నాడు పెండింగ్ -నేడు షౌటింగ్


Mon,April 18, 2016 11:24 PM

కరువుకు కేరాఫ్ అడ్రస్ లాంటి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలకు కమిట్‌మెంట్ ఉన్న పాలకులు ముఖ్యం తప్ప బతుకులను పెండింగ్‌లో పెట్టిన గత పాలకుల షౌటింగ్ వాదనలు ముఖ్యం కాదు. గతమంతా అధికారంలో ఉండి ప్రాజెక్టులను పెండింగ్ పెట్టారు. ఇపుడు విపక్షంలో ఉండి షౌటింగ్ చేస్తున్నారు.ప్రజలు తెలివైన వారని మర్చిపోతే ఎలా? ఉమ్మడి ప్రభుత్వాలు తెలంగాణలో ఆరంభించి వదిలేసిన ప్రాజెక్టులకు పెండింగ్ ప్రాజెక్టులుగా నామకరణం చేసి చరిత్రకెక్కించిన వారే..

srinivas
ఇపుడు గాయి చేయడం విచిత్రం. ఆ ప్రాజెక్టుల నిర్మాణ ప్యాకేజీలు ఏవేవి పూర్తయ్యాయి, ఏవి కాలే దు, ఎందుకు కాలేదు అని తెలుసుకొని తిరిగి వాటిని ఆరంభించడమంటే మామూలు విషయం కాదు. మహబూబ్‌నగర్ జిల్లాలో కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ పెండింగ్ ప్రాజెక్టుల కథలు కూడా అలాంటివే. ఈ పెండింగ్ ప్రాజెక్టుల పనులు దాదాపు 80 శాతం పూర్తయ్యాయని, మరికొద్ది పను లు మాత్రమే మిగిలాయని వాటిని ఎందుకు పూర్తి చేయడం విపక్షనేతలు కొందరు ప్రభుత్వంపై విమర్శ లు చేయడం చూస్తున్నాం. వారి వాదనల్లో ఎంత నిజముంది? నిజంగానే ఈ ప్రభుత్వం ఆ ప్రాజెక్టుల పనులు చేయడం లేదా? జవాబులు తెలుసుకోవాల్సి న ప్రశ్నలవి.

ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారం చేపట్టిన నాటినుంచి ఉమ్మడి పాలకులు వదిలేసిపోయిన ప్రాజెక్టుల పై దృష్టి పెట్టడం లేదని ఎవరు ఆరోపించినా అది ఉబుసుపోని ఆరోపణే అవుతుంది. పాలనా సామ ర్థ్యం కలిగిన హరీష్‌రావు సాగునీటి మంత్రిగా ఉండ టం తెలంగాణకు కలిసొచ్చిన అంశం. అలాగే, ఉద్య మ లక్ష్యాలు తెలిసిన ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు నిరంజన్‌రెడ్డి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన వారు కావడం, అక్కడి పెండింగ్ ప్రాజెక్టులపై వారు మరింత శ్రద్ధ తీసుకొని పర్యవేక్షిస్తుండటం మనం గమనించవచ్చు. అందువల్లే పైనాలుగు పెండింగ్ ప్రాజెక్టుల పనులు మరింత వేగవంతంగా జరుగుతున్నాయ నడంలో సందేహం అక్కరలేదు. విపక్షాల విమర్శల నేపథ్యంలో, ఈ మధ్య నేను నిరంజన్‌రెడ్డిని కలిశాను. ఆ పెండింగ్ ప్రాజెక్టల పనులపై వివరాలు అడిగి తెలుసుకున్నాను.

పై ప్రాజెక్టుల పెండింగ్ కథనాలు, వాటి ప్యాకేజీలను అర్థం చేసుకొని తిరిగి ఆరంభించడానికి కొంత సమయం పట్టింది. వాటి పనులు ఏడాది కాలంగా వేగవంతంగా జరుగుతున్నాయి. వాటి పనులు పను లు గతంలోనే దాదాపు 80 శాతం పూర్తయ్యాయని అంటున్నారే కానీ, మిగిలిన పనులే చాలా క్లిష్టమైనవని చెప్పకతప్పదు. ఏప్రాజెక్టులోనూ పూర్తి భూసేకరణ చేసింది లేదు. పునరావాసం పూర్తి కాలేదు. రిజర్వాయర్లు పూర్తి కాలేదు. అంతేకాదు, ప్రాజెక్టుల పను లు తిరిగి ఆరంభించి పూర్తి చేయడానికి కొత్తగా టెండ ర్లు పిలవాలా లేక పాత కాంట్రాక్టర్లకే అప్పంగించాలా అనేది ఒక సందిగ్ధం. అందుకోసం ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీ వేసింది. కొత్తగా టెండర్లు పిలిచి కొత్త కాంట్రాక్టర్లకు అప్పగిస్తే వందశాతం వ్యయం పెరుగుతుంది.

పెరిగిన ధరలను జోడించి పాత కాంట్రాక్టర్లకే పనులు అప్పగిస్తే దాదాపు 27 నుంచి 32 శాతం మాత్రమే వ్యయం పెరుగుతుందని క్యాబినెట్ సబ్ కమిటీ సిఫార్సు చేసింది. ఆ ప్రకారమే పాత కాంట్రాక్ట్ ఒప్పందాలనే కొనసాగిస్తూ పనులు జరుగుతున్నాయి. నిజంగానే వ్యయంపై అధ్యయనం చేయకుండా కొత్త కాంట్రాక్టర్లకు పనులు అప్పగిస్తే 70 శాతం వ్యయం దుబారా అయ్యేదే కదా. ప్రజాధనం దుబారా పట్ల అవగాహన మరిచి చిన్నారెడ్డి నుంచి నాగం దాకా ఎవరు మాట్లాడినా వారిది రాద్ధాంతం తప్ప మరొకటి కాదు.

పై నాలుగు పెండింగ్ ప్రాజెక్టులు ఎప్పడు ఆరంభమయ్యాయి? ఎందుకు పూర్తి కాలేదు? జవాబు చెప్పాల్సిన అప్పటి పాలకులే, ఇపుడు ప్రశ్నిస్తుండటం గమనార్హం. ఒక్కో పెండింగ్ ప్రాజెక్టుది ఒక్కో కథ. వాటన్నిటివీ దశాబ్దాల పెండింగ్ చరిత్ర. ఎన్నికలు ఎప్పుడొచ్చినా అప్పుడు కొన్ని పనులు చేయడం అప్పటి పాలకుల అలవాటులో భాగంగానే కోయిల్ సాగర్ పనులు కూడా కొంత జరిగాయి. సుమారు 14 వేల ఎకరాలకు నీరందించారు. కానీ మిగతా సుమా రు 32 వేల ఎకరాలను ఎండబెట్టారు. పేరుకు 75 శాతం పనులు పూర్తయినట్లేగానీ, కెనాల్స్ మార్గాలు పూర్తిచేయలేదు. రైల్వే క్రాసింగ్‌లు, ఆర్ అండ్ బీ రోడ్ క్రాసింగ్‌లు, డిస్ట్రిబ్యూషన్ సిస్టం అన్నీ పెండింగే. సులభంగా జరిగే పనులు తప్ప క్లిష్టమైన పనులు పెండంగ్ ఖాతాలో పెట్టారు.

ఇక భీమా ప్రాజెక్టు విషయానికొస్తే, ఫేస్ వన్‌లో భూసేకరణ, కెనాల్స్, స్ట్రక్చర్స్ నిర్మాణాలు పెండింగే. ఇక ఫేస్ రెండు గురించి చెప్పాలంటే, ఎన్నికలు దగ్గర పడిన 2013లో ఒక లిఫ్ట్ నిర్మాణం పూర్తి చేశారు. కాలువలు, డిస్ట్రిబ్యూషన్ సిస్టం పెండింగ్‌లో పెట్టారు. భీమా ఆయకట్టు 2 లక్షల ఎకరాలుగా నిర్ధారించారు. కానీ గత ప్రభుత్వ కాలంలో అందించింది 12 వేల ఎకరాలకు మాత్రమే.టీఆర్‌ఎస్ ప్రభు త్వం వచ్చాక మొన్నటి రబీలో భీమా ఆయకట్టుకు 25 వేల ఎకరాలకు నీరందించామని నిరంజన్‌రెడ్డి చెప్పారు. నెట్టెంపాడు ప్రాజెక్టు నుంచి రెండు లక్షల ఎకరాలకు నీరందిస్తామని ఆరంభించారు. కానీ ఇప్పటికీ ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 15 వేల ఎకరాలకు మాత్రమే అందించగలిగారు. పై మూడు ప్రాజెక్టుల ద్వార 8.60 లక్షల ఎకరాల ఆయకట్టును నిర్ధారించిన వారు, 40 వేల ఎకరాలకు మించి అందిచలేనపుడు ఆ ప్రాజెక్టులన్నీ 80 శాతం పూర్తయ్యాయని చెప్పడం లో ఎంత నిజాయితీ ఉన్నదందాం? భూసేకరణ, రిహాబిలిటేషన్, కెనాల్స్ నిర్మాణం, స్ట్రక్చర్స్ నిర్మాణా లు ఏ ప్రాజెక్టులోనూ పూర్తి కానపుడు అవి 80 శాతం పూర్తయ్యాయని చెప్పుకున్నా ప్రయోజనం ఉందా?
పై మూడు ప్రాజెక్టుల కన్నా అత్యంత కీలకమైన ప్రాజెక్టు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం.

ఈ ప్రాజెక్టును చంద్రబాబు పాలనలో (1996) సర్వే చేశారు. రూ. 50 లక్షల వ్యయం నిర్ధారించారు. కానీ 2002 వరకు ఈ ప్రాజెక్టుపై ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టలేదు. ఈ విషయాన్ని అప్పటి అసెంబ్లీలో కేసీఆర్ అనేక సార్లు చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎన్నికలు దగ్గర పడగానే 2003లో రిజర్వాయర్ల బండింగ్ పను లు ప్రారంభించారు. ఆ తదుపరి 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకా జరిగిందేమిటి? 3 లక్షల65 వేల ఆయకట్టుకు నీరందించాలని ప్రతిపాదించారు. కానీ జరిగిందేమిటి? అన్ని ప్రాజెక్టుల పనులపై ఎన్నికల ముందు హడావిడి చేసినట్లుగానే 2013లో కల్వకుర్తి ప్రాజెక్టు మొదటి లిప్ట్‌ను పూర్తి చేశారు. 13 వేల ఎకరాలకు నీరందించారు. గుడిపల్లి నుంచి కుడి వైపు అచ్చంపేట నియోజకవర్గానికి, ఎడమవైపు కల్వకుర్తి నియోజకవర్గానికి వెళ్లే ప్రధాన కాలువ (165 కి.మీ) పనులు మూలనపడ్డాయి.

రెండో లిఫ్ట్ (జొన్నలగడ్డ), టన్నెల్ పనులు, అలాగే మూడో లిఫ్ట్ (గుడిపల్లి), పంపులు, మోటర్ల పనులు సగం మేరకు తప్ప మిగ తా పనులన్నీ అరకొరగా అక్కరకు రాకుండా ఉన్నా యి. ఈ ప్రాజెక్టు పనులు 50 శాతానికి మించి జరగలేదని నిరంజన్‌రెడ్డి చెపుతున్నారు. 2012 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదని అన్నారు. అరకొర భూసేకరణ, అరకొర రిహాబిలిటేషన్ అన్నీ తీరని సమస్యలను వదిలి వెళ్లిన వాళ్లు ఇవాళ 80 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పడమే అశ్చర్యమని వారంటున్నారు. అయినా టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆ పెండింగ్ సమస్యలన్నిటినీ పరిష్కరిస్తూ పై ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయడానికి తన శాయశక్తులను ఉపయోగిస్తున్నదని వారన్నారు. కల్వకుర్తి ప్రాజెక్టుకు గతంలో 25 టీఎంసీల కేటాయింపు ఉంది. ఇపుడు టీఆర్‌ఎస్ ప్రభుత్వం 40 టీఎంసీలకు పెంచుతూ 147/sept/2015 జీవో ఇచ్చింది.

తద్వార కల్వకుర్తి ప్రాజెక్టు ఆయకట్టును 3.65 వేల ఎకరాల నుంచి 3.90 వేల ఎకరాలకు పెంచారు.
తాము సమైక్యపాలనలో అధికారం అనుభవించిన నాడు కనిపించని ఈ పెండింగ్ ప్రాజెక్టులపై ఇవాళ ఒంటికాలిపై లేచి...ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు మాట్లాడటాన్ని నిపుణులు సైతం తప్పు పడుతున్నా రు. నిరంజన్‌రెడ్డి మాటల్లోనే చెప్పాలంటే- దేశంలో ఉండే ఏ నిపుణులైనా వచ్చి మిగిలిఉన్న పనులను రెండు మూడు నెలల్లో పూర్తి చేయగలమంటే ఎంత డబ్బైనా ఇవ్వడానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. విపక్షాలు మా సవాలును స్వీకరించాలి అన్నమాటల్లో నిజాయితీ లేదందామా?ఈ పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో తేలుతున్నదేమంటే, గత పాలకులు సులభమైన పనులు చేసి, క్లిష్టమైన పనులను తెలంగాణకు వదిలేసిపోయారని చెప్పొచ్చు.

అవి ఎంతటి క్లిష్టమైన పనులైనా ఈ పెండింగ్ ప్రాజెక్టుల పనులు ఇవాళ వేగంగా జరుగుతున్నాయనడంలో సందేహం లేదు. నిరజంన్‌రెడ్డి లాంటి పర్యవేక్షుడు ఇప్పటికే ఆ ప్రాజెక్టుల వద్దకు 20 సార్లు వెళ్లి పనులు పర్యవేక్షిం చారు. ప్రాజెక్టుల వద్ద నిద్ర అనే కార్యక్రమం చేపట్టి అక్కడ పనిచేసే వారిలో స్ఫూర్తి నింపారు. వచ్చే జూలై నాటికి నాలుగు ప్రాజెక్టుల కింద సుమారు 3.50 లక్షల ఎకరాలకు నీరందిస్తామంటున్నారు. అలాగే ఆ నాలుగు ప్రాజెక్టులు 2017 జూలై నాటికి పూర్తి చేస్తామంటున్నారు. కరువుకు కేరాఫ్ అడ్రస్ లాంటి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలకు కమిట్‌మెంట్ ఉన్న పాలకులు ముఖ్యం తప్ప బతుకులను పెండింగ్‌లో పెట్టిన గత పాలకుల షౌటింగ్ వాదనలు ముఖ్యం కాదు. గతమంతా అధికారంలో ఉండి ప్రాజెక్టులను పెండింగ్ పెట్టారు. ఇపుడు విపక్షంలో ఉండి షౌటింగ్ చేస్తున్నా రు. ప్రజలు తెలివైన వారని మర్చిపోతే ఎలా?

1643

SRINIVAS REDDY KALLURI

Published: Tue,October 16, 2018 03:29 PM

సంపద సృష్టికే అప్పులు

అప్పులు ఎప్పుడూ సంపద సృష్టికి మాత్రమే ఉపయోగించాలనేది సంక్షేమ రాజ్య పాలకుడికి ఉండాల్సిన సహజ లక్షణం. ఈ లక్షణం కేసీఆర్ అనే పాలకుడిలో

Published: Sun,February 25, 2018 01:31 AM

డైనమిజానికి ప్రతీక

యువనేతలో తెలంగాణ ఒక డైనమిజాన్ని చూస్తున్నది. ఆయనలో క్లాస్ కంటే మాస్ లీడర్‌గా మరింత బలంగా ఉన్నాడు. తెలంగాణ పునర్ నిర్మాణ పథకాల రచనల

Published: Fri,July 7, 2017 01:04 AM

రైతు లక్షణం ఇంకా రాదా?

2022 వరకు వ్యవసాయాన్ని ఇప్పటికన్నా రెండింతల లాభాల బాట పట్టిస్తామని కొన్నాళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీపదేపదే చెబుతున్నారు. కానీ ఆచరణ

Published: Sat,February 18, 2017 01:37 AM

సృజనాత్మక వక్త

భూమిపై సగం, ఆకాశంలో సగం అని చెపితే సరిపోయేది కాదు. ఆర్బీఐ గవర్నర్‌తో సమానమైన బాధ్యతను ఈ దేశ మహిళ నిర్వహిస్తున్నదని చెప్పడమే కవిత ప

Published: Tue,February 7, 2017 01:46 AM

సహకారానికి ఉపకారమేది?

దేశంలో ఒక విశ్వసనీయ పాలకుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్‌ను ప్రధాని మోదీ ప్రశంసలతో ముంచెత్తితే సరిపోదు. కేసీఆర్ విశాల దృక్పథానికి అన

Published: Fri,January 6, 2017 11:54 PM

‘దేశీ’ తెలంగాణ స్ఫూర్తి

ప్రపంచీకరణ ప్రయాణంలో దేశీ ఆలోచనలతో బాధితులను కాపాడుకోవాలనే స్పృహ ఒక నిజమైన దేశీయ పాలకుడికి ఉండాల్సిన లక్షణం. ఆ లక్షణాన్ని ఇపుడు మ

Published: Tue,November 29, 2016 12:53 AM

రెండున్నరేండ్ల సమర్థత

గతంలో దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీకి గ్యారంటీ ఇవ్వగానే బ్యాంకులు ఒప్పేసుకొని మాఫీ చేసిన సందర్భాలున్నాయి. కానీ కేసీఆర్ ప

Published: Tue,November 22, 2016 12:02 AM

నోట్ల రద్దుపై వాస్తవ వైఖరి

ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై రకరకాల అభిప్రాయాలున్నాయి. ప్రజల అభిప్రాయం ఎలా ఉందనే కన్నా ముందు రాజకీయ

Published: Sat,October 22, 2016 01:23 AM

చెరువును చంపొద్దు

వర్షాలు ఇంత భారీగా పడినా కూడా మా ఊరి చెరువులోకి చుక్క నీరు రాలేకపోయింది. దాంతో మా ఊరి చెరువు కింద మరో మూడు ఊర్లకు చెందిన గొలుసుకట్

Published: Wed,October 5, 2016 03:43 AM

మోదీ వ్యూహాత్మక పయనం

నిజానికి కశ్మీరీలు అమాయకులు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే హిందూ యాత్రికులను గుర్రాలపై, బగ్గీలపై తీసుకెళ్లేది కశ్మీరీ ముస్లిం సోదరులే.

Published: Fri,September 16, 2016 01:23 AM

నీటి హక్కుపై నియంత్రణా?

రాష్ట్ర విభజన డ్రాఫ్ట్ బిల్లులో రెండు నదులపై యాజమాన్య బోర్డులు పెట్టాలనే ప్రతిపాదనను ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌తో సహా యావత్ తెలంగాణ బు

Published: Tue,August 9, 2016 01:17 AM

కేసీఆర్-మోదీ: తెలంగాణ

రాజకీయాలకతీతంగా దేశంలోని సమస్యల పట్ల దార్శనికంగా ఆలోచించే కేసీఆర్ వంటి ముఖ్యమంత్రికి ప్రధానిగా మోడీ ఏమేరకు సహకారం అందిస్తారనేది ఇ