నగరంలో నవ సమీకరణ


Wed,January 20, 2016 12:24 AM

హైదరాబాద్‌లోనూ తెలంగాణ అస్తిత్వ పతాక ఎగరేయాలనుకున్నపుడు నగరంలో జీవిస్తున్న ఇతర ప్రాంతాల ప్రజల మద్దతు కూడగట్టడం కూడా తెలంగాణ అస్తిత్వ స్థిరీకరణ కోసమేనని అందరూ గమనించాలె.
కాబట్టి, హైదరాబాద్‌లోనూ పాలనాధికారం సాధించడం ముఖ్యం తప్ప, అందుకు ఏయే ప్రాంతాల ప్రజలు మద్దతు ఇస్తున్నారనేది ముఖ్యం కాదు.

srinivasreddy

హైదరాబాద్ రాజకీయ సమీకరణ మారిందా? మారితే ఎలా మారింది? ఎందుకు మారింది? ఈ ప్రశ్నల కన్నా ముందు.. 2014 వరకు హైదరాబాద్ రాజకీయాలు ఎలా ఉన్నాయనే ప్రశ్నకు జవాబు తెలుసుకోవాల్సిందే.
వలస రాజకీయాలతో హైదరాబాద్ బతికిందా, వెనుకబడిందా? మూసీ నది ఆవల అభివృద్ధి జరిగిందా? మూసీ ఈవల కొత్త నగరం బాగుపడిందేమిటి? 45 ఏళ్ల చరిత్ర నిండా హైదరాబాద్‌లో మతఘర్షణలు, భూకబ్జాలు, అక్రమాలు, ఉగ్రవాదం, భూమాఫియాలు తప్ప జరిగిన అభివృద్ధి పెద్ద లెక్కలోకి వచ్చేది కాదు. పాతబస్తీ రాజకీయాన్ని సమైక్య పాలకులు వాడుకోవడం తప్ప దాన్ని కొత్త నగరంతో సమానంగా అభివృద్ధి చేశారా? కొత్తనగరంలోనూ జరిగిందేమిటీ? ఫక్తూ హైటెక్‌సిటీని, ైఫ్లెఓవర్లను చూపి పబ్బం గడుపుకోవడం తప్ప నగరం నిర్మాణత్మకంగా అభివృద్ధి చెందిందా? ఒక రాజధాని జీవన ప్రమాణాలను సగటు నగర జీవి ఏనాడైనా అందుకున్నాడా? ఎంతసేపూ తెలంగాణ ఏర్పాటును అడ్డుకునేందుకు హైదరాబాద్ రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని పబ్బం గడుపుకున్నారు.

తెలంగాణలో రాజకీయ సమీకరణ మారినట్లుగానే, రాజధాని రాజకీయ సమీకరణ కూడా అంతే వేగంగా మారింది. హైదరాబాద్ రాజకీయాలు తెలంగాణ సోయిలోకి వచ్చాయి. నిన్నటి దాకా పరాయిలమనుకున్న ఆంధ్రా సమాజం కూడా తామూ తెలంగాణ వాసులమే అనుకునే స్థాయికి చేరుకున్నది. తెలంగాణ ప్రజలుగానీ, టీఆర్‌ఎస్‌గానీ, సీమాంధ్ర రాజకీయ నాయకులను తప్పు పట్టారు తప్ప సీమాంధ్ర సగటు ప్రజలను ఏనాడూ తప్పు పట్టలేదు. అయితే సీమాంధ్ర రాజకీయ నేతలు తప్పుడు ప్రచారాలతో అక్కడి ప్రజలను కొంతమేర కొద్ది కాలం నమ్మించగలిగారు. కానీ, కేసీఆర్ దీక్ష తర్వాత జరిగిన పరిణామాలతో సీమాంధ్ర సగటు ప్రజలు సైతం తమకూ ఒక రాష్ట్రం ఉంటేనే అభివృద్ధి చెందగలుగుతామనే ఆలోచన క్రమంగా పెరిగింది. అమరావతి శంకుస్థాపనకు వెళ్లిన కేసీఆర్‌కు అక్కడి ప్రజలు చప్పట్లతో స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకోవడం గమనార్హం. రాజధాని మాత్రమే కాదు, అనేక విశ్వవిద్యాలయాలు, ఐఐటీ లాంటి విద్యాసంస్థలు, మెడికల్ కాలేజీలు, వైద్యశాలలు,భూములకు విలువలు వచ్చాయంటే, అందుకు తెలంగాణను సాధించిన కేసీఆర్ వల్లనే రాగలిగాయని సీమాంధ్ర ప్రజలు భావిస్తున్నారు. వారికి కేసీఆర్ ఆరాధ్య నాయకుడుగా మారిపోయారు. నాయకుల చేత కల్పించబడిన తెలంగాణ వ్యతిరేకతను పాతరేశా రు.

రాష్ట్రం విడిపోవడం వల్ల బాగుపడుతున్నది ఒక్క తెలంగాణ మాత్రమే కాదు సీమాంధ్ర కూడా అని ఏడాదిన్నరలో వారికి బాగా అవగతమైంది. దీని ప్రభావం కేవలం సీమాంధ్రలోనే కాదు, హైదరాబాద్‌లో జీవిస్తున్న సీమాంధ్ర ప్రజల్లోనూ కనిపిస్తున్నది. సీమాంధ్ర నేతలు వేరు, నగరంలో జీవిస్తున్న సగటు సీమాంధ్ర ప్రజలు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు వేరు. ఎక్కడ జీవిస్తున్నా... వారు అక్కడి అభివృద్ధిలో, అక్కడి పరిపాలనలో భాగమవుతారు. రాష్ట్రం ఇక విడిపోతున్నదనడంతో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి విద్యుత్ సమస్యను, మంచినీటి సమస్యను గాలికివదిలేసి వెళ్లిపోయారు. వచ్చే తెలంగాణను ఆ సమస్యలు పీడించాలనే రాజకీయ శాడిజానికి అదొక పరాకాష్ట. తెలంగాణ ఏర్పడగానే మొదటి ఆరు నెలల పాటు విద్యుత్ సమస్య నగరాన్ని పీడించిన విషయం తెలిసిందే. నగరంలో ఉన్న పారిశ్రామికవేత్తలు ఒక సందర్భంలో ఇందిరాపార్క్ వద్ద ధర్నాలు చేసిన సంఘటనలూ ఉన్నాయి. నగరంలో అలాంటి క్లిష్టమైన విద్యుత్ సమస్యను, మంచినీటి సమస్యను యుద్ధ ప్రాతిపదికన అధిగమించిన కేసీఆర్ పనితీరును నగరంలో జీవిస్తున్న సీమాంధ్ర ప్రజలు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులూ గమనించారు. రెండేళ్లుగా మంచినీటి కొరతతో నగరం విలవిలలాడింది. గోదావరి నుంచి కృష్ణా నుంచి నగరానికి యుద్ధ ప్రాతిపదికన మంచినీటిని తరలించిన కేసీఆర్ పాలనా తీరు అందరి ప్రశంసలందుకుంటున్నాయి. ఏ ప్రాంతంలో జీవిస్తున్నా, ఆ ప్రాంతఅభివృద్ధే తమ జీవితాలను నడిపించగలదనే స్పృహ ఇవాళ నగరంలో జీవిస్తున్న సీమాంధ్రులలోనూ ఏర్పడింది.

పక్క రాష్ట్ర పాలకుడిని చూసి ఓటేస్తే ఫలితం శూన్యమనే భావన నగర సీమాంధ్రుల్లో ఇప్పటికే ఏర్పడింది. మత విశ్వాసం వేరు. ప్రాంత భావంతో అభివృద్ధిలో భాగస్వాములు కావడం వేరు. ఈ సున్నిత తర్కాన్ని నగరంలోని అటు మైనారిటీలలోనూ, ఇటు మెజారిటీలలోనూ కల్పించడంలో కేసీఆర్ ఏడాదిన్నరలో సఫలీకృతమయ్యారు. పాతనగరాన్ని ఆవహించిన మతరాజకీయాలు ఇవాళ ప్రాంతభావాన్ని సంతరించుకుంటున్నాయంటే, స్వరాష్ట్రంలో అస్తిత్వ పాలన సాగుతుండటమే కారణం.అస్తిత్వ రాజకీయ గొడుగు కింద మతవాదులను సైతం అభ్యుదయానికి కట్టడిచేయడంలో, వారికి అభివృద్ధి రుచి చూపించడంలో కేసీఆర్ చాలామేరకు సఫలమవుతున్నారు. ఆవిధంగా మత వాద రాజకీయశక్తులు తెలంగాణ ప్రాంత భావంలోకి రాక తప్పని అనివార్యతను కలిస్తున్న కేసీఆర్ ఘనతను ఎవరూ కాదనలేరు. నగర శాంతిభద్రతల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా పనిచేస్తున్న ప్రభుత్వ సామర్థ్యాన్ని కేంద్ర ఇంటలిజెన్స్ వర్గాలు సైతం అభినందిస్తున్నాయి. షీటీంలతో మహిళలకు కల్పిస్తున్న భద్రత ప్రశంసనీయం. ఈవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో పాతనగరానికి ఏర్పడిన అపవాదులు ఇపుడు అస్తిత్వ పాలనలో తుడిచేయబడుతున్నాయి. అందుకు పాత నగర ప్రజలే కేసీఆర్ పాలనను ప్రశంసిస్తున్నారు..

నగరంలో జీవిస్తున్న సీమాంధ్రులకు గతంలో సమైక్యులు కల్పించిన అనుమానాలన్నీ ఏడాదిన్నరలో పటాపంచలయినాయి. నిన్నటి కేసీఆర్ విమర్శకులే, ఇవాళ ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కంటోన్మెంట్‌లో తెలంగాణ, సీమాంధ్ర ప్రజలే కాకుండా ఉత్తరాది, దక్షిణాది రాష్ర్టాల వారూ అక్కడ జీవిస్తున్నారు. ఏడా ది కిందట జరిగిన కంటోన్మెంట్ ఎన్నికల్లో ప్రాం త భేదం లేకుండా వారంతా తెలంగాణ అస్తిత్వ రాజకీయానికి పట్టం కట్టారు. తెలంగాణ అస్తిత్వాన్ని గౌరవిస్తున్నారని చెప్పడానికి కంటోన్మెంట్ ఫలితాలే నిలువెత్తు సాక్ష్యం. ఒకప్పుడు (2009) జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ కూడా చేయని టీఆర్‌ఎస్, ఇవాళ నగరంలో గెలుపు గుర్రంగా మారిన తీరే కేసీఆర్ సమర్థ పాలనకు గీటురాయిగా చెప్పుకోవాలి.

ఇవాళ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తెలంగాణ అస్తిత్వ రాజకీయం ఒక నవ సమీకరణను సాధించింది. తెలంగాణకు గుండెకాయ రాజధానిలోనూ అస్తిత్వ ముద్ర అనివార్యం. నగరంలోనూ అస్తిత్వాన్ని స్థిరీకరించినపుడే, తెలంగాణ అస్తిత్వ రాజకీయానికి సంపూర్ణత ఏర్పడుతుంది.రాష్ట్ర జనాభాలో మూడవ వంతు రాజధానిలోనే జీవిస్తున్న దశలో హైదరాబాద్‌లో అస్తిత్వ పతాక ఎగరడం అనివార్యం. అందుకు నగరంలో జీవిస్తున్న అన్ని ప్రాంతాల ప్రజల మద్దతును కూడగట్టాలి. ఉదాహరణకు బీఎస్‌పీ అధినేత్రి మాయవతి, యూపీ లో బహుజనుల రాజ్యాధికారం కోసం ఉన్నత కులాల మద్దతునూ కూడగట్టిన చరిత్ర మనకు తెలిసిందే. హైదరాబాద్‌లోనూ తెలంగాణ అస్తిత్వ పతాక ఎగరేయాలనుకున్నపుడు నగరంలో జీవిస్తున్న ఇతర ప్రాంతాల ప్రజల మద్దతు కూడగట్టడం కూడా తెలంగాణ అస్తిత్వ స్థిరీకరణ కోసమేనని అందరూ గమనించాలె. కాబట్టి, హైదరాబాద్‌లోనూ పాలనాధికారం సాధించడం ముఖ్యం తప్ప, అందుకు ఏయే ప్రాంతాల ప్రజలు మద్దతు ఇస్తున్నారనేది ముఖ్యం కాదు. నగర రాజకీయాలను సమీకరించడంలో ఏడాదిన్నరగా కేసీఆర్ చేసిన కృషిని యావత్ తెలంగాణ ప్రజలూ హర్షిస్తారు. అలాగే నగరంలో జీవిస్తున్న సీమాంధ్ర ప్రజలకు కావల్సిందీ అది తెలంగాణ అస్తిత్వ పాలనైనా సరే.. తమ జీవితాలకూ వెలుగులివ్వాలనుకుంటారు. అందుకే పక్క రాష్ట్ర పాలకుడిని నమ్ముకొని ఓటేస్తే ఒరిగేదేమీ ఉండదని కూడా నగరంలో జీవిస్తున్న సీమాంధ్రులకు ఇప్పటికే అర్థమై ఉంటుంది.

1102

SRINIVAS REDDY KALLURI

Published: Tue,October 16, 2018 03:29 PM

సంపద సృష్టికే అప్పులు

అప్పులు ఎప్పుడూ సంపద సృష్టికి మాత్రమే ఉపయోగించాలనేది సంక్షేమ రాజ్య పాలకుడికి ఉండాల్సిన సహజ లక్షణం. ఈ లక్షణం కేసీఆర్ అనే పాలకుడిలో

Published: Sun,February 25, 2018 01:31 AM

డైనమిజానికి ప్రతీక

యువనేతలో తెలంగాణ ఒక డైనమిజాన్ని చూస్తున్నది. ఆయనలో క్లాస్ కంటే మాస్ లీడర్‌గా మరింత బలంగా ఉన్నాడు. తెలంగాణ పునర్ నిర్మాణ పథకాల రచనల

Published: Fri,July 7, 2017 01:04 AM

రైతు లక్షణం ఇంకా రాదా?

2022 వరకు వ్యవసాయాన్ని ఇప్పటికన్నా రెండింతల లాభాల బాట పట్టిస్తామని కొన్నాళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీపదేపదే చెబుతున్నారు. కానీ ఆచరణ

Published: Sat,February 18, 2017 01:37 AM

సృజనాత్మక వక్త

భూమిపై సగం, ఆకాశంలో సగం అని చెపితే సరిపోయేది కాదు. ఆర్బీఐ గవర్నర్‌తో సమానమైన బాధ్యతను ఈ దేశ మహిళ నిర్వహిస్తున్నదని చెప్పడమే కవిత ప

Published: Tue,February 7, 2017 01:46 AM

సహకారానికి ఉపకారమేది?

దేశంలో ఒక విశ్వసనీయ పాలకుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్‌ను ప్రధాని మోదీ ప్రశంసలతో ముంచెత్తితే సరిపోదు. కేసీఆర్ విశాల దృక్పథానికి అన

Published: Fri,January 6, 2017 11:54 PM

‘దేశీ’ తెలంగాణ స్ఫూర్తి

ప్రపంచీకరణ ప్రయాణంలో దేశీ ఆలోచనలతో బాధితులను కాపాడుకోవాలనే స్పృహ ఒక నిజమైన దేశీయ పాలకుడికి ఉండాల్సిన లక్షణం. ఆ లక్షణాన్ని ఇపుడు మ

Published: Tue,November 29, 2016 12:53 AM

రెండున్నరేండ్ల సమర్థత

గతంలో దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీకి గ్యారంటీ ఇవ్వగానే బ్యాంకులు ఒప్పేసుకొని మాఫీ చేసిన సందర్భాలున్నాయి. కానీ కేసీఆర్ ప

Published: Tue,November 22, 2016 12:02 AM

నోట్ల రద్దుపై వాస్తవ వైఖరి

ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై రకరకాల అభిప్రాయాలున్నాయి. ప్రజల అభిప్రాయం ఎలా ఉందనే కన్నా ముందు రాజకీయ

Published: Sat,October 22, 2016 01:23 AM

చెరువును చంపొద్దు

వర్షాలు ఇంత భారీగా పడినా కూడా మా ఊరి చెరువులోకి చుక్క నీరు రాలేకపోయింది. దాంతో మా ఊరి చెరువు కింద మరో మూడు ఊర్లకు చెందిన గొలుసుకట్

Published: Wed,October 5, 2016 03:43 AM

మోదీ వ్యూహాత్మక పయనం

నిజానికి కశ్మీరీలు అమాయకులు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే హిందూ యాత్రికులను గుర్రాలపై, బగ్గీలపై తీసుకెళ్లేది కశ్మీరీ ముస్లిం సోదరులే.

Published: Fri,September 16, 2016 01:23 AM

నీటి హక్కుపై నియంత్రణా?

రాష్ట్ర విభజన డ్రాఫ్ట్ బిల్లులో రెండు నదులపై యాజమాన్య బోర్డులు పెట్టాలనే ప్రతిపాదనను ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌తో సహా యావత్ తెలంగాణ బు

Published: Tue,August 9, 2016 01:17 AM

కేసీఆర్-మోదీ: తెలంగాణ

రాజకీయాలకతీతంగా దేశంలోని సమస్యల పట్ల దార్శనికంగా ఆలోచించే కేసీఆర్ వంటి ముఖ్యమంత్రికి ప్రధానిగా మోడీ ఏమేరకు సహకారం అందిస్తారనేది ఇ