క్షీణిస్తున్న పార్లమెంట్ జవాబుదారీతనం


Sat,October 6, 2012 03:37 PM

భారత పార్లమెంట్ షష్టిపూర్తి జరుపుకుంటున్నది. రాష్ట్రానికి చెందిన ఇద్దరు నాటి తొలితరం పార్లమెం సహా మరో ఇద్దరు మాజీ పార్లమెంటుసభ్యులను ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ సత్కరించారు. అరుదైన అరవై ఏళ్ల ప్రస్థానంలో ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన ప్రజస్వామ్య దేశపు పార్లమెంటుగా అనేక మేలైన శాసనాలను, చట్టాలను తీసుకొచ్చింది. బ్యాంకుల జాతీయీకరణ, రాజాభరణాల రద్దు, స్థానిక సంస్థలకు సంబంధించి న సవరణలు, సమాచార హక్కు చట్టం లాంటి ఎన్నో శాసనాలను పార్లమెంటు చేసింది. ఈ సుదీర్ఘ కాలంలో అది సాధించింది స్వల్పమే అయినా సాధించాల్సింది ఇంకా ఎంతో ఉన్నది. రాజ్యాంగానికి లోబడి చట్టాలను చేసే నిర్ణయాధికారం, సార్వభౌమాధికారం పార్లమెంటుదే అయినా, ఒక సంస్థగా,వ్యవస్థగా భారత పార్లమెంటుకు రాజ్యాంగ పరం గా సంక్రమించిన అధికారాలను కార్య నిర్వహణ సంస్థ చేతుల్లో పెట్టింది. దీం తో పరోక్షంగా ఉనికిని కోల్పోతున్న నేపథ్యంలో భవిష్యత్‌లో దాని ప్రధాన బాధ్యతైన జవాబుదారీతనంతో వ్యవహరించడం క్లిష్టమౌతుందని నిపుణులు అభివూపాయపడుతున్నారు.

భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ఆయువు పట్టయి న పార్లమెంటు ఉభయ సభల రాజ్యాంగపరమైన శాసనాధికార పర్యవేక్షణా సామర్థ్యం, జవాబుదారీతనం క్రమేపీ క్షీణ దశకు చేరుకుంటున్నాయి. జవాబుదారీకి ప్రతీకలుగా, పార్లమెంటులో ప్రవేశపెట్టి చర్చించాల్సిన వివిధ తీర్మానాలు, పర్యవేక్షణా బాధ్యతలు, సభా సంఘాల పనితీరు లాంటివి నిర్వీర్యమైపోతున్నాయి. ప్రపంచీకరణ దిశగా దూసుకుపోతున్న భారత ఆర్థిక వ్యవస్థ, పార్లమెంటు అధికారాలను హరించి వేస్తున్నది. భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్న పలు అంతర్జాతీయ ఒప్పందాలకు సంబంధించి పార్లమెంటుకు సరైన పర్యవేక్షణ లేదు. ఆ ఒప్పందా ల విషయంలో పార్లమెంటు వెలుపల తీసుకున్న నిర్ణయాలు తిరుగులేనివిగా వుండడంతో పార్లమెంటు ప్రేక్షక పాత్ర వహించాల్సి వస్తున్నది. బాధ్యతాయుతమైన విధులు నిర్వహించే పలు వ్యవస్థలకు బదలాయించిన అధికారాలపై కూడా పార్లమెంటు పర్యవేక్షణ బలహీనంగా ఉన్నది. అలానే న్యాయ వ్యవస్థ కూడా పార్లమెంటును ఆదేశించే సందర్భాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. శాసనాధికారాలున్న చట్టసభల పరిస్థితి ఇలా కావడానికి కారణాలను రాజకీయ విశ్లేషకులు, విద్యావేత్తలు, పార్లమెంటరీ నిపుణులు అన్వేషించే ప్రయత్నం చేశారు.

శాసన ప్రక్రియలో జాప్యం జరుగుతున్నదనే సాకుతో, చట్టాల రూపకల్పన, నిర్ణయాధికారం కలిగిన పార్లమెంటు చట్టం స్థానంలో ఆర్డినెన్సులను తెచ్చేందుకు కార్య నిర్వహణ వ్యవస్థకు (నిర్వహణాధికారికి-వూపధానికి) అధికారాలను కట్టబెడుతూ పోవడం భారత పార్లమెంటుకున్న బలహీనత అనాలి. పెరుగుతున్న సామాజిక అవసరాలకు ఆధునిక పార్లమెంటరీ పద్ధతులకు అనుగుణంగా వ్యవహరించగల సామర్థ్యం చాలామంది పార్లమెంటు సభ్యులలో లేకపోవడం కూడా జవాబుదారీతనం క్షీణించడానికి కారణం. పార్లమెంటు నిర్వర్తించాల్సిన విధుల ను, దానంతటదే పరిత్యజించడం విషాదకరమైన అంశంగా పరిగణించాలి. ఎన్నికల పార్టీల రాజకీయాల కారణాన తప్పనిసరిగా తలెత్తే పరిస్థితులు, చట్టాల రూపకల్పనలో అలసత్వం ఆలస్యం జరగడానికి దోహదపడుతున్నాయి. పార్లమెంటు సభ్యులు సరైన కారణాలు లేకపోయినా చట్ట సభలో అవరోధాలు కలిగించి శాసన ప్రక్రియను ఆలస్యం చేస్తున్నారు. తరతరాలుగా గుత్తాధిపత్యంతో కొందరు మాత్రమే రాజ్యాధికారం చెలాయించే స్థితి ఉన్న భారతీయ సమాజంలో, నెమ్మదిగా సామాజిక చైతన్యం వస్తుందని ఆశించారు. రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులు కాపాడబడతాయని, సార్వజనీన ఓటు హక్కు మార్పుకు సంకేతమని భావించిన దేశ పౌరుల నమ్మకం వమ్మైందని అనాలి. భారత దేశ ప్రజాస్వామ్య ప్రక్రియలో చోటుచేసుకుంటున్న వైఫల్యాలకు,సాఫల్యాలకు, పార్లమెంటు బాధ్యత ఎంతనేది చర్చనీయాంశం. పార్లమెంటు పనితీరుకు సంబంధం లేకుండా ప్రజాస్వామ్యం మనుగడ సాగే వీలు లేదు. రాజకీయ పార్టీల ఆలోచనా సరళి, ప్రభావం, పార్లమెంటు సభ్యులపై ప్రస్ఫుటంగా వుంటుంది. ఈ నేపథ్యం లో తప్పైనా ఒప్పైనా, అర్హతలు యోగ్యతల దృష్ట్యా కాని, నిబద్ధత దృష్ట్యా కాని, పార్లమెంటు పనిలో నాణ్యత క్షీణిస్తున్నదని నిపుణుల అభివూపాయం. స్వాతం త్య్రం వచ్చిన తొలినాళ్లతో పోల్చి చూస్తే ఈ నాటి పార్లమెంటు సభ్యులలో చాలా మంది విద్యార్హతలు ఉన్నత స్థాయిలో వున్నప్పటికీ, ఎన్నికైన వారిలో గణనీయమైన సంఖ్యలో నేరచరిత్ర కలిగినవారు కూడా వుండడంతో దాని ప్రభావం కూడా పార్లమెంటు పనితీరుపై పడుతున్నది.

ఒకనాడు ఆంగ్ల విద్యను అభ్యసించ గలిగిన లాయర్లు, అగ్రకులాలకు చెందిన విద్యావేత్తలు, ధనవంతులకు మాత్రమే పార్లమెంటులో అడుగుపెట్టగల సత్తా వుండేది. కాలం మారింది. ధన బలం, అంగ బలం, కుల బలం వున్న అన్ని సామాజిక వర్గాల వారితో సహా, రిజర్వేషన్ల మూలాన, వెనుక బడిన వర్గాలకు, షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన వారు కూడా చట్ట సభలకు ఎన్నిక కాగలుగుతున్నారు. మహిళలకు ఇంకా రిజర్వేషన్లు లేకపోవడంతో, అనుకున్నంత మంది ఎన్నిక కావడం లేదు. మొత్తం మీద మారుతున్న సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులకనుగుణంగా, వైవిధ్యంతో కూడిన సామాజిక ప్రయోజనాలను ప్రతిబింబించే విభిన్న వ్యక్తులతో పార్లమెంటు ఏర్పాటవుతోంది ఇప్పుడు. పార్లమెంటులోకి అడుగు పెట్టే రాజకీయ పార్టీల సంఖ్య ఐదు నుంచి నలభైకి పెరగడం, ఒకసారి గెలిచిన వ్యక్తి మళ్ళీ గెలుస్తారో లేదో అన్న అపనమ్మకంతో, ‘ఆయారం గయారాం’ రాజకీయాలకు ఒడిగట్టడం, పార్లమెంటు వ్యవస్థ జవాబుదారీతనాన్ని కుదించాయి.

అవిశ్వాస తీర్మానాల ద్వారా, ఇతర రకాలైన సభా తీర్మానా ల ద్వారా, రాజ్యాంగ పరంగా సంక్రమించిన అధికారాలతో ప్రభుత్వాలను ఇబ్బందికి గురిచేయగల పదునైన ఆయుధాలు, తమ చేతులో వుంచుకున్న ప్రతి పక్షాలు సహితం, పార్లమెంటును జవాబుదారీగా వుంచడంలో విఫలమవుతున్నాయి. ఒకప్పుడు అధికారంలో కొచ్చిన రాజకీయ పార్టీలు కూడా, ప్రతిపక్ష పాత్ర సక్రమంగా పోషించలేక పోవడానికి కారణం, సంస్థాగతంగా సరైన నిర్మాణం లేకపోవడమే. పార్లమెంటు సభా సమావేశాల సమయం క్రమేపీ తగ్గుతోంది. రాజ్యాంగపరంగా విధిగా కావాల్సిన కోరం లేకుండా కూడా సభను నిర్వహించాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి . విధి లేని సందర్భాలలో సభాపతి వాయిదా మార్గాన్ని ఎంచుకోవాల్సి వస్తోంది దురదృష్టవశాత్తు, నియోజకవర్గానికి చెందిన ప్రజల దృష్టిలో ఎంపీ అంటే, తమకు కావాల్సిన సొంత పనులు చేసిపెట్టే మనిషి మాత్రమే అన్న అభివూపాయం వున్నది. పార్లమెంటు సభ్యులకు కూడా వారి అవసరం వుండడం తో, వారు కూడా దానికే ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తున్నారు. వెరసీ ఇవన్నీ జాతీ య ప్రాముఖ్యం ఉన్న అంశాలపై శ్రద్ధ వహించకుండా దోహద పడుతున్నాయి. భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ తన పని తాను చేసుకుంటూ పోతుందేమో కాని, ఆ వ్యవస్థకు మూలస్థంభమైన పార్లమెంటు జవాబుదారీతనం ప్రశ్నార్థకంగా మారిపోతోంది.

-వనం జ్వాలా నరసింహారావు

35

VANAM JWALA NARASIMHA RAO

Published: Thu,December 21, 2017 01:12 AM

కృత్రిమ వైరుధ్యాలతో కుమ్ములాటలా!

హైదరాబాద్‌లో అద్భుతంగా జరిగిన జీఈఎస్ ఎనిమిదవ సదస్సు నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా వ్యయం చేయలేదన్నారు సీఎం. అసలీ సదస

Published: Tue,November 21, 2017 11:20 PM

ఆధ్వర్యం మనదే.. అధ్యక్షత మనదే

తెలంగాణలో జరిగే ప్రపంచ తెలుగు మహాసభలకు రంగం సిద్ధమవుతున్నది. సమావేశాలు జరుగడానికి ఇంకా మూడు వారాలే మిగిలాయి. దేశం నలుమూలల నుంచి, వ

Published: Sun,November 12, 2017 12:41 AM

గ్రామ పునర్నిర్మాణం దిశగా..

క్రియాశీల పంచాయతీరాజ్ వ్యవస్థకు శ్రీకారం చుట్టాలని, స్వయం ప్రతిపత్తితో గ్రామాలు, వ్యక్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అభివృద్ధిలో భ

Published: Sun,October 15, 2017 01:33 AM

కులాలపై విమర్శ తగదు

శతాబ్దాలకాలంగా బ్రాహ్మణ, బ్రాహ్మణేతరులు కలిమిడిగా, అభివృద్ధి చేసిన సామాజిక, రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. ఒకరిని మరొకరు దూషించుకున

Published: Wed,October 4, 2017 12:56 AM

వ్యాపారం చేయడమే నేరమా?

ఇటీవల ఒక సామాజిక శాస్త్రవేత్త కోమట్లను సామాజిక స్మగ్లర్లు (దొంగ రవాణాదారులు) అంటూ ఒక అసంబద్ధమైన బుల్లి పుస్తకాన్ని రాశాడు. దానిమీద

Published: Sat,April 22, 2017 03:12 AM

కేంద్ర, రాష్ట్ర సంబంధాల్లో కొత్త అధ్యాయం

ముఖ్యమంత్రి అసెంబ్లీలో కేంద్ర-రాష్ట్ర సంబంధాల విషయంలో వెలిబుచ్చిన అభిప్రాయాలు, ముస్లిం రిజర్వేషన్ల పెంపు అంశం, యావత్ భారతదేశం దృష

Published: Tue,March 28, 2017 12:01 AM

అభివృద్ధి కోసమే అప్పులు

అత్యంత హుందాగా, సమర్థవంతంగా, అర్థవంతంగా సుమారు మూడు వారాల పాటు జరిగిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా ప

Published: Tue,February 14, 2017 01:23 AM

ప్రపంచవ్యాప్త మహిళా సాధికారత

ఎందరో మహిళలు దేశ దేశాల్లో కీలకమైన పదవుల్లో ఉండటం గత ఐదారు దశాబ్దాల మహిళా సాధికారతకు నిదర్శనం. భవిష్యత్‌లో మరికొన్ని దేశాల అధ్యక్

Published: Tue,December 13, 2016 01:03 AM

బహుముఖ ప్రజ్ఞాశాలి సీఎస్‌ఆర్

ఉత్తర భారతదేశంలోని బద్రీనాథ్, కేదార్‌నాథ్ దేవాలయానికి 1977లో సీఎస్‌ఆర్అ ధ్యక్షులుగా నియమించబడ్డారు. వారి కాలంలోనే బద్రీనాథ్, కేదార

Published: Fri,September 23, 2016 11:32 PM

ప్రతిభకు ప్రతీకలు గురుకులాలు

విద్యా విధానంలో ప్రస్తుతమున్న అన్ని అనర్థాలకూ గురుకుల విద్య సమాధానం కాకపోవచ్చు. కానీ ఈ నమూనా తప్పకుండా,అణగారిన వర్గాల్లో ఆణిముత్య

Published: Sun,September 18, 2016 12:57 AM

అన్యాయానికి సజీవసాక్ష్యం

నందికొండ ప్రాజెక్టు నిర్మాణం 1956న ప్రారంభం కాగా 1969లో పూర్తయ్యింది.గేట్ల ఏర్పాటు, స్పిల్‌వే ఏర్పాటు 1974 నాటికి పూర్తి చేయటం జరి

Published: Thu,September 3, 2015 01:28 AM

అందరికీ విద్య దిశగా అడుగులు

సమాజానికి అవసరమయ్యే సేవలు ఏమిటి? అందుకు అనుగుణంగా సేవలందించేవారిని ఎలా తయారు చేయాలి? అనే విషయంపై విద్యా శాఖకు అవగాహన ఉండాలి. ఏ వృత

Published: Sun,August 23, 2015 01:39 AM

వ్యయం లేని వ్యవసాయం కావాలి

తెలంగాణలో ప్రతి గ్రామంలో రైతులతో వ్యవసాయ శాఖ ప్రత్యక్ష అనుబంధం కలిగి వుండాలి. ఎప్పటికప్పుడు రైతులతో మాట్లాడుతూ వ్యవసాయానికి పూర్వ

Published: Wed,August 19, 2015 12:09 AM

నాటిరోజుల్లో గ్రామీణ జనజీవనం

వేసవి కాలంలో పొలాలకు పెంట తోలే ప్రక్రియ తో వ్యవసాయ పనులు మొదలయ్యేవి. పాడి పశువుల వల్ల పోగైన పెంటను ఎరువుగా పొలాలకు తరలించేవారు. అద

Published: Wed,August 12, 2015 01:49 AM

యాభై ఏళ్ల సింగపూర్.. విశేషాలు

ఐదారు దశాబ్దాల క్రితం వరకూ దూర ప్రాచ్య తీర ప్రాంతంలో, బ్రిటన్‌కు ప్రధానమైన నావికా సైనిక స్థావరంగా మాత్రమే ఉండేది సింగపూర్. అలాంటిద

Published: Fri,July 31, 2015 11:18 PM

ఆచితూచి.. అసలైన నిర్ణయం

న్యాయపరమైన నియమ, నిబంధనల నేపథ్యంలో రాజ్యాంగ ప్రకరణాలు, న్యాయస్థానాల తీర్పులు ఉండి తీరాలి. సంప్రదాయాలకు ఇదమిత్థమైన నిబంధనలంటూ ఏవీ ఉ

Published: Thu,July 23, 2015 12:20 AM

పర్యాటక మకుటంగా యాదాద్రి ..

180 ఎకరాల విస్తీర్ణం గల యాదగిరిగుట్ట స్థలాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకునేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఆ ప్రాంతమంతా అందమైన చెట్లతో

Published: Thu,July 2, 2015 04:46 AM

ఆకుపచ్చని తెలంగాణ దిశగా..

బంగారు తెలంగాణ స్వప్నం సాకార దిశగా మరో కీలకమైన అడుగు వేయడానికి ప్రభుత్వం సకల సన్నాహాలు చేసింది. తెలంగాణకు హరిత హారం పేరుతో ముఖ్యమం

Published: Thu,June 25, 2015 01:13 AM

పుష్కరాలు ఆధ్యాత్మిక పరిమళాలు

గౌతమ మహర్షి కఠోర తపస్సు కారణాన భూలోకానికి తేబడిన గంగానది పాయ గౌతమిగా, గోదావరిగా ప్రసిద్ధికెక్కింది. గంగానది అంశగా భావించబడే గోదావర

Published: Thu,September 11, 2014 12:27 AM

నాటి హైదరాబాద్ జ్ఞాపకాలు

జూన్, 1964లో నేను, నాన్న గారు కలిసి మొదటిసారి హైదరాబాద్ చేరుకున్నాం.ఖమ్మంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు బస్సెక్కితే హైదరాబాద్ గౌలిగూ