ద్వీప దేశం సింగపూర్ అభివృద్ధి రహస్యం!


Tue,December 10, 2013 12:53 AM

గత ఏడాది మొదటిసారి వచ్చినప్పుడు, ఇప్పుడు మళ్లీ రెండో మారు వచ్చినప్పుడు సింగపూర్ నగరంలో తిరుగుతుంటే ఆశ్చ ర్యం. ఎలా అతి కొద్ది కాలంలో సింగపూర్ ఇంతగా అభివృద్ధి చెందింది! ప్రపంచ దేశాలలో ఆర్థిక రంగం ఇంతగా అభివృద్ధి చెందింది బహుశా ఇక్కడేనేమో! సంపన్న దేశాలలో ముందు వరుస నున్న వాటిలో సింగపూర్ ఒకటి. ద్వీపాల సమూహంతో కూడిన ద్వీప దేశం ఇది. గణతంత్ర సింగపూర్‌గా ఆవిర్భవించిన రోజుల్లోను, అంతకు ముందు బ్రిటన్ వలస రాజ్యంగా వున్న సం దర్భంలోను పలు దేశాల దృష్టిలో లేని దేశం ఇది. స్వాతంత్య్రం పొందిన వలస దేశాల తదనంతర రాజకీయ-ఆర్థిక చరిత్ర ఒక దానితో మరొకటి పోల్చడం చాలా కాష్టం.అలాంటి దేశాలలో సింగపూర్ ప్రత్యేక స్థానం సంతరించుకుంది.

ఐరోపా దేశాల ఆధిపత్యానికి గండి పడి, రెండో ప్రపంచ యుద్ధానంతరం పరిస్థితులు మారిపోవడంతో, వలస రాజ్యాలకు స్వాతంత్య్రం లభించడంతో పాటు, సింగపూర్ స్థితిగతులు కూడా మార్పుకు గురయ్యాయి. రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యం నామకార్థం మిగిలిపోయింది. కామన్వెల్త్ దేశాల అధ్యాయం మొదలైంది. ఆ నేపథ్యంలో తొలుత సింగపూర్ మలయాలో విలీనమై, మలేసియాలో భాగమైంది. రెండేళ్లకే సింగపూర్‌ను వది లించుకుంది మలేసియా. సింగపూర్ జాతిపితగా, ఆ దేశ ఆవిర్భా వ కారకుడిగా గుర్తింపు తెచ్చుకున్న లీ క్వాన్ యూ దేశ ప్రధాని అయ్యారు. ఈ నాటికీ, 90 సంవత్సరాల వృద్ధాప్యంలో కూడా, ఆ దేశ రాజకీయాలను పరోక్షంగా శాసిస్తూ, ప్రభుత్వ పాలనలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

ఏబై ఏళ్ల సింగపూర్ చరిత్రలో ఇంతవరకూ కేవలం ముగ్గురే ప్రధానులయ్యారు. సింగపూర్ చరి త్ర వెనుక, అభివృద్ధి వెనుక ఏముంది తెలుసు కోవడానికి, పుస్త కాల దుకాణాలు వెతుకుతుంటే, లీ క్వాన్ యూ రాసిన 800 పేజీ ల బృహత్ గ్రంథం దొరికింది. ‘ఫ్రం థర్డ్ వరల్డ్ టు ఫస్’్ట అనే ఆ పుస్తకం సింగపూర్ యువతరానికి సందేశా త్మకంగా రాశా రాయ న. ఆవిర్భావం నుంచి గత శతాబ్దం చివరి దాకా, సింగపూ ర్‌కు ఎదురైన చేదు-తీపి అనుభ వాల గురించి, ఆటుపోట్ల గురిం చి వివరంగా వుందాపుస్తకంలో. సింగపూర్ అభివృద్ధి ఆషా మాషీగా జరిగింది కాదని, దేశ అభి వృద్ధికి, ఆర్థిక ఎదుగుదలకు, తన కాలంనాటి నాయకులు, ఆ తరువాత వచ్చిన వారు ఎంతో కృషి చేశారని వివరించారు.

640చదరపు కిలో మీటర్ల విస్తీర్ణం లో, సహజ వనరులనేవి లేకుండా, చైనాబిటి ష్ ఇండియా-డచ్-ఇతర దేశాల నుంచి వలస వచ్చిన వారి మధ్య ఐక్యత సాధించుకుంటూ, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం వెనుక వున్న సుదీర్ఘమైన చరిత్ర రాశారు.

1942-1945 మధ్య కాలంలో, జపాన్ ఆక్రమణ కింద సింగపూర్ మగ్గుతున్న రోజుల్లో, బ్రిటన్‌లో విద్యాభ్యాసం చేస్తుండేవాడు లీ. సింగ పూర్ ఎదుర్కుంటున్న సమస్యలను అర్థం చేసు కున్న లీ మదిలో జాతీయ భావాలు, ఆత్మగౌరవ ఆవేశం పెల్లు బుకింది. 1950లో సింగపూర్ తిరిగొచ్చిన లీ, కార్మిక సంఘాల-రాజకీయ నాయకులతో సంబంధాలు ఏర్పరుచు కున్నారు. రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకుని కమ్యూనిస్టులతో చేతులు కలిపాడు. 35 సంవత్సరాల పిన్న వయసులో సింగపూర్ ప్రధాని అయ్యారు. కమ్యూనిస్ట్ పార్టీతో ఉమ్మడి ఫ్రంట్ ఏర్పాటు చేసి నప్పటికీ, ఆ తరువాత విడిపోయారు. లీ క్వాన్ యూ, ఆయ న సహచరులు, సింగపూర్‌ను మలయాలో విలీనం చేస్తే బాగుం టుందని నమ్మడం, సెప్టెంబర్ 1963లో కలవడం, అలా కలిసిన ఇరు దేశాలు మలేసియాగా పిలవబడడం జరిగింది. అయితే, ఆ తరువాత చోటు చేసుకున్న రాజకీయ, సామాజిక పరిణామాలు, సైద్ధాంతిక విభేదాలు మలేసియా నుంచి సింగపూర్ వేరు పడ డానికి దారితీశాయి. ఫలితంగా ఆగస్ట్ 1965లో సింగపూర్ సర్వ సత్తాక గణ తంత్ర నగర-రాజ్యంగా ఏర్పడింది.

1965లో బాధ్యతలు స్వీకరించిన లీ ధైర్యంగా ముందుకు సాగారు. పటిష్టమైన, నాణ్యమైన, ప్రొఫెషనల్ సైనిక-ఆయుధ పాటవాన్ని సమ కూర్చుకున్నారు. పాతికేళ్ల తరువాత, 1990లో లీ క్వాన్ యూ పదవీ విరమణ చేసే నాటికి, సింగపూర్ సైనిక బలగాలు అత్యంత బలీయమైన విగా గుర్తింపు తెచ్చుకున్నాయి. 1965లో సింగపూర్ ప్రస్థానం ప్రారంభమైనప్పుడు, ఒకానొక రోజున, ఆ దేశం ప్రపంచ స్థాయి ఆర్థిక లావాదేవీల కేంద్రం అవు తుందని కాని, అగ్ర రాజ్యాల సరసన వాటిని కూ డా శాసించే స్థాయికి ఎదిగి, సంపన్న దేశాలలో ఒకటిగా అవుతుందని కానీ ఎవరూ ఊహించి వుండరు. ఈ నాడు, ప్రపంచ దేశాలన్నీ తమ కార్యాలయాలను, బాంకులను సింగపూర్‌లో నెలకొల్పి, అను క్షణం ఆ దేశంతో లండన్, న్యూయార్క్, టోక్యో, ఫ్రాంక్ ఫర్ట్, హాంగ్‌కాంగ్ లాంటి అగ్రశ్రేణి నగరాలతో కంప్యూ టర్ అనుసంధాన కార్యకలాపాలు సాగిస్తున్నాయి.

దీని కంతా 1968 లో బీజం పడింది. దానికొక బృహత్తర ప్రణాళికను పక డ్బందీగా రచించడం జరిగింది. అది రూపు దిద్దుకున్న ప్రక్రియ ఆసక్తికరంగా వుంటుంది. పారిశ్రామికంగా, సాంకేతికంగా, ప్రయోగాల ద్వారా, పరిశోధనల ద్వారా, ఔత్సాహికంగా అభి వృద్ధి చెందుతున్న దేశాలలోసింగపూర్ ముందుంది.
-వనం జ్వాలా నరసింహారావు

408

VANAM JWALA NARASIMHA RAO

Published: Thu,December 21, 2017 01:12 AM

కృత్రిమ వైరుధ్యాలతో కుమ్ములాటలా!

హైదరాబాద్‌లో అద్భుతంగా జరిగిన జీఈఎస్ ఎనిమిదవ సదస్సు నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా వ్యయం చేయలేదన్నారు సీఎం. అసలీ సదస

Published: Tue,November 21, 2017 11:20 PM

ఆధ్వర్యం మనదే.. అధ్యక్షత మనదే

తెలంగాణలో జరిగే ప్రపంచ తెలుగు మహాసభలకు రంగం సిద్ధమవుతున్నది. సమావేశాలు జరుగడానికి ఇంకా మూడు వారాలే మిగిలాయి. దేశం నలుమూలల నుంచి, వ

Published: Sun,November 12, 2017 12:41 AM

గ్రామ పునర్నిర్మాణం దిశగా..

క్రియాశీల పంచాయతీరాజ్ వ్యవస్థకు శ్రీకారం చుట్టాలని, స్వయం ప్రతిపత్తితో గ్రామాలు, వ్యక్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అభివృద్ధిలో భ

Published: Sun,October 15, 2017 01:33 AM

కులాలపై విమర్శ తగదు

శతాబ్దాలకాలంగా బ్రాహ్మణ, బ్రాహ్మణేతరులు కలిమిడిగా, అభివృద్ధి చేసిన సామాజిక, రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. ఒకరిని మరొకరు దూషించుకున

Published: Wed,October 4, 2017 12:56 AM

వ్యాపారం చేయడమే నేరమా?

ఇటీవల ఒక సామాజిక శాస్త్రవేత్త కోమట్లను సామాజిక స్మగ్లర్లు (దొంగ రవాణాదారులు) అంటూ ఒక అసంబద్ధమైన బుల్లి పుస్తకాన్ని రాశాడు. దానిమీద

Published: Sat,April 22, 2017 03:12 AM

కేంద్ర, రాష్ట్ర సంబంధాల్లో కొత్త అధ్యాయం

ముఖ్యమంత్రి అసెంబ్లీలో కేంద్ర-రాష్ట్ర సంబంధాల విషయంలో వెలిబుచ్చిన అభిప్రాయాలు, ముస్లిం రిజర్వేషన్ల పెంపు అంశం, యావత్ భారతదేశం దృష

Published: Tue,March 28, 2017 12:01 AM

అభివృద్ధి కోసమే అప్పులు

అత్యంత హుందాగా, సమర్థవంతంగా, అర్థవంతంగా సుమారు మూడు వారాల పాటు జరిగిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా ప

Published: Tue,February 14, 2017 01:23 AM

ప్రపంచవ్యాప్త మహిళా సాధికారత

ఎందరో మహిళలు దేశ దేశాల్లో కీలకమైన పదవుల్లో ఉండటం గత ఐదారు దశాబ్దాల మహిళా సాధికారతకు నిదర్శనం. భవిష్యత్‌లో మరికొన్ని దేశాల అధ్యక్

Published: Tue,December 13, 2016 01:03 AM

బహుముఖ ప్రజ్ఞాశాలి సీఎస్‌ఆర్

ఉత్తర భారతదేశంలోని బద్రీనాథ్, కేదార్‌నాథ్ దేవాలయానికి 1977లో సీఎస్‌ఆర్అ ధ్యక్షులుగా నియమించబడ్డారు. వారి కాలంలోనే బద్రీనాథ్, కేదార

Published: Fri,September 23, 2016 11:32 PM

ప్రతిభకు ప్రతీకలు గురుకులాలు

విద్యా విధానంలో ప్రస్తుతమున్న అన్ని అనర్థాలకూ గురుకుల విద్య సమాధానం కాకపోవచ్చు. కానీ ఈ నమూనా తప్పకుండా,అణగారిన వర్గాల్లో ఆణిముత్య

Published: Sun,September 18, 2016 12:57 AM

అన్యాయానికి సజీవసాక్ష్యం

నందికొండ ప్రాజెక్టు నిర్మాణం 1956న ప్రారంభం కాగా 1969లో పూర్తయ్యింది.గేట్ల ఏర్పాటు, స్పిల్‌వే ఏర్పాటు 1974 నాటికి పూర్తి చేయటం జరి

Published: Thu,September 3, 2015 01:28 AM

అందరికీ విద్య దిశగా అడుగులు

సమాజానికి అవసరమయ్యే సేవలు ఏమిటి? అందుకు అనుగుణంగా సేవలందించేవారిని ఎలా తయారు చేయాలి? అనే విషయంపై విద్యా శాఖకు అవగాహన ఉండాలి. ఏ వృత

Published: Sun,August 23, 2015 01:39 AM

వ్యయం లేని వ్యవసాయం కావాలి

తెలంగాణలో ప్రతి గ్రామంలో రైతులతో వ్యవసాయ శాఖ ప్రత్యక్ష అనుబంధం కలిగి వుండాలి. ఎప్పటికప్పుడు రైతులతో మాట్లాడుతూ వ్యవసాయానికి పూర్వ

Published: Wed,August 19, 2015 12:09 AM

నాటిరోజుల్లో గ్రామీణ జనజీవనం

వేసవి కాలంలో పొలాలకు పెంట తోలే ప్రక్రియ తో వ్యవసాయ పనులు మొదలయ్యేవి. పాడి పశువుల వల్ల పోగైన పెంటను ఎరువుగా పొలాలకు తరలించేవారు. అద

Published: Wed,August 12, 2015 01:49 AM

యాభై ఏళ్ల సింగపూర్.. విశేషాలు

ఐదారు దశాబ్దాల క్రితం వరకూ దూర ప్రాచ్య తీర ప్రాంతంలో, బ్రిటన్‌కు ప్రధానమైన నావికా సైనిక స్థావరంగా మాత్రమే ఉండేది సింగపూర్. అలాంటిద

Published: Fri,July 31, 2015 11:18 PM

ఆచితూచి.. అసలైన నిర్ణయం

న్యాయపరమైన నియమ, నిబంధనల నేపథ్యంలో రాజ్యాంగ ప్రకరణాలు, న్యాయస్థానాల తీర్పులు ఉండి తీరాలి. సంప్రదాయాలకు ఇదమిత్థమైన నిబంధనలంటూ ఏవీ ఉ

Published: Thu,July 23, 2015 12:20 AM

పర్యాటక మకుటంగా యాదాద్రి ..

180 ఎకరాల విస్తీర్ణం గల యాదగిరిగుట్ట స్థలాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకునేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఆ ప్రాంతమంతా అందమైన చెట్లతో

Published: Thu,July 2, 2015 04:46 AM

ఆకుపచ్చని తెలంగాణ దిశగా..

బంగారు తెలంగాణ స్వప్నం సాకార దిశగా మరో కీలకమైన అడుగు వేయడానికి ప్రభుత్వం సకల సన్నాహాలు చేసింది. తెలంగాణకు హరిత హారం పేరుతో ముఖ్యమం

Published: Thu,June 25, 2015 01:13 AM

పుష్కరాలు ఆధ్యాత్మిక పరిమళాలు

గౌతమ మహర్షి కఠోర తపస్సు కారణాన భూలోకానికి తేబడిన గంగానది పాయ గౌతమిగా, గోదావరిగా ప్రసిద్ధికెక్కింది. గంగానది అంశగా భావించబడే గోదావర

Published: Thu,September 11, 2014 12:27 AM

నాటి హైదరాబాద్ జ్ఞాపకాలు

జూన్, 1964లో నేను, నాన్న గారు కలిసి మొదటిసారి హైదరాబాద్ చేరుకున్నాం.ఖమ్మంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు బస్సెక్కితే హైదరాబాద్ గౌలిగూ