అద్భుతాలు లేవు, అసంతృప్తీ లేదు


Tue,May 17, 2016 01:24 AM

మోదీ పాలనపై రాజకీయ వైరుధ్యం గలవారు చాలానే ఆభాండాలు వేస్తూవస్తున్నారు. నిజానికి
దేశంలో ఎన్నో దశాబ్దాలుగా ఏర్పడిన రుగ్మతలు మోదీ వచ్చా కే ఏర్పడినట్లు నిందలు వేయడంలో
నిజాయితీ లేదు. రాజకీయ వైరుద్ధ్యంతో వేసే అభాండాలను ప్రజలు కూడా అంత ఈజీగా నమ్మరు. అలాగే,వ్యతిరేకులు ఎన్ని అభాండాలు వేసినా ఆయన మౌనంగా ఉంటూవస్తున్నారు. ఏదేమైనా దేశంలో అశాంతి నెలకొనకుండా చూడగలిగినంతవరకు మోదీ మౌనం ఆయన వ్యతిరేకులకు సరైన జవాబే అవుతుంది. మొత్తం మీద రెండేళ్ల మోదీ పాలన నాట్ బ్యాడ్ అని చెప్పాలి.

srinivas
నరేంద్ర మోదీ పాలనకు రెండేళ్లు పూర్తవుతున్నా యి. ఆయన ప్రోగ్రెస్ రిపోర్టుపై రాజకీయ వైరుధ్యం గలవారి విశ్లేషణలు ఎలా ఉన్నా.. ఆయన పాలన ఫరవా లేదనే అభిప్రాయం మాత్రం ప్రజల్లో ఉన్నది. ప్రజ లు మెచ్చుకునేంత మంచి జరిగి ఉండకపోవచ్చు. కానీ చెడు మాత్రం జరగలేదనే భావన మాత్రం బలంగా ఉన్నది. విదేశాల నుంచి నల్లధనాన్ని తీసుకురాకపోవచ్చు. కానీ రెండేళ్లలో మోదీ ప్రభుత్వంలో ఒక్క అవినీతి కుంభకోణం కూడా జరిగినట్లు వార్త లు మాత్రం లేవు. మంచి జరగకున్నా, కనీసం చెడు జరగకుంటే చాలనే సగటు ప్రజల అభిప్రాయాన్ని మోదీ ప్రభుత్వం నిలబెట్టుకున్నదని చెప్పడానికి ఎవరికీ అభ్యంతరం ఉండకూడదు. కాకపోతే ఆర్థిక నేరాలు తగ్గుముఖం పట్టలేకపోతున్నాయి.

అది కలవర పరిచే అంశమే. కానీ పీవీ నర్సింహారావు కాలంలో హర్షద్ మెహతాతో మొదలైన ఆర్థిక నేరగాళ్ల పరంప ర మన్మోహన్‌సింగ్ కాలం దాకా కొనసాగుతూ వస్తున్నపుడు.. అప్పటికప్పుడు మోదీ ప్రభుత్వం ఆర్థిక నేరగాళ్లను కట్టడి చేసి ఉండాల్సిందని ఆశించడం కూడా అత్యాశే. మోదీ హయాంలో కొత్త ఆర్థిక నేరగాళ్లు పుట్టుకొచ్చారా అనే దే ఆయన పాలనకు కొలమానంగా మనం భావించాలి. నిజానికి ఇప్పటి వరకైతే అలాంటి కొత్త ఆర్థిక నేరగాళ్లు పుట్టుకొచ్చినట్లు వార్తలు మాత్రం లేవు. అందుకు సంతోషిద్దాం. కానీ కింగ్‌ఫిషర్ విజయ్ మాల్యా సుమారు 9 వేల కోట్ల అప్పులకు ఎగనామం పెట్టి దేశం విడిచి పారిపోగలగడం మాత్రం మోదీ ప్రభుత్వానికి మాయని మచ్చనే.

ఎందుకంటే విజయ్ మాల్యా వ్యాపారాలలో అవకతవకలు కొన్నేళ్లుగా బయట పడుతూ వస్తున్నా యి. కాబట్టి అతని ఆర్థికనేరాల చిట్టాల ఆధారంగానైనా ఆయనపై ప్రభు త్వం ఓ కన్నేసి ఉంచాల్సింది. ఆ పని జరిగివుంటే, మాల్యా దేశం విడిచి పారిపోగలిగే వాడేనా అనే సామాన్యుని ప్రశ్న ఇవాళ మోదీ ప్రభుత్వం నిలబ డాల్సివచ్చేదికాదు. అయితే వ్యవస్థీకృతమైపోయిన అవినీతి, దేశాన్ని దశాబ్దాలు గా శాసిస్తున్నపుడు నిన్నగాక మొన్న వచ్చిన ఒక్క మోదీ మాత్రం ఏం చేస్తాడులే అనే సహజ భావనను ఆసరా చేసుకుంటే మాత్రం అది మోదీ పాలనకు ప్రమాదమే. మాల్యా ను వెనక్కి రప్పించి, అప్పులు కక్కించే ప్రయత్నం చేయడమే మోదీ ప్రతిష్ఠకు పరీక్ష కానుంది.

ఢిల్లీ డీ బ్లాక్, బీ బ్లాక్, సీ బ్లాక్ వంటి ఆయా శాఖ ల కార్యాలయాల చుట్టూ బ్రోకర్లు, ఏజెంట్లు చెక్కర్లు కొడుతుంటారని ఎప్పటినుంచో మనం వింటూ వస్తున్నాం. బోఫోర్స్ కుంభకోణం నుంచి మొదలు కుంటే, కార్గిల్ శవపేటికల కుంభకోణం, లక్షల కోట్ల టూజీ కుంభకోణం, బొగ్గు కుంభకోణం దాకా ఢిల్లీలోని పాలనాబ్లాకులే బ్రోకర్లకు, ఏజెంట్లకు కేంద్రాలుగా మారినట్లు కూడా మనం విన్నాం. కానీ మోదీ ప్రధాని అయ్యాక ఆ పరిస్థితులు చాలామేరకు మారయని వింటున్నాం. డీ బ్లాకు, ఆ బ్లాకు, ఈ బ్లాకుల చుట్టూ బ్రోకర్లు, ఏజెంట్లు తిరగడం చాలామేరకు ఆగిపోయింది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో మోదీ కొంత పారదర్శకత తీసుకురాగలిగారని స్వయాన ఇతర పార్టీలు సైతం ఆంతరంగికంగానైనా అంగీకరించడం అందుకు నిదర్శనం.

దేశంలో ప్రపంచీకరణ పాలసీలకు 25 ఏళ్లు దాటిపోయాయి. ఆ విధానాలలోని మంచి-చెడులను బేరీజు వేసుకొని పాలించడమే ఏపాలకుడైనా చేయాల్సిన పని. కానీ గడిచిన కాలంలో చాలామంది పాలకులు మంచి-చెడులను గాలికి వదిలేసి ఆర్థిక సంస్కరణలతో ప్రజల బతుకులను బుల్డోజ్ చేయడానికి వెనుకాడలేదు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా కొనసాగినపుడు ఆర్థిక సంస్కరణలను ఎలా అమలు చేశాడనే విషయాన్ని పక్కనబెడితే.. ఆయన దేశ ప్రధాని అయ్యాక మాత్రం ఆర్థిక సంస్కరణలలోని చెడును గుర్తించి కొంతవరకైనా దానికి చెక్ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పొచ్చు. ఉదాహరణ కు, సుమారు రెండు దశాబ్దాలుగా మన దేశంలో పత్తివిత్తనాల అమ్మకంలో మోన్‌శాంటో గుత్తాధిపత్యంతో వ్యాపారం చేస్తున్నది. దాని దోపిడీ వల్ల దేశ రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. కానీ గత పాలకులకు ఆ విషయం ఏనాడూ పట్టలేదు. చివరకు పత్తి విత్తనాలు పండించే రైతుల కష్టానికి సైతం అది సరైన వెల కట్టలేదు. దీన్ని మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించారు.

పత్తివిత్తనాలు పండించే రైతులకు సరైన ధర ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. మోన్‌శాంటో గుత్తాధిపత్య ఆగడాల వ ల్ల రైతులు నష్టపోతున్న విషయాన్ని కేసీఆర్ ప్రధాని మోదీ దృష్టికీ తీసుకెళ్లారు. తెలంగాణ ప్రభుత్వ విన్నపమే కావచ్చు, మరేదైనా కావచ్చు, వెంటనే పత్తివిత్తన ఉత్పత్తి కంపెనీల విధివిధానాల కోసం మోదీ ప్రభుత్వం ఓ కమిటీ వేసింది. ఆ కమిటీ మోన్‌శాం టో కంపెనీ గుత్తాధిపత్యానికి చెక్‌పెడుతూ సిఫార్సు లు చేసింది. బీటీ టెక్నాలజీ కలిగిన ఏ కంపెనీ అయి నా లైసెన్సు పొందవచ్చని చెప్పింది. దాంతో మోన్‌శాంటో కంపెనీ గుత్తాధిపత్య దోపిడీకి చెక్ పడిందని చెప్పాలి. అట్లా నేటి గుత్తాధిపత్య స్వేచ్ఛా మార్కెట్ల దోపిడీకి చెక్ పెట్టే సాహసం గతంలో ఏ పాలకుడూ చేసిన పాపానపోలేదు. కాబట్టి ఆర్థిక సంస్కరణల్లోని చెడుకు చెక్ పెట్టడానికి మోదీ కొంతైనా సాహసం చేస్తున్నారని చెప్పాలి. అట్లా అని ఎరువులు, పురుగు మందులపై గత కేంద్ర ప్రభుత్వాలు సబ్సిడీలను ఎత్తే సి వ్యవసాయాన్ని మరింత పెట్టబడి వ్యాపారంగా మార్చేశాయి. ఈ విషయంలో మాత్రం మోదీ కూడా ఎరువులపై మరిన్ని సబ్సిడీలను ఎత్తేసి తానూ ఆ తాను ముక్కనే అనిపించుకోవడం ఆయనకు మైనస్ పాయింటే. ఏదేమైనా, స్వేచ్ఛా మార్కెట్ల మాటున దాగిన మోన్‌శాంటో లాంటి గుత్తాధిపత్య కంపెనీకి చెక్ పెట్టే ప్రయత్నం చేయడం మాత్రం మోదీకి మంచి పేరే తెస్తున్నదని చెప్పాలి.

ఎప్పుడో 1983లో ఇందిరాగాంధీ హయాంలో మారిషస్‌తో జరిగిన ద్వంద్వ పన్నుల మినహాయిం పు ఒప్పందం ఈ దేశంలోని నల్లధన కుబేరులకు వరంగా మారింది. మారిషస్‌లో బినామీ కంపెనీల పేర తమ నల్లధనాన్ని తెల్లధనం మార్చుకొని తిరిగి దేశంలోకి తెచ్చుకోవడం ఈ దేశంలో బహిరంగ రహస్యంగా మారి చాలా కాలమైంది. గత ఏ కేంద్ర ప్రభుత్వం కూడా మారిషస్ ఒప్పందాన్ని రద్దు చేయడానికి సాహసించలేదు. నల్ల కుబేరులకు ఉపయోగపడుతున్న మారిషస్ ఒప్పందాన్ని రద్దు చేసుకోవ చ్చు కదా అని గతంలో అనేకమార్లు ఈ దేశ ఆర్థిక మంత్రులను మీడియా ప్రశ్నించింది.

ఈ దేశం నుం చి తరలిపోతున్న నల్లధనం తిరిగి దేశంలోకి రావడానికి మారిషస్ లాంటి దేశాలతో ఉన్న ఒప్పందాలు ఉపయోగపడతున్నాయనేదే గత ఆర్థిక మం త్రుల మనోగతంగా అనేకసార్లు వెల్లడైంది. కానీ ఇవాళ అలాంటి నల్ల కుభేరులకు కొమ్ముకాయకుం డా మారిషస్ ఒప్పందంలో సవరణలు తెచ్చి వారికి చెక్ పెట్టిన ఘనత ఇవాళ నరేంద్ర మోదీకి దక్కింది. వ్యవస్థీకృతమైన అవినీతిలో కూరుకుపోయిన దేశం లో ఒక పాలకుడు నల్లధనానికి చెక్ పెట్టడం గొప్ప సాహసమే. ఆందుకు నరేంద్ర మోదీని అందరూ అభినందించాల్సిందే. ఇరవై ఐదేళ్ల సంస్కరణల ఫలితాలలోని మంచి-చెడును మోదీ కొంతమేరకైనా గుర్తించి పనిచేస్తున్నారని చెప్పడానికి.. మోన్‌శాంటో గుత్తాధిపత్యానికి చెక్ పెట్టడం కావచ్చు, మారిషస్ ఒప్పందానికి సవరణలు చేయడం లాంటివి నిదర్శనాలుగా చెప్పుకోవచ్చు.

మోదీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన పాపులారిటీతో ఈ దేశానికి ప్రధాని అయ్యారు. ఆ విషయాన్ని ఆయన కూడా మర్చిపోతారనుకోలేం. రాజ్యసభలో బలం పెంచుకోవాలనే ఆరాటంలో పడినట్లున్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో అక్కడి ప్రభుత్వాన్ని అస్థిరపరిచి తమ ప్రభుత్వం ఏర్పరిచారు. అలాగే ఉత్తరాఖండ్‌లోనూ అదే వైఖరితో అక్కడి ప్రభుత్వాన్ని కూడా కూల్చేసే ప్రయత్నం చేశారు. కానీ న్యాయవ్యవస్థ పుణ్యమా అని అక్కడి ప్రభు త్వం బతికిపోయింది. నిజానికి 35 ఏళ్ల తర్వాత జాతీయస్థాయి పాపులారిటీ సాధించుకున్న ఏకైక నాయకుడిగా మోదీ చరిత్రకెక్కారు. అలాంటి ప్రజాదరణ కలిగి కూడా రాష్ర్టాల్లోని ప్రభుత్వాలను పడగొట్టి తన పాపులారిటీకి తానే భంగం కలిగించుకో వడమే బాగాలేదు.

దేశంలో కరువుకు ఒక టాస్క్‌ఫోర్స్ వ్యవస్థ లేకపోవడాన్ని ఆ మధ్య ఢిల్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మోదీకి ఎత్తిచూపారు. దేశంలో ఏర్పడిన కరువును ఎదుర్కోవడంలో మాత్రం మోదీ కొంత వైఫల్యం చెందారనే చెప్పాలి. అలాగే, కొత్త రాష్ట్రమైన తెలంగాణకు విభజన బిల్లులో ఉన్న హామీలను అమలు చేయడంలో ఆయన చాలామేరకు విఫలమ య్యారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి ఎగనామం పెట్టారు. చెప్పాపెట్టకుం డా ఏడు మండలాలను పక్కరాష్ర్టానికి బదిలీ చేశా రు. ఇలాంటి వన్నీ ఆయన ఫెడరల్ స్ఫూర్తికి భంగం కలిగించాయి. మోదీ తన ఫెడరల్ నిజాయితీని చాటుకోవాలంటే, ఇప్పటికైనా ఉమ్మడి హైకోర్టును త్వరగా విభజించగలగాలి.

మోదీ పాలనపై రాజకీయ వైరుధ్యం గలవారు చాలానే ఆభాండాలు వేస్తూవస్తున్నారు. నిజానికి దేశంలో ఎన్నో దశాబ్దాలుగా ఏర్పడిన రుగ్మతలు మోదీ వచ్చా కే ఏర్పడినట్లు నిందలు వేయడంలో నిజాయితీ లేదు. రాజకీయ వైరుద్ధ్యంతో వేసే అభాండాలను ప్రజలు కూడా అంత ఈజీగా నమ్మ రు. అలాగే,వ్యతిరేకులు ఎన్ని అభాండాలు వేసినా ఆయన మౌనంగా ఉంటూవస్తున్నారు. ఏదేమైనా దేశంలో అశాంతి నెలకొనకుండా చూడగలిగినంతవరకు మోదీ మౌనం ఆయన వ్యతిరేకులకు సరైన జవాబే అవుతుంది. మొత్తం మీద రెండేళ్ల మోదీ పాలన నాట్ బ్యాడ్ అని చెప్పాలి. రాబోయే మూడేళ్ల పాలన కాలం మరింత మెరుగైన పాలన సాగనుందా లేక నాట్‌బ్యాడ్ (ఫరవాలేదు) గానే కొనసాగనుందా చూడాల్సి ఉన్నది.

1063

SRINIVAS REDDY KALLURI

Published: Tue,October 16, 2018 03:29 PM

సంపద సృష్టికే అప్పులు

అప్పులు ఎప్పుడూ సంపద సృష్టికి మాత్రమే ఉపయోగించాలనేది సంక్షేమ రాజ్య పాలకుడికి ఉండాల్సిన సహజ లక్షణం. ఈ లక్షణం కేసీఆర్ అనే పాలకుడిలో

Published: Sun,February 25, 2018 01:31 AM

డైనమిజానికి ప్రతీక

యువనేతలో తెలంగాణ ఒక డైనమిజాన్ని చూస్తున్నది. ఆయనలో క్లాస్ కంటే మాస్ లీడర్‌గా మరింత బలంగా ఉన్నాడు. తెలంగాణ పునర్ నిర్మాణ పథకాల రచనల

Published: Fri,July 7, 2017 01:04 AM

రైతు లక్షణం ఇంకా రాదా?

2022 వరకు వ్యవసాయాన్ని ఇప్పటికన్నా రెండింతల లాభాల బాట పట్టిస్తామని కొన్నాళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీపదేపదే చెబుతున్నారు. కానీ ఆచరణ

Published: Sat,February 18, 2017 01:37 AM

సృజనాత్మక వక్త

భూమిపై సగం, ఆకాశంలో సగం అని చెపితే సరిపోయేది కాదు. ఆర్బీఐ గవర్నర్‌తో సమానమైన బాధ్యతను ఈ దేశ మహిళ నిర్వహిస్తున్నదని చెప్పడమే కవిత ప

Published: Tue,February 7, 2017 01:46 AM

సహకారానికి ఉపకారమేది?

దేశంలో ఒక విశ్వసనీయ పాలకుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్‌ను ప్రధాని మోదీ ప్రశంసలతో ముంచెత్తితే సరిపోదు. కేసీఆర్ విశాల దృక్పథానికి అన

Published: Fri,January 6, 2017 11:54 PM

‘దేశీ’ తెలంగాణ స్ఫూర్తి

ప్రపంచీకరణ ప్రయాణంలో దేశీ ఆలోచనలతో బాధితులను కాపాడుకోవాలనే స్పృహ ఒక నిజమైన దేశీయ పాలకుడికి ఉండాల్సిన లక్షణం. ఆ లక్షణాన్ని ఇపుడు మ

Published: Tue,November 29, 2016 12:53 AM

రెండున్నరేండ్ల సమర్థత

గతంలో దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీకి గ్యారంటీ ఇవ్వగానే బ్యాంకులు ఒప్పేసుకొని మాఫీ చేసిన సందర్భాలున్నాయి. కానీ కేసీఆర్ ప

Published: Tue,November 22, 2016 12:02 AM

నోట్ల రద్దుపై వాస్తవ వైఖరి

ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై రకరకాల అభిప్రాయాలున్నాయి. ప్రజల అభిప్రాయం ఎలా ఉందనే కన్నా ముందు రాజకీయ

Published: Sat,October 22, 2016 01:23 AM

చెరువును చంపొద్దు

వర్షాలు ఇంత భారీగా పడినా కూడా మా ఊరి చెరువులోకి చుక్క నీరు రాలేకపోయింది. దాంతో మా ఊరి చెరువు కింద మరో మూడు ఊర్లకు చెందిన గొలుసుకట్

Published: Wed,October 5, 2016 03:43 AM

మోదీ వ్యూహాత్మక పయనం

నిజానికి కశ్మీరీలు అమాయకులు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే హిందూ యాత్రికులను గుర్రాలపై, బగ్గీలపై తీసుకెళ్లేది కశ్మీరీ ముస్లిం సోదరులే.

Published: Fri,September 16, 2016 01:23 AM

నీటి హక్కుపై నియంత్రణా?

రాష్ట్ర విభజన డ్రాఫ్ట్ బిల్లులో రెండు నదులపై యాజమాన్య బోర్డులు పెట్టాలనే ప్రతిపాదనను ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌తో సహా యావత్ తెలంగాణ బు

Published: Tue,August 9, 2016 01:17 AM

కేసీఆర్-మోదీ: తెలంగాణ

రాజకీయాలకతీతంగా దేశంలోని సమస్యల పట్ల దార్శనికంగా ఆలోచించే కేసీఆర్ వంటి ముఖ్యమంత్రికి ప్రధానిగా మోడీ ఏమేరకు సహకారం అందిస్తారనేది ఇ