కాంగ్రెస్ నేతల మైండ్‌సెట్ మారదా?


Sat,April 9, 2016 01:02 AM

ప్రాయశ్చిత్త మనస్తత్వం ఉంటే.. ఆరు దశాబ్దాల విధ్వంసం నుంచి తెలంగాణను తిరిగి నిర్మించుకునే ప్రయత్నాలకు సహకరించాలె తప్ప పాత మైండ్‌సెట్‌తో పనిచేయొద్దు! పశ్చాత్తాపం ఉన్నపుడే, కాంగ్రెస్ నేతలు తెలంగాణ ఆత్మతో
ఆలోచించగలుగుతారు. ప్రజల మన్ననలూ పొందగలుగుతారు.

srinu
అసెంబ్లీ సాక్షిగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాల పై ప్రభుత్వం పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే బహిష్కరించిన వాళ్లే ఇప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడతామంటున్నారు. తెలంగాణను తెచ్చిన పార్టీగా టీఆర్‌ఎస్ పట్ల ప్రజలకు ఎంత గౌర వం ఉందో, తెలంగాణను ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పట్ల కొంత గౌరవం ఉన్నది. కానీ సీమాంధ్ర నేతల సహవాస దోషమో మరొకటో తెలియదు కానీ, వారి పాత మైండ్‌సెట్ మాత్రం మారడం లేదు.
అసెంబ్లీలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ చేయవచ్చా లేదా, తాము బహిష్కరించడం మంచిదా కాదా అని మాజీ స్పీకర్లు సురేశ్‌రె డ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి నుంచి కాంగ్రెస్ నేతలు సలహా తీసుకున్నారని విన్నాం. ప్రభుత్వాలు పరిపాలనలోనే సాంకేతికతను విపరీతంగా ఉపయోగిస్తున్నాయి. చట్టసభ ల్లో దాన్ని వాడటంలో తప్పేముంది? సభను బహిష్కరించడానికి సాకులు వెదకడం సరికాదు. అసెంబ్లీలో ఏది మాట్లాడినా అది రికార్డవుతుంది. అది ప్రజలకు జవాబుదారీగా చరిత్రలో నిలిచిపోతుంది.

ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొనే సీఎం కేసీఆర్ తెలంగాణ జల దృశ్యాన్ని అసెంబ్లీలో ఆవిష్కరించారు. గతంలో ఏం జరిగింది, ఇప్పుడేం చేయాలన్న దానిపై అసెంబ్లీ రికార్డుల్లోకి ఎక్కించగలిగారు. రాబోయే తరాలకు అది ఉపయోగకరమవుతుంది. అట్లాగే, ప్రభుత్వం చూపిన ప్రజెంటేషన్‌లో అభ్యంతరాలు, సూచనలుంటే చెప్పే అవకాశాన్ని ప్రతిపక్షంగా కాం గ్రెస్ ఉపయోగించుకోవాల్సింది. చర్చకు సమయం సరిపోదంటే, మరో రెండు రోజుల చర్చకు పట్టుబట్టి ఉండాల్సింది. బహిష్కరించిన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ కి అదొక చారిత్రక తప్పిందంగా మిగిలిపోతుంది తప్ప కౌంటర్ ప్రజెంటేషన్ ఇవ్వ డం వల్ల ఆ తప్పిదం ఒప్పుగా మారిపోదు.
తెలంగాణ వస్తే అంధకారమవుతుందని అక్కసు వెళ్లగక్కిన మాజీ ముఖ్యమం త్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సలహా మేరకు పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్‌కు డుమ్మా కొట్టిన కాంగ్రెస్ నేతలను చూస్తే ఎవరికైనా ఏమనిపిస్తుంది?

ఇందిరమ్మ తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించారని అర్థంలేని ఆధారాలు పట్టుకొని ఢిల్లీ పెద్దలను మేనేజ్‌చేసి చివరిదాకా తెలంగాణను అడ్డుకుందామనుకున్న కిరణ్‌కుమార్‌రెడ్డి నుంచి ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ నేత లు సలహాలు తీసుకునే స్థాయికి చేరుకున్నారంటే, వీరి మైండ్‌సెట్ మారిందని ఎవరికైనా అనిపించగల దా? అంతెందుకు, నల్లగొండ కాంగ్రెస్ ఎంపీ గారి నిర్వాకం చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవలసిందే. మిష న్ భగీరథ పథకానికి రుణం ఇవ్వకూడదని నాబార్డు కు ఆయన లేఖ రాశారు. ప్రజల దాహార్తిని తీర్చే పథకానికి రుణం ఇవ్వవద్దని ఒక తెలంగాణ ప్రజాప్రతినిధిగా లేఖ రాయడాన్ని ఎలా చూడవచ్చు? తెలంగాణ వచ్చాక కూడా కాంగ్రెస్ నేతల మైండ్‌సెట్ మారలేదనేందుకు అంతకుమిం చిన ఉదాహరణ అక్కరలేదేమో? అందుకే, కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఇచ్చినా, అది తెలంగాణకు న్యాయం చేయజాలదని ప్రజలు నమ్మారు. వచ్చిన తెలంగాణ లో అధికారమివ్వలేదు. తెలంగాణను ఎవరిచ్చారనేది ముఖ్యం కాదు, ఇచ్చిన తెలంగాణ పట్ల తాము ఎలా వ్యవహరిస్తున్నామనేదే ముఖ్యం.

పోతిరెడ్డిపాడు నుంచి తోడుకుపోతుంటే కదలని రాజకీయం, ఇవాళ తమ్మిడి హట్టి ఎత్తు తగ్గించొద్దని గగ్గోలు పెడుతున్నది. సరిహద్దు రాష్ర్టాలతో తెగని పంచాయితీలు ముడిపెట్టి తెలంగాణ భూములకు దశాబ్దాల తరబడి సమైక్య పాలకులు కావాలని ఎసరుపెడుతుంటే, మనోళ్లు పదవుల లాలసత్వాలలో తేలియాడారు. వివాదాలు, అభ్యంతరాలు కలిగిన డిజైన్లు రచించి తెలంగాణ ప్రాజెక్టులను పెం డింగ్ ప్రాజెక్టులుగా చరిత్రకెక్కించినా మనోళ్లకు ఏనాడూ పట్టలేదు. గోదావరి నీళ్లు ధవళేశ్వరానికి, కృష్ణా నీళ్లు పోతిరెడ్డి పాడుకు బిరబిరా పారడానికి తెలంగాణ ప్రాజెక్టులను కావాలని కిరికిరిల్లో ఇరికిస్తుంటే మనోళ్లకు ఏనాడూ కనిపించలేదు. రాయలసీమలో హంద్రీ-నీవా ప్రాజెక్టుకు రాజశేఖర్‌రెడ్డి శంకుస్థాపన చేస్తుంటే వెళ్లి మంగళహారతులు పట్టిన మహిళానేతనే ఇవాళ ప్రాజెక్టుల రీడిజైనింగ్‌లను తప్పు పడుతున్నారు. నిజంగా తన ప్రాంతం పట్ల అంత సోయే ఉంటే, గత పదేళ్లలో సీమాంధ్రలో ఇన్ని ప్రాజెక్టులు నిర్మించి పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు దోచుకుపోయేవారేనా?

రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే సీమాంధ్రలో చేపట్టిన ఏ ఒక్క ప్రాజెక్టుకై నా నీటి కేటాయింపులున్నాయా? వాటికి కేంద్ర అనుమతులున్నా యా? పదవుల లాలసత్వం తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టింది. ఇవాళ పోతిరెడ్డిపాడు నుంచి నీటి దోపిడీ ఆగేదికాదు. దెబ్బతిన్న ప్రయోజనాలు తిరిగి వచ్చేవి కావు. క్షమించరాని తప్పిదాలకు ఒడిగట్టిన వారు ఇప్పుడు తగుదునమ్మా అంటూ ప్రాజెక్టుల రీ డిజైంగ్‌లపై అక్కసు కొద్ది మాట్లాడి ఎవరికి ప్రయోజనం చేయనున్నారు? వీరి మైండ్‌సెట్ మారదా?

ఇంతటి ఘన చరిత్ర కలిగిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇచ్చే పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో కొత్తగా ఉండబోయేదేమిటి? రీ డిజైనింగ్‌పై పెడబొబ్బలు పెట్టడానికే తప్ప సలహాలు, సూచనలు ఇవ్వడానికి కాదని వేరే చెప్పనక్కరలేదేమో? తమ్మిడిహట్టి ప్రాజెక్టును 152 మీటర్ల ఎత్తు తో డిజైన్ చేసింది గత కాంగ్రెస్ ప్రభుత్వమే. కానీ ఆ ప్రాజెక్టును నిర్మించకుండా వదిలేసి, కాలువలు తవ్వారెందుకో కాంగ్రెస్ నేతలు ఇంతవరకూ ప్రజలకు జవా బు చెప్పలేకపోతున్నారు. తమ్మిడిహట్టి ప్రాజెక్టు 152 మీటర్ల ఎత్తును మహారాష్ట్ర మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నది. అందుకే రాజశేఖర్‌రెడ్డి నుంచి కిరణ్‌కుమార్‌రెడ్డి దాకా ప్రాజెక్టు నిర్మాణం వదిలేసి, కాలువలు తవ్వి కాంట్రాక్టర్లకు కాసుల వర్షం కురిపించారు. దాంతో గోదావరి నీళ్లను ధవళేశ్వరానికి పారించారు. నిజంగానే మహారాష్ట్ర అభ్యంతరాన్ని అధిగమించే అవకాశం ఉంటే గింటే.. అప్పటి కాంగ్రెస్ పాలకులకే ఉండింది.

మొన్నటిదాకా ఉమ్మడి రాష్ట్రంలో, మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నాయి. కేంద్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండేది. మూడు చోట్లా తమ ప్రభుత్వాలు ఉన్నా కూడా కాంగ్రెస్ నేతలు తమ్మడిహట్టి ప్రాజెక్టు ఎత్తు 152 మీటర్లకు మహారాష్ట్రను ఎందుకు ఒప్పించలేదు? ఇవాళ మాత్రం 152 మీటర్ల ఎత్తుతోనే తమ్మిడిహట్టి ప్రాజెక్టు కట్టాలని ఎలా అంటున్నారు? మూడు చో ట్లా కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నపుడు సాధ్యం కాని పని ఎన్నటికైనా సాధ్యమవుతుందా? జవాబు చెప్పాల్సిన బాధ్యత ఇవాళ కాంగ్రెస్ నేతలపై లేదా?

పొలిటికల్ మైలేజ్ కోసం అడ్డంగా మాట్లాడటం వేరు. ఏ రాష్ట్రమైనా తనకు నష్టం జరిగే పనికి ఎన్నటికీ ఒప్పుకోదు. అలాగే వందేళ్లు ఎదురుచూసినా తమ్మిడిహట్టి ఎత్తు విషయంలో మహారాష్ట్ర రాజీ పడదు. కాబట్టి ఇచ్చిపుచ్చుకునే ధోరణి అవసరం. కావాలని ప్రాజెక్టులను వివాదాలకు వదిలేసి తెలంగాణ పంట పొలాలను ఇంకా ఎండబెట్టడానికి ఇది సమై క్య ఆంధ్రప్రదేశ్ కాదు కదా! వివాదాలను పరిష్కరించుకొని ప్రాజెక్టులు నిర్మించుకోవడానికే తెలంగా ణ తెచ్చుకున్నాం. ఆ విషయాన్ని మర్చిపోతున్నారంటే, తెలంగాణ వచ్చాక కూడా కాంగ్రెస్ నేతల మైండ్‌సెట్ మారడం లేదనకుంటే ఏమందాం?

తెలంగాణ కాంగ్రెస్ నేతల పదవుల లాలసత్వాల పుణ్యమాని తెలంగాణ పదేళ్లు ఆలస్యంగా వచ్చిందనే విషయం కాదనలేనిది. తెలంగాణ 2004లోనే వచ్చి ఉంటే, నాలుగింతల న్యాయం జరిగేది. 1250 టీఎంసీల నీటితో తెలంగాణ పంట పొలాలు కళకళలాడేవి. పోతిరెడ్డిపాడు తూములు ఇంతగా పెరిగేవి కావు. ఇవాళ మనం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి వరద జలాలపై ఆధారపడే దుస్థితి ఉండేది కాదు. ఎంతటి కరువునైనా తట్టుకునే శక్తితో తెలంగాణ బతికేది. మొత్తం సాగునీటి ప్రాజెక్టులు మహా అయితే రూ.60 వేల కోట్ల తో పూర్తయ్యేవి. ఇవాళ లక్షా 50 వేల కోట్లు కావల్సివస్తున్నది. ఒకే ఒక్క దశాబ్ద కాలం ఆలస్యంతో తెలంగాణ ఎంత నష్టపోయిందో చెప్పడానికి మాటలు సరిపో వు.

ఈ పుణ్యం ఎవరిది? సీమాంధ్ర సీఎంలకు వంతపాడిన వారిది కాదందామా? వర్షాలు పడినా, పడకపోయినా ఎండాకాలం వచ్చిందంటే తెలంగాణలో నీటి కరు వు లేని కాలం ఎన్నడైనా ఉన్నదా? ఈ పాపం ఎవరిదని కాదు. ప్రాయశ్చిత్త మనస్తత్వం ఉంటే..ఆరు దశాబ్దాల విధ్వంసం నుంచి తెలంగాణను తిరిగి నిర్మించుకునే ప్రయత్నాలకు సహకరించాలె తప్ప పాత మైండ్‌సెట్‌తో పనిచేయొద్దు! పశ్చాత్తాపం ఉన్నపుడే, కాంగ్రెస్ నేతలు తెలంగాణ ఆత్మతో ఆలోచించగలుగుతారు. ప్రజల మన్ననలూ పొందగలుగుతారు. అంతేతప్ప పక్క రాష్ట్ర నేతల సలహాలతో, పాత మైండ్‌సెట్‌తో నడిస్తే మాత్రం.. తెలంగాణ ఇచ్చామన్న కీర్తిని కూడా వారు కాపాడుకోవడం కష్టమే!

1019

SRINIVAS REDDY KALLURI

Published: Tue,October 16, 2018 03:29 PM

సంపద సృష్టికే అప్పులు

అప్పులు ఎప్పుడూ సంపద సృష్టికి మాత్రమే ఉపయోగించాలనేది సంక్షేమ రాజ్య పాలకుడికి ఉండాల్సిన సహజ లక్షణం. ఈ లక్షణం కేసీఆర్ అనే పాలకుడిలో

Published: Sun,February 25, 2018 01:31 AM

డైనమిజానికి ప్రతీక

యువనేతలో తెలంగాణ ఒక డైనమిజాన్ని చూస్తున్నది. ఆయనలో క్లాస్ కంటే మాస్ లీడర్‌గా మరింత బలంగా ఉన్నాడు. తెలంగాణ పునర్ నిర్మాణ పథకాల రచనల

Published: Fri,July 7, 2017 01:04 AM

రైతు లక్షణం ఇంకా రాదా?

2022 వరకు వ్యవసాయాన్ని ఇప్పటికన్నా రెండింతల లాభాల బాట పట్టిస్తామని కొన్నాళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీపదేపదే చెబుతున్నారు. కానీ ఆచరణ

Published: Sat,February 18, 2017 01:37 AM

సృజనాత్మక వక్త

భూమిపై సగం, ఆకాశంలో సగం అని చెపితే సరిపోయేది కాదు. ఆర్బీఐ గవర్నర్‌తో సమానమైన బాధ్యతను ఈ దేశ మహిళ నిర్వహిస్తున్నదని చెప్పడమే కవిత ప

Published: Tue,February 7, 2017 01:46 AM

సహకారానికి ఉపకారమేది?

దేశంలో ఒక విశ్వసనీయ పాలకుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్‌ను ప్రధాని మోదీ ప్రశంసలతో ముంచెత్తితే సరిపోదు. కేసీఆర్ విశాల దృక్పథానికి అన

Published: Fri,January 6, 2017 11:54 PM

‘దేశీ’ తెలంగాణ స్ఫూర్తి

ప్రపంచీకరణ ప్రయాణంలో దేశీ ఆలోచనలతో బాధితులను కాపాడుకోవాలనే స్పృహ ఒక నిజమైన దేశీయ పాలకుడికి ఉండాల్సిన లక్షణం. ఆ లక్షణాన్ని ఇపుడు మ

Published: Tue,November 29, 2016 12:53 AM

రెండున్నరేండ్ల సమర్థత

గతంలో దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీకి గ్యారంటీ ఇవ్వగానే బ్యాంకులు ఒప్పేసుకొని మాఫీ చేసిన సందర్భాలున్నాయి. కానీ కేసీఆర్ ప

Published: Tue,November 22, 2016 12:02 AM

నోట్ల రద్దుపై వాస్తవ వైఖరి

ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై రకరకాల అభిప్రాయాలున్నాయి. ప్రజల అభిప్రాయం ఎలా ఉందనే కన్నా ముందు రాజకీయ

Published: Sat,October 22, 2016 01:23 AM

చెరువును చంపొద్దు

వర్షాలు ఇంత భారీగా పడినా కూడా మా ఊరి చెరువులోకి చుక్క నీరు రాలేకపోయింది. దాంతో మా ఊరి చెరువు కింద మరో మూడు ఊర్లకు చెందిన గొలుసుకట్

Published: Wed,October 5, 2016 03:43 AM

మోదీ వ్యూహాత్మక పయనం

నిజానికి కశ్మీరీలు అమాయకులు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే హిందూ యాత్రికులను గుర్రాలపై, బగ్గీలపై తీసుకెళ్లేది కశ్మీరీ ముస్లిం సోదరులే.

Published: Fri,September 16, 2016 01:23 AM

నీటి హక్కుపై నియంత్రణా?

రాష్ట్ర విభజన డ్రాఫ్ట్ బిల్లులో రెండు నదులపై యాజమాన్య బోర్డులు పెట్టాలనే ప్రతిపాదనను ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌తో సహా యావత్ తెలంగాణ బు

Published: Tue,August 9, 2016 01:17 AM

కేసీఆర్-మోదీ: తెలంగాణ

రాజకీయాలకతీతంగా దేశంలోని సమస్యల పట్ల దార్శనికంగా ఆలోచించే కేసీఆర్ వంటి ముఖ్యమంత్రికి ప్రధానిగా మోడీ ఏమేరకు సహకారం అందిస్తారనేది ఇ