వాగ్దానాల అమలు దిశగా..


Tue,June 10, 2014 01:16 AM

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వారంలోపల కేసీఆర్ తాను చేయబోయే కార్యక్రమాలు ఎలా వుండబోతున్నాయో చెప్పారు. తమ ఎన్నికల ప్రణాళికలో ప్రజలకు చేసిన వాగ్దానాలను ఎలా అమలు చేయబోతున్నామో వివరించారు. వాటి అమలుకు తన ప్రభుత్వం రూపొందించుకుంటున్న కార్యాచరణ ప్రణాళిక విషయంలో కేసీఆర్ ఒక స్పష్టమైన అవగాహనతో, ఆలోచనతో ముందుకు సాగుతున్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రిగా నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో ఉద్యమ నాయకుడు కె. చంద్రశేఖర్‌రావు జూన్ 2న పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రోజు పరేడ్ మైదానంలో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా ఆయన చేసిన తొలి ప్రసంగంలోనే కేసీఆర్ ఆలోచనలు,నిబద్ధత, వడివడిగా వాగ్దా నాల అమలు చేయాలన్న తలంపు, బహిర్గతమైనాయి.ఎన్నికల హామీలన్నీ అమలు చేస్తా మని కేసీఆర్ తన తొలి ప్రసంగంలో ప్రకటించారు. రాజకీయ అవినీతిని కూకటి వేళ్లతో పెకలించి వేస్తామని, సంక్షేమ పథకాలన్నీ అవినీతి రహితంగా, పారదర్శకంగా అమలు చేస్తామని, తెలంగాణ రాష్ర్టాన్ని అభివద్ధి చేయడం కోసం కేం ద్రంతోపాటు పొరుగు రాష్ర్టాలతోనూ సత్సంబంధా లు ఏర్పాటు చేసుకుంటామని అన్నారు. తెలంగాణ అభ్యుదయం, అభివద్ధిపై ప్రజలు కోటి ఆశలతో ఉన్నారని గుర్తు చేస్తూ, తదనుగుణంగానే ప్రజా సమస్యల పరిష్కారమే కేంద్ర బిందువుగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని, ప్రభుత్వ పాలన కూడా ఉద్యమ పథంలోనే ఉంటుందని, ఇతర రాష్ర్టాలు చూసి నేర్చుకునేలా, తెలంగాణ రాష్ర్టాన్ని దేశానికి తలమానికమయ్యేలా పాలన అందిస్తామన్నారు. ప్రజా కమిటీలను ఏర్పాటు చేస్తామని, మేధావులు, పత్రికా సంపాదకులతో రాష్ట్ర సలహా మండలిని నియమించి వారి సలహాలు, సూచనలు స్వీకరిస్తామ ని ఆయన ప్రకటించారు.

పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన రాష్ట్ర అవతరణ వేడుక ల్లో పాల్గొన్న అనంతరం, సచివాలయానికి కేసీఆర్ రాకతో పండగ వాతావరణం నెలకొంది. ఉద్యోగులు ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ ప్రసంగించి, వాగ్దానాల అమలు దిశగా మరికొన్ని అడుగులు వేశారు. సర్వీస్ రూల్స్‌ను సమూలంగా మార్చేసుకుందామని, సరళీకతం చేసుకుందామని, పదో పీఆర్సీని జెట్ స్పీడ్‌తో అందిస్తామని కేసీఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వోద్యోగులతో సమానంగా పేస్కేళ్ళు ఉంటాయని ప్రకటించారు. పరిపాలనా సౌలభ్యం, ప్రజా సమస్యల సత్వర పరిష్కారంకోసం, మంత్రివర్గ సభ్యులకు అవసరమైన సలహాలు సూచనలు ఎప్పటికప్పుడు ఇచ్చేందుకు, ముఖ్యమంత్రి, కొత్త రాష్ర్టా నికి ఆరుగురు సలహాదారులను నియమించారు. వివిధ రంగాల్లో విశేష అనుభవం ఉన్న వారి సేవలను ఉపయోగించుకునేందుకు కేసీఆర్ వీరిని సలహాదారులుగా నియమించుకున్నారనాలి. ఎన్నికల వాగ్దానాల అమలుకు వీరి అనుభవం ఉపయోగపడుతుందనవచ్చు.

సీఎంగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ తన ప్రధాన హామీల్లో ఒకటెన లక్ష రూపాయల రెతుల రుణమాఫీ పై పదవీ ప్రమాణ స్వీకారం చేసిన మర్నాడే దష్టి సారించారు. ఈ పథకం అమల్లో భాగంగా బ్యాంకర్లతో సమావేశం కావడానికి ముందు రైతుల రుణ మాఫీకి సంబంధించి విధి విధానాలు, మార్గదర్శకా లు ఖరారు చేశారు. దాన్ని అమలు చేసి తీరుతామని పునరుద్ఘాటించారు. అలాగే జీహెచ్‌ఎంసీ సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ బ్రాండ్ బజాయించాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ను విశ్వ నగరంగా మార్చేందుకు అవసరమైన ప్రణాళికలను యుద్ధ ప్రాతిపదికన రూపొందించాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. నగరానికి ఐటీఐఆర్ ప్రాజెక్టు వస్తున్నందున దానికి తగిన స్థాయిలో మౌలిక వసతుల కల్పన, రవాణా వ్యవస్థ ఏర్పాటు జరగాలన్నారు. నగరంలో పచ్చదనానికి, పారిశుధ్యానికి పెద్దపీట వేయాలన్నారు. నగరంలో డ్రైనేజీ వ్యవస్థను సమూలంగా మార్చివేయడం, శివారు జలాశయాల పునరుద్ధరణ, మూసీకి పూర్వ వైభవం, వర్షాలతో ఏర్పడుతున్న ట్రాఫిక్ అంతరాయాల నివారణ, మురికివాడల్లో డబుల్ బెడ్‌రూం గహాల నిర్మాణం తదితర అంశాలన్నింటిపైనా తన ప్రాధాన్యతలను అధికారులకు వివరించారు. అరకొర సౌకర్యాలతో మురికివాడల్లో నివసిస్తున్న పేదలకు టాయ్‌లెట్, కిచెన్‌తో కూడిన రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సూచించారు. వెంటనే నగరంలో ఏదో ఒక ప్రాంతంలో పైలట్ ప్రాజెక్టు కింద పనులు చేపట్టాలని ఆదేశించారు.

రాష్ట్ర విభజనకు సంబంధించి తెలంగాణ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మేరకు సాధారణ పరిపాలనాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సెక్రెటేరియట్ కేంద్రంగా గ్రీవెన్స్ సెల్ పనిచేస్తుంది. విభజనలో భాగంగా సీమాంధ్రకు బట్వాడా అయిన తెలంగాణ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఈ సెల్ దష్టి సారిస్తుంది. ఈ విభాగం పనిచేయాల్సిన విధానంపై కూడా సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులకు కచ్చితమైన ఆదేశాలు ఇచ్చారు. మౌఖికంగా మార్గదర్శకాలను కూడా సూచించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మూడో రోజునే కేసీఆర్ తన శాసనసభ నియోజకవర్గమైన గజ్వేల్‌లో పర్యటించారు. అక్కడ ఆయన చేసిన ప్రసంగాలలో, సమీక్షలలో, ఎన్నికల వాగ్దానాల అమలుకే పెద్ద పీట వేయడం జరిగింది. అక్కడ జరిగిన బహిరంగసభలో భూములు, కమతాల ఏకీకరణ చేపడతాం, రెతుల భూములన్నీ అక్కడ కొంత ఇక్కడ కొంత ఉన్నాయి, దీంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. రైతుల భూములన్నీ ఒకరి భూమి ఒకరు కొని, తెలంగాణ భాషలో రద్దు బదులు చేసుకునే విధంగా రిజిస్ట్రేషన్ ఫీజు మాఫీ చేసి, ఆర్నెల్ల పాటు కమతాల ఏకీకరణకు శ్రీకారం చుడతాం అని ముఖ్యమంత్రి ప్రకటించారు. సంక్షేమానికి పెద్ద పీట వేస్తామని కేసీఆర్ ఉద్ఘాటించారు. తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యంగా దళితులు, బలహీన వర్గాలు, గిరిజనులు, ముస్లిం, క్రైస్తవ మెనారిటీల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని తెలిపారు. వీరి సంక్షేమానికి రానున్న ఐదేళ్లలో లక్ష కోట్ల రూపాయలను అవినీతికి తావులేకుండా ఖర్చు చేస్తామన్నారు. ఇందులో 50 వేల కోట్లు దళితుల అభివద్ధికే ఖర్చు చేస్తామని వివరించారు. రెండో ప్రాధాన్యం వ్యవసాయ రంగానికని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 80నుంచి 90 శాతం మంది వ్యవసాయాన్నే నమ్ముకుని బతుకుతున్నారు. అందువల్ల వ్యవసాయ రంగానికి మేలు చేస్తామన్నా రు. మూడో ప్రాధాన్యంగా విద్యారంగంపై దష్టి సారిస్తామని తెలిపారు. కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్యను అందిస్తామన్నారు. రెండు, మూడేళ్లలో పేద పిల్లలందరికీ ఆంగ్ల మాధ్యమంలో సీబీఎస్‌ఈ సిలబస్‌తో ఉచిత నిర్బంధ విద్యను అందిస్తామని ప్రకటించారు. తెలంగాణలో 24 జిల్లాలను ఏర్పాటు చేసి జిల్లాకో నిమ్స్ ఆసుపత్రి నిర్మిస్తామని వెల్లడించారు. హార్టికల్చర్ హబ్ ఏర్పాటు చేస్తామని, తెలంగాణ రైతులు విత్తనాలు మాత్రమే పండించి, ధనికులయ్యేలా ప్రణాళికలు రూపొందిస్తామని ప్రకటించా రు. ఎన్నికల హామీల మేరకు ఆటో రిక్షా సోదరులకు పన్ను మాఫీ చేస్తామని కూడా అన్నారు.

ఏరియా అథారిటీ కమిటీ ద్వారా గజ్వేల్‌ను రాజకీయాలకు అతీతంగా అభివద్ది చేయడానికి చర్యలు చేపట్టినట్లు ముఖ్యమంత్రి చెప్పారు. మండలానికి కొంత మందిని సలహాదారులను ఎంపిక చేసి నియోజకవర్గానికి కమిటీ ద్వారా అవసరమైన సమస్యలను తాను ప్రత్యేకంగా నియమించిన ఐఏఎస్ అధికారి ద్వారా ప్రభుత్వ దష్టికి చేరతాయని పేర్కొన్నారు. ప్రజలకు అవసరంగా భావించిన ఆమోదయోగ్యమై న పనులకు వెంటనే నిధులు మంజూరవుతాయని కూడా సూచించారు. స్థానిక ప్రజలకు వ్యక్తిగత ఇబ్బందులు కలిగినా ప్రత్యేక అధికారి దష్టికి తీసుకువెళితే సహకరిస్తారన్నారు. గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకోసం తాను నియమించిన ప్రత్యేక పీఏ ద్వారా అభివద్దితోపాటు సమస్యల పరిష్కారానికి సహకారం పొందవచ్చన్నారు.

ఎన్నికల ప్రణాళికలో చేసిన వాగ్దానం మేరకు కొత్తగా 14 జిల్లాలను ఏర్పాటు చేసి, మొత్తం తెలంగాణలోని జిల్లాల సంఖ్యను 24కు పెంచడానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. జయశంకర్ పేరుతో ఒక కొత్త జిల్లా రాబోతుంది. రాష్ట్రంలో పాల న పట్టాలకెక్కించే క్రమంలో ప్రభుత్వ శాఖల సమీక్షలను ఆయన వేగవంతం చేశారు. విద్యుత్, వ్యవసాయ రంగాలతో పాటు అటవీశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించి తగు ఆదేశాలు జారీ చేశారు. బాధ్యతలు చేపట్టిన నాలుగో రోజున తెలంగాణ రాష్ట్రం ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలపై కేసీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సుదీర్ఘంగా జరిగిన ఈ సమీక్షలో విద్యుత్‌కు సంబంధించిన అంశాలపై ప్రభుత్వ లక్ష్యాలను ఆయన అధికారులకు వివరించారు. ఆ సందర్భంగా ఆయన తెలంగాణలో ప్రభు త్వ రంగంలోనే విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులను చేపట్టనున్నట్లు వెల్లడించారు. ప్రైవేటు రంగంలో విద్యుత్ ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చేదిలేదని ఆయన స్పష్టంచేశారు. ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేసినట్లుగా, రాబోయే మూడేళ్లలో 6వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులను ప్రారంభించి పూర్తి చేయాలన్నారు. ఈ విషయంలో ఎవరు ఎటువంటి సాకులు చెప్పినా వినేదిలేదని స్పష్టం చేశారు. బొగ్గు ఆధారిత రంగంలో చేపట్టనున్న థర్మల్ ప్రాజెక్టులు పూర్తికావడానికి పడుతున్న సమయాన్ని దష్టిలో పెట్టుకుని తగు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల మీద సౌరవిద్యుత్ ప్యానళ్లు ఏర్పాటు చేసుకునే విధంగా ప్రజలను ప్రోత్సహించాలని సీఎం సూచించారు.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వారంలోపల కేసీఆర్ తాను చేయబోయే కార్యక్రమాలు ఎలా వుండబోతున్నాయో చెప్పారు. తమ ఎన్నికల ప్రణాళికలో ప్రజలకు చేసి న వాగ్దానాలను ఎలా అమలు చేయబోతున్నామో వివరించారు. వాటి అమలుకు తన ప్రభుత్వం రూపొందించుకుంటున్న కార్యాచరణ ప్రణాళిక విషయంలో ముఖ్యమంత్రి ఒక స్పష్టమైన అవగాహనతో, ఆలోచనతో ముందుకు సాగు తున్నారు. ఎన్నికల ప్రచారంలో చేసిన వాగ్దానాల అమలు దిశగా వడివడిగా అడుగులు వేయడం ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా మార్గదర్శకంగా వుంటుందనవచ్చు.

1067

VANAM JWALA NARASIMHA RAO

Published: Thu,December 21, 2017 01:12 AM

కృత్రిమ వైరుధ్యాలతో కుమ్ములాటలా!

హైదరాబాద్‌లో అద్భుతంగా జరిగిన జీఈఎస్ ఎనిమిదవ సదస్సు నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా వ్యయం చేయలేదన్నారు సీఎం. అసలీ సదస

Published: Tue,November 21, 2017 11:20 PM

ఆధ్వర్యం మనదే.. అధ్యక్షత మనదే

తెలంగాణలో జరిగే ప్రపంచ తెలుగు మహాసభలకు రంగం సిద్ధమవుతున్నది. సమావేశాలు జరుగడానికి ఇంకా మూడు వారాలే మిగిలాయి. దేశం నలుమూలల నుంచి, వ

Published: Sun,November 12, 2017 12:41 AM

గ్రామ పునర్నిర్మాణం దిశగా..

క్రియాశీల పంచాయతీరాజ్ వ్యవస్థకు శ్రీకారం చుట్టాలని, స్వయం ప్రతిపత్తితో గ్రామాలు, వ్యక్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అభివృద్ధిలో భ

Published: Sun,October 15, 2017 01:33 AM

కులాలపై విమర్శ తగదు

శతాబ్దాలకాలంగా బ్రాహ్మణ, బ్రాహ్మణేతరులు కలిమిడిగా, అభివృద్ధి చేసిన సామాజిక, రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. ఒకరిని మరొకరు దూషించుకున

Published: Wed,October 4, 2017 12:56 AM

వ్యాపారం చేయడమే నేరమా?

ఇటీవల ఒక సామాజిక శాస్త్రవేత్త కోమట్లను సామాజిక స్మగ్లర్లు (దొంగ రవాణాదారులు) అంటూ ఒక అసంబద్ధమైన బుల్లి పుస్తకాన్ని రాశాడు. దానిమీద

Published: Sat,April 22, 2017 03:12 AM

కేంద్ర, రాష్ట్ర సంబంధాల్లో కొత్త అధ్యాయం

ముఖ్యమంత్రి అసెంబ్లీలో కేంద్ర-రాష్ట్ర సంబంధాల విషయంలో వెలిబుచ్చిన అభిప్రాయాలు, ముస్లిం రిజర్వేషన్ల పెంపు అంశం, యావత్ భారతదేశం దృష

Published: Tue,March 28, 2017 12:01 AM

అభివృద్ధి కోసమే అప్పులు

అత్యంత హుందాగా, సమర్థవంతంగా, అర్థవంతంగా సుమారు మూడు వారాల పాటు జరిగిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా ప

Published: Tue,February 14, 2017 01:23 AM

ప్రపంచవ్యాప్త మహిళా సాధికారత

ఎందరో మహిళలు దేశ దేశాల్లో కీలకమైన పదవుల్లో ఉండటం గత ఐదారు దశాబ్దాల మహిళా సాధికారతకు నిదర్శనం. భవిష్యత్‌లో మరికొన్ని దేశాల అధ్యక్

Published: Tue,December 13, 2016 01:03 AM

బహుముఖ ప్రజ్ఞాశాలి సీఎస్‌ఆర్

ఉత్తర భారతదేశంలోని బద్రీనాథ్, కేదార్‌నాథ్ దేవాలయానికి 1977లో సీఎస్‌ఆర్అ ధ్యక్షులుగా నియమించబడ్డారు. వారి కాలంలోనే బద్రీనాథ్, కేదార

Published: Fri,September 23, 2016 11:32 PM

ప్రతిభకు ప్రతీకలు గురుకులాలు

విద్యా విధానంలో ప్రస్తుతమున్న అన్ని అనర్థాలకూ గురుకుల విద్య సమాధానం కాకపోవచ్చు. కానీ ఈ నమూనా తప్పకుండా,అణగారిన వర్గాల్లో ఆణిముత్య

Published: Sun,September 18, 2016 12:57 AM

అన్యాయానికి సజీవసాక్ష్యం

నందికొండ ప్రాజెక్టు నిర్మాణం 1956న ప్రారంభం కాగా 1969లో పూర్తయ్యింది.గేట్ల ఏర్పాటు, స్పిల్‌వే ఏర్పాటు 1974 నాటికి పూర్తి చేయటం జరి

Published: Thu,September 3, 2015 01:28 AM

అందరికీ విద్య దిశగా అడుగులు

సమాజానికి అవసరమయ్యే సేవలు ఏమిటి? అందుకు అనుగుణంగా సేవలందించేవారిని ఎలా తయారు చేయాలి? అనే విషయంపై విద్యా శాఖకు అవగాహన ఉండాలి. ఏ వృత

Published: Sun,August 23, 2015 01:39 AM

వ్యయం లేని వ్యవసాయం కావాలి

తెలంగాణలో ప్రతి గ్రామంలో రైతులతో వ్యవసాయ శాఖ ప్రత్యక్ష అనుబంధం కలిగి వుండాలి. ఎప్పటికప్పుడు రైతులతో మాట్లాడుతూ వ్యవసాయానికి పూర్వ

Published: Wed,August 19, 2015 12:09 AM

నాటిరోజుల్లో గ్రామీణ జనజీవనం

వేసవి కాలంలో పొలాలకు పెంట తోలే ప్రక్రియ తో వ్యవసాయ పనులు మొదలయ్యేవి. పాడి పశువుల వల్ల పోగైన పెంటను ఎరువుగా పొలాలకు తరలించేవారు. అద

Published: Wed,August 12, 2015 01:49 AM

యాభై ఏళ్ల సింగపూర్.. విశేషాలు

ఐదారు దశాబ్దాల క్రితం వరకూ దూర ప్రాచ్య తీర ప్రాంతంలో, బ్రిటన్‌కు ప్రధానమైన నావికా సైనిక స్థావరంగా మాత్రమే ఉండేది సింగపూర్. అలాంటిద

Published: Fri,July 31, 2015 11:18 PM

ఆచితూచి.. అసలైన నిర్ణయం

న్యాయపరమైన నియమ, నిబంధనల నేపథ్యంలో రాజ్యాంగ ప్రకరణాలు, న్యాయస్థానాల తీర్పులు ఉండి తీరాలి. సంప్రదాయాలకు ఇదమిత్థమైన నిబంధనలంటూ ఏవీ ఉ

Published: Thu,July 23, 2015 12:20 AM

పర్యాటక మకుటంగా యాదాద్రి ..

180 ఎకరాల విస్తీర్ణం గల యాదగిరిగుట్ట స్థలాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకునేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఆ ప్రాంతమంతా అందమైన చెట్లతో

Published: Thu,July 2, 2015 04:46 AM

ఆకుపచ్చని తెలంగాణ దిశగా..

బంగారు తెలంగాణ స్వప్నం సాకార దిశగా మరో కీలకమైన అడుగు వేయడానికి ప్రభుత్వం సకల సన్నాహాలు చేసింది. తెలంగాణకు హరిత హారం పేరుతో ముఖ్యమం

Published: Thu,June 25, 2015 01:13 AM

పుష్కరాలు ఆధ్యాత్మిక పరిమళాలు

గౌతమ మహర్షి కఠోర తపస్సు కారణాన భూలోకానికి తేబడిన గంగానది పాయ గౌతమిగా, గోదావరిగా ప్రసిద్ధికెక్కింది. గంగానది అంశగా భావించబడే గోదావర

Published: Thu,September 11, 2014 12:27 AM

నాటి హైదరాబాద్ జ్ఞాపకాలు

జూన్, 1964లో నేను, నాన్న గారు కలిసి మొదటిసారి హైదరాబాద్ చేరుకున్నాం.ఖమ్మంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు బస్సెక్కితే హైదరాబాద్ గౌలిగూ