ఖేల్ ఖతం... దుక్నం బంద్!


Sat,March 12, 2016 01:22 AM

తెలంగాణ ప్రయోజనాలనే కాదు, దాని అస్తిత్వాన్ని కనుమరుగు చేసేందుకు పుట్టిన పార్టీ టీడీపీ. చట్టసభలో తెలంగాణ పదాన్ని నిషేధించిన పారీ.్ట ఉద్యోగాల్లో అన్యాయమైందంటే, ఆం ధ్రా ప్రాంతంలో ఉన్న పట్టెడు తెలంగాణ ఉద్యోగులను తరిమేసి రెండింతల అన్యాయం చేసిన పార్టీ అది. రెండు జీవనదులలో 1200 టీఎంసీల నీటి హక్కులు కలిగి ఉన్నా, సాగునీటి ప్రాజెక్టులను అటకెక్కించి ఉచిత కరెంట్ పేర మభ్యపెట్టిన పార్టీ. తెలుగు గంగ పేర నీటి దోపిడీ చేసిన పార్టీ. తెలుగుఆత్మగౌరవం మాటున తెలంగాణలో అక్రమ ఆంధ్రా ఉద్యోగులను రెట్టింపు చేసిన పార్టీ టీడీపీ.
తెలంగాణ ఏర్పాటును రకరకాల కారణాలతో వ్యతిరేకించిన వాళ్లు ఉండవచ్చు. కానీ తెలుగుదేశం పుట్టుకనే తెలంగాణ అస్తిత్వాన్ని తుడిచేయడానికి జరిగింది. కాబ ట్టి దాని రాజకీయం తెలంగాణ ఉనికికి ఎంత ప్రమాదమో ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. ఉద్యమం మొదలైన 14 ఏళ్ల తదుపరి గానీ తెలంగాణ ఏర్పడలేక పోయిందంటే అందుకు టీడీపీ తప్ప మరొకరు కారణం కాదు. 2004 వరకు ఎన్‌డీఏ భాగస్వామిగా కొనసాగుతూ అడ్డుకున్నది. ఆ తర్వాత యూపీఏ ప్రభుత్వం కూడా తెలంగాణ ఏర్పాటును పదేళ్ల వరకు ఎం దుకు లాగిందంటే కూడా తెలుగుదేశమే కారణం. తెలుగుదేశం యూపీఏ మిత్రపక్షం కాకపోవచ్చు. కానీ సీమాంధ్ర నేపథ్యం కలిగిన పార్టీగా, తెలంగాణ ఏర్పాటు పట్ల అది అన్ని పార్టీలను పరోక్షంగా ప్రభావితం చేస్తూ వచ్చింది. ఇస్తామని చెప్పిన సోనియా గాంధీ సైతం పదేళ్లు ఆగాల్సివచ్చిందంటే, అడ్డుచెపుతున్న తెలుగుదేశం పార్టీ వల్ల తామేమైనా రాజకీయంగా నష్టపోతామేమోననే అనుమానంతో నే ! ఆ విధంగా తెలంగాణ ఏర్పాటుకు పద్నాగేళ్ల పాటు టీడీపీ రాజకీయాలే ప్రతిబంధకంగా మారాయి. ఫలితంగా దీనివల్ల పద్నాలుగేళ్ల అభివృద్ధిని కోల్పోవడమే కాక, వందలాది బలిదానాలతో తెలంగాణ ఆత్మ క్షోభకు గురైంది. ఒక ప్రాంతం పట్ల టీడీపీ నెరిపిన దాయాది రాజకీయం వల్ల జరిగిన అనర్థాలు తుడిచేస్తే పోయేవి కావు!. తెలంగాణ పట్ల, దాని ఏర్పాటు పట్ల నిండారా వ్యతిరేకత కలిగిన పార్టీని ఇపుడు తెలంగాణలోనూ కొనసాగిస్తామనుకోవడం ఆ పార్టీకి ఉన్న అజ్ఞానమనుకోవాలో, ఆంధ్రా అహంభావమనుకోవాలో తెలియదు.

Kallurisrinivasreddyతెలంగాణ వచ్చాక జరుగుతున్న ప్రతి ఎన్నికల్లోనూ ఆ పార్టీ ప్రజల చేత కేవలం తిరస్కరణకే కాదు, బహిష్కరణకు గురవుతున్నది. అదే విషయాన్ని గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు, నారాయణ్‌ఖేడ్ ఉప ఎన్నిక, తాజా ఎన్నికల్లోనూ ప్రస్ఫుటమైం ది. కనీసం వార్డుల స్థాయిలోనూ డిపాజిట్ దక్కించుకోలేదు. టీడీపీని తెలంగాణ ప్రజలు నిర్దందంగా బహిష్కరిస్తున్నారనడానికి మంచి ఉదాహరణ.
టీడీపీని ఆంధ్రాపార్టీ అని ఎవరో అనడం లేదు. స్వయాన తెలంగాణ ప్రజలే దాన్ని ఆంధ్రాపార్టీగా గుర్తించి బహిష్కరిస్తున్నారని వరుసగా వెలువడుతున్న ప్రజాతీర్పులే చెపుతున్నాయి. ప్రజాస్వామ్యంలో వైరుధ్య రాజకీయాలు సహజం. కానీ దాయాది రాజకీయాలే ప్రమాదం. తెలంగాణ ఏ నాడూ వైరుధ్య రాజకీయాలకు వ్యతిరేకం కాదు. అయితే, ప్రాంత ప్రయోజనాలను సైతం ఫణంగా పెట్టే దాయాది రాజకీయాన్ని ప్రజలు తప్పక బహిష్కరిస్తారు. పక్క రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేయగలదని నమ్మడానికి ఇవాళ తెలంగాణ ప్రజలు అమాయకులు కారు. నిధుల పంపకాలు, ఉద్యోగ పంపకాలు ఇంకా కొనసాగుతున్నాయి. అలాగే నీటి వివాదాలు నిరంతరం కొనసాగునున్నాయి. వీటన్నిటి విషయంలో ఆంధ్రాపార్టీ తెలంగాణకు న్యాయం చేయగలదని ఎవరైనా చెప్పగలరా? తెలుగుదేశం పార్టీని ఆంధ్రాపార్టీగా ప్రజలు ఎందుకు గుర్తిస్తున్నారు? దాన్ని ఎందుకు బహిష్కరిస్తున్నారు? అనే ప్రశ్నలకు జవాబులు కావాలంటే, ఇక్క డ ఒక ఉదాహరణ చెప్పుకుంటే సరిపోతుంది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంఖుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఆ మరుసటి రోజే ఏపీ ముఖ్యమంత్రి ఆంధ్రాపార్టీ ఆధ్యక్షుడైన చంద్రబాబు, అది అక్రమ ప్రాజెక్టు, దాన్ని అడ్డుకోవాలంటూ కేంద్ర జల సంఘానికి, కృష్ణా బోర్డుకు లేఖ రాశారు. కానీ తెలంగాణ టీడీపీ నేతలు ఎవరూ కూడా చంద్రబాబు రాసిన లేఖను వ్యతిరేకించలేకపోయారు. కనీసం ఆ లేఖను వెనక్కి తీసుకోవాలని చంద్రబాబుకు చెప్పలేకపోయారు. ఒంటికాలిపై లేచి మాట్లాడే రేవంత్ లాంటి నేతల మూతులు ఆ లేఖపై చంద్రబాబును ఎందుకు నిలదీయలేకపోయాయి? అలాంటి పార్టీలో కొనసాగుతున్న నేతల రాజకీయాన్ని ప్రజాతీర్పుల ద్వారా అంతమొందించడం తప్ప తెలంగాణ ప్రజలకు మరో మార్గమున్నదా? ఏ పార్టీ అయినా ప్రాంత ప్రయోజనాల కోసం పోటీ పడాలె తప్ప, ప్రాంత ప్రయోజనాలను ఫణంగా పెట్టడంలో కాదు. అందుకు ఇక్కడ ఇంకో ఉదాహరణ కూడా చెప్పుకోవాలి.

ప్రాంత ప్రయోజనం కలిగిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు అడ్డుకునే ప్రయత్నం చేస్తే నోరు తెరవని ఆంధ్రాపార్టీ.. గోదావరిపై కాళేశ్వరం బ్యారేజీకి మాత్రం అడ్డుచెప్పడం గమనార్హం. గోదావరిపై ఎక్కడ బ్యారేజీలు కట్టినా వాటి నీరు తెలంగాణ ప్రాంతానికే ఉపయోగపడతాయి. కానీ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథాకాన్ని చంద్రబాబు అడ్డుకుంటే అది తెలంగాణ ప్రాంతానికే అనర్థమవుతుంది. ప్రాంతం పట్ల ఆమాత్రం సోయిలేని టీటీడీపీ నేతలు ఎవరి సేవలో పునీతులవుతున్నట్లు?నిక్కచ్చిగా వారి సేవలు చంద్రబాబుకు తప్ప తెలంగాణకు కాదు. అట్లాగే, ఆంధ్రాపార్టీ అవలక్షణాలు కొన్ని మిగతా జాతీయ పార్టీలకూ అంటుకున్నట్లున్నాయి. ప్రాంత ప్రయోజనం పట్టని ఆంధ్రాపార్టీ వలె జాతీయ పార్టీలు కూడా కొన్ని విషయాల్లో వ్యవహరిస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలు కాళేశ్వరం బ్యారేజీపై అపోహలు సృష్టించడం... పాలమూరు ప్రాజెక్టుకు అడ్డుచెబుతున్న చంద్రబాబును వ్యతిరేకించకపోవడం చూస్తే జాతీయ పార్టీలకూ ఆంధ్రాపార్టీ అవలక్షణాలు కొన్ని అలవడ్డాయని చెప్పకతప్పదు. ఏది ఏమైనా తెలంగాణ ప్రయోజనాల కోసం తప్ప అందుకు భిన్నంగా ఏ పా ర్టీ వ్యవహరించినా ప్రజలు సహించరు. ప్రతి ఎన్నికల్లో వెలువడుతున్న ప్రజాతీర్పులే ఆ విషయాన్ని చెబుతున్నా యి.

ప్రజల తిరస్కరణ, బహిష్కరణలకు గురవుతున్న ఆంధ్రాపార్టీకి తెలంగాణలో భవిష్యత్తులేదని చెప్పడానికి చాణక్యుడు కూడా అక్కరలేదు. ఆ విషయం ఆంధ్రాపార్టీలో కొనసాగుతున్న తెలంగాణ నేతలందరికీ తెలుసు. అందుకే వారు ఆ్ంరధ్రపార్టీని వదులుకుంటున్నారు. ఆంధ్రాపార్టీ అంతం వల్ల అధికార పార్టీకే కాదు, యావద్ తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణకు అవసరం అనే విషయం సగటు తెలంగాణ జీవికి ఏనాడో అర్థమైంది. ఎందుకంటే, తెలంగాణలో నిర్మించాల్సిన సాగునీటి ప్రాజెక్టలను సవ్యంగా నిర్మించుకోవాలన్నా, విభజన పంపకాలు న్యాయంగా జరగాలన్నా& కోవర్టు లాంటి ఆంధ్రాపార్టీ తెలంగాణలో కొనసాగడం మంచిది కాదని తెలివైన తెలంగాణ ప్రజలు తీర్పులు ఇస్తూనే వస్తున్నారు. ప్రజలు ఆంధ్రాపార్టీని పొలిమేర్లు దాటేదాకా తరిమేశారని ఇటీవలి వరంగల్, అచ్చంపేటలో జరిగిన ఎన్నికలే కాదు, సరిహద్దు జిల్లా ఖమ్మం ప్రజాతీర్పు కూడా దాన్ని ధృవీకరించింది.
కొసమెరుపు: ఒకప్పుడు చంద్రబాబు- తెలంగాణ భవన్‌ను ఏ లాడ్జీకో మరేదానికో కిరాయికి ఇచ్చుకోవాల్సి ఉంటుంది అన్నారు.

కానీ, అది తన ఎన్టీఆర్ భవన్‌కే వర్తిస్తుందని చంద్రబాబు కలలోకూడా ఊహించి ఉండకపోవచ్చు కదా?
ఇవాళ తెలంగాణ ప్రజలు ఆంధ్రాపార్టీ ఖేల్ ఖతం-దుక్నం బంద్ చేశారు. ఇపుడు ఆంధ్రాపార్టీలో మిగిలింది రేవంత్ ఒక్కడే కావచ్చు. ఆ ఒక్కని కోసం అంతపెద్ద ఎన్టీఆర్ భవన్ ఎందుకు? చంద్రబాబు లాగా కుసంస్కారంగా ఏ లాడ్జికో వాడుకోవాలని అనడం కాకుండా, ఎన్టీఆర్ భవన్‌ను ప్రజాప్రయోజనం కోసం ఉపయోగించాలి. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి గ్రామీణ ప్రాంతాల నుంచి వేలాది రోగులు వస్తుంటారు. ఆస్పత్రి సరిపోక వారు ఇబ్బందులు పడుతుంటారు. ఎన్టీఆర్ భవన్‌ను వారి కోసం ఉపయోగిస్తే ప్రజలకైనా కాస్త మేలు జరుగుతుంది.

1203

SRINIVAS REDDY KALLURI

Published: Tue,October 16, 2018 03:29 PM

సంపద సృష్టికే అప్పులు

అప్పులు ఎప్పుడూ సంపద సృష్టికి మాత్రమే ఉపయోగించాలనేది సంక్షేమ రాజ్య పాలకుడికి ఉండాల్సిన సహజ లక్షణం. ఈ లక్షణం కేసీఆర్ అనే పాలకుడిలో

Published: Sun,February 25, 2018 01:31 AM

డైనమిజానికి ప్రతీక

యువనేతలో తెలంగాణ ఒక డైనమిజాన్ని చూస్తున్నది. ఆయనలో క్లాస్ కంటే మాస్ లీడర్‌గా మరింత బలంగా ఉన్నాడు. తెలంగాణ పునర్ నిర్మాణ పథకాల రచనల

Published: Fri,July 7, 2017 01:04 AM

రైతు లక్షణం ఇంకా రాదా?

2022 వరకు వ్యవసాయాన్ని ఇప్పటికన్నా రెండింతల లాభాల బాట పట్టిస్తామని కొన్నాళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీపదేపదే చెబుతున్నారు. కానీ ఆచరణ

Published: Sat,February 18, 2017 01:37 AM

సృజనాత్మక వక్త

భూమిపై సగం, ఆకాశంలో సగం అని చెపితే సరిపోయేది కాదు. ఆర్బీఐ గవర్నర్‌తో సమానమైన బాధ్యతను ఈ దేశ మహిళ నిర్వహిస్తున్నదని చెప్పడమే కవిత ప

Published: Tue,February 7, 2017 01:46 AM

సహకారానికి ఉపకారమేది?

దేశంలో ఒక విశ్వసనీయ పాలకుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్‌ను ప్రధాని మోదీ ప్రశంసలతో ముంచెత్తితే సరిపోదు. కేసీఆర్ విశాల దృక్పథానికి అన

Published: Fri,January 6, 2017 11:54 PM

‘దేశీ’ తెలంగాణ స్ఫూర్తి

ప్రపంచీకరణ ప్రయాణంలో దేశీ ఆలోచనలతో బాధితులను కాపాడుకోవాలనే స్పృహ ఒక నిజమైన దేశీయ పాలకుడికి ఉండాల్సిన లక్షణం. ఆ లక్షణాన్ని ఇపుడు మ

Published: Tue,November 29, 2016 12:53 AM

రెండున్నరేండ్ల సమర్థత

గతంలో దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీకి గ్యారంటీ ఇవ్వగానే బ్యాంకులు ఒప్పేసుకొని మాఫీ చేసిన సందర్భాలున్నాయి. కానీ కేసీఆర్ ప

Published: Tue,November 22, 2016 12:02 AM

నోట్ల రద్దుపై వాస్తవ వైఖరి

ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై రకరకాల అభిప్రాయాలున్నాయి. ప్రజల అభిప్రాయం ఎలా ఉందనే కన్నా ముందు రాజకీయ

Published: Sat,October 22, 2016 01:23 AM

చెరువును చంపొద్దు

వర్షాలు ఇంత భారీగా పడినా కూడా మా ఊరి చెరువులోకి చుక్క నీరు రాలేకపోయింది. దాంతో మా ఊరి చెరువు కింద మరో మూడు ఊర్లకు చెందిన గొలుసుకట్

Published: Wed,October 5, 2016 03:43 AM

మోదీ వ్యూహాత్మక పయనం

నిజానికి కశ్మీరీలు అమాయకులు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే హిందూ యాత్రికులను గుర్రాలపై, బగ్గీలపై తీసుకెళ్లేది కశ్మీరీ ముస్లిం సోదరులే.

Published: Fri,September 16, 2016 01:23 AM

నీటి హక్కుపై నియంత్రణా?

రాష్ట్ర విభజన డ్రాఫ్ట్ బిల్లులో రెండు నదులపై యాజమాన్య బోర్డులు పెట్టాలనే ప్రతిపాదనను ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌తో సహా యావత్ తెలంగాణ బు

Published: Tue,August 9, 2016 01:17 AM

కేసీఆర్-మోదీ: తెలంగాణ

రాజకీయాలకతీతంగా దేశంలోని సమస్యల పట్ల దార్శనికంగా ఆలోచించే కేసీఆర్ వంటి ముఖ్యమంత్రికి ప్రధానిగా మోడీ ఏమేరకు సహకారం అందిస్తారనేది ఇ        


country oven

Featured Articles