రాజ్యాంగ వ్యవస్థలపై రాజకీయాలు వద్దు!


Wed,December 26, 2012 04:31 PM

దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు గవర్నర్
వ్యవహారం నచ్చనప్పుడు గవర్నర్ పాత్రను విమర్శించడంతో సరిపుచ్చుకోకుండా, గవర్నర్ వ్యవస్థనే రద్దుచేయమని కోరడం పరిపాటి అయింది. గవర్నర్లు తప్పుచేయలేదని కాదు. రాజ్యాంగ స్ఫూర్తికి
విరుద్ధంగా వ్యవహరించిన గవర్నర్లు లేరనీ కాదు. అంత మాత్రాన
ఆ వ్యవస్థనే రద్దు చేయాలని కోరడం సమంజసం కాదు.


ధర్మాన కేసులో తమ పార్టీ విజ్ఞప్తిని వివరించడానికి అవకాశం కల్పించ డం లేదని, గవర్నర్ రాజ్యాంగ రక్షకునిగా వ్యవహరించా లిలి కాని, సోని యా ఏజెంటుగా వ్యవహరిస్తే తాము గవర్నర్ల వ్యవస్థపైనే పోరాడాల్సి ఉంటుందని తెలుగుదేశంపార్టీ అధికార ప్రతినిధి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగానే పరిగణించాలి. ఆయన అంతటితో ఆగకుండా, గతంలో రహస్య గూఢచారి ఉద్యోగం చేసిన నరసింహన్ ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల్లో కూడా అదే పని చేస్తున్నారని విమర్శించారు. గవర్నర్ ఢిల్లీ వెళ్లినప్పుడు ప్రధాని, రాష్ట్రపతులను కలవడంలో తప్పులేదు కాని, సోనియాను ఎలా కలుస్తారని ప్రశ్నించారు. రాజ్‌భవన్‌ను గాంధీ భవన్ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో గవర్నర్ వారికి అపాయిం ట్‌మెంట్ ఇచ్చి, రేవంత్ వ్యాఖ్యలపై ఆగ్ర హం వ్యక్తం చేశారు.

తెలుగుదేశం పార్టీ నాయకుడికి ఆయన వ్యవహార శైలి సరికాదని చెప్పమని కూడా ఆయన సూచించా రు. గతంలో ఒకసారి, నలుగురు రాష్ట్ర మంత్రులు, ఇద్దరు పార్లమెంట్ సభ్యుల సమక్షంలో, కొందరు గ్రామ సర్పంచులను ఉద్దేశించి మాట్లాడిన గవర్నర్ నరసింహన్, తనను తాను చెడ్డ గవర్నర్‌గాఅభివర్ణించుకున్నారు. అంతటితో ఆగకుండా, ఇక ముందు ఎక్కువ కాలం తను రాజ్‌భవన్‌లో గడపనని, ప్రజల మధ్య గడుపుతానని, వారి కష్ట సుఖాలను విచారిస్తానని హామీ కూడా ఇచ్చారు. గవర్నర్ తరచూ ఢిల్లీకి వెళ్లి నివేదికలు ఇస్తున్నారన్న విమర్శలూ వున్నాయి. పాలనలో జోక్యం చేసుకుంటున్నారన్న విమర్శా ఉన్నది. ధర్మాన కేసును ఆయన ఏ విధంగా పరిష్కరిస్తారో వేచి చూడాలి. ఆయన నిర్ణయాలు ఒక్కోసారి ఒక్కో పార్టీకి సంతోషకరంగా వుంటున్నాయి. మరి కొందరికి ఇబ్బందులు కలగ చేస్తున్నాయి.
కొందరు గవర్నర్లు ఇలా వ్యవహరించడం కొత్తేమీ కాదు. 1977-7 మధ్య కాలంలో రాష్ట్ర గవర్నర్‌గా పదిహేను నెలలు పనిచేసిన శారదా ముఖ ర్జీ, 195-90 మధ్య కాలంలో నాలుగేళ్లకు పైగా పనిచేసిన కుముద్ బెన్ జోషి, భిన్నరీతుల్లో వ్యవహరించినప్పటికీ, ప్రస్తుత గవర్నర్‌తో పోల్చదగిన వారని అనాలి.

దివి సీమను అతలాకుతలం చేసిన భీకరమైన తుఫాను నేపధ్యంలో, స్వచ్చంద సంస్థల పనితీరుకు మార్గదర్శకంగా-ధీటుగా పనిచేసే తరహాలో చేతన సంస్థను స్థాపించి, సహాయ పునరావాస కార్యక్షికమాలను చేపట్టి, రాష్ట్ర ప్రజల అభినందన లు అందుకున్నారు శారదా ముఖర్జీ. చేతన సంస్థకు, గవర్నర్ అధ్యక్షులుగా, ముఖ్యమంత్రి ఉపాధ్యక్షులుగా వ్యవహరించే పద్ధతిలో సంస్థ నియమ నిబంధనలను అప్పటి గవర్నర్ కార్యదర్శి మోహన్ కందా తోడ్పాటుతో రూపొందించారామె. శారదా ముఖర్జీ గుజరాత్ గవర్నర్‌గా వెళ్లిపోయిన తర్వాత చేతన కార్యకలాపాలు ఆగిపోయాయి. ఏడేళ్ల తర్వాత గవర్నర్‌గా వచ్చిన కుముద్ బెన్ జోషి, చేతన సంస్థ ను పునరుద్ధరించడంతో పాటు, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ యాక్షన్ (నీసా) అనే మరో స్వచ్ఛంద సంస్థను స్థాపించి, పలు ప్రజోపయోగమైన కార్యక్షికమాలను చేపట్టారు. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుతో అనేక సందర్భాల్లో విభేదించిందన్నపేరు తెచ్చుకున్న కుముద్ బెన్ జోషి, ఆ రెండు సంస్థల కార్యకలాపాల విషయంలో ఆయ న సలహాలను కూడా తీసుకునేవారు. జోగినిల దురాచారం రూపుమాపే దిశగా రాజ్ భవన్ దర్బార్ హాలులో వారికి వివాహం జరిపించారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ చర్యలు, కుముద్ బెన్ జోషి ఆధ్వర్యంలోని స్వచ్ఛంద సంస్థలు చేపట్టిన కొన్ని ముఖ్య కార్యక్షికమాలు.


దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు, సంబంధిత గవర్నర్ వ్యవహారం నచ్చనప్పుడు, గవర్నర్ పాత్రను విమర్శించడంతో సరిపుచ్చుకోకుండా, గవర్నర్ వ్యవస్థనే రద్దుచేయమని కోరడం పరిపాటి అయింది. గవర్నర్లు తప్పుచేయలేదని కాదు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించిన గవర్నర్లు లేరనీ కాదు. అంత మాత్రాన ఆ వ్యవస్థనే రద్దు చేయాలని కోరడం సమంజసం కాదు. రాజ్యాంగ స్ఫూర్తికి-వూపకరణాలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్న గవర్నర్లను పదవినుంచి తొలగించమని అడిగే హక్కుందికాని, వ్యవస్థనే ప్రశ్నించే విధంగా రాజకీయ నాయకులు ప్రకటనలు ఇవ్వడం తగదు.

రాజ్యాంగపరంగా ఏర్పడ్డ రాష్ట్రపతి, గవర్నర్ పదవులు ఎల్లవేళలా అలంకారవూపాయమైనవేనని భావించడం తప్పు. ఎన్టీఆర్‌ను 194లో నాటి గవర్నర్ రామ్ లాల్ తొలగించడం రాజ్యాంగ విరుద్ధమని, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీశారని అభియోగం మోపుతూ, న్యాయం కావాలని కోరుతూ తెలుగుదేశం నాయకత్వం రాష్ట్రపతి వద్దకు పోయింది గాని, ప్రధాని వద్దకు కాదే ! గవర్నర్‌ను, గవర్నర్ వ్యవస్థను విమర్శించడానికి, సొంత కోణం నుంచి చూడకుండా, రాజ్యాంగ కోణం నుంచి చూడడం మంచిది. ప్రధాని వద్దకు కాకుండా, న్యాయం కొరకు రాష్ట్రపతి వద్దకు పోవడానికి కారణం, ఆయన రాజ్యాంగాన్ని పరిరక్షించే వాడు కాబట్టే.
రాష్ట్ర స్థాయిలో స్థానిక సంస్థలకు ఎన్నికైన ప్రజా ప్రతినిధులు అవసరమైనప్పుడు-న్యాయం జరగలేదని భావించినప్పుడు, గవర్నర్ వైపు దృష్టి సారించడం తప్పు కాదు. వారు గవర్నర్ దగ్గరకు పోయినా, లేక, గవర్నరే వారి దగ్గరకు వచ్చినా, ఉద్దేశం ఒకటే. కష్ట కాలంలో, గవర్నర్ నుంచి సహాయం కోరుకునే వారు, కేవలం ఎన్నికైన ప్రజా ప్రతినిధులే కావాలని లేదు. సామాన్య ప్రజానీకం కూడా కావచ్చు. బహుశా రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న వ్యవహారాలను, రాజ్యాంగ అధినేతగా, తరచూ కేంద్రానికి-వూపధానికి-రాష్ట్రపతికి తెలియచేయడం మంచిదని గవర్నర్ నరసింహన్ భావిస్తుండవచ్చు. ఆయన చర్యలను ఆక్షేపించడం గాని, వాటికి దురుద్దేశం ఆపాదించడం కాని, అపార్థాలు వెతకడం గాని చేయడం భావ్యం కాదు.


గవర్నర్ పేరుపైన ప్రభుత్వ నిర్ణయాలు, ప్రకటనలు, ఉత్తర్వులు జారీ అవుతాయి. రాజకీయ నాయకులు ఎన్ని చెప్పినప్పటికీ, గవర్నర్ పాత్రకు ప్రాధాన్యత వుందని, ఏ ఐఏఎస్ అధికారిని అడిగినా ఒప్పుకోవడానికి క్షణం కూడా ఆలోచించరు. గవర్నర్ కేవలం రాజ్యాంగంలో పొందుపరచిన వ్యక్తి మాత్రమే కాదు. పలు సాంఘిక-సంక్షేమ కార్యక్షికమాలకు రాజ్యాంగ రీత్యా పర్యవేక్షకుడు. రాష్ట్ర ప్రజ ల్లో ఐకమత్యానికి, సమక్షిగతా భావాలకు, స్థిరత్వానికి కూడా గవర్నర్ బాధ్యుడు.
రాజ్యాంగం నిర్దేశించిన విధంగా, గవర్నర్ ముఖ్యమంవూతికి, మంత్రివర్గ సహచరులకు కష్ట-సుఖాలలో తోచిన సలహాలు ఇవ్వడం తప్పేమీ కాదు. గవర్నర్ మంత్రివర్గం సభ్యులకు ఇచ్చిన సలహాలను వారెంతవరకు పాటిస్తారనేది, గవర్నర్ ఇచ్చే విషయం పై, మంవూతులు ఆ సలహాను ఏ కోణం నుంచి చూస్తారన్న అంశంపైన ఆధారపడి వుంటుంది. త్రివేది గవర్నర్‌గా వున్నప్పుడు, దైనందిన పాలనా వ్యవహారాల్లో ఆయన మంత్రులకు సలహాలను ఇచ్చేవారని-వాటిని వారు మరో ఆలోచన లేకుండా తిరస్కరించే వారని చెప్పుకునేవారు. బహుశా ఆ నేపథ్యంలో, సలహాలను ఇచ్చే శైలిలో మార్పొచ్చిందేమో ! ప్రస్తుత గవర్నర్ నరసింహ న్ ఒకసారి తన ఏలూరు పర్యటనలో భాగంగా, నిర్మల్ పురస్కారాలను అందుకున్న గ్రామాలకు కేంద్ర ప్రోత్సాహానికి అదనంగా మరో లక్ష రూపాయలను ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు. ఆయన కోరికను వెంటనే అంగీకరించిన మంత్రి రఘువీరా రెడ్డి దానికి సంబంధించిన ప్రకటన తక్షణమే చేశారు. ఏ విధానమైనా, ఆచరణలో పెట్టేవారి నిజాయితీని బట్టి సానుకూలమవుతుంది. వ్యక్తిగతమైన అభిమానాలకు-దురభిమానాలకు పాల్పడితే దేశ శ్రేయస్సు, రాష్ట్ర శ్రేయస్సు దెబ్బతింటుంది. ఏదేమైనా, తొందరపడి గవర్నర్‌ను విమర్శించడం, వ్యవస్థనే కించపరచడం భావ్యం కాదు. రాజ్యాంగ బాధ్యతలు తెలియకుండా అందరు గవర్నర్లు వ్యవహరిస్తాడని విమర్శించడం పొరపాటు.

-వనం జ్వాలా నరసింహారావు

35

VANAM JWALA NARASIMHA RAO

Published: Thu,December 21, 2017 01:12 AM

కృత్రిమ వైరుధ్యాలతో కుమ్ములాటలా!

హైదరాబాద్‌లో అద్భుతంగా జరిగిన జీఈఎస్ ఎనిమిదవ సదస్సు నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా వ్యయం చేయలేదన్నారు సీఎం. అసలీ సదస

Published: Tue,November 21, 2017 11:20 PM

ఆధ్వర్యం మనదే.. అధ్యక్షత మనదే

తెలంగాణలో జరిగే ప్రపంచ తెలుగు మహాసభలకు రంగం సిద్ధమవుతున్నది. సమావేశాలు జరుగడానికి ఇంకా మూడు వారాలే మిగిలాయి. దేశం నలుమూలల నుంచి, వ

Published: Sun,November 12, 2017 12:41 AM

గ్రామ పునర్నిర్మాణం దిశగా..

క్రియాశీల పంచాయతీరాజ్ వ్యవస్థకు శ్రీకారం చుట్టాలని, స్వయం ప్రతిపత్తితో గ్రామాలు, వ్యక్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అభివృద్ధిలో భ

Published: Sun,October 15, 2017 01:33 AM

కులాలపై విమర్శ తగదు

శతాబ్దాలకాలంగా బ్రాహ్మణ, బ్రాహ్మణేతరులు కలిమిడిగా, అభివృద్ధి చేసిన సామాజిక, రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. ఒకరిని మరొకరు దూషించుకున

Published: Wed,October 4, 2017 12:56 AM

వ్యాపారం చేయడమే నేరమా?

ఇటీవల ఒక సామాజిక శాస్త్రవేత్త కోమట్లను సామాజిక స్మగ్లర్లు (దొంగ రవాణాదారులు) అంటూ ఒక అసంబద్ధమైన బుల్లి పుస్తకాన్ని రాశాడు. దానిమీద

Published: Sat,April 22, 2017 03:12 AM

కేంద్ర, రాష్ట్ర సంబంధాల్లో కొత్త అధ్యాయం

ముఖ్యమంత్రి అసెంబ్లీలో కేంద్ర-రాష్ట్ర సంబంధాల విషయంలో వెలిబుచ్చిన అభిప్రాయాలు, ముస్లిం రిజర్వేషన్ల పెంపు అంశం, యావత్ భారతదేశం దృష

Published: Tue,March 28, 2017 12:01 AM

అభివృద్ధి కోసమే అప్పులు

అత్యంత హుందాగా, సమర్థవంతంగా, అర్థవంతంగా సుమారు మూడు వారాల పాటు జరిగిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా ప

Published: Tue,February 14, 2017 01:23 AM

ప్రపంచవ్యాప్త మహిళా సాధికారత

ఎందరో మహిళలు దేశ దేశాల్లో కీలకమైన పదవుల్లో ఉండటం గత ఐదారు దశాబ్దాల మహిళా సాధికారతకు నిదర్శనం. భవిష్యత్‌లో మరికొన్ని దేశాల అధ్యక్

Published: Tue,December 13, 2016 01:03 AM

బహుముఖ ప్రజ్ఞాశాలి సీఎస్‌ఆర్

ఉత్తర భారతదేశంలోని బద్రీనాథ్, కేదార్‌నాథ్ దేవాలయానికి 1977లో సీఎస్‌ఆర్అ ధ్యక్షులుగా నియమించబడ్డారు. వారి కాలంలోనే బద్రీనాథ్, కేదార

Published: Fri,September 23, 2016 11:32 PM

ప్రతిభకు ప్రతీకలు గురుకులాలు

విద్యా విధానంలో ప్రస్తుతమున్న అన్ని అనర్థాలకూ గురుకుల విద్య సమాధానం కాకపోవచ్చు. కానీ ఈ నమూనా తప్పకుండా,అణగారిన వర్గాల్లో ఆణిముత్య

Published: Sun,September 18, 2016 12:57 AM

అన్యాయానికి సజీవసాక్ష్యం

నందికొండ ప్రాజెక్టు నిర్మాణం 1956న ప్రారంభం కాగా 1969లో పూర్తయ్యింది.గేట్ల ఏర్పాటు, స్పిల్‌వే ఏర్పాటు 1974 నాటికి పూర్తి చేయటం జరి

Published: Thu,September 3, 2015 01:28 AM

అందరికీ విద్య దిశగా అడుగులు

సమాజానికి అవసరమయ్యే సేవలు ఏమిటి? అందుకు అనుగుణంగా సేవలందించేవారిని ఎలా తయారు చేయాలి? అనే విషయంపై విద్యా శాఖకు అవగాహన ఉండాలి. ఏ వృత

Published: Sun,August 23, 2015 01:39 AM

వ్యయం లేని వ్యవసాయం కావాలి

తెలంగాణలో ప్రతి గ్రామంలో రైతులతో వ్యవసాయ శాఖ ప్రత్యక్ష అనుబంధం కలిగి వుండాలి. ఎప్పటికప్పుడు రైతులతో మాట్లాడుతూ వ్యవసాయానికి పూర్వ

Published: Wed,August 19, 2015 12:09 AM

నాటిరోజుల్లో గ్రామీణ జనజీవనం

వేసవి కాలంలో పొలాలకు పెంట తోలే ప్రక్రియ తో వ్యవసాయ పనులు మొదలయ్యేవి. పాడి పశువుల వల్ల పోగైన పెంటను ఎరువుగా పొలాలకు తరలించేవారు. అద

Published: Wed,August 12, 2015 01:49 AM

యాభై ఏళ్ల సింగపూర్.. విశేషాలు

ఐదారు దశాబ్దాల క్రితం వరకూ దూర ప్రాచ్య తీర ప్రాంతంలో, బ్రిటన్‌కు ప్రధానమైన నావికా సైనిక స్థావరంగా మాత్రమే ఉండేది సింగపూర్. అలాంటిద

Published: Fri,July 31, 2015 11:18 PM

ఆచితూచి.. అసలైన నిర్ణయం

న్యాయపరమైన నియమ, నిబంధనల నేపథ్యంలో రాజ్యాంగ ప్రకరణాలు, న్యాయస్థానాల తీర్పులు ఉండి తీరాలి. సంప్రదాయాలకు ఇదమిత్థమైన నిబంధనలంటూ ఏవీ ఉ

Published: Thu,July 23, 2015 12:20 AM

పర్యాటక మకుటంగా యాదాద్రి ..

180 ఎకరాల విస్తీర్ణం గల యాదగిరిగుట్ట స్థలాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకునేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఆ ప్రాంతమంతా అందమైన చెట్లతో

Published: Thu,July 2, 2015 04:46 AM

ఆకుపచ్చని తెలంగాణ దిశగా..

బంగారు తెలంగాణ స్వప్నం సాకార దిశగా మరో కీలకమైన అడుగు వేయడానికి ప్రభుత్వం సకల సన్నాహాలు చేసింది. తెలంగాణకు హరిత హారం పేరుతో ముఖ్యమం

Published: Thu,June 25, 2015 01:13 AM

పుష్కరాలు ఆధ్యాత్మిక పరిమళాలు

గౌతమ మహర్షి కఠోర తపస్సు కారణాన భూలోకానికి తేబడిన గంగానది పాయ గౌతమిగా, గోదావరిగా ప్రసిద్ధికెక్కింది. గంగానది అంశగా భావించబడే గోదావర

Published: Thu,September 11, 2014 12:27 AM

నాటి హైదరాబాద్ జ్ఞాపకాలు

జూన్, 1964లో నేను, నాన్న గారు కలిసి మొదటిసారి హైదరాబాద్ చేరుకున్నాం.ఖమ్మంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు బస్సెక్కితే హైదరాబాద్ గౌలిగూ

Published: Tue,June 10, 2014 01:16 AM

వాగ్దానాల అమలు దిశగా..

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వారంలోపల కేసీఆర్ తాను చేయబోయే కార్యక్రమాలు ఎలా వుండబోతున్నాయో చెప్పారు. తమ ఎన్నికల ప్రణాళికలో ప

Published: Tue,December 10, 2013 12:53 AM

ద్వీప దేశం సింగపూర్ అభివృద్ధి రహస్యం!

గత ఏడాది మొదటిసారి వచ్చినప్పుడు, ఇప్పుడు మళ్లీ రెండో మారు వచ్చినప్పుడు సింగపూర్ నగరంలో తిరుగుతుంటే ఆశ్చ ర్యం. ఎలా అతి కొద్ది కాలంల

Published: Sat,May 25, 2013 01:10 AM

అంతర్‌రాష్ట్ర జలవివాదాలు, రాజకీయాలు

బాబ్లీ ప్రాజెక్టు వివాదంపై కోర్టు తీర్పుమీద వివరణ, సమీక్ష కోసం సుప్రీంకోర్టు లో పిటిషన్ దాఖలుకు ముందు మూడంచెల వ్యూహం అనుసరించాలని

Published: Mon,April 22, 2013 12:38 AM

రాహుల్ కోసం అధిష్ఠానం ఆరాటం

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మరోమారు రాష్ట్ర వ్యవహారాలపై దృష్టి సారించారనడానికి నిదర్శనం,ఢిల్లీకి రావాల్సిందిగా ముఖ్

Published: Mon,April 8, 2013 02:40 AM

కాగ్ నివేదిక పరమార్థమే!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2006-2011 మధ్య జరిపిన భూముల కేటాయింపులలో 50 కోట్ల పైగా విలువగల భూమి అక్రమ పద్ధతుల్లో అన్యాక్షికాంతమైందని క

Published: Fri,March 29, 2013 11:50 PM

అసమ్మతిపై అనర్హత అస్త్రం

అవిశ్వాస తీర్మానం ఓటింగులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటువేసిన తొమ్మిది మంది కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలపై, పార్టీ ఫిరాయింపుల ని

Published: Wed,December 19, 2012 11:49 PM

బ్రాహ్మణుల బాధలు పట్టవా?

ఒక నాడు సమాజాన్ని ఐక్యంగా వుంచడానికి తమ శాయశక్తులా కృషిచేసిన బ్రాహ్మణుల స్థితిగతులు రోజురోజుకూ క్షీణించిపోతున్నాయి. క్రిస్టియన్ మి

Published: Fri,December 14, 2012 12:01 AM

కాలయాపనకే అఖిల పక్షాలు!

తెలంగాణ సమస్యపై శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇచ్చి రెండేళ్లు పూర్తి కావస్తున్నది. తదనంతరం అనేక అఖిలపక్ష సమావేశాలు జరిగాయి. ఏమీ తేలలేదు.

Published: Wed,October 10, 2012 05:37 PM

దారులు ఏవైనా గమ్యమొక్కటే

తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటూ ఏళ్ల తరబడి సాగుతున్న ఉద్య మం మరో మలుపు తిరిగింది. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె

Published: Sat,October 6, 2012 03:36 PM

అక్కసుతోనే పీవీపై ఆరోపణలు

బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ పీవీ బాధ్యుడా? పీవీకి, నెహ్రూ-గాంధీ కుటుంబానికి భేదాభివూపాయాలున్నాయా? ఆ

Published: Sat,October 6, 2012 03:37 PM

క్షీణిస్తున్న పార్లమెంట్ జవాబుదారీతనం

భారత పార్లమెంట్ షష్టిపూర్తి జరుపుకుంటున్నది. రాష్ట్రానికి చెందిన ఇద్దరు నాటి తొలితరం పార్లమెం సహా మరో ఇద్దరు మాజీ పార్లమెంటుసభ్యుల

Published: Sat,October 6, 2012 03:37 PM

విజ్ఞానాన్ని అందించిన ప్రణవానంద

గత శతాబ్దం ప్రారంభంలో, స్వీడన్‌కు చెందిన స్వెన్ హెదిన్ అనే యూరోపియన్ పర్యాటకుడు, టిబెట్ వెళ్లి, ఆసియా ఖండానికి చెందిన భౌగోళిక విషయ

Published: Sat,October 6, 2012 03:38 PM

పార్టీని వీడిన వాళ్లకే పట్టం!

అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసి, ధిక్కార స్వరం వినిపించి న కాంగ్రెస్ శాసనసభ్యులమీద వేటు పడింది. వారితో పాటు ఎంపీ మేకపాటి

Published: Sat,October 6, 2012 03:38 PM

హైమన్‌డార్ఫ్ అనుబంధం

మానవ పరిణామ శాస్త్రవేత్త ప్రొఫెసర్ వోన్ ఫ్యూరర్ హైమ న్‌డార్ఫ్‌కు గిరిజన సంప్రదాయాల ప్రకారం, అంతి మ సంస్కారాలు జరిపించడానికి ఆయన కు

Published: Sat,October 6, 2012 03:38 PM

స.హ. చట్టంలో సంభావనలు!

సమాచార హక్కు చట్టం కమిషనర్లుగా కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఎనిమిదిని ఎంపిక చేసింది. ఆ నిర్ణయానికి ప్రతిపక్షనేత మద్దతు ఇచ్చీ-ఇవ్వ

Published: Sat,October 6, 2012 03:39 PM

పద్యపుష్పంపై రమణీయ ఝంకారం

రమణ ఎంపిక చేసుకున్న అంశం వినూత్నమైందనాలి. సాధారణంగా, తెలుగులో పీహెచ్‌డీ కావాలనుకున్నవారు ఎవరో ఒకరి ప్రముఖ రచనలపై పరిశోధన చేస్తారు.

Published: Sat,October 6, 2012 03:40 PM

గెలుపెవరిది ? ఓటమెవరిది?

లాంఛనవూపాయంగా ముగుస్తుందనుకున్న అవిశ్వాస తీర్మానం తతంగం, ఆద్యం తం ఆసక్తికరంగా కొనసాగింది. తీర్మానం వీగిపోయిందనేకన్నా, అన్ని ప్రధాన

Published: Sat,October 6, 2012 03:39 PM

అరుదైన కార్యదక్షుడు చెన్నారెడ్డి

డాక్టర్ మర్రి చెన్నాడ్డి మరణించి 15 సంవత్సరాలైంది. పాతతరం నాయకుల్లో అరుదైన ఆ నాయకుడిని ఎన్నో రకాలుగా ఆంధ్రవూపదేశ్ రాష్ట్ర ప్రజలు గ

Published: Sat,October 6, 2012 03:41 PM

ఏకాభిప్రాయం ఎన్నటికి సాధ్యం?

తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావంతో నూతనోత్సాహంతో ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం పూర్తిగా అహింసా మార్గంలో సాగుతోంది. ఆబాల

Published: Sat,October 6, 2012 03:41 PM

సకలంతో కాంగ్రెస్‌లో కదలిక

మూసుకున్న ఢిల్లీ కాంగ్రెస్-యూపీఏ సారథ్య నాయకుల (నాయకీమణు ల) కళ్లు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. అవును మరి! ఇంకా కొద్ది రోజులు మ

Published: Sat,October 6, 2012 03:40 PM

గైర్హాజరే మిగిలిన దారి

-వనం జ్వాలా నరసింహారావు చట్ట సభల ప్రతినిధుల రాజీనామాల విషయంలో ఎలా వ్యవహరిస్తే మంచిదో, రాజీనామా చేసిన, చేయని సభ్యుల ద్వారా సభా మ