అంతర్‌రాష్ట్ర జలవివాదాలు, రాజకీయాలు


Sat,May 25, 2013 01:10 AM

babu-caricatureబాబ్లీ ప్రాజెక్టు వివాదంపై కోర్టు తీర్పుమీద వివరణ, సమీక్ష కోసం సుప్రీంకోర్టు లో పిటిషన్ దాఖలుకు ముందు మూడంచెల వ్యూహం అనుసరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు వార్తలొచ్చాయి. ఇందులో భాగంగా ప్రాజెక్టు పర్యవేక్షణ కమిటీ పరిధి, అధికారాలపై స్పష్టత కోసం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కేంద్ర జలవనరుల శాఖ మంత్రికి లేఖ రాసే ఆలోచనలో వున్నట్లు కూడా వార్తలొచ్చా యి. అదే లేఖలో, గోదావరి జలాల్లో మహారాష్ట్ర వినియోగించే 60 టీఎంసీలపై లెక్కల ఖరారు సంగతి కూడా తెలపాలని కోరవచ్చు. ఆ తరువాత నీటిపారుదల శాఖ మంత్రి నేతృత్వాన అఖిలపక్షాన్ని ఢిల్లీకి పంపే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తున్నది. ఈ విధంగా చేయడం వలన, బాబ్లీపై సుప్రీంకోర్టు తీర్పుమీద రాష్ట్ర ప్రభుత్వానికి వున్న సందేహాలను కేంద్రం ముందు పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ చేసిన తర్వాత కూడా కేంద్రంనుంచి అనుకున్న స్పష్టత రాకపోతే, సుప్రీం కోర్టుకు వెళ్లాలన్నది ప్రభుత్వ ఆలోచన.

బాబ్లీ ప్రాజెక్టు విషయంలో సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయాలా? లేక క్లారిఫికేషన్ పిటిషన్ వేయాలా? అనే దానిపై న్యాయ నిపుణుల సలహాలు కూడా ప్రభు త్వం తీసుకున్నది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో చేపట్టాల్సిన తదుపరి చర్యలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి మార్చి 28న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు సుప్రీంకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని ప్రతిపక్షాలు ఈ సందర్భంగా ప్రభుత్వానికి సూచించాయి.

దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత సుమారు నలభై సంవత్సరాల దాకా, అటు కేంద్రంలోను, ఇటు పలు రాష్ట్రాలలోనూ కాంగ్రెస్ ప్రభుత్వాలే అధికారంలో వున్నా యి. సరిహద్దున ఉన్న పొరుగు రాష్ట్రాల మధ్య సమస్యలు తలెత్తి, పార్టీ పరంగా చాలావరకు సమసిపోయినా, అన్ని విషయాల్లో, అన్ని సందర్భాల్లో అంగీకారానికి వచ్చాయని అనలేం. కాకపోతే ఆరంభంలో, రాష్ట్రానికి ఒకటో రెండో నాగార్జునసాగర్ ప్రాజె క్టు వంటివి మాత్రమే వుండడంతో, పెద్దగా పేచీలుండకపోయేవి. క్రమేపీ, ఒక్క నీటి పారుదల ప్రాజెక్టులే కాకుండా, రక రకాల పంపకాలలో విభేదాలు తలెత్తడం మొదలైంది. అవీ కాంగ్రెస్ ప్రభుత్వాల మధ్యనే, కాంగ్రెస్ ఇంకా కేంద్రంలో అధికారం కోల్పోకముందే తలెత్తాయి. కాంగ్రేసేతర ప్రభుత్వాలు అధికారంలోకి రావడంతో, విభేదాలు చిలికి చిలికి గాలివానలయ్యాయి.

పొరుగు రాష్ట్రాల మధ్య తలెత్తే సమస్యలను రాజకీయకోణం నుంచి, రాజకీయ లబ్ధిని దృష్టిలో వుంచుకుని చూడడం సహజమైంది. ఇంతలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ ప్రాంత ప్రజలకు లాభం చేకూరాలన్న కోణంలో ఆలోచన చేయడం, ఆ ఆలోచనల్లో రాజకీయం వుండడం, అంతటితో ఆగకుండా కొందరు నాయకులు పొరుగు రాష్ట్రాల వారికి నష్టం జరిగినా తమకు లబ్ది జరగాలని ముందుకు సాగడం నిరంతర సమస్యలకు కారణమైంది. ‘తమ రాష్ట్రం నుంచి పారుతున్న నీటిపై తమకే హక్కు’ అని కొందరు వాదిస్తే, ‘మిగులు జలాలపై హక్కు తమద’ని మరికొందరు వాదించ సాగారు. సహజంగా ప్రవహించే నీటిపై హక్కు ఎవరికి,ఎంత మోతాదులో వుండాలన్నది తేల్చాల్సిన కేంద్ర జల వనరుల సంఘం, ప్రాజెక్టులు ఆరంభించినప్పటినుంచి, పూర్తయ్యే వరకు నిమ్మకు నీరెత్తినట్లు వుండి, ఆ తర్వా త తమకే హక్కుందని వాదించే పొరుగునున్న రాష్ట్రప్రభుత్వాలకు తమదైన శైలిలో వం తుల వారీగా మద్దతిచ్చి సమస్యను మరింత జటిలం చేయడం ఆనవాయితీ అయిపోయింది. అలాంటి తాజా వివాదమే బాబ్లీ ప్రాజెక్టు.

బాబ్లీ ప్రాజెక్ట్ నిర్మాణంలో మహారాష్ట్ర ప్రభుత్వం చేసింది తప్పా ఒప్పా అని నిర్ణయించే అధికారమున్న కేంద్ర జలవనరుల సంఘం తీర్పు చెప్పే లోపునే అది పూర్త యింది. టీడీపీ హయాంలోనే పనులు మొదలయ్యాయని కాంగ్రెస్ వారు, కాదని టీడీ పీ నేతలు వాదించుకోవడంతో మొదలైన జగ డం, అప్పట్లో సమస్యను ప్రధాని దృష్టికి తీసుకెళ్లాలనే వరకుపోయింది. అఖిలపక్ష కమిటీ ప్రధానిని కలిసే లోపునే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో, టీడీపీకి చెందిన పలువురు ప్రజా ప్రతినిధుల బృందం, బాబ్లీ ప్రాజెక్టును సందర్శించి, స్వయంగా అధ్యయనం చేసి, ప్రధానికి అన్ని విషయాలు తెలియచేయాలన్న ఆలోచనతో ఆంధ్ర-మహారాష్ట్ర సరిహద్దుకు చేరుకున్నది. వారిని మహారాష్ట్రలోకి రానీకుండా అడ్డుకున్న మరాఠా పోలీసులు, ప్రాజెక్టుకు తీసుకుపోతామని మభ్యపెట్టి పోలీసు వాహనం ఎక్కించి, అతి జుగుప్సాకరమైన పద్ధతిలో వారందరినీ అరెస్టు చేసినట్లు ప్రకటించి, మర్నాడు న్యాయమూర్తి ముందర హాజరుపరిచారు. ఒక మాజీ ముఖ్యమంత్రి అని చూడకుం డా, మిగతా వారందరు చట్ట సభలకు ఎన్నికైన వారని చూడకుండా, అందులోనూ మహిళలున్నారని ఆలోచించకుండా,అప్పట్లో మరాఠా పోలీసులు ప్రవర్తించారు .

ఒకానొక రోజుల్లో రాష్ట్ర సమస్యలు వచ్చినప్పుడు, పొరుగు రాష్ట్రాలతో పోరాడవలసి వచ్చినప్పుడు, పార్టీలకతీతంగా కలిసిమెలిసి పని చేసేవారు. ఇప్పుడా స్ఫూర్తి పోయింది. అప్పట్లో చంద్రబాబు చేసిన పని విమర్శించవచ్చునేమో కానీ, ఆయన అరెస్టును, ఆ తర్వాత ఆయన పట్ల,ఆయన సహచరుల పట్ల మరాఠా పోలీసులు వ్యవహరించిన తీరును, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కాని, ప్రభుత్వం కాని ఖండించక పోవడం శోచనీయం. అసలింతకీ బాబ్లీ ప్రాజెక్టు ఇరు రాష్ట్రాల రైతుల సమస్య. మహారాష్ట్ర రైతే బాగుపడాలని కానీ, ఆంధ్రా రైతే బాగు పడాలని కాని కోరడం సమంజసం కాదు. భారత దేశంలోని రైతు ఎక్కడున్నా రైతే. జల వివాదాలు పరిష్కరించుకొని, అంతర్ రాష్ట్రాల గుండా పారుతున్న జలాలను, ప్రాజెక్టులు ఎక్కడ కట్టినా, పొరుగున ఉన్న రాష్ట్రాల రైతులకు కూడా న్యాయం జరిగేటట్లు ఉపయోగించుకోవాలి.

రెండు లేక మూడు ఇరుగుపొరుగు రాష్ట్రాల మధ్య జల వివాదం వుంటే, రాజకీయాల కు ఆస్కారం లేకుండా, ఇతర రాష్ట్రాల ఇంజనీరింగ్ నిపుణులసంఘం పరిష్కరించే విధానం రూపొందించాలి. వారి నిర్ణయాన్ని ధిక్కరించకుండా సంబంధిత రాష్ట్రాలు అమలు పరిచే చట్టం రూపొందించాలి. అంతవరకు రాజకీయాలకు అతీతంగా దేశ రైతు లాభ పడే ఆస్కారం భవిష్యత్తులో కనిపించడం లేదు.

చారివూతకంగా,భౌగోళికంగా రూపు దిద్దుకొని, సుస్థిర జన సమూహంతో సామాజిక వర్గంతో కూడి, ఉమ్మడి భాష,పరిసరాలు,ఆర్థిక జీవన శైలి, మానసిక స్థితిగతులు కలిగిన సార్వజనీన సమాజ లక్షణాలుంటే దానినొక జాతిగా, దేశంగా పరిగణించాలని, అదే జాతికి సరైన నిర్వచనమని మార్క్సిస్ట్ సిద్ధాంతం చెపుతుంది. ఈ నిర్వచనాన్ని అన్ని కోణాల్లోంచి చూస్తే సరిపోతుందా అనే విషయంలో భిన్నాభివూపాయాలున్నాయి. ఎల్లలతో కూడిన సరిహద్దులున్నప్పుడే దాన్ని ఒక ప్రత్యేక జాతిగా, లేదా దేశంగా పిలవాలని మరికొందరి అభివూపా యం. గత కొన్నాళ్లుగా వార్తల్లోకెక్కిన బాబ్లీ ప్రాజెక్ట్ వివాదం గమనిస్తుంటే, ఒక దేశం విషయంలో ఇది నిజం కావచ్చునేమో కానీ, ఒకే దేశంలో,ఒకే జాతిలో (భారత జాతి) భాగమైన వివిధ రాష్ట్రాల విషయంలో హద్దులు,సరిహద్దులు హక్కులు ప్రత్యేకతలు వేర్పాటు ధోరణులు అనే భావన కలగడం సరైందేనా? అని ప్రశ్నించుకునే సమయం ఆసన్నమైందనాలి.

భారతదేశం వివిధ రాష్ట్రాల సమా ఖ్య. ఫెడరల్ తరహా వ్యవస్థ. కాకపోతే, పాక్షికంగా ఏక కేంద్రక ప్రభుత్వ విధానాన్ని పాటించే రాజ్యాంగ వ్యవ స్థ అని కూడా అంటాం. ఒక వైపు సకలాధికారాలున్న కేంద్ర ప్రభు త్వం, మరో వైపు తమ రాష్ట్రానికి సంబంధించినంతవరకు అదే మోతాదులో సర్వాధికారాలున్న రాష్ట్ర ప్రభుత్వాలు, సాధ్యమైనంత వరకు తమ తమ హద్దుల్లో, రాజ్యాంగం నిర్దేశించిన పరిధుల్లో, అధికారాన్ని చెలాయిస్తుంటా యి. రాష్ట్రాధికారాలని, కేంద్రం అధికారాలని, ఉమ్మడి అధికారాలని, వేర్వేరు రకాల అధికారాలను, అటు ఫెడరల్ విధానానికి ఇటు యూనిటరీ విధానానికి భంగం కలగని రీతిలో రాజ్యాంగం నిర్దేశించింది. అంతవరకూ బాగానే వున్నది కానీ, ఒకే దేశంలో ఒకే జాతిలో, భిన్న భాషలు మాట్లా డే, విభిన్న సంస్కృతులు అనుసరించే, రక రకాల మనస్తత్వాలున్న సామాజిక వర్గంతో నిండిన వివిధ రాష్ట్రాల మధ్య అధికారాలు, హక్కుల విషయంలో తేడాలొస్తే, పరిష్కరించుకునే విధానం అస్పష్టంగా వుండడంతోనే బాబ్లీ లాంటి సమస్యలు ఉత్పన్నమవడం మొదలైంది.

అసలింతకీ మనముంటున్నది ఒకే దేశంలోని ఒకే జాతి వారమా? లేక ఒకే దేశంలో నివసిస్తున్న విదేశీయులమా? పొరుగునున్న ప్రాజెక్టును చూస్తామనడంలో తప్పేంటో అంతుపట్టడం లేదు. ఇలాంటి సంఘటనలిలానే కొన సాగిస్తే, భిన్నత్వంలో ఏకత్వానికి, ఏకత్వంలో భిన్నత్వానికి ప్రతీక అని మనం చెప్పుకుంటున్న భారతావని ప్రకటనలకే పరిమితం అనాల్సి వస్తుందేమో!

-వనం జ్వాలా నరసింహారావు

35

VANAM JWALA NARASIMHA RAO

Published: Thu,December 21, 2017 01:12 AM

కృత్రిమ వైరుధ్యాలతో కుమ్ములాటలా!

హైదరాబాద్‌లో అద్భుతంగా జరిగిన జీఈఎస్ ఎనిమిదవ సదస్సు నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా వ్యయం చేయలేదన్నారు సీఎం. అసలీ సదస

Published: Tue,November 21, 2017 11:20 PM

ఆధ్వర్యం మనదే.. అధ్యక్షత మనదే

తెలంగాణలో జరిగే ప్రపంచ తెలుగు మహాసభలకు రంగం సిద్ధమవుతున్నది. సమావేశాలు జరుగడానికి ఇంకా మూడు వారాలే మిగిలాయి. దేశం నలుమూలల నుంచి, వ

Published: Sun,November 12, 2017 12:41 AM

గ్రామ పునర్నిర్మాణం దిశగా..

క్రియాశీల పంచాయతీరాజ్ వ్యవస్థకు శ్రీకారం చుట్టాలని, స్వయం ప్రతిపత్తితో గ్రామాలు, వ్యక్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అభివృద్ధిలో భ

Published: Sun,October 15, 2017 01:33 AM

కులాలపై విమర్శ తగదు

శతాబ్దాలకాలంగా బ్రాహ్మణ, బ్రాహ్మణేతరులు కలిమిడిగా, అభివృద్ధి చేసిన సామాజిక, రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. ఒకరిని మరొకరు దూషించుకున

Published: Wed,October 4, 2017 12:56 AM

వ్యాపారం చేయడమే నేరమా?

ఇటీవల ఒక సామాజిక శాస్త్రవేత్త కోమట్లను సామాజిక స్మగ్లర్లు (దొంగ రవాణాదారులు) అంటూ ఒక అసంబద్ధమైన బుల్లి పుస్తకాన్ని రాశాడు. దానిమీద

Published: Sat,April 22, 2017 03:12 AM

కేంద్ర, రాష్ట్ర సంబంధాల్లో కొత్త అధ్యాయం

ముఖ్యమంత్రి అసెంబ్లీలో కేంద్ర-రాష్ట్ర సంబంధాల విషయంలో వెలిబుచ్చిన అభిప్రాయాలు, ముస్లిం రిజర్వేషన్ల పెంపు అంశం, యావత్ భారతదేశం దృష

Published: Tue,March 28, 2017 12:01 AM

అభివృద్ధి కోసమే అప్పులు

అత్యంత హుందాగా, సమర్థవంతంగా, అర్థవంతంగా సుమారు మూడు వారాల పాటు జరిగిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా ప

Published: Tue,February 14, 2017 01:23 AM

ప్రపంచవ్యాప్త మహిళా సాధికారత

ఎందరో మహిళలు దేశ దేశాల్లో కీలకమైన పదవుల్లో ఉండటం గత ఐదారు దశాబ్దాల మహిళా సాధికారతకు నిదర్శనం. భవిష్యత్‌లో మరికొన్ని దేశాల అధ్యక్

Published: Tue,December 13, 2016 01:03 AM

బహుముఖ ప్రజ్ఞాశాలి సీఎస్‌ఆర్

ఉత్తర భారతదేశంలోని బద్రీనాథ్, కేదార్‌నాథ్ దేవాలయానికి 1977లో సీఎస్‌ఆర్అ ధ్యక్షులుగా నియమించబడ్డారు. వారి కాలంలోనే బద్రీనాథ్, కేదార

Published: Fri,September 23, 2016 11:32 PM

ప్రతిభకు ప్రతీకలు గురుకులాలు

విద్యా విధానంలో ప్రస్తుతమున్న అన్ని అనర్థాలకూ గురుకుల విద్య సమాధానం కాకపోవచ్చు. కానీ ఈ నమూనా తప్పకుండా,అణగారిన వర్గాల్లో ఆణిముత్య

Published: Sun,September 18, 2016 12:57 AM

అన్యాయానికి సజీవసాక్ష్యం

నందికొండ ప్రాజెక్టు నిర్మాణం 1956న ప్రారంభం కాగా 1969లో పూర్తయ్యింది.గేట్ల ఏర్పాటు, స్పిల్‌వే ఏర్పాటు 1974 నాటికి పూర్తి చేయటం జరి

Published: Thu,September 3, 2015 01:28 AM

అందరికీ విద్య దిశగా అడుగులు

సమాజానికి అవసరమయ్యే సేవలు ఏమిటి? అందుకు అనుగుణంగా సేవలందించేవారిని ఎలా తయారు చేయాలి? అనే విషయంపై విద్యా శాఖకు అవగాహన ఉండాలి. ఏ వృత

Published: Sun,August 23, 2015 01:39 AM

వ్యయం లేని వ్యవసాయం కావాలి

తెలంగాణలో ప్రతి గ్రామంలో రైతులతో వ్యవసాయ శాఖ ప్రత్యక్ష అనుబంధం కలిగి వుండాలి. ఎప్పటికప్పుడు రైతులతో మాట్లాడుతూ వ్యవసాయానికి పూర్వ

Published: Wed,August 19, 2015 12:09 AM

నాటిరోజుల్లో గ్రామీణ జనజీవనం

వేసవి కాలంలో పొలాలకు పెంట తోలే ప్రక్రియ తో వ్యవసాయ పనులు మొదలయ్యేవి. పాడి పశువుల వల్ల పోగైన పెంటను ఎరువుగా పొలాలకు తరలించేవారు. అద

Published: Wed,August 12, 2015 01:49 AM

యాభై ఏళ్ల సింగపూర్.. విశేషాలు

ఐదారు దశాబ్దాల క్రితం వరకూ దూర ప్రాచ్య తీర ప్రాంతంలో, బ్రిటన్‌కు ప్రధానమైన నావికా సైనిక స్థావరంగా మాత్రమే ఉండేది సింగపూర్. అలాంటిద

Published: Fri,July 31, 2015 11:18 PM

ఆచితూచి.. అసలైన నిర్ణయం

న్యాయపరమైన నియమ, నిబంధనల నేపథ్యంలో రాజ్యాంగ ప్రకరణాలు, న్యాయస్థానాల తీర్పులు ఉండి తీరాలి. సంప్రదాయాలకు ఇదమిత్థమైన నిబంధనలంటూ ఏవీ ఉ

Published: Thu,July 23, 2015 12:20 AM

పర్యాటక మకుటంగా యాదాద్రి ..

180 ఎకరాల విస్తీర్ణం గల యాదగిరిగుట్ట స్థలాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకునేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఆ ప్రాంతమంతా అందమైన చెట్లతో

Published: Thu,July 2, 2015 04:46 AM

ఆకుపచ్చని తెలంగాణ దిశగా..

బంగారు తెలంగాణ స్వప్నం సాకార దిశగా మరో కీలకమైన అడుగు వేయడానికి ప్రభుత్వం సకల సన్నాహాలు చేసింది. తెలంగాణకు హరిత హారం పేరుతో ముఖ్యమం

Published: Thu,June 25, 2015 01:13 AM

పుష్కరాలు ఆధ్యాత్మిక పరిమళాలు

గౌతమ మహర్షి కఠోర తపస్సు కారణాన భూలోకానికి తేబడిన గంగానది పాయ గౌతమిగా, గోదావరిగా ప్రసిద్ధికెక్కింది. గంగానది అంశగా భావించబడే గోదావర

Published: Thu,September 11, 2014 12:27 AM

నాటి హైదరాబాద్ జ్ఞాపకాలు

జూన్, 1964లో నేను, నాన్న గారు కలిసి మొదటిసారి హైదరాబాద్ చేరుకున్నాం.ఖమ్మంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు బస్సెక్కితే హైదరాబాద్ గౌలిగూ

Published: Tue,June 10, 2014 01:16 AM

వాగ్దానాల అమలు దిశగా..

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వారంలోపల కేసీఆర్ తాను చేయబోయే కార్యక్రమాలు ఎలా వుండబోతున్నాయో చెప్పారు. తమ ఎన్నికల ప్రణాళికలో ప

Published: Tue,December 10, 2013 12:53 AM

ద్వీప దేశం సింగపూర్ అభివృద్ధి రహస్యం!

గత ఏడాది మొదటిసారి వచ్చినప్పుడు, ఇప్పుడు మళ్లీ రెండో మారు వచ్చినప్పుడు సింగపూర్ నగరంలో తిరుగుతుంటే ఆశ్చ ర్యం. ఎలా అతి కొద్ది కాలంల

Published: Mon,April 22, 2013 12:38 AM

రాహుల్ కోసం అధిష్ఠానం ఆరాటం

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మరోమారు రాష్ట్ర వ్యవహారాలపై దృష్టి సారించారనడానికి నిదర్శనం,ఢిల్లీకి రావాల్సిందిగా ముఖ్

Published: Mon,April 8, 2013 02:40 AM

కాగ్ నివేదిక పరమార్థమే!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2006-2011 మధ్య జరిపిన భూముల కేటాయింపులలో 50 కోట్ల పైగా విలువగల భూమి అక్రమ పద్ధతుల్లో అన్యాక్షికాంతమైందని క

Published: Fri,March 29, 2013 11:50 PM

అసమ్మతిపై అనర్హత అస్త్రం

అవిశ్వాస తీర్మానం ఓటింగులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటువేసిన తొమ్మిది మంది కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలపై, పార్టీ ఫిరాయింపుల ని

Published: Wed,December 19, 2012 11:49 PM

బ్రాహ్మణుల బాధలు పట్టవా?

ఒక నాడు సమాజాన్ని ఐక్యంగా వుంచడానికి తమ శాయశక్తులా కృషిచేసిన బ్రాహ్మణుల స్థితిగతులు రోజురోజుకూ క్షీణించిపోతున్నాయి. క్రిస్టియన్ మి

Published: Fri,December 14, 2012 12:01 AM

కాలయాపనకే అఖిల పక్షాలు!

తెలంగాణ సమస్యపై శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇచ్చి రెండేళ్లు పూర్తి కావస్తున్నది. తదనంతరం అనేక అఖిలపక్ష సమావేశాలు జరిగాయి. ఏమీ తేలలేదు.

Published: Wed,December 26, 2012 04:31 PM

రాజ్యాంగ వ్యవస్థలపై రాజకీయాలు వద్దు!

దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు గవర్నర్ వ్యవహారం నచ్చనప్పుడు గవర్నర్ పాత్రను విమర్శించడంతో సరిపుచ్చుకోకుండా, గవర్నర్ వ్యవస్థనే రద

Published: Wed,October 10, 2012 05:37 PM

దారులు ఏవైనా గమ్యమొక్కటే

తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటూ ఏళ్ల తరబడి సాగుతున్న ఉద్య మం మరో మలుపు తిరిగింది. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె

Published: Sat,October 6, 2012 03:36 PM

అక్కసుతోనే పీవీపై ఆరోపణలు

బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ పీవీ బాధ్యుడా? పీవీకి, నెహ్రూ-గాంధీ కుటుంబానికి భేదాభివూపాయాలున్నాయా? ఆ

Published: Sat,October 6, 2012 03:37 PM

క్షీణిస్తున్న పార్లమెంట్ జవాబుదారీతనం

భారత పార్లమెంట్ షష్టిపూర్తి జరుపుకుంటున్నది. రాష్ట్రానికి చెందిన ఇద్దరు నాటి తొలితరం పార్లమెం సహా మరో ఇద్దరు మాజీ పార్లమెంటుసభ్యుల

Published: Sat,October 6, 2012 03:37 PM

విజ్ఞానాన్ని అందించిన ప్రణవానంద

గత శతాబ్దం ప్రారంభంలో, స్వీడన్‌కు చెందిన స్వెన్ హెదిన్ అనే యూరోపియన్ పర్యాటకుడు, టిబెట్ వెళ్లి, ఆసియా ఖండానికి చెందిన భౌగోళిక విషయ

Published: Sat,October 6, 2012 03:38 PM

పార్టీని వీడిన వాళ్లకే పట్టం!

అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసి, ధిక్కార స్వరం వినిపించి న కాంగ్రెస్ శాసనసభ్యులమీద వేటు పడింది. వారితో పాటు ఎంపీ మేకపాటి

Published: Sat,October 6, 2012 03:38 PM

హైమన్‌డార్ఫ్ అనుబంధం

మానవ పరిణామ శాస్త్రవేత్త ప్రొఫెసర్ వోన్ ఫ్యూరర్ హైమ న్‌డార్ఫ్‌కు గిరిజన సంప్రదాయాల ప్రకారం, అంతి మ సంస్కారాలు జరిపించడానికి ఆయన కు

Published: Sat,October 6, 2012 03:38 PM

స.హ. చట్టంలో సంభావనలు!

సమాచార హక్కు చట్టం కమిషనర్లుగా కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఎనిమిదిని ఎంపిక చేసింది. ఆ నిర్ణయానికి ప్రతిపక్షనేత మద్దతు ఇచ్చీ-ఇవ్వ

Published: Sat,October 6, 2012 03:39 PM

పద్యపుష్పంపై రమణీయ ఝంకారం

రమణ ఎంపిక చేసుకున్న అంశం వినూత్నమైందనాలి. సాధారణంగా, తెలుగులో పీహెచ్‌డీ కావాలనుకున్నవారు ఎవరో ఒకరి ప్రముఖ రచనలపై పరిశోధన చేస్తారు.

Published: Sat,October 6, 2012 03:40 PM

గెలుపెవరిది ? ఓటమెవరిది?

లాంఛనవూపాయంగా ముగుస్తుందనుకున్న అవిశ్వాస తీర్మానం తతంగం, ఆద్యం తం ఆసక్తికరంగా కొనసాగింది. తీర్మానం వీగిపోయిందనేకన్నా, అన్ని ప్రధాన

Published: Sat,October 6, 2012 03:39 PM

అరుదైన కార్యదక్షుడు చెన్నారెడ్డి

డాక్టర్ మర్రి చెన్నాడ్డి మరణించి 15 సంవత్సరాలైంది. పాతతరం నాయకుల్లో అరుదైన ఆ నాయకుడిని ఎన్నో రకాలుగా ఆంధ్రవూపదేశ్ రాష్ట్ర ప్రజలు గ

Published: Sat,October 6, 2012 03:41 PM

ఏకాభిప్రాయం ఎన్నటికి సాధ్యం?

తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావంతో నూతనోత్సాహంతో ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం పూర్తిగా అహింసా మార్గంలో సాగుతోంది. ఆబాల

Published: Sat,October 6, 2012 03:41 PM

సకలంతో కాంగ్రెస్‌లో కదలిక

మూసుకున్న ఢిల్లీ కాంగ్రెస్-యూపీఏ సారథ్య నాయకుల (నాయకీమణు ల) కళ్లు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. అవును మరి! ఇంకా కొద్ది రోజులు మ

Published: Sat,October 6, 2012 03:40 PM

గైర్హాజరే మిగిలిన దారి

-వనం జ్వాలా నరసింహారావు చట్ట సభల ప్రతినిధుల రాజీనామాల విషయంలో ఎలా వ్యవహరిస్తే మంచిదో, రాజీనామా చేసిన, చేయని సభ్యుల ద్వారా సభా మ