సకల జన కల్యాణం కోసం...


Sat,October 6, 2012 03:46 PM

నా బిడ్డ పెండ్లి అక్టోబర్ 22న. పెండ్లి దగ్గర పడుతుంటే ఇంట్ల మినుకులాడుకుంట అడగనే అడిగిరి. సకల జనుల సమ్మెకాడ్నుంచి ఒక్కరోజు పుర్‌సత్ లేకుంట బయటనే తిరిగితే పత్రికపూప్పుడు పంచుడు? పనుపూప్పుడు చూసుకునుడు? పైసలు మంచిచెడు.... నిజమే దగ్గర పడ్డది. నకిరేకల్‌లో జేఏసీ, ఇతరులకు నాలు గు రోజులు పెండ్లి పత్రికల మీద పడతనని చెప్పి... అక్టోబర్ 3 పొద్దున పెండ్లి పత్రికలకు అంటించిన పసుపు చూడంగనే బాధ్యత, ఒకింత భావోద్వేగం... తొందర గ తల స్నానం చేసి పెండ్లి పత్రిక ఇవ్వడానికి వస్తున్నానని ఫోన్‌లో చాలా మందికి చెప్పిన. చిరకాల మిత్రుడు బ్రహ్మచారికి ‘అన్నా మొదటి పత్రిక’ ఇయ్యడానికే వస్తున్న అని బండిలో కూర్చున్నాను. మావో డు డ్రైవర్ రవి కూడా...తొందరగా రెడీ అయి వచ్చిం డు. ఇంటి మలుపు తిరుగుతుండంగనే సెల్‌ఫోన్ కాల్....తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు నిమ్మల శ్రీను ఫోన్..అన్నా! సూర్యాపేట నుంచి కోదాడ దాటి వచ్చిన ప్రైవేట్ ఆంధ్రా బస్సులకు అడ్డుకోబోయినం...ఫుల్ సెక్యూరిటీ పెట్టి..లాఠీచార్జి చేసి అవతలేసింవూడన్న - మా ఊరు దాటినం..అన్నా! ఎట్ల జేస్తవో...నకిరేకల్ దాటితే...ఇగ దాటినట్టే అంటున్నరన్న పోలీసులు....ఫోన్ పెట్టేసిండ్రు....ఇంట్ల ఈ రోజు నుంచి వెళ్లకుండా ఉందామనుకున్న ఆలోచన...అప్పుడే డిస్టర్బ్ అయిపోయింది. సూర్యాపేట జేఏసీ.... ధర్మారాజన్ ఎప్పుడూ అంటుండేది.. మన ధర్మాక్షిగహం సరే.. అన్నా...ఎప్పటిదాక మీకు టెన్షన్- మాకు టెన్షన్ ఎట్ల భరించాపూనని అంటున్న ఈ ధర్మపత్నిలకు ఏం చెప్పాలె అని...నిమ్మల శ్రీను..ముచ్చట ఎవన్ని మాత్రం నిమ్మలంగా ఉండనిస్తది... మొదటి పెండ్లికార్డు ముచ్చట మరిచిపోయి కొత్తబట్టల ముచ్చట మరిచిపోయి రోడ్డెక్కినం..


సకల జనుల సమ్మె 21రోజు బారసాలకు తెలంగాణ సమస్త ఉపాధ్యాయ- ఉద్యోగ, విద్యార్థి, ప్రజానీకం ఉరుకులాడుతున్న వేళ - ఈ బారసాల మొక్కవోని మా తెలంగాణ యావత్ ప్రజల పోరాట పటిమకు, నిబద్ధతకు నిదర్శనమని. బారసాల వేడుకను హుజూర్‌నగర్‌లో జరుపుతనే ఉన్నరు. రోడ్డు మీద అప్పటికే నోటికి నల్లని నిరసన రిబ్బన్ కట్టుకుని టీచర్స్ జాక్ రాస్తారోకోలో ఉంది. సకల జనుల సమ్మెలో లక్షల మంది ప్రజలు కులాలు, వృత్తులు, సంఘాల వారీగా తమ సంఘీభావాన్ని రోడ్డు మీద ప్రదర్శిస్తూనే ఉన్నారు.

అక్టోబర్ 3న ర్యాలీల తాకిడి తక్కువగానే ఉంది. ఆంధ్రాబస్సులు భారీ బందోబస్తుతో అట్టహాసంగా దూసుకొస్తున్నయ్....ఏం చెయాలె..చాలా సీరియస్‌గా రోడ్డు మీద ఉదయం ఆక్టివిటీని కో ఆర్డినేట్ చేసే ముఖ్యమైన తెలంగాణవాదులు ఆరోజు ఇంకా రోడ్డు ఎక్కనే లేదు. ఈ రాస్తారోకో ఏం చేయగలుగుతది. ఇంత పెద్ద పనిని ఎట్ల అనుకుంటుండగానే...ఎంత లేస్తరు? విరమించాలని పోలీసులు అంటనే ఉన్నరు...లేవాలని ఏ ఉపవూదవం ముంచుకురావద్దని, అందరినీ పక్కకు జరిపిం డ్రు. ఫర్వాలేదు, ఉన్నోళ్లమే ర్యాలీగా వెళ్లమన్నారు. ర్యాలీ మొదలయ్యింది. ఒక మలుపు పోయి సెంటర్‌కు వచ్చే సరికే విద్యుత్ ఉద్యోగుల ర్యాలీ వచ్చింది.... అమ్మయ్య! నిరసన తెలపడానికి కొంత మెరుగయ్యింది. కదా అనుకున్న. వాళ్లు అప్పటికే డప్పువాయిద్యాలు, మైక్ అన్నింటితో వచ్చిన్రు. మా తెలంగాణ పాటగాడు తేజ, డప్పు శేఖర్ చేరిన్రు. పాటతో, ఆటతో రోడ్డుపై వందలాది మందిని నిలబెట్టి అరుణోదయ రాయి కృష్ణ ఖమ్మంలో తెలంగాణ పోరు గర్జనలో కాలుకు గాయమై వారం రోజులు దాటి ఆపరేషన్ చేసుకుని ఆ రోజే బయలుదేరి వస్తున్న డు నకిరేకల్‌కు. ఇంటి పేరులోనే రాయి ఉంది. కనుక ముందే వచ్చి వుంటే నకిరేకల్ కేసులో చెరుకు సుధాకర్‌కు బదులు రాయి కృష్ణనే ఏ-వన్ అయ్యేవాడు. మా పాటల పెద్దక్కలు తెలంగాణ ఆడ బిడ్డలు.. వసంత, పుష్ప, సుకన్య, ఇంకా రాలేదు.

తేజ పాట అందుకున్నడు. మల్ల నకిరేకల్ రోడ్డు మీద తీన్‌మార్. జోరందుకున్నది. పెద్ద ర్యాలీ, ఎంత నెమ్మదిగా పోయినా బస్సులైతే నకిరేకల్‌కు చేరలేదు. సీఐతో ‘‘ఏం తమ్మీ! బస్సులు దబ్బున వస్తే మా నిరసన ఏదో తెలుపుతం కదా! అని అన నే అన్నాను. మీ నిరసన ఎటు దారి తీస్తదో డాక్టర్ గారూ! కంట్రోల్ తప్పితే, మీదే బాధ్యత డీఎస్పీ గారు గుర్తు చేస్తూనే ఉన్నారు. టీవీ9 నుంచి ఫోన్- ఆన్‌లైన్‌లో మాట్లాడాలని...చెప్పాల్సింది చెప్పి.. మీరు అడిగినట్లు పండుగకు వెళ్లే ఆంధ్రా ప్రయాణికుల మీద కాదమ్మా! వందలాది చిన్న ప్రైవేట్ వాహనాల్లో వేలాదిమంది వెళ్తున్నారు. ఎవ్వరినీ ఏమీ అనం కానీ, ఒక ఆర్గనైజ్‌డ్ ప్రైవేట్ సీమాంధ్ర ట్రాన్స్‌పోర్ట్ సెక్టార్. ఈ సమ్మెను ఆర్టీసీ కార్మికులను వెక్కిరించడానికి చేస్తున్న కుటిల ప్రయత్నం. ఇది. అందిన సమాచారం ప్రకారం... వస్తున్న 30 బస్సుల్లో కూడా ప్రయాణికులు ఎక్కువ ఏమీ లేరు. కిరణ్‌కుమార్‌డ్డి సీమాంధ్ర ప్రజల్ని తెలంగాణ డిమాండ్‌కు అనుకూలంగా ప్రిపేర్ చేయడం వదిలిపెట్టి తెలుగునేల మీద రెండు ప్రాంతాల ప్రజల మద్య చిచ్చు పెట్టడానికే చేస్తున్న కొత్త కుట్ర ఇది. తప్పకుండా సీమాంధ్ర బస్సులను అడ్డుకుంటాం. నిరసన తెలుపుతామని మాట్లాడి ముగించే సరికి..చాలా మంది తెలంగాణ ఉద్యమ దీక్షా శిబిరం దగ్గరకు వచ్చిండ్రు. అందరూ మైక్‌లో సకల జనుల సమ్మె తీరు, ప్రభుత్వ నిర్లక్ష్యం, మీద మాట్లాడినంక...ఆర్టీసీ కార్మికులు ‘‘బస్‌కా పయ్యా...నహీ చలేగీ’’ అని తెగేసి మేము ఈ దసరా పండుగ కు అర్థాకలితో మాడుతుంటే పూల పల్లకి లెక్కన ఈ ప్రైవేట్ బస్సులు రావడం, న్యాయమా? అని ప్రశ్నించి నినాదాలు ఇస్తున్నరు.

బస్సులు దగ్గరకు వచ్చిన వార్త రావడంతో 30 మీటర్ల పొడగయిన నల్ల జెండాతో వందల మందిమి రోడ్డుకు సమాంతరంగా లైన్ కట్టి నినాదాలిస్తూనే ఉన్నాం. జై తెలంగాణ నినాదాలతో మా నిరసన ప్రదర్శన ఉంటే, పోలీసులు, బార్డర్ పోలీస్, సీఆర్‌పీఎఫ్ దళాలు పొజిషన్ తీసుకున్నయ్. ఎటు చూసిన యుద్ధ వాతావరణాన్ని సృష్టించి ఎవరిని దగ్గరలో నిలబడకుండా జనాన్ని చెదరగొడుతూ నే ఉన్నాయి. పంద్రాగస్టు రోజు రాష్ట్రపతి ముందు పరేడ్ చేస్తున్న రంగురంగుల వాహనాల లెక్క బారులు తీరి ఆంధ్రా బస్సులే, పైలట్ జీపులతో, సైరన్‌తో సెంటర్‌కు చేరడంతోనే...ఒక్కసారి ఎదురుగా నిలబడ్డ మమ్మల్ని కమ్మేయడం, కుమ్మేయడం అన్ని జరిగిపోతూనే ఉన్నాయి. కిందపడ్డ నన్ను పట్టుకుని ఈడ్చుకొచ్చే ప్రయత్నం జరుగుతుండగానే ఒక పొలికేక....చెరుకు సుధాకర్‌ను పడేసింవూడురా! ఎయ్యండిరా!..అంతే పోలీసులతో పెనుగులాడుతూ...ఇంత మిలటరీ, పోలీసుల ముందు మా నిరసన శక్తి సరిపోదేమో అని మనసు నీరు కారుతుంటే...ధర్మాక్షిగహం కట్టలు తెంచుకున్న తెలంగాణ బిడ్డ ల ప్రతిఘటన... క్షణాల్లో బారులు కట్టిన పూల రధాలు, గరుడలు, అద్దాల మేడలు పగిలినట్టే....పల్ల పల్ల చప్పుడు...రాజ్యం ముందు నిరసన శక్తి సరిపోదేమోనని ఖిన్నిల్లిన నాకు మానుకోట ఆవహించిన మహిమ గల నకిరేకల్ రాళ్లు...యాైభై ఏండ్ల తండ్లాటను ఆరు వందల మంది బలిదానాల కడుపు కోతను రాజకీయ ఛట్రం నుంచి బయటకు రాక జనంపై రాళ్లు విసిరే ‘‘కిరాయి రాజకీయ మూకలకు’’ మూతోడ్ జవాబుగా విసురుతున్న రాళ్లు...సంప్రదాయంగా, నిరాయుధులమై ఇంకా రోజు దాటని గాంధీ జయంతి సత్యాక్షిగహ వారసులమై రోడ్డుపై నిలబడ్డప్పుడు...అన్నీ తామై...చేతిలోకి తీసుకున్న రాయి....అవును అక్టోబర్ విప్లవంలో వింటర్ ప్యాలెస్‌పై పేల్చిన మొదటి ఫిరంగిని మించి గుండెలను తట్టింది. మానని అణిచివేత గాయం. సాయుధమై నిలిచినట్లు...అవును నకిరేకల్ గడ్డ... మళ్లీ 2009ని మించి రాళ్లవాన కురిపించింది. ఎవరో చెపితే జరిగింది కాదు! ఎవరికి వాళ్లు కర్తవ్యమని చేతిలోకి తీసుకున్నది...ఇంకా చెవులను చీల్చుతున్న ‘‘రాక్ మ్యూజిక్’’ చట్టం తన పని తాను చేసుకొని జైళ్లో పెడితే అన్నంలో రాళ్లు కూడా అపురూపంగా కనపడి జైల్ బ్యారక్‌లోనూ స్టెప్పులేస్తున్న ‘‘ర్యాక్ మ్యూజిక్’’.

గిట్టని వాళ్లు దాన్ని ఎన్ని తిట్టి పోసినా...చెవిలో కొందరు నాతో అది ‘‘రాక్ మ్యూజిక్ మాత్రమే కాదన్నా...ఎంతో మందిని, పది జిల్లాల ప్రజల్ని ముగ్దుల్ని చేస్తున్న రాక్ మ్యూజిక్ అని, మరో మిలియన్‌మార్చ్ అని అంటూనే ఉన్నారు. బిడ్డ పెళ్లి పని చేసుకోకుండా...ఒకింత బాధ మధ్య...307 సెక్షన్ పెట్టిరి కదా! సెషన్స్ కోర్టు బెయిల్ ఎప్పుడో అని ఎదురు చూస్తూ’’ లెట్ దిస్ రాక్ మ్యూజి క్...అండ్ మ్యాజిక్ బెయిల్ అవుట్ మాగ్జిమమ్ ఆఫ్ లాంగ్ పెండింగ్’’ అనుకుంటున్నాను.
ఓపికగా మాతో ప్రవర్తించి మా జిల్లా ఎస్పీని ట్రాన్స్‌ఫర్ చేసి ఇప్పుడు ఎవరో గులాటినట లాఠీలాగ తిప్పమని కొత్త ఎస్పీగా తీసుకొస్తున్నరు..ఎంతో అభిమానంతో చూసుకునే సీఐకి గాయమైతే... ఒక్క ఉదుటున్నే కట్టు కట్టి కలత చెందిన ఆయన మీద మేము నలభై పైబడి తెలంగాణవాదులం హత్యా వూపయత్నం చేసినమట.

ఆంధ్రా డీఐజీ నకిరేకల్‌లో కూర్చొని అరెస్టు అయిన జేఏసీ చైర్మన్ పూజార్ల శంభయ్య, ఎంఈవో అంజయ్యసారు... ఆర్టీసీ డ్రైవర్ అబ్దుల్లా....యానాల లింగాడ్డి, మందుల షాపు కనకయ్య, వెంకన్న, గుండె జబ్బుతో ఓపెన్‌హార్ట్ సర్జరీ చేసుకున్న ఉపేందర్...నిన్న జైలుకు వచ్చిన ఇరవై మంది కాదని వంద మందిని పెడతానంటడు. ఉద్యోగ జేఏసీలను ముయ్యమంటడు, తానే జిల్లా ఇన్‌చార్జి ఎస్పీగా లాఠీ తిప్పుతుంటే, రాజీనామా లేఖను వీపుకు కట్టుకొని నోరు ఎత్తని ప్రజావూపతినిధులను చూసి జైల్లో ఉన్నా.... బయట ఉన్నా అసహనంగా ఉంది.
డాక్టర్ చెరుకు సుధాకర్
నల్లగొండ జైలు నుంచి

35

SUDHAKAR CHERUKU

Published: Sat,February 1, 2014 12:05 AM

పెద్దలసభలో పొలికేకకు.. తెలంగాణ పెద్దన్న

సరైన సమయంలో సరియైన నిర్ణయంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతుందని ఢిల్లీ పెద్దలు చెబితే ఎప్పుడు సరియైన సమయం అర్థం కాక పుష్కరకాలం ఎదురు

Published: Tue,December 31, 2013 04:12 AM

భూమిపుత్రుడు భూమన్న..

‘భూమికి పచ్చాని ఆకుల రంగేసినట్లు’ నేస్తమా! నీవు భూమ్మీ ద పుట్టి, పెరిగిన కానుంచి భూమి గురించే, భూమ్మీద మనుషుల గురించే ఆలోచించావు.

Published: Sun,May 19, 2013 02:17 AM

పాటకు పత్రహరితం కలేకూరి

‘కర్మభూమిలో పూసిన ఓ పువ్వు’ కోసం, ‘చుండూరు గుండె గాయం’ సర్వనామం చేసుకున్న ఓ దళితుని కోసం, ఎంత వెతుక్కున్నా, ఎన్ని ఉద్యమాలు చేసినా

Published: Wed,May 1, 2013 01:41 PM

ఏ తెలుగుజాతి ఉద్ధరణకు బాబూ!

ఏ ప్రిల్ 27న యాదృచ్ఛికమైనా మూడు పార్టీల నేతల సభలు ఒకే రోజు జరిగాయి. టీడీపీ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతలు చంద్రబాబు నాయుడు,

Published: Fri,April 5, 2013 11:36 PM

పాట గుండెను చీల్చే విఫలయత్నం

తెలంగాణ బతుకు చిత్రాన్ని, ఛిద్రాన్ని మూట గట్టుకున్న పాట. యాభై ఏండ్ల తెలంగాణ తండ్లాటను, ఆరవై ఆరేండ్ల ఈ దేశ స్వాతంవూతానంతర జనతంత్ర జ

Published: Tue,March 26, 2013 12:05 AM

సాంబశివుని ఉద్యమస్ఫూర్తి

సాంబశివుడు హత్యగావించబడి అప్పుడే రెండేళ్లు నిండినయ్. దోపిడీ పీడనపై శివమెత్తి ఆడినందుకు,కొన ఊపిరిదాకా జన ఉద్యమ పతాకను భుజాన మోసిన

Published: Thu,January 3, 2013 11:46 PM

చిత్తులేఖతో చిందులా!

కొత్త సంవత్సరంలో కొలువులు లేవని బాధపడకండి. మా నాయన పద్నాలుగు వంద ల కిలోమీటర్లు దాటిన పాదయావూతలో తెలంగాణలో చాలా దూరమే చాలా రోజులే న

Published: Fri,December 21, 2012 11:43 PM

నేతల మొసలి కన్నీరు, తెలంగాణ దుఃఖం

దుఃఖం కనుకొలకుల నుంచి జలజల రాలుతున్న కన్నీళ్ళు- ఎంత సముదాయించుకున్నా ఆగని దుఃఖం. కోట్లాది మంది టీవీ ప్రేక్షకులు అగ్రరాజ్యం అమెరికా

Published: Mon,December 17, 2012 01:45 AM

విగ్రహ ఆగ్రహం- తెలంగాణ

పా ర్లమెంటు ఆవరణలో ఎన్టీరామారావు విగ్రహ ఏర్పాటు నేపథ్యంలో చిన్నల్లుడు చంద్రబాబు, మరో అల్లుడు దగ్గుపాటి, కూతురు పురం దరేశ్వరి, ఎన

Published: Fri,November 9, 2012 01:20 AM

పుష్కరకాల ఉద్యమ పునశ్చరణ

తెలంగాణ రాష్ట్ర సమితి కార్యవర్గం, శాసనసభ్యులు, పొలిట్‌బ్యూరో రెండురోజులు కరీంనగర్‌లో జరిగింది. సభ ప్రారంభం కాగానే యావత్ ప్రతినిధుల

Published: Sat,November 3, 2012 12:04 AM

నల్ల చట్టాలు, నిర్బంధపు నీడలు..

నవంబర్ నెల పేరులోని మొదటి అక్షరం ‘న’, ‘నల్ల’ విశేషణలోని మొదటి అక్ష రం ‘న’ ఒక్కటే కావడం యాధృచ్ఛికం అయినా చెప్పాల్సిన ముచ్చట్లు చాలా

Published: Thu,November 1, 2012 12:02 AM

విద్రోహపు చీకటి

ఐదున్నర దశాబ్దాల సీమాంధ్ర కబ్జా గురించి చెప్పుకోకుండా నవంబర్ 1 ఆంధ్రవూపదేశ్ అవతరణ దినోత్సవం గురించి ఏమీ చెప్పుకోలేం. నమ్మించి, హామ

Published: Sun,October 28, 2012 12:10 AM

చంద్రయానం- షర్మిల బాణం- తెలంగాణం

చంద్రబాబు చంద్రయానం ‘వస్తున్నా మీ కోసం !’ రాజోలిబండ నుంచి ప్రవేశించి ఐదు రోజులయ్యింది. కర్నూల్ జిల్లా నుంచి రాజోలి డైవర్షన్ స్కీం

Published: Wed,October 10, 2012 07:27 PM

సౌ సాల్ సిల్‌సిలా

చార్ సౌ సాల్ షహర్- హైదరాబాద్ బార్ బార్ కోషిష్ చేసినా దొరకని దక్కన్ కోహినూర్ వజ్రం.. నేల రాలింది. తెలంగాణ బడే దిల్‌వాలా! సౌ స

Published: Sat,October 6, 2012 03:43 PM

జయశంకర్ జననం తెలంగాణకు వేడుక

‘అతని జననం ఒక తల్లి వేడుక.. అతని మరణం వేల తల్లుల సామూహిక వేదన.. అంటాడు ఓ కవి. జయశంకర్‌సార్ జననం అలాంటిది. సాధారణ వ్యక్తుల జననం సీద

Published: Sat,October 6, 2012 03:43 PM

ప్రజారోగ్యంపై పాలకుల కుట్ర

లాభాపేక్షతో కూడిన కార్పొరేట్, ప్రైవేట్ వైద్య పద్ధతుల్లో మునిగి తేలితే డాక్టర్ బిదాన్ చంద్రరాయ్ జయంతి, వర్ధంతిరోజు అయిన జూలై ఒకటికి

Published: Sat,October 6, 2012 03:44 PM

అత్యున్నత పదవికి అర్హుడు కాదు

పింటో కో గుస్సా క్యోం హోతాహై’ హిందీలో సూపర్‌హిట్ చిన్న బడ్జెట్ సిని మా ఉన్నది. అందులో పింటో కు రోడ్ మీద వెళుతున్నప్పుడు ట్రాఫిక్ ర

Published: Sat,October 6, 2012 03:44 PM

ప్రజల రేపటి కల పరకాల

పరకాలలో గులాబీ జెండా గెలుపు రెపపల సందర్భంలో ఇది రేపటి కల ఎట్లవుతుంది? ఎవరైనా ఇట్లా ప్రశ్నించవచ్చు. కానీ అనేక ఉప ఎన్నికల్లో మిశ్రమ

Published: Sat,October 6, 2012 03:44 PM

చేపమందు చేదైన వలస పాలన

దక్కన్ నడ్డిగడ్డన నూట ఆరవై సంవత్సరాల పైబడిన, ఉబ్బసవ్యాధికి ఉపశమనమిస్తుందనే చేపమందు సీమాంధ్ర విజ్ఞాన సంస్థలు, మీడియా, ప్రభుత్వం క్ర

Published: Sat,October 6, 2012 03:45 PM

పోరు కల- పరకాల

తెలంగాణ ఉద్యమసాధనలో తెలంగాణ రాష్ట్రసమితి ముందుండి పోరాడుతున్నది. ఈక్రమంలో టీఆర్‌ఎస్‌పై ఎందరో ఎన్నో నిం దలు వేశారు. ఎన్నికలతో ఆడుకు

Published: Sat,October 6, 2012 03:45 PM

అస్తిత్వాల సింగిడి వీరన్న

భారత విప్లవోద్యమ శిబిరంలో 1996లో ఎర్రజెండా అంచుల నిండా అస్తిత్వ నక్షవూతాలు నింపి, ఎదురీత తెరచాప నీలిరంగుల్ని భాగస్వామ్యం చేసి‘కుల-

Published: Sat,October 6, 2012 03:46 PM

హక్కుల జాడ - బుర్ర రాములు

ఆదివారం-ఉదయం ఫోన్‌లో మిస్డ్ కాల్ చూసి ఫోన్ చేసిన అవతలి వైపు నుంచి ‘నేను సుధాకర్! ఎట్లున్నవ్’ అనగానే ఎవరు? అని మళ్ళీ అడిగిన. ‘నేన