అసమ్మతిపై అనర్హత అస్త్రం


Fri,March 29, 2013 11:50 PM

అవిశ్వాస తీర్మానం ఓటింగులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటువేసిన తొమ్మిది మంది కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలపై, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద, అనర్హత వేటు వేయాలని ప్రభుత్వ విప్ గండ్ర వెంకటరమణాడ్డి సభాపతికి విజ్ఞప్తి చేశారు.దానికి అవసరమైన డాక్యుమెంట్లను కూడా ఆయన సభాపతికి సమర్పించారు. కాంగ్రెస్ బాటలోనే టీడీపీ నాయకులు పయనించారు. నేడో-రేపో వీరందరినీ అనర్హులుగా ప్రకటించే అవకాశాలున్నాయి.పార్టీఫిరాయింపుల నిరోధక చట్టానికి రాజ్యాంగపరమైన నియమ నిబంధనలున్నాయి. కాకపోతే, అవి ఎంత సక్రమంగా అమలుకు నోచుకుంటున్నాయనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

చట్ట సభలకు ఎన్నికైన వారు, ఏఏ సందర్భాలలో, సభ్యులుగా కొనసాగడానికి అనర్హులవుతారనే విషయం, రాజ్యాంగంలో స్పష్టంగా వివరించబడింది.రాజీవ్‌గాం ధీ ప్రధానిగా వున్నప్పుడు, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం 52వ రాజ్యాంగ సవరణ ద్వారా,1985లో అమల్లోకొచ్చింది. ఒక రాజకీయ పార్టీ టికెట్‌పై ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి, స్వచ్చందంగా, ఆపార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినప్పుడు, సహజంగా శాసనసభ సభ్యత్వం కూడా కోల్పోతారు. ఒకపార్టీ సభ్యుడుగా చట్టసభకు ఎన్నికైన వ్యక్తి, ఎన్నికల అనంతరం, మరోపార్టీలో చేరి, తన పార్టీకి వ్యతిరేకంగా పని చేసినా సభ్యత్వానికి అనర్హులవుతారు. సభాపతిగా-ఉపసభాపతిగా, లేదా శాసన మండలి అధ్యక్షుడుగా-ఉపాధ్యక్షుడుగా ఎన్నికైన వారికి, పార్టీ సభ్యత్వానికి రాజీనా మా చేసినప్పటికీ, అనర్హత వేటు పడకుండా చట్టం మినహాయించింది.

అదేవిధంగా, టికెట్ ఇచ్చిన పార్టీ అధికారికంగా జారీచేసిన ఆదేశాలకు విరుద్ధం గా, శాసనసభలో జరిగే ఓటింగులో పాల్గొనకపోయినా-పాల్గొని వ్యతిరేకంగా ఓటేసినా, సభ్యత్వానికి అనర్హులవుతారు. కాకపోతే,అలా చేయడానికి పార్టీ నుంచి ముం దస్తుగా అనుమతి పొందినా, లేక, అలా చేసిన పదిహేను రోజులలోపు అధికారికంగా పార్టీ నాయకత్వం ఆవ్యక్తిని మన్నించినా, అర్హతకు గురికాకుండే అవకాశం వుంది. చట్టం మరో చిన్న వెసులుబాటు కూడా కలిగించింది. ఏదైనా రాజకీయ పార్టీ నుంచి ఎన్నికైన శాసన (లోక్‌సభ) సభ సభ్యులలో, మూడింట ఒక వంతు మంది, మూకుమ్మడిగా పార్టీ మారితే-వేరే పార్టీలో విలీనమైతే, ఆచర్యకు ఫిరాయింపుల నిరోధక చట్టం నుంచి మినహాయింపు వుంది. అయితే, రాజ్యాంగ 91వ సవరణ ఈనిబంధనను మార్చి, మూడింట రెండు వంతుల సంఖ్య వుంటేనే, విలీనమైనట్లవుతుందని చెప్పింది.

అలానే ఒక రాజకీయపార్టీలో చీలిక వచ్చినప్పుడు, పార్టీ మొత్తం మరో పార్టీలో చేరితే కూడా ఫిరాయింపుల చట్టం నుంచి మినహాయింపు వుంటుంది. ఆ పార్టీ నుంచి ఎన్నికైన కొందరు శాసనసభ్యులు విలీనానికి అంగీకరించకుండా వేరే పార్టీ పెట్టుకున్నా, ఒక ప్రత్యేకమైన గ్రూపుగా ఏర్పడినా, మినహాయింపు ఉంటుంది.
అనర్హత విషయంలో నిర్ణయాధికారం పూర్తిగా (ఉప) సభాపతిదే. పదవ షెడ్యూల్ కింద పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి సంబంధించి, సభాపతి తీసుకున్న ఎటువంటి నిర్ణయమైనా, న్యాయస్థానాల తీర్పు పరిధిలోకి రావు. పదవ షెడ్యూల్ నిబంధనలను అమలుపరిచే విషయంలో, తదనుగుణమైన విధి-విధానాలను రూపొందించుకునే అధికారం సభాపతికి వుంది.

రాజకీయపార్టీలు తమ-తమ పార్టీలకు చెందిన సభ్యుల వివరాలు, కొత్తగా చేరిన వారి వివరాలు, పార్టీ వ్యతిరేకంగా పని చేస్తున్న వారి వివరాలు, పార్టీ ఆదేశాలకు వ్యతిరేకంగా ఓటేసిన వారి వివరాలు, సంబంధిత అంశాలకు చెందిన ఇతర వివరాలను పార్టీలు నమోదు చేసుకోమని అడి గే అధికారం వుంది సభాపతికి. సభ్యుల అర్హత-అనర్హతలు నిర్ధారించవలసిన సమయంలో అవి ఉపయోగపడే అవకాశాలున్నాయి. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం సభ్యత్వానికి అనర్హులైన వ్యక్తులు, యాంత్రికంగా, తమ సభ్యత్వాన్ని కోల్పో రు. వారిని పార్టీ నుంచి తొలగించ వచ్చు కానీ, చట్టసభల సభ్యత్వాన్నించి తొలగించడానికి,పార్టీ నాయకత్వం నియమించిన ప్రతినిధి, సంబంధిత సభ్యుల అనర్హత విషయా న్ని సభాపతి దృష్టికి తీసుకుని పోయిన తదుపరి, తగు విచారణ జరిగిన చేసిన తర్వాతే, సభాపతి తగు నిర్ణయం తీసుకుంటారు.

సభాపతి తీసుకునే నిర్ణయాన్ని ప్రశ్నించే అధికారం న్యాయస్థానాలకు లేకపోయినా, చట్టంలో పొందుపరిచిన నియమ నిబంధనలకు భాష్యం చెప్పే అధికారం, రాజ్యాం గ పరంగా, న్యాయమూర్తులకు వుంది.తాను ఎన్నికైన రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి, స్వచ్ఛందంగా పార్టీకి రాజీనామా చేస్తే, సభ్యత్వానికి అనర్హుడవుతాడని చట్టం చెప్పిన దాన్ని విస్తరిస్తూ, సరి కొత్త నిర్వచనం చెప్పింది అత్యున్నత న్యాయస్థానం. లాంఛనంగా రాజీనామా చేయకుండా, తనకు టికెట్ ఇచ్చిన పార్టీ వ్యతిరేక కార్య కలాపాల్లో పాల్గొనే రీతిలో,స్పష్టమైన వైఖరిలో ప్రవర్తించే చట్టసభ సభ్యుల విషయంలో కూడా, ఫిరాయింపుల నిబంధనలు వర్తించుతాయని, 1994లో, సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. అదేవిధంగా, స్వతంవూతుడుగా గెలిచి, ఏదై నా పార్టీలో చేరిన వ్యక్తి కూడా, ఫిరాయింపుల చట్టం పరిధిలోకి వస్తారని చెప్పింది కోర్టు.

పార్టీ ఫిరాయింపుల నియమ నిబంధనలను ఉల్లంఘించే సభ్యుల వివరాలు, సభాపతి దృష్టికి తీసుకుని రానంత వరకు, అర్హత-అనర్హతలతో నిమిత్తం లేకుండా, చట్టసభలలో నిరాటంకంగా సభ్యులుగా కొనసాగడానికి, ఎన్నిరకాల అవకాశాలుండాలో అన్నిరకాల అవకాశాలను చట్టం కలిగించింది. రాజకీయపార్టీల అధినాయకులు తమకు అనుకూలమని భావించి, సభాపతికి ఫిర్యాదు చేయనంత కాలం, ఫిరాయింపుల చట్టం కాగితాలకే పరిమితం. అలాకాకుండా కొన్ని సత్ సాంప్రదాయాలకు ఎవరో ఒక రాష్ట్రానికి చెందిన శాసనసభ సభాపతి చొరవ తీసుకోవాలి.

తాత్కాలిక-శాశ్వత, ఆర్థిక-లేదా-పదవి లాభం కోసం, పార్టీ ఫిరాయింపులు, దేశంలోని వివిధ రాష్ట్రాలలో చోటు చేసుకోవడం చాలా కాలం నుంచి జరుగుతున్న వ్యవహారం. విలువలకు తిలోదకాలిచ్చి, తనకు పార్టీ టికెట్ ఇచ్చి గెలిపించిన, మాతృ సంస్థకే ద్రోహం తలపెట్టడం నేరం. ఆ నేరానికి కనీసం శిక్ష అనర్హత వేటు. పాతికేళ్ల కితం ఫిరాయింపుల నిరోధక చట్టం వచ్చినా, దాని అమలు అంతంత మాత్రమే. రాజీవ్‌గాంధీ హయాంలో, చట్టం తేవడానికి ప్రధాన కారణం, అంతకుముందు, ఆయారాం-గయారాంల హవాలో అనుక్షణం రాష్ట్ర ప్రభుత్వాల మనుగడ ప్రశ్నార్థ కం కావడమే. అయితే, చట్టం తేవడం జరిగినప్పటికీ, ఫిరాయింపులు మాత్రం ఆగలేదు.

చట్టం అమలు బాధ్యత సభాపతిది మాత్రమే కావడంతో రాజకీయాలకు అతీతంగా, సత్ సాంప్రదాయాలు నెలకొనక పోవడమే దీనికి కారణం. పార్టీ ఫిరాయింపులు యథేఛ్చగా కొనసాగుతూనే వున్నా యి. అవసరార్థం ఎమ్మెల్యేలను విపక్షం నుంచి స్వపక్షానికి తెచ్చుకునే ప్రయత్నాలు అన్ని రాజకీ య పార్టీలు చేస్తూనే వున్నాయి. కోట్ల ధనం చేతులు మారుతూనే వుంది. ప్రజాస్వామ్యం విలువను అపహాస్యం పాలు చేయడానికి ఫిరాయింపుదారులు చట్టంలోని లొసుగులను ఇంకా వాడుకుంటూనే వున్నా రు. రాష్ట్ర మాజీ గవర్నర్, పాలనానుభవం దిట్ట, ఇందిరాగాంధీకి సన్నిహితుడు, పీసీ అలెగ్జాండర్, ఫిరాయింపుల చట్టం లోప భూయిష్టమైందని విమర్శించారు. పదవ షెడ్యూల్‌లోని ఫిరాయింపుల చట్టాన్ని తిరగరాసి, ఏ స్థాయి ప్రజా ప్రతినిదైనా, తాను ఎన్నికైన పార్టీని వీడినట్లయితే ప్రజల విశ్వాసం కోల్పోయినట్లుగా భావించి, తక్షణం సభ్యత్వానికి అనర్హుడైనట్లుగా ప్రకటించే విధంగా వుండాలని సూచించారు.

పార్టీ ఫిరాయింపులకు పాల్పడే వారి విషయంలోను, దానికి కారణమైన వారి మాతృ సంస్థ రాజకీయపార్టీల విషయంలోను, ఎన్నికల సంఘం అప్రమత్తంగా వుంటే మంచిదేమో! ఎన్నికల ప్రణాళికలో చేసిన వాగ్దానాలను నెరవేర్చని పక్షంలో, పార్టీ వీడిపోయే సభ్యులకు ఎన్నికల సంఘం రక్షణ ఇవ్వడం సమంజసం. ఒక పార్టీ, ఒకసారి ప్రణాళికలో చేర్చిన అంశాలకు సంబంధించి, అమలుకు నోచుకోని అంశాల విషయంలో, ఎన్నికల సంఘం చర్యలు తీసుకోలేని పరిస్థితులున్నంత కాలం పార్టీలను వీడేవారికి ఇబ్బందులు తప్పవు. అదేవిధంగా, పదవ షెడ్యూల్ అమలు విషయంలోను, కనీసం, సభాపతి దృష్టికి తీసుకుపోయే విషయంలోనైనా, ఎన్నికల సంఘం పాత్ర వుండడం మంచిది. ఐదేళ్లకో సారి మేల్కొనకుండా,రాజకీయ పార్టీల-పార్టీల ద్వారా ఎన్నికైన సభ్యుల విషయంలో కొంత క్రియాశీలక పాత్ర పోషించాల్సిన బాధ్యతను ఎన్నికల సంఘం మరిచిపోకూడదు.

-వనం జ్వాలా నరసింహారావు

35

VANAM JWALA NARASIMHA RAO

Published: Thu,December 21, 2017 01:12 AM

కృత్రిమ వైరుధ్యాలతో కుమ్ములాటలా!

హైదరాబాద్‌లో అద్భుతంగా జరిగిన జీఈఎస్ ఎనిమిదవ సదస్సు నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా వ్యయం చేయలేదన్నారు సీఎం. అసలీ సదస

Published: Tue,November 21, 2017 11:20 PM

ఆధ్వర్యం మనదే.. అధ్యక్షత మనదే

తెలంగాణలో జరిగే ప్రపంచ తెలుగు మహాసభలకు రంగం సిద్ధమవుతున్నది. సమావేశాలు జరుగడానికి ఇంకా మూడు వారాలే మిగిలాయి. దేశం నలుమూలల నుంచి, వ

Published: Sun,November 12, 2017 12:41 AM

గ్రామ పునర్నిర్మాణం దిశగా..

క్రియాశీల పంచాయతీరాజ్ వ్యవస్థకు శ్రీకారం చుట్టాలని, స్వయం ప్రతిపత్తితో గ్రామాలు, వ్యక్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అభివృద్ధిలో భ

Published: Sun,October 15, 2017 01:33 AM

కులాలపై విమర్శ తగదు

శతాబ్దాలకాలంగా బ్రాహ్మణ, బ్రాహ్మణేతరులు కలిమిడిగా, అభివృద్ధి చేసిన సామాజిక, రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. ఒకరిని మరొకరు దూషించుకున

Published: Wed,October 4, 2017 12:56 AM

వ్యాపారం చేయడమే నేరమా?

ఇటీవల ఒక సామాజిక శాస్త్రవేత్త కోమట్లను సామాజిక స్మగ్లర్లు (దొంగ రవాణాదారులు) అంటూ ఒక అసంబద్ధమైన బుల్లి పుస్తకాన్ని రాశాడు. దానిమీద

Published: Sat,April 22, 2017 03:12 AM

కేంద్ర, రాష్ట్ర సంబంధాల్లో కొత్త అధ్యాయం

ముఖ్యమంత్రి అసెంబ్లీలో కేంద్ర-రాష్ట్ర సంబంధాల విషయంలో వెలిబుచ్చిన అభిప్రాయాలు, ముస్లిం రిజర్వేషన్ల పెంపు అంశం, యావత్ భారతదేశం దృష

Published: Tue,March 28, 2017 12:01 AM

అభివృద్ధి కోసమే అప్పులు

అత్యంత హుందాగా, సమర్థవంతంగా, అర్థవంతంగా సుమారు మూడు వారాల పాటు జరిగిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా ప

Published: Tue,February 14, 2017 01:23 AM

ప్రపంచవ్యాప్త మహిళా సాధికారత

ఎందరో మహిళలు దేశ దేశాల్లో కీలకమైన పదవుల్లో ఉండటం గత ఐదారు దశాబ్దాల మహిళా సాధికారతకు నిదర్శనం. భవిష్యత్‌లో మరికొన్ని దేశాల అధ్యక్

Published: Tue,December 13, 2016 01:03 AM

బహుముఖ ప్రజ్ఞాశాలి సీఎస్‌ఆర్

ఉత్తర భారతదేశంలోని బద్రీనాథ్, కేదార్‌నాథ్ దేవాలయానికి 1977లో సీఎస్‌ఆర్అ ధ్యక్షులుగా నియమించబడ్డారు. వారి కాలంలోనే బద్రీనాథ్, కేదార

Published: Fri,September 23, 2016 11:32 PM

ప్రతిభకు ప్రతీకలు గురుకులాలు

విద్యా విధానంలో ప్రస్తుతమున్న అన్ని అనర్థాలకూ గురుకుల విద్య సమాధానం కాకపోవచ్చు. కానీ ఈ నమూనా తప్పకుండా,అణగారిన వర్గాల్లో ఆణిముత్య

Published: Sun,September 18, 2016 12:57 AM

అన్యాయానికి సజీవసాక్ష్యం

నందికొండ ప్రాజెక్టు నిర్మాణం 1956న ప్రారంభం కాగా 1969లో పూర్తయ్యింది.గేట్ల ఏర్పాటు, స్పిల్‌వే ఏర్పాటు 1974 నాటికి పూర్తి చేయటం జరి

Published: Thu,September 3, 2015 01:28 AM

అందరికీ విద్య దిశగా అడుగులు

సమాజానికి అవసరమయ్యే సేవలు ఏమిటి? అందుకు అనుగుణంగా సేవలందించేవారిని ఎలా తయారు చేయాలి? అనే విషయంపై విద్యా శాఖకు అవగాహన ఉండాలి. ఏ వృత

Published: Sun,August 23, 2015 01:39 AM

వ్యయం లేని వ్యవసాయం కావాలి

తెలంగాణలో ప్రతి గ్రామంలో రైతులతో వ్యవసాయ శాఖ ప్రత్యక్ష అనుబంధం కలిగి వుండాలి. ఎప్పటికప్పుడు రైతులతో మాట్లాడుతూ వ్యవసాయానికి పూర్వ

Published: Wed,August 19, 2015 12:09 AM

నాటిరోజుల్లో గ్రామీణ జనజీవనం

వేసవి కాలంలో పొలాలకు పెంట తోలే ప్రక్రియ తో వ్యవసాయ పనులు మొదలయ్యేవి. పాడి పశువుల వల్ల పోగైన పెంటను ఎరువుగా పొలాలకు తరలించేవారు. అద

Published: Wed,August 12, 2015 01:49 AM

యాభై ఏళ్ల సింగపూర్.. విశేషాలు

ఐదారు దశాబ్దాల క్రితం వరకూ దూర ప్రాచ్య తీర ప్రాంతంలో, బ్రిటన్‌కు ప్రధానమైన నావికా సైనిక స్థావరంగా మాత్రమే ఉండేది సింగపూర్. అలాంటిద

Published: Fri,July 31, 2015 11:18 PM

ఆచితూచి.. అసలైన నిర్ణయం

న్యాయపరమైన నియమ, నిబంధనల నేపథ్యంలో రాజ్యాంగ ప్రకరణాలు, న్యాయస్థానాల తీర్పులు ఉండి తీరాలి. సంప్రదాయాలకు ఇదమిత్థమైన నిబంధనలంటూ ఏవీ ఉ

Published: Thu,July 23, 2015 12:20 AM

పర్యాటక మకుటంగా యాదాద్రి ..

180 ఎకరాల విస్తీర్ణం గల యాదగిరిగుట్ట స్థలాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకునేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఆ ప్రాంతమంతా అందమైన చెట్లతో

Published: Thu,July 2, 2015 04:46 AM

ఆకుపచ్చని తెలంగాణ దిశగా..

బంగారు తెలంగాణ స్వప్నం సాకార దిశగా మరో కీలకమైన అడుగు వేయడానికి ప్రభుత్వం సకల సన్నాహాలు చేసింది. తెలంగాణకు హరిత హారం పేరుతో ముఖ్యమం

Published: Thu,June 25, 2015 01:13 AM

పుష్కరాలు ఆధ్యాత్మిక పరిమళాలు

గౌతమ మహర్షి కఠోర తపస్సు కారణాన భూలోకానికి తేబడిన గంగానది పాయ గౌతమిగా, గోదావరిగా ప్రసిద్ధికెక్కింది. గంగానది అంశగా భావించబడే గోదావర

Published: Thu,September 11, 2014 12:27 AM

నాటి హైదరాబాద్ జ్ఞాపకాలు

జూన్, 1964లో నేను, నాన్న గారు కలిసి మొదటిసారి హైదరాబాద్ చేరుకున్నాం.ఖమ్మంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు బస్సెక్కితే హైదరాబాద్ గౌలిగూ