మోదీ బాత్ కేజ్రీ టాక్


Wed,July 20, 2016 01:42 AM

మోదీకి మన్‌కీ బాత్ ఎంత పాపులారిటీని కొనితెచ్చిందో తెలియదు. కానీ రాష్ట్ర ప్రభుత్వాల పట్ల ఆయన మరింత మెరుగ్గా వ్యవహరించాలి. అలాగే కేజ్రీవాల్ టాక్ టు ఏకే కార్యక్రమంఅతనికి ఎంత పాపులారిటీ తేనుందో తెలియదు. కానీ ఢిల్లీ ఈ దేశానికి రాజధాని అనే విషయం మర్చిపోకుండా, కేజ్రీవాల్ దుడుకు వ్యాఖ్యలు మానుకుంటే మంచిది. మోదీ బాత్-కేజ్రీ టాక్ ఏదైనా కావచ్చు. ఇరువురికీ అటు దేశం ఇటు సమాఖ్య స్ఫూర్తి సమాంతర ప్రధానం కావాలి.

ప్రధాని మోదీ రేడియోలో తన మనసులోని మాటను (మన్ కీ బాత్) ప్రజలతో పంచుకుంటున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ప్రజలతో ముఖాముఖి (టాక్ టు ఏకే) కార్యక్రమం ఆరంభించారు. రాజకీయ వైరుధ్యం ఒక్కోసారి ప్రజలకు మంచి కూడా చేస్తుందని చెప్పొచ్చు. మోదీ బాత్ కేజ్రీ టాక్ కాంటెస్టు అందుకు ఒక ఉదాహరణ. అంతవరకు బాగానే ఉంది. కానీ కేజ్రీ టాక్ విపరీత ధోరణి వైపు పయనిస్తుండటమే కాస్త ఇబ్బందికర విషయం. తన టాక్ టు ఏకే కు 47 ఒక్కటే తక్కువైంది. కేంద్రం ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం పట్ల భారత్-పాక్ సంబంధాల వలె వ్యవహరిస్తునదని వ్యాఖ్యానించడమే ఆయన ఏకే 47 ధోరణికి నిదర్శనం. ఈ అసహజ ధోరణి బీజేపీ-ఆమ్ ఆద్మీపార్టీల మధ్య ఎందుకు పెరిగిపోతున్నదనేదే ఇక్కడ కీలక ప్రశ్న. నిజానికి బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు రెండూ కూడా దిగువ మధ్యతరగతి భావజాలం నుంచి ఎదిగిన పార్టీలు కావడం, ముఖ్యం గా ఉత్తరాది అర్బన్, సెమీ ఆర్బన్ ప్రజలలో బీజేపీ ఆదరణకు ఆప్ ఎసరు పెట్టే అవకాశాలుండటం ఆ రెండు పార్టీల మధ్య పెరుగుతున్న అసహజ ధోరణులకు కారణాలు. ఒకే తరగతి భావజాలంలో రెండు పార్టీలూ పోటీ పడుతున్నపుడు జరిగే రాజకీయ పరిణామాలనే మనం చూస్తున్నాం. బీజేపీ 36 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో దిగువ మధ్యతరగతిని పూర్తిగా మెప్పించలేక పోవడంవల్లనే, ఢిల్లీ వంటి పట్టణ ప్రజలు ఆప్‌ను ప్రత్యామ్నాయంగా ఎంచుకున్నారు.
Ksrinivassreddy
ఈ పరంపర ఉత్తరభారత నగరాలకు విస్తరిస్తే బీజేపీ కొంత బలహీనపడటం సహజ పరిణామం. అందుకే బీజేపీ-ఆప్‌ల మధ్య ప్రత్యారోపణల క్రీడను ప్రజలు చూడక తప్పడం లేదు. ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలు ఆప్‌కు ఏకపక్షంగా రావడంతో బీజేపీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అందుకే ఆప్ ప్రభు త్వం పట్ల కేంద్రం కాస్త కఠినంగా వ్యవహరిస్తున్నదేమోననే భావన కలుగడం కూడా సహజం. అందులో నిజమెంతో తెలియదు గానీ, ఆ భావనను కేజ్రీవాల్ బాగా వాడుకలో పెట్టి ప్రజల సానుభూతిని పొందే ప్రయత్నం నిరంతరం చేస్తున్నాడు. అటు బీజేపీ, ఇటు ఆప్ పార్టీలు ఆడుతున్న రాజకీయ క్రీడలో ఢిల్లీ ప్రజలు పరోక్షంగా నలిగిపోతున్నారు.

తన మొదటి టాక్ టూ ఏకేలో కేజ్రీవాల్ సాధ్యాసాధ్యాలను పక్కనబెట్టి చాలా విషయాలు చెప్పారు. ఢిల్లీ రాష్ట్ర పరిధిలోకి పోలీస్ వ్యవస్థ, భూములకు సంబంధించిన అధికారాలను బదలాయించాలన్నారు. ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కల్పించడంపై ఒపీనియన్ పోల్ నిర్వహిస్తామన్నారు.

127 కోట్ల భారతీయులకు ఢిల్లీ రాజధాని. దాన్ని కొన్ని పరిమితులకు లోబ డి మాత్రమే ఒక రాష్ట్రం చేశారు. కాబట్టి దానికి మిగతా రాష్ర్టాల లాగ పూర్తిస్థా యి రాష్ట్ర హోదా ఇవ్వడం కుదిరే పని కాదు. దేశ రాజధానిలో కేంద్ర కార్యాలయాలుంటాయి. విదేశీ పాలకులు వస్తుంటారు. విదేశీ రాయబార కార్యాలయాలుంటాయి. దేశ భద్రతా కార్యాలయాలుంటాయి. ఒకరకంగా చెప్పాలంటే, దేశ అస్తిత్వానికి, దాని భద్రతకు రాజధాని ఒక గుండెకాయ. అలాంటి గుండెకాయను పూర్తిస్థాయిలో ఒక రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించడమనేది ఏ కోణంలో చూసినా కుదరని పని. గతంలో ఆలిండియా సర్వీసు అధికారిగా పనిచేసిన కేజ్రీవాల్‌కు పై విషయాలన్నీ తెలియవనుకోలేం. రాజకీయ వైరుధ్యాన్ని పెంచిపోషిస్తూ తన ప్రజాదరణను కాపాడుకోవాలనే ఉద్దేశం తప్ప కేజ్రీవాల్ డిమాండ్‌లో నిజాయితీ లేదనే చెప్పాలి.

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కూడా కేజ్రీవాల్ చేస్తున్న కొన్ని ఆరోపణలకు అతికినట్లుగా వ్యవహరించడం కనిపిస్తుంది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు కొన్ని ప్రత్యేక అధికారాలున్నమాట నిజం. కానీ ఆయన తీసుకుంటున్న నిర్ణయాలలో కాస్త అత్యుత్సాహం కనిపించడమే.. ప్రతిదాడి కోసం ఎదురుచూసే కేజ్రీవాల్‌కు ఆయుధంగా మారుతుంది. ఢిల్లీ ప్రభుత్వాధికారులను అవినీతి ఆరోపణలపై ఈ మధ్య సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సీబీఐకి అవినీతి అధికారులు కేవలం ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వంలోనే కనిపిస్తున్నారా? అనే కేజ్రీవాల్ ప్రశ్న మోదీ ప్రభుత్వానికి పరీక్ష లాంటిదే. వీటన్నిటినీ చూసినప్పుడు, నిజంగానే మోదీ ప్రభు త్వం కావాలనే కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నదా అనే అనుమానం కలుగడం సహజం. ఆప్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోవాలె తప్ప ప్రభుత్వ పరంగా ఇబ్బందులు పెడితే, ఢిల్లీలో మోదీ ప్రతిష్ఠ దిగజారుతుంది. అలాగే, కేజ్రీవాల్ తన పాలనా వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకు మోదీ ప్రభుత్వ దుడుకు చర్యలను ఎత్తిచూపే అవకాశాన్ని ఉపయోగించుకూనే ఉంటాడు.

ప్రజలు ఆశించినంతగా కేజ్రీవాల్ ప్రభుత్వం పనిచేస్తున్నది కూడాలేదు. నా ఇంట్లో సీబీఐ సోదాలు చేస్తే నాలుగు మఫ్లర్లు తప్ప ఏమీ దొరుకవని కేజ్రీవాల్ గతంలో చాలా గొప్పగా చెప్పా రు. తన నిజాయితే ప్రజలకు కొలమానం కాదు. ప్రభుత్వ పనితీరే ప్రజలకు కొలమానం. ఆప్ ఎమ్మెల్యేలలో వివిధ కేసుల్లో ఐదుగురు అరెస్టు కావడం. ఒక ఆప్ ఎమ్మెల్యేపై 21 కేసులుండటం. క్యాబినెట్‌లోకి నకిలీ డిగ్రీలు కలిగిన వారిని తీసుకోవడం లాంటివన్నీ కేజ్రీవాల్ నిజాయితీ పాలనకు ప్రశ్న గుర్తులే. జన్‌లోక్‌పాల్‌ను తమ ప్రభుత్వం తనకు తానే పాటిస్తుందని చెప్పే కేజ్రీవాల్ పాలనలో ఇలాంటి రికార్డులను ప్రజలు ఆశించలేరు. కుటుంబానికి 20 లీటర్ల మంచినీ రు, 400 యూనిట్లలోపు విద్యుత్ వాడే కుటుంబాలకు 50 శాతం సబ్సిడీ లాం టి వాగ్దానాలను కేజ్రీవాల్ ప్రభుత్వం అమలు చేస్తు న్నా.. ఇంకా అమలు కాని హామీలు కూడా ఉన్నాయి. ఢిల్లీలో కేజ్రీవాల్‌ను రాజకీయంగా ఎదుర్కోవడానికి ఇలాంటి అనేక సమస్యలుండగా, మోదీ ప్రభుత్వం అడ్డదారులు వెదకాల్సిన అవసరం లేదు.
ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం పట్ల కేంద్రం, భారత్-పాక్ సంబంధాల వలె వ్యవహరిస్తుందని కేజ్రీవాల్ ఒక పొలిటికల్ క్రేజీతో మాట్లాడవచ్చుగానీ, అది ప్రజ ల మనోభావాలు ప్రభావితమయ్యేలా ఉండటమే ఎవరికైనా అభ్యంతరకరం.ఢిల్లీ పూర్తిస్థాయి రాష్ట్రం కాదు. అందు కు కారణాలున్నాయి. వాటన్నిటినీ కాదని కేంద్రాన్ని నిందించడం వల్ల కేజ్రీవాల్ పొలిటికల్ మైలేజీకే నష్టం. ఆప్ దేశమంతటా శాఖలు పెట్టుకున్నా అది ఇప్పటికీ ఢిల్లీకి పరిమితమైన పార్టీలాగనే వ్యవహరిస్తున్న కేజ్రీవాల్, దేశంలో తన పార్టీని ఎలా విస్తరించాలనుకుంటున్నారు? పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలపై ఆప్ బాగా ఆశలు పెట్టుకున్నది. నిజానికి పంజాబ్‌లో అకాళీదళ్, కాంగ్రెస్ ప్రభుత్వాలతో అక్కడి ప్రజలు విసిగిపోయి ఉన్నారు. మూడో ప్రత్యామ్నాయం కావాలనుకుంటున్నారు. ఫలితంగానే 2014 జనరల్ ఎన్నికల్లో ఆప్ అక్కడ 4 ఎంపీ స్థానాలను గెలువగలిగింది. ఆ గెలుపే అసెంబ్లీ ఎన్నికలపై ఆప్‌కు ఆశలు రేపుతున్నది. ఢిల్లీ ప్రజలు సంప్రదాయ పార్టీలను కాదని ఆప్‌ను ఎన్నుకోవడానికి కారణం కాస్త భిన్నమైన పాలన కోసమే. కానీ కేజ్రీవాల్ ఆప్‌ను ఇప్పటికే సంప్రదాయపార్టీగా మార్చేశారు. లేని అధికారాల పేర రాజకీయ రాద్ధాంతాలకు అధిక ప్రాధాన్యమివ్వడమే అందుకు నిదర్శనం.

రాష్ర్టాల పట్ల యూపీఏ కన్నా ఎన్డీయే ప్రభుత్వాలే కాస్త మెరుగ్గా వ్యవహరిస్తున్నాయనే పేరుంది. నిజానికి మోదీ కూడా రాష్ర్టాల పట్ల కాస్త మెరుగ్గానే వ్యవహరిస్తున్నారు. కానీ ఉత్తరాఖండ్, అరుణాచల్‌ప్రదేశ్‌లలో ప్రభుత్వాలను పడగొట్టడంలో గల పాత్రతో అంతే అన్‌పాపులారిటీని కొనితెచ్చుకున్నారు. సుప్రీంకోర్టు పుణ్యమాని ఆ రెండు రాష్ర్టాల్లో పాత ప్రభుత్వాలే ఏర్పడగలిగాయి.
మోదీకి మన్‌కీ బాత్ ఎంత పాపులారిటీని కొనితెచ్చిందో తెలియదు. కానీ రాష్ట్ర ప్రభుత్వాల పట్ల ఆయన మరింత మెరుగ్గా వ్యవహరించాలి. అలాగే కేజ్రీవాల్ టాక్ టు ఏకే కార్యక్రమం అతనికి ఎంత పాపులారిటీ తేనుందో తెలియదు. కానీ ఢిల్లీ ఈ దేశానికి రాజధాని అనే విషయం మర్చిపోకుండా, కేజ్రీవాల్ దుడుకు వ్యాఖ్యలు మానుకుంటే మంచిది. మోదీ బాత్-కేజ్రీ టాక్ ఏదైనా కావచ్చు. ఇరువురికీ అటు దేశం ఇటు సమాఖ్యస్ఫూర్తి సమాంతర ప్రధానం కావాలి.
kallurisreddy@gmail.com

633

SRINIVAS REDDY KALLURI

Published: Tue,October 16, 2018 03:29 PM

సంపద సృష్టికే అప్పులు

అప్పులు ఎప్పుడూ సంపద సృష్టికి మాత్రమే ఉపయోగించాలనేది సంక్షేమ రాజ్య పాలకుడికి ఉండాల్సిన సహజ లక్షణం. ఈ లక్షణం కేసీఆర్ అనే పాలకుడిలో

Published: Sun,February 25, 2018 01:31 AM

డైనమిజానికి ప్రతీక

యువనేతలో తెలంగాణ ఒక డైనమిజాన్ని చూస్తున్నది. ఆయనలో క్లాస్ కంటే మాస్ లీడర్‌గా మరింత బలంగా ఉన్నాడు. తెలంగాణ పునర్ నిర్మాణ పథకాల రచనల

Published: Fri,July 7, 2017 01:04 AM

రైతు లక్షణం ఇంకా రాదా?

2022 వరకు వ్యవసాయాన్ని ఇప్పటికన్నా రెండింతల లాభాల బాట పట్టిస్తామని కొన్నాళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీపదేపదే చెబుతున్నారు. కానీ ఆచరణ

Published: Sat,February 18, 2017 01:37 AM

సృజనాత్మక వక్త

భూమిపై సగం, ఆకాశంలో సగం అని చెపితే సరిపోయేది కాదు. ఆర్బీఐ గవర్నర్‌తో సమానమైన బాధ్యతను ఈ దేశ మహిళ నిర్వహిస్తున్నదని చెప్పడమే కవిత ప

Published: Tue,February 7, 2017 01:46 AM

సహకారానికి ఉపకారమేది?

దేశంలో ఒక విశ్వసనీయ పాలకుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్‌ను ప్రధాని మోదీ ప్రశంసలతో ముంచెత్తితే సరిపోదు. కేసీఆర్ విశాల దృక్పథానికి అన

Published: Fri,January 6, 2017 11:54 PM

‘దేశీ’ తెలంగాణ స్ఫూర్తి

ప్రపంచీకరణ ప్రయాణంలో దేశీ ఆలోచనలతో బాధితులను కాపాడుకోవాలనే స్పృహ ఒక నిజమైన దేశీయ పాలకుడికి ఉండాల్సిన లక్షణం. ఆ లక్షణాన్ని ఇపుడు మ

Published: Tue,November 29, 2016 12:53 AM

రెండున్నరేండ్ల సమర్థత

గతంలో దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీకి గ్యారంటీ ఇవ్వగానే బ్యాంకులు ఒప్పేసుకొని మాఫీ చేసిన సందర్భాలున్నాయి. కానీ కేసీఆర్ ప

Published: Tue,November 22, 2016 12:02 AM

నోట్ల రద్దుపై వాస్తవ వైఖరి

ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై రకరకాల అభిప్రాయాలున్నాయి. ప్రజల అభిప్రాయం ఎలా ఉందనే కన్నా ముందు రాజకీయ

Published: Sat,October 22, 2016 01:23 AM

చెరువును చంపొద్దు

వర్షాలు ఇంత భారీగా పడినా కూడా మా ఊరి చెరువులోకి చుక్క నీరు రాలేకపోయింది. దాంతో మా ఊరి చెరువు కింద మరో మూడు ఊర్లకు చెందిన గొలుసుకట్

Published: Wed,October 5, 2016 03:43 AM

మోదీ వ్యూహాత్మక పయనం

నిజానికి కశ్మీరీలు అమాయకులు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే హిందూ యాత్రికులను గుర్రాలపై, బగ్గీలపై తీసుకెళ్లేది కశ్మీరీ ముస్లిం సోదరులే.

Published: Fri,September 16, 2016 01:23 AM

నీటి హక్కుపై నియంత్రణా?

రాష్ట్ర విభజన డ్రాఫ్ట్ బిల్లులో రెండు నదులపై యాజమాన్య బోర్డులు పెట్టాలనే ప్రతిపాదనను ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌తో సహా యావత్ తెలంగాణ బు

Published: Tue,August 9, 2016 01:17 AM

కేసీఆర్-మోదీ: తెలంగాణ

రాజకీయాలకతీతంగా దేశంలోని సమస్యల పట్ల దార్శనికంగా ఆలోచించే కేసీఆర్ వంటి ముఖ్యమంత్రికి ప్రధానిగా మోడీ ఏమేరకు సహకారం అందిస్తారనేది ఇ