హక్కుల జాడ - బుర్ర రాములు


Sat,October 6, 2012 03:46 PM

ఆదివారం-ఉదయం ఫోన్‌లో మిస్డ్ కాల్ చూసి ఫోన్ చేసిన అవతలి వైపు నుంచి ‘నేను సుధాకర్! ఎట్లున్నవ్’ అనగానే ఎవరు? అని మళ్ళీ అడిగిన. ‘నేను స్వరూపక్కను-బుర్ర రాములు మిసెస్‌ను’అన్నది. మే 14న వరంగల్‌లో ఇంటి దగ్గర అంద రు కలుసుకొని సాయంత్రం కాకతీయ విశ్వవిద్యాలయం దగ్గర మొదటి వర్ధంతి సభ జరుపుకోవాలి రమ్మని చెప్పింది.
చూస్తుండగానే తెలంగాణ మట్టిపరిమళం వరంగల్ ఖిల్లాను లాల్‌ఖిల్లాగా ఎత్తిపట్టి-పదుల ఆకురాలు కాలాల మధ్య జనవసంతమై పుష్పించి, మోదుగుపూల జ్ఞాపకాల్లో ఎప్పటికీ జీవించే బుర్ర రాములన్న చనిపోయి అప్పుడే సంవత్సరమైంది. మే14కు మూడు రోజుల ముందే, నేను ప్రొఫెసర్.వినయ్‌బాబు,చంద్రమౌళి వెళ్ళి హాస్పిటల్‌లో క్యాన్సర్ వ్యాధి విస్తరించి, శ్వాస కష్టతరం అవుతున్న సమయంలో చెయ్యి అందిస్తే,గుర్తు పట్టినట్లు సైగ చేసి చేయి నిమిరి, శాశ్వతంగా మనల్ని వదిలిపోయిన రాములన్నకు, ఆయనకంటే తొమ్మిది నెలలు ముందే చనిపోయిన బాలగోపాల్ గురించి రాసిన మాటల్లోనే‘నిను యాది చేసుకుంటూ.. నీ దారిలో నడుస్తాం’ అంటూ స్మరించి ఆచరణకు పూనుకోవాలే.రాములన్న నాకు దీర్ఘకాల మిత్రుడు.అడుగడుగున ఆచరణను ప్రశ్నిస్తూ’ బుర్రను విడువని వొడవని ముచ్చట.

గాంధీ మెడికల్ కాలేజీ వైద్య విద్యకాలం నుంచి ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎంత నిర్బం ధం వచ్చినా ఖిల్లావరంగల్‌కు కొండగుర్తు లెక్క మిగిలిన బుర్ర రాములన్న తెలంగాణ మొండి గోడ. తాళ్ళు ఎక్కి కల్లుగీసి మోకుముస్తాదుతో, మొండికేసిన వాళ్ళు తాతలు, తండ్రుల మొం డితనంతో, పోరాటాల జెండా కింద జమైన జనం తన్మయత్వంతో జమిలిగా మిగిలిన జ్ఞాపకాల జాడ. ఈ మధ్యనే ఉస్మానియా అరుణతార జార్జిడ్డి 40వ వర్ధంతి సభలను హైదరాబాద్‌లో జరుపుకునేప్పుడు జ్ఞానేశ్వర్‌కీర్తి రాసి న ‘జార్జి ! నువ్వు అందించిన కొడవలి కొస నుంచి పిడి వరకు చేరుకున్నం. బిగించిన పిడికిలి వదలం’అన్న కవితా పంక్తు ల్ని గుర్తు చేసుకున్నరు. జార్జిహత్య చేయబడ్డట్టే జ్ఞానేశ్వర్ కీర్తి,కొండయ్య గుండాలదాడుల్లో నిలువునా అగ్నికి ఆహుతయ్యారు.అక్కడ అగ్గిలో బొగ్గు ను గుండెల్లో నింపుకున్న బుర్ర రాములు, పీడీఎస్‌యు మొదలు చాలా దూరం ప్రయా ణం చేశాడు. కోటగల్లి, హన్మకొండ, వర్ధన్నపేట మొదలు ఇయన కలెతిరిగని తెలు గు ప్రాంతం లేదు. బీడీ కార్మికుల్ని, హమాలీలను మొదలు వందలమంది బుద్ధిజీవుల్ని, విద్యావంతుల్ని ఉద్యమబాటల్లో హక్కుల దుక్కుల్లోకి గుంజుకొచ్చినవాడు. బుర్ర రాములు. విద్యార్థి నుంచి కాకతీయ యూ నివర్సిటీ ప్రొఫెసర్ అయ్యేదాక ఎక్కడ వరంగల్‌ను వదలకుండా గోదావరి తీ రం దాటి,ఏటూరునాగారం దాటి ఛత్తీస్‌గఢ్, సిరోంచా,ఒడిషా,కాశ్మీర్, ఢిల్లీ, కర్ణాటక అన్నీ కలెతిరిగి,బాలగోపాల్, హరగోపాల్, కన్నబీరన్, జీవన్‌కుమార్ ఇతర హక్కులనేతలతో తెలంగాణ ఉద్యమంలో మమేకమై ఎప్పటికి మరిచిపోని నేతగా మిగిలినాడు. జార్జి హత్య చేయబడితే కవిత్వం రాసి ఉద్యమించి, హత్య కు గురికాబడ్డ జ్ఞానేశ్వర్ కీర్తి లెక్కనే, శివసాగర్ మాటల్లో రాజ్యం విసిరిన కత్తులకు గాయపడ్డ పక్షులకు, రాలిపడిన గడ్డిపూలకై, పరితపించి, రాజ్యం ప్రకోపంలోనే ఎప్పుడో అసాధారణ, ముందస్తు మృత్యువుకు బలవుతారనుకున్న బాలగోపాల్ బుర్ర రాములు కొద్దికాలం తేడా తో అకాలమరణానికి గురికావడం గుండెల్లో గునపంతో పొడిచినంత బాధ.

మానవహక్కుల ఉద్యమంలో అంతర్జాతీయంగా పేరు తెచ్చుకున్న మనకాలం మహామనిషి బాలగోపాల్‌కు తోడు బుర్ర రాములు చనిపోవడం ఇంకా కుంగదీసే అంశం. యాధృచ్చికమైనా సంవత్సరంలో పాలకులు ప్రజల మీద కొనసాగిస్తున్న అడ్డుఅదుపులేని గ్రీన్‌హంట్, ట్రెజర్‌హంట్ హింస గురించి నిరసించే, ప్రతిఘటించే ప్రజా ఉద్యమం లేకపోవడం ఇంకా బాధ పెట్టింది. హక్కుల ఉద్యమం ఇప్పుడిప్పు డే బలంగా అడుగులు వేస్తున్నది. నాలాంటి వాన్ని అకారణంగా వరంగల్ జైళ్లో వేస్తే బాలగోపాల్, బుర్ర రాములు స్ఫూర్తే తెలంగాణ అం తా భగ్గున మండింది.ఇస్తమన్న తెలంగాణ మాట తప్పితే ఈసర్కార్‌ను నిలదీయాలని, కొనసాగతున్న తెలంగాణ బిడ్డల బలిదానాలు పాలకుల హత్యలేనని దేశవ్యాప్తంగా నిలదీస్తున్నది వాళ్ల స్ఫూర్తే .
సూరపనేని జనార్దన్‌లు, మారోజు వీరన్న లు, బుర్ర రాములు క్యాంపస్ కెరటాలై ఎగిసి న తెలంగాణ త్యాగాల చాల్లలో పోరు విత్తనాలే గాని బలిదానాల విత్తులుకాదని చాటే రోజు మే14. మృత్యుశిఖరంపై యుద్ధ ఫిరం గిలా శత్రు శిబిరంలో సివాపూత్తిన సివంగిలా సవాలు విసిరిన బుర్ర రాములుకు నివాళులర్పించేటప్పుడు ప్రజా తెలంగాణ ఆకాంక్షను గుండెలనిండా నింపుకుందాం.

-డాక్టర్ చెరుకు సుధాకర్
టీఆర్‌ఎస్, పొలిట్‌బ్యూరో సభ్యులు

35

SUDHAKAR CHERUKU

Published: Sat,February 1, 2014 12:05 AM

పెద్దలసభలో పొలికేకకు.. తెలంగాణ పెద్దన్న

సరైన సమయంలో సరియైన నిర్ణయంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతుందని ఢిల్లీ పెద్దలు చెబితే ఎప్పుడు సరియైన సమయం అర్థం కాక పుష్కరకాలం ఎదురు

Published: Tue,December 31, 2013 04:12 AM

భూమిపుత్రుడు భూమన్న..

‘భూమికి పచ్చాని ఆకుల రంగేసినట్లు’ నేస్తమా! నీవు భూమ్మీ ద పుట్టి, పెరిగిన కానుంచి భూమి గురించే, భూమ్మీద మనుషుల గురించే ఆలోచించావు.

Published: Sun,May 19, 2013 02:17 AM

పాటకు పత్రహరితం కలేకూరి

‘కర్మభూమిలో పూసిన ఓ పువ్వు’ కోసం, ‘చుండూరు గుండె గాయం’ సర్వనామం చేసుకున్న ఓ దళితుని కోసం, ఎంత వెతుక్కున్నా, ఎన్ని ఉద్యమాలు చేసినా

Published: Wed,May 1, 2013 01:41 PM

ఏ తెలుగుజాతి ఉద్ధరణకు బాబూ!

ఏ ప్రిల్ 27న యాదృచ్ఛికమైనా మూడు పార్టీల నేతల సభలు ఒకే రోజు జరిగాయి. టీడీపీ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతలు చంద్రబాబు నాయుడు,

Published: Fri,April 5, 2013 11:36 PM

పాట గుండెను చీల్చే విఫలయత్నం

తెలంగాణ బతుకు చిత్రాన్ని, ఛిద్రాన్ని మూట గట్టుకున్న పాట. యాభై ఏండ్ల తెలంగాణ తండ్లాటను, ఆరవై ఆరేండ్ల ఈ దేశ స్వాతంవూతానంతర జనతంత్ర జ

Published: Tue,March 26, 2013 12:05 AM

సాంబశివుని ఉద్యమస్ఫూర్తి

సాంబశివుడు హత్యగావించబడి అప్పుడే రెండేళ్లు నిండినయ్. దోపిడీ పీడనపై శివమెత్తి ఆడినందుకు,కొన ఊపిరిదాకా జన ఉద్యమ పతాకను భుజాన మోసిన

Published: Thu,January 3, 2013 11:46 PM

చిత్తులేఖతో చిందులా!

కొత్త సంవత్సరంలో కొలువులు లేవని బాధపడకండి. మా నాయన పద్నాలుగు వంద ల కిలోమీటర్లు దాటిన పాదయావూతలో తెలంగాణలో చాలా దూరమే చాలా రోజులే న

Published: Fri,December 21, 2012 11:43 PM

నేతల మొసలి కన్నీరు, తెలంగాణ దుఃఖం

దుఃఖం కనుకొలకుల నుంచి జలజల రాలుతున్న కన్నీళ్ళు- ఎంత సముదాయించుకున్నా ఆగని దుఃఖం. కోట్లాది మంది టీవీ ప్రేక్షకులు అగ్రరాజ్యం అమెరికా

Published: Mon,December 17, 2012 01:45 AM

విగ్రహ ఆగ్రహం- తెలంగాణ

పా ర్లమెంటు ఆవరణలో ఎన్టీరామారావు విగ్రహ ఏర్పాటు నేపథ్యంలో చిన్నల్లుడు చంద్రబాబు, మరో అల్లుడు దగ్గుపాటి, కూతురు పురం దరేశ్వరి, ఎన

Published: Fri,November 9, 2012 01:20 AM

పుష్కరకాల ఉద్యమ పునశ్చరణ

తెలంగాణ రాష్ట్ర సమితి కార్యవర్గం, శాసనసభ్యులు, పొలిట్‌బ్యూరో రెండురోజులు కరీంనగర్‌లో జరిగింది. సభ ప్రారంభం కాగానే యావత్ ప్రతినిధుల

Published: Sat,November 3, 2012 12:04 AM

నల్ల చట్టాలు, నిర్బంధపు నీడలు..

నవంబర్ నెల పేరులోని మొదటి అక్షరం ‘న’, ‘నల్ల’ విశేషణలోని మొదటి అక్ష రం ‘న’ ఒక్కటే కావడం యాధృచ్ఛికం అయినా చెప్పాల్సిన ముచ్చట్లు చాలా

Published: Thu,November 1, 2012 12:02 AM

విద్రోహపు చీకటి

ఐదున్నర దశాబ్దాల సీమాంధ్ర కబ్జా గురించి చెప్పుకోకుండా నవంబర్ 1 ఆంధ్రవూపదేశ్ అవతరణ దినోత్సవం గురించి ఏమీ చెప్పుకోలేం. నమ్మించి, హామ

Published: Sun,October 28, 2012 12:10 AM

చంద్రయానం- షర్మిల బాణం- తెలంగాణం

చంద్రబాబు చంద్రయానం ‘వస్తున్నా మీ కోసం !’ రాజోలిబండ నుంచి ప్రవేశించి ఐదు రోజులయ్యింది. కర్నూల్ జిల్లా నుంచి రాజోలి డైవర్షన్ స్కీం

Published: Wed,October 10, 2012 07:27 PM

సౌ సాల్ సిల్‌సిలా

చార్ సౌ సాల్ షహర్- హైదరాబాద్ బార్ బార్ కోషిష్ చేసినా దొరకని దక్కన్ కోహినూర్ వజ్రం.. నేల రాలింది. తెలంగాణ బడే దిల్‌వాలా! సౌ స

Published: Sat,October 6, 2012 03:43 PM

జయశంకర్ జననం తెలంగాణకు వేడుక

‘అతని జననం ఒక తల్లి వేడుక.. అతని మరణం వేల తల్లుల సామూహిక వేదన.. అంటాడు ఓ కవి. జయశంకర్‌సార్ జననం అలాంటిది. సాధారణ వ్యక్తుల జననం సీద

Published: Sat,October 6, 2012 03:43 PM

ప్రజారోగ్యంపై పాలకుల కుట్ర

లాభాపేక్షతో కూడిన కార్పొరేట్, ప్రైవేట్ వైద్య పద్ధతుల్లో మునిగి తేలితే డాక్టర్ బిదాన్ చంద్రరాయ్ జయంతి, వర్ధంతిరోజు అయిన జూలై ఒకటికి

Published: Sat,October 6, 2012 03:44 PM

అత్యున్నత పదవికి అర్హుడు కాదు

పింటో కో గుస్సా క్యోం హోతాహై’ హిందీలో సూపర్‌హిట్ చిన్న బడ్జెట్ సిని మా ఉన్నది. అందులో పింటో కు రోడ్ మీద వెళుతున్నప్పుడు ట్రాఫిక్ ర

Published: Sat,October 6, 2012 03:44 PM

ప్రజల రేపటి కల పరకాల

పరకాలలో గులాబీ జెండా గెలుపు రెపపల సందర్భంలో ఇది రేపటి కల ఎట్లవుతుంది? ఎవరైనా ఇట్లా ప్రశ్నించవచ్చు. కానీ అనేక ఉప ఎన్నికల్లో మిశ్రమ

Published: Sat,October 6, 2012 03:44 PM

చేపమందు చేదైన వలస పాలన

దక్కన్ నడ్డిగడ్డన నూట ఆరవై సంవత్సరాల పైబడిన, ఉబ్బసవ్యాధికి ఉపశమనమిస్తుందనే చేపమందు సీమాంధ్ర విజ్ఞాన సంస్థలు, మీడియా, ప్రభుత్వం క్ర

Published: Sat,October 6, 2012 03:45 PM

పోరు కల- పరకాల

తెలంగాణ ఉద్యమసాధనలో తెలంగాణ రాష్ట్రసమితి ముందుండి పోరాడుతున్నది. ఈక్రమంలో టీఆర్‌ఎస్‌పై ఎందరో ఎన్నో నిం దలు వేశారు. ఎన్నికలతో ఆడుకు