వైరుధ్యం దేశ విరుద్ధం కావొద్దు


Sun,March 27, 2016 01:56 AM

వైరుధ్యం ప్రజాస్వామ్యాన్ని బతికించాలి తప్ప అది దేశానికి భంగం కాకూడ దు. దేశంలో మోడీలు వస్తుంటారు పోతుంటారు. కానీ ఈ దేశం శాశ్వతమనే విషయాన్ని వామపక్ష రాజకీయంగానీ, మరొకరుగానీ ఎందుకు మర్చిపోతున్నారనేదే ఇవాళ సగటు పౌరుణ్ణి వేధిస్తున్న ప్రశ్న.

హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో, జేఎన్‌యూలో సంఘటనలను ప్రజలు పెద్దగా పటించుకోకపోయినా మీడియాలో మాత్రం చర్చనీయాంశాలుగా మారాయి. మళ్లీ హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ ఉద్రిక్తంగా మారింది. జేఎన్‌యూ విద్యార్థి నేత హైదరాబాద్ వచ్చారు. అవే నిరసనలు, అవే వాదనలు, అవే సంఘర్షణలు తప్ప పరిస్థితులు మారుతున్నవి లేవు.

srinivas
దేశంలో ఎప్పుడు రాజకీయ సుస్థిరత ఏర్పడినా కొందరు ఏదో ఒక రకమైన అసహనానికి పాల్పడటం అలవాటుగా మారిపోతున్నది. ఐడియలాజికల్ రాజకీయాలు తగ్గిపోయాయి. అసహన రాజకీయాలు పెరిపోతున్నాయి. రాజకీయ వైరుధ్యం ప్రజాస్వామ్య ఆరోగ్యానికి అవసరమే. కానీ వైరుధ్యం కాస్తా అక్కసుగా మారుతున్నది. అలాంటి అక్కసునే అసహనంగా చెప్పుకుంటున్నారు. ప్రజలకు వారి అసహనాలు పట్టకున్నా, బలవంతంగానైనా ప్రజలపై రుద్దే ప్రయత్నాలు నిరంతరం జరుగుతున్నాయి. అది శోచనీయం.

బెయిల్‌పై విడుదలైన రోజే కన్హయ్య తనకు కావల్సింది అఫ్జల్‌గురు కాదు, రోహిత్ వేముల అని అన్నారు. మరి అంతకు ముందు అఫ్జల్‌గురు, యాకుబ్‌మెమన్ పేరున సభలు ఎందుకు జరిగాయో ఆయన చెప్పలేదు. కన్హయ్యతో సహా కొందరు విద్యార్థులపై దేశద్రోహం కేసులు నమోదుకాగానే వారు అఫ్జల్‌గురు, యాకుబ్ మెమన్‌ల చర్చ మానేశారు. ఇపుడు కేవలం రోహిత్ వేముల గురించే మాట్లాడుతున్నారు. వారి ఉద్దేశం, వ్యూహం ఏమైనా కావచ్చు, అదొక మంచి పరిణామమనే చెప్పాలి. వ్యూహాత్మకంగా రోహిత్ వేముల అంశాన్ని మాత్రమే ఎజెండాగా మార్చుకున్నారు. దాంతో అఫ్జల్‌గురు, యాకుబ్ మెమన్‌ల పట్ల వారి ఉద్దేశాలు మారాయని ఎవరూ అనుకోలేరు. అఫ్జల్‌గురు, యాకుబ్‌మెమన్‌ల పేరున సభలు జరపడాన్ని దేశ ప్రజలు వ్యతిరేకిస్తారని ఆ విద్యార్థి సంఘాలు తెలుసుకోగలిగి వ్యూహం మార్చుకోగలిగినందుకైనా సంతోషించాల్సిందే.

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచంలోని అత్యధిక దేశాలకు స్వాతంత్య్రం లభించింది. ప్రపంచమే ఒక ప్రజాస్వామ్య యుగంలోకి అడుగుపెట్టిందని చెప్పాలి. మెజారిటీ జాతులు, సంస్కృతుల ఆధారంగానే దేశాలు ఏర్పడ్డాయి. అలాగే చారిత్రక సంఘటనల నేపథ్యంతో భారత్ ఒక దేశంగా ఏర్పడిందంటే అందుకు ఇక్కడి మెజారిటీ ప్రజలే ఆధారమైనారని మర్చిపోకూడదు. స్వేచ్ఛ పుష్కలంగా ఉన్న దేశమిది. కాబట్టి ఇక్కడ స్వేచ్ఛలేదని తర్కించే వాళ్లెవరైనా ఉంటే వారి ఉద్దేశంలో మరేదైనా ఉండి ఉండాలి. ప్రపంచంలో కొన్ని మతాధార దేశాలు, మరికొన్ని నియంత్రృత్వ దేశాలు ఇప్పటికీ ఉన్నాయి.

అక్కడ వీరు చెప్పే స్వేచ్ఛ ఉన్నదా? దేశంలో రకరకాల అరాచకాలు, అక్రమాలు, వివక్షలు దశాబ్దాలుగా మనం వింటూనే వస్తున్నాం. వాటిపై పోరాటం చేయాల్సిందే. కానీ అవేవో గత 20 నెలలుగానే దేశంలో జరుగుతున్నట్లు కొందరు అసహనం ప్రదర్శించారు. ఆ అసహనాన్ని విశ్వవిద్యాలయాలకు మళ్లించారు. అదంతా కొత్త దేశ పాలకుడిపై గురిపెట్టి ప్రదర్శిస్తున్నట్లు ప్రజలకు సైతం అర్థం కావడం మొదలైంది. ప్రస్తుత దేశ పాలకుడిని రాజకీయ వైరుధ్యంతో ఎదుర్కుంటే తప్పులేదు. కానీ అతడి పట్ల వైరుధ్యం మాటున దేశ అస్థిత్వాన్నే ప్రశ్నించే పనులకు పాల్పడడాన్నే ప్రజలు హర్షించలేరు.

వామపక్ష రాజకీయం దేశంలో పొడిగడుతున్న విషయం తెలిసిందే. అది పూర్వవైభవానికి చేరుకునేందుకు దేశంలో సమస్యలు లేవని కాదు. ఆ సమస్యల ఆధారంగా వామపక్ష రాజకీయం బలపడితే ఎవరూ వద్దనరు. కానీ అదిపుడు స్వేచ్ఛల పేర తర్కించడం, కులాలను ఆశ్రయించడం మొదలుపెట్టింది. ప్రజాక్షేత్రాన్ని వదిలేసి విశ్వవిద్యాలయాలను ఆశ్రయిస్తున్నది. దేశంలో సుమారు 6 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. గ్రామీణ జీవితాలు స్వయం సమృద్ధిని కోల్పోయి, ప్రభుత్వ సబ్సిడీలపై బతుకుతున్నాయి. పట్టణ జీవితాలు కరెన్సీపై ఆధారపడి గడుస్తున్నాయి. ఒక సంక్షేమ రాజ్యానికి ఉండాల్సిన లక్షణాలు కావవి. వామపక్షాలు రాజకీయాలు నడపడానికి ఇలాంటి సమస్యలు అనేకం ఉన్నాయి. వాటన్నిటి కన్నా అఫ్జల్‌గురు, యాకుబ్ మెమన్‌ల ఉరిపై చర్చించడమే ఎందుకు ముఖ్యంగా మారింది? హైదరాబాద్ వర్సిటీలో గత పదేళ్ల యూపీఏ ప్రభుత్వ కాలంలోనూ కొందరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.

అప్పట్లో ఇంత రాద్ధాంతం ఎందుకు జరగలేదనే ప్రశ్న ఉంది. యూపీఏకు నేతృత్వం వహించిన కాంగ్రెస్‌పార్టీకి చెందిన యువనేత రాహుల్ గాంధీ ఇవాళ రోహిత్ ఆత్మహత్యపై మాట్లాడుతున్నారు, విద్యార్థి సంఘాలకు సంఘీభావం తెల్పుతున్నారు. అందుకు ఎవరికీ అభ్యంతరం ఉండనక్కర లేదు. కానీ, ఈ విషయంలో విద్యార్థి నేతలు రాహుల్‌గాంధీ సానుభూతిని ఏ విధంగా అర్థంచేసుకుంటున్నట్లు? వారి అసహనమంతా ప్రస్తుత పాలకులపైనే అనడానికి వేరే ఉదాహరణ అక్కర లేదేమో!

ఈ దేశ ప్రజలు ఏపార్టీకైనా అధికారం అప్పగించే అధికారం కలిగి ఉన్నారు. దేశంలో 35 ఏళ్ల తర్వాత పూర్తి మెజారిటీతో ఒకపార్టీకి పట్టం కట్టారు. అలాంటి ప్రజాతీర్పుపై అసహనం పెంచుకోవడం సరైనదేనా? ఇవాళ అమెరికా వంటి క్యాపిటలిస్ట్ దేశాలు, టెర్రరిస్టు సంస్థల మధ్య మూడో ప్రపంచం నలిగిపోతున్నది. ఆ రెండు శక్తుల ఆధిపత్యపోరులో మన దేశం ఎంత సురక్షితంగా ఉన్నదందాం? అలాంటి మన దేశానికి రాజకీయ సుస్థిరత అక్కరలేదా? బలమైన ప్రభుత్వం, బలమైన నాయకత్వం ఉండకూడదా? ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపడం తప్పు కాదు, కానీ ఆ విధానం దేశాన్ని బలహీనం చేసేలా ఉండకూడదు కదా!

ఒక మైనారిటీ నేత భారత్ మాతకీ జై అనన్నారు. అది ఆయన స్వేచ్ఛ!భిన్న సంస్కృతులు, భాషలు, ప్రాంతాలు ఎన్నిఉన్నా, దీన్ని భారత్ అనో, ఇండియా అనో, హిందుస్తాన్ అనో అంటున్నాం. మనది కలోనియల్ డేశం కాదు. ఇదొక దేశంగా ఏర్పడడానికి భౌగోళకంగానే కాకుండా బలమైన చరిత్ర, సంస్కృతి ఉంది. కాబట్టే దీన్ని భారత్ లేదా ఇండియా అనే కాకుండా హిందుస్థాన్ అని కూడా అంటాం. ఇండియా దటీజ్ భారత్ అని రాజ్యాంగంలోనే పేర్కొన్నాం. భాష ఏది వాడినా భావం ఒక్కటే అన్నట్లుగా, భారత్ అన్నా హిందుస్తాన్ అన్నా ఒక్కటే ననే భావన అందరిలో ఉంది. రాజ్యాంగంలో ఇండియా దటీజ్ భారత్ మాత్రమే ఉంది కాబట్టి ఈ దేశాన్ని హిందుస్తాన్ అనడం తప్పని ఎవరైనా అనగలరా? ఆ విధంగానే, భారత్ మాతాకీ జై అనాలని మన రాజ్యాంగంలో లేకపోవచ్చు. ఏ దేశమైనా తన అస్తిత్వ సుస్థిరతకు ఏదో ఒక నినాదాన్ని ప్రేరణగా తీసుకోవచ్చు. ఆ నినాదం సంఘ్‌పరివార్ ద్వారా వచ్చింది కాదు.

ఆ నినాదం స్వాత్రంత్య్ర పోరాటంలో పుట్టింది.ఆ నినాదానికి ప్రజామోదం ఉంది. ఆ నినాదంపై ఆర్‌ఎస్‌ఎస్ సంస్థకు పేటెంట్ హక్కులు లేవు. ఆ నినాదం నిర్బంధం కాకపోవచ్చు. నిజంగానే ఆ నినాదం తన గొంతుతో అనడం ఇష్టం లేకపోతే ఫరవాలేదు. కానీ ఆ నినాదా న్ని గొంతుపై కత్తి పెట్టినా అననని బహిరంగంగా ప్రకటించుకోవడమే అభ్యంతరకరం. ప్రముఖ సీనీ రచయిత జావెద్ అఖ్తర్ రాజ్యసభలో భారత్ మాతాకీ జై అని మూడుసార్లు నినదించారు. హిందీ సీనియర్ సినీ నటి షబనా ఆజ్మీ భారత్ మాతాకీ జైకి బదులు భారత్ అమ్మీ కో జై అంటానన్నది. అది జాతీయ భావాని కి స్ఫూర్తి. దేశం పట్ల గౌరవాన్ని చాటుకోవడానికి మతమో, భాషనో అడ్డుకాదు. వైరుధ్యం ప్రజాస్వామ్యాన్ని బతికించాలి తప్ప అది దేశానికి భంగం కాకూడ దు. దేశంలో మోడీలు వస్తుంటారు పోతుంటారు. కానీ ఈ దేశం శాశ్వతమనే విషయాన్ని వామపక్ష రాజకీయంగానీ, మరొకరుగానీ ఎందుకు మర్చిపోతున్నారనేదే ఇవాళ సగటు పౌరుణ్ణి వేధిస్తున్న ప్రశ్న.

1104

SRINIVAS REDDY KALLURI

Published: Tue,October 16, 2018 03:29 PM

సంపద సృష్టికే అప్పులు

అప్పులు ఎప్పుడూ సంపద సృష్టికి మాత్రమే ఉపయోగించాలనేది సంక్షేమ రాజ్య పాలకుడికి ఉండాల్సిన సహజ లక్షణం. ఈ లక్షణం కేసీఆర్ అనే పాలకుడిలో

Published: Sun,February 25, 2018 01:31 AM

డైనమిజానికి ప్రతీక

యువనేతలో తెలంగాణ ఒక డైనమిజాన్ని చూస్తున్నది. ఆయనలో క్లాస్ కంటే మాస్ లీడర్‌గా మరింత బలంగా ఉన్నాడు. తెలంగాణ పునర్ నిర్మాణ పథకాల రచనల

Published: Fri,July 7, 2017 01:04 AM

రైతు లక్షణం ఇంకా రాదా?

2022 వరకు వ్యవసాయాన్ని ఇప్పటికన్నా రెండింతల లాభాల బాట పట్టిస్తామని కొన్నాళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీపదేపదే చెబుతున్నారు. కానీ ఆచరణ

Published: Sat,February 18, 2017 01:37 AM

సృజనాత్మక వక్త

భూమిపై సగం, ఆకాశంలో సగం అని చెపితే సరిపోయేది కాదు. ఆర్బీఐ గవర్నర్‌తో సమానమైన బాధ్యతను ఈ దేశ మహిళ నిర్వహిస్తున్నదని చెప్పడమే కవిత ప

Published: Tue,February 7, 2017 01:46 AM

సహకారానికి ఉపకారమేది?

దేశంలో ఒక విశ్వసనీయ పాలకుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్‌ను ప్రధాని మోదీ ప్రశంసలతో ముంచెత్తితే సరిపోదు. కేసీఆర్ విశాల దృక్పథానికి అన

Published: Fri,January 6, 2017 11:54 PM

‘దేశీ’ తెలంగాణ స్ఫూర్తి

ప్రపంచీకరణ ప్రయాణంలో దేశీ ఆలోచనలతో బాధితులను కాపాడుకోవాలనే స్పృహ ఒక నిజమైన దేశీయ పాలకుడికి ఉండాల్సిన లక్షణం. ఆ లక్షణాన్ని ఇపుడు మ

Published: Tue,November 29, 2016 12:53 AM

రెండున్నరేండ్ల సమర్థత

గతంలో దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీకి గ్యారంటీ ఇవ్వగానే బ్యాంకులు ఒప్పేసుకొని మాఫీ చేసిన సందర్భాలున్నాయి. కానీ కేసీఆర్ ప

Published: Tue,November 22, 2016 12:02 AM

నోట్ల రద్దుపై వాస్తవ వైఖరి

ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై రకరకాల అభిప్రాయాలున్నాయి. ప్రజల అభిప్రాయం ఎలా ఉందనే కన్నా ముందు రాజకీయ

Published: Sat,October 22, 2016 01:23 AM

చెరువును చంపొద్దు

వర్షాలు ఇంత భారీగా పడినా కూడా మా ఊరి చెరువులోకి చుక్క నీరు రాలేకపోయింది. దాంతో మా ఊరి చెరువు కింద మరో మూడు ఊర్లకు చెందిన గొలుసుకట్

Published: Wed,October 5, 2016 03:43 AM

మోదీ వ్యూహాత్మక పయనం

నిజానికి కశ్మీరీలు అమాయకులు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే హిందూ యాత్రికులను గుర్రాలపై, బగ్గీలపై తీసుకెళ్లేది కశ్మీరీ ముస్లిం సోదరులే.

Published: Fri,September 16, 2016 01:23 AM

నీటి హక్కుపై నియంత్రణా?

రాష్ట్ర విభజన డ్రాఫ్ట్ బిల్లులో రెండు నదులపై యాజమాన్య బోర్డులు పెట్టాలనే ప్రతిపాదనను ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌తో సహా యావత్ తెలంగాణ బు

Published: Tue,August 9, 2016 01:17 AM

కేసీఆర్-మోదీ: తెలంగాణ

రాజకీయాలకతీతంగా దేశంలోని సమస్యల పట్ల దార్శనికంగా ఆలోచించే కేసీఆర్ వంటి ముఖ్యమంత్రికి ప్రధానిగా మోడీ ఏమేరకు సహకారం అందిస్తారనేది ఇ