రెండున్నరేండ్ల సమర్థత


Tue,November 29, 2016 12:53 AM

గతంలో దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీకి గ్యారంటీ ఇవ్వగానే బ్యాంకులు ఒప్పేసుకొని మాఫీ చేసిన సందర్భాలున్నాయి. కానీ కేసీఆర్ ప్రభుత్వం చేసిన వినతిని బ్యాంకులు అంగీకరించకపోవడమే రైతుల ఇబ్బందులకు కారణమైంది. ఇవాళ దేశంలో ఎప్పటికప్పుడు బ్యాంకుల విధి విధానాలు మారుతుండటమే అందుకు కారణం.

srinivas
డిసెంబర్ 2వ తేదీతో తెలంగాణ రాష్ట్ర అవతరణకు, అస్తిత్వ పాలనకు రెండున్నరేండ్లు ముగుస్తున్నాయి. జరిగిందేమిటి, జరుగాల్సిందేమిటి అని టీఆర్‌ఎస్ పార్టీ, ప్రభుత్వం అవలోకనం చేసుకొని భవిష్యత్‌ను రచించుకోవలసిన సం దర్భమిది. ప్రభుత్వాలు ప్రణాళికా వ్యయం కన్నా ప్రణాళికేతర వ్యయానికే అధిక ప్రాధాన్యమిస్తున్న ఈ రోజుల్లో ప్రణాళికా వ్యయానికే ముఖ్యమంత్రి కేసీఆర్ అధిక ప్రాధాన్యమివ్వడం తెలంగాణ పట్ల ఆయన దార్శనికతను తెలుపుతున్నది. వందల టీఎంసీల నీళ్లను వాడుకోలేని తెలంగాణ దశాబ్దాలుగా ఎంత వెనుకబడిపోయిందో లెక్కలేసి చెప్పడం ఎవరి కీ సాధ్యంకాదు. అలాంటి సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలకే ఏటా 25 వేల కోట్లు కేటాయించడం కేసీఆర్ ప్రభుత ్వ దార్శనికతకు నిదర్శనం. అలాగే 30 వేల కోట్లు సంక్షేమ పథకాల అమలుతో తెలంగాణ జీవన ప్రమాణాలు చాలామేరకు మెరుగుపడుతున్నాయి. గడిచిన రెండున్నరేండ్లలో కేసీఆర్ ప్రభుత్వం తన సమర్థతను, సార్థకతను చాటుకుందనడంలో సందేహం లేదు. అదే సందర్భంలో ఎదుర్కొన్న సవాళ్లూ ఉన్నాయి. పాలకుడి పట్ల ప్రజల విశ్వాసమే ఆ సవాళ్లను ఎదుర్కొనేలా చేసిందని చెప్పుకోవచ్చు.
గతంలో దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీకి గ్యారంటీ ఇవ్వగానే బ్యాంకులు ఒప్పేసుకొని మాఫీ చేసిన సందర్భాలున్నాయి.

కానీ కేసీఆర్ ప్రభుత్వం చేసిన వినతిని బ్యాంకులు అంగీకరించకపోవడ మే రైతుల ఇబ్బందులకు కారణమైంది. ఇవాళ దేశంలో ఎప్పటికప్పుడు బ్యాంకుల విధి విధానాలు మారుతుండటమే అందుకు కారణం. అందు కే ఏటా 25 శాతం రుణమాఫీ చేయక తప్పలేదు. దీన్ని రైతాంగం అర్థం చేసుకున్నది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెండు లక్షల రుణమాఫీ చేస్తామని రైతులకు హామీ ఇచ్చింది. నిజంగానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉంటే, ఒకేసారి రెండు లక్షల మాఫీ చేయగలిగేదేనా? కాబట్టి రుణమాఫీ విషయంలో విపక్షాల విమర్శలు రాజకీయపరమైనవేనని రైతులకు అర్థ మైంది.

అధికారంలోకి వచ్చిన్నాడే ఈ ప్రభుత్వం ఫ్రెండ్లీ ప్రభుత్వం అని కేసీఆర్ చెప్పారు. నిజానికి ప్రభుత్వం-ప్రజల మధ్యన దాపరికాలు లేని పాలన ఉండాలె. మిషన్ కాకతీయ, భగీరథ, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలలో ప్రభుత్వ ఉద్యోగులు కష్టపడి పనిచేస్తున్నారు. కానీ ఆ పథకాల అమలులో ఆశించిన మేర ఫలితాలు ఇంకా రావడం లేదు. ప్రజలకు ప్రభుత్వోద్యోగుల సేవలు అందడం కీలకాంశం. అలాగే పోలీసు వ్యవస్థ లో కేసీఆర్ తెచ్చిన మార్పులు సత్ఫలితాలిస్తున్నాయి. షీ-టీంల ఏర్పా టు, కార్డెన్ సెర్చ్ లాంటి కొత్త చర్యల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు చాలా బాగున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలే చెబుతున్నాయి. ఇవన్నీ కేసీఆర్ ప్రభుత్వానికి మంచి మార్కులే. సామాన్యుడు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగలిగే రోజులను తేవడం కోసం ఆలోచించాలె. ఒక ప్రభుత్వానికి మంచిపేరు రావడానికి యంత్రాగమే కారణమవుతుందనే విషయం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలుసు. కాబట్టి ఉద్యోగుల పనితీరుపై మరింత దృష్టి సారించాలి.

ఇరిగేషన్, వ్యవసాయం, ట్రాన్స్‌కో, జెన్‌కో, పోలీసు వంటి శాఖల్లో వేలాది ఉద్యోగ భర్తీలు జరిగాయి, జరుగతూనే ఉన్నాయి. గ్రూప్-2 ఉద్యోగాల భర్తీ కూడా జరుగబోతున్నది. అయినా ఎందుకు అసంతృప్తి వినిపిస్తోంది? ప్రతి నిరుద్యోగి మొదటి ప్రాధాన్యంగా ప్రభుత్వోద్యోగం ఆశించడంలోనే అసలు చిక్కుంది. టీఎస్‌ఐపాస్ ద్వారా రాష్ర్టానికి సుమా రు 45 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దాంతో సుమారు ఒక లక్షా 60 వేల కొత్త ఉద్యోగాలు భర్తీ అయ్యాయి. పరోక్షంగా మరో 4 లక్షల మందికి ఉపాధి కలిగిందని ఆర్థిక నిపుణులు చెపుతున్నారు. అందరూ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ గురించే మాట్లాడుతున్నారు తప్ప ప్రైవేటు రం గంలో వచ్చిన లక్షన్నరకు పైగా వచ్చిన కొత్త ఉద్యోగాల గురించి ఎవరూ మాట్లాడకపోవడం గమనార్హం. ఈ-గవర్నెన్స్ ప్రాధాన్యం పెరిగిపోతున్న ఈ కాలంలో ప్రభుత్వోద్యోగాలు తగ్గుతాయి తప్ప పెరుగవని తెలియని వారుండరు. ఓ వైపు ప్రభుత్వోద్యోగాలు భర్తీ చేస్తూనే, ప్రైవేటు రంగంలో ఉద్యోగావకాశాలను పెంచడమే ప్రస్తుత ప్రభుత్వాలు చేయాల్సిన పని. ఆ పని కేసీఆర్ ప్రభుత్వం అద్భుతంగా చేస్తున్నదని చెప్పడానికి, ప్రైవేటు రంగంలో లక్షన్నరకు పైగా కొత్త ఉద్యోగాలు రావడమే నిదర్శనం.
అధికార పార్టీగా టీఆర్‌ఎస్ ప్రజా సంబంధాలు బలపడితేనే ప్రభుత్వ పథకాలు, పనులపై ప్రజలకు అవగాహన పెరుగుతుంది.

అలా కానప్పుడే, ప్రతిపక్షాల విమర్శలు పదునెక్కి ప్రజల్ని పక్కదారి పటించే అవకాశాలుంటాయి. ఉదాహరణకు, రైతు రుణమాఫీపై గగ్గోలు చేసిన కాంగ్రెస్ పార్టీ యే, తాను అధికారంలోకి వస్తే 2 లక్షల మాఫీ ఎలా చేయగలిగేదనే వాదనను ప్రజల్లోకి ఏ మేరకు తీసుకుపోగలిగారో టీఆర్‌ఎస్ శ్రేణులు ఆత్మపరిశీలన చేసుకోవాలె. అలాగే, లక్ష ప్రభుత్వోద్యోగాల భర్తీ గురించి రాద్ధాం తం చేసిన విపక్షాలకు.. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఇప్పటికే సుమారు 2 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించగలిగామని చెప్పడంలో అంతగా ఎం దుకు సఫలం కాలేకపోయారో టీఆర్‌ఎస్ ఆలోచించుకోవాలె. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమాచార లోపం లేకుండా చూసుకోగలిగినపుడే విపక్షాలను కట్టడి చేయగలుగుతారు. సంస్థాగతంగా పార్టీపై మరింత దృష్టిపెట్టడానికి కేసీఆర్‌కు ఇదే సరైన సమయం.

1010

SRINIVAS REDDY KALLURI

Published: Tue,October 16, 2018 03:29 PM

సంపద సృష్టికే అప్పులు

అప్పులు ఎప్పుడూ సంపద సృష్టికి మాత్రమే ఉపయోగించాలనేది సంక్షేమ రాజ్య పాలకుడికి ఉండాల్సిన సహజ లక్షణం. ఈ లక్షణం కేసీఆర్ అనే పాలకుడిలో

Published: Sun,February 25, 2018 01:31 AM

డైనమిజానికి ప్రతీక

యువనేతలో తెలంగాణ ఒక డైనమిజాన్ని చూస్తున్నది. ఆయనలో క్లాస్ కంటే మాస్ లీడర్‌గా మరింత బలంగా ఉన్నాడు. తెలంగాణ పునర్ నిర్మాణ పథకాల రచనల

Published: Fri,July 7, 2017 01:04 AM

రైతు లక్షణం ఇంకా రాదా?

2022 వరకు వ్యవసాయాన్ని ఇప్పటికన్నా రెండింతల లాభాల బాట పట్టిస్తామని కొన్నాళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీపదేపదే చెబుతున్నారు. కానీ ఆచరణ

Published: Sat,February 18, 2017 01:37 AM

సృజనాత్మక వక్త

భూమిపై సగం, ఆకాశంలో సగం అని చెపితే సరిపోయేది కాదు. ఆర్బీఐ గవర్నర్‌తో సమానమైన బాధ్యతను ఈ దేశ మహిళ నిర్వహిస్తున్నదని చెప్పడమే కవిత ప

Published: Tue,February 7, 2017 01:46 AM

సహకారానికి ఉపకారమేది?

దేశంలో ఒక విశ్వసనీయ పాలకుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్‌ను ప్రధాని మోదీ ప్రశంసలతో ముంచెత్తితే సరిపోదు. కేసీఆర్ విశాల దృక్పథానికి అన

Published: Fri,January 6, 2017 11:54 PM

‘దేశీ’ తెలంగాణ స్ఫూర్తి

ప్రపంచీకరణ ప్రయాణంలో దేశీ ఆలోచనలతో బాధితులను కాపాడుకోవాలనే స్పృహ ఒక నిజమైన దేశీయ పాలకుడికి ఉండాల్సిన లక్షణం. ఆ లక్షణాన్ని ఇపుడు మ

Published: Tue,November 22, 2016 12:02 AM

నోట్ల రద్దుపై వాస్తవ వైఖరి

ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై రకరకాల అభిప్రాయాలున్నాయి. ప్రజల అభిప్రాయం ఎలా ఉందనే కన్నా ముందు రాజకీయ

Published: Sat,October 22, 2016 01:23 AM

చెరువును చంపొద్దు

వర్షాలు ఇంత భారీగా పడినా కూడా మా ఊరి చెరువులోకి చుక్క నీరు రాలేకపోయింది. దాంతో మా ఊరి చెరువు కింద మరో మూడు ఊర్లకు చెందిన గొలుసుకట్

Published: Wed,October 5, 2016 03:43 AM

మోదీ వ్యూహాత్మక పయనం

నిజానికి కశ్మీరీలు అమాయకులు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే హిందూ యాత్రికులను గుర్రాలపై, బగ్గీలపై తీసుకెళ్లేది కశ్మీరీ ముస్లిం సోదరులే.

Published: Fri,September 16, 2016 01:23 AM

నీటి హక్కుపై నియంత్రణా?

రాష్ట్ర విభజన డ్రాఫ్ట్ బిల్లులో రెండు నదులపై యాజమాన్య బోర్డులు పెట్టాలనే ప్రతిపాదనను ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌తో సహా యావత్ తెలంగాణ బు

Published: Tue,August 9, 2016 01:17 AM

కేసీఆర్-మోదీ: తెలంగాణ

రాజకీయాలకతీతంగా దేశంలోని సమస్యల పట్ల దార్శనికంగా ఆలోచించే కేసీఆర్ వంటి ముఖ్యమంత్రికి ప్రధానిగా మోడీ ఏమేరకు సహకారం అందిస్తారనేది ఇ

Published: Wed,July 20, 2016 01:42 AM

మోదీ బాత్ కేజ్రీ టాక్

మోదీకి మన్‌కీ బాత్ ఎంత పాపులారిటీని కొనితెచ్చిందో తెలియదు. కానీ రాష్ట్ర ప్రభుత్వాల పట్ల ఆయన మరింత మెరుగ్గా వ్యవహరించాలి. అలాగే కే