017 12:41 AM

గ్రామ పునర్నిర్మాణం దిశగా..

క్రియాశీల పంచాయతీరాజ్ వ్యవస్థకు శ్రీకారం చుట్టాలని, స్వయం ప్రతిపత్తితో గ్రామాలు, వ్యక్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అభివృద్ధిలో భ

Published: Sun,October 15, 2017 01:33 AM

కులాలపై విమర్శ తగదు

శతాబ్దాలకాలంగా బ్రాహ్మణ, బ్రాహ్మణేతరులు కలిమిడిగా, అభివృద్ధి చేసిన సామాజిక, రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. ఒకరిని మరొకరు దూషించుకున

Published: Wed,October 4, 2017 12:56 AM

వ్యాపారం చేయడమే నేరమా?

ఇటీవల ఒక సామాజిక శాస్త్రవేత్త కోమట్లను సామాజిక స్మగ్లర్లు (దొంగ రవాణాదారులు) అంటూ ఒక అసంబద్ధమైన బుల్లి పుస్తకాన్ని రాశాడు. దానిమీద

Published: Sat,April 22, 2017 03:12 AM

కేంద్ర, రాష్ట్ర సంబంధాల్లో కొత్త అధ్యాయం

ముఖ్యమంత్రి అసెంబ్లీలో కేంద్ర-రాష్ట్ర సంబంధాల విషయంలో వెలిబుచ్చిన అభిప్రాయాలు, ముస్లిం రిజర్వేషన్ల పెంపు అంశం, యావత్ భారతదేశం దృష

Published: Tue,March 28, 2017 12:01 AM

అభివృద్ధి కోసమే అప్పులు

అత్యంత హుందాగా, సమర్థవంతంగా, అర్థవంతంగా సుమారు మూడు వారాల పాటు జరిగిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా ప

Published: Tue,February 14, 2017 01:23 AM

ప్రపంచవ్యాప్త మహిళా సాధికారత

ఎందరో మహిళలు దేశ దేశాల్లో కీలకమైన పదవుల్లో ఉండటం గత ఐదారు దశాబ్దాల మహిళా సాధికారతకు నిదర్శనం. భవిష్యత్‌లో మరికొన్ని దేశాల అధ్యక్

Published: Tue,December 13, 2016 01:03 AM

బహుముఖ ప్రజ్ఞాశాలి సీఎస్‌ఆర్

ఉత్తర భారతదేశంలోని బద్రీనాథ్, కేదార్‌నాథ్ దేవాలయానికి 1977లో సీఎస్‌ఆర్అ ధ్యక్షులుగా నియమించబడ్డారు. వారి కాలంలోనే బద్రీనాథ్, కేదార

Published: Fri,September 23, 2016 11:32 PM

ప్రతిభకు ప్రతీకలు గురుకులాలు

విద్యా విధానంలో ప్రస్తుతమున్న అన్ని అనర్థాలకూ గురుకుల విద్య సమాధానం కాకపోవచ్చు. కానీ ఈ నమూనా తప్పకుండా,అణగారిన వర్గాల్లో ఆణిముత్య

Published: Sun,September 18, 2016 12:57 AM

అన్యాయానికి సజీవసాక్ష్యం

నందికొండ ప్రాజెక్టు నిర్మాణం 1956న ప్రారంభం కాగా 1969లో పూర్తయ్యింది.గేట్ల ఏర్పాటు, స్పిల్‌వే ఏర్పాటు 1974 నాటికి పూర్తి చేయటం జరి

Published: Thu,September 3, 2015 01:28 AM

అందరికీ విద్య దిశగా అడుగులు

సమాజానికి అవసరమయ్యే సేవలు ఏమిటి? అందుకు అనుగుణంగా సేవలందించేవారిని ఎలా తయారు చేయాలి? అనే విషయంపై విద్యా శాఖకు అవగాహన ఉండాలి. ఏ వృత

Published: Sun,August 23, 2015 01:39 AM

వ్యయం లేని వ్యవసాయం కావాలి

తెలంగాణలో ప్రతి గ్రామంలో రైతులతో వ్యవసాయ శాఖ ప్రత్యక్ష అనుబంధం కలిగి వుండాలి. ఎప్పటికప్పుడు రైతులతో మాట్లాడుతూ వ్యవసాయానికి పూర్వ

Published: Wed,August 19, 2015 12:09 AM

నాటిరోజుల్లో గ్రామీణ జనజీవనం

వేసవి కాలంలో పొలాలకు పెంట తోలే ప్రక్రియ తో వ్యవసాయ పనులు మొదలయ్యేవి. పాడి పశువుల వల్ల పోగైన పెంటను ఎరువుగా పొలాలకు తరలించేవారు. అద

Published: Wed,August 12, 2015 01:49 AM

యాభై ఏళ్ల సింగపూర్.. విశేషాలు

ఐదారు దశాబ్దాల క్రితం వరకూ దూర ప్రాచ్య తీర ప్రాంతంలో, బ్రిటన్‌కు ప్రధానమైన నావికా సైనిక స్థావరంగా మాత్రమే ఉండేది సింగపూర్. అలాంటిద

Published: Fri,July 31, 2015 11:18 PM

ఆచితూచి.. అసలైన నిర్ణయం

న్యాయపరమైన నియమ, నిబంధనల నేపథ్యంలో రాజ్యాంగ ప్రకరణాలు, న్యాయస్థానాల తీర్పులు ఉండి తీరాలి. సంప్రదాయాలకు ఇదమిత్థమైన నిబంధనలంటూ ఏవీ ఉ

Published: Thu,July 23, 2015 12:20 AM

పర్యాటక మకుటంగా యాదాద్రి ..

180 ఎకరాల విస్తీర్ణం గల యాదగిరిగుట్ట స్థలాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకునేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఆ ప్రాంతమంతా అందమైన చెట్లతో

Published: Thu,July 2, 2015 04:46 AM

ఆకుపచ్చని తెలంగాణ దిశగా..

బంగారు తెలంగాణ స్వప్నం సాకార దిశగా మరో కీలకమైన అడుగు వేయడానికి ప్రభుత్వం సకల సన్నాహాలు చేసింది. తెలంగాణకు హరిత హారం పేరుతో ముఖ్యమం

Published: Thu,June 25, 2015 01:13 AM

పుష్కరాలు ఆధ్యాత్మిక పరిమళాలు

గౌతమ మహర్షి కఠోర తపస్సు కారణాన భూలోకానికి తేబడిన గంగానది పాయ గౌతమిగా, గోదావరిగా ప్రసిద్ధికెక్కింది. గంగానది అంశగా భావించబడే గోదావర

Published: Tue,June 10, 2014 01:16 AM

వాగ్దానాల అమలు దిశగా..

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వారంలోపల కేసీఆర్ తాను చేయబోయే కార్యక్రమాలు ఎలా వుండబోతున్నాయో చెప్పారు. తమ ఎన్నికల ప్రణాళికలో ప