దౌత్య భగీరథుడికి జేజేలు


Sat,March 5, 2016 01:53 AM

గత పాలకులు తెలంగాణ ప్రాజెక్టుల డిజైన్లను ప్రణాళికాబద్ధంగా తయారుచేయలేదని చెప్పడానికి ప్రాణహిత ప్రాజెక్టే ఒక నిదర్శనం. మహారాష్ట్ర ముంపు వివాదాన్ని పక్కనబెట్టి కాలువలు తవ్విన గత ప్రభుత్వాలు తెలంగాణ ప్రాజెక్ట్‌ల పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించాయో చెప్పకనే చెబుతాయి. అందుకే, తెలంగాణ వచ్చిన వెంటనే కేసీఆర్ సాగునీటి ప్రాజెక్ట్‌ల రీ డిజైనింగ్‌పై దృష్టిపెట్టారు. అంతర్రాష్ట్ర వివాదాల పరిష్కారానికి పూనుకున్నారు.

srinu


కొత్త రాష్ర్టానికి పాత పాలకు లు వదిలిపోయిన సమస్యలను ఎన్నో. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టే అందుకొక ఉదాహరణ. దశాబ్దాల పాటు అంతర్రాష్ట్ర అభ్యంతరాల తో గోదావరి నీటికి నోచుకోని తెలంగాణ బీడు భూములకు తెలంగాణ వచ్చాక తీపి కబురు అందుతున్నది. ముఖ్యమంత్రి కృషి ఫలితంగా తుమ్మిడిహట్టితో పాటు పెన్‌గంగలపై మరో నాలుగు బ్యారేజీల నిర్మాణానికి మహారా ష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తూ ముందుకురావడం శుభపరిణామం. దశాబ్దాల తరబడి తెగని వివాదాలను 19 నెలల్లో పరిష్కారానికి తేగలిగిన ఘనతను కేసీఆర్ దక్కించుకుంటున్నారు. తెలంగాణ వస్తే ఏమవుతదని ప్రశ్నించిన వారికి ఇదొక జవాబు.

మహారాష్ట్ర ముంపు సమస్యను పట్టించుకోకుండానే ప్రాణహిత-చేవెళ్లకు డిజైన్ చేసిన గత పాలకులకు ఆ ప్రాజెక్ట్ పట్ల ఎంతటి నిజాయితీ ఉందో వేరే చెప్పనక్కలేదు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్ట్ స్ట్రక్చర్ నిర్మాణాన్ని గాలికి వదిలేసి, కాలువల నిర్మాణాలు చేపట్టి, మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు పంచిపెట్టారు. అసలు ప్రాజెక్ట్ నిర్మాణ అభ్యంతరాలపై దృష్టిపెట్టని వాళ్లు, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్‌ను ఎన్నటికైనా పూర్తి చేయగలిగేవారేనా? ముమ్మాటికి పూర్తిచేసే వారు కాదని చెప్పాలి. కడుపు మాడుతున్న వాడికి తెలుస్తుంది ఆకలి మంట. ఉమ్మడి రాష్ర్టాన్ని పాలించిన వారికి తెలంగాణ బీడు భూముల దాహార్తి, రైతు గోస ఏం తెలుస్తుంది? తెలంగాణ తెచ్చుకున్నది బీడు భూముల దాహార్తి తెలిసిన పాలన కోసమేనని. అదిప్పుడు నిజమవుతున్నది. 2012లో మహారాష్ట్ర-అప్పటి ఏపీ ప్రభుత్వం మధ్య ప్రాణహిత-చేవెళ్ల పై ఒప్పందం జరిగింది. కానీ ముంపు ప్రాంతంపై మహారాష్ట్ర అభ్యంతరం తెలిపింది. అక్కడితో ప్రాజెక్ట్ నిర్మాణం ఆగిపోయింది. ఆ తదుపరి పట్టించుకున్న పాలకుడు లేడు. మనసుంటే ప్రతి సమస్యకూ ఓ పరిష్కారం దొరుకుతుంది. ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉన్నపుడే దేనికైనా పరిష్కారం లభిస్తుంది. అందుకు కాస్త రాజనీతిజ్ఞత, సమయస్ఫూర్తి, దౌత్యనీతి ఉండాలి. ఆ మూడింటినీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రదర్శించగలిగారు. గతంలోనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో కేసీఆర్ సమావేశమయ్యారు.

వారి అభ్యంతరాలను తెలుసుకున్నారు. తుమ్మిడిహట్టి బ్యారేజీ ఎత్తును తగ్గించుకోవడానికి అంగీకరించారు. అలాగే, ఇరు రాష్ర్టాలకు ప్రయోజనం కలిగే విధంగా పెన్‌గంగ వంటి నదిపై మిగిలిన ప్రాజెక్ట్‌లను నిర్మించుకోవచ్చని చెప్పారు. దాంతో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా సానుకూలతను ప్రదర్శించింది. ఇపుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఒప్పందాల కోసం ఫడ్నవీస్ పిలవగలిగారంటే.. గత 19 నెలలుగా కేసీఆర్ నెరపిన దౌత్యం కావచ్చు, సమయస్ఫూర్తి కావచ్చు, రాజనీతిజ్ఞత కావచ్చు అవన్నీ బలం గా పనిచేశాయనడంలో అనుమానం లేదు.

ఎగువ గోదావరి నుంచి నీటి లభ్యత దాదాపు లేకుండాపోయింది. అది ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యం. బాబ్లీ నిర్మాణం వల్లనే ఎస్సారెస్పీకి నీటి లభ్యత లేకుండాపోయిందనే వాదన ఉంది. కానీ బాబ్లీ బ్యారేజీ కెపాసిటీ 1.5 టీఎంసీలు మాత్రమేనని గమనించాలి. కాబట్టి బాబ్లీ వల్లనే మనకు ఎగువ గోదావరిలో నీటి లభ్యత కొరవడిందనేది పూర్తి నిజం కాదు. గోదావరి ఉపనది అయిన మంజీరాలోనూ నీటి లభ్యత పడిపోతున్నది. దాంతో సింగూరు, నిజాంసాగర్‌లకు కూడా నీటి లభ్య త బాగా పడిపోయింది. కాబట్టి తెలంగాణకు గోదావరిలో నీటి లభ్యత ఉన్నదంటే అది దిగవ గోదావరిలో కలుస్తున్న ఉపనదులు ప్రాణహిత, పెన్‌గంగ, ఇంద్రావతిలతోనే అని గమనించాలి. దిగువ గోదావరిలో కలిసే ఉపనదుల నీరే తెలంగాణను బతికించగలుగుతాయి. ఇప్పటికే కృష్ణా నదిలోనూ మనకు నికర జలాలు, వరద జలాల లభ్యత అంతంతగా ఉంది. ఇక గోదావరి దిగువన ఉన్న ఉపనదుల నీళ్లే తెలంగాణకు ప్రాణధారలని చెప్పాలి. ప్రాణహితపై తుమ్మిడిహట్టి బ్యారేజీతో ఆదిలాబాద్ జిల్లాను సస్యశ్యామలం చేయొచ్చు.

కాళేశ్వరం దిగువన మేడిగడ్డ, తదిత ర బ్యారేజీలతో తెలంగాణ నలుదిశల సాగు-తాగు నీటిని ప్రవహింపజేసినపుడే తెచ్చుకున్న తెలంగాణకు ఓ సార్థకత దక్కుతుంది. అలాగే నీటి లభ్యత లేని ఎగువ గోదావరి పాత-కొత్త ఆయకట్టుకు సైతం రివర్స్‌లో దిగువ గోదావరి నీటిని అందించడం కూడా ఒక బృహత్కార్యం కానుంది. గోదావరి నదిలో మనకు 900 టీఎంసీలకు పైగా నీటిపై హక్కులు ఉన్నా, అవన్నీ దిగువ గోదావరిలో తప్ప ఎగువ గోదావరిలో లభించే అవకాశాలు దాదాపు లేవని చెబితేనే బాగుంటుంది. కాబట్టి ప్రాణహిత, పెన్‌గంగ లాంటి దిగువ గోదావరి ఉపనదుల నీటిని సంపూర్ణంగా వాడుకోగలగాలి. అలాగే, రెండేళ్లుగా వర్షాభావ పరిస్థితులున్నాయి. అయినా దిగువ గోదావరి ప్రాంతం నుంచి దాదాపు 1400 టీఎంసీల నీరు సముద్రం పాలైందని కేంద్ర జల సంఘం చెబుతున్నది. అంటే ఎంతటి వర్షాభావం ఉన్నా ప్రాణహిత, పెన్‌గం గ, ఇంద్రావతి వంటి ఉపనదులలో నీటి లభ్యతకు ఢోకా ఉండదనే విషయాన్ని కూడా గమనించవచ్చు. అందుకే దిగువ గోదావరికి ఉన్న ఉప నదులన్నీ తెలంగాణకు వరప్రదాయినులని చెప్పాలి.

ఇంతటి నమ్మకమైన నీటి లభ్యత తెచ్చుకున్న తెలంగాణకు ఒక వరం లాంటిది. అలాంటి నీటి బ్యారేజీల నిర్మాణాలు వివాదాలతో, అభ్యంతరాలతో కాలం గడిపితే చరిత్ర క్షమించదు.
అంతర్రాష్ట్ర వివాదాలు, అభ్యంతరాలతో దేశంలో అనేక ప్రాజెక్టులు నిర్మాణాలు కాకుండా ఆగిపోతున్నాయి. కేంద్రం జోక్యం చేసుకొని న్యాయం చేయడం కూడా నేటి దేశ రాజకీయ పరిస్థితుల్లో సాధ్యమయ్యే పనికాదు. న్యాయం కోసం కోర్టుకు వెళితే దశాబ్దాలు గడిచినా తీర్పులు వెలువడని కేసులు ఎన్నో ఉన్నాయి. వాద ప్రతివాదాలతో కాలం వృథా కావడం తప్ప మరొకటి జరగదు. వివాదాలున్న ప్రాజెక్టుల నిర్మాణ వ్యయాలు అనేక రెట్లు పెరిగిపోతుంటాయి. ఉదాహరణకు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్‌ను ప్రకటించిన నాటి వ్యయం అంచనాకు, దాని నేటి వ్యయం అంచనాకు పోలికలేదు. ఆ విధంగా కాలం, ధనం వృథా కావడమే కాకుండా, సాగునీటి లభ్యత లేక రైతు లోకం ఒక తరం జీవితాన్నే కోల్పోతున్నది. ఇన్ని రకాల అనర్థాలను దృష్టిలో ఉంచుకున్నపుడు, ప్రాణహిత, పెన్‌గంగా నదులపై ఐదు బ్యారేజీల నిర్మాణానికి మహారాష్ట్రతో అంగీకారానికి రావడం నిజంగా ఆహ్వానించదగ్గపరిణామం.

తెలంగాణలోని నీటి లభ్యతపై, వాటిని ఎలా వాడాలనే పరిజ్ఞానంపై.. కేసీఆర్ కు 14 ఏళ్ల ఉద్యమ కాలమే పట్టును సాధించిపెట్టంది. గత పాలకులు తెలంగాణ ప్రాజెక్టుల డిజైన్లను ప్రణాళికాబద్ధంగా తయారుచేయలేదని చెప్పడానికి ప్రాణహిత ప్రాజెక్టే ఒక నిదర్శనం. మహారాష్ట్ర ముంపు వివాదాన్ని పక్కనబెట్టి కాలువలు తవ్వి న గత ప్రభుత్వాలు తెలంగాణ ప్రాజెక్ట్‌ల పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించాయో చెప్పకనే చెబుతాయి. అందుకే, తెలంగాణ వచ్చిన వెంటనే కేసీఆర్ సాగునీటి ప్రాజెక్ట్‌ల రీ డిజైనింగ్‌పై దృష్టిపెట్టారు. అంతర్రాష్ట్ర వివాదాల పరిష్కారానికి పూనుకున్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం అనుమానాలు లేకుండా బ్యారేజీల నిర్మాణ సర్వేలను చూపారు.

మహారాష్ట్రతో ఐదు బ్యారేజీలపై అంగీకారానికి రావడమనేది ముమ్మాటికీ తెలంగాణకు వరం లాంటిదే. మహారాష్ట్ర అం దుకు అంగీకారానికి రావడమే తెలంగాణ సాధించుకున్న ఒక గొప్ప విజయంగా చెప్పుకోవాలి. ఎందుకంటే.. ఎగువ గోదావరిపై అనేక బ్యారేజీలు నిర్మించిన మహారాష్ట్ర, ఇపుడు దిగువ గోదావరి ఉపనదులపై తెలంగాణ బ్యారేజీల నిర్మాణానికి అంగీకారానికి రాగలిగిందంటే.. అది కేసీఆర్ రాజనీతిజ్ఞత, సమయస్ఫూర్తి, దౌత్యనీతికి నిదర్శనమని చెప్పాలి. బీడు భూముల దాహార్తి తీర్చే పాలకుని కోసమే ఇన్నా ళ్లు యావత్ తెలంగాణ ఎదురుచూసింది. అందుకు తగ్గట్లుగానే దౌత్య భగీరథుడి రూపంలో ఆ కార్యాన్ని తీర్చే దిశగా కేసీఆర్ వేగంగా అడుగులు వేస్తున్నారని చెప్పాలి. ప్రాణహితపై కేసీఆర్ భగీరథ దౌత్యం తప్పక ఫలిస్తుందని ఆశిద్దాం.

1131

SRINIVAS REDDY KALLURI

Published: Tue,October 16, 2018 03:29 PM

సంపద సృష్టికే అప్పులు

అప్పులు ఎప్పుడూ సంపద సృష్టికి మాత్రమే ఉపయోగించాలనేది సంక్షేమ రాజ్య పాలకుడికి ఉండాల్సిన సహజ లక్షణం. ఈ లక్షణం కేసీఆర్ అనే పాలకుడిలో

Published: Sun,February 25, 2018 01:31 AM

డైనమిజానికి ప్రతీక

యువనేతలో తెలంగాణ ఒక డైనమిజాన్ని చూస్తున్నది. ఆయనలో క్లాస్ కంటే మాస్ లీడర్‌గా మరింత బలంగా ఉన్నాడు. తెలంగాణ పునర్ నిర్మాణ పథకాల రచనల

Published: Fri,July 7, 2017 01:04 AM

రైతు లక్షణం ఇంకా రాదా?

2022 వరకు వ్యవసాయాన్ని ఇప్పటికన్నా రెండింతల లాభాల బాట పట్టిస్తామని కొన్నాళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీపదేపదే చెబుతున్నారు. కానీ ఆచరణ

Published: Sat,February 18, 2017 01:37 AM

సృజనాత్మక వక్త

భూమిపై సగం, ఆకాశంలో సగం అని చెపితే సరిపోయేది కాదు. ఆర్బీఐ గవర్నర్‌తో సమానమైన బాధ్యతను ఈ దేశ మహిళ నిర్వహిస్తున్నదని చెప్పడమే కవిత ప

Published: Tue,February 7, 2017 01:46 AM

సహకారానికి ఉపకారమేది?

దేశంలో ఒక విశ్వసనీయ పాలకుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్‌ను ప్రధాని మోదీ ప్రశంసలతో ముంచెత్తితే సరిపోదు. కేసీఆర్ విశాల దృక్పథానికి అన

Published: Fri,January 6, 2017 11:54 PM

‘దేశీ’ తెలంగాణ స్ఫూర్తి

ప్రపంచీకరణ ప్రయాణంలో దేశీ ఆలోచనలతో బాధితులను కాపాడుకోవాలనే స్పృహ ఒక నిజమైన దేశీయ పాలకుడికి ఉండాల్సిన లక్షణం. ఆ లక్షణాన్ని ఇపుడు మ

Published: Tue,November 29, 2016 12:53 AM

రెండున్నరేండ్ల సమర్థత

గతంలో దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీకి గ్యారంటీ ఇవ్వగానే బ్యాంకులు ఒప్పేసుకొని మాఫీ చేసిన సందర్భాలున్నాయి. కానీ కేసీఆర్ ప

Published: Tue,November 22, 2016 12:02 AM

నోట్ల రద్దుపై వాస్తవ వైఖరి

ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై రకరకాల అభిప్రాయాలున్నాయి. ప్రజల అభిప్రాయం ఎలా ఉందనే కన్నా ముందు రాజకీయ

Published: Sat,October 22, 2016 01:23 AM

చెరువును చంపొద్దు

వర్షాలు ఇంత భారీగా పడినా కూడా మా ఊరి చెరువులోకి చుక్క నీరు రాలేకపోయింది. దాంతో మా ఊరి చెరువు కింద మరో మూడు ఊర్లకు చెందిన గొలుసుకట్

Published: Wed,October 5, 2016 03:43 AM

మోదీ వ్యూహాత్మక పయనం

నిజానికి కశ్మీరీలు అమాయకులు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే హిందూ యాత్రికులను గుర్రాలపై, బగ్గీలపై తీసుకెళ్లేది కశ్మీరీ ముస్లిం సోదరులే.

Published: Fri,September 16, 2016 01:23 AM

నీటి హక్కుపై నియంత్రణా?

రాష్ట్ర విభజన డ్రాఫ్ట్ బిల్లులో రెండు నదులపై యాజమాన్య బోర్డులు పెట్టాలనే ప్రతిపాదనను ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌తో సహా యావత్ తెలంగాణ బు

Published: Tue,August 9, 2016 01:17 AM

కేసీఆర్-మోదీ: తెలంగాణ

రాజకీయాలకతీతంగా దేశంలోని సమస్యల పట్ల దార్శనికంగా ఆలోచించే కేసీఆర్ వంటి ముఖ్యమంత్రికి ప్రధానిగా మోడీ ఏమేరకు సహకారం అందిస్తారనేది ఇ        


country oven

Featured Articles