ఆత్మలేని విపక్షాలు!


Wed,July 13, 2016 03:16 AM

కొత్త రాష్ట్రంలో ఐదేళ్ల కాలం పంపకాలలోనే గడిచిపోతుంది. అలాగే, కొత్త పాలకుడికి మొదటి ఐదేళ్లకాలం పూల పాన్పు కాదు. కానీ కేసీఆర్ దగ్గర అందుకు తగ్గ పొలిటికల్ కెపాసిటీ, పరిపాలనా క్యాపబిలిటీ, డిప్లమాటిక్ ఎబిలిటీ ఉన్నాయి కాబట్టే, గడిచిన రెండేళ్లలో అటు పంపకాలపై, ఇటు పరిపాలన, అభివృద్ధి ప్రణాళికలపై సమాంతర దృష్టిపెట్టి పనిచేయ గలుగుతున్నారనడంలో సందేహంలేదు.

ఒకవైపు పక్కరాష్ట్రం అభ్యంతరాలు, మరొక వైపు విపక్షాల ఆటంకాలు..ఈ పరిణామాలు పసికూనలాంటి రెండేళ్ల తెలంగాణకు మంచివేనా? కమలనాథన్ కమిటీ సమావేశాలకు కొదువలేదు. పంపకాలు మాత్రం పూర్తి కావు. ఆస్తుల పంపకాలు, సంస్థల పంపకాలు ఎప్పుడవుతాయో తెలియదు. నీటి పంపకాలు, నూతన ప్రాజెక్టుల కిరికిరీలు కొనసాగుతూనే ఉన్నాయి. కొత్త రాష్ట్రంలో ఏర్పడే మొద టి ప్రభుత్వానికి అధికారం ముళ్ల కిరీటం లాంటిది. ఉద్యమంలో అనేక అవరోధాలను ఎదుర్కొన్న అనుభవం కలిగిన కేసీఆర్ మొదటి పాలకుడు అయ్యారు కాబట్టి సరిపోయింది.

kalluri
రెండేళ్లుగా ఎదురైన అన్యాయాలు, అవరోధాలు ఎన్నని చెప్పగలం? ప్రాంతం పట్ల ఆత్మతో పనిచే యని విపక్షాలే అధికారంలోకి వచ్చి ఉంటే ఏం జరిగేది? పక్క రాష్ట్ర అభ్యంతరాలను ఎదుర్కొని శ్రీశైలంలో, నాగార్జునసాగర్‌లో విద్యుత్తు ఉత్పత్తి చేయగలిగేవారేనా? స్వీయ అస్తిత్వ రాజకీయానికున్న దమ్ము ఏమిటో కేసీఆర్ చూపగలిగారు. ప్రాజెక్టుల రీ డిజైనింగ్‌పై గగ్గోలు పెడుతున్న ప్రతిపక్షాలే తాము అధికారంలోకి వచ్చిఉంటే.. రీ డిజైనింగ్ చేయకుం డా మన నీటి వాటాను ఏం చేసేవారో చెప్పగలరా?
లక్ష ఎకరాలకు కూడా సాగునీరు అందించలేకపోతున్న జూరాల నుంచి పాలమూరు ప్రాజెక్టు చేపడితే లక్షల ఎకరాలకు నీరందించగలమా?పుష్కలంగా వరద నీరు లభ్యమయ్యే శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చేపట్టి సుమారు 14 లక్షల ఎకరాలు నీళ్లందించడం తప్పవుతుందా? అయినా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వార ఎత్తయిన లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ నుంచి నీటిని నారాయణపేట-కొడంగల్‌కు తరలిస్తామని ప్రభుత్వం చెపుతున్నా విపక్షాల కు పట్టదా? 69 శాతం కృష్ణానది పరీవాహక ప్రాం తం కలిగి ఉండి కూడా మన ప్రాంతంలో అంతే సమానంగా ప్రాజెక్టులే కట్టకుండా ఇంతకాలం చేసిన నీటి దోపిడీని తిరిగి ఎలా రాబట్టాలో ప్రతిపక్షాలకు తెలుసా? ఆరు దశాబ్దాలలో జరిగిన నీటి దోపిడీని తిరిగి ఎలా రాబట్టుకోవాలో కేసీఆర్‌కు బాగా తెలు సు. అలాంటి విషయాలను కాన్ఫిడెన్షెయల్‌గా ఉంచి పనిచేయాలె తప్ప ఆత్మను మరిచి అడిగే విపక్షాలను ఏమందాం? పోతిరెడ్డి పాడు నుంచి వెళుతున్న వందల టీఎంసీలకు అధికారిక కేటాయింపులున్నాయా? పోతిరెడ్డిపాడు తూములకు లేని అనుమతులు పాలమూరు ప్రాజెక్టుకు అడుగుతుంటే చంద్రబాబును నిలదీయాల్సిన విపక్షాలు.., రీ డిజైనింగ్‌పై మాట్లాడటమే ప్రజలకు ఆశ్చర్యం కలిగించే విషయం. తెలంగాణలో నిర్మిస్తున్నప్రాజెక్టులు అక్ర మ ప్రాజెక్టులు అంటూ కృష్ణాబోర్డుకు, కేంద్ర జల సంఘానికి బాబు లేఖలు రాస్తుంటే.. ఒక్క రోజైనా ప్రతిపక్షాలు ఒక నిరసనగానీ, ఒక ధర్నాగానీ చేసిన దాఖలాలను తెలంగాణ ప్రజలు చూడగలిగారా?

కాళేశ్వరం రీ డిజైనింగ్ చేయాల్సి రావడానికి కూడా కాంగ్రెస్ టీడీపీల పరిపాలనల ఫలితమేనని ఆ రెండు పార్టీలు మర్చిపోతున్నాయి. ఉమ్మడి రాష్ర్టా న్ని ఏలిన కాంగ్రెస్, టీడీపీ హయంలోనే మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాలు గోదావరిపై, కృష్ణాపై వందల సం ఖ్యలో బ్యారేజీలు కట్టి తెలంగాణ ప్రాజెక్టులను ఎండబెట్టాయి. ఇవాళ శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సిం గూరు ప్రాజెక్టులు ఎండిపోతున్నాయంటే ఎవరి పుణ్యమో ఆత్మపరీశీలన చేసుకోలేని విపక్షాలు ఇవా ళ కాళేశ్వరం రీడిజైనింగ్‌ను తప్పుబడుతున్నందుకు సిగ్గుపడాలి. కాళేశ్వరం ద్వారా అనేక రిజర్వాయర్ల లో 144 టీఎంసీల నీళ్లు నింపి 18 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుతో పాటు, డిపెండెబిలిటీ కోల్పోయిన శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూర్ ప్రాజెక్టుల పాత ఆయకట్టుతో కలిపి మరో 19లక్షల ఎకరాలకు(మొత్తం18+19=37లక్షల ఎకరాలకు)నీరందించడమే కాళేశ్వరం(మేడిగడ్డ) ప్రాజెక్టు లక్ష్యం. ఈ విషయాన్ని విపక్షాలు మర్చిపోయి మాట్లాడినా వాళ్లను చరిత్ర క్షమించగలదా?

విభజన పంపకాల బాధ్యత అంతా కేసీఆర్‌దే అన్నట్లు వ్యవహరిస్తున్న విపక్షాలు, రేపు తెలంగాణ ప్రజలను ఓట్లు ఎట్లా అడుగాలనుకుంటున్నాయి? పక్క రాష్ట్రం అభ్యంతరాలకు, అన్యాయాలకు భజన చేస్తూ ఓట్లడుగుతాయా? దేశ న్యాయ చరిత్రలోనే మొదటిసారి తెలంగాణ జడ్జీలు రోడ్లెక్కారు. ప్రాం తం న్యాయం కోసం విధులను బహిష్కరించారు. హైకోర్టు విభజన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చేతిలో ఉందని బాధ్యతారహితంగా చెప్పి కేంద్ర న్యాయశా ఖ మంత్రి చేతులు దులుపుకున్నారు. అట్లా వ్యాఖ్యానించిన కేంద్ర మంత్రి దేశానికి పాలకుడనుకోవా లా? లేక చంద్రబాబుకు సామంతుడనుకోవాలా? ప్రతిపక్ష పార్టీగా తెలంగాణలో బతుకుతున్న బీజేపీ వైఖరి బాబు పక్షమా? తెలంగాణ ప్రజల పక్షమా? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కలుగజేసుకొని న్యాయవాదులతో మాట్లాడి త్వరలో న్యాయం చేస్తామన్నారు కాబట్టి సరిపోయింది. తెలుగుదేశం పార్టీ జాతీయపార్టీ అయిపోయిందట! దాని అధిష్ఠానం విజయవాడలో ఉన్నదట! బాబు ఆదేశాలను శిరస్సుపై మోసే రేవంత్ కిష్టాపూర్‌లో దీక్షలు చేస్తాడు తప్ప..తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు లేఖలు రాస్తున్న చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎందుకు దీక్షలు చేస్తాడు?

తెలంగాణ ఇచ్చామని చెప్పుకోవడం ఒక్కటే తెలు సు తప్ప తామేం చేస్తున్నామనేది కాంగ్రెస్ నేతలకు పట్టదు. ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపే బాధ్యత నిస్సంకోచంగా ప్రతిపక్షానిదే. కానీ రంధ్రాన్వేషణలు తప్ప నిర్మాణాత్మక పాత్ర ఏది? బతికి చెడినోడిలో అక్కసు ఎలా ఉంటుందో కాంగ్రెస్ నేతల్లోనూ మనకు అదే కనిపిస్తుంది. జలయజ్ఞం ఎవరు చేసినా వాళ్లకు ధనయజ్ఞంలాగే కనిపిస్తుంది. మిషన్ భగీరథ, కాకతీయ, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ఈ ఏడాది బడ్జెట్‌లో సుమారు రూ. 30 వేల కోట్లు కేటాయించారు. బడ్జెట్ ప్రవేశ పెట్టి నాలుగు నెలలు కూడా కాలేదు. ఆ మూడు పథకాలకు నాలుగు నెల ల్లో సుమారు పదివేల కోట్లు కూడా ఖర్చు చేశారో లేదో తెలియదు. కానీ ఒక కాంగ్రెస్ నేత లక్ష కోట్ల అవినీతి జరిగిందంటాడు. మరొకాయన రెండు లక్ష ల కోట్ల అవినీతి జరిగిందంటాడు.ప్రతిపక్షం అన్నపు డు విమర్శ చేస్తే కాస్త అతికినైట్లెనా ఉండాలి కదా! వచ్చిన తెలంగాణలో నిజంగానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిఉంటే ఏం జరిగేది? పంపకాలను ఏమేరుకు పట్టించుకునేవారు? కొత్త ప్రాజెక్టుల నిర్మాణా ల అనుమతుల కోసం కృష్ణా,గోదావరి యాజమాన్య బోర్టులకు వదిలేసేవారా? లేక కేసీఆర్‌లాగ స్వతంత్రంగా తెగించి చేపట్టేవారా? మొదటిదే నిజం చేసేవారని కళ్లు మూసుకొని ఎవరైనా చెప్పగలుగుతారు. స్వీయ అస్తిత్వ రాజకీయానికి-బయటి అధిష్టానాల రాజకీయానికి ఉండే తేడా ఏమిటో గడిచిన రెండేళ్ల కాలమే తేల్చిచెపుతున్నది. కాంగ్రెస్ నేతలు విమర్శలపై చూపుతున్న ఆసక్తిని, విభజన పంపకాలలో కూడా చూపగలిగితే తెలంగాణ ఇచ్చామన్న పేరుకు కొంత సార్థకతనైనా దక్కించుకోగలుగుతారు.

తమిళనాడు ద్రవిడ రాజకీయాల్లో వైరుధ్యాలు ఉంటాయి తప్ప ప్రాంతం పట్ల విరుద్ధాలు ఉండవు. కర్ణాటకతో ఉన్న కావేరీ జల వివాదాలపై తమిళ పార్టీలు అన్నీ ఒకే గొంతుతో మాట్లాడుతాయి తప్ప, మన ప్రతిపక్షాల లాగ అంతా కేసీఆర్‌దే బాధ్యత తప్ప మాది కాదన్నట్లుగా వ్యవహరించవు. కానీ రెం డేళ్లు కూడా గడువని కౌమార దశలో ఉన్న తెలంగా ణ రాష్ట్రంలో విమర్శల వ్యాపకంలో మునిగితేలుతున్నాయి తప్ప కీలకమైన విభజన పంపకాలపై, పక్క రాష్ట్రం పెడుతున్న కిరికిరీలపై ఏమేరకు స్పందిస్తున్నా యో ప్రతిపక్షాలే ఆత్మవిమర్శ చేసుకోవాలి. తెలంగాణలో బతుకుతున్న ప్రతిపక్షాల విరుద్ధ పోకడలు పక్కరాష్ట్రం సృష్టిస్తున్న అడ్డంకులకు మరింత అవకాశాన్నిస్తాయని మర్చిపోకూడదు.
ఆధారం ఉన్న విమర్శలను ప్రజలు ఎప్పుడూ స్వాగతిస్తారు. అలాగే, ఆధారాలు లేని విమర్శలను ప్రజలు ఎప్పుడూ విశ్వసించరు. కాబట్టి, ప్రతిపక్షా లు ఆధారాలు లేని విమర్శలు చేయకుండా కనీసం ఐదేళ్ల పాటు తమకు తామే మారిటోరియం విధించుకుంటే మంచిది. తెలంగాణ పంపకాలపై, ప్రాంత ప్రయోజనాలపై దృష్టిపెట్టి పనిచేస్తే మరీ మంచిది. దేశంలో అనేక కొత్త రాష్ర్టాలు ఏర్పడి ఉండొచ్చు. కానీ అన్యాయాలకు వ్యతిరేకంగా ఏర్పడిన రాష్ట్రం దేశంలో ఒక్క తెలంగాణ మాత్రమే అని ఎవరూ మర్చిపోకూడదు. ఈ విషయాన్ని ప్రతిపక్షాలు ఏమేరకు గుర్తించిపని చేస్తున్నాయనేదే ప్రజలకు అవసరం.ఆత్మతో పనిచేయని విపక్షాలు ఉంటేమీ లేకుంటేమీ అనే పరిస్థితిని కొనితెచ్చుకోవద్దు.
కొత్త రాష్ట్రంలో ఐదేళ్ల కాలం పంపకాలలోనే గడిచిపోతుంది. అలాగే, కొత్త పాలకుడికి మొదటి ఐదేళ్ల కాలం పూల పాన్పు కాదు. కానీ కేసీఆర్ దగ్గర అం దుకు తగ్గ పొలిటికల్ కెపాసిటీ, పరిపాలనా క్యాపబిలిటీ, డిప్లమాటిక్ ఎబిలిటీ ఉన్నాయి కాబట్టే, గడిచిన రెండేళ్లలో అటు పంపకాలపై, ఇటు పరిపాలన, అభివృద్ధి ప్రణాళికలపై సమాంతర దృష్టిపెట్టి పనిచేయ గలుగుతున్నారనడంలో సందేహంలేదు. స్వీయ అస్తిత్వ రాజకీయ శక్తికి ఉండే సహజ లక్షణం అది !

686

SRINIVAS REDDY KALLURI

Published: Tue,October 16, 2018 03:29 PM

సంపద సృష్టికే అప్పులు

అప్పులు ఎప్పుడూ సంపద సృష్టికి మాత్రమే ఉపయోగించాలనేది సంక్షేమ రాజ్య పాలకుడికి ఉండాల్సిన సహజ లక్షణం. ఈ లక్షణం కేసీఆర్ అనే పాలకుడిలో

Published: Sun,February 25, 2018 01:31 AM

డైనమిజానికి ప్రతీక

యువనేతలో తెలంగాణ ఒక డైనమిజాన్ని చూస్తున్నది. ఆయనలో క్లాస్ కంటే మాస్ లీడర్‌గా మరింత బలంగా ఉన్నాడు. తెలంగాణ పునర్ నిర్మాణ పథకాల రచనల

Published: Fri,July 7, 2017 01:04 AM

రైతు లక్షణం ఇంకా రాదా?

2022 వరకు వ్యవసాయాన్ని ఇప్పటికన్నా రెండింతల లాభాల బాట పట్టిస్తామని కొన్నాళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీపదేపదే చెబుతున్నారు. కానీ ఆచరణ

Published: Sat,February 18, 2017 01:37 AM

సృజనాత్మక వక్త

భూమిపై సగం, ఆకాశంలో సగం అని చెపితే సరిపోయేది కాదు. ఆర్బీఐ గవర్నర్‌తో సమానమైన బాధ్యతను ఈ దేశ మహిళ నిర్వహిస్తున్నదని చెప్పడమే కవిత ప

Published: Tue,February 7, 2017 01:46 AM

సహకారానికి ఉపకారమేది?

దేశంలో ఒక విశ్వసనీయ పాలకుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్‌ను ప్రధాని మోదీ ప్రశంసలతో ముంచెత్తితే సరిపోదు. కేసీఆర్ విశాల దృక్పథానికి అన

Published: Fri,January 6, 2017 11:54 PM

‘దేశీ’ తెలంగాణ స్ఫూర్తి

ప్రపంచీకరణ ప్రయాణంలో దేశీ ఆలోచనలతో బాధితులను కాపాడుకోవాలనే స్పృహ ఒక నిజమైన దేశీయ పాలకుడికి ఉండాల్సిన లక్షణం. ఆ లక్షణాన్ని ఇపుడు మ

Published: Tue,November 29, 2016 12:53 AM

రెండున్నరేండ్ల సమర్థత

గతంలో దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీకి గ్యారంటీ ఇవ్వగానే బ్యాంకులు ఒప్పేసుకొని మాఫీ చేసిన సందర్భాలున్నాయి. కానీ కేసీఆర్ ప

Published: Tue,November 22, 2016 12:02 AM

నోట్ల రద్దుపై వాస్తవ వైఖరి

ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై రకరకాల అభిప్రాయాలున్నాయి. ప్రజల అభిప్రాయం ఎలా ఉందనే కన్నా ముందు రాజకీయ

Published: Sat,October 22, 2016 01:23 AM

చెరువును చంపొద్దు

వర్షాలు ఇంత భారీగా పడినా కూడా మా ఊరి చెరువులోకి చుక్క నీరు రాలేకపోయింది. దాంతో మా ఊరి చెరువు కింద మరో మూడు ఊర్లకు చెందిన గొలుసుకట్

Published: Wed,October 5, 2016 03:43 AM

మోదీ వ్యూహాత్మక పయనం

నిజానికి కశ్మీరీలు అమాయకులు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే హిందూ యాత్రికులను గుర్రాలపై, బగ్గీలపై తీసుకెళ్లేది కశ్మీరీ ముస్లిం సోదరులే.

Published: Fri,September 16, 2016 01:23 AM

నీటి హక్కుపై నియంత్రణా?

రాష్ట్ర విభజన డ్రాఫ్ట్ బిల్లులో రెండు నదులపై యాజమాన్య బోర్డులు పెట్టాలనే ప్రతిపాదనను ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌తో సహా యావత్ తెలంగాణ బు

Published: Tue,August 9, 2016 01:17 AM

కేసీఆర్-మోదీ: తెలంగాణ

రాజకీయాలకతీతంగా దేశంలోని సమస్యల పట్ల దార్శనికంగా ఆలోచించే కేసీఆర్ వంటి ముఖ్యమంత్రికి ప్రధానిగా మోడీ ఏమేరకు సహకారం అందిస్తారనేది ఇ