తెలంగాణ తొలి పోరాట కవి రుక్నుద్దీన్


Wed,May 29, 2013 12:23 AM

kavi
1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి తెలుగు సాహిత్యంలో చిరస్థాయిని, శాశ్వతత్వాన్ని కల్పిస్తూ ‘విప్లవ ఢంకా’ మోగించిన రుక్నుద్దిన్ కలం, గళం మూగపోయింది. ఆయన గుజరాత్‌లో డాక్టర్‌గా పనిచేస్తున్న తన కుమారుడు గాలిబ్ వద్ద సోమవారం కన్నుమూశారు. వలసాంధ్ర పాలకుల ఆధిపత్యాన్ని తన అక్షరాలతో బోనులో నిలబెట్టడమే గాకుండా, ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నందుకు జైలు శిక్ష సైతం అనుభవించాడు. కవిగా అక్షరాలను సంధించడమే గాకుండా, మహబూబ్‌నగర్ జిల్లా అంతటా తిరిగి తన మాటలతో ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసిండు.కేవలం 22 యేండ్ల వయసులో మొత్తం పాలమూరు జిల్లా అంతటా తిండి తిప్పలు లేకుండా రాత్రనకా పగలనకా తిరుగుతూ ఉద్యమానికి ఊపిరిపోసిన రుక్నుద్దిన్ కవిగా, రచయితగా, ఉద్యమకారుడిగా, పరిశోధకుడిగా, ప్రొఫెసర్‌గా తెలంగాణ ముఖచివూతానికి మెరుగైన రంగుల్ని అద్దిండు. అచ్చంపేట, కల్వకుర్తి, నాగర్‌కర్నూలు, మహబూబ్‌నగర్‌లు ఆయన కార్యక్షేవూతాలుగా ఉండేవి. పాలెం ఓరియంటల్ కళాశాలలో బిఓఎల్ చదువు తూ గురువు శ్రీరంగాచార్య ప్రోత్సా హం, గైడెన్స్‌లో ఉద్యమ కవిత్వాన్ని, కరపవూతాల్ని రాసిండు. మిత్రుడు, క్లాస్‌మేట్, రూమ్‌మేట్ కూడా అయిన జి. యాదగిరితో కలిసి కవిత్వాన్ని పుస్తకం గా తీసుకొచ్చిండు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఊపుమీద ఉన్న దశలోనే అప్పుచేసి ‘విప్లవ ఢంకా’ పేరుతో కవిత్వాన్ని పుస్తకంగా తీసుకొచ్చిండ్రు. ఈ అప్పు ని ఉద్యోగాలు వచ్చిన తర్వాత తీర్చామని నాటి ఉద్యమస్ఫూర్తిని, చైతన్యాన్ని రుక్నుద్దిన్ సహ రచయిత అయిన జి.యాదగిరి ఇప్పటికీ ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటారు.

తండ్రి, అన్న కమ్మరి పనిచేసి రుక్నుద్దిన్‌ని చదివించారు. దానికి తగ్గట్టుగానే చదువులో పాలెం కళాశాల నుంచి ఉస్మానియా విశ్వవిద్యాలయం లో మొదటి స్థానాల్లో నిలిచేవారు. పాలెంలో రుక్నుద్దిన్ క్లాస్‌మేట్‌లు, రూమ్మేట్లు వామపక్ష ఉద్యమాలతో పెనవేసుకున్న జి.యాదగిరి ఒక రు కాగా మరొకరు రైటిస్ట్ తెలుగు ప్రొఫెసర్ కసిడ్డి వెంకటడ్డి. మొదట తెలుగు పండితుడిగా టీచర్ ఉద్యోగంలో చేరిన రుక్నుద్దిన్ పోల్కంపల్లి, మాసపేట తదితర గ్రామాల్లో పనిచేశాడు. అనంతరం 1976లో జూనియర్ లెక్చరర్‌గా ఎంపికై జడ్చర్ల, మఖ్తల్, కల్వకుర్తి, భువనగిరి తదితర ప్రాంతాల్లో పనిచేశారు. సంస్కృతంలో కూడా ఎమ్మే చేసిన రుక్నుద్దిన్ 1989లో ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో అసిస్టెంట్ రీడర్‌గా జాయినై ఎందరో విద్యార్థులకు మార్గదర్శకంగా నిలిచాడు. తాను జూనియర్ కాలేజీలో ఉన్నప్పటి నుంచి కూడా విద్యార్థులకు తలలో నాలుకలా ఉండడమే గాకుండా వారికి అన్నివిధాల సహాయ సహకారాలందించే వారు. తన విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు తన చేతనైన సాయం జేసేవాడు. ఈయన నేతృత్వంలో ఎందరో విద్యార్ధులు, ఎంఫిల్, పి.హెచ్‌డీ పట్టాలను పొందారు. చందాల కేశవదాసు మీద జరిగిన పరిశోధనకు కూడా రుక్నుద్దిన్‌గారే గైడ్‌గా వ్యవహరించారు. లౌకిక, ప్రజాస్వామిక, ప్రగతిశీల భావాల మూలంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎబీవీపీ విద్యార్ధుల నుంచి దాడు ల్ని కూడా ఎదుర్కొన్నాడు. ఎన్ని అవరోధాలు ఎదురైనా తాను నమ్మి న సిద్ధాంతాన్ని ఆచరించిన ధైర్యశాలి రుక్నుద్దిన్. కులాలు, మతాల పట్టింపులు ఏ మాత్రం లేని రుక్నుద్దిన్‌కు ఇద్దరు కుమారులు, ఒక్క కూతురు. కొడుకు మతాంతర వివాహాన్ని కూడా ఆయన ఆహ్వానించాడు. 1947లో కల్వకుర్తి తాలూకా రాచూరులో చాంద్‌బీ, జహంగీర్ దంపతులకు జన్మించిన రుక్నుద్దిన్ విద్యార్థి దశలో అత్యంత పేదరికం అనుభవించాడు. ఆకలి, కసి, తెలంగాణపై సీమాంవూధుల ఆధిపత్యం ఆయన్ని పోరాట కవిగా తీర్చిదిద్దాయి. విద్యార్థిగా ఉన్నప్పుడే గుళ్ళు, చెరువు గట్లమీద శాసనాలను సేకరించి పరిశోధన చేసేవాడు. అలాగే 1984లో తెలుగులో జానపద సాహిత్యంలో అలంకార విధానంపై పరిశోధన చేసిండు. విశ్వదర్శనం గేయ సంపుటి. రిట్మైంట్ సందర్భంగా ప్రయాణం పేరిట తాను నడిచివచ్చిన దారిని గుర్తు చేసుకుంటూ పుస్తకాన్ని వెలువరించారు.


‘తెలంగాణము’ నా జన్మ హక్కని
తెలిసి చాటవోయీ!
దుష్ట శత్రువుల కరకర గోయుచు
దును మాడుమురోయీ!

మృతవీరుల హృదయాంత రంగముల ముచ్చట గూర్చోయీ! అంటూ ఆనాడు కవిత్వాన్ని ఆయుధంగా మలిచి ఆధిపత్యాంవూధులపై ప్రయోగించాడు. ఇట్లా అనేక కవితలు ‘విప్లవ ఢంకా’లో చోటు చేసుకున్నాయి. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సందర్భంగా తెలుగులో సాహిత్యం వెలువడలేదని సీమాంధ్ర సాహిత్యకారులు, చరివూతకారులు, విమర్శకులు అవాకులు చవాకులు పేలుతున్న సందర్భంలో ఆనాటి ఉద్యమ కవిత్వాన్ని వెలుగులోకి తీసుకురావడానికి మిత్రుడు సుంకిడ్డి నారాయణడ్డితో కలిసి నేను ప్రయత్నం చేశాను. ఈ ప్రయత్నంలో భాగంగానే ‘1969-73 తెలంగాణ ఉద్యమ కవిత్వం’ పుస్తకాన్ని వెలువరించడం జరిగింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కవిత్వం రాసిన తొట్ట తొలికవుల్లో రుక్నుద్దిన్‌ది అద్వితీయస్థానం. ‘సింగిడి’ తెలంగాణ రచయితల సంఘం తరపున ముస్లిం ప్రత్యేక సంచికను తెస్తున్నాం, దానికి మీరు మార్గదర్శన చేయాలని అడిగినప్పుడు, అవసరమైన మంచి పని చేస్తున్నారు, నా సహాయ సహకారాలు తప్పకుండా ఉంటాయి. అయితే నేనిప్పుడు మా కొడుకు దగ్గరికి అమెరికాకు వెళ్తున్నాను తిరిగి వచ్చిన తర్వాత కలుద్దాం కలకాలం నిలిచిపోయేలా సంచికను తీసుకొద్దాం అని చెప్పిన రుక్నుద్దిన్ అమెరికా నుంచే అనారోగ్యంతో వచ్చారు. అక్కడి వాతావరణం సరిపడక అస్వస్థులయ్యారు. చివరకు అదే అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన ఆశించిన ప్రత్యేక తెలంగాణ సాధన, అందుకు కవులుగా, రచయితలుగా ఎవరికీ, దేనికీ తలవంచకుండా పోరాడడమే ఆయనకిచ్చే నిజమైన నివాళి..

- సంగిశెట్టి శ్రీనివాస్
9849220321


35

SRINIVAS SANGISETTI

Published: Thu,April 7, 2016 12:02 AM

ఉర్దూ రచయితలు ముద్దాయిలా?

ఈరోజు ఉర్దూ భాషలో రాసిన వారికోసం తీసుకొచ్చిన నిబంధన రేపు దక్షిణాది భాషలైన తమిళం, మళయాలం, కన్నడ, తెలుగు భాషలపై కూడా రుద్దొచ్చు. ఎంద

Published: Mon,November 9, 2015 11:23 PM

ఆత్మగౌరవాన్ని చాటిన్రు

భ్రమలు తొందరగా నే పటాపంచలయినై. మీ(మో)డీయా మాయ లో మోడీ(మూఢ)త్వాని కి పట్టంగట్టి పట్టుమని 16 నెలలు కూడా కాలే దు. మతోన్మాద అసహనానికి,

Published: Sat,July 25, 2015 12:03 AM

బాబూ నీకో దండం! దయచేయండి!!

అందుకే అయ్యా మీరు మా హైదరాబాద్ జోలికి, ఊసుకు రాకుంటేమీకు దండం పెడ్తం. ఇంకో తొమ్మిదేండ్లు సుట్టాల తీరుగ హైదరాబాద్‌ల ఉంటే ఉండ్రుండి

Published: Wed,August 6, 2014 02:29 AM

తెలంగాణ మశాల్ జయశంకర్

ఆధునిక తెలంగాణచరిత్ర అన్ని మలుపుల్లో నూ దారి చూపిన దార్శనికుడు కొత్తపల్లి జయశంకర్ సార్. హైదరాబాద్ రాష్ట్రానికి ఆంధ్రోళ్ళ దోపిడీ పీ

Published: Sun,June 15, 2014 01:19 AM

హద్దులుదాటిన ఆంధ్ర మీడియా

దశాబ్దాలుగా తెలంగాణ ప్రజల్ని బానిసలుగా చూసిన, రాసిన, చూపెట్టిన సీమాంధ్ర మీడియా అగ్రకుల అహంకారంతో వ్యవహరిస్తుంది. ఇన్నేండ్లు

Published: Tue,September 3, 2013 12:27 AM

ఆంధ్ర పెత్తనంపై తొలి ధిక్కారం

పోలీసు చర్య ద్వారా భారతదేశంలో హైదరాబాద్‌ని విలీనం చేసుకున్న తర్వా త ఈ ప్రాంతంలో వచ్చిన మొట్టమొదటి ప్రజా పోరాటం ‘ముల్కీ ఉద్య మం’.

Published: Wed,January 30, 2013 11:14 PM

ఆధిపత్యవాదుల ఆయుధం అబద్ధం

ఇక ‘ప్రత్యేక తెలంగాణ’కల సాకారమైతుందనుకున్న ప్రతిసారీ ‘ఆధిపత్య’ సీమాం ధ్ర దోపిడీదార్లు, వారి తాబేదార్లు అబద్ధాల్ని అతిగా ప్రచారం

Published: Thu,January 3, 2013 02:07 PM

బానిస రచయితలకు సాహిత్య బహిష్కరణ

కోతకొచ్చిన తెలంగాణ పంటకు తెగులు పట్టుకుంది. ‘ప్రపంచ తెలుగు’ సభల పేరిట తెలంగాణకు పట్టిన ఈతెగులును సమూలంగా నిర్మూలిం చనట్లయితే అది త

Published: Sat,October 6, 2012 03:48 PM

దళితోద్యమ వేగుచుక్క

భారతదేశ దళితోద్యమంలోనే వేగుచుక్క భాగ్యడ్డి వర్మ. 1906లో హైదరాబాద్ కేంద్రంగా ‘జగన్మివూతమండలి’ స్థాపించి దళితజాతి చైతన్యానికి పాదులు

Published: Sat,October 6, 2012 03:49 PM

తెలంగాణ సాపెన

తెలంగాణ మొత్తం ఇయ్యాళ తుక్క తుక్క ఉడుకుతుంది. ఆసరయితడనుకున్న కొడుకు అంటుపెట్టుకొని ‘జై తెలంగాణ’ అంటూ కాలిపోతుండు. పానాల్దీసుకున్న

Published: Sat,October 6, 2012 03:49 PM

ప్రతీకల్ని మార్చుకుందాం..

త్యాగానికి ప్రతీక శ్రీరాములు’ (ఈ నెల 24) పేరిట రాసిన వ్యాసానికి స్పందన ఇది. కరీంనగర్‌కు చెందిన పొట్టి శ్రీరాములు ఫౌండేషన్ చైర్మన్

Published: Sat,October 6, 2012 03:51 PM

తెలంగాణ భూమి పుత్రిక

తన చరివూతను తాను తిరగరాసుకుంటున్న తెలంగాణ నేడు మరుగున పడేసిన అణిముత్యాలను వెలికి తీస్తున్నది. ముళ్లకంచెలు సాపుచేసి పోరుదారులేసిన త

Published: Sat,October 6, 2012 03:50 PM

హస్తినలో కాదు హైదరాబాద్‌లోనే చర్చలు

ఢిల్లీని హైదరాబాద్‌కు రప్పించాల్సిన అవసరముంది. ఒక్క ఎంపీ కూడా లేని చిరంజీవితో మాట్లాడ్డానికి ఆంటోని లాంటి అధిష్ఠానం దూతలు ఆగమేఘాల

Published: Sat,October 6, 2012 03:49 PM

ఉద్యమాన్ని సాయుధంచేసిన దొడ్డికొమురయ్య

నాటి తెలంగాణ ఉద్యమానికి పురుడు పోసిన యోధుల్లో ముందు వరుసలో నిలిచి, నేటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ప్రేరణగా నిలిచిన వాడు దొడ్డికొ