నీటి హక్కుపై నియంత్రణా?


Fri,September 16, 2016 01:23 AM

రాష్ట్ర విభజన డ్రాఫ్ట్ బిల్లులో రెండు నదులపై యాజమాన్య బోర్డులు పెట్టాలనే ప్రతిపాదనను ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌తో సహా యావత్ తెలంగాణ బుద్ధిజీవులు వ్యతిరేకించారు. అయితే జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, ఉభయ కమ్యూనిస్టులు మాత్రం ఆ ప్రతిపాదనను సమర్థించాయి. అందుకే ఇవాళ ఆ బోర్డుల పెత్తనాన్ని, పక్క రాష్ట్ర అభ్యంతరాలను ఏ పార్టీ కూడా పట్టించుకుంటున్న దాఖలాలు లేకపోవడం దురదృష్టకరం.

srinivas
కేంద్ర జలవనరుల శాఖా మంత్రి ఉమాభారతి ఇరు రాష్ర్టా ల ముఖ్యమంత్రులను ఆహ్వానించి అపెక్స్ కౌన్సిల్ సమావే శం జరుపబోతున్నారు. తెలంగాణ చేపడుతున్న పాలమూరు, డిండితో సహా అనేక ప్రాజెక్టులు అక్రమమైనవంటూ కృష్ణా, గోదావరి యాజమాన్య బోర్డులకు, కేంద్రానికి చంద్రబాబు లేఖలు రాస్తున్నారు. ఈ నేపథ్యంలో జరుగబోతున్న అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఇది. అలాగే బోర్డుల అనుమతి లేకుండా ఏపీ చేపట్టిన, చేపడుతున్న ప్రాజెక్టులపైనే కాకుండా అరవై ఏళ్లు గా నీటిని దోపిడీ చేసిన పక్క రాష్ట్రం వ్యవహారాన్ని కచ్చితంగా అపెక్స్ కౌన్సిల్‌లో కేసీఆర్ బయటపెడతారనడంలో సందేహంలేదు. జరిగిన నీటి దోపిడీని పక్కనపెట్టి, ఇపుడు తెలంగాణ ప్రభు త్వం చేపడుతున్న ప్రాజెక్టుల నిర్మాణాలను అక్రమమనడానికి పక్క రాష్ట్ర నేతలకు నోరు ఎలా వస్తున్నది? గత ఆరు దశాబ్దాల్లో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ప్రాజెక్టుల నిర్మాణాలన్నిటిపైన అపెక్స్ కౌన్సిల్‌లో చర్చ జరుగాలె. ఆ పని కేంద్రం చేయగలదా? చేయలేనపుడు ఇపుడు తెలంగాణ కట్టబోతున్న ప్రాజెక్టులు మాత్ర మే పక్కరాష్ర్టానికి ఎట్లా అభ్యంతరకరమవుతాయో రేపటి సమావేశంలో కేంద్రమే జవాబు చెప్పాలి.

రెండు నదులపై యాజమాన్య బోర్టుల ఏర్పాటును విభజన చట్టంలోని సెక్షన్ 9లో పొందుపరిచారు. నిజంగా దేశంలో ఉన్న అన్ని నదులపై ఇలాంటి యాజమాన్య బోర్డులు ఉన్నాయా? నిజంగా దేశంలో నదుల నీటి వాడకాలపై ఇలాంటి బోర్డులే ముందు నుంచి ఉంటే మహారాష్ట్రలో పుట్టిన కృష్ణా, గోదావరి నాలుగు రాష్ర్టాల గుండా ప్రవహించి సముద్రంలో కలుస్తున్నపుడు, నాలుగు రాష్ర్టాలను కూడా బోర్డుల పరిధిలోకి ఎందుకు తీసుకురాలేదు? కేవలం విభజన జరిగిన రెండు రాష్ర్టాలకే ఎందుకు పరిమితం చేశారు? నదుల నీటి హక్కులు ఒక్కో రాష్ర్టానికి ఒక్కో విధంగా ఉండటం సమంజసమేనా? అం దుకే ఏపీ విభజన జరిగి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో కృష్ణానది నీటి పంపకాలు నాలుగు (మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఏపీ) రాష్ర్టాల మధ్య తిరిగి జరుపాలని తెలంగాణ సీఎం కేసీఆర్ విభజన జరిగిన నాటి నుంచే డిమాండ్ చేస్తున్నారు.అదేవిధంగా బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యూనల్ తిరిగి పంపకాల కోసం ఇప్పుడు పనిచేస్తున్నది. కానీ ఇటీవలనే కేంద్రం మరోసారి తిరకాసు పెట్టింది. కేవలం తెలంగాణ, ఏపీల మధ్యనే పంపకం జరుగాలని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యూనల్‌ను కేంద్రం కోరింది.

మహారాష్ట్ర, కర్ణాటక పైరాష్ర్టాలుగా ఉండి ఇంతకాలం ఇష్టమొచ్చిన రీతిలో భారీ ప్రాజెక్టులు, వందలాది బ్యారేజీలు నిర్మించి కింది రాష్ర్టాలకు వరదలు వస్తే తప్ప, చుక్క నీరు రాకుండా అడ్డుకుంటున్నాయి. ఇప్పటికే పై రాష్ర్టాలకు జరిగిన నీటి పంపకాలను వదిలేసి ఉమ్మడి రాష్ట్రం పేరుతో జరిగిన నీటి కేటాయింపులనే తిరిగి రెండురాష్ర్టాల మధ్య పంపకం చేయడంలో అర్థం ఉందా? ఈ విషయంలో కేం ద్రం వైఖరిని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే తప్పుపట్టింది. ఒక నది నీటిని పంపకం చేసే ట్రిబ్యూనల్‌కు పూర్తి స్వాతంత్య్రం ఉండాలి తప్ప దాన్ని కేంద్రం ఇష్టానుసారం శాసించడం సరికాదు. దీనిపై బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యూనల్ కూడా కేంద్రం వాదనను తప్పుబట్టడం మంచి పరిణామం.
గతంలో ఉమ్మడి రాష్ట్ర పాలకుల పుణ్యమా అని పై రాష్ర్టాలు నిర్మించిన అక్రమ ప్రాజెక్టుల వల్ల ఇప్పటికే మూల్యం చెల్లిస్తుండడమే కాకుండా, ఇపుడు మన కింది రాష్ట్రం (ఏపీ) యాజమాన్య బోర్డుల పేర తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణాలను అక్రమ ప్రాజెక్టులనడం ఇంకో ఎత్తు. అడిగేవాడికి చెప్పే వాడు లోకువ అన్నట్లుగా ఉన్నది చంద్రబాబు లేఖల వ్యవహారం.

ఇవాళ తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న అన్ని ప్రాజెక్టులకు గత ఉమ్మడి ప్రభుత్వాలే అనుమతులు ఇచ్చి మూలకు పడేశాయనే విషయాన్ని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలా మర్చిపోతున్నట్లు? అభ్యంతరం తెలుపుతూ లేఖలెందుకు రాస్తున్నట్లు? పట్టిసీమ చేపట్టి రెండు నదులను అనుసంధానం చేశానని ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబు.. ఏ యాజమాన్య బోర్డు అనుమతి తీసుకొని పట్టిసీమను నిర్మించారో చెప్పగలరా? అలాగే, పోతిరెడ్డిపాడుకు పెంచిన తూములకు ఎవరి అనుమతులున్నాయి? పోతిరెడ్డిపాడు కింద జరిగిన రెండువేలకు పైగా కిలోమీటర్ల కాలువల నిర్మాణాలకు ఎవరి అనుమతులున్నాయి? ఇవ న్నీ రేపు అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో చర్చకు రాకతప్పదు. అలా గే, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యూనల్ పైరాష్ర్టాలైన మహారాష్ట్ర, కర్ణాటక లకు ఒకవేళ మినహాయింపులిస్తే, ఆ విధంగానే పైరాష్ర్టాలకు మొదటి హక్కు ఉంటదనుకుంటే.. ఏపీ కన్నా పైరాష్ట్రమైన తెలంగాణ నీటి హక్కులను బోర్డులు పెట్టి నియంత్రించడ మేమి టో కూడా కేంద్రం జవాబు చెప్పాలి.

ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణానదిలో జరిగిన నీటి దోపిడీ తేలితేగానీ ఇవాళ కృష్ణానదిపై తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులపై అభ్యంతరం చెప్పే హక్కు ఏపీతో సహా కేంద్రానికి సైతం ఉండదు. అలాగే సీమాంధ్రలో నిర్మాణం జరిగిన అక్రమ ప్రాజెక్టులపై తేల్చకుండా తెలంగాణలో చేపడుతున్న ప్రాజెక్టులపైనే మాట్లాడే హక్కు కృష్ణా బోర్డుకూ ఉండదు. తెలంగాణ వాదన కేంద్రానికి వినబడకపోతే, పనికిరా ని కృష్ణా యాజమాన్య బోర్డును రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేయాల్సిన అవసరముంది.

మన కోటి ఎకరాలకు నీరందిస్తాం తప్ప మరో ఐదు కోట్ల ఎకరాలను మాత్రం కొత్తగా సృష్టించలేం కదా. అలా కాకుండా తెలంగాణ రాష్ట్రమే నీళ్ల దోపిడీ చేస్తదేమో నన్నట్లు యాజమాన్య బోర్డులు పెట్టడమేమిటి? పక్కరాష్ట్ర ముఖ్యమంత్రి పదే పదే పనికిమాలిన లేఖలు రాయడమేమిటి? తెలంగాణ నీటి హక్కులపై పెత్తనం చేయడమేమిటి? ఆ మధ్య ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక విషయం స్పష్టం గా చెప్పారు. గోదావరిలో మనకున్న నీటి వాటా 950 టీఎంసీలు వాడుకోగా కూడా మరో 1500 టీఎంసీల మిగులు జలాలున్నాయన్నారు. వాటిలో మన వాటా తేల్చాలని కేంద్రాన్ని అడుగుతామని కూడా చెప్పారు. అంటే, గోదావరిలో ఉన్న మిగులు జలాలు మన అవసరాలకు మించి ఉన్నాయన్న మాట. విషయమేమిటం టే, నదుల్లో ఎన్ని నీళ్లున్నా మనం వాడుకోగా మిగిలినపుడు తప్పక కిందికే వదులుతాం.

అలాంటి గోదావరి నదిపై కూడా యాజమాన్య బోర్డు పెట్టడం ఎవరిని ఇబ్బం ది పెట్టడానికి? గోదావరి నదిపై ఉమ్మడి ప్రాజెక్టులు లేవు. ఏపీతో కనీసం సరిహద్దులు కూడా లేవు. వివాదాలూ లేవు. అయినా గోదావరినదిపై కూడా బోర్డు పెట్టడంలో అర్థం ఉన్నదా? రోజూ కిరికిరీలతో బతికే చంద్రబాబును బతికించడానికి తప్ప ఆ బోర్డులు ఎవరిని ఉద్ధరించడాని కి? తెలంగాణ ప్రజల నీటి హక్కులపై నియంత్రణ విధించి పక్క రాష్ర్టానికి ఆ హక్కులను అప్పగిస్తున్న బోర్డులను రద్దు చేస్తే తప్ప తెలంగాణకు న్యాయం జరుగదు. కనీసం అక్కరలేని గోదావరి యాజమాన్య బోర్డునైనా కేంద్రం రద్దు చేస్తే తెలంగాణకు కొంతైనా న్యాయం జరిగే అవకాశం ఉన్నది.

రాష్ట్ర విభజన డ్రాఫ్ట్ బిల్లులో రెండు నదులపై యాజమాన్య బోర్డులు పెట్టాలనే ప్రతిపాదనను ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌తో సహా యావత్ తెలంగాణ బుద్ధిజీవులు వ్యతిరేకించారు. అయితే జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, ఉభయ కమ్యూనిస్టులు మాత్రం ఆ ప్రతిపాదనను సమర్థించాయి. అందుకే ఇవాళ ఆ బోర్డుల పెత్తనాన్ని, పక్క రాష్ట్ర అభ్యంతరాలను ఏ పార్టీ కూడా పట్టించుకుంటున్న దాఖలాలు లేకపోవడం దురదృష్టకరం. తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణాలు, వాటి డీపీఆర్‌ల గురించి పదేపదే ప్రశ్నించే ప్రతిపక్షాలు.. ఇకనైనా పక్కరాష్ట్రం అభ్యంతరాలకు ఉపయోగపడుతున్నామనే సోయితో పనిచేస్తే మంచిది. ఢిల్లీలో జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశం వాడివేడిగా జరిగే అవకాశాలు తప్పకుండా ఉంటాయి. ఎందుకంటే.. మన నీటి హక్కును ప్రశ్నించ మరిగిన పక్క రాష్ట్ర వ్యవహారశైలిపై సీఎం కేసీఆర్ అంతే సీరియస్‌గా స్పందించే అవకాశం తప్పకుండా ఉంటది, ఉండాల్సిన అవసరం కూడా ఉన్నది.

1158

SRINIVAS REDDY KALLURI

Published: Tue,October 16, 2018 03:29 PM

సంపద సృష్టికే అప్పులు

అప్పులు ఎప్పుడూ సంపద సృష్టికి మాత్రమే ఉపయోగించాలనేది సంక్షేమ రాజ్య పాలకుడికి ఉండాల్సిన సహజ లక్షణం. ఈ లక్షణం కేసీఆర్ అనే పాలకుడిలో

Published: Sun,February 25, 2018 01:31 AM

డైనమిజానికి ప్రతీక

యువనేతలో తెలంగాణ ఒక డైనమిజాన్ని చూస్తున్నది. ఆయనలో క్లాస్ కంటే మాస్ లీడర్‌గా మరింత బలంగా ఉన్నాడు. తెలంగాణ పునర్ నిర్మాణ పథకాల రచనల

Published: Fri,July 7, 2017 01:04 AM

రైతు లక్షణం ఇంకా రాదా?

2022 వరకు వ్యవసాయాన్ని ఇప్పటికన్నా రెండింతల లాభాల బాట పట్టిస్తామని కొన్నాళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీపదేపదే చెబుతున్నారు. కానీ ఆచరణ

Published: Sat,February 18, 2017 01:37 AM

సృజనాత్మక వక్త

భూమిపై సగం, ఆకాశంలో సగం అని చెపితే సరిపోయేది కాదు. ఆర్బీఐ గవర్నర్‌తో సమానమైన బాధ్యతను ఈ దేశ మహిళ నిర్వహిస్తున్నదని చెప్పడమే కవిత ప

Published: Tue,February 7, 2017 01:46 AM

సహకారానికి ఉపకారమేది?

దేశంలో ఒక విశ్వసనీయ పాలకుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్‌ను ప్రధాని మోదీ ప్రశంసలతో ముంచెత్తితే సరిపోదు. కేసీఆర్ విశాల దృక్పథానికి అన

Published: Fri,January 6, 2017 11:54 PM

‘దేశీ’ తెలంగాణ స్ఫూర్తి

ప్రపంచీకరణ ప్రయాణంలో దేశీ ఆలోచనలతో బాధితులను కాపాడుకోవాలనే స్పృహ ఒక నిజమైన దేశీయ పాలకుడికి ఉండాల్సిన లక్షణం. ఆ లక్షణాన్ని ఇపుడు మ

Published: Tue,November 29, 2016 12:53 AM

రెండున్నరేండ్ల సమర్థత

గతంలో దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీకి గ్యారంటీ ఇవ్వగానే బ్యాంకులు ఒప్పేసుకొని మాఫీ చేసిన సందర్భాలున్నాయి. కానీ కేసీఆర్ ప

Published: Tue,November 22, 2016 12:02 AM

నోట్ల రద్దుపై వాస్తవ వైఖరి

ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై రకరకాల అభిప్రాయాలున్నాయి. ప్రజల అభిప్రాయం ఎలా ఉందనే కన్నా ముందు రాజకీయ

Published: Sat,October 22, 2016 01:23 AM

చెరువును చంపొద్దు

వర్షాలు ఇంత భారీగా పడినా కూడా మా ఊరి చెరువులోకి చుక్క నీరు రాలేకపోయింది. దాంతో మా ఊరి చెరువు కింద మరో మూడు ఊర్లకు చెందిన గొలుసుకట్

Published: Wed,October 5, 2016 03:43 AM

మోదీ వ్యూహాత్మక పయనం

నిజానికి కశ్మీరీలు అమాయకులు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే హిందూ యాత్రికులను గుర్రాలపై, బగ్గీలపై తీసుకెళ్లేది కశ్మీరీ ముస్లిం సోదరులే.

Published: Tue,August 9, 2016 01:17 AM

కేసీఆర్-మోదీ: తెలంగాణ

రాజకీయాలకతీతంగా దేశంలోని సమస్యల పట్ల దార్శనికంగా ఆలోచించే కేసీఆర్ వంటి ముఖ్యమంత్రికి ప్రధానిగా మోడీ ఏమేరకు సహకారం అందిస్తారనేది ఇ

Published: Wed,July 20, 2016 01:42 AM

మోదీ బాత్ కేజ్రీ టాక్

మోదీకి మన్‌కీ బాత్ ఎంత పాపులారిటీని కొనితెచ్చిందో తెలియదు. కానీ రాష్ట్ర ప్రభుత్వాల పట్ల ఆయన మరింత మెరుగ్గా వ్యవహరించాలి. అలాగే కే        


country oven

Featured Articles