కాంగ్రెస్ ముక్త్ కాదు.. కరప్షన్ ముక్త్


Tue,May 31, 2016 01:13 AM

జాతీయపార్టీలుగా దేశానికి బీజేపీ ఎంత అవసరమో, కాంగ్రెస్ కూడా అంతే అవసరం. అందులో ఏ ఒక్కటి లేకున్నా దేశంలో ఒకరకమైన రాజకీయ అస్థిరతకు అవకాశం ఏర్పడుతుంది. అది దేశ అస్తిత్వానికి మంచి పరిణామం కాబోదు. అమిత్‌షా జీ... మీరు కోరుకోవాల్సింది కాంగ్రెస్ ముక్త్ భారత్ కాదు,భ్రష్టాచార్ ముక్త్ భారత్‌ను.

srinivas
తెలంగాణలో ఆంధ్రాపార్టీల అవసరం లేదనడంలో ఒక సమంజసం ఉన్నది. ఎందుకంటే ఒక ప్రాంత ప్రయోజనాలను మరొక ప్రాంతానికి చెందిన పార్టీ నెరవేర్చజాలదు. కాబట్టి ఒక జాతీయపార్టీ నుంచి దేశం విముక్తి కావాలని కోరుకోవడంలో మాత్రం అలాంటి అర్థం ఉండదు. ఇటీవలి ఐదు రాష్ర్టాల ఎన్నికల ఫలితాలను దృష్టిలో ఉంచుకొని మరొకసారి బీజేపీ ప్రముఖ నేతలు కాంగ్రెస్ రహిత్/ముక్త్ భారత్ అనే పొలిటికల్ మైలేజ్ నినాదాన్ని వినిపిస్తుండటమే ఇక్కడ చర్చనీయాంశం.

తాను గెలవకున్నా ఫరవాలేదు, తన ప్రత్యర్థి గెలవకుంటే చాలనుకోవడం చాలాసార్లు భస్మాసురుడి కథలాగా మారుతుంటుంది. ఉదాహరణకు, బీజేపీ వ్యతిరేక పార్టీలతో జతకట్టి ఈ దేశంలో కమ్యూనిస్టు లు బలహీనపడ్డారు. కామ్రేడ్లు తమ సొంత బలాన్ని గత ముప్పై ఏళ్లలో చాలా కోల్పోయారు. అంతెందుకు మొన్న పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్‌తో జత కట్టారు. కానీ కమ్యూనిస్టుల కన్నా కాంగ్రెస్ పార్టీయే అక్కడ ఎక్కువ స్థానాలు దక్కించుకోవడం గమనార్హం. అట్లాగే ఇప్పు డు కాంగ్రెస్ అంతమైతే దాని స్థానాన్ని మరిన్ని కొత్త ప్రాంతీయ పార్టీ లు వశం చేసుకుంటాయి, తప్ప బీజేపీ వశం చేసుకుంటుందా? బీజేపీ బలపడటం దేవుడెరుగు, పార్లమెంటులో ఇప్పుడున్న 40 పార్టీలు, రెండితలు అయ్యే అవకాశాలే ఎక్కువ.

దేశంలో రెండు బలమైన జాతీయపార్టీలు(కాంగ్రెస్, బీజేపీ) ఉండబట్టే కేంద్రంలో ఏదో ఒక జాతీయపార్టీ నేతృత్వంలో కూటమి ఏర్పడి దేశాన్ని ఏలగలుగుతున్నాయి. ఈ దేశ సార్వభౌమత్వాన్నీ చాటగలుగుతున్నాయి. నిజం చెప్పాలంటే దేశంలో ఒకే జాతీయపార్టీ మనగలగడం నేటి దేశ రాజకీయాల్లో సాధ్యం కాదు. మరి కాంగ్రెస్ ముక్త్ భారత్ కోరుకుంటున్న బీజేపీ ఒకే జాతీయపార్టీగా ఎలామనగలగుతుంది? ఒక జాతీయపార్టీకి మరొక ప్రత్యామ్నాయ పార్టీ లేనపుడు జాతీయ పార్టీల మనుగడకు ముప్పు ఏర్పడే అవకాశాలే ఎక్కువ. కాబట్టి దేశానికి ఆరోగ్యకరమైన వైరుధ్య రాజకీయాలు కావాలె తప్ప శాడిస్టు రాజకీయాలు కాదు.

ఒక పార్టీని దేశం నుంచి తరిమేయాలనే స్థాయిలో వైరుధ్యం చాటుకోవడం వల్ల బీజేపీకి జరిగే ప్రయోజనం ఏమిటో తెలియదు. కానీ, ఆ వైఖరి దేశ రాజకీయ వ్యవస్థ గౌరవానికి మంచి పరిణామం కాదు. నరేంద్రమోదీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన కాలం నుంచి ఆయనతో సహా అనేకమంది బీజేపీ నేతలు కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదాన్ని బాగా వాడుతున్నారు. రాజకీయాల్లో నేటి విజయాలే రేపటి పరాజయాలుగా మారుతుంటాయి. అయినా మొన్న జరిగిన ఐదు రాష్ర్టాల ఎన్నికల్లో కాంగ్రెస్ తుడిచుకు పోయిందనడంలోనూ నిజం లేదు. అసోం, కేరళలో అధికారం కోల్పోయింది. పుదుచ్చేరిలో కొత్తగా అధికారం పొందింది. కానీ అధికారం కోల్పోయిన రెండు రాష్ర్టాల్లోనూ ప్రధాన ప్రతిపక్షంగా నిలబడిందనే విషయాన్ని మరిచిపోకూడదు. కాబట్టి ఫలానా పార్టీ నుంచి దేశం విముక్తి కావాలని నరేంద్రమోదీయో, అమిత్ షానో కోరుకుంటే జరిగేది కాదు కదా!

ఇవాళ ఎవరైతే కాంగ్రెస్ ముక్త్ భారత్ కోరుకుంటున్నారో... వారి పార్టీలకు కూడా కాంగ్రెసే ప్రాణం పోసిందని మర్చిపోతున్నారు. ఒక్క కమ్యూనిస్టుపార్టీ తప్ప ప్రతి రాజకీయపార్టీ కాంగ్రెస్ నుంచి పుట్టుకొచ్చిన పార్టీయే. దేశ రాజకీయాలకు కాంగ్రెస్ ఒక మాతృక లాంటిది. ఆ మాతృకకు జన్మించిన పార్టీలే ఇవాళ కాంగ్రెస్ ముక్త్ భారత్ కోరుకోవడం ఒక విచిత్రం. శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ అప్పటి నెహ్రూ ప్రభుత్వం లో క్యాబినెట్ మంత్రిగా పని చేశారు. కశ్మీర్ సమస్యపై విభేదాలు వచ్చి ఆయన ప్రభుత్వం నుంచి వైదొలిగి జనసంఘ్ అనే కొత్త పార్టీ (1950) ని స్థాపించారు. ఆపార్టీయే జనతాపార్టీలో(1977) విలీనమై ఆతర్వాత బీజేపీగా (1980) రూపాంతరం చెందింది. మరి బీజేపీ మూలాలు ఎక్కడివో అమిత్‌షా చెప్పగలరా?

నిజంగానే కాంగ్రెస్ ముక్త్ భారత్ అయితే ఈ దేశంలో అవినీతి అంతమవుతుందని మోదీగానీ, అమిత్ షా గానీ ఈ దేశ ప్రజలకు హామీ ఇవ్వగలరా? అవినీతికి ఒక్క కాంగ్రెసే కారణమైతే 17 ఏళ్లు కేంద్రంలో, 35 ఏళ్లుగా అనేక రాష్ర్టాల్లో కాంగ్రెసేతర ప్రభుత్వాలు నడుస్తున్నాయి. మరి ఈపాటికే దేశంలో అవినీతి అంతమైపోవాలి కదా!ఈ దేశంలో 2జీ, బొగ్గు, ఆదర్శ్ కుంభకోణాలు మాత్రమే జరగలేదు. కార్గిల్ యుద్ధంలో శవపేటికల కుంభకోణం, మధ్యప్రదేశ్‌లో భయంకరమైన వ్యాపం కుంభకోణం, తమిళనాడులో జయలలిత, కరుణానిధి కుటుంబం, బీహార్‌లో లాలూ కుంభకోణాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ఏలేరు లాంటి కుంభకోణాలు, బెంగాల్‌లో తృణమూల్ నేతల అక్రమాలు.. లాంటివి కాంగ్రెసేతర ప్రభుత్వాలలోనే జరిగాయి.

పనామా పత్రాల్లో అమితాబ్‌బచ్చన్ పేరుంది. అదే అమితాబ్‌బచ్చన్ మోదీ ప్రభుత్వానికి మొన్నటిదాకా ప్రచారకర్తగా పనిచేశారు. మోదీ దేశాన్ని పాలిస్తుండగానే ఆర్థికనేరస్తుడైన విజయమాల్యా విదేశాలకు పారిపోయాడు. వీటికి కూడా కాంగ్రెసే కారణమంటారా? ఇవాళ అవినీతికి ఏ కాంగ్రెస్ అయితే కారణమంటున్నారో, ఆ కాంగ్రెస్ నుంచి పుట్టి పెరిగిన అనేక రాజకీయపార్టీలు అవినీతిని కూడా వారసత్వంగా పొందలేదందామా? ఒక్క కాంగ్రెస్‌ను ఈదేశంలో లేకుండా చేస్తే ఈ దేశంలో అవినీతి అంతమైపోతుందా? దేశంలో అవినీతి వ్యవస్థీకృతమైపోయింది. అందుకు కాంగ్రెస్ ఎంత కారణమో మిగతాపార్టీలు కూడా అంతే కారణం.

పెట్టుబడిలేని రాజకీయమే లేనపుడు ఏదో ఒక పార్టీని నిందించడంలో నిజాయితీ ఉందా? అది మార్చుకోకుండా కాంగ్రెస్ రహిత్ భారత్‌లో ఏం జరగనుందో అమిత్‌షా చెప్పగలరా? అట్లాగే అవినీతి ఇవాళ ప్రపంచవ్యాప్త సమస్య. ప్రపంచంలోనే నల్లధనం పెరిగిపోయి మార్కెట్లు కుప్పకూలుతున్నాయని స్వయాన ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకు మొత్తుకుంటున్నాయి. ఆయా దేశాలు నల్లధనా న్ని వెలికితీసి చెలామణిలోకి తేవాలని ప్రపంచ ఆర్థిక సంస్థలు సూచనలిస్తున్నాయి. విదేశాల్లో మూల్గుతున్న నల్లధనం తిరిగి తెస్తానన్న మోదీ వాగ్దానానికి రెండేళ్లు గడిచిపోయాయి. కానీ నల్లధనం రాలేదు. ఆ పనిలో విఫలమవుతున్న పార్టీయే..ఇపుడు అవినీతికి ఫలానా పార్టీ కారణమని, ఆ పార్టీ నుంచి దేశం విముక్తి పొందాలని చెప్పడాన్నే ప్రజలు జీర్ణించుకోలేరు.

కాంగ్రెస్‌ను విమర్శించడానికి బీజేపీ నేతలకు మరే నినాదమూ దొరకలేదా? ఊకదంపుడు నినాదాలతో దేశ రాజకీయ ప్రతిష్టను దిగజార్చడం మంచి పద్ధతి కాదు. ఎవరైనా పార్టీ కన్నా దేశం ముఖ్యం అని భావిస్తారు. అందునా నరేంద్రమోదీ లాంటి వారు మరింత బలంగా భావిస్తారనుకున్నాం. పొలిటికల్ మైలేజ్ తీసుకోవడానికి అనేక మార్గాలుంటాయి. కానీ ఒక పార్టీ నుంచి ఈదేశం విముక్తి కావాలని కోరడం శోచనీయం.

దేశం కోసం పార్టీ పార్టీ కోసం దేశం కాదు అనే నినాదంలో ఆర్‌ఎస్‌ఎస్‌కు పూర్తి విశ్వాసం. అలాంటి ఆర్‌ఎస్‌ఎస్ ఉగ్గుపాలతో ఎదిగిన నేతలే ఇవాళ రాజకీయ మర్యాదలు మరిచి మాట్లాడటం దేశ అస్తిత్వానికి శోభనివ్వదు. నిజానికి కాంగ్రెస్ ఆక్టోపస్ లాంటి ఒక సూక్ష్మజీవి.అది దేశంలో బ్రాహ్మణుల నుంచి దళితుల దాకా మెప్పు పొందిన పార్టీ. క్యాపిటలిస్ట్ నుంచి కడుపేదవాడి దాకా ఆదరణ పొందిన పార్టీ. అది ఈదేశ అస్తిత్వాన్ని నిలపడంలో, నడపడంలో ఊతకర్రగా ఉపయోగపడిన పార్టీ. అలాంటి కాంగ్రెస్‌పార్టీని అనేక సందర్భాలలో స్వయాన ఆర్‌ఎస్‌ఎస్ ప్రశంసలు పొందిన సందర్భాలూ ఉన్నాయి. ఇందిరాగాంధీని పలు సందర్భాల్లో ప్రశంసించారు.

ఈశాన్య రాష్ర్టాల్లో వేర్పాటువాదులను నిలువరిస్తూ అక్కడ ప్రజామోదంతో కాంగ్రెస్ ప్రభుత్వాలను ఏర్పరచడాన్ని గతంలో సంఘ్‌పరివార్ పత్రికలు ప్రశంసించిన సందర్భాలున్నాయి. మైనారిటీల బుజ్జగింపులే కాదు. మెజారిటీల మనోభావాలనూ గౌరవించిన చరిత్ర కాంగ్రెస్‌కు ఉన్నది. బంగ్లాదేశ్‌కు విముక్తి కల్పించిన ఇందిరాగాంధీని స్వయాన వాజ్‌పేయి అపర కాళీమాతగా పొగిడారు. కాబట్టి దేశ అస్తిత్వాన్ని నిలిపి నడిపిన పార్టీ ఏదైనా ఉంటే దాన్ని ప్రతి దేశభక్తుడు ప్రశంసిస్తాడు తప్ప అలాంటి పార్టీని ఈదేశం నుంచి పారద్రోలాలని కోరుకోడు.

దేశంలో ఆర్‌ఎస్‌ఎస్ అత్యంత బలంగా ఉన్న రాష్ట్రం కేరళ. అక్కడ వామపక్ష-జాతీయవాద విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణలు నిత్యకృత్యం. అయినా గత ఆరు దశాబ్దాలుగా అక్కడ బీజేపీ అసెంబ్లీలోకి అడుగుపెట్టలేకపోయింది. అక్కడ ఆర్‌ఎస్‌ఎస్, జాతీయవాద విద్యార్థి సంఘాలు...వామపక్షాలతో ఉన్న వైరుధ్యంతో పరోక్షంగా కాంగ్రెస్‌ను సమర్థించడం జరుగుతున్నది. బీజేపీ గెలిచే పరిస్థితులు లేనపుడు వామపక్షాలను ఓడించేందుకు పరోక్షంగా కాంగ్రెస్ గెలుపును కోరుకుంటూ వస్తున్నారు. మరి దాన్నేమందాం? కాంగ్రెస్ ఒక ఆక్టోపస్ లాంటి ఫ్లెక్సిబుల్ పార్టీ కాబట్టే కేరళలో జాతీయవాదులు సైతం పరోక్షంగా దాన్ని సమర్థిస్తూ వచ్చారు. అలాంటి కాంగ్రెస్ నుంచి దేశం విముక్తి కావాలని ఇవాళ బీజేపీ నేతలు నినాదామివ్వడమే బాగాలేదు. బలమైన నాయకుడిగా మోదీని ఈదేశ ప్రజలు ఇప్పటికీ నమ్ముతున్నారు.అందుకే అసోంలో గెలవగలిగారు.

బెంగాల్, కేరళలో బలపడ్డారు. ప్రజలు ఇస్తు న్న అలాంటి ఆదరణను నిలుపుకోవాలి తప్ప, దాన్ని అతిగా ఊహించుకొని ఒక పార్టీ నుంచి దేశ విముక్తి కోరడం వరకు వెళ్లడం సరికాదు. జాతీయపార్టీలుగా దేశానికి బీజేపీ ఎంత అవసరమో, కాంగ్రెస్ కూడా అంతే అవసరం. అందులో ఏ ఒక్కటి లేకున్నా దేశంలో ఒకరకమైన రాజకీయ అస్థిరతకు అవకాశం ఏర్పడుతుంది. అది దేశ అస్తిత్వానికి మంచి పరిణామం కాబోదు. అమిత్‌షా జీ... మీరు కోరుకోవాల్సింది కాంగ్రెస్ ముక్త్ భారత్ కాదు, భ్రష్టాచార్ ముక్త్ భారత్‌ను.చివరగా..జేఎన్‌యూ కన్నయ్యకు- తమకు తేడా ఏమిటని ఆత్మపరిశీలన చేసుకుంటే కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదం ఎంత అసంబద్ధమైనదో బీజేపీ నేతలకు తప్పక అర్థమవుతుంది.

794

SRINIVAS REDDY KALLURI

Published: Tue,October 16, 2018 03:29 PM

సంపద సృష్టికే అప్పులు

అప్పులు ఎప్పుడూ సంపద సృష్టికి మాత్రమే ఉపయోగించాలనేది సంక్షేమ రాజ్య పాలకుడికి ఉండాల్సిన సహజ లక్షణం. ఈ లక్షణం కేసీఆర్ అనే పాలకుడిలో

Published: Sun,February 25, 2018 01:31 AM

డైనమిజానికి ప్రతీక

యువనేతలో తెలంగాణ ఒక డైనమిజాన్ని చూస్తున్నది. ఆయనలో క్లాస్ కంటే మాస్ లీడర్‌గా మరింత బలంగా ఉన్నాడు. తెలంగాణ పునర్ నిర్మాణ పథకాల రచనల

Published: Fri,July 7, 2017 01:04 AM

రైతు లక్షణం ఇంకా రాదా?

2022 వరకు వ్యవసాయాన్ని ఇప్పటికన్నా రెండింతల లాభాల బాట పట్టిస్తామని కొన్నాళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీపదేపదే చెబుతున్నారు. కానీ ఆచరణ

Published: Sat,February 18, 2017 01:37 AM

సృజనాత్మక వక్త

భూమిపై సగం, ఆకాశంలో సగం అని చెపితే సరిపోయేది కాదు. ఆర్బీఐ గవర్నర్‌తో సమానమైన బాధ్యతను ఈ దేశ మహిళ నిర్వహిస్తున్నదని చెప్పడమే కవిత ప

Published: Tue,February 7, 2017 01:46 AM

సహకారానికి ఉపకారమేది?

దేశంలో ఒక విశ్వసనీయ పాలకుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్‌ను ప్రధాని మోదీ ప్రశంసలతో ముంచెత్తితే సరిపోదు. కేసీఆర్ విశాల దృక్పథానికి అన

Published: Fri,January 6, 2017 11:54 PM

‘దేశీ’ తెలంగాణ స్ఫూర్తి

ప్రపంచీకరణ ప్రయాణంలో దేశీ ఆలోచనలతో బాధితులను కాపాడుకోవాలనే స్పృహ ఒక నిజమైన దేశీయ పాలకుడికి ఉండాల్సిన లక్షణం. ఆ లక్షణాన్ని ఇపుడు మ

Published: Tue,November 29, 2016 12:53 AM

రెండున్నరేండ్ల సమర్థత

గతంలో దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీకి గ్యారంటీ ఇవ్వగానే బ్యాంకులు ఒప్పేసుకొని మాఫీ చేసిన సందర్భాలున్నాయి. కానీ కేసీఆర్ ప

Published: Tue,November 22, 2016 12:02 AM

నోట్ల రద్దుపై వాస్తవ వైఖరి

ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై రకరకాల అభిప్రాయాలున్నాయి. ప్రజల అభిప్రాయం ఎలా ఉందనే కన్నా ముందు రాజకీయ

Published: Sat,October 22, 2016 01:23 AM

చెరువును చంపొద్దు

వర్షాలు ఇంత భారీగా పడినా కూడా మా ఊరి చెరువులోకి చుక్క నీరు రాలేకపోయింది. దాంతో మా ఊరి చెరువు కింద మరో మూడు ఊర్లకు చెందిన గొలుసుకట్

Published: Wed,October 5, 2016 03:43 AM

మోదీ వ్యూహాత్మక పయనం

నిజానికి కశ్మీరీలు అమాయకులు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే హిందూ యాత్రికులను గుర్రాలపై, బగ్గీలపై తీసుకెళ్లేది కశ్మీరీ ముస్లిం సోదరులే.

Published: Fri,September 16, 2016 01:23 AM

నీటి హక్కుపై నియంత్రణా?

రాష్ట్ర విభజన డ్రాఫ్ట్ బిల్లులో రెండు నదులపై యాజమాన్య బోర్డులు పెట్టాలనే ప్రతిపాదనను ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌తో సహా యావత్ తెలంగాణ బు

Published: Tue,August 9, 2016 01:17 AM

కేసీఆర్-మోదీ: తెలంగాణ

రాజకీయాలకతీతంగా దేశంలోని సమస్యల పట్ల దార్శనికంగా ఆలోచించే కేసీఆర్ వంటి ముఖ్యమంత్రికి ప్రధానిగా మోడీ ఏమేరకు సహకారం అందిస్తారనేది ఇ        


country oven

Featured Articles