నమస్తే ప్రస్థానం వర్ధిల్లాలె


Sun,June 5, 2016 12:50 AM

తెలంగాణ వచ్చింది. కానీ దాడులు ఆగిపోలేదు. అవకాశం ఉన్న ప్రతి చోటా అన్యాయమూ ఆగిపోలేదు. నిరంతరం తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణకు నమస్తే వాచ్‌డాగ్‌లా పనిచేస్తున్నది. మూడేళ్లు ఉద్యమ గొంతుకగా, రెండేళ్లు విజన్ వాచ్‌గా.. నమస్తే ప్రస్థానానికి ఐదేళ్లు గడిచిపోయాయి. ఆరో ఏట అడుగిడుతున్నది.
జూన్ ఒక్క తెలంగాణను మాత్రమే తేలేదు. నమస్తే తెలంగాణనూ తెచ్చింది. తెలంగాణ రాష్ట్ర రెండో ఆవిర్భావోత్సవాలు జూన్ 2న జరుపుకున్నాం. నమస్తే తెలంగాణ ఐదో వార్షికోత్సవం జూన్ 6న జరుపుకుంటాం. అందుకే తెలంగాణ సాధన చరిత్రలో జూన్ నెలకు ఒక ప్రత్యేకత ఉంది. సిబ్బంది కలాల కష్టం, యాజమాన్య సమర్థత ఫలితంగా.. అంతకు మించి పాఠకలోక అద్భుత ఆదరణ ద్వారా నమస్తే కు లభించిన ఐదేళ్ల అపూర్వ సంబురం ఇది. నమస్తే ఐదేళ్లు పూర్తి చేసుకొని ఆరో ఏట అడుగిడుతున్న సందర్భంగా.. దాని నేపథ్యాన్ని, తెలంగాణ సమాజం పట్ల దాని అంకితభావాన్ని, అవిరళకృషిని, భవిష్యత్ తెలంగాణ పట్ల దాని కీలకపాత్రను విశ్లేషించుకుందాం.

srinivas
తెలంగాణ వస్తే తెలంగాణకే నష్టమటగదా? తెలంగాణ వస్తే నీళ్లు రావటగదా? తినడానికి బియ్యం దొరకవటకదా? కనీసం ఇలాంటి సిల్లీ సంశయాలను పెంచిపోషించేవాళ్లను ఎదుర్కొని వాస్తవాలను ఆవిష్కరించే బలమైన ప్రింట్‌మీడియా లేని లోటు పదేళ్లపాటు తెలంగాణ ఉద్యమాన్ని వెంటాడింది. నిజాలు అబద్ధాలుగా, అబద్ధాలు నిజాలుగా చెలామణిలో పెట్టిన సమైక్యుల తీరుకు ప్రజలు సైతం కొంతమేర నమ్మిన సంఘటనలు అనేకం. పొట్టి శ్రీరాములు మద్రాసు రాష్ట్రంలో ఉన్న ఆంధ్రాప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రం చేయాలనే డిమాండ్‌తో ఆమరణదీక్ష చేసి అమరుడయ్యారు. కానీ ఆయన ఆంధ్రా-తెలం గాణ విలీనం కోసం అమరుడయ్యారని సీమాంధ్రుల వింత ప్రచారాన్ని తెలంగాణలోనూ కొందరు నమ్మా రు. పొట్టిశ్రీరాములు అమరుడైంది ఆంధ్రా రాష్ట్రం కోసం తప్ప తెలంగాణతో కలవడానికి కాదని ఎంత మొత్తుకున్నా చాలాకాలం అర్థంకాలేదు. తెలంగాణ ఏర్పడితే రెండు నదుల నీళ్లు ఆంధ్రోళ్లు ఆపేస్తారట గదా అని అమాయకులు అడుగుతుంటే... మీడియాలేని కొరతను ఎదుర్కొంటున్న తెలంగాణ వారిని కావాలని ఆటపట్టిస్తుంటే చాలా బాధ కలిగేది. నదుల నీళ్లు ఎగువ ప్రాంతమైన తెలంగాణ నుంచే దిగువ ప్రాంతమైన ఆంధ్రకు వెళ్తాయనే సత్యం ప్రజలకు తెలియక కాదు.

నిరంతరం ప్రజల్లో గందరగోళం సృష్టిం చే విశ్వప్రయత్నాల్లో అలాంటి విష ప్రచారాలెన్నో జరిగాయి.అప్పట్లో కేసీఆర్ జలసాధన యాత్ర చేసి వెలుగులోకి తెచ్చిన అనేక నిజాలు సగటు తెలంగాణవాసి దాకా చేరవేసే సాధనం లేకపోయింది. ఉమ్మడి అసెంబ్లీలో మన నీళ్ల వాటా, మన నిధుల వాటా, మన ఉద్యోగాల వాటాపై ప్రభుత్వాలను నాలుగేళ్ల పాటు నిరంతరం నిలదీసిన కేసీఆర్ వాదనలకు అప్పటి మీడియాలో లభించిన చోటెంత? దశాబ్దాల పాటు తెలంగాణ రాజకీయ అనాథగానే కాదు, మీడియాలేని అనాథగా తనేమిటో తానే తెలుసుకోలేక బతికింది.

2011 జూన్ 6 వరకు ఆంధ్రుల జ్యోతులు, ఈనాడులు, ఆనాడులు వండి వార్చిన వార్తలు చదువుకోవడం తప్ప మనకు మరో మార్గం ఉన్నదా? ఉద్యమా న్ని వక్రీకరించి వడ్డించిన సందర్భాలనూ చూశాం. ఉద్యమ పంథాను చీల్చి చూపించే నిరంతర ప్రయత్నాలనూ చూశాం. ఏది సత్యం, ఏది అసత్యం అంతుపట్టని ఆంధ్రామీడియా మాయాజాలాన్ని ఛేదించి వార్తల్లోని వాస్తవాలను ప్రజలకు అందిచకపోతే ఉద్య మం నిలబడి గెలవడం అంత సులభం కాదని అప్పటికే కేసీఆర్‌తో పాటు ఉద్యమకారులూ భావించారు. ఆ ఆలోచనలే 2011 జూన్ 6న నమస్తే తెలంగాణ కు జన్మనిచ్చాయి. రవీంద్రభారతి సాక్షిగా స్వర్గీయ జయశంకర్, కేసీఆర్ నుంచి ఫణికర మల్లయ్య దాకా ఆసీనులైన నిండు సభలో నమస్తే మొదటి ప్రతి విడుదలైంది. తెలంగాణ మీడియా రంగం ఎన్నటికీ మర్చిపోలేని రోజది. తెలంగాణ గుండె చప్పుడు వినపడ టం మొదలైంది. అల్లం నారాయణ సంపాదకులుగా నమస్తే రాతల పోరాటం మొదలుపెట్టింది. వాస్తవాలను వెలికితీసి లోకానికి చాటే క్రియాత్మక కలాలు కదిలాయి. వార్తల్లోని వాస్తవాల ఆవిష్కరణ మొదలైంది.

మన నీళ్లెన్ని, నిధులెన్ని, ఉద్యోగాలెన్ని లెక్కగట్టి చెప్పగల స్థితికి తెలంగాణ సమాజం చేరుకోవడంలో నమస్తే కృషి సఫలమైంది. జాగృత తెలంగాణను ఆవిష్కరించడంలో నమస్తే పాత్ర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆంధ్రాపార్టీల అసలు రూపాలను ఆవిష్కరించింది. ఆంధ్రాపార్టీలతో అనర్థమేమిటో విడమరిచి చెప్పింది. స్వీయ రాజకీయ అస్తి త్వం ఎందుకు కావాలో చాటగలిగింది. శ్రీకృష్ణ కమిటీ కుట్రలను బద్దలు కొట్టి సంచలనం సృష్టించింది. 8వ చాప్టర్ రహస్యాలను బయటపెట్టి కుట్రదారులకు షాకిచ్చింది. ఉద్యమ ఉధృతికి ఊతమందించింది. ఢిల్లీ పెద్దలపై ఒత్తిడి పెరిగేలా సంచలన కథనాలను అందించింది. దాంతో 8వ చాప్టర్‌లోని కుట్రలకు విభజన బిల్లులో కొంతమేరకైనా చోటు లేకుండా చేయగలిగిం ది. అస్తిత్వ పోరాటాన్ని నిలబెట్టి తెలంగాణను గెలిపించడంలో ముమ్మాటికి నమస్తే కృషి కాదనలేనిది. ఆంధ్రామీడియా విష ప్రచారాలకు చెక్ పెట్టి ఉద్యమానికి రక్షణ కవచంలా నిలిచింది.

కలాలతో కలెబడి, నిలబడి తెలంగాణను గెలిపించడంలో నమస్తే పోషించిన కీలక పాత్ర అంతటితో అయిపోలేదు. వచ్చిన తెలంగాణలో నమస్తే బాధ్యత మరింత పెరిగింది. ఉద్యమ కాలం కంటే ఎక్కువగా పనిచేయాల్సిన అవసరం ఏర్పడింది. అందుకు తగ్గట్లుగానే నిరంతరం వాస్తవాలపై నిఘాపెట్టి పనిచేసే కట్టా శేఖర్‌రెడ్డి సంపాదకులుగా రెండేళ్లుగా నమస్తే ప్రస్థానం నిజాలను నిగ్గు తేలుస్తున్నది. విభజన పంపకాలు అయిపోలేదు. ఉద్యోగుల పంపకాలలో, ఆస్తుల పంపకాలలో, నీళ్ల పంపకాలలో ఆంధ్రా పాలకుల కిరికిరీలు చూస్తూనే ఉన్నాం. పంపకాల విషయంలో ఆంధ్రా మీడియా వంకర రాతలు కొనసాగుతూనే ఉన్నాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్ నీటి పంపకాలలో కావచ్చు. పాలమూరు ఎత్తిపోతల పథకం పట్ల చంద్రబాబు అభ్యంతరం చెప్పడంపై కావచ్చు, గోదావరిపై కాళేశ్వరం ప్రాజెక్టు పట్ల కావచ్చు అవకాశం దొరికినప్పుడల్లా తెలంగాణ ప్రయోజనాలపై వక్రీకరణ రాతలకు ఆంధ్రామీడియా వెనుకాడుతున్నది లేదు.

ఓవైపు కేసీఆర్ పాలనను మెచ్చుకుంటూనే, మరోవైపు నర్మగర్భ కథనాలతో విషం చిమ్మడం ఆంధ్రా మీడియా మానుకోలేదు. కుట్రలపై ప్రభుత్వం స్పందించే కన్నా ముందే నమస్తే స్పందించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. తెలంగాణ ప్రయోజనాల పట్ల నమస్తే అంకితభావానికి అవి నిదర్శనాలు. రెండు జీవనదుల్లో తెలంగాణ కలిగివున్న నీటి వాటా పై, నిర్మించిన, నిర్మాణంలో ఉన్న, నిర్మించబోయే ప్రాజెక్టులపై సవివరంగా తెలంగాణ జలదృశ్యాన్ని తెలంగాణ పాఠక లోకానికి నమస్తే అద్భుతంగా అందిస్తూ వచ్చింది. ఆంధ్రామీడియా, ఆంధ్రాపార్టీల ద్వంద్వ నాటకాలను బహిర్గతం చేస్తూ వస్తున్నది. ఇప్పటిదాకా రెండు నదులలో జరిగిన, జరుగుతున్న నీటిదోపిడీపై అద్భుతమైన కథనాలను రెండేళ్లుగా అందిస్తూ వస్తున్నది.

నీళ్ల విషయంలో అనేక కథనాలను పాఠకులకు సమగ్రంగా ఎప్పటికప్పుడు అంది స్తూ ఆంధ్రా మీడియా వంకర రాతలకు చెక్ పెట్టగలుగుతున్నదంటే.. అందుకు సంపాదకులు కట్టా శేఖర్‌రెడ్డి కృషిని అభినందించక తప్పదు. ఉద్యోగాల పంపకంలో జరుగుతున్న అన్యాయాలను నమస్తే ఎలుగెత్తుతున్నది, ఆస్తుల పంపకాలలో జరుగుతున్న కుట్రలను కథనాల రూపంలో బహిర్గతం చేస్తూనే ఉన్నది. పంపకాలలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల గురించి కనీసం తెలంగాణ ఎడిషన్‌లోనైనా ఏ ఆంధ్ర పత్రికనైనా రాస్తున్న దాఖలా ఉన్నదా? అలాంటి పత్రికలు కేసీఆర్ ప్రభుత్వాన్ని పొగడడంలో నిజాయితీ ఉన్నదనుకోవచ్చా? కేసీఆర్ ప్రభుత్వ పనితీరు ను పొగడడం తప్పుకాదు. కానీ నిజాయితీ ఎంత అనేదే ప్రశ్న. ఒకవేళ ఆంధ్రామీడియాకు నిజాయితే ఉంటే.. కృష్టా, గోదావరి నీళ్ల పై చంద్రబాబు వాదనలను పరోక్షంగా సమర్థిస్తూ ఎందుకు కథనాలు రాస్తున్నాయో చెప్పగలగాలి. సమధర్మాన్ని పాతరేసి పరధర్మం పాటించే పత్రికల ప్రశంసల్లో నిజాయితీ ఉంటదా?

తెలంగాణ వచ్చింది. కానీ నిరంతర దాడులు ఆగిపోలేదు. అవకాశం ఉన్న ప్రతి చోటా అన్యాయమూ ఆగిపోలేదు. నిరంతరం తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణకు నమస్తే వాచ్‌డాగ్ లా పనిచేస్తున్నది. మూడే ళ్లు ఉద్యమ గొంతుకగా, రెండేళ్లు విజన్ వాచ్‌గా.. నమ స్తే ప్రస్థానానికి ఐదేళ్లు గడిచిపోయాయి. ఆరో ఏట అడుగిడుతున్నది. తెలంగాణ గుండెచప్పుడు ఎప్పు డూ ఆగేది కాదు. కాలంతో పాటు నమస్తే ప్రస్థా నం కొనసాగుతుంది. ఆంధ్రా మీడియా రంగుల కథనాల న్నీ మన మంచికే అనుకుంటే పొరపాటే. అ రంగులు ఎప్పుడైనా మారవచ్చు. లేదా అపుడుపుడూ విషం చిమ్ముతూనే ఉండొచ్చు. కాబట్టి మన మీడియా మనదే. మన నమస్తే తెలంగాణ మనదే.

1234

SRINIVAS REDDY KALLURI

Published: Tue,October 16, 2018 03:29 PM

సంపద సృష్టికే అప్పులు

అప్పులు ఎప్పుడూ సంపద సృష్టికి మాత్రమే ఉపయోగించాలనేది సంక్షేమ రాజ్య పాలకుడికి ఉండాల్సిన సహజ లక్షణం. ఈ లక్షణం కేసీఆర్ అనే పాలకుడిలో

Published: Sun,February 25, 2018 01:31 AM

డైనమిజానికి ప్రతీక

యువనేతలో తెలంగాణ ఒక డైనమిజాన్ని చూస్తున్నది. ఆయనలో క్లాస్ కంటే మాస్ లీడర్‌గా మరింత బలంగా ఉన్నాడు. తెలంగాణ పునర్ నిర్మాణ పథకాల రచనల

Published: Fri,July 7, 2017 01:04 AM

రైతు లక్షణం ఇంకా రాదా?

2022 వరకు వ్యవసాయాన్ని ఇప్పటికన్నా రెండింతల లాభాల బాట పట్టిస్తామని కొన్నాళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీపదేపదే చెబుతున్నారు. కానీ ఆచరణ

Published: Sat,February 18, 2017 01:37 AM

సృజనాత్మక వక్త

భూమిపై సగం, ఆకాశంలో సగం అని చెపితే సరిపోయేది కాదు. ఆర్బీఐ గవర్నర్‌తో సమానమైన బాధ్యతను ఈ దేశ మహిళ నిర్వహిస్తున్నదని చెప్పడమే కవిత ప

Published: Tue,February 7, 2017 01:46 AM

సహకారానికి ఉపకారమేది?

దేశంలో ఒక విశ్వసనీయ పాలకుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్‌ను ప్రధాని మోదీ ప్రశంసలతో ముంచెత్తితే సరిపోదు. కేసీఆర్ విశాల దృక్పథానికి అన

Published: Fri,January 6, 2017 11:54 PM

‘దేశీ’ తెలంగాణ స్ఫూర్తి

ప్రపంచీకరణ ప్రయాణంలో దేశీ ఆలోచనలతో బాధితులను కాపాడుకోవాలనే స్పృహ ఒక నిజమైన దేశీయ పాలకుడికి ఉండాల్సిన లక్షణం. ఆ లక్షణాన్ని ఇపుడు మ

Published: Tue,November 29, 2016 12:53 AM

రెండున్నరేండ్ల సమర్థత

గతంలో దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీకి గ్యారంటీ ఇవ్వగానే బ్యాంకులు ఒప్పేసుకొని మాఫీ చేసిన సందర్భాలున్నాయి. కానీ కేసీఆర్ ప

Published: Tue,November 22, 2016 12:02 AM

నోట్ల రద్దుపై వాస్తవ వైఖరి

ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై రకరకాల అభిప్రాయాలున్నాయి. ప్రజల అభిప్రాయం ఎలా ఉందనే కన్నా ముందు రాజకీయ

Published: Sat,October 22, 2016 01:23 AM

చెరువును చంపొద్దు

వర్షాలు ఇంత భారీగా పడినా కూడా మా ఊరి చెరువులోకి చుక్క నీరు రాలేకపోయింది. దాంతో మా ఊరి చెరువు కింద మరో మూడు ఊర్లకు చెందిన గొలుసుకట్

Published: Wed,October 5, 2016 03:43 AM

మోదీ వ్యూహాత్మక పయనం

నిజానికి కశ్మీరీలు అమాయకులు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే హిందూ యాత్రికులను గుర్రాలపై, బగ్గీలపై తీసుకెళ్లేది కశ్మీరీ ముస్లిం సోదరులే.

Published: Fri,September 16, 2016 01:23 AM

నీటి హక్కుపై నియంత్రణా?

రాష్ట్ర విభజన డ్రాఫ్ట్ బిల్లులో రెండు నదులపై యాజమాన్య బోర్డులు పెట్టాలనే ప్రతిపాదనను ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌తో సహా యావత్ తెలంగాణ బు

Published: Tue,August 9, 2016 01:17 AM

కేసీఆర్-మోదీ: తెలంగాణ

రాజకీయాలకతీతంగా దేశంలోని సమస్యల పట్ల దార్శనికంగా ఆలోచించే కేసీఆర్ వంటి ముఖ్యమంత్రికి ప్రధానిగా మోడీ ఏమేరకు సహకారం అందిస్తారనేది ఇ