నోట్ల రద్దుపై వాస్తవ వైఖరి


Tue,November 22, 2016 12:02 AM

ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై రకరకాల అభిప్రాయాలున్నాయి. ప్రజల అభిప్రాయం ఎలా ఉందనే కన్నా ముందు రాజకీయ పార్టీల వైఖరి గురించి చర్చించుకోవాలె. ఈ మధ్య నేను ఫేస్‌బుక్‌లో ఓ కామెంట్ పోస్టు చేశాను. మమత పూర్తి వ్యతిరేకత, నితీశ్- ఓపెన్ ప్రశంస, కేసీఆర్‌వాస్తవ వైఖరి. నోట్ల రద్దుపై ముగ్గురు ముఖ్యమంత్రుల భిన్న అభిప్రాయంలో మీరు దేన్ని సమర్థిస్తారు? అని అడిగాను.

కేసీఆర్ మంచి పరిపాలకుడనే అభిప్రాయం మోదీకి మొదటి నుంచీ ఉంది. నీతి ఆయోగ్‌ను ఏర్పాటు చేసినపుడు కేసీఆర్ చేసిన అనేక సూచనలను మోదీ ఆహ్వానించారు, అమలు చేశారు. అలాగే జీఎస్‌టీ బిల్లు విషయంలోనూ కేసీఆర్ సూచనలను కొన్నింటిని మోదీ ఆహ్వానించారు. రాజకీయాలకతీతంగా ఒక పాజిటివ్ దృక్పథంతో పనిచేసే కేసీఆర్ వైఖరిని మోదీ ఎప్పుడూ గౌరవిస్తూ వస్తున్నారని చెప్పొచ్చు. ఇపుడు నోట్ల రద్దు విషయంలో కేసీఆర్ సూచించిన విషయాలను కొన్నిటినైన మోదీ ఆమోదించి ఆమలు చేస్తే అంతకు మించి కావలసింది ఏమీలేదు. భిన్న అభిప్రాయాలు వచ్చినా, చాలా మేరకు కేసీఆర్ వాస్తవ వైఖరినే సమర్థించారు. ఇం త పెద్ద దేశంలో దేనిపైనా ఏకాభిప్రాయం రాకపోవచ్చు. కానీ నల్లధనం వెలికితీయాలనే విషయంలో మాత్రం దేశంలో ఏకాభిప్రాయానికి ఢోకా లేదు. అయితే హటాత్తుగా తీసుకున్న నిర్ణయం వల్ల ఎదుర్కొన్న సమస్యల పట్లనే ప్రజల్లో కొంత అసహనం ఏర్పడింది. నోట్ల రద్దు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పటికిప్పుడే ఒక అభిప్రాయానికి రావడం కూడా సరికాకపోవచ్చు. నోట్ల మార్పిడికి డిసెంబర్ 31 వరకు అవకాశం ఉన్నది. ఆ తరువాత కూడా అంటే, 2017 మార్చి 31 వరకు కూడా సహేతుక కారణాలు చూపి నోట్లు మార్చుకు నే అవకాశం ఉన్నది. కాబట్టి నోట్లరద్దు చర్య దేశ ఆర్థిక వ్యవస్థను మరిం త బలోపేతం చేయబోతున్నదా లేక దెబ్బ తీయనుందా అనే చర్చ రాబోయే 6 నెలల కాలం పాటు కొనసాగే అవకాశాలున్నాయి.

ముఖ్యంగా గత 35 ఏళ్లుగా దేశంలోని అన్ని రంగాలను అవినీతి, నల్లధనం శాసిస్తున్నాయి. కానీ దేశం అనేక రంగాలలో అనితర సాధ్యమైన అభివృద్ధి సాధించినా దాని ఫలాలు చివరి పేదోడి వరకు చేరలేకపోతున్నాయి. అందుకే గత 30 ఏళ్లలో జరిగిన అన్ని సాధారణ ఎన్నిక ల సర్వేలలో అవినీతి, నల్లధనమే ప్రధాన సమస్యగా ప్రజలు పేర్కొం టూ వస్తున్నారు. అందుకే ఇవాళ మోదీ తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజ ల్లో వ్యతిరేకత ఉందనుకోలేం. కాకపోతే హటాత్తు నిర్ణయం వల్ల సామాన్యులు సమస్యలు ఎదుర్కోవడమే ఇవాళ అంతటా చర్చనీయాంశంగా మిగిలింది. నోట్ల రద్దుపై కేసీఆర్ వైఖరి కూడా ప్రజలు ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యలు, రాష్ట్ర ఆదాయానికి పడుతున్న కోత గురించే తప్ప, నల్లధనంపై మోదీ తీసుకున్న నిర్ణయాన్ని మమత, కేజ్రీవాల్ లాగా రాజకీయ వైరుధ్యంతో వ్యతిరేకించడం కాదు. దేశ కరెన్సీ వ్యవహారం కేంద్రానికి సంబంధించినది. కాబట్టి మోదీ చెప్పాపెట్టకుండా తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం పట్ల కొంత అసంతృప్తి ఉన్నా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలెదుర్కొంటున్న సమస్యలు, రాష్ట్రం కోల్పోతున్న ఆదాయంపైనే కేసీఆర్ దృష్టి పెట్టారు. ఆ విషయాలపైనే ఢిల్లీకి వెళ్లారు. సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి ఇలాంటి వాస్తవ వైఖరినే ప్రజలు ఆశిస్తారు. మోదీ నిర్ణయాన్ని వ్యతిరేకించడమో, ప్రశంసించడమో తప్ప ప్రజలెదుర్కొంటున్న సమస్యలపై (ఒక్క కేసీఆర్ తప్ప) ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ఇప్పటివరకు ప్రధానిని కలిసి చెప్పిన వారులేరు. ఆ క్రెడిట్ ఇపుడు కేసీఆర్‌కే దక్కింది.

మూడు రోజుల్లో ప్రజలెదుర్కొంటున్న సమస్యలు తీర్చకపోతే, నోట్లరద్దును వెనక్కి తీసుకోవాలని కేజ్రీవాల్, మమత మోదీని డిమాండ్ చేశారు. వారి డిమాండ్‌ను ప్రజలు రాజకీయ విమర్శగానే చూస్తారు తప్ప వాస్తవ విమర్శగా తీసుకోలేరు. వారి డిమాండ్‌ను రాజకీయ వైరుధ్య విమర్శగానే పరిగణిస్తారు. మోదీ నిర్ణయాన్ని చంద్రబాబు ప్రశంసించడం సంగతేమోగానీ, గతంలో 500, 1000 నోట్ల రద్దు చేయాలని ప్రధానికి లేఖ రాసింది నేనేనని, అందుకే ఆయన రద్దు చేయగలిగాడని చంద్రబాబు మొదటిరోజే స్వీయ ప్రచారం చేసుకున్నారు. నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న రెండు రోజులకు గానీ ఆయనకు విష యం బోధ పడలేదు. వెంటనే ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురిం చి మాట్లాడటం మొదలుపెట్టారు. అవకాశవాద వైఖరికి చంద్రబాబును మించిన నాయకుడు బహుశా దేశంలో మరొకరు ఉండి ఉండరు. ఆయ న సంగతి పక్కన పెడదాం. దేశంలో ఉన్న 29 మంది ముఖ్యమంత్రు ల్లో ప్రజాప్రయోజన విషయాల్లో రాజకీయాలకతీతంగా పనిచేసే వారున్నారు. అందులో కొందరి పేర్లు కూడా చెప్పుకోవచ్చు. ఒక కేసీఆర్, ఒక నవీన్ పట్నాయక్, ఒక నితీశ్‌కుమార్ ఇలా మరికొందరు ముఖ్యమంత్రులున్నారు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ బహిరంగంగా మోదీ నిర్ణయాన్ని ప్రశంసించడం కూడా ఆ కోణంలోనే చూడొచ్చు. నిజానికి మోదీ ప్రధానమంత్రి అభ్యర్థిత్వాన్నే వ్యతిరేకించి ఎన్‌డీఏ నుం చి వైదొలిగిన నితీశ్ కుమార్ ఇపుడు మోదీ నిర్ణయాన్ని సమర్థించడం రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యాన్ని కలిగించినా ఆయన నిశ్కల్మశ రాజకీ యం తెలిసివారెవరూ ఆశ్చర్యపోలేరు. నితీశ్ కుమార్ ఒక ముఖ్యమం త్రి మాత్రమే కాదు, రాజనీతిజ్ఞడు కూడా. అలాంటి రాజనీతిజ్ఞులే దేశ ప్రయోజనాల విషయంలో రాజకీయాలకతీతంగా మాట్లాడగలుగుతా రు. సరే, నితీశ్ చేసిన ప్రశంసతో కొందరు విభేదించొచ్చు, సమర్థించొ చ్చు. అది వేరే చర్చ. కానీ వాస్తవ వైఖరితో ముందుకెళ్లిన కేసీఆర్‌ను మాత్రం ఎవరూ కాదనలేరు.

తెలంగాణ దోపిడీ నుంచి విముక్తి పొంది ఏర్పడిన రాష్ట్రం. మిగులు బడ్జెట్ కలిగిన రాష్ట్రం. ఉమ్మడి రాష్ట్రంలో ప్రాంతం సంపన్నమైనదైనా ప్రజలు పేదలుగా బతికా రు. కాబట్టి సంపన్న రాష్ట్ర అభివృద్ధికి రచించిన ప్రణాళికలకు ఒక్కసారిగా బ్రేకులు పడి తే ఏమిటి పరిస్థితి అనేదే కేసీఆర్ ఆందోళన. నోట్ల రద్దుతో రాష్ట్రంలో రియలెస్టేట్, రిజిస్ట్రేషన్లు, వ్యాపారాలు సగానికి సగం పడిపోతుండటమే గ్రోయింగ్ తెలంగాణను కలవరపరుస్తున్న అంశం. సుమారు 2000 వేల నుంచి 3000 నెలవారీ పన్నుల రాబడి కి నోట్లరద్దుతో బ్రేకు పడుతున్నది. సస్యశ్యామల తెలంగాణ కోసం చేపడుతున్న భారీ సాగునీటి ప్రాజెక్టులకు ఏటా రూ.25,000 కోట్లు, సంక్షేమానికి రూ.30,000 వేల కోట్ల భారీ ప్రణాళికలు ఏం కానున్నాయనేదే కేసీఆర్‌ను కలవర పరుస్తున్న అంశాలలో ఒకటి. అలాగే, నోట్లరద్దుతో ఆగిపోతున్న నిర్మాణ రంగం, ఇతర రంగాలలో ప్రజలు ఉపాధి అవకాశాలు లేకుండాపోవడమూ ఆయన్ను మరింత ఆందోళనకు గురిచేస్తున్న విషయం. రాష్ట్ర ప్రభుత్వం నెలవారీ అనివార్య వ్యయం సుమారు రూ.5600 కోట్లు. ఆ మాత్రం ఆదాయం రాకుంటే ఏమిటి పరిస్థితి? పోరాడి తెలంగాణను తెచ్చిన నాయకుడిగా కేసీఆర్‌కు అలాంటి ఆందోళన కలగడం సహజం. కాబట్టే, నోట్లరద్దుతో ఏర్పడిన సమస్యల పరిష్కారాల కోసమే ఆయన తాపత్రయం తప్ప, ఇతరుల లాగా రాజకీయ వైరుధ్యంతో మోదీ నిర్ణయాన్ని గుడ్డిగా వ్యతిరేకించాలని మాత్రం కాదు. కేసీఆర్ మంచి పరిపాలకుడనే అభిప్రాయం మోదీకి మొదటి నుంచీ ఉంది. నీతి ఆయోగ్ ను ఏర్పాటు చేసినపుడు కేసీఆర్ చేసిన అనేక సూచనలను మోదీ ఆహ్వానించారు, అమలు చేశారు. అలాగే జీఎస్‌టీ బిల్లు విషయంలోనూ కేసీఆర్ సూచనలను కొన్నింటిని మోదీ ఆహ్వానించారు. రాజకీయాలకతీతంగా ఒక పాజిటివ్ దృక్పథంతో పనిచేసే కేసీఆర్ వైఖరిని మోదీ ఎప్పు డూ గౌరవిస్తూ వస్తున్నారని చెప్పొచ్చు. ఇపుడు నోట్ల రద్దు విషయంలో కేసీఆర్ సూచించిన విషయాలను కొన్నిటినైనా మోదీ ఆమోదించి ఆమ లు చేస్తే అంతకు మించి కావలసింది ఏమీలేదు. నిజానికి కేసీఆర్ ప్రధా ని మోదీకి విన్నవించిన విషయాల్లో ఒక్క తెలంగాణకు సంబంధించివే కాకుండా యావద్దేశ ప్రజలకు ఉపయోగపడే సూచనలు కూడా చేశారు. ఉదాహరణకు, గ్రామీణ కోఆపరేటివ్ బ్యాంకుల్లో నోట్ల బదిలీని అకస్మాత్తుగా ఆపేశారు. 60 శాతం పైగా గ్రామాల్లో నివసిస్తున్న దేశ జనాభాకు నోట్ల బదిలీ ఒక సమస్యగా మారింది. అయితే గ్రామీణ కోఆపరేటివ్ బ్యాంకులు స్థానిక రాజకీయ నాయకుల ఆధ్వర్యంలో కొనసాగుతాయి కాబట్టి అక్కడ నోట్ల బదిలీ దుర్వినియోగమయ్యే అవకాశముందని ఆపేసినట్లుగా కేంద్రం చెపుతున్నది. కోఆపరేటివ్ చైర్మన్‌ల వల్ల ఇబ్బంది ఉంటే, ఇతర బ్యాంకర్లకే కో-ఆపరేటివ్ బ్యాంకులను అప్పగించి గ్రామాల్లో నోట్ల బదిలీని కొనసాగించవచ్చు. గ్రామీణ కోఆపరేటి వ్ బ్యాంకుల ద్వారా తిరిగి నోట్ల బదిలీకి అవకాశమివ్వాలని కేసీఆర్ ప్రధానికి కచ్చితంగా చెప్పినట్లు వార్త. ఇది కూడా ఒక్క తెలంగాణ ప్రజలకే కాదు, గ్రామీణ భారతానికంతటికీ ఉపయోగపడే అంశం. ప్రధాని మోదీకి చేసిన అత్యంత కీలకమైన సూచన ఏమిటంటే, నోట్ల రద్దుతో ప్రజలు, రాష్ర్టాలు ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. వారి అభిప్రాయాల సాధ్యాసాధ్యాలు తెలుసుకొని అమలుచేస్తే అటు ప్రజలకు ఇటు రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాలకు ఓ పరిష్కారం దొరుకుతుందని చెప్పినట్లు తెలుస్తున్నది.

నోట్ల రద్దుతో వస్తున్న సమస్యలపై ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా వాస్తవ వైఖరితో ప్రధానికి సరైన ప్రజెంటేషన్ చేసిన మన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అభినందిద్దాం. మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా దేశ ప్రజలందరి సమస్యలను కూడా పరోక్షంగా ప్రధాని దృష్టి కి తీసుకెళ్లడం.. అందరికన్నా మనకు (తెలంగాణకు) గొప్ప విషయం.
kallurisreddy@gmail.com

2686

SRINIVAS REDDY KALLURI

Published: Tue,October 16, 2018 03:29 PM

సంపద సృష్టికే అప్పులు

అప్పులు ఎప్పుడూ సంపద సృష్టికి మాత్రమే ఉపయోగించాలనేది సంక్షేమ రాజ్య పాలకుడికి ఉండాల్సిన సహజ లక్షణం. ఈ లక్షణం కేసీఆర్ అనే పాలకుడిలో

Published: Sun,February 25, 2018 01:31 AM

డైనమిజానికి ప్రతీక

యువనేతలో తెలంగాణ ఒక డైనమిజాన్ని చూస్తున్నది. ఆయనలో క్లాస్ కంటే మాస్ లీడర్‌గా మరింత బలంగా ఉన్నాడు. తెలంగాణ పునర్ నిర్మాణ పథకాల రచనల

Published: Fri,July 7, 2017 01:04 AM

రైతు లక్షణం ఇంకా రాదా?

2022 వరకు వ్యవసాయాన్ని ఇప్పటికన్నా రెండింతల లాభాల బాట పట్టిస్తామని కొన్నాళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీపదేపదే చెబుతున్నారు. కానీ ఆచరణ

Published: Sat,February 18, 2017 01:37 AM

సృజనాత్మక వక్త

భూమిపై సగం, ఆకాశంలో సగం అని చెపితే సరిపోయేది కాదు. ఆర్బీఐ గవర్నర్‌తో సమానమైన బాధ్యతను ఈ దేశ మహిళ నిర్వహిస్తున్నదని చెప్పడమే కవిత ప

Published: Tue,February 7, 2017 01:46 AM

సహకారానికి ఉపకారమేది?

దేశంలో ఒక విశ్వసనీయ పాలకుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్‌ను ప్రధాని మోదీ ప్రశంసలతో ముంచెత్తితే సరిపోదు. కేసీఆర్ విశాల దృక్పథానికి అన

Published: Fri,January 6, 2017 11:54 PM

‘దేశీ’ తెలంగాణ స్ఫూర్తి

ప్రపంచీకరణ ప్రయాణంలో దేశీ ఆలోచనలతో బాధితులను కాపాడుకోవాలనే స్పృహ ఒక నిజమైన దేశీయ పాలకుడికి ఉండాల్సిన లక్షణం. ఆ లక్షణాన్ని ఇపుడు మ

Published: Tue,November 29, 2016 12:53 AM

రెండున్నరేండ్ల సమర్థత

గతంలో దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీకి గ్యారంటీ ఇవ్వగానే బ్యాంకులు ఒప్పేసుకొని మాఫీ చేసిన సందర్భాలున్నాయి. కానీ కేసీఆర్ ప

Published: Sat,October 22, 2016 01:23 AM

చెరువును చంపొద్దు

వర్షాలు ఇంత భారీగా పడినా కూడా మా ఊరి చెరువులోకి చుక్క నీరు రాలేకపోయింది. దాంతో మా ఊరి చెరువు కింద మరో మూడు ఊర్లకు చెందిన గొలుసుకట్

Published: Wed,October 5, 2016 03:43 AM

మోదీ వ్యూహాత్మక పయనం

నిజానికి కశ్మీరీలు అమాయకులు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే హిందూ యాత్రికులను గుర్రాలపై, బగ్గీలపై తీసుకెళ్లేది కశ్మీరీ ముస్లిం సోదరులే.

Published: Fri,September 16, 2016 01:23 AM

నీటి హక్కుపై నియంత్రణా?

రాష్ట్ర విభజన డ్రాఫ్ట్ బిల్లులో రెండు నదులపై యాజమాన్య బోర్డులు పెట్టాలనే ప్రతిపాదనను ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌తో సహా యావత్ తెలంగాణ బు

Published: Tue,August 9, 2016 01:17 AM

కేసీఆర్-మోదీ: తెలంగాణ

రాజకీయాలకతీతంగా దేశంలోని సమస్యల పట్ల దార్శనికంగా ఆలోచించే కేసీఆర్ వంటి ముఖ్యమంత్రికి ప్రధానిగా మోడీ ఏమేరకు సహకారం అందిస్తారనేది ఇ

Published: Wed,July 20, 2016 01:42 AM

మోదీ బాత్ కేజ్రీ టాక్

మోదీకి మన్‌కీ బాత్ ఎంత పాపులారిటీని కొనితెచ్చిందో తెలియదు. కానీ రాష్ట్ర ప్రభుత్వాల పట్ల ఆయన మరింత మెరుగ్గా వ్యవహరించాలి. అలాగే కే        


country oven

Featured Articles