పెద్దలసభలో పొలికేకకు.. తెలంగాణ పెద్దన్న


Sat,February 1, 2014 12:05 AM

సరైన సమయంలో సరియైన నిర్ణయంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతుందని ఢిల్లీ పెద్దలు చెబితే ఎప్పుడు సరియైన సమయం అర్థం కాక పుష్కరకాలం ఎదురు చూసి నం.1995 నుంచే మలిదశ తెలంగాణ ఉద్యమం ఊపందుకున్నా,2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావంతో తెలంగాణ రోడ్‌మ్యాప్ గాడిలో పడింది. 2009తో శిఖర స్థాయికి చేరి తెలంగాణ సమాజాన్ని ఏకధవంగా పేనుతున్న సమయంలో ఉప ఎన్నికల విజయాలకు మించి పాలకపక్షం నుంచే ఇక మా వశం కాదు ! సరి అయిన సమయం సమీప గమ్యంలో లేదని 2013 మే నెలలో ఏకంగా నాలుగు దశాబ్దాలు పైబడిన అనుబంధాన్ని, ఉన్నత స్థాయి పదవుల్ని కాదని కాంగ్రెస్‌ను వీడి వచ్చి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరినవారు, మన తెలంగాణ పెద్దన్న కే కే. అంటే కట్టలు తెంచుకున్న కే కే అసహనం తెలంగాణకు కేక అయ్యింది, కాంగ్రెస్‌లో కాక పుట్టింది. కేకే కాస్తా తెలంగాణకు ఆత్మీయంగా పిలిచే కా కా కూడా అయ్యిండు.

కేకే తోపాటు గత్యంతరం లేక ఇద్దరు ఎంపీలు వివేక్, మంద జగన్నాధం కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పవలసి వచ్చింది. పార్లమెంట్ మెట్ల మీద జై తెలంగాణ ఫ్లకార్డ్ పట్టుకున్న, టెన్ జనపధ్‌కు పోయి అధినేత్రికి పలుసార్లు విన్నవించినా జరగని పరిణామాలు జ్ఞానీ జైల్‌సింగ్ దేశానికి అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే ఢిల్లీలో కాంగ్రెస్‌కు ప్రముఖంగా ఉండి, ఎన్నో కేంద్ర పదవుల్ని అలంకరించిన కంచర్ల కేశవరావు అలియాస్ కే కే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ స్థాయి నుంచి తెలంగాణ ఇవ్వక నిర్బంధించే అధిష్ఠానం జైల్ ఎందుకని బయటకు వస్తే చాలా జ్ఞానోదయమయ్యింది కాంగ్రెస్ అదిష్ఠానానికి.

1972లో జాతీయ కనీస వేతనాల బోర్డు చైర్మన్‌గా ఉండి, 1979లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా ఉండి, 1979-85 మధ్య రెండుసార్లు ఎమ్మెల్సీగా ఉండి, 1980 నుంచి పరిశ్రమలు, విద్య, కార్మికశాఖ, క్యాబినెట్ మినిష్టర్‌గా ఉండి, రాజీవ్ విద్యామిషన్‌కు చైర్మన్‌గా ఉండి, 2006లో రాజ్యసభ మెంబర్‌గా ఉండి, అనేక కేంద్ర అధ్యయన, నిర్వహ ణ కమిటీలో విస్తత సేవలు అందించి అనేక భాషల్లో, విషయాల్లో కొలు వదగ్గ లోతుల్లో అపార జ్ఞాన సంపద ఉండి, అనేక పుస్తకాలు, విశ్లేషణలు రాసి జాతీయ అవార్డు తెలుగు సినిమా నిమజ్జనంకు నిర్మాత గా ఉండి, ఇంత కాంగ్రెస్ నిండుకుండ అనుబంధాన్ని తెలంగాణ కోసమే నిమజ్జనం చేసిన దర్శకుడు, దార్శనికుడు కేశవరావుని రాజ్యసభకు అభ్యర్ధిగా టి.ఆర్.ఎస్ నిర్ణయించి బరిలోకి దించి తన ఇరవై ఒక్క శాసనసభ్యుల తోపాటు సహకారమందించిన సి.పి.ఐ నలుగురు ఎమ్మెల్యేలను కలుపుకొని నామినేషన్ వేసింది.

పలు నాటకీయ పరిణామాలతో తెలుగు నేలపై అంతరించే ప్రమాదమున్న సరభి నాటక మండలిని మించి అసెంబ్లీ శాసన మండలి ముందుకుపోతున్న తరుణంలో కాంగ్రెస్ నుంచి ముగ్గురు, టీడీపీ నుంచి ఇద్దరు, టీఆర్‌ఎస్ నుంచి కేకే రాజ్యసభ బరిలో ఉన్నారు. స్వతంత్రమో, సమైక్యమో, ఏదో పేరుతో మరొకరు బరిలో ఉన్నాడు

కాంగ్రెస్ తెలంగాణ నుంచి పోటీ చేయించిన రాజ్యసభ అభ్యర్ధి ఎం.ఏ ఖాన్‌కు, టి.ఆర్.ఎస్ పోటీ పెట్టిన అభ్యర్థి కేకే కు గెలవడానికి చెరి 37 మంది శాసనసభ్యుల ఓటు కావాలి. టి.ఆర్.ఎస్, సి.పి.ఐ శాసనసభ్యులు 25 మందికి తోడు 12 మంది ఇతరుల నుంచి రావాలి. హైదరాబాద్ నుంచే గెలిచినా, ఉన్న ఒక్క ఓటు సమన్యాయం అన్న చంద్రబాబు అడిగిండు గనుక అంటే వేస్తనంటడు సీమాంధ్ర సమన్యాయం బాగా సమజ్ చేసుకున్న లోక్‌సత్తా జయప్రకాశ్ నారాయణ హైదరాబాద్‌కు యూనియన్ టెర్రిటరీ చేస్తమన్న ప్రతిపాదనలు చేస్తే హైదరాబాద్ ఎవరి కష్టార్జితమో విప్పి చెప్పిన మజిస్‌పార్టీ ఉన్న ఏడు ఓట్లు కేకే కు వేయాలని కోరుకుందాం. కాంగ్రెస్ వారి అభ్యర్ధికి వేసే 37 ఓట్లు పోను ఉన్న 13 ఓట్లను నిండు శాసనసభ సీమాంధ్ర, తెలంగాణ నిట్లనిలువునా చీలిన సమయంలో ఏవిధమైన శషబిషలు లేకుండా కేకేకు వేస్తేనే పెద్దల సభకు పోయేది. ఇన్ని పక్షపాతాలు, కుట్రలు కండ్లార చూసి, చెవులారా విని, తామే సాక్షీభూతంగా నిలిచిన సమయంలో ఇక తెలంగాణ బిల్లు పెట్టే సమయంలో రేపటి తెలంగాణపై పెద్దల సభలో గొంతు విప్పడానికి తెలంగాణ పెద్దన్న ఒకరు కావాలంటే విజ్ఞతతో, సోయితో కే కే కు ఓటు వేయాలి.


కేశవరావు జాతీయ పార్టీ కాంగ్రెస్ వదిలిపెట్టి, సముద్రం వదిలి పెట్టి పిల్ల కాలువలోకి వస్తున్నాడని, దారులు తనకు తానే మూసుకుంటున్నాడ ని కొందరు, దొరల గడీలకు పోయి ఆగమయితున్నడని, చాలా అన్నరు. కేకే వస్తాడా? ఉట్టి పుకారా అన్నరు. పుకారు కాదు. నా చావుతో అయినా తెలంగాణ రావాలని రాసే ఆత్మ బలిదానాల కంటే నా యాభై ఏండ్ల కాంగ్రెస్ అనుబంధ నిష్ర్కమణ అదిష్ఠానానికి ఒక కుదుపు, కనువిప్పు కావాలని కే కే ధైర్యంగా బయటకు వచ్చిండు.వందల మీటింగ్‌లలో మాట్లాడిండు. తెలంగాణ పునర్నిర్మాణానికి ఏం చేస్తే బాగుంటుందో కేసీఆర్ మొదలు అనేక మందితో చర్చించిండు. వేయి మంది బలిదానాలతో నివ్వెరబోయిన కాంగ్రెస్ కే కే ఇద్దరు ఎంపీల నిష్ర్కమణతో 2014 ఎన్నికల రిపోర్టులతో జూలై 30 నిర్ణయం ప్రకటించింది. తెలంగాణ బిల్లు అటక ఎక్కించారేమే కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటున్నప్పుడు ఆగమేఘాల మీద సి.డబ్ల్యు.సి నిర్ణయానికి, ఆంటోని కమిటీ ఏర్పాటుకు క్యాబినెట్ మీటింగ్ కు కే కే. ఇద్దరు ఎంపీలు జెట్‌స్పీడ్ కలుగ చేసిండ్రు. టి.ఆర్.ఎస్ కేశవ రావును పార్టీ సెక్రటరీ జనరల్ చేసింది. రాజ్యసభకు నిలబెట్టింది.

మద్దతు తెలిపిన సి.పి.ఐకి కేసీఆర్‌యే స్వయాన కతజ్ఞతలు తెలిపారు.బి.జె.పి.ని ఓటు వేయమని, కాంగ్రెస్‌ను సహకరించమని టి.ఆర్.ఎస్ విజ్ఞప్తి చేస్తుంది. తెలంగాణను అడ్డుకోవడానికి సీమాంధ్ర నేతలు చేస్తున్న అనేక కుట్రలను చూస్తున్నాం. అసెంబ్లీలో టీ బిల్లుపై చర్చ ముగిసింది. ఇక తెలంగాణ బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే కీలక సమయంలో రేపటి తెలంగాణపై పెద్దల సభలో గొంతు విప్పడానికి తెలంగాణ పెద్దన్న ఒకరు కావాలంటే విజ్ఞతతో, సోయితో కేశవరావుకు గారికి ఓటు వేయాలి. నిజమే, బియ్యంలో మెరుగలు ఏరడానికి పెద్దలసభలో ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను వినిపించ డానికి కే కే తెలంగాణకు ఒక అవసరం ఒక అనివార్యం.
-డాక్టర్ చెరుకు సుధాకర్
టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యులు

325

SUDHAKAR CHERUKU

Published: Tue,December 31, 2013 04:12 AM

భూమిపుత్రుడు భూమన్న..

‘భూమికి పచ్చాని ఆకుల రంగేసినట్లు’ నేస్తమా! నీవు భూమ్మీ ద పుట్టి, పెరిగిన కానుంచి భూమి గురించే, భూమ్మీద మనుషుల గురించే ఆలోచించావు.

Published: Sun,May 19, 2013 02:17 AM

పాటకు పత్రహరితం కలేకూరి

‘కర్మభూమిలో పూసిన ఓ పువ్వు’ కోసం, ‘చుండూరు గుండె గాయం’ సర్వనామం చేసుకున్న ఓ దళితుని కోసం, ఎంత వెతుక్కున్నా, ఎన్ని ఉద్యమాలు చేసినా

Published: Wed,May 1, 2013 01:41 PM

ఏ తెలుగుజాతి ఉద్ధరణకు బాబూ!

ఏ ప్రిల్ 27న యాదృచ్ఛికమైనా మూడు పార్టీల నేతల సభలు ఒకే రోజు జరిగాయి. టీడీపీ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతలు చంద్రబాబు నాయుడు,

Published: Fri,April 5, 2013 11:36 PM

పాట గుండెను చీల్చే విఫలయత్నం

తెలంగాణ బతుకు చిత్రాన్ని, ఛిద్రాన్ని మూట గట్టుకున్న పాట. యాభై ఏండ్ల తెలంగాణ తండ్లాటను, ఆరవై ఆరేండ్ల ఈ దేశ స్వాతంవూతానంతర జనతంత్ర జ

Published: Tue,March 26, 2013 12:05 AM

సాంబశివుని ఉద్యమస్ఫూర్తి

సాంబశివుడు హత్యగావించబడి అప్పుడే రెండేళ్లు నిండినయ్. దోపిడీ పీడనపై శివమెత్తి ఆడినందుకు,కొన ఊపిరిదాకా జన ఉద్యమ పతాకను భుజాన మోసిన

Published: Thu,January 3, 2013 11:46 PM

చిత్తులేఖతో చిందులా!

కొత్త సంవత్సరంలో కొలువులు లేవని బాధపడకండి. మా నాయన పద్నాలుగు వంద ల కిలోమీటర్లు దాటిన పాదయావూతలో తెలంగాణలో చాలా దూరమే చాలా రోజులే న

Published: Fri,December 21, 2012 11:43 PM

నేతల మొసలి కన్నీరు, తెలంగాణ దుఃఖం

దుఃఖం కనుకొలకుల నుంచి జలజల రాలుతున్న కన్నీళ్ళు- ఎంత సముదాయించుకున్నా ఆగని దుఃఖం. కోట్లాది మంది టీవీ ప్రేక్షకులు అగ్రరాజ్యం అమెరికా

Published: Mon,December 17, 2012 01:45 AM

విగ్రహ ఆగ్రహం- తెలంగాణ

పా ర్లమెంటు ఆవరణలో ఎన్టీరామారావు విగ్రహ ఏర్పాటు నేపథ్యంలో చిన్నల్లుడు చంద్రబాబు, మరో అల్లుడు దగ్గుపాటి, కూతురు పురం దరేశ్వరి, ఎన

Published: Fri,November 9, 2012 01:20 AM

పుష్కరకాల ఉద్యమ పునశ్చరణ

తెలంగాణ రాష్ట్ర సమితి కార్యవర్గం, శాసనసభ్యులు, పొలిట్‌బ్యూరో రెండురోజులు కరీంనగర్‌లో జరిగింది. సభ ప్రారంభం కాగానే యావత్ ప్రతినిధుల

Published: Sat,November 3, 2012 12:04 AM

నల్ల చట్టాలు, నిర్బంధపు నీడలు..

నవంబర్ నెల పేరులోని మొదటి అక్షరం ‘న’, ‘నల్ల’ విశేషణలోని మొదటి అక్ష రం ‘న’ ఒక్కటే కావడం యాధృచ్ఛికం అయినా చెప్పాల్సిన ముచ్చట్లు చాలా

Published: Thu,November 1, 2012 12:02 AM

విద్రోహపు చీకటి

ఐదున్నర దశాబ్దాల సీమాంధ్ర కబ్జా గురించి చెప్పుకోకుండా నవంబర్ 1 ఆంధ్రవూపదేశ్ అవతరణ దినోత్సవం గురించి ఏమీ చెప్పుకోలేం. నమ్మించి, హామ

Published: Sun,October 28, 2012 12:10 AM

చంద్రయానం- షర్మిల బాణం- తెలంగాణం

చంద్రబాబు చంద్రయానం ‘వస్తున్నా మీ కోసం !’ రాజోలిబండ నుంచి ప్రవేశించి ఐదు రోజులయ్యింది. కర్నూల్ జిల్లా నుంచి రాజోలి డైవర్షన్ స్కీం

Published: Wed,October 10, 2012 07:27 PM

సౌ సాల్ సిల్‌సిలా

చార్ సౌ సాల్ షహర్- హైదరాబాద్ బార్ బార్ కోషిష్ చేసినా దొరకని దక్కన్ కోహినూర్ వజ్రం.. నేల రాలింది. తెలంగాణ బడే దిల్‌వాలా! సౌ స

Published: Sat,October 6, 2012 03:43 PM

జయశంకర్ జననం తెలంగాణకు వేడుక

‘అతని జననం ఒక తల్లి వేడుక.. అతని మరణం వేల తల్లుల సామూహిక వేదన.. అంటాడు ఓ కవి. జయశంకర్‌సార్ జననం అలాంటిది. సాధారణ వ్యక్తుల జననం సీద

Published: Sat,October 6, 2012 03:43 PM

ప్రజారోగ్యంపై పాలకుల కుట్ర

లాభాపేక్షతో కూడిన కార్పొరేట్, ప్రైవేట్ వైద్య పద్ధతుల్లో మునిగి తేలితే డాక్టర్ బిదాన్ చంద్రరాయ్ జయంతి, వర్ధంతిరోజు అయిన జూలై ఒకటికి

Published: Sat,October 6, 2012 03:44 PM

అత్యున్నత పదవికి అర్హుడు కాదు

పింటో కో గుస్సా క్యోం హోతాహై’ హిందీలో సూపర్‌హిట్ చిన్న బడ్జెట్ సిని మా ఉన్నది. అందులో పింటో కు రోడ్ మీద వెళుతున్నప్పుడు ట్రాఫిక్ ర

Published: Sat,October 6, 2012 03:44 PM

ప్రజల రేపటి కల పరకాల

పరకాలలో గులాబీ జెండా గెలుపు రెపపల సందర్భంలో ఇది రేపటి కల ఎట్లవుతుంది? ఎవరైనా ఇట్లా ప్రశ్నించవచ్చు. కానీ అనేక ఉప ఎన్నికల్లో మిశ్రమ

Published: Sat,October 6, 2012 03:44 PM

చేపమందు చేదైన వలస పాలన

దక్కన్ నడ్డిగడ్డన నూట ఆరవై సంవత్సరాల పైబడిన, ఉబ్బసవ్యాధికి ఉపశమనమిస్తుందనే చేపమందు సీమాంధ్ర విజ్ఞాన సంస్థలు, మీడియా, ప్రభుత్వం క్ర

Published: Sat,October 6, 2012 03:45 PM

పోరు కల- పరకాల

తెలంగాణ ఉద్యమసాధనలో తెలంగాణ రాష్ట్రసమితి ముందుండి పోరాడుతున్నది. ఈక్రమంలో టీఆర్‌ఎస్‌పై ఎందరో ఎన్నో నిం దలు వేశారు. ఎన్నికలతో ఆడుకు

Published: Sat,October 6, 2012 03:45 PM

అస్తిత్వాల సింగిడి వీరన్న

భారత విప్లవోద్యమ శిబిరంలో 1996లో ఎర్రజెండా అంచుల నిండా అస్తిత్వ నక్షవూతాలు నింపి, ఎదురీత తెరచాప నీలిరంగుల్ని భాగస్వామ్యం చేసి‘కుల-

country oven

Featured Articles