రాహుల్ కోసం అధిష్ఠానం ఆరాటం


Mon,April 22, 2013 12:38 AM

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మరోమారు రాష్ట్ర వ్యవహారాలపై దృష్టి సారించారనడానికి నిదర్శనం,ఢిల్లీకి రావాల్సిందిగా ముఖ్యమంత్రి కిరణ్, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణలకు ఆయన దగ్గరనుంచి పిలుపు రావడం. ఏ క్షణాన్నైనా జాతీయ స్థాయిలో సార్వవూతిక ఎన్నికలు, తదనుగుణంగా రాష్ట్రంలో ఎన్నికలు, రాష్ట్ర మంత్రులపై సీబీఐ కేసులు, ఇతరత్రా సమస్యల నేపథ్యంలో రాహుల్ రాష్ట్రంపై తనదైన శైలిలో దృష్టి సారించి వుండవచ్చు.అలానే తెలంగాణ అంశానికి సంబంధించి కూడా ఆయన కొన్ని సూచన లు చేసి వుండవచ్చేమో! వీరిద్దరు రాహుల్‌ని కలిసినప్పుడు, ఆంధ్రవూపదేశ్ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి ఎంతో కీలకం అని, ఎంతో ముఖ్యం అని, రాష్ట్రంపై పార్టీ పట్టు జారవద్దని ఆదేశించినట్లు తెలుస్తున్నది. రాష్ట్రంలోనూ, దేశంలోను మళ్లీ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి? అని రాహుల్ ప్రశ్నించారట! రాహుల్‌గాంధీ ఇప్పటికే పలు రాష్ట్రాల ముఖ్యమంవూతులు, పీసీసీ అధ్యక్షులతో సమావేశమై పార్టీ పరిస్థితులను సమీక్షించారు.

రాష్ట్ర, దేశ రాజకీయాలలో చోటుచేసుకుంటున్న పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్న పరిశీలకులు అసలేం జరుగుతోంది? జరుగబోతోంది? అన్న మీమాంసతో కొట్టుమిట్టాడుతున్నారు. రాష్ట్రం విషయంలో మరి కొద్ది రోజుల్లో తేలనున్న జగన్ వర్గ కాంగ్రెస్-తెలుగుదేశం అసంతృప్తి ఎమ్మెల్యేల అనర్హత, ఆ తరువాత తేలనున్న ఉప ఎన్నికల ఫలితాలను ఇప్పటి నుంచే వివిధ కోణాల నుంచి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి, ప్రభుత్వ పదవి లేకపోయినా-వూపధాని కాకపోయినా, మకుటం లేని మహారాణిగా చెలామణి అవుతున్న సోనియాగాంధీ, ఆమె కుమారుడు-రాహుల్ గాంధీల ఆధిపత్యం ఏం కాబోతున్నదా అన్న అనుమానం కలుగుతున్నది.

రాష్ట్రంలో ఎగబాకుతున్న యువ నాయకుడు వైఎస్ జగన్‌కు తగు రీతిలో రాజకీయ గుణపాఠం చెప్పి తీరాల్సిందే అన్న పట్టుదలతో కాంగ్రెస్ అధిష్ఠానం ముం దడుగు వేస్తోంది. ఆయనకు ముక్కుతాడు వేసే ప్రయత్నం చేసింది-ఇంకా చేస్తూనే వుంది. గతం లో జరిగిన ఉప ఎన్నికలను కూడా, తమకు అనుకూలంగా,ఒక ఆయుధంలాగా మలచుకుందామని, జగన్ పార్టీలోకి వలసలను ఆపు చేద్దామని అపోహపడింది అధిష్ఠానం. కాని అది సాధ్యపడలేదు. వీటన్నింటి నేపథ్యం ఒకటే! సామ-దాన-భేద-దండోపాయాలను ఉపయోగించి సోనియా-నెవూ-రాజీవ్‌గాంధీ కుటుంబాల వారసత్వానికి, ఆధిపత్యానికి తిరుగులేని అవకాశం కలిగించి, రాహుల్‌గాంధీని ఢిల్లీ గద్దె ఎక్కించడమే! అది సాధ్యపడుతోందా? లేదా? అన్నది వేరే సంగతి!

అధిష్ఠానానికి ఈ తరహా ఆలోచన రావడం, అమలు చేయడం కొత్తేమీకాదు. గతంలో కూడా అధిష్ఠానానికి ఎదురు తిరిగిన మహామహులను-ఉద్దండ పిండాలను నిరంకుశంగా కాలరాసింది. ఒక్క మాటలో చెప్పాలంటే, సమష్ఠి నాయకత్వం అన్న మాటే కాంగ్రెస్‌కు గిట్టదు. అధిష్ఠానం అం ఎవరో కాదు. ఒకనాడు నెహ్రూ అయితే, ఆ తర్వాత ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ (మధ్య లో సంజయ్)లు కాగా ఇప్పుడు సోనియా గాంధీ. ఆ ఏక వ్యక్తుల అభివూపాయమే ఏకాభివూపాయం-సమష్టి అభివూపాయం. ఆ సుప్రీం లీడర్‌కు అంతా సలాం కొట్టాల్సిందే! అడుగుజాడలలో నడవాల్సిందే! వారెంత ప్రజాదరణ కల నాయకులైనా, పరిణితి చెందిన నాయకులైనా, ఎన్ని రకాల శక్తి సామర్ధ్యాలున్న వారైనా, తలవంచక-దాసోహం అనక తప్పదు.
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే ఒకటి-ండు ఉప ఎన్నికల ఫలితాల ద్వారా, పరువు-వూపతిష్ఠలను పూర్తిగా కోల్పోయిన కాంగ్రెస్ అధిష్ఠానం, జగన్ పార్టీని మనుగడ చేయనిస్తుందా? అన్నింటికన్నా ముఖ్యమైంది, పవర్ పాలిటిక్స్‌ను అర్థం చేసుకోగలగడం.

పవర్ పాలిటిక్స్‌ను అనుసరించాలంటే, ఊహ కందని వ్యూహాలను పన్నాలి. వాటికి నైతికత అక్కర లేదు. పవర్ పాలిటిక్స్ ఆట ఆడడంలో ఢిల్లీ అధినాయకత్వానికి తెలియని కిటుకు లేదు. ఆ ఆట ఆడడానికి అనుసరించని నిరంకుశ ధోరణి లేదు. నెహ్రూ-ఇందిరాగాంధీ వారసత్వ సంపదను పదిలంగా ఉంచడానికి, కాంగ్రెస్ అధిష్ఠానం, పవర్ పాలిటిక్స్‌ను, అవసరమైతే, జాతీయ అవసరాలను పక్కన పెట్టినా సరే, తమకు అనుకూలంగా మలచుకుంటూ వస్తున్నది. ఈ ఆటలో ఏకైక వ్యూహం ఒక్కటే. ఏదో విధంగా రాహుల్‌గాంధీని ప్రధాని పీఠం ఎక్కించడమే! దానిని అడ్డగించిన వారికి చుక్కలు చూపించే ప్రయత్నం చేయడమే!

రాహుల్‌గాంధీకి దారి సుగమం చేయడానికి ప్రణబ్‌కు పదోన్నతి కలిగించి రాష్ట్రపతి పదవి కట్టబెట్టింది నెహ్రూ-ఇందిర- వారసత్వం. యూపీఏ భాగస్వా మ్య పార్టీల ప్రస్తుత-మాజీ నాయకులు శరద్‌పవార్, అజిత్‌సింగ్, మమతా బెనర్జీ, ములాయంసింగ్ యాదవ్, లాలూప్రసాద్ యాదవ్, కరుణానిధి లాంటి కాకలు తీరిన యోధుల పాదాలు చల్లబడేట్లు చేసింది సోనియా. ఒకవేళ వీరిలో ఎవరన్నా నోరు మెదిపితే, ఎల్లప్పుడూ వాడే సీబీఐ దర్యాప్తు లాంటి బ్లాక్ మెయి ల్ ఆయుధం ఉండనే ఉన్నది.

కాంగ్రెస్‌కు సంబంధించినంత వరకు, ఒక వైపు జబ్బు ముదురుతుండగా, మరోవైపు, రోగ లక్షణాలు ప్రస్ఫుటంగా గోచరిస్తున్నాయి. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచీ, కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా వుంటూ వస్తోందీ దక్షిణ భారత ప్రాంతం. అలనాడు నీలం సంజీవడ్డి మొదలు రాజశేఖర్‌రెడ్డి దాకా రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారందరూ, దిగుబడి సరుకే!.ఆ ఆచారం జవహర్‌లాల్ నెహ్రూ కాలం నుంచి సోనియా హయాం వరకూ అలాగే కొనసాగుతూ వస్తోంది. దామోదరం సంజీవయ్య నుంచి నేటి వరకూ అదే వరస.

ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఉద్యమం కాంగ్రెస్‌కు పెద్ద సవాల్‌గా మారింది ఒక పక్క తెలంగాణ రాష్ట్ర సమితి, సీపీఐ, భారతీయ జనతా పార్టీల సారథ్యంలో ఊపందుకున్న తెలంగాణ రాష్ట్ర ఉద్యమం తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్‌ను మట్టి కరిపిస్తుంటే, మరో పక్క కడప ఎంపీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్ సీపీ సీమాంధ్ర ప్రాంతంలో తిరుగులేని శక్తిగా ఎదుగుతున్నది. నెత్తి మీద కుంపటి దించుకున్న చందాన, చిరంజీవి తన ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీ నం చేసినా ఫలితం శూన్యం.

అనేక ఒత్తిడిల మధ్య కొట్టుమిట్టాడుతున్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ప్రస్తుతం నాలుగు రోడ్ల కూడలి మధ్య వున్నట్లుంది. ఇదే పరిస్థితి దాదాపు జాతీయ స్థాయిలో కూడా నెలకొని వుంది. ప్రధాని పదవిని తనయుడు రాహుల్ గాంధీకి బదలాయించాలని తాపవూతయ పడుతున్న సోనియాగాంధీ ముందున్న సవాళ్లు ఏంటి? వాటిని ఆమె ఏవిధంగా అధిగమించగలరు? కాంగ్రెస్ పార్టీ గడ్డు కాలం ఎదుర్కుంటుందన్నది వాస్తవం. సవాళ్లను సోనియా ఎదుర్కునే ముందర, రాష్ట్రంలో అందరికీ అర్థం అవుతున్న కొన్ని నగ్న సత్యాలను అధిష్ఠానం సహితం అర్థం చేసుకుంటే మంచిదేమో! బహు శా, తమిళనాడు తరహాలో, ఏదో ఒక ప్రాంతీ య పార్టీతో అవగాహన కుదుర్చుకోక తప్పని పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో కూడా కాంగ్రెస్‌కు తప్పదా? అలాంటప్పుడు, ఆ ప్రాంతీయ పార్టీ ఎలాగూ తెలుగుదేశం కాదు కాబట్టి, తెరాసతోను-వైఎస్సార్ సీపీతోను అవగాహన వుండే అవకాశాలున్నాయా? రాష్ట్ర విభజన చేయక తప్పదా? ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో ఏదో ఒక నిర్ణయం ప్రకటించక తప్పదా?

2014లో జరగనున్న సార్వవూతిక ఎన్నికలకు రాష్ట్ర కాంగ్రెస్‌ను సన్నద్ధం చేసేందుకు-బలోపేతం చేసేందుకు, జాతీయ స్థాయిలో పార్టీ అధినాయకత్వం-అధిష్ఠానం చేపడుతున్న చర్యల్లో భాగంగా, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కుమారుడు, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ముఖ్య భూమిక పోషించేందుకు సమాయత్త మౌతున్నారు. యువనాయకుడు రాహుల్ కాయ కల్ప చికిత్స మొదలుపెట్టారంటున్నారు. అందులో భాగంగానే, ఢిల్లీలో తల్లిని కలవడానికి వచ్చిన పెద్దా-చిన్నా పనిలో పనిగా రాహుల్‌గాంధీని కూడా కలిసిపోతున్నారు. అంతేకాదు.రాహుల్ గాంధీనే స్వయంగా ఎంపిక చేసిన కొందరికి ప్రత్యేక ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. రాష్ట్రంలోని సీనియర్ నేతలు పలువురితో వ్యక్తిగతంగా మంతనాలు జరిపారు.అధినేత్రి సోనియా ఆదేశాలతోనే రాహుల్ రంగ ప్రవేశం చేశారా? లేక స్వయంగా ఆయన తనంతట తానే చొరవ తీసుకుని ఇలా చేస్తున్నారా? అనేది ఇంకా తేలాల్సిన విషయం.

-వనం జ్వాలా నరసింహారావు

35

VANAM JWALA NARASIMHA RAO

Published: Thu,December 21, 2017 01:12 AM

కృత్రిమ వైరుధ్యాలతో కుమ్ములాటలా!

హైదరాబాద్‌లో అద్భుతంగా జరిగిన జీఈఎస్ ఎనిమిదవ సదస్సు నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా వ్యయం చేయలేదన్నారు సీఎం. అసలీ సదస

Published: Tue,November 21, 2017 11:20 PM

ఆధ్వర్యం మనదే.. అధ్యక్షత మనదే

తెలంగాణలో జరిగే ప్రపంచ తెలుగు మహాసభలకు రంగం సిద్ధమవుతున్నది. సమావేశాలు జరుగడానికి ఇంకా మూడు వారాలే మిగిలాయి. దేశం నలుమూలల నుంచి, వ

Published: Sun,November 12, 2017 12:41 AM

గ్రామ పునర్నిర్మాణం దిశగా..

క్రియాశీల పంచాయతీరాజ్ వ్యవస్థకు శ్రీకారం చుట్టాలని, స్వయం ప్రతిపత్తితో గ్రామాలు, వ్యక్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అభివృద్ధిలో భ

Published: Sun,October 15, 2017 01:33 AM

కులాలపై విమర్శ తగదు

శతాబ్దాలకాలంగా బ్రాహ్మణ, బ్రాహ్మణేతరులు కలిమిడిగా, అభివృద్ధి చేసిన సామాజిక, రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. ఒకరిని మరొకరు దూషించుకున

Published: Wed,October 4, 2017 12:56 AM

వ్యాపారం చేయడమే నేరమా?

ఇటీవల ఒక సామాజిక శాస్త్రవేత్త కోమట్లను సామాజిక స్మగ్లర్లు (దొంగ రవాణాదారులు) అంటూ ఒక అసంబద్ధమైన బుల్లి పుస్తకాన్ని రాశాడు. దానిమీద

Published: Sat,April 22, 2017 03:12 AM

కేంద్ర, రాష్ట్ర సంబంధాల్లో కొత్త అధ్యాయం

ముఖ్యమంత్రి అసెంబ్లీలో కేంద్ర-రాష్ట్ర సంబంధాల విషయంలో వెలిబుచ్చిన అభిప్రాయాలు, ముస్లిం రిజర్వేషన్ల పెంపు అంశం, యావత్ భారతదేశం దృష

Published: Tue,March 28, 2017 12:01 AM

అభివృద్ధి కోసమే అప్పులు

అత్యంత హుందాగా, సమర్థవంతంగా, అర్థవంతంగా సుమారు మూడు వారాల పాటు జరిగిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా ప

Published: Tue,February 14, 2017 01:23 AM

ప్రపంచవ్యాప్త మహిళా సాధికారత

ఎందరో మహిళలు దేశ దేశాల్లో కీలకమైన పదవుల్లో ఉండటం గత ఐదారు దశాబ్దాల మహిళా సాధికారతకు నిదర్శనం. భవిష్యత్‌లో మరికొన్ని దేశాల అధ్యక్

Published: Tue,December 13, 2016 01:03 AM

బహుముఖ ప్రజ్ఞాశాలి సీఎస్‌ఆర్

ఉత్తర భారతదేశంలోని బద్రీనాథ్, కేదార్‌నాథ్ దేవాలయానికి 1977లో సీఎస్‌ఆర్అ ధ్యక్షులుగా నియమించబడ్డారు. వారి కాలంలోనే బద్రీనాథ్, కేదార

Published: Fri,September 23, 2016 11:32 PM

ప్రతిభకు ప్రతీకలు గురుకులాలు

విద్యా విధానంలో ప్రస్తుతమున్న అన్ని అనర్థాలకూ గురుకుల విద్య సమాధానం కాకపోవచ్చు. కానీ ఈ నమూనా తప్పకుండా,అణగారిన వర్గాల్లో ఆణిముత్య

Published: Sun,September 18, 2016 12:57 AM

అన్యాయానికి సజీవసాక్ష్యం

నందికొండ ప్రాజెక్టు నిర్మాణం 1956న ప్రారంభం కాగా 1969లో పూర్తయ్యింది.గేట్ల ఏర్పాటు, స్పిల్‌వే ఏర్పాటు 1974 నాటికి పూర్తి చేయటం జరి

Published: Thu,September 3, 2015 01:28 AM

అందరికీ విద్య దిశగా అడుగులు

సమాజానికి అవసరమయ్యే సేవలు ఏమిటి? అందుకు అనుగుణంగా సేవలందించేవారిని ఎలా తయారు చేయాలి? అనే విషయంపై విద్యా శాఖకు అవగాహన ఉండాలి. ఏ వృత

Published: Sun,August 23, 2015 01:39 AM

వ్యయం లేని వ్యవసాయం కావాలి

తెలంగాణలో ప్రతి గ్రామంలో రైతులతో వ్యవసాయ శాఖ ప్రత్యక్ష అనుబంధం కలిగి వుండాలి. ఎప్పటికప్పుడు రైతులతో మాట్లాడుతూ వ్యవసాయానికి పూర్వ

Published: Wed,August 19, 2015 12:09 AM

నాటిరోజుల్లో గ్రామీణ జనజీవనం

వేసవి కాలంలో పొలాలకు పెంట తోలే ప్రక్రియ తో వ్యవసాయ పనులు మొదలయ్యేవి. పాడి పశువుల వల్ల పోగైన పెంటను ఎరువుగా పొలాలకు తరలించేవారు. అద

Published: Wed,August 12, 2015 01:49 AM

యాభై ఏళ్ల సింగపూర్.. విశేషాలు

ఐదారు దశాబ్దాల క్రితం వరకూ దూర ప్రాచ్య తీర ప్రాంతంలో, బ్రిటన్‌కు ప్రధానమైన నావికా సైనిక స్థావరంగా మాత్రమే ఉండేది సింగపూర్. అలాంటిద

Published: Fri,July 31, 2015 11:18 PM

ఆచితూచి.. అసలైన నిర్ణయం

న్యాయపరమైన నియమ, నిబంధనల నేపథ్యంలో రాజ్యాంగ ప్రకరణాలు, న్యాయస్థానాల తీర్పులు ఉండి తీరాలి. సంప్రదాయాలకు ఇదమిత్థమైన నిబంధనలంటూ ఏవీ ఉ

Published: Thu,July 23, 2015 12:20 AM

పర్యాటక మకుటంగా యాదాద్రి ..

180 ఎకరాల విస్తీర్ణం గల యాదగిరిగుట్ట స్థలాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకునేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఆ ప్రాంతమంతా అందమైన చెట్లతో

Published: Thu,July 2, 2015 04:46 AM

ఆకుపచ్చని తెలంగాణ దిశగా..

బంగారు తెలంగాణ స్వప్నం సాకార దిశగా మరో కీలకమైన అడుగు వేయడానికి ప్రభుత్వం సకల సన్నాహాలు చేసింది. తెలంగాణకు హరిత హారం పేరుతో ముఖ్యమం

Published: Thu,June 25, 2015 01:13 AM

పుష్కరాలు ఆధ్యాత్మిక పరిమళాలు

గౌతమ మహర్షి కఠోర తపస్సు కారణాన భూలోకానికి తేబడిన గంగానది పాయ గౌతమిగా, గోదావరిగా ప్రసిద్ధికెక్కింది. గంగానది అంశగా భావించబడే గోదావర

Published: Thu,September 11, 2014 12:27 AM

నాటి హైదరాబాద్ జ్ఞాపకాలు

జూన్, 1964లో నేను, నాన్న గారు కలిసి మొదటిసారి హైదరాబాద్ చేరుకున్నాం.ఖమ్మంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు బస్సెక్కితే హైదరాబాద్ గౌలిగూ

Published: Tue,June 10, 2014 01:16 AM

వాగ్దానాల అమలు దిశగా..

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వారంలోపల కేసీఆర్ తాను చేయబోయే కార్యక్రమాలు ఎలా వుండబోతున్నాయో చెప్పారు. తమ ఎన్నికల ప్రణాళికలో ప

Published: Tue,December 10, 2013 12:53 AM

ద్వీప దేశం సింగపూర్ అభివృద్ధి రహస్యం!

గత ఏడాది మొదటిసారి వచ్చినప్పుడు, ఇప్పుడు మళ్లీ రెండో మారు వచ్చినప్పుడు సింగపూర్ నగరంలో తిరుగుతుంటే ఆశ్చ ర్యం. ఎలా అతి కొద్ది కాలంల

Published: Sat,May 25, 2013 01:10 AM

అంతర్‌రాష్ట్ర జలవివాదాలు, రాజకీయాలు

బాబ్లీ ప్రాజెక్టు వివాదంపై కోర్టు తీర్పుమీద వివరణ, సమీక్ష కోసం సుప్రీంకోర్టు లో పిటిషన్ దాఖలుకు ముందు మూడంచెల వ్యూహం అనుసరించాలని

Published: Mon,April 8, 2013 02:40 AM

కాగ్ నివేదిక పరమార్థమే!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2006-2011 మధ్య జరిపిన భూముల కేటాయింపులలో 50 కోట్ల పైగా విలువగల భూమి అక్రమ పద్ధతుల్లో అన్యాక్షికాంతమైందని క

Published: Fri,March 29, 2013 11:50 PM

అసమ్మతిపై అనర్హత అస్త్రం

అవిశ్వాస తీర్మానం ఓటింగులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటువేసిన తొమ్మిది మంది కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలపై, పార్టీ ఫిరాయింపుల ని

Published: Wed,December 19, 2012 11:49 PM

బ్రాహ్మణుల బాధలు పట్టవా?

ఒక నాడు సమాజాన్ని ఐక్యంగా వుంచడానికి తమ శాయశక్తులా కృషిచేసిన బ్రాహ్మణుల స్థితిగతులు రోజురోజుకూ క్షీణించిపోతున్నాయి. క్రిస్టియన్ మి

Published: Fri,December 14, 2012 12:01 AM

కాలయాపనకే అఖిల పక్షాలు!

తెలంగాణ సమస్యపై శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇచ్చి రెండేళ్లు పూర్తి కావస్తున్నది. తదనంతరం అనేక అఖిలపక్ష సమావేశాలు జరిగాయి. ఏమీ తేలలేదు.

Published: Wed,December 26, 2012 04:31 PM

రాజ్యాంగ వ్యవస్థలపై రాజకీయాలు వద్దు!

దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు గవర్నర్ వ్యవహారం నచ్చనప్పుడు గవర్నర్ పాత్రను విమర్శించడంతో సరిపుచ్చుకోకుండా, గవర్నర్ వ్యవస్థనే రద

Published: Wed,October 10, 2012 05:37 PM

దారులు ఏవైనా గమ్యమొక్కటే

తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటూ ఏళ్ల తరబడి సాగుతున్న ఉద్య మం మరో మలుపు తిరిగింది. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె

Published: Sat,October 6, 2012 03:36 PM

అక్కసుతోనే పీవీపై ఆరోపణలు

బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ పీవీ బాధ్యుడా? పీవీకి, నెహ్రూ-గాంధీ కుటుంబానికి భేదాభివూపాయాలున్నాయా? ఆ

Published: Sat,October 6, 2012 03:37 PM

క్షీణిస్తున్న పార్లమెంట్ జవాబుదారీతనం

భారత పార్లమెంట్ షష్టిపూర్తి జరుపుకుంటున్నది. రాష్ట్రానికి చెందిన ఇద్దరు నాటి తొలితరం పార్లమెం సహా మరో ఇద్దరు మాజీ పార్లమెంటుసభ్యుల

Published: Sat,October 6, 2012 03:37 PM

విజ్ఞానాన్ని అందించిన ప్రణవానంద

గత శతాబ్దం ప్రారంభంలో, స్వీడన్‌కు చెందిన స్వెన్ హెదిన్ అనే యూరోపియన్ పర్యాటకుడు, టిబెట్ వెళ్లి, ఆసియా ఖండానికి చెందిన భౌగోళిక విషయ

Published: Sat,October 6, 2012 03:38 PM

పార్టీని వీడిన వాళ్లకే పట్టం!

అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసి, ధిక్కార స్వరం వినిపించి న కాంగ్రెస్ శాసనసభ్యులమీద వేటు పడింది. వారితో పాటు ఎంపీ మేకపాటి

Published: Sat,October 6, 2012 03:38 PM

హైమన్‌డార్ఫ్ అనుబంధం

మానవ పరిణామ శాస్త్రవేత్త ప్రొఫెసర్ వోన్ ఫ్యూరర్ హైమ న్‌డార్ఫ్‌కు గిరిజన సంప్రదాయాల ప్రకారం, అంతి మ సంస్కారాలు జరిపించడానికి ఆయన కు

Published: Sat,October 6, 2012 03:38 PM

స.హ. చట్టంలో సంభావనలు!

సమాచార హక్కు చట్టం కమిషనర్లుగా కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఎనిమిదిని ఎంపిక చేసింది. ఆ నిర్ణయానికి ప్రతిపక్షనేత మద్దతు ఇచ్చీ-ఇవ్వ

Published: Sat,October 6, 2012 03:39 PM

పద్యపుష్పంపై రమణీయ ఝంకారం

రమణ ఎంపిక చేసుకున్న అంశం వినూత్నమైందనాలి. సాధారణంగా, తెలుగులో పీహెచ్‌డీ కావాలనుకున్నవారు ఎవరో ఒకరి ప్రముఖ రచనలపై పరిశోధన చేస్తారు.

Published: Sat,October 6, 2012 03:40 PM

గెలుపెవరిది ? ఓటమెవరిది?

లాంఛనవూపాయంగా ముగుస్తుందనుకున్న అవిశ్వాస తీర్మానం తతంగం, ఆద్యం తం ఆసక్తికరంగా కొనసాగింది. తీర్మానం వీగిపోయిందనేకన్నా, అన్ని ప్రధాన

Published: Sat,October 6, 2012 03:39 PM

అరుదైన కార్యదక్షుడు చెన్నారెడ్డి

డాక్టర్ మర్రి చెన్నాడ్డి మరణించి 15 సంవత్సరాలైంది. పాతతరం నాయకుల్లో అరుదైన ఆ నాయకుడిని ఎన్నో రకాలుగా ఆంధ్రవూపదేశ్ రాష్ట్ర ప్రజలు గ

Published: Sat,October 6, 2012 03:41 PM

ఏకాభిప్రాయం ఎన్నటికి సాధ్యం?

తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావంతో నూతనోత్సాహంతో ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం పూర్తిగా అహింసా మార్గంలో సాగుతోంది. ఆబాల

Published: Sat,October 6, 2012 03:41 PM

సకలంతో కాంగ్రెస్‌లో కదలిక

మూసుకున్న ఢిల్లీ కాంగ్రెస్-యూపీఏ సారథ్య నాయకుల (నాయకీమణు ల) కళ్లు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. అవును మరి! ఇంకా కొద్ది రోజులు మ

Published: Sat,October 6, 2012 03:40 PM

గైర్హాజరే మిగిలిన దారి

-వనం జ్వాలా నరసింహారావు చట్ట సభల ప్రతినిధుల రాజీనామాల విషయంలో ఎలా వ్యవహరిస్తే మంచిదో, రాజీనామా చేసిన, చేయని సభ్యుల ద్వారా సభా మ