కాగ్ నివేదిక పరమార్థమే!


Mon,April 8, 2013 02:40 AM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2006-2011 మధ్య జరిపిన భూముల కేటాయింపులలో 50 కోట్ల పైగా విలువగల భూమి అక్రమ పద్ధతుల్లో అన్యాక్షికాంతమైందని కాగ్ నివేదికలో తేలింది. కాగ్ ఆడిట్ జరిపిన ఐదు సంవత్సరాల్లో తొలుత వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంవూతిగా వ్యవహరించగా, ఆతరువాత 15 నెలలపాటు రోశయ్య ముఖ్యమంత్రిగా పాలించాడు. అప్పట్నుంచీ ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి హయాం కొనసాగుతున్నది. భూముల కేటాయింపులు ప్రధానంగా రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే జరిగినప్పటికీ అప్పటి నిర్ణయాలను తదుపరి ముఖ్యమంవూతులు కొనసాగించారు.

రాజశేఖర్‌రెడ్డి హయాంలో జరిగిన అక్రమ కేటాయింపులను రద్దు చేయడానికి గానీ, సరి చేయడానికి గానీ వారు పూనుకోలేదు. దీంతో కాగ్ నివేదిక రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రం గా తప్పుపట్టింది. ఆర్ధిక పరమైన ఆస్తులకు సంబంధించిన చట్టాలను, నిర్దేశిత విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వం అనేక కేసుల్లో పూర్తిగా విస్మరించిందని చెప్పిం ది. తాత్కాలిక ప్రాతిపదికన, యథేచ్ఛగా ప్రైవేటు వ్యక్తులకు, సంస్థలకు, అత్యం త తక్కువ ధరలకు భూములు పందేరం పెట్టారని వెల్లడించింది. రాష్ట్ర ప్రజల ఆర్ధిక భవితవ్యాన్నీ, సామాజికార్ధిక ప్రయోజనాలను పరిరక్షించడంలో విఫలం అయ్యారని పేర్కొన్నది. అదేవిధంగా విద్యుత్ వ్యవహారంలో కూడా కాగ్ అక్షింతలు వేసింది. కాకపోతే, కాగ్ నివేదిక బైబిల్, భగవద్గీత, ఖురాన్ కాదని సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి అన్నారు.

కాగ్ నివేదికలో పలు అంశాలు వాస్తవ విరుద్ధంగా ఉంటున్నాయన్నారు.కాగ్ చెప్పినవన్నీ నిజాలు కావని, మళ్లీ, కాగ్ నివేదికపై పీఏ సీ పరిశీలన చేసి నివేదిక ఇస్తుందన్నారు.కాగ్ విషయంలో ముఖ్యమంత్రి ఇంత తేలికగా ఎలా మాట్లాడగలిగారనేది అంతుపట్టని విషయం. ఈ నేపథ్యంలో కాగ్‌కు సంబంధించిన పూర్వాపరాలను గురించి తెలుసుకోవడం అవసరం.

పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో, కార్యనిర్వాహక వ్యవస్థపై చట్టసభలకు ఆధిపత్యం వుందని-వుండాలని తెలియచేస్తూ, తద్వారా ప్రభుత్వ జవాబుదారీతనాన్ని ఆచరణలోకి తేవడానికి ఉపయోగపడే అసలు-సిసలైన ఆయుధం, ప్రభుత్వపరమైన ఆదాయ-వ్యయ లెక్కల తనిఖీ అనే ప్రక్రియ మాత్రమే. ద్రవ్య వినియోగ విషయంలో చట్టసభలదే తుది తీర్పు.చట్టసభలకు సంక్రమించిన ఈ అధికారానికి రెండు మౌలికాంశాలు ప్రధానంగా తోడయ్యాయి. ఒకటి ప్రభుత్వం తన మనుగడ సాగించడానికి అవసరమైన నిధుల ను సమకూర్చుకోవడం కాగా, రెండోది ప్రభుత్వం చేస్తున్న వ్యయాన్ని పర్యవేక్షించే అధికారం.

ఏనాడో 1866 లోనే, ఎక్స్ చెక్కర్ అండ్ ఆడిట్ శాఖను రాజ్యాంగపరంగా ఒక చట్టంగా ఏర్పాటు చేయడం ద్వారా, పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి మాతృకైన బ్రిటిష్ ప్రభుత్వం ఇప్పుడు అమల్లో వున్న ప్రభుత్వ ఆడిట్ విధానానికి శ్రీకారం చుట్టింది. ఎక్స్ చెక్కర్ అండ్ ఆడిట్ శాఖ చట్టం కింద, ప్రతి ప్రభుత్వ శాఖ విధిగా ఏటేటా, తన శాఖకు చెందిన ద్రవ్య వినియోగ పద్దులను-ఆదాయ గణనలను పార్లమెంటు ముందుంచి తీరాలి. అదే చట్టం కింద మొట్టమొదటి సారిగా, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) అనే వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అలా కాగ్ కు నాంది-వూపస్తావన జరిగింది. ప్రభుత్వ ఆదాయ-వ్యయాలపై కాగ్ నిర్వహించే దర్యాప్తు ఫలితాలను స్వతంత్ర ప్రతిపత్తిగల బాధ్యతాయుతమైన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనే పార్లమెంటరీ కమిటీ పరిశీలించి, తద్వారా, ద్రవ్య వినియోగంపై పార్లమెంటరీ ఆధిపత్యాన్ని నెలకొల్పడం జరుగుతుంది.

ప్రభుత్వ పరమైన ఆదాయ-వ్యయ సంబంధిత లెక్కలు చూడడం, తనిఖీ చేయడం కోసం ఉద్దేశించిన ఈనాటి ఇండియన్ ఆడిట్-అక్కౌంట్స్ శాఖ వ్యవస్థాగత ఏర్పాటు బ్రిటిష్ ప్రభుత్వ నమూనాలో, బ్రిటిష్ వారసత్వంగా మనకు సంక్రమించిందే. ఎప్పుడో-ఏనాడో 1858 లోనే, ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యవహారాలను హస్తగతం చేసుకున్న నాటి బ్రిటిష్ ప్రభుత్వం, ప్రభుత్వ ఆదాయ-వ్యయ వ్యవహారాలు చూసేందుకు ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాను నియమించింది.1919లో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సంస్కరణ లు, ఆడిటర్ జనరల్ పదవికి చట్టబద్ధత కలిగించడానికి దోహదపడ్డా యి. 1935చట్టం, ఆడిటర్ జనరల్ పదవికి మరింత ప్రాముఖ్యం కలిగించింది.

భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తరువాత, కాగ్‌కు 148 నుంచి 152 ప్రకరణల ద్వారా ప్రత్యేక హోదాను కలిగించడం తోపాటు, రాజ్యాంగపరమైన భద్రత కలిగించడం జరిగింది. 1971కాగ్ చట్టం ద్వారా, ఆ వ్యవస్థకు వుండాల్సిన బాధ్యతలు, అధికారా లు, హక్కులు స్పష్టంగా క్రమబద్ధీకరించడం జరిగింది.రాజ్యాంగం 151వ ప్రకరణలో చెప్పినట్లు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినంత వరకు కాగ్ నివేదికలన్నీ భారత రాష్ట్రపతికి అందచేయాలి. ఆయన ఆదేశాల మేరకు ఆ నివేదికలను పార్లమెంటు ఉభ య సభల ముందుంచాలి. రాష్ట్రాలకు సంబంధించి గవర్నర్లకు వారి ద్వారా శాసనసభలకు సమర్పించడం జరుగుతుంది.

కాగ్ పదవికి సర్వసాధారణంగా ఇండియన్ ఆడిట్ అక్కౌంట్స్ సర్వీసెస్‌కు చెందిన సీనియర్ అధికారులనే నియమించే సంప్రదాయం చాలాకాలం వుం డేది. 1978 తరువాత ఐఏఎస్ అధికారులను ఆపదవిలో నియమించే ఆనవాయితి మొదలైంది. ఇది తరచూ విమర్శలకు దారితీసింది. దీనిని విమర్శించిన వారిలో పబ్లిక్ అక్కౌంట్స్ కమిటీ అధ్యక్షుడు, మీడియా, సామాజిక కార్యకర్తలు ఇతరులు వున్నారు. కాకపోతే, రాజ్యాంగంలో కాగ్ పదవికి ఫలానా పూర్వ ఉద్యోగార్హతలుండాలని లేదు. ఐతే, రాజ్యాంగసభలో దీనిపై చర్చలు జరిగాయి. ఆర్థిక, ఆదాయ-వ్యయ వ్యవహారాలలో అనుభవం గడించినవారిని మాత్రమే ఆ పదవిలోకి తేవాలని సూత్రవూపాయంగా అప్పట్లో అంగీకరించారు.

ఇండియన్ ఆడిట్-అక్కౌంట్స్ శాఖాధిపతినే కంప్ట్రోలర్-ఆడిటర్ జనరల్ (కాగ్)అని పిలుస్తారు. ఈశాఖ కార్యాలయాలు దేశవ్యాప్తంగా వున్నాయి. సుమారు 60వేల మంది సిబ్బంది గల ఈ కార్యాలయాల్లో గ్రూప్-ఏకు చెందిన ఇండియన్ ఆడిట్-అక్కౌంట్స్ సర్వీసెస్ అధికారులు సుమారు 500 మంది వుంటారు. ఈశాఖల వార్షిక బడ్జెట్ సుమారు 850 కోట్లవరకుంటుంది. చట్టసభలకు కాని, కార్యనిర్వాహక వ్యవస్థకు కాని చెందకపోయినా రాజ్యాంగం ద్వారా నియమించబడిన వ్యక్తి అయి వుంటారు కాగ్. భారత రాష్ట్రపతి కాగ్‌ని నియమిస్తారు ఆ పదవిలో. మూడింట రెండు వంతుల మంది పార్లమెంట్ సభ్యులు ఓటింగ్ ద్వారా మాత్రమే కాగ్‌ను ఆ పదవి నుంచి తొలగించ వీలవుతుంది. ప్రస్తుత కంప్ట్రోలర్-ఆడిటర్ జనరల్‌గా వినోద్‌రాయ్ వ్యవహరిస్తున్నారు.

11వ కాగ్‌గా ఆయన నియామకం 2008 జనవరి 7న జరిగింది. 2జి స్పెక్ట్రం, బొగ్గు గనుల స్కాం లాంటి పలు అవినీతి ఆరోపణల వ్యవహారంలో వినోద్‌రాయ్ వార్తల్లోకి ఎక్కారు.
కాగ్ బాధ్యతలు అపారమైనవనవచ్చు. కేంద్ర, రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల సంచిత నిధి నుంచి వ్యయం చేసిన ప్రతి పైసా అది ఉద్దేశించబడిన దాని కోసం ఖర్చు చేయబడిందా? లేదా? అని నిర్ధారించే బాధ్యత కాగ్‌కు వున్నది. ఆ మాటకొస్తే ఫలానా దాని కోసం వ్యయం చేయదల్చుకున్న నిధులు చట్ట రీత్యా ప్రభుత్వానికి అందుబాటులో వుందీ-లేంది కూడా కాగ్ నిర్ధారిస్తుంది. అదే విధంగా కేంద్ర, రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వాల అత్యవసర నిధుల నుంచి, ప్రభుత్వ పద్దుల నుంచి జరిగే అన్ని రకాల లావాదేవీల వ్యవహారంలో కూడా చట్టబద్ధత నిర్ధారించేది కాగే. ఆయా ప్రభుత్వ శాఖల ఆర్థిక లావాదేవీలను, రాబడులను, వ్య యాన్ని, నిధుల వినియోగాన్ని, దుర్వినియోగాన్ని విశ్లేషించేది కూడా కాగ్ మాత్రమే.

కేవలం ప్రభుత్వ శాఖల ఆదాయ వ్యయాలు మాత్రమే కాకుండా, ప్రభుత్వం నుంచి గణనీయమైన మోతాదు లో నిధులను పొందిన ప్రభుత్వేతర సంస్థల ద్రవ్య లావాదేవీలను కూడా పరిశీలించే హక్కు, బాధ్యత కాగ్‌కు వుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు విడుదలయ్యే నిధుల సక్రమ వ్యయం జరిగిందా? లేదా? అని చూసేది కూడా కంప్ట్రోలర్-ఆడిటర్ జనరలే. కంపెనీ చట్టం కింద నెలకొల్పబడిన ప్రభుత్వ రంగ సంస్థల ఆదాయ గణన కూడా కాగ్ పరిధిలోకే వస్తుంది. రాజ్యాంగంలోని 151 వ ప్రకరణకు అనుగుణంగా, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన రకరకాల ఆడిట్ నివేదికలను కాగ్ రూపొందించి, ఆ నివేదికలను పార్లమెంటుకు, సంబంధిత రాష్ట్రాల శాసనసభలకు పరిశీలనకు సమర్పిస్తుంది. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల ద్రవ్య వినియోగ పద్దులను, ఆర్థిక పద్దులను ధృవీకరించి ఆ పత్రాన్ని చట్టసభల ముందుంచడానికి రాష్ట్రపతికి, గవర్నర్లకు పంపుతుంది. ఈ అధికారాలన్నీ రాజ్యాంగపరంగా కాగ్‌కు సంక్రమించినవే. ఇంత చరిత్ర వున్న కాగ్‌ను బైబిలా, ఖురానా, భగవద్గీతా అని హేళన చేసినట్లు మాట్లాడడం ముఖ్యమంవూతికి తగదు. శివుడాజ్ఞ లేనిది చీమైనా కదలదన్నట్లు, కంప్ట్రోలర్-ఆడిట్ జనరల్ చేయి బడకుండా కేంద్ర రాష్ట్రాల ఆదాయ వ్యయాల లెక్కలు ఒక కొలిక్కి రానేరావు.
- వనం జ్వాలా నరసింహారావు

35

VANAM JWALA NARASIMHA RAO

Published: Thu,December 21, 2017 01:12 AM

కృత్రిమ వైరుధ్యాలతో కుమ్ములాటలా!

హైదరాబాద్‌లో అద్భుతంగా జరిగిన జీఈఎస్ ఎనిమిదవ సదస్సు నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా వ్యయం చేయలేదన్నారు సీఎం. అసలీ సదస

Published: Tue,November 21, 2017 11:20 PM

ఆధ్వర్యం మనదే.. అధ్యక్షత మనదే

తెలంగాణలో జరిగే ప్రపంచ తెలుగు మహాసభలకు రంగం సిద్ధమవుతున్నది. సమావేశాలు జరుగడానికి ఇంకా మూడు వారాలే మిగిలాయి. దేశం నలుమూలల నుంచి, వ

Published: Sun,November 12, 2017 12:41 AM

గ్రామ పునర్నిర్మాణం దిశగా..

క్రియాశీల పంచాయతీరాజ్ వ్యవస్థకు శ్రీకారం చుట్టాలని, స్వయం ప్రతిపత్తితో గ్రామాలు, వ్యక్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అభివృద్ధిలో భ

Published: Sun,October 15, 2017 01:33 AM

కులాలపై విమర్శ తగదు

శతాబ్దాలకాలంగా బ్రాహ్మణ, బ్రాహ్మణేతరులు కలిమిడిగా, అభివృద్ధి చేసిన సామాజిక, రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. ఒకరిని మరొకరు దూషించుకున

Published: Wed,October 4, 2017 12:56 AM

వ్యాపారం చేయడమే నేరమా?

ఇటీవల ఒక సామాజిక శాస్త్రవేత్త కోమట్లను సామాజిక స్మగ్లర్లు (దొంగ రవాణాదారులు) అంటూ ఒక అసంబద్ధమైన బుల్లి పుస్తకాన్ని రాశాడు. దానిమీద

Published: Sat,April 22, 2017 03:12 AM

కేంద్ర, రాష్ట్ర సంబంధాల్లో కొత్త అధ్యాయం

ముఖ్యమంత్రి అసెంబ్లీలో కేంద్ర-రాష్ట్ర సంబంధాల విషయంలో వెలిబుచ్చిన అభిప్రాయాలు, ముస్లిం రిజర్వేషన్ల పెంపు అంశం, యావత్ భారతదేశం దృష

Published: Tue,March 28, 2017 12:01 AM

అభివృద్ధి కోసమే అప్పులు

అత్యంత హుందాగా, సమర్థవంతంగా, అర్థవంతంగా సుమారు మూడు వారాల పాటు జరిగిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా ప

Published: Tue,February 14, 2017 01:23 AM

ప్రపంచవ్యాప్త మహిళా సాధికారత

ఎందరో మహిళలు దేశ దేశాల్లో కీలకమైన పదవుల్లో ఉండటం గత ఐదారు దశాబ్దాల మహిళా సాధికారతకు నిదర్శనం. భవిష్యత్‌లో మరికొన్ని దేశాల అధ్యక్

Published: Tue,December 13, 2016 01:03 AM

బహుముఖ ప్రజ్ఞాశాలి సీఎస్‌ఆర్

ఉత్తర భారతదేశంలోని బద్రీనాథ్, కేదార్‌నాథ్ దేవాలయానికి 1977లో సీఎస్‌ఆర్అ ధ్యక్షులుగా నియమించబడ్డారు. వారి కాలంలోనే బద్రీనాథ్, కేదార

Published: Fri,September 23, 2016 11:32 PM

ప్రతిభకు ప్రతీకలు గురుకులాలు

విద్యా విధానంలో ప్రస్తుతమున్న అన్ని అనర్థాలకూ గురుకుల విద్య సమాధానం కాకపోవచ్చు. కానీ ఈ నమూనా తప్పకుండా,అణగారిన వర్గాల్లో ఆణిముత్య

Published: Sun,September 18, 2016 12:57 AM

అన్యాయానికి సజీవసాక్ష్యం

నందికొండ ప్రాజెక్టు నిర్మాణం 1956న ప్రారంభం కాగా 1969లో పూర్తయ్యింది.గేట్ల ఏర్పాటు, స్పిల్‌వే ఏర్పాటు 1974 నాటికి పూర్తి చేయటం జరి

Published: Thu,September 3, 2015 01:28 AM

అందరికీ విద్య దిశగా అడుగులు

సమాజానికి అవసరమయ్యే సేవలు ఏమిటి? అందుకు అనుగుణంగా సేవలందించేవారిని ఎలా తయారు చేయాలి? అనే విషయంపై విద్యా శాఖకు అవగాహన ఉండాలి. ఏ వృత

Published: Sun,August 23, 2015 01:39 AM

వ్యయం లేని వ్యవసాయం కావాలి

తెలంగాణలో ప్రతి గ్రామంలో రైతులతో వ్యవసాయ శాఖ ప్రత్యక్ష అనుబంధం కలిగి వుండాలి. ఎప్పటికప్పుడు రైతులతో మాట్లాడుతూ వ్యవసాయానికి పూర్వ

Published: Wed,August 19, 2015 12:09 AM

నాటిరోజుల్లో గ్రామీణ జనజీవనం

వేసవి కాలంలో పొలాలకు పెంట తోలే ప్రక్రియ తో వ్యవసాయ పనులు మొదలయ్యేవి. పాడి పశువుల వల్ల పోగైన పెంటను ఎరువుగా పొలాలకు తరలించేవారు. అద

Published: Wed,August 12, 2015 01:49 AM

యాభై ఏళ్ల సింగపూర్.. విశేషాలు

ఐదారు దశాబ్దాల క్రితం వరకూ దూర ప్రాచ్య తీర ప్రాంతంలో, బ్రిటన్‌కు ప్రధానమైన నావికా సైనిక స్థావరంగా మాత్రమే ఉండేది సింగపూర్. అలాంటిద

Published: Fri,July 31, 2015 11:18 PM

ఆచితూచి.. అసలైన నిర్ణయం

న్యాయపరమైన నియమ, నిబంధనల నేపథ్యంలో రాజ్యాంగ ప్రకరణాలు, న్యాయస్థానాల తీర్పులు ఉండి తీరాలి. సంప్రదాయాలకు ఇదమిత్థమైన నిబంధనలంటూ ఏవీ ఉ

Published: Thu,July 23, 2015 12:20 AM

పర్యాటక మకుటంగా యాదాద్రి ..

180 ఎకరాల విస్తీర్ణం గల యాదగిరిగుట్ట స్థలాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకునేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఆ ప్రాంతమంతా అందమైన చెట్లతో

Published: Thu,July 2, 2015 04:46 AM

ఆకుపచ్చని తెలంగాణ దిశగా..

బంగారు తెలంగాణ స్వప్నం సాకార దిశగా మరో కీలకమైన అడుగు వేయడానికి ప్రభుత్వం సకల సన్నాహాలు చేసింది. తెలంగాణకు హరిత హారం పేరుతో ముఖ్యమం

Published: Thu,June 25, 2015 01:13 AM

పుష్కరాలు ఆధ్యాత్మిక పరిమళాలు

గౌతమ మహర్షి కఠోర తపస్సు కారణాన భూలోకానికి తేబడిన గంగానది పాయ గౌతమిగా, గోదావరిగా ప్రసిద్ధికెక్కింది. గంగానది అంశగా భావించబడే గోదావర

Published: Thu,September 11, 2014 12:27 AM

నాటి హైదరాబాద్ జ్ఞాపకాలు

జూన్, 1964లో నేను, నాన్న గారు కలిసి మొదటిసారి హైదరాబాద్ చేరుకున్నాం.ఖమ్మంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు బస్సెక్కితే హైదరాబాద్ గౌలిగూ

Published: Tue,June 10, 2014 01:16 AM

వాగ్దానాల అమలు దిశగా..

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వారంలోపల కేసీఆర్ తాను చేయబోయే కార్యక్రమాలు ఎలా వుండబోతున్నాయో చెప్పారు. తమ ఎన్నికల ప్రణాళికలో ప

Published: Tue,December 10, 2013 12:53 AM

ద్వీప దేశం సింగపూర్ అభివృద్ధి రహస్యం!

గత ఏడాది మొదటిసారి వచ్చినప్పుడు, ఇప్పుడు మళ్లీ రెండో మారు వచ్చినప్పుడు సింగపూర్ నగరంలో తిరుగుతుంటే ఆశ్చ ర్యం. ఎలా అతి కొద్ది కాలంల

Published: Sat,May 25, 2013 01:10 AM

అంతర్‌రాష్ట్ర జలవివాదాలు, రాజకీయాలు

బాబ్లీ ప్రాజెక్టు వివాదంపై కోర్టు తీర్పుమీద వివరణ, సమీక్ష కోసం సుప్రీంకోర్టు లో పిటిషన్ దాఖలుకు ముందు మూడంచెల వ్యూహం అనుసరించాలని

Published: Mon,April 22, 2013 12:38 AM

రాహుల్ కోసం అధిష్ఠానం ఆరాటం

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మరోమారు రాష్ట్ర వ్యవహారాలపై దృష్టి సారించారనడానికి నిదర్శనం,ఢిల్లీకి రావాల్సిందిగా ముఖ్

Published: Fri,March 29, 2013 11:50 PM

అసమ్మతిపై అనర్హత అస్త్రం

అవిశ్వాస తీర్మానం ఓటింగులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటువేసిన తొమ్మిది మంది కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలపై, పార్టీ ఫిరాయింపుల ని

Published: Wed,December 19, 2012 11:49 PM

బ్రాహ్మణుల బాధలు పట్టవా?

ఒక నాడు సమాజాన్ని ఐక్యంగా వుంచడానికి తమ శాయశక్తులా కృషిచేసిన బ్రాహ్మణుల స్థితిగతులు రోజురోజుకూ క్షీణించిపోతున్నాయి. క్రిస్టియన్ మి

Published: Fri,December 14, 2012 12:01 AM

కాలయాపనకే అఖిల పక్షాలు!

తెలంగాణ సమస్యపై శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇచ్చి రెండేళ్లు పూర్తి కావస్తున్నది. తదనంతరం అనేక అఖిలపక్ష సమావేశాలు జరిగాయి. ఏమీ తేలలేదు.

Published: Wed,December 26, 2012 04:31 PM

రాజ్యాంగ వ్యవస్థలపై రాజకీయాలు వద్దు!

దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు గవర్నర్ వ్యవహారం నచ్చనప్పుడు గవర్నర్ పాత్రను విమర్శించడంతో సరిపుచ్చుకోకుండా, గవర్నర్ వ్యవస్థనే రద

Published: Wed,October 10, 2012 05:37 PM

దారులు ఏవైనా గమ్యమొక్కటే

తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటూ ఏళ్ల తరబడి సాగుతున్న ఉద్య మం మరో మలుపు తిరిగింది. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె

Published: Sat,October 6, 2012 03:36 PM

అక్కసుతోనే పీవీపై ఆరోపణలు

బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ పీవీ బాధ్యుడా? పీవీకి, నెహ్రూ-గాంధీ కుటుంబానికి భేదాభివూపాయాలున్నాయా? ఆ

Published: Sat,October 6, 2012 03:37 PM

క్షీణిస్తున్న పార్లమెంట్ జవాబుదారీతనం

భారత పార్లమెంట్ షష్టిపూర్తి జరుపుకుంటున్నది. రాష్ట్రానికి చెందిన ఇద్దరు నాటి తొలితరం పార్లమెం సహా మరో ఇద్దరు మాజీ పార్లమెంటుసభ్యుల

Published: Sat,October 6, 2012 03:37 PM

విజ్ఞానాన్ని అందించిన ప్రణవానంద

గత శతాబ్దం ప్రారంభంలో, స్వీడన్‌కు చెందిన స్వెన్ హెదిన్ అనే యూరోపియన్ పర్యాటకుడు, టిబెట్ వెళ్లి, ఆసియా ఖండానికి చెందిన భౌగోళిక విషయ

Published: Sat,October 6, 2012 03:38 PM

పార్టీని వీడిన వాళ్లకే పట్టం!

అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసి, ధిక్కార స్వరం వినిపించి న కాంగ్రెస్ శాసనసభ్యులమీద వేటు పడింది. వారితో పాటు ఎంపీ మేకపాటి

Published: Sat,October 6, 2012 03:38 PM

హైమన్‌డార్ఫ్ అనుబంధం

మానవ పరిణామ శాస్త్రవేత్త ప్రొఫెసర్ వోన్ ఫ్యూరర్ హైమ న్‌డార్ఫ్‌కు గిరిజన సంప్రదాయాల ప్రకారం, అంతి మ సంస్కారాలు జరిపించడానికి ఆయన కు

Published: Sat,October 6, 2012 03:38 PM

స.హ. చట్టంలో సంభావనలు!

సమాచార హక్కు చట్టం కమిషనర్లుగా కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఎనిమిదిని ఎంపిక చేసింది. ఆ నిర్ణయానికి ప్రతిపక్షనేత మద్దతు ఇచ్చీ-ఇవ్వ

Published: Sat,October 6, 2012 03:39 PM

పద్యపుష్పంపై రమణీయ ఝంకారం

రమణ ఎంపిక చేసుకున్న అంశం వినూత్నమైందనాలి. సాధారణంగా, తెలుగులో పీహెచ్‌డీ కావాలనుకున్నవారు ఎవరో ఒకరి ప్రముఖ రచనలపై పరిశోధన చేస్తారు.

Published: Sat,October 6, 2012 03:40 PM

గెలుపెవరిది ? ఓటమెవరిది?

లాంఛనవూపాయంగా ముగుస్తుందనుకున్న అవిశ్వాస తీర్మానం తతంగం, ఆద్యం తం ఆసక్తికరంగా కొనసాగింది. తీర్మానం వీగిపోయిందనేకన్నా, అన్ని ప్రధాన

Published: Sat,October 6, 2012 03:39 PM

అరుదైన కార్యదక్షుడు చెన్నారెడ్డి

డాక్టర్ మర్రి చెన్నాడ్డి మరణించి 15 సంవత్సరాలైంది. పాతతరం నాయకుల్లో అరుదైన ఆ నాయకుడిని ఎన్నో రకాలుగా ఆంధ్రవూపదేశ్ రాష్ట్ర ప్రజలు గ

Published: Sat,October 6, 2012 03:41 PM

ఏకాభిప్రాయం ఎన్నటికి సాధ్యం?

తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావంతో నూతనోత్సాహంతో ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం పూర్తిగా అహింసా మార్గంలో సాగుతోంది. ఆబాల

Published: Sat,October 6, 2012 03:41 PM

సకలంతో కాంగ్రెస్‌లో కదలిక

మూసుకున్న ఢిల్లీ కాంగ్రెస్-యూపీఏ సారథ్య నాయకుల (నాయకీమణు ల) కళ్లు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. అవును మరి! ఇంకా కొద్ది రోజులు మ

Published: Sat,October 6, 2012 03:40 PM

గైర్హాజరే మిగిలిన దారి

-వనం జ్వాలా నరసింహారావు చట్ట సభల ప్రతినిధుల రాజీనామాల విషయంలో ఎలా వ్యవహరిస్తే మంచిదో, రాజీనామా చేసిన, చేయని సభ్యుల ద్వారా సభా మ