ఉద్యోగుల్లో ఉద్యమస్ఫూర్తి ఏది?


Tue,May 10, 2016 12:10 AM

తెలంగాణలోని ప్రతి ఉపాధ్యాయుడు రామాజిపేట ఉపాధ్యాయుల వలె పనిచేస్తే మన రాష్ట్రంలో ఏ ఒక్క పాఠశాల కూడా మూతపడదు. తెచ్చుకున్న తెలంగాణలో రామాజిపేట ఉపాధ్యాయుల వలె పనిచేస్తున్న ప్రభుత్వోద్యోగులు లేరని కాదు. అలాంటి వారి సంఖ్య ఎంత అనేదే ప్రశ్న. అందుకే రామాజిపేట ఉపాధ్యాయుల పనితీరు ప్రతి ప్రభుత్వోద్యోగికి ఒక ఆదర్శం కావాలె. నిర్లక్ష్యం వీడి, కొంతైనా నిజాయితీ పెంచుకొని పనిచేస్తే పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రభుత్వోద్యోగుల పాత్ర సార్థకం అవుతుందనడంలో సందేహం లేదు.

srinivas
తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించింది ప్రభుత్వ ఉద్యోగులే. 42 రోజలపాటు సాగిన సకల జనుల సమ్మె ఉద్యమానికే ఒక తలమానికం. అద్భుత పాత్ర పోషించిన ప్రభుత్వ ఉద్యోగుల చరిత్రను ఎవరూ చెరిపేయలేరు వచ్చిన తెలంగాణలోనూ వారి సేవలు మరింత మెరుగ్గా ఉంటాయ ని ఆశించడం కూడా సహజం. నిజానికి వచ్చిన తెలంగాణలో అంతే నిబద్ధతతో పనిచేస్తున్న కొందరు అధికారులు, ఉద్యోగులు ఇప్పటికీ లేరని చెప్పడం కాదు. కానీ చాలామేరకు అలా పనిచేయలేకపోతున్నారని చెప్పాల్సి రావడమే చింతించాల్సిన విషయం.
ఉదాహరణకు, ఈ మధ్య ప్రభుత్వం మన తెలంగాణ- మన వ్యవసాయం పేరున ఊరూరా రైతు అవగాహన సదస్సుల కార్యక్రమం చేపట్టిన విష యం తెలిసిందే.

ఈ కార్యక్రమం ఏప్రిల్ 25 నుంచి మే 5వ తేదీ వరకు కొనసాగింది. చాలా గ్రామాల లో ఈ కార్యక్రమాన్ని అధికారులు మొక్కుబడిగా జరిపినట్లు జిల్లాల నుంచి వార్తలు ఉన్నాయి. అక్కడక్కడా ఈ కార్యక్రమం బాగానే జరిపారనే వార్తలు కూడా ఉన్నాయి. కానీ మెజారిటీ సదస్సులు అలా జరగలేదని వార్తలు చెబుతున్నాయి. చాలా గ్రామాలలో ఈ కార్యక్రమం గురించి నిరక్షరాస్యులైన రైతులకు తెలిసేలా డప్పు చాటింపు చేయించిందిలేదు.ఈ సదస్సు గురించి తెలియని రైతులే ఎక్కువ అని స్థాని క వార్తలు చెపుతున్నాయి. తీరా కార్యక్రమం రోజు ఏదో ఒక శాఖ మండలాధికారి హాజరై సదస్సు జరిగినట్లు మమ అనిపించారని రైతులు చెబుతున్నా రు. ఈ రైతు సదస్సులకు 13 శాఖల అధికారులు హాజరు కావాలె. ఆయా శాఖలకు చెందిన అధికారులు రైతులకు సూచనలు చేయాలె. అలాగే రైతుల సందేహాలకు జవాబు చెప్పాలె.

కానీ, పేరుకు సదస్సులు జరిపారే తప్ప, సఫలమైన సదస్సులు పదిశాతానికి మంచి ఉండకపోవచ్చని ఒక అంచనా. నిజం గా అధికారులు, ఉద్యోగుల నిర్లక్షం.. వచ్చిన తెలంగాణలోనూ కొనసాగుతుండటం దురదృష్టకరం. స్వయాన వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్న ఇదే కార్యక్రమానికి కూడా అధికారులు సమయానికి రాలేదు. వారిపై మంత్రి ఆగ్ర హం వ్యక్తం చేసిన వార్తను కూడా పత్రికల్లో చది వాం. తెలంగాణ వచ్చాక అదనంగా ఒక గంట పనిచేస్తామన్న ఉద్యోగులే ఇపుడు ఇంత నిర్లక్షంగా పనిచేయడం సమంజసమేనా? మంత్రి హాజరవుతున్న సదస్సు పట్ల కూడా అధికారుల నిర్లక్ష్యం చూస్తే.. మన తెలంగాణ-మన వ్యవసాయం కార్యక్రమా న్ని అధికారులు ఏమేరకు ప్రయోజనకరంగా నడపగలిగారో వేరే చెప్పనక్కర లేదనిపిస్తుంది. రాబోయే వర్షా కాలాన్ని దృష్టిలో ఉంచుకొని రైతులు ఏ పంటలు వేస్తే మేలు? ఏ పంటలు వేయకూడ దు? ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? అలాంటి వ్యవసాయ సంబంధిత అంశాలపై రైతులకు అవగాహన కల్పించాలని ప్రభుత్వం భావించింది. కానీ జరిగిందేమిటి? అడుగడుగునా అధికారుల నిర్లక్ష్యం.

తెలంగాణలో గత రెండు దశాబ్దాలుగా రైతులు పత్తిపంటనే అత్యధికంగా ఎంచుకుంటున్నారు. తెలంగాణలో పంటల సాగు 89 లక్షల ఎకరాల్లో జరుగుతున్నది. అందులో 43 లక్షల ఎకరాల్లో కేవ లం పత్తిసాగు జరుగుతున్నది. 56 లక్షల మంది రైతుల్లో 26 లక్షల మంది పత్తి రైతులే. రైతుఆత్మహత్యలకు పత్తి పంట ఒక ప్రేరకంగా తయారైంది. నకి లీ విత్తనాలతో, నకిలీ పురుగు మందులతో, గిట్టుబాటుధర లభించకపోవడంతో, అధిక పెట్టుబడులతో పత్తిరైతులు నష్టపోవడమే కాదు, అప్పుల పాలై మెడకు ఉరితాళ్లు తగిలించుకుంటుంన్నారు.వారి కుటుంబాలు బజారున పడుతున్నాయి. తాజాగా పత్తి రైతులు కొత్తగా మరొక సమస్యను కూడా ఎదుర్కోబోతున్నారు. పత్తి ఎగుమతి రాయితీలను కేం ద్రం ఎత్తేయబోతున్నది.

పత్తిధర మరింత దిగజారే అవకాశం ఉన్నది. వచ్చే ఖరీఫ్‌లోనూ మన రైతులు ఎప్పటిలాగే పత్తి పంట వెంటనే పరుగెడితే ఏమిటి పరిస్థితి? అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ పత్తి పంట మానుకోవాలని రైతులకు ఇప్పటికే పిలుపునిచ్చారు. ఇతర పప్పుదినుసులు, చిరుధాన్యాలు పండించుకోవాలని సూచన చేశారు. గత కాలంగా భారీ ఎత్తున పత్తి రైతులు నష్టపోతుంటే, ప్రాణాలనే వదులుకుంటుంటే.. వచ్చిన తెలంగాణలో దాని నివారణోపాయాల ప్రాధాన్యం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. సమస్య తీవ్రతను అధికారులు అర్థం చేసుకొని ఉంటే, పైన చెప్పిన మనతెంగాణ-మన వ్యవసాయం సదస్సులు అలా మొక్కుబడిగా జరిగేవేనా? పత్తి పంటను మానుకోవాలని అటు ముఖ్యమంత్రి కేసీఆర్, ఇటు వ్యవసాయ మంత్రి పోచారం పిలుపులిస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి పిలుపును రైతులకు చేరవేయడంలో అధికారుల నిర్లక్ష్యం చాలానే ఉన్నది. అందుకే, బీటీ పత్తి విత్తనాలను రైతులు మార్కెట్లో కొనుగోలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అధికారులు రైతులకు అవగాహన కల్పించడంలో జరిగిన వైఫల్యానికి అదొక నిదర్శనం కాదందామా?

నెలరోజుల క్రితం ఇరిగేషన్ మంత్రి హరీష్‌రావు మిషన్ కాకతీయ పనులపై జరిపిన సమీక్షా సమావేశంలో అధికారుల అలసత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసి న వార్తను కూడా మనం పత్రికల్లో చదివాం. మిషన్ కాకతీయ-2 పనులలో 25 శాతం కూడా ప్రారం భం కాలేదని అధికారులపై మంత్రి అసహనం వ్యక్తంచేశారు. చెరువుల పూడిక తీత పనులు వేగవంతంగా జరిగితేనే వర్షాకాలంలో చెరువులు బాగా ఉపయోగంలోకి రాగలుగుతాయి. మంత్రి హెచ్చరికతో చెరువుల పూడికతీత పనులు ఇపుడు వేగం పుంజుకున్న మాట నిజం. ఇక్కడ గమనించాల్సిందేమిటం టే.. మంత్రి హెచ్చరిస్తే గానీ అధికారులలో చలనం లేకపోవడమే. సమైక్య పాలనలో చెరువుల ప్రాధా న్యం అటకెక్కింది. తెలంగాణ బతుకులకే ఎసరుపెట్టింది. అందుకే, మిషన్ కాకతీయ తెలంగాణ పునర్నిర్మాణానికి పునాది రాయి. ఉద్యోగులు ఏ తెలంగాణ కోసం పోరాడారో ఆ తెలంగాణ గ్రామాల్లోనే ఉన్నది. 46000 తెలంగాణ చెరువులు కళకళలాడితే.. తెలంగాణ పునరుజ్జీవం పొందినట్లే.

కేసీఆర్ వంటి సమర్థుడైన పాలకుడు ఉన్నారు. ప్రభుత్వ యంత్రాంగం కూడా అంతే సమర్థతను చాటుకోగలిగితే తెలంగాణను పట్టిపీడిస్తున్న అనేక సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. కానీ ప్రభుత్వ యంత్రాంగం గత రుగ్మతల నుంచి పూర్తిగా బయటపడలేకపోతున్నది. రాత్రికి రాత్రే ఆ రుగ్మతల నుంచి బయట పడకపోవచ్చు. కానీ తామే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజలకు కొంతైనా మెరుగైన సేవలు అందించాలనే స్పృహ ప్రతి ఉద్యోగిలోనూ ఉండాలె. అలాంటి స్పృహ ఉన్న ఉద్యోగు లు కొందరు లేకపోలేదు. కానీ మెజారిటీ ఉద్యోగుల తీరులోనే మార్పు రావాలె. తెలంగాణ తెచ్చుకున్నది తమ ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ల కోసం మాత్రమే కాకుండా, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు జరిగిన అన్యాయాలను తుడిచేయడానికి కూడా అని మర్చిపోవద్దు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమంలో ఉద్యోగుల కీలక పాత్రను మర్చిపోలేదు.

ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిచడానికి 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చారు. సాధ్యమైనంత వరకు పనిలో నిర్లక్ష్యం, అవినీతికి అస్కారం ఉండకూడదనే ఉద్దేశంతోనే దేశంలో ఎక్కడా లేనివిధంగా 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చారు. ఉద్యోగులు నిబద్ధతతో, స్నేహపూర్వకంగా పనిచేయడానికి తమ ది ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని ప్రకటించారు. ఆ విధంగా ఉద్యోగుల కష్టనష్టాలను పట్టించుకొని పరిష్కరించిన ప్రభుత్వంలో ఉద్యోగులు నిర్లక్ష్యానికి తావులేకుండా పని చేయాలె. అది కనీస ధర్మం.

పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రకటించ డం పాలకుని పని. వాటిని అమలు చేయాల్సింది ప్రభుత్వ యంత్రాంగమే. కాబట్టి ప్రభుత్వ విజయాలు-వైఫల్యాలు ఉద్యోగుల పనితీరుపైనే చాలామేరకు ఆధారపడిఉంటాయి. అందుకొక ఉదాహరణ కూడా ఇక్కడ మనం చెప్పుకొవచ్చు. ఉపాధ్యాయు ల పనితీరు సరిగా లేక, తద్వారా పిల్లలు రాక, ప్రభు త్వ పాఠశాలలు మూత పడుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల్లో నమ్మకంలేని ఈ కాలంలో కరీంనగర్ జిల్లా, ఇల్లంతకుంట మండలం, రామాజిపేట ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు అందరికీ ఆదర్శప్రాయులుగా నిలిచారు. ఆ ఊరికి చెందిన 90 శాతం విద్యార్థులు ప్రభత్వ పాఠశాలలోనే చదువుతున్నారు. ఉపాధ్యాయుల పనితీరే అందుకు నిదర్శనం.

అంతబాగా పనిచేస్తూ కూడా ఆ ఉపాధ్యాయులు తమ పనితీరు మరింత మెరుగుపరుచుకునేందుకు ఆ ఊరి ప్రజల నుంచి సలహాలు కోరారు. గ్రామం నుంచి ఒక్క విద్యార్థికూడా ప్రైవేటు పాఠశాలకు వెళ్లకుండా చూసుకోవడ మే ఆ పాఠశాల ఉపాధ్యాయులు లక్ష్యంగా పెట్టుకున్నారు. తెలంగాణలోని ప్రతి ఉపాధ్యాయుడు రామాజిపేట ఉపాధ్యాయుల వలె పనిచేస్తే మన రాష్ట్రంలో ఏ ఒక్క పాఠశాల కూడా మూతపడదు. తెచ్చుకున్న తెలంగాణలో రామాజిపేట ఉపాధ్యాయుల వలె పనిచేస్తున్న ప్రభుత్వోద్యోగులు లేరని కాదు. అలాంటి వారి సంఖ్య ఎంత అనేదే ప్రశ్న. అందుకే రామాజిపేట ఉపాధ్యాయుల పనితీరు ప్రతి ప్రభుత్వోద్యోగికి ఒక ఆదర్శం కావాలె. నిర్లక్ష్యం వీడి, కొంతైనా నిజాయితీ పెంచుకొని పనిచేస్తే పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రభుత్వోద్యోగుల పాత్ర సార్థకం అవుతుందనడంలో సందేహం లేదు.

2837

SRINIVAS REDDY KALLURI

Published: Tue,October 16, 2018 03:29 PM

సంపద సృష్టికే అప్పులు

అప్పులు ఎప్పుడూ సంపద సృష్టికి మాత్రమే ఉపయోగించాలనేది సంక్షేమ రాజ్య పాలకుడికి ఉండాల్సిన సహజ లక్షణం. ఈ లక్షణం కేసీఆర్ అనే పాలకుడిలో

Published: Sun,February 25, 2018 01:31 AM

డైనమిజానికి ప్రతీక

యువనేతలో తెలంగాణ ఒక డైనమిజాన్ని చూస్తున్నది. ఆయనలో క్లాస్ కంటే మాస్ లీడర్‌గా మరింత బలంగా ఉన్నాడు. తెలంగాణ పునర్ నిర్మాణ పథకాల రచనల

Published: Fri,July 7, 2017 01:04 AM

రైతు లక్షణం ఇంకా రాదా?

2022 వరకు వ్యవసాయాన్ని ఇప్పటికన్నా రెండింతల లాభాల బాట పట్టిస్తామని కొన్నాళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీపదేపదే చెబుతున్నారు. కానీ ఆచరణ

Published: Sat,February 18, 2017 01:37 AM

సృజనాత్మక వక్త

భూమిపై సగం, ఆకాశంలో సగం అని చెపితే సరిపోయేది కాదు. ఆర్బీఐ గవర్నర్‌తో సమానమైన బాధ్యతను ఈ దేశ మహిళ నిర్వహిస్తున్నదని చెప్పడమే కవిత ప

Published: Tue,February 7, 2017 01:46 AM

సహకారానికి ఉపకారమేది?

దేశంలో ఒక విశ్వసనీయ పాలకుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్‌ను ప్రధాని మోదీ ప్రశంసలతో ముంచెత్తితే సరిపోదు. కేసీఆర్ విశాల దృక్పథానికి అన

Published: Fri,January 6, 2017 11:54 PM

‘దేశీ’ తెలంగాణ స్ఫూర్తి

ప్రపంచీకరణ ప్రయాణంలో దేశీ ఆలోచనలతో బాధితులను కాపాడుకోవాలనే స్పృహ ఒక నిజమైన దేశీయ పాలకుడికి ఉండాల్సిన లక్షణం. ఆ లక్షణాన్ని ఇపుడు మ

Published: Tue,November 29, 2016 12:53 AM

రెండున్నరేండ్ల సమర్థత

గతంలో దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీకి గ్యారంటీ ఇవ్వగానే బ్యాంకులు ఒప్పేసుకొని మాఫీ చేసిన సందర్భాలున్నాయి. కానీ కేసీఆర్ ప

Published: Tue,November 22, 2016 12:02 AM

నోట్ల రద్దుపై వాస్తవ వైఖరి

ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై రకరకాల అభిప్రాయాలున్నాయి. ప్రజల అభిప్రాయం ఎలా ఉందనే కన్నా ముందు రాజకీయ

Published: Sat,October 22, 2016 01:23 AM

చెరువును చంపొద్దు

వర్షాలు ఇంత భారీగా పడినా కూడా మా ఊరి చెరువులోకి చుక్క నీరు రాలేకపోయింది. దాంతో మా ఊరి చెరువు కింద మరో మూడు ఊర్లకు చెందిన గొలుసుకట్

Published: Wed,October 5, 2016 03:43 AM

మోదీ వ్యూహాత్మక పయనం

నిజానికి కశ్మీరీలు అమాయకులు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే హిందూ యాత్రికులను గుర్రాలపై, బగ్గీలపై తీసుకెళ్లేది కశ్మీరీ ముస్లిం సోదరులే.

Published: Fri,September 16, 2016 01:23 AM

నీటి హక్కుపై నియంత్రణా?

రాష్ట్ర విభజన డ్రాఫ్ట్ బిల్లులో రెండు నదులపై యాజమాన్య బోర్డులు పెట్టాలనే ప్రతిపాదనను ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌తో సహా యావత్ తెలంగాణ బు

Published: Tue,August 9, 2016 01:17 AM

కేసీఆర్-మోదీ: తెలంగాణ

రాజకీయాలకతీతంగా దేశంలోని సమస్యల పట్ల దార్శనికంగా ఆలోచించే కేసీఆర్ వంటి ముఖ్యమంత్రికి ప్రధానిగా మోడీ ఏమేరకు సహకారం అందిస్తారనేది ఇ        


country oven

Featured Articles