మోన్‌శాంటోలను తరిమేద్దాం


Sat,March 19, 2016 01:58 AM

రైతును మోసం చేసిన మోన్‌శాంటో కంపెనీని ఎదిరంచిన కేసీఆర్ వంటి సాహస పాలకులు ఉన్నపుడే, కేంద్ర పాలకులు సైతం కదలక తప్పదని చెప్పాలి. మోన్‌శాంటో విషయంలో అమెరికా ఒత్తిళ్లకు లొంగని ప్రధానిగా
మోదీ మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుందాం.

డబ్ల్యూటీఓ (ప్రపంచ వాణిజ్య సంస్థ)లో చేరిన నాడే మన దేశం తన ఆర్థిక విధాన స్వేచ్ఛను వదులుకుంది. ఉత్పత్తులపై పేటెంట్ హక్కుల రూపంలో బహుళ జాతి కంపెనీల ప్రవేశానికి అనుమతించ డం మొదలై 25 ఏళ్లు దాటిపోయాయి. ఈ కాలంలో దేశంలో అనేక మార్పులు జరిగాయి. మం చిని ఆస్వాదించి చెడును విసర్జించే విధానం దేశ పాలకుల్లో ఉండి ఉంటే, మోన్‌శాంటో లాంటి కంపెనీ వల్ల గత రెండు దశాబ్దాలలో మన రైతులు ఇంతగా నష్టపోయేవారు కాదు. సరళీకరణ విధానాలలో మునిగి తేలుతున్న మన దేశ పాలకులు మోన్‌శాంటో లాంటి కంపెనీలకు ఆడింది ఆటగా రెండు దశాబ్దాలు గా ఉపయోగపడుతూ వచ్చారు. మోన్‌శాంటో పత్తి విత్తన కంపెనీ ఆధిపత్య దోపిడీ వ్యాపారానికి ఇప్పటికైనా చెక్ పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం హర్షించదగ్గ విషయం.

srinu


గతేడాది క్రితమే కేసీఆర్ ప్రభుత్వం మోన్‌శాంటో (భారత్‌లో మహికో) కంపెనీ దోపిడీకి చెక్ పెట్టే ప్రయత్నం చేసింది. పత్తి విత్తన ఉత్పత్తి రైతులకు ఇవ్వాల్సిన రాయల్టీలో ఆ కంపెనీ అన్యాయానికి ఒడిగట్టింది. దాన్ని ఎత్తిచూ పి పత్తి విత్తన ఉత్పత్తి రైతులకు రాయల్టీలో న్యాయం జరిగేలా కేసీఆర్ ప్రభుత్వం ఆదేశా లు జారీ చేసింది. అయినా అది తప్పుడు విధానాలను ఆసరా చేసుకొని వితనోత్పత్తి రైతులకు రాయల్టీలో అన్యాయాన్ని కొనసాగిస్తూ వస్తున్న ది. విధాన లోపాల వల్ల జరుగుతున్న ఈ ఆన్యాయాన్ని కేసీఆర్ ప్రభుత్వం కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్లింది. దేశంలో మోన్‌శాంటో కొనసాగిస్తున్న విత్తన గుత్తాధిపత్యం వల్ల విత్తనోత్పత్తి రైతులే కాకుండా, దాని విత్తనాలను వాడుతున్న పత్తి రైతులూ అపారంగా నష్టపోయారు, నష్టపోతూనే ఉన్నారు. దీనంతటికీ కారణం, విత్తన వ్యాపారం లో మోన్‌శాంటో గుత్తాధిపత్యమే. దాన్ని ఛేదించడం తప్ప మరో మార్గంలేదు. కాబట్టి, తెలంగాణ లాంటి రాష్ట్ర ప్రభుత్వాల విన్నపాలు కావచ్చు, దేశవ్యాప్తంగా జరుగుతున్న పత్తి రైతుల ఆత్మహత్యలు కావచ్చు, మొత్తం మీద కేం ద్రం ఓ కమిటీ వేసింది.

దానికి కేంద్ర వ్యవసాయశాఖ సంయుక్త కార్యదర్శి తెలంగాణ వ్యవసాయ శాఖ కార్యదర్శి పార్థసారథి సభ్యుడిగా ఆ కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ చేసిన మార్గదర్శకాలు అమలైతే మోన్‌శాంటో గుత్తాధిపత్యానికి తెర పడిన ట్లేనని చెప్పొచ్చు. ఇకపై బీటి టెక్నాలజీ గల కంపెనీలు, విత్తనోత్పత్తి సంస్థల మధ్య ప్రభుత్వం మధ్యవర్తిగా ఉంటుంది. ప్రస్తుతం బీటీ టెక్నాలజీపై మోన్‌శాంటోకు మాత్రమే లైసెన్స్ ఉంది. దీంతో ఇతర కంపెనీలు బీటీ టెక్నాలజీని కలిగి ఉన్నా, వాటికి లైసెన్స్ దక్కకుండా అడ్డుకుంటున్నది. ఇకపై మోన్‌శాంటో కంపెనీ వలెనే ఏ కంపెనీకైనా లైసెన్స్ పొందే వీలుండనుంది. అలాగే, భారత వ్యవసాయ పరిశోధన మండలి, వ్యవసాయ విశ్వవిద్యాలయాల భాగస్వామ్యం టెక్నా లజీ పునర్వ్యవస్థీకరణలో ఉండాలని కూడా ఆ కమిటీ మార్గదర్శకాలు తయా రు చేసింది. ఈ మార్గదర్శకాల వల్ల తక్కువ ధరకే రైతులకు బీటీ విత్తనాలు అందుబాటులోకి రానున్నాయి. విత్తనోత్పత్తి రైతులకు కూడా గిట్టుబాటు ధర లభించనుంది.

మోన్‌శాంటో కంపెనీ 2002 నుంచి దేశీయ మహికో కంపెనీతో కలిసి దేశంలో బీటీ-1 పత్తి విత్తన వ్యాపారం చేస్తున్నది. మరే ఇతర పత్తివిత్తనాలు మార్కెట్లోకి రాకుండా గుత్తాధిపత్యం చెలాయిస్తూ వస్తున్నది. బీటీ-1 పత్తి విత్తనంపై మోన్‌శాంటోకు పేటెంట్ హక్కులేదని, దానికి రాయల్టీ చెల్లించాల్సిన అవసరం లేదని జాతీయ పత్తి పరిశోధన సంస్థ గతంలోనే చెప్పినట్లు సమాచారం. అయినా అది ఇప్పటికీ రాయల్టీ వసూలు చేస్తుండటం గమనార్హం. బీటీ-2 పత్తి విత్తనాన్ని 2006 లో మార్కెట్లోకి తెచ్చింది. దానికీ పేటెంట్ ఉందని రాయల్టీ పొందుతుంది.రాయల్టీ రూపంలో మోన్‌శాంటో ఇప్పటికే వేల కోట్లు దండుకుంది. బీటీ-1 విత్తనం విఫలమవడంతో పాటు, బీటీ-2 పత్తి విత్తనం విఫలమైనట్లు స్వయాన కేంద్రం కూడా సుప్రీంకోర్టుకు అఫిడవిట్లో తెలిపింది. ఈ నేపథ్యంలో బీటీ-2కి ప్రత్యామ్నాయంగా బీటీ-3ని తీసుకురావడానికి దేశంలోని పలు పత్తి కంపెనీలు తమ సంసిద్ధతను తెలుపుతున్నాయి. ఆ విధంగా పలు విత్తన కంపెనీలు పోటీ పడినపుడే మోన్‌శాంటో గుత్తాధిపత్యాన్ని ఛేధించి రైతుకు కొంతమేరకు మేలు జరిగే అవకాశం ఉన్నది.

దేశంలో అత్యధికంగా పత్తి సాగుచేసే రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటి. గత ఏడాది తెలంగాణలో పంటల సాగు సుమారు 89 లక్షల ఎకరాల్లో జరిగింది. అందులో సుమారు 43 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరిగిందంటేనే తెలంగాణ రైతు అన్ని పంటల కన్నా అత్యధికంగా పత్తి పంటపైనే చెప్పొచ్చు. అలాగే రాష్టంలోని సుమారు 56 లక్షల మంది రైతుల్లో సుమారు 26 లక్షల మంది పత్తి రైతులే ఉండటం కూడా గమనార్హం. ఒక్క తెలంగాణలోనే బీటీ పత్తి విత్తన ప్యాకెట్లు కోటికి పైగా అమ్మకం జరుగుతున్నాయట. అంటే తెలంగాణలో సుమారు రూ.వెయ్యి కోట్ల పత్తి విత్తన వ్యాపారం జరుతున్నదన్నమాట. అదేవిధంగా తెలంగాణలో జరిగిన రైతుఆత్మహత్యల్లో సగానికి పైగా పత్తి రైతులే ఉన్నారు. అంటే పత్తి పంట తెలంగాణ రైతును బతికించిందా, బతుకు లేకుండా చేసిందా అనేది తెలియంది కాదు. మోన్‌శాంటో లాంటి విత్తన గుత్తాధిపత్యం దేశంలోని అన్ని రాష్ర్టాల కన్నా తెలంగాణ, విదర్భ రైతుల బతుకులనే అధికంగా ప్రభావితం చేసి బతకలేకుండా చేసిందని చెప్పొచ్చు.

ఇది సున్నతమైన విషయం కాదు. అత్యంత ఘోరమైన విషయం. మోన్‌శాంటో కంపెనీ పత్తి విత్తన ఉత్పత్తులకు పేటెంట్లు ఉన్నాయా, లేవా తెలియదు. దేశీయ సమాచారం ప్రకారం దాని ఉత్పత్తులకు పేటెంట్లు లేవనే తెలుస్తున్నది. ఒకవేళ లేనట్లయితే, గత పదిహేనేళ్లుగా దాని గుత్తాధిపత్యంలో దేశ పత్తి రైతులు నష్టపోతుంటే మన పాలకులు ఏమి చేసినట్లు అనే ప్రశ్న సహజంగానే వస్తుంది. మోన్‌శాంటో కంపెనీ అమెరికా ప్రభుత్వాలనే లాబీయింగ్‌ల ద్వార ప్రభావితం చేసేంత స్థాయిని కలిగివుందట! ఆ విధంగానే మన దేశంలోనూ ఇంతకాలం ప్రభుత్వాలనూ అది ప్రభావితం చేయగలిగి ఉంటుందనే అనుమానం కలగడం సహజం. నిజానికి మన దేశంలోని చట్టాలు విత్తనాలపై పేటెంట్లకు అనుమతించవు. కానీ డబ్ల్యూటీవోను, అమెరికా ప్రభుత్వ అండదండలను చూపుతూ ఇన్నాళ్లూ అది ఇక్కడి చట్టాలను ఉల్లంఘించగలిగిందని చెప్పాలి. మన పాలకుల బలహీనతలు మాన్‌శాంటో కంపెనీ గుత్తాధిపత్యానికి కలిసిరాలేదనగలమా?

అయితే ఇల్లు అలుకగానే పండగ కాదన్నట్లు, కేంద్రం వేసిన కమిటీ తయారు చేసిన మార్గదర్శకాలను కేంద్రం ఆమోదించి అమలు చేయడం పైనే మోన్‌శాంటో గుత్తాధిపత్యానికి చెక్ పడినట్లా లేదా అనేది తేలుతుంది.
దేశం ప్రపంచీకరణలోకి అడుగుపెట్టి, సరళీకరణ విధానాలకు శ్రీకారం చుట్టి 25 ఏళ్లు గడిచిపోయాయి. ఈదేశ మార్కెట్ల మీద బహుళజాతి కంపెనీలు ఇప్పటికే తమ పట్టును బిగించాయి. సరళీకరణ విధానాల నుంచి తిరిగి రాలేనంత దూరం దేశం వెళ్లిపోయింది. కాబట్టి, అందులోని మంచిని ఆస్వాదించి, చెడును వ్యతిరేకించడమే ఇప్పటి పాలకులు చేయాల్సిన పని. డబ్ల్యూటీవో ఒప్పందాలు మనకు కొన్ని నిర్బంధాలుగా మారాయి. వాటిని అధిగమించే దిశగా పాలకుల ఆలోచనలుండాలి.

మెడకు పడిన పాము లాంటివి డబ్ల్యూటీవో ఒప్పందాలని మిన్నకుంటే మనల్ని మోన్‌శాంటో లాంటి పాములు కాటేస్తూనే ఉంటాయి. మనది జనాభా సంపన్న దేశం. అందులోనూ ఇప్పటికీ 65 శాతం రైతు దేశం. మనను మించిన మార్కెట్ మాన్‌శాంటోలకు మరొకటి ఉండదు. కాబట్టి దాని వ్యాపార గుత్తాధిపత్యాన్ని మన రైతు జనాభాయే, దాని వ్యాపార బలహీనతగా మార్చగలుగుతుంది. అందుకు కావల్సిందల్లా ఈదేశ పాలకుల సాహసమే.

ఆ విషయంలో కేంద్రంలో మోదీ ప్రభుత్వం అలాంటి సాహసానికి పూనుకుంటున్నదని చెప్పొచ్చు. మోన్‌శాంటో గుత్తాధిపత్యానికి చెక్ పట్టే దిశగా అడుగులు వేస్తుండటమే అందుకొక ఉదాహరణ. అలాగే, రాయల్టీలో రైతును మోసం చేసిన మోన్‌శాంటో కంపెనీని ఎదిరంచిన కేసీఆర్ వంటి సాహస పాలకులు ఉన్నపుడే, కేంద్ర పాలకులు సైతం కదలక తప్పదని చెప్పాలి. మోన్‌శాంటో విషయంలో అమెరికా ఒత్తిళ్లకు లొంగని ప్రధానిగా మోదీ మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుందాం. మొత్తమ్మీద ఆ కమిటీ తయారు చేసిన మార్గదర్శకాలను తూచా తప్పక అమలు చేసినపుడే మోదీ ప్రభుత్వ నిజాయితీ వెల్లడవుతుంది. మోన్‌శాంటో వంటి గుత్తాధిపత్యాలను తరిమేద్దామనే నినాదమే మన పాలకుల విధానాలుగా మారాలి.

1082

SRINIVAS REDDY KALLURI

Published: Tue,October 16, 2018 03:29 PM

సంపద సృష్టికే అప్పులు

అప్పులు ఎప్పుడూ సంపద సృష్టికి మాత్రమే ఉపయోగించాలనేది సంక్షేమ రాజ్య పాలకుడికి ఉండాల్సిన సహజ లక్షణం. ఈ లక్షణం కేసీఆర్ అనే పాలకుడిలో

Published: Sun,February 25, 2018 01:31 AM

డైనమిజానికి ప్రతీక

యువనేతలో తెలంగాణ ఒక డైనమిజాన్ని చూస్తున్నది. ఆయనలో క్లాస్ కంటే మాస్ లీడర్‌గా మరింత బలంగా ఉన్నాడు. తెలంగాణ పునర్ నిర్మాణ పథకాల రచనల

Published: Fri,July 7, 2017 01:04 AM

రైతు లక్షణం ఇంకా రాదా?

2022 వరకు వ్యవసాయాన్ని ఇప్పటికన్నా రెండింతల లాభాల బాట పట్టిస్తామని కొన్నాళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీపదేపదే చెబుతున్నారు. కానీ ఆచరణ

Published: Sat,February 18, 2017 01:37 AM

సృజనాత్మక వక్త

భూమిపై సగం, ఆకాశంలో సగం అని చెపితే సరిపోయేది కాదు. ఆర్బీఐ గవర్నర్‌తో సమానమైన బాధ్యతను ఈ దేశ మహిళ నిర్వహిస్తున్నదని చెప్పడమే కవిత ప

Published: Tue,February 7, 2017 01:46 AM

సహకారానికి ఉపకారమేది?

దేశంలో ఒక విశ్వసనీయ పాలకుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్‌ను ప్రధాని మోదీ ప్రశంసలతో ముంచెత్తితే సరిపోదు. కేసీఆర్ విశాల దృక్పథానికి అన

Published: Fri,January 6, 2017 11:54 PM

‘దేశీ’ తెలంగాణ స్ఫూర్తి

ప్రపంచీకరణ ప్రయాణంలో దేశీ ఆలోచనలతో బాధితులను కాపాడుకోవాలనే స్పృహ ఒక నిజమైన దేశీయ పాలకుడికి ఉండాల్సిన లక్షణం. ఆ లక్షణాన్ని ఇపుడు మ

Published: Tue,November 29, 2016 12:53 AM

రెండున్నరేండ్ల సమర్థత

గతంలో దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీకి గ్యారంటీ ఇవ్వగానే బ్యాంకులు ఒప్పేసుకొని మాఫీ చేసిన సందర్భాలున్నాయి. కానీ కేసీఆర్ ప

Published: Tue,November 22, 2016 12:02 AM

నోట్ల రద్దుపై వాస్తవ వైఖరి

ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై రకరకాల అభిప్రాయాలున్నాయి. ప్రజల అభిప్రాయం ఎలా ఉందనే కన్నా ముందు రాజకీయ

Published: Sat,October 22, 2016 01:23 AM

చెరువును చంపొద్దు

వర్షాలు ఇంత భారీగా పడినా కూడా మా ఊరి చెరువులోకి చుక్క నీరు రాలేకపోయింది. దాంతో మా ఊరి చెరువు కింద మరో మూడు ఊర్లకు చెందిన గొలుసుకట్

Published: Wed,October 5, 2016 03:43 AM

మోదీ వ్యూహాత్మక పయనం

నిజానికి కశ్మీరీలు అమాయకులు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే హిందూ యాత్రికులను గుర్రాలపై, బగ్గీలపై తీసుకెళ్లేది కశ్మీరీ ముస్లిం సోదరులే.

Published: Fri,September 16, 2016 01:23 AM

నీటి హక్కుపై నియంత్రణా?

రాష్ట్ర విభజన డ్రాఫ్ట్ బిల్లులో రెండు నదులపై యాజమాన్య బోర్డులు పెట్టాలనే ప్రతిపాదనను ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌తో సహా యావత్ తెలంగాణ బు

Published: Tue,August 9, 2016 01:17 AM

కేసీఆర్-మోదీ: తెలంగాణ

రాజకీయాలకతీతంగా దేశంలోని సమస్యల పట్ల దార్శనికంగా ఆలోచించే కేసీఆర్ వంటి ముఖ్యమంత్రికి ప్రధానిగా మోడీ ఏమేరకు సహకారం అందిస్తారనేది ఇ        


country oven

Featured Articles