రాజకీయ అస్తిత్వ స్థిరీకరణ కావాలె


Mon,May 23, 2016 11:44 PM

తెలంగాణ ఆవిర్భావం, తెలంగాణ అస్తిత్వం అధికారం చేపట్టడం ఒకేరోజు (జూన్ 2)న జరిగాయి. ఇది యాధృశ్చికమే కావచ్చు. దేశంలో ఏర్పడిన ఏ రాష్ర్టానికి ఇలాంటి రెండు సందర్భాలు ఒకేరోజు జరిగి ఉండవు. దేశంలో ఒక రాష్ట్రం ఏర్పాటు డిమాండ్‌తో పుట్టిన పార్టీలు అనేకం. కానీ ఏవీ కూడా రాష్ర్టాన్ని సాధించి అధికారం చేపట్టలేదు. అలాంటి చరిత్రను తిరగరాసిన కీర్తి టీఆర్‌ఎస్ వ్యవస్థాపక అధినేతగా కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దక్కించుకున్నారు. అందుకే చరిత్రలో కేసీఆర్ పేరు కు ప్రాధాన్యం మాత్రమే దక్కితే సరిపోయేది కాదు. ఆ పేరు ఒక నూతన రాజకీయ సిద్ధాంతంగా మారి భవిష్యత్తు తెలంగాణను నడిపించాల్సిన అవసరమూ ఉన్నది.
దేశంలో ఏ రాష్ర్టానికి ప్రాంతీయ నేతృత్వం అవసరమో లేదో తెలియదు కానీ, తెలంగాణ రాష్ర్టానికి మాత్రం అస్తిత్వ నేతృత్వ పాలన అనివార్యం. ఆర్థికంగా మిగులు రాష్ట్రమే అయినా , తెలంగాణకు, మిగతా దేశానికి అన్నిరంగాల్లో ఆరు దశాబ్దాల అం తరం ఉన్నది. విద్యలో మిగతాదేశంతో తెలంగాణ పోటీ పడలేకపోవడం ఆరు దశాబ్దాల అంతరానికి నిదర్శనం. దేశ సగటు అక్షరాస్యత 74 శాతం కాగా తెలంగాణ అక్షరాస్యత 66 శాతం మాత్రమే. అలాగే తెలంగాణ వచ్చినట్లే గానీ, ఇకముందు ఉద్యోగ నియామకాల్లోనూ ప్రాంతేతరుల ప్రమాదం ఇప్పటి కీ పొంచివుండటం ఒక నిదర్శనం.

srinivasreddyఅలాగే రెండు రాష్ర్టాల మధ్య రెండు జీవనదుల నీళ్ల పంపకం మాత్రం నిజం. అలాంటి అన్యాయాలకు ఎదురొడ్డ టం, అంతరాలను పూడ్చడం అస్తిత్వపార్టీతో తప్ప మరొక పార్టీతో సాధ్యం కావడం అంత సులభం కాదు. కాబట్టి తెలంగాణకు బలమైన అస్తిత్వ నేతృ త్వం అనివార్యం. అస్తిత్వ పాలనకు రెండేళ్లు గడిచిపోయాయి. అభివృద్ధి, సంక్షేమం, పాలనా సామర్థ్యం పట్ల ప్రజల్లో విశ్వాసం స్థిరపడింది. వరుసగా వచ్చిన రెండు లోక్ సభ, రెండు అసెంబ్లీ ఉప ఎన్నికలు, హైదరాబాద్ నుంచి ఖమ్మం దాక జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు నలుదిశల విస్తరించిన కేసీఆర్ ప్రజాదరణను చాటిచెప్పాయి. రాబోయే కాలంలోనూ కేసీఆర్ పాలనకు తిరుగుండబోదని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఉత్తమ రాజకీయ ఉద్యమకారుడిగా, ఉత్తమ పాలకుడిగా ఇప్పటికే నిరూపించుకున్నారు. ఇక జరగవల్సిందల్లా కేసీఆర్ పేరు ఒక సిద్ధాంతంగా స్థిరీకరించబడటమే. ప్రపంచంలో అనే క సిద్ధాంతాలు ఆయా వ్యక్తుల పేర స్థిరపడ్డాయి. ఒక గాంధీ, ఒక నెహ్రూ, ఒక హెడ్గేవార్, ఒక కారల్ మార్క్స్, ఒక అన్నాదురై.. లాంటివారు స్థిరీకరించిన సిద్ధాంతాలు, వారి ఆలోచనా విధానాలు సజీవంగా చెలామణిలో ఉన్నాయి. ఈ దేశానికి గాంధీ, నెహ్రూ ఆలోచనా విధానాలు ఇప్పటికీ శిరోధార్యం. అన్నాదురై ఆలోచనా విధానాల పునాదులపైనే ఇప్పటికీ ద్రవిడ రాజకీయం నడుస్తున్నది. అట్లాగే తెలంగాణ రాజకీయ అస్తిత్వ సిద్ధాంతం కేసీఆర్ పేరున స్థిరపడి తే గానీ.. భవిష్యత్ తెలంగాణ నిలిచి గెలిచి ఉన్నతం గా బతకడం సాధ్యం కాదు. అయితే, కేసీఆర్ నేతృ త్వం ఆ విషయంపై ఏమేరకు దృష్టిపెడుతున్నది, మరింత దృష్టిపెట్టాల్సి ఉన్నదేమిటి అనే అంశాలపై విశ్లేషిద్దాం.

కేసీఆర్ ఏది చేసినా మన మంచికే అని నమ్మే కేసీఆర్‌లు ఇప్పటికీ సజీవంగా ఉన్నారంటే, ఆయన పట్ల వాళ్ల విశ్వాసాన్ని ఎంతపొగిడినా తక్కువే. వాళ్లే కేసీఆర్ పేరును ఒక సిద్ధాంతంగా మార్చగలిగి రేపటి తరానికి అందించగలిగేవాళ్లు. వలసల రాజకీయంతో రాజకీయ తాత్కాలిక లబ్ధి కలగవచ్చు. ఫక్తూ రాజకీయం ఎన్నికల్లో కొన్ని విజయాలను ఇవ్వవచ్చు. వలసలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ అస్తిత్వ సైద్ధాంతికత శాశ్వతం కావడమెట్లా? కాబట్టి తెచ్చిన తెలంగాణ ప్రయోజనాలను ఎల్లకాలం కాపాడుకోవాలంటే కేసీఆర్ అనే పేరు సిద్ధాంతీకరించబడి రాబోయే తరాలకు అందించగలగాలె.

పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన కొద్దిరోజులకే తెలంగాణ భవన్‌లో కేసీఆర్ ప్రెస్‌మీట్ పెట్టారు. ఇక నుంచి టీఆర్‌ఎస్ పక్కా రాజకీ య పార్టీగా పనిచేస్తుందని వెల్లడించారు. ఆయన అలా ప్రకటించడానికి కారణం లేకపోలేదు. దేశంలో కొనసాగుతున్న ఫక్తూ రాజకీయాలను ఎదుర్కోవాలంటే టీఆర్‌ఎస్ కూడా ఫక్తూ రాజకీయపార్టీగా మారకతప్పదని కేసీఆర్ భావించి ఉంటారు. నిజానికి ఫక్తూ రాజకీయపార్టీ అని ఎంతచెప్పుకున్నా ప్రజలు మాత్రం టీఆర్‌ఎస్‌ను ఉద్యమ పార్టీగానే గెలిపించారు. ఇంకా చెప్పాలంటే, ఫక్తూ రాజకీయం కొంత పనిచేసినా, అదొక అస్తిత్వ పార్టీగానే ఎన్నిక ల్లో అత్యధికంగా లబ్ధి పొందింది. ఇది కాదనలేని సత్యం. అయితే, తెలంగాణలో జీవిస్తున్న ఆంధ్రా ప్రజలను సైతం తెలంగాణ అస్తిత్వంలోకి తెచ్చే ప్రయత్నానికి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో లభించిన అపూర్వ విజయమూ ఒక సాక్ష్యమే. అయితే వచ్చిన తెలంగాణలో ఆంధ్రా పార్టీల పాత్ర లేకపోవడమే ఆంధ్రా ప్రజలు తెలంగాణ అస్తిత్వపార్టీ వైపు మళ్లడానికి కారణమైంది. అలాగే, టీఆర్‌ఎస్‌లోకి వలసల ప్రవాహం పెరిగింది. ఆంధ్రా పార్టీల అవసరం లేని తెలంగాణలో రాజకీయ పునరేకీకరణ కూడా సహజ పరిణామంగా మారింది. అదంతా ఫక్తూ రాజకీయం ద్వారా అస్తిత్వం మరింత విస్తరించి ఉండొచ్చు. కానీ అస్తిత్వానికి భంగం కలగనంత వరకు మాత్రమే వలసలైనా, ఫక్తూ రాజకీయమైనా పరిమతమైతే మేలు.

రెండేళ్లలో అస్తిత్వ రాజకీయం తెలంగాణ నలుదిశలా విస్తరించింది. ఇంకా ఫక్తూ రాజకీయంతోనో, వలసలతోనో పని ఉన్నదనుకోలేం. ఆ దశ దాటింది. ఇక జరగాల్సింది తెలంగాణ భవిష్యత్తుకు దిశా నిర్దే శం చేయాల్సిన సైద్ధాంతిక స్థిరీకరణ. అందుకు కేసీఆర్ పేరే ఒక సిద్ధాంతంగా మారి వచ్చే తరాలకు మార్గదర్శనం చేయగలగాలె. కేసీఆర్ పద్నాలుగేళ్ల ఉద్యమ ప్రస్థానం ఊరూరా పదిమందిని కేసీఆర్‌ల ను తయారు చేసింది. ప్రతి రంగంలో కేసీఆర్‌లను తయారు చేసింది. ఒక స్టూడెంట్, ఒక ఆటోవాలా, ఒక రైతుబిడ్డ, ఒక కూలీ బిడ్డ, ఒక కార్మికుడు, ఒక ఉద్యోగి, ఒక జర్నలిస్ట్, గ్రామీణ వృత్తుల వాళ్లు.. ఒకరేమిటి ప్రతి రంగంలో కేసీఆర్‌లు తయారయ్యా రు. వారిలో కేసీఆర్ నేర్పిన అస్తిత్వ పాఠాలున్నాయి. వాళ్ల గుండెల్లో అస్తిత్వానికి ప్రతిరూపమైన కేసీఆర్ చిత్రపటమున్నది. అది తుడిచేసినా పోనంతగా అతుక్కుపోయింది. తెలంగాణ నలుదిశలా ఫణికర మల్లయ్యలెందరో ఉన్నారు. కేసీఆర్‌ను తప్ప మరొకరిని నాయకుడుగా అంగీకరించని అస్తిత్వ మనస్తత్వం తెలంగాణ నలుదిశలా విస్తరించింది. కేసీఆర్ పేరు ఒక అస్తిత్వ సిద్ధాంతంగా మారడానికి గల కారణానికి అంతకు మించిన ఉదాహరణ అక్కరలేదు. ఒకప్పుడు తెలంగాణ పదం పలకడానికి కూడా సంకోచించిన రాజకీయాల నుంచి, ఇవాళ తెలంగాణ పదం పలకని రాజకీయాలకు తావులేని స్థితికి తెలంగాణ చేరుకోగలిగిందంటే.. కేసీఆర్ నేతృత్వాన్ని అనుసరించిన 24వేల ఊళ్లలో, వందలాది నగరాల్లో ఉన్న అపరిచిత అసంఖ్యాక కేసీఆర్‌ల సేవలే అందు కు పునాదులు వేశాయి. గతేడాది ఆవిర్భావ దినం రోజు ఒక కుగ్రామంలో ఒక గ్రామీణ యువకుడు కేసీఆర్ చిత్రపటం పెట్టి టీఆర్‌ఎస్ జెండాను తనకు తానే ఎగరేస్తున్న ఫొటో తన ఫేస్‌బుక్‌లో పోస్టు చేశా డు. అతడొక కేసీఆర్. ఊరూరా ఉన్న అలాంటి కేసీఆర్‌లను లెక్కించడం సాధ్యమేనా అనిపించింది. అది కల్మషం లేని క్యాడర్. వారంతా కనిపించని కేసీఆర్‌లుగా మిగిలిపోతున్నారు. అలాంటి క్యాడర్‌ను వలసలు కొంత కలవరపెట్టొచ్చు. దాన్నీ ఒక అనివార్యతగా భావించే గ్రామీణ కేసీఆర్‌లూ ఉన్నారు. కేసీఆర్ ఏది చేసినా మన మంచికే అని నమ్మే కేసీఆర్‌లు ఇప్పటికీ సజీవంగా ఉన్నారంటే, ఆయన పట్ల వాళ్ల విశ్వాసాన్ని ఎంతపొగిడినా తక్కువే. వాళ్లే కేసీఆర్ పేరును ఒక సిద్ధాంతంగా మార్చగలిగి రేపటి తరాని కి అందించగలిగేవాళ్లు. వలసల రాజకీయంతో రాజకీయ తాత్కాలిక లబ్ధి కలగవచ్చు.

ఫక్తూ రాజకీయం ఎన్నికల్లో కొన్ని విజయాలను ఇవ్వవచ్చు. వలసలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ అస్తిత్వ సైద్ధాంతికత శాశ్వతం కావడమెట్లా? కాబట్టి తెచ్చిన తెలంగాణ ప్రయోజనాలను ఎల్లకాలం కాపాడుకోవాలం టే కేసీఆర్ అనే పేరు సిద్ధాంతీకరించబడి రాబోయే తరాలకు అందించగలగాలె. ఆ పని ప్రతి రంగంలో మిగిలి ఉన్న కేసీఆర్‌లతోనే జరగుతుంది తప్ప వలసలతోనో, మరొకదానితోనో జరిగేది కాదు. 15 ఏళ్లు గా కొనసాగుతున్న అపరిచిత కేసీఆర్‌లలో తెలంగా ణ ప్రయోజనాల పట్ల కొంతైనా మెరుగైన కమిట్‌మెంట్ ఉంటది. తాను బతుకుతూనే తన ప్రాంత ప్రయోజనాలకు ప్రతి కేసీఆర్ ప్రాధాన్యం ఇస్తాడు, ఇందులో అనుమానం లేదు. కానీ వలసల క్యాడర్ లో అంతటి కమిట్‌మెంట్ ఉంటుందని గానీ, ఉండదని గానీ చెప్పడం సాధ్యం కాదు. అలాంటి కమిటెడ్ కేసీఆర్‌లను పసిగట్టి ఆదరించే పద్ధతి అటు పార్టీలోగానీ, ఇటు ప్రభుత్వంలోగానీ మరింతగా జరగాలె. స్వయాన కేసీఆర్ ఆ విషయంలో మరింత చొరవ తీసుకొని కమిటెడ్ కేసీఆర్‌లు చెప్పే ప్రజా సమస్యల కు టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించాలె. అలాగే, వేలల్లో ఉండే కేసీఆర్‌లను కలవడం స్వయాన కేసీఆర్‌కు అన్నివేళలా సాధ్యం కాకపోవచ్చు. కాబట్టి అందుకు ప్రత్యామ్నాయం వెదకాలె. ఉదాహరణకు, ప్రజా దర్బార్లు అందుకు బాగా దోహదపడగలుగుతాయి. కనీసం నెలకొకసారైనా ప్రజాదర్బార్ పెడితే కేసీఆర్‌ను కలిసే వెసులుబాటు కమిటెడ్ కేసీఆర్‌లకు కూడా కలుగుతుంది. దాంతో ప్రతి కేసీఆర్‌లో కేసీఆర్ మరింత బలపడతా డు. మనం వెయ్యేళ్లు బతకడానికి రాలేదు. మనం బతికినంత కాలం చేసే పని శాశ్వతంగా నిలిచిపోవా లె.. ఈ మాటలు కేసీఆర్ నోట మనం అనేక మార్లు విన్నాం. శతాబ్దాల తెలంగాణ భవిష్యత్తు భద్రత కోస మే కేసీఆర్ పేరు ఒక రాజకీయ అస్తిత్వ సిద్ధాంతంగా స్థిరపడాలని మనం కూడా కోరుకుంటున్నాం.
kallurisreddy@gmail.com

1445

SRINIVAS REDDY KALLURI

Published: Tue,October 16, 2018 03:29 PM

సంపద సృష్టికే అప్పులు

అప్పులు ఎప్పుడూ సంపద సృష్టికి మాత్రమే ఉపయోగించాలనేది సంక్షేమ రాజ్య పాలకుడికి ఉండాల్సిన సహజ లక్షణం. ఈ లక్షణం కేసీఆర్ అనే పాలకుడిలో

Published: Sun,February 25, 2018 01:31 AM

డైనమిజానికి ప్రతీక

యువనేతలో తెలంగాణ ఒక డైనమిజాన్ని చూస్తున్నది. ఆయనలో క్లాస్ కంటే మాస్ లీడర్‌గా మరింత బలంగా ఉన్నాడు. తెలంగాణ పునర్ నిర్మాణ పథకాల రచనల

Published: Fri,July 7, 2017 01:04 AM

రైతు లక్షణం ఇంకా రాదా?

2022 వరకు వ్యవసాయాన్ని ఇప్పటికన్నా రెండింతల లాభాల బాట పట్టిస్తామని కొన్నాళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీపదేపదే చెబుతున్నారు. కానీ ఆచరణ

Published: Sat,February 18, 2017 01:37 AM

సృజనాత్మక వక్త

భూమిపై సగం, ఆకాశంలో సగం అని చెపితే సరిపోయేది కాదు. ఆర్బీఐ గవర్నర్‌తో సమానమైన బాధ్యతను ఈ దేశ మహిళ నిర్వహిస్తున్నదని చెప్పడమే కవిత ప

Published: Tue,February 7, 2017 01:46 AM

సహకారానికి ఉపకారమేది?

దేశంలో ఒక విశ్వసనీయ పాలకుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్‌ను ప్రధాని మోదీ ప్రశంసలతో ముంచెత్తితే సరిపోదు. కేసీఆర్ విశాల దృక్పథానికి అన

Published: Fri,January 6, 2017 11:54 PM

‘దేశీ’ తెలంగాణ స్ఫూర్తి

ప్రపంచీకరణ ప్రయాణంలో దేశీ ఆలోచనలతో బాధితులను కాపాడుకోవాలనే స్పృహ ఒక నిజమైన దేశీయ పాలకుడికి ఉండాల్సిన లక్షణం. ఆ లక్షణాన్ని ఇపుడు మ

Published: Tue,November 29, 2016 12:53 AM

రెండున్నరేండ్ల సమర్థత

గతంలో దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీకి గ్యారంటీ ఇవ్వగానే బ్యాంకులు ఒప్పేసుకొని మాఫీ చేసిన సందర్భాలున్నాయి. కానీ కేసీఆర్ ప

Published: Tue,November 22, 2016 12:02 AM

నోట్ల రద్దుపై వాస్తవ వైఖరి

ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై రకరకాల అభిప్రాయాలున్నాయి. ప్రజల అభిప్రాయం ఎలా ఉందనే కన్నా ముందు రాజకీయ

Published: Sat,October 22, 2016 01:23 AM

చెరువును చంపొద్దు

వర్షాలు ఇంత భారీగా పడినా కూడా మా ఊరి చెరువులోకి చుక్క నీరు రాలేకపోయింది. దాంతో మా ఊరి చెరువు కింద మరో మూడు ఊర్లకు చెందిన గొలుసుకట్

Published: Wed,October 5, 2016 03:43 AM

మోదీ వ్యూహాత్మక పయనం

నిజానికి కశ్మీరీలు అమాయకులు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే హిందూ యాత్రికులను గుర్రాలపై, బగ్గీలపై తీసుకెళ్లేది కశ్మీరీ ముస్లిం సోదరులే.

Published: Fri,September 16, 2016 01:23 AM

నీటి హక్కుపై నియంత్రణా?

రాష్ట్ర విభజన డ్రాఫ్ట్ బిల్లులో రెండు నదులపై యాజమాన్య బోర్డులు పెట్టాలనే ప్రతిపాదనను ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌తో సహా యావత్ తెలంగాణ బు

Published: Tue,August 9, 2016 01:17 AM

కేసీఆర్-మోదీ: తెలంగాణ

రాజకీయాలకతీతంగా దేశంలోని సమస్యల పట్ల దార్శనికంగా ఆలోచించే కేసీఆర్ వంటి ముఖ్యమంత్రికి ప్రధానిగా మోడీ ఏమేరకు సహకారం అందిస్తారనేది ఇ