డైనమిజానికి ప్రతీక


Sun,February 25, 2018 01:31 AM

యువనేతలో తెలంగాణ ఒక డైనమిజాన్ని చూస్తున్నది. ఆయనలో క్లాస్ కంటే మాస్ లీడర్‌గా మరింత బలంగా ఉన్నాడు. తెలంగాణ పునర్ నిర్మాణ పథకాల రచనలో యువనేత సేవలూ ఉన్నాయి. వరంగల్ టెక్స్‌టైల్ పార్క్, మిషన్ భగీరథ మొదలు పెట్టడం, వీటన్నిటికి మించి పేద ఆడబిడ్డల పెళ్ళిళ్లకు ప్రభుత్వ సహాయ కార్యక్రమానికి కల్యాణలక్ష్మి పేరును ప్రతిపాదించింది కూడా ఈ యువనేతే. దీన్నిబట్టి ఆయనలో మాస్ లీడర్ ఎంత బలంగా ఉన్నాడో ఎవరికైనా అర్థమవుతుంది.

తరాలు మారుతున్నాయి. ఆలోచనలు మారుతున్నాయి. ప్రపంచ పరివర్తన వేగాన్ని అందుకోవడమే నేటి తరాని కి ఒక అనివార్యత. అది సమాజమా, రాజకీయ మా, ప్రభుత్వమా అని కాదు. వేగం అన్ని వ్యవస్థలకు అనివార్యమైపోయింది. ఒక ఉద్యోగి తన స్కిల్స్‌తో పని వేగం పెంచాలి, ఒక ప్రభుత్వం పని తనంలో వేగం చూపాలి. రాజకీయం ఆలోచన ల్లో వేగం పెంచాలి. వాటన్నిటి ఫలితాలే సమాజ గమనాన్ని నిర్దేశిస్తాయి. టాలెంటెడ్ ఉద్యోగి ఒక కంపెనీకి ఎంత అవసరమో, ప్రపంచ పరివర్తనను ప్రజలకు అందించడానికి పాలకుల్లో డైనమిజం అంతే అవసరం. దేశంలో రాజకీయవ్యవస్థ కూడా రోజురోజుకు పరివర్తన చెందుతున్నది. పోటీ ప్రపంచ గమనాన్ని తన ప్రజలకూ అందించగలిగే సమర్థ పాలకులు కావాలనే కోరిక ఈ తరం ప్రజల్లో బాగా పెరుగుతున్నది. అకడమిక్ విద్య కంటే, వృత్తి విద్యకే ఈ తరం బాగా మొగ్గు చూపుతుండటం అందరికీ తెలిసిందే. సుమారు 8 లక్షల మందికి పైగా తెలంగాణ యువత విదేశాల్లో ఉద్యోగాలు చేయడమో, విద్య కోసం వెళ్లడమో, స్థిరపడడమో జరిగింది. దీని వేగం రెండు దశాబ్దాలుగా బాగా పెరిగింది, పెరుగుతూనే ఉన్నది. గత మూడేళ్లలో దేశంలో అన్నిరాష్ర్టాల కన్నా తెలంగాణ ఐటీ రంగం ఐదు శాతం అభివృద్ధి చెందుతుండటాన్ని గమనిస్తే ఉపాధి కల్పనలో తెలంగాణ వేగాన్ని గమనించొచ్చు. పరివర్తనకు తగ్గ నాయకత్వాన్ని సమాజం ఎప్పుడూ కోరుకుంటుంది.

ఐటీ రంగంలో హైదరాబాద్ నగరానికి మేమే పేరు తెచ్చామనే వాళ్లు ఉండొచ్చు. కానీ రాష్ట్ర విభజన జరిగితే నగరం దివాళా తీస్తుందని చెప్పినోళ్లు ఉన్నారు. విభజన జరిగిన తొలినాళ్లలో నగరంలోని పారిశ్రామికవేత్తలకు తెలంగాణ ప్రభుత్వం తరఫున బలమైన భరోసా కల్పించడంలో కేటీఆర్ చేసిన కృషి ఎవరూ కాదనలేనిది. కొట్లాట పారిశ్రామికవేత్తలతో కాదు, పాలనాపరమైన దోపిడీదారులతోనే అనే ఉద్యమకాలం నాటి కేసీఆర్ మాటను నిలబెట్టడంలో కేటీఆర్ విజ యం సాధించారు. హైదరాబాద్ నుంచి ఒక్క పెట్టుబడిదారుడు కూడా తెలంగాణ సరిహద్దులు దాటి బయటికి అడుగుపెట్టలేదు. కేటీఆర్ పాలనా సమర్థతకు అది మొదటి విజయం. విభజన కాలం నాడు తెలంగాణ వ్యతిరేకులు సృష్టించిన అపోహలను పటాపంచలు చేయడంలో ఆయన పూర్తి విజయం సాధించారు. సంపద సృష్టికర్తలంతా హైదరాబాద్‌ను వదిలేసి విశాఖకు తరలిపోతారని చెప్పినోళ్లు, ఇవాళ గుడ్లప్పగించి చూస్తున్నారు. ఎవరూ ఊహించని ప్రపంచస్థాయి సంస్థలు గూగుల్, అమెజాన్, ఫేస్‌బుక్ వంటి కంపెనీలు హైదరాబాద్‌కు తరలివచ్చాయి. నాలుగేండ్లలో కొత్తగా లక్ష కోట్లకు పైగా పెట్టుబడులతో నాలుగువేలకు పైగా పరిశ్రమలు రావడం మామూలు విషయం కాదు. వాటి ద్వారా ఉపాధి అవకాశాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా నాలుగు లక్షలకు పైగా పెరుగుతున్నాయి.

ఇంతటి పాలనాపరమైన సత్పలితాలు సాధించడంలో కేసీఆర్ విధానపరమైన చర్యలున్నాయి. ప్రపంచ పెట్టుబడులు తెలంగాణ దారి పట్టడానికి టీఎస్ ఐపాస్ బాగా పనిచేసింది. అయితే ఇన్వెస్టర్లకు పాలనా పరమైన ఇబ్బందులు లేకుండా, అవినీతికి ఆస్కారం లేకుండా పరిశ్రమల అనుమతులను సులభతరం చేసి దాన్ని మానిటరింగ్ చేయడంలో పరిశ్రమల మంత్రి కేటీఆర్ పడుతున్న శ్రమ అంతకన్నా విలువైంది. పెట్టుబడులను ఆకర్షించడంలో అప్పటి ఉమ్మడి రాష్ట్రం దేశం లో 13వ స్థానంలో ఉండేది. ఇవాళ పెట్టుబడులను ఆకర్షించడంలో దేశంలో తెలంగాణ మొదటి స్థానానికి చేరింది. ఇది ఎవరో చెపుతు న్న విషయం కాదు, స్వయాన భారత ప్రభుత్వం చెపుతున్న విష యం. కేవలం నాలుగేండ్లలో తెలంగాణ ఇంతటి అద్భుతాన్ని సాధించడం పరిశ్రమల యువ మంత్రి పాలనా సామర్థ్యానికి ఒక కొలమానం. దాన్నే డైనమిజం అంటున్నాం.

టాలెంట్ అనే పదం సహజంగా విద్యార్థుల ప్రతిభకు సంబంధించి వాడుతుంటాం. కానీ రాజకీయ రంగంలో, పాలనా రంగంలో టాలెంటే కొలమానమవుతున్న కాలమిది. రాజకీయాన్ని వృత్తిగా చేపట్టడం సహజంగా జరుగుతుంది. కానీ పాలనా పరంగానూ టాలెంట్‌ను చాటుకోవడమనేదే పొలిటికల్ కెరీర్‌లో కీలకం. అందు నా కొత్త రాజకీయ తరం పనితనానికి టాలెంటే గీటురాయి. రాజకీయాల్లో కొత్త తరం యువనేతలు పెరుగుతున్నారు. అందులో టాలెంట్ ఉన్న యువనేతలు ప్రపంచ పరివర్తన వేగాన్ని అందుకోగలుగుతున్నారు. ప్రపంచ నూతన ఆవిష్కరణల ఫలాలను ప్రజలకు అందించగలుగుతున్నారు.

ఈ నాలుగేండ్లు జాతీయ, అంతర్జాతీయ సదస్సులకు తెలంగాణ వేదికగా మారింది. ఆ సదస్సులు మన రాష్ర్టానికి తేవడంలో యువ మం త్రికి అడ్మినిస్ట్రేషన్‌ను నడుపడంలో ఉన్న స్కిల్స్, పొలిటికల్ టాలెంట్ బాగా ఉపయోగపడ్డాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి మొదలు కుంటే మొన్నటి వరల్డ్ ఐటీ కాంగ్రెస్, నిన్నటి బయోఏషియా సదస్సు దాకా ప్రపంచ ప్రతిష్ఠాత్మక సదస్సులు తెలంగాణలో జరిగాయంటే కేటీఆర్‌లో బెస్ట్ పొలిటీషియన్, బెస్ట్ అడ్మినిస్ట్రేటర్‌నూ చూడొచ్చు. నాస్కామ్ ఇండియా 25 ఏండ్లుగా ముంబైని వదిలేసి బయట సదస్సుల్లో ఎన్నడూ భాగస్వామి కాలేదు. అలాంటి నాస్కామ్‌ను కూడా వరల్డ్ ఐటీ కాంగ్రెస్ సదస్సులో భాగస్వామిని చేస్తూ హైదరాబాద్‌కు తేవడంలో కేటీఆర్ సమర్థతను గుర్తించకతప్పదు. కేటీఆర్ మంచి ఉపన్యాసకుడు కూడా. ఎదుటివారిని మెప్పించి ఒప్పించే సామర్థ్యం ఆయనలో ఆపారం. కేటీఆర్‌కు పని పట్ల ఉన్న కమిట్‌మెంట్, విశ్వసనీయతలే ఆయనకు జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి అనేక అవార్డులను తెచ్చిపెట్టాయి.
రాజకీయాల్లో పదకొండేళ్ల అనుభవం. పరిపాలనలో నాలుగేండ్ల అనుభవం. ప్రపంచ, దేశ, ప్రాంత గమనాన్ని తక్కువ కాలంలోనే ఎక్కువ అర్థం చేసుకున్నారు. ఒక యువనేతలో ఇన్ని లక్షణాలను ఒకేసారి చూడటం చాలా అరుదు. అందుకే ప్రధాని, కేంద్ర మంత్రు లు కేటీఆర్‌ను ఆదరిస్తుంటారు. తెలంగాణ సమస్యలను, పాలనా పరమైన పనులను కాదనలేని రీతిలో ప్రజెంట్ చేయడంలో ఆయన దిట్ట అని ఢిల్లీలో మంత్రులు, అధికారులు ప్రశంసిస్తుంటారు.

చాలమంది సీఎంలకు వారసులుంటారు. కానీ అందరూ ఎదిగిరాలేరు. అవకాశాలు కలిసొచ్చినా ఎదిగిరావడమనేది అంత సులభం కాదు. రాజకీయాల్లో టాలెంట్, అడ్మిస్ట్రేషన్‌ను నడపడంలో స్కిల్స్ ఉన్నపుడే ఎదిగిరావడం సులభం. కేటీఆర్‌లో ఉన్న ప్రత్యేకత అదే. మీడియా ఇంటర్వ్యూలలో తన రాజకీయ ఎదుగుదల గురించి చాలాసార్లు స్పష్టంగా చెప్పిన సందర్భాలూ ఉన్నాయి. నేను కేసీఆర్ కుమారుడిని కాబట్టే రాజకీయంగా అవకాశం వచ్చిన మాట నిజం. అలాగే సమర్థ ఉద్యమ నాయకుడి, సమర్థ పాలకుడైన కేసీఆర్ కుమారుడిగా గర్విస్తాను. కేసీఆర్ గారు అవకాశమిచ్చారు. కానీ ఎదిగిరావడమనేది మాత్రం నా సమర్థతపైనే ఆధారపడింది అని విస్పష్టంగా వినమ్రంగా చెబుతారు.
srinivas-reddy
యువనేతలో తెలంగాణ ఒక డైనమిజాన్ని చూస్తున్నది. ఆయనలో క్లాస్ కంటే మాస్ లీడర్‌గా మరింత బలంగా ఉన్నాడు. తెలంగాణ పునర్ నిర్మాణ పథకాల రచనలో యువనేత సేవలూ ఉన్నాయి. వరంగల్ టెక్స్‌టైల్ పార్క్, మిషన్ భగీరథ మొదలు పెట్టడం, వీటన్నిటికి మించి పేద ఆడబిడ్డల పెళ్ళిళ్లకు ప్రభుత్వ సహాయ కార్యక్రమానికి కల్యాణలక్ష్మి పేరును ప్రతిపాదించింది కూడా ఈ యువనేతే. దీన్ని బట్టి ఆయనలో మాస్ లీడర్ ఎంత బలంగా ఉన్నాడో ఎవరికైనా అర్థమవుతుంది.

యువ నేత సోషల్ మీడియా ద్వారా పబ్లిక్ రిలేషన్‌ను బాగా పెంచుకున్నారు. సామాన్యులు సైతం ట్వీట్ చేస్తే స్పందిస్తుంటారు. వారి సమస్యలను పరిష్కరిస్తుంటారు. ఆదుకుంటుంటారు. యువనేతకు ప్రజలకు మధ్యన సోషల్ మీడియా వారధిలా పనిచేస్తున్నది. ఆమేరకు ప్రజాసంబంధాలు బాగానే ఉన్నాయి. కానీ ప్రత్య క్ష ప్రజాసంబంధాలే మరింత మెరుగు పడాల్సిన అవసరం ఉన్నది. టెక్నాలజీ ఉపయోగాన్ని సామాన్యుడికి సైతం అందుబాటులోకి తేవడంలో ఆయన అభిరుచి కాదనలేనిది. పొలంలో రైతును సైతం కొత్త టెక్నాలజీతో అనుసంధానం చేసి సమస్యలను పరిష్కరించే కాలం రాబోతున్నది. కొత్త తరం కొత్త ఆలోచనలే రేపటి తెలంగాణను ఆవిష్కరించడం ఖాయం. అలాంటి మాస్ డైనమిక్ పాలనే తెలంగాణ అభివృద్ధికి బలమైన బాటలు వేస్తుంది.
kallurisreddy@gmail.com

624

SRINIVAS REDDY KALLURI

Published: Tue,October 16, 2018 03:29 PM

సంపద సృష్టికే అప్పులు

అప్పులు ఎప్పుడూ సంపద సృష్టికి మాత్రమే ఉపయోగించాలనేది సంక్షేమ రాజ్య పాలకుడికి ఉండాల్సిన సహజ లక్షణం. ఈ లక్షణం కేసీఆర్ అనే పాలకుడిలో

Published: Fri,July 7, 2017 01:04 AM

రైతు లక్షణం ఇంకా రాదా?

2022 వరకు వ్యవసాయాన్ని ఇప్పటికన్నా రెండింతల లాభాల బాట పట్టిస్తామని కొన్నాళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీపదేపదే చెబుతున్నారు. కానీ ఆచరణ

Published: Sat,February 18, 2017 01:37 AM

సృజనాత్మక వక్త

భూమిపై సగం, ఆకాశంలో సగం అని చెపితే సరిపోయేది కాదు. ఆర్బీఐ గవర్నర్‌తో సమానమైన బాధ్యతను ఈ దేశ మహిళ నిర్వహిస్తున్నదని చెప్పడమే కవిత ప

Published: Tue,February 7, 2017 01:46 AM

సహకారానికి ఉపకారమేది?

దేశంలో ఒక విశ్వసనీయ పాలకుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్‌ను ప్రధాని మోదీ ప్రశంసలతో ముంచెత్తితే సరిపోదు. కేసీఆర్ విశాల దృక్పథానికి అన

Published: Fri,January 6, 2017 11:54 PM

‘దేశీ’ తెలంగాణ స్ఫూర్తి

ప్రపంచీకరణ ప్రయాణంలో దేశీ ఆలోచనలతో బాధితులను కాపాడుకోవాలనే స్పృహ ఒక నిజమైన దేశీయ పాలకుడికి ఉండాల్సిన లక్షణం. ఆ లక్షణాన్ని ఇపుడు మ

Published: Tue,November 29, 2016 12:53 AM

రెండున్నరేండ్ల సమర్థత

గతంలో దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీకి గ్యారంటీ ఇవ్వగానే బ్యాంకులు ఒప్పేసుకొని మాఫీ చేసిన సందర్భాలున్నాయి. కానీ కేసీఆర్ ప

Published: Tue,November 22, 2016 12:02 AM

నోట్ల రద్దుపై వాస్తవ వైఖరి

ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై రకరకాల అభిప్రాయాలున్నాయి. ప్రజల అభిప్రాయం ఎలా ఉందనే కన్నా ముందు రాజకీయ

Published: Sat,October 22, 2016 01:23 AM

చెరువును చంపొద్దు

వర్షాలు ఇంత భారీగా పడినా కూడా మా ఊరి చెరువులోకి చుక్క నీరు రాలేకపోయింది. దాంతో మా ఊరి చెరువు కింద మరో మూడు ఊర్లకు చెందిన గొలుసుకట్

Published: Wed,October 5, 2016 03:43 AM

మోదీ వ్యూహాత్మక పయనం

నిజానికి కశ్మీరీలు అమాయకులు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే హిందూ యాత్రికులను గుర్రాలపై, బగ్గీలపై తీసుకెళ్లేది కశ్మీరీ ముస్లిం సోదరులే.

Published: Fri,September 16, 2016 01:23 AM

నీటి హక్కుపై నియంత్రణా?

రాష్ట్ర విభజన డ్రాఫ్ట్ బిల్లులో రెండు నదులపై యాజమాన్య బోర్డులు పెట్టాలనే ప్రతిపాదనను ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌తో సహా యావత్ తెలంగాణ బు

Published: Tue,August 9, 2016 01:17 AM

కేసీఆర్-మోదీ: తెలంగాణ

రాజకీయాలకతీతంగా దేశంలోని సమస్యల పట్ల దార్శనికంగా ఆలోచించే కేసీఆర్ వంటి ముఖ్యమంత్రికి ప్రధానిగా మోడీ ఏమేరకు సహకారం అందిస్తారనేది ఇ

Published: Wed,July 20, 2016 01:42 AM

మోదీ బాత్ కేజ్రీ టాక్

మోదీకి మన్‌కీ బాత్ ఎంత పాపులారిటీని కొనితెచ్చిందో తెలియదు. కానీ రాష్ట్ర ప్రభుత్వాల పట్ల ఆయన మరింత మెరుగ్గా వ్యవహరించాలి. అలాగే కే        


country oven

Featured Articles